Dec2019 Messages


01Dec2019ఆదివారం ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 


లూకా సువార్త 1:5 యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకు డుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.

చదవబడిన వాక్యభాగములో ఈ జెకర్యా ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క సేవ యందు భక్తి భావం కలిగినవాడు. దేవుని యొక్క మందిరములో ప్రత్యక్ష గుడారంలో యాజక ధర్మం చేయువాడు ఈ జెకర్యా .ఇంకా దేవుని మందిరములో ఈ యాజకత్వము చేయు యాజకులు ఆవరణములో, పరిశుద్ధ స్థలములో అనేక మంది ఉంటారు, మొత్తంగా ఇరువైనాల్గు మంది యాజకులు ఉంటారు. ఈ యాజకులలో ఎనిమిదోవాడుగా దావీదు నియమించినవాడు అబీయా, ఈ అబీయా తరగతిలోనున్న నుండి వచ్చినవాడు జెకర్యా అను యాజకుడు. ఈ జెకర్యా, అతని భార్య ఎలీసబెతు జీవితం ఒక ఆదర్శవంత మైన జీవితం కలిగినవాడు, దేవుని యొక్క పనిని ఆశక్తితో చేసినవాడు, అటువంటి ఈ జెకర్యా జీవితం గూర్చి పరిశుద్ధ దేవుని గ్రంధములో ఏమి వ్రాయబడినదో, ఈ జెకర్యా జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలో ఈ రోజున మనం ధ్యానించుకుందాం.  


1.మొదటిగా దేవుని సేవను నమ్మకత్వముతో చేసినవాడు జెకర్యా
యాజక ధర్మము చేయాలి అని అంటే పరిశుద్దులుగా ఉండాలి నిష్ఠతో దేవుని యందు భయముతో చేయాలి, ఆలాగున చేయక పొతే దేవుని యొక్క కోపాగ్నికిలోనవుతారు, అటువంటి గొప్ప యాజకత్వమును పరిశుద్ధంగా జరిగించువాడు ,దేవుని పనిని నమ్మకముగా ఆశక్తిగా కొనసాగించినవాడు జెకర్యా.

దేవుని యొక్క పనిలో యాజకత్వము శ్రేష్టమైనది దానికి ఏర్పాటు చేయబడిన వంశములోని యాజకులు పరిశుద్దులుగా, నీతిమంతులుగా, ఉండాలి. దేవునికి - మానవునికి మధ్యవర్తిత్వంగా యాజకత్వము చేసేవాడు జెకర్యా, అటువంటి నమ్మకత్వం కలిగి దేవుని సేవను వృద్దాప్యo వరకు కూడా చేసిన గొప్ప యాజకుడు జెకర్యా, దేవుని పనిని మరణం వరకు నమ్మకం కలిగి చేసిన వాడు జెకర్యా.

మనం కూడా దేవుని యొక్క సేవలో నమ్మకత్వం కలిగిన వారంగా,నీతిమంతులుగా నడచుకొనువారిగా ఉండాలి.

2.రెండవదిగా దేవుని సకల ఆజ్ఞలను పాటించేవారు జెకర్యా దంపతులు
లూకా సువార్త1:6 వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.

దేవుని సకల ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి, అనగా ఒక కుటుంబముగా భార్య భర్తలు ఇరువురు ఆదర్శ దంపతులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా భక్తి కలిగి జీవిస్తున్నారు, విశ్రాంతి దినమును ఆచరిస్తున్నారు, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను ఆచరిస్తున్నారు జెకర్యా దంపతులు.

రోజున మనం కూడా దేవుని దృష్టికి సకల ఆజ్ఞలను పాటించువారిగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండవలసిన వారమై, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొను వారీగా ఉండాలి.
 

దేవుని ఆజ్ఞలను తప్పిపోయినట్లైతే ఏమి అవుతుంది అని దేవుని వాక్యం చెప్తుందో మనం ఆలోచిస్తే
యాకోబు 2:10 ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;

దేవుని ఆజ్ఞల విషయంలో మనం తప్పి పోయినట్లయితే మనం దేవుని దృష్టికి అపరాధులుగా ఎంచబడుతాము అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది.

3.మూడవదిగా జెకర్యా దంపతులు గొప్ప ప్రార్ధనాపరులు 
లూకా సువార్త1:13 అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీస బెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను.  ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కన బడగా జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

ఈరోజున మన ప్రార్ధన దేవుడు వినాలి అని అంటే దేవుని ముందు తగ్గించుకొని యదార్ధమైన, గురితో కూడిన, సహనం కలిగి ప్రార్ధన చేయాలి.
 

రోజున మనం కుటుంబముగా ఒక ఆదర్శవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి, భార్యాభర్తలుగా దేవుని యెడల భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం జీవించాలి.
మనం కుటుంబముగా మరణం వరకు దేవుని యెడల నమ్మకత్వం కలిగి, దేవుని సకల ఆజ్ఞలను నడుచుకొనువారీగా, దేవుని యెడల  యదార్థత కలిగి నీతి కలిగి ప్రార్ధన జీవితం కలిగి ఉండు వారీగా యేసయ్య మన అందరిని దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
********************************************





15Dec2019 ఆదివారం ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 

Topic:క్రిస్టమస్‘లో దూతల పాత్ర 

లూకా 2:8-12 :9 ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.

10 అయితే ఆ దూతభయ పడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు చున్నాను;
 
చదవబడిన వాక్యభాగములో మనం గమనిస్తే ప్రభువారి యొక్క పుట్టుక గూర్చి తెలిపే దూతను గూర్చి వ్రాయబడినది .అసలు ఈ దూతలు మొదట ఎవరు? ఈ దూతలు ఎన్ని రకములుగా ఉన్నాయ్ అవి వెటిని సూచనగా ఉన్నవి? క్రిస్టమస్'లో దూతల పాత్రను గూర్చి ఈ క్రిస్టమస్'లో మనం ఎలా ఉండాలి అని ఈ రోజున మనం ధ్యానించుకుందాం.

1.మొదటగా అసలు ఈ దూతలు ఎన్ని రకములుగా ఉన్నారు అని మనం ఆలోచిస్తే

దూతలు అనే పదం ఇంగ్లీష్’లో ఏంజెల్స్, ఇది ఏంజెలోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది.
 ఈ దూతలు మొదట రెండురకాలుగా ఉన్నారు.
**పడద్రోయబయిన దూతలు అనగా సాతాను వాని అనుచరులు (పాపులు).
**నిరంతరం నిలుచు దూతలు అనగా తమ ఆధిక్యతను కాపాడుకొనువారు.

2.ఈ దూతలు ఎన్నిఅవి వెటిని సూచిస్తున్నాయి అని మనం ఆలోచిస్తే

ఈ దూతలలో ముఖ్యంగా మిఖాయేలు(Sunday), గాబ్రియేలు(Monday), రెఫాయేలు(Tuesday), ఊరియేలు(Wednesday), సెలాఫియేలు(Thursday), రఘూయేలు, జేగుడియేలు(Friday), బెరాఖియేలు(Saturday) ఈ ఏడుగురు దూతలు వారంలో ఏడు రోజులను సూచనగా ఉంటున్నాయి.

3.ఈ రోజున ఏవిధమైన క్రిస్టమస్ దూతల పాత్రలవలె మనం ఉండాలి అని యేసయ్య మనలను కోరుచున్నారు మనం ఆలోచిస్తే

మొదటిగా పరిశుద్ధ దూతలు : మనం పరిశుద్దులుగా ఉండాలి.

రెండవదిగా వెలుగైనా దూతలు : మనం ఈ లోకంలో వెలగాలి, ఆ వెలుగులో ఇతరులకు మాదిరిగా ఉండాలి.

ముడవదిగా సువార్తికులైన దూతలు : మనం సువార్త పరిచర్య చేసే సువార్తికులుగా ఉండాలి.

నాల్గవదిగా సమిష్టి దూతలు :మనం అందరితో ఐక్యత కలిగి ఉండాలి.

ఐదవదిగా స్తుతించే దూతలు :మనం నిత్యం దేవుని స్తుతించే వారీగా ఉండాలి. 

ఈ రోజున మనం పరిశుద్దులుగా,ఇతరులకు మాదిరిగా, సువార్తికులుగా, నిత్యం దేవుని స్తుతించే వారీగా అటువంటి దూతల వలే మనం ఉండుటకు దేవుని కృప కలిగి ఉండువారీగా యేసయ్య మన అందరిని దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ..


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...


 ************************************************


25Dec2019క్రిస్టమస్ ఆరాధన 2019
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

యెషయా9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

ఈ క్రిస్టమస్ ఒక వెలుగుల పండుగ,

ఈ క్రిస్టమస్ ఒక సంతోషకరమైన పండుగ,

మరియు ఈ క్రిస్టమస్ సమాధానము ఇచ్చే పండుగ.

చదవబడిన వాక్యభాగములో యెషయా ప్రవక్త యేసుప్రభువారి పుట్టుక గూర్చి అయన జన్మించడానికి ముందే అయన ప్రవచించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అయన  శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు అని మనం ఆలోచిస్తే,  అయన బిడ్డలమైన మనం పాపం చేసి అపరాధ శిక్షను భరించి నశించిపోకుండా తండ్రి ఐన దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు.
 
లూకా సువార్త19:10: నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

అయన మన పాపములను బట్టి దేవుని ప్రజలైన వారు పాడైపోవుచున్నారు కావున యేసుప్రభువారు మన అందరిని రక్షించుటకు ఈ లోకంలో జన్మించారు, ఈ లోకంలో పుట్టి అనేక ఆశ్చర్య కార్యములను మన కొరకు చేసారు అయన  ఆశ్చర్య కరుడు, ఆలోచన కర్త.

కావున ఈ క్రిస్టమస్ సందర్భముగా అయన  మనకు నేర్పించె, మరియు ఈ క్రిస్టమస్ సందర్భముగా మనం ఈరోజున ఏమి నేర్చుకోవాలి మనం ధ్యానించుకుందాం.

1.మొదటిగా ఈ క్రిస్టమస్ మనకు దీనత్వం గూర్చి చెప్తుంది.

యేసుప్రభువారి యొక్క పుట్టుకను ఒక సారి  మనం గమనిస్తే అయన  పశువుల పాకలో పుట్టాడు, కావున అయన  పుట్టుకలో మనకు దీనత్వం కనిపిస్తుంది అయన దీనుడై  తగ్గింపు కలిగిన వాడై, అయన ఏర్పాటు చేసుకున్న ఒక పేద కుటుంబంలో అయన జన్మించారు

ఎందుకు అయన  ఆలా జన్మించారు అని అంటే మనం అయన  యొక్క నీతిని తెలుసుకోవాలి అని అయన యొక్క నీతిని నేర్చుకోవాలి అని ఆలా పుట్టారు.

మనం ఈ క్రిస్టమస్ నుండి మన జీవితాలలో తగ్గింపు కలిగి ఉండాలి, , ప్రతి విషయంలో అయన నేర్పిన దీనత్వం నేర్చుకోవాలి అది సంఘములో కానీ, కుటుంబములో కాని, చేసే వృత్తిలో కానీ ఈ దీనత్వం కనిపించాలి.

2.రెండవదిగా ఈ క్రిస్ట్మస్లో దేవుని గూర్చిన సువార్త మనకు కనిపిస్తుంది.

జ్ఞానులు ఆకాశంలో నక్షత్రమును చూచి ఒక రాజు పుట్టాడు అని తెలుసుకొని దేవుని పుట్టకును గూర్చిన సువార్తను మనం ఇంతవరకు ఎదురుచూస్తున్నా రక్షకుని పుట్టుకను గూర్చిన సువార్తను  కనుగొన్నారు, దూతలు గొఱ్ఱెల కాపరులైన వారికీ యేసయ్య పుట్టుకను గూర్చి సువార్త చేసారు , దేవుడే తన దూతల ద్వారా ప్రకటించిన ఈ రక్షణ సువార్తను తాము విన్నది చూసినది దేవుని కుమారుని పుట్టుక యొక్క సువార్తను అందరికిని ప్రకటించారు.

మనం కూడా దేవుని సువార్తను అన్నివేళలా అందరికిని ప్రకటించే వారిగా ఉండాలి అని మన యేసయ్య ఈ క్రిస్టమస్ సందర్భముగా మనకు నేర్పిస్తున్నారు.

3.మూడవదిగా ఈ క్రిస్ట్మస్లో మనకు సమర్పణ కనిపిస్తుంది.

జ్ఞానులైన వారు యేసుప్రభువారి పుట్టుకను తెలుసుకొని వారు ఆయనకు బంగారమును, బోళమును, సాంబ్రాణిని విలువైన వాటిని ఆయనకు వారు సమర్పించారు, బంగారము పరిశుద్ధతకు, పవిత్రతకు, బోళము సమర్పణకు, సాంబ్రాణి ఆరాధనకు సూచనగా వారు ఆయనకు సమర్పణ చేసారు,

ఈ రోజున ఏది విలువైనది, ఏది మన నుండి దేవుడు ఆశిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఆయనకు మనం ఏమి ఇచ్చిన అది ఆయనకు సమంకాదు, అందుకే మన విలువైన జీవితాన్ని ఈ క్రిస్టమస్ సందర్భముగా మనం ఆయనకు ఇచ్చే వారీగా ఉండాలి.
 
రోమ 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

మనకొరకు ఈ లోకానికి వచ్చిన ఆయనకు మనం మన హృదయాన్ని, మన మనస్సును ,మన జీవితాన్ని సమర్పించేవారిగా, సజీవయాగంగా మనలను మనం సమర్పించుకోవాలి, దేవుని ఇష్టప్రకారంగా నడుచుకోవాలి.

యేసయ్య దీనత్వం మనం కలిగి, అయన సువార్తను ప్రకటించువారిగా, సమర్పణకలిగి జీవించాలి  అని యేసయ్య మన అందరిని దీవించాలని ఆశిస్తూ , యేసయ్య కృప మన అందరికి కలుగును గాక ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించునుగాక ఆమెన్.. 
 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

***************************************************************



29Dec2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు


లూకా  2:25-35
25 యెరూషలేము నందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతి మంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.

చదవబడిన వాక్యంలో యేసు ప్రభువారిని దేవాలయము లోనికి తీసుకు వచ్చి పాతనిభంధన గ్రంధం ప్రకారం ధర్మశాస్త్రంను నెరవేర్చుటకు యేసు ప్రభువారిని పుట్టిన ఎనిమిదవ రోజున ప్రతిష్ఠత చేసి యేసు అను పేరు పెట్టారు.  

వాక్యంలో అక్కడ దేవాలయంలో యేసయ్య రాకడ గురించి ఎదురు చూస్తున్న ఒక వృద్ధుడు, యాజకుడు సుమెయోనను భక్తిపరుడును గూర్చి వ్రాయబడినది, పాతనిభందన గ్రంధములో అధికాండములో షిమ్యోనును గూర్చి వ్రాయబడినది యితడు యాకోబు పనెండ్రు కుమారులలో ఒకడు, అనీతిపరుడు, దుర్మార్గుడు, కపటముగల చెడ్డవాడైన వ్యక్తి ఉండే వాడు. యితడు తండ్రి మాట ఆలకించక తండ్రి మాటకు దేవునికి విరోధముగా ప్రవర్తించినవాడు.

ఐతే, రోజున మనం సుమెయోను గూర్చి అతని జీవితం నుండి మనం నేర్చుకోవలసిన అంశములను గూర్చి నేర్చుకోవాల్సిన వారమైఉన్నము

1.మొదటిగా మనం సుమెయోను వలే దేవుని బిడ్డలుగా దేవుని మాటలు ఆలకించి ప్రకారము నడుచుకొను వారీగా ఉండాలి.

లూకా సువార్తలో వ్రాయబడిన సుమెయోనను భక్తుడు దేవుని మాటకు విధేయుడై జీవించినవాడు, సుమెయోను అనగా ఆలకించువాడు అని అర్ధం.
 
బైబిల్ గ్రంధములో మనం గమనిస్తే దేవుని వాక్యంలో చాల సార్లు దేవాది దేవుడు మనకు చెప్తున్న మాట ఆలకించుడి అని మనకు కనిపిస్తుంది

సమూయేలు దేవుని పిలుపును గ్రహించి దేవునితో ని దాసుడు ఆలకించు చున్నాడు అని పలికినట్లుగా మనం చూస్తాము, నోవహు దేవుని మాట నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడినది 

సుమెయోను కూడా దేవుని వాక్యమును ఆలకించి ప్రకారం నడుచుకొను వాడు, ఆలాగుననే మనం కూడా దేవుని వాక్యమును ఎంతో ఆశక్తితో ఆలకించు వారీగా ఉండాలి, దేవుని వాక్యాంపట్ల నిర్లక్ష్య ధోరణి ఉండరాదు. రోజులలో మనం దేవుని వాక్యం విని ప్రకారం నడచుకొని మన జీవితాలను బాగుపరచుకొనువారిగా మనం ఉండాలి.

2.రెండవదిగా సుమెయోను నీతిమంతుడు.
 
సుమెయోను వృద్ధుడు  దేవుని యందు విశ్వాసం కలిగి యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతుడు. అతడు క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి ఉండినవాడు, అటువంటి గొప్ప సాక్ష్యమును మనం దేవుని నుండి పొందుకోవాలి అని అంటే మనం నీతిగా జీవించాలి. 

నీతి మనకు ఎలావస్తుంది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగు తుంది, దేవుని యందు విశ్వాసం వలన మనకు నీతిగా జీవిస్తాం.

3.మూడవదిగా సుమెయోను భక్తిపరుడు.

రోజున మనకు దేవుని యందు భక్తి చాల అవసరం, భక్తి ఎలా మనకు కలుగు తుంది అని మనం ఆలోచిస్తే, దేవుని యందు విశ్వాసం కలిగి నీతిగా జీవిస్తే, నీతి ద్వారా మనకు దేవుని యందు భక్తి భావం కలుగు తుంది. అటువంటి భక్తి కలిగిన జీవితం రోజున మనం కలిగి ఉండాలి.

4.నాల్గవదిగా సుమెయోను ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.

ఎందుకు ఇశ్రాయేలు వారికీ ఆదరణ లేదు అని మనం ఆలోచిస్తే వారి యొక్క జీవితం పాపపు జీవితం, అటువంటి మనుష్యులకు ఆదరణ లేక పొతే వారికీ విమోచన లేదు, కనుక అటువంటి ఆదరణ కర్త ఐన యేసుప్రభువారి కొరకు కానీ పెట్టుకొని జీవించేవాడు.

రోజున మనం దేని కొరకు కనిపెట్టువారిగా ఉండాలి అని అంటే  
దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మనం కనిపెట్టాలి ప్రధాన దూతలతో యేసయ్య తెచ్చే దేవుని రాజ్యం కొరకు మనం కానీ పెట్టాలి. అయనను ఎదుర్కొనువారిగా, అయన బిడ్డలుగా, మనం అయన రెండవ రాకడ కొరకు కనిపెట్టు వారీగా మనం ఉండాలి.

5.ఐదవదిగా పరిశుద్ధాత్మ అతని మీద ఉండినవాడు.

సుమెయోనను ఒక మనుష్యుడు పరిశ్దుద్ధాత్మా తో నడిపించబడిన వాడు,  ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు  నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధాన ముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

లూకా 2:30-32
30 అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
31 నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన
32 నీ రక్షణ నేనుకన్నులార చూచితిని. 

రోజున మనం దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉన్నాము?
దేవుని బిడ్డలుగా మనం పరిశుద్దాత్మను పొందుకోవాలి అని అంటే దేవుని పట్ల భక్తి కలిగి నీతికలిగి జీవించాలి అప్పుడు పరిశుద్దాత్మ మనలను సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తుంది.

రోజున సుమెయోను విధంగా దేవుని పరిశుద్దాత్మ ద్వారా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వాడిగా ఉన్నాడో దేవుని బిడ్డలుగా మన అందరం యేసుప్రభువారి చేత ఏర్పాటు చేయబడిన వారీగా దేవుని కొరకు అయన రాకడను ఎదుర్కొనువారిగా నీతి కలిగి జీవించాలని యేసయ్య మన అందరిని దీవించును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును  గాక ఆమెన్..
 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
                       
 












 
 


 

No comments: