June 2020 Messages


7June2020
ఆదివారము ఆరాదన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : చేపట్టుడి

హెబ్రీయులకు 10:23 వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

చదవబడిన వాక్యంలో మనం ధ్యానించు కోబోయే మాట పట్టుకోనుడి. సాదారణంగా  మన జీవితంలో విలువైనటువంటివి మరియు  అధ్యాత్మికమైనటువంటివి ఇలా చాల ఉన్నాయిమన జీవితంలో విలువైనటువంటి వాటిని జాగ్రతగా పట్టుకొని ఉంటాము.

ఈరోజున మనం ఏమి గట్టిగా చేపట్టాలి అని మనం ఆలోచిస్తే. పరిశుద్ద గ్రంధములో కీర్తనాకారుడు దావీదు పలికిన మాటలను మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? 13 రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. మన జీవితంలో ఈ విలువైనటువంటి రక్షణను ఏవిధంగా చేత పట్టుకొని ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చుస్తే దావీదు ఈ రక్షణను చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజున మనం కుడా యేసుప్రభువారు మన కిచ్చిన విలువైనటువంటి రక్షణ పాత్రను చేతపట్టుకొని చూడాలి అది వెలపెట్టికొనలేనిది. ఈరక్షణ అముల్యమైనది, నిర్దోషమును, నిస్కలంకమైన యేసుప్రభువారి రక్తముచేత మనలను కొని రక్షించిన ఈ రక్షణను మనం చూడాలి. అది ఎంత విలువైనటువంటిదో, ఈ రక్షణను ఇవ్వడానికి యేసుప్రభువారు నాకు ఏమిచేసారో అని ఆలోచిస్తే అయన దేవాది దేవుడిగా ఉండి కూడా పరలోకమును విడిచి ఈలోకమునకు వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అది వేలకట్టలేనటువంటి అటువంటి ఈ రక్షణను చేతపుచ్చుకొని నిత్యమూ రక్షణ మార్గములో నడచుకొని మనము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 

ఈరోజున మనం ఏమి చేపట్టాలిదేవుని వాక్యం మనకు ఏమి చెప్తుందో కొన్ని విషయాలను బైబిల్ గ్రoదములో మనం ధ్యానించుకొందాము.

1.మొదటిగా మనం అయన ఉపదేశమును చేపట్టువారిగా ఉండాలి
కొరింథీయులకు 15:2 మీరు దానిని అంగీకరించితిరిదానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గానినేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
ఏమి మనం గట్టిగా పట్టుకోవాలి అని అంటే విలువైన మన రక్షణ కారకమైన అయన చేసిన ఉపదేశమును అయన మనకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. అయన ఉపదేశము ద్వారా మనతో మాట్లాడిన మాటలను అ దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అని అంటే మన జీవితంలో మనలో ఆసహ్యములైన క్రియలను సరిచేసుకోవడానికి, మనలను బాగుచేయడానికి దేవుని సేవకుల ద్వార పలికిన మాటలను మనం స్వీకరించి వాటిని అనుసరించాలి. అది గట్టిగా పట్టుకోకపోతే సాతాను వాటిని పట్టుకొని తీసుకుపోతాడు అప్పుడు అవి మనలో ఫలించవు. అందుకే మనం వాటిని జాగ్రతగా వినాలి వాటిని గట్టిగా పట్టుకోనాలి. ఆవిధంగా చేస్తే మనకు కలిగే లాభం ఏమిటి అని అంటే ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నయెడల ఆ సువార్త వలననే మీరు రక్షణపొందువారై యుందురు. ఈరోజున ఆ విలువైన మన రక్షణ కారకమైన ఉపదేశమును మనం వినాలి వాటిని గట్టిగా చేతపట్టుకోవాలి.

2.రెండవదిగా దృడవిశ్వాసమును గట్టిగా చేపట్టువారిగా ఉండాలి. 
హెబ్రీయులకు 3:15 ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాద్యం. ఈరోజున మనం ఎటువంటి విశ్వాసము గలవారమై ఉండాలి అని అంటే దృఢమైన విశ్వాసముతోఅంతము మట్టుకు గట్టిగా చేపట్టువారిగా మనం ఉండాలి. ఈరోజున ప్రియమైన వారలారా మన విశ్వాసం ఎంత ఉందొ పరీక్షా చేసుకోవాలి అది నమ్మకంగా ఉండాలి చెదిరిపోకుండా దృడంగా ఉండాలి. మనలో ఎల్లప్పుడు దృడమైన విశ్వాసమును నింపుకోవాలి. యేసుకోసం మనం ఏదైనా వదులుకోనేవారిగా మనం సిద్దంగా ఉండాలి ఆవిధంగా మనం మన ప్రుభువుతో చెప్పగలిగే వారిగా ఉండాలి. ఈరోజున మనం లోకాశాలను విడిచి యేసయ్య పైన దృడ విశ్వాసమును కలిగి అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. 
 
3.దైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టుకోనువారిగా ఉండాలి
హెబ్రీయులకు 3:6 అయితే క్రీస్తు కుమారుడైయుండిఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడుధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
ప్రియులారా మనం ఏమి చేపట్టుకోవాలి అని అంటే పరలోకం సమీపిస్తుంది మనకు ప్రభువుతో ఉండే భాగ్యం మనకు కలుగుతుంది అని అటువంటి నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహమునుధైర్యమును చేపట్టుకొని ఉండువారిగా మనం సిద్దపడి ఉండాలి. ఈరోజున భయము అనేది శారీరకముగా మరియు ఆధ్యాత్మికంగా చాల ప్రమాదకరమైనటువంటిది. అందుకే మనం ప్రతి విషయంలో దైర్యము కలిగి ఉండాలి ప్రభువు మనకు తోడై ఉండగా మనం ఆయనపై నిరీక్షణ కలిగిశాస్వతమైన దేవుని రాజ్యమును గూర్చి సిద్దపాటు కలిగి ఉండాలి. మన జీవితంలో మనం దేనికి భయపడక అది వ్యాధి ఐన మరి ఏదైనా వాటి అన్నిటిలో దైర్యమును మనలో నింపుకొని ప్రభువుతో నివసించే పరలోకమును గూర్చి ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుకొని జీవించాలి. 

4.మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉండాలి
థెస్సలొనీకయులకు 2:14-15 మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెననిఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.15 కాబట్టి సహోదరులారానిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
క్రైస్తవ జీవితములో మన ప్రవర్తన ఎలా ఉండాలిమనం ఎలా బ్రతకాలిఎలా జీవించాలి అని అంటే మనకు భోదింపబడిన విధులనుకట్టడాలను చేపట్టువారిగా మనం ఉండాలి. అది యవ్వనస్తులైనస్త్రిలైనపెద్దవారైన ఎవరు ఎలా ఉండాలో ఆ పద్దతులను నియమాలు నిభందనలను పాటించాలి వాటిని అనుసరించాలి.మన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉంటె దేవుని గొప్పదైన ఆశీర్వాదాలను మనమందరం పొందుకొంటాము. 

5.నమ్మదగిన భోదను గట్టిగా చేపట్టువారిగా మనం ఉండాలి.
తీతుకు 1:9 తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకునుఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లుఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.
నమ్మదగిన భోదలలో చాల రకములైనవి ఉన్నాయి.వాటిలో హితబోధవిషయమైనఆరోగ్యకరమైన వాటిని మనం అనుసరిస్తూ అటువంటి భోదను గట్టిగా మనం చేపట్టాలి దానిని అనుసరించాలి.

ముగింపు:-ఈరోజున మనం ఉదేశయుక్తమైన భోదను గట్టిగా పట్టుకోవాలి దాని వలన మనకు ఏమి కలుగుతుంది అని అంటే మనకు రక్షణ కలుగుతుంది. మనం దృడమైన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి దాని ప్రయోజనము ఏమిటి అంటే క్రీస్తుతో కుడా పాలివారమైఉంటాముఅటువంటి భాగ్యము మనకు కలుగుతుంది. దైర్యము నిరీక్షణ ఉత్సాహమును కలిగి వాటిని గట్టిగా పట్టుకొని ఉండాలిఅప్పుడే అయనే మన ఇల్లుగా మనం ఉంటాము. అంతే కాకుండా మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉంటె మనం యేసు క్రీస్తు వారి మహిమను మనం కలిగి ఉంటాము. ఆఖరిగా అయన నమ్మదగిన భోదను గట్టిగా చేపట్టువారిగా ఉంటె మనకు జ్ఞానం మంచి ఆలోచన పెరుగుతుందిమన జీవితం మారుతుంది. అట్టి కృపతో యేసయ్య మన అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

********************************************************************************** 

14June2020

ఆదివారము ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 
అంశం: స్థిరముగా ఉండుడి 

1 కొరింథీయులకు15:58 కాగా నా ప్రియ సహోదరులారామీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగిస్థిరులునుకదలనివారునుప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.


చదవబడిన వాక్యములో ఈరోజున మనం ధ్యానించుకొబోయే అంశం స్థిరముగా ఉండుడి. ఈ స్థిరముగా అనే మాట చాల ప్రాముఖ్యమైనదిమానవ జీవితంలో స్థిరముగా ఉండుట అని అంటే అటు ఇటు తిరుగాకుండా ఉండుట అని అర్దమునిస్తుంది. స్థిరము అని అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి ఆ పనిని మధ్యలో ఆపకుండా అనుకున్న రీతిగా కొనసాగించుట అది చదువులలో గాని ఉద్యోగ రిత్యా గాని మరి ఏపనిలో గాని ప్రతి మనిషికి తన జీవితంలో తను చేసే ప్రతి పనిలో స్థిరత్వము అనేది చాల అవసరం. క్రైస్తవులుగా ఈరోజున దేవుని బిడ్డలుగా మనం అనేకమంది ఒక తల్లి సంఘమును ప్రేమించి ఆ సంఘమును అభివృది పరచుటకు భాద్యత కలిగి ఆ సంఘములో దేవుని పనిని చేస్తూ దేవునిలో స్థిరత్వము కలిగి నిలకడగా ఉండాలి. ఈరోజున మనం దేవుని బిడ్డలుగా దేనిలో స్థిరత్వము కలిగి ఉండాలో దేవుని వాక్యము ఏమి చెప్తుందో మనం ధ్యానించుకుందాము.

1.మొదటిగా మనం క్రీస్తునందలి ఎలా ఉండాలి అని అంటే స్థిరవిశ్వాసము కలిగిన వారముగా ఉండాలి 
కొలొస్సయులకు 2:5 నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండిమీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.
ఈరోజున మనం క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును కలిగి ఉండాలి. 

ఎందుకు మనము దేవునిలో స్థిరవిశ్వాసము కలిగి ఉండాలి. 
1 పేతురు 5:9 లోకమందున్న మీ సహో దరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి,విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.

ఎందుకు మనం దేవునిలో స్థిరవిశ్వాసమందు స్థిరులై ఉండాలి అని అంటే ఈరోజున మనం అపవాదిని ఎదురించాలి అని అంటే మనకు దేవుని యెడల స్థిరవిశ్వాసము కలిగి ఉండాలిఎందుకు అని అంటే అపవాది గర్జించు సింహము వలే తిరుగుచున్నాడు కాబట్టి మనం మన క్రీస్తు పట్ల దృడమైన విశ్వాసకలిగి జీవించాలి అప్పుడే మనం అపవాదిని ఎదురించాగలం.

మనం దేవుని యెడల స్థిరవిశ్వాసము కలిగి ఉంటె దేవుని ప్రేమ మనతో ఉంటుంది   
రోమీయులకు 8:38 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, 

దేవుని యెడల స్థిరవిశ్వాసము కలిగి ఉంటె మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.

ఆకాలంలో పడిపోయిన గలతీయులను మనం గమనిస్తేమనం గలతీయుల వలే శరీరానుసారముగా కాకుండా ఆత్మానుసారముగా ఉండాలి. 
గలతీయులకు 3:3 మీరింత అవివేకులైతిరామొదట ఆత్మానుసారముగా ఆరంభించియిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా?

ఎందుకు అని అంటే వారు మునుపు ఆత్మానుసారులవలె ఉండినను తరువాత వారు శరిరానుసారులుగా మారిపోయారు అని పౌలు భక్తుడు మనకు వివరిస్తున్నాడు. మనం ఈరోజున ఆకాలములో పడిపోయిన స్థితి ఉన్న గలతీయులు వలే ఉండకుండా మన భక్తి దేవుని యెడల స్థిరవిశ్వాసము కలిగి ఉన్నదా ఆత్మానుసారముగా ఉన్నదో లేదో మనలను మనం పరిశీలన చేసుకోవాలి అప్రకారము నడచుకోవాలి. 

2.మనం దేవునిలో స్థిరమైన పునాది కలిగిన వారముగా ఉండాలి
2తిమోతికి2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది.

ఈరోజున ఒక ఇంటికి ఎటువంటి బలమైన పునాది కావాలో అదేవిధంగా దేవుని యెడల మనం స్థిరమైన పునాది కావాలి. 

ఈ స్థిర మైన పునాది ఎవరు కలిగి ఉంటారు, ఆ పునాదిని ఎక్కడ కట్టుకోవాలి? 
ఈ స్థిరమైన పునాది ఎక్కడ కట్టుకోవాలి అని అంటే క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి.
మత్తయి సువార్త7:24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.

ఎవరు ఈపునాది అని అంటే క్రీస్తు. మనమైతే క్రీస్తు అనే బండ మీద స్థిరమైన పునాది కట్టుకోవాలి అప్పుడే మనం దేవునిలో బలంగా ఉంటాము. అదేవిధంగా ఈరోజున మనం మన కుటుంబమును కుడా క్రీస్తు అనే బండ మీద స్థిరమైనపునాది మీద కట్టుకోవాలి. 

క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడితే మనం ఎలా ఉంటాము అని అంటే స్థిరముగా ఉంటాము. 
కొలొస్సయులకు 1:23 పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండిమీరు విన్నట్టియుఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోకవిశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.

ఈస్థిరమైన పునాదియైన మూలరాయిని విశ్వసించువాడు ఎలా ఉంటాడు. 
యెషయా గ్రంథము 28:16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.

ఈ బహు స్థిరమైన పునాదియైన మూలరాయిని విశ్వసించువాడు ఎన్నడును కలవరపడడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకే మనం దేవుని బిడ్డలుగా మన దేవునిలో అటువంటి స్థిరమైన పునాది మనమందరం కలిగి ఉండాలి దేవునిలో బలపడాలి.  

3. మూడవదిగా దేవుని యందు స్థిరమనస్సు మనం కలిగి ఉండాలి 
2 పేతురు3:17 ప్రియులారామీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడిమీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.

ఈ స్థిరమనస్సును ఎవరు కలిగి ఉంటారు అని మనం ఆలోచిస్తే 
కీర్తనల గ్రంథము 112:8 వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.

ఎవరైతే తమ జీవితంలో యదర్దాతను, నీతి కలిగి ఉంటారో, వారు ఈ స్థిర మైన మనస్సును కలిగి ఉంటారు. ఈరోజున మనం మన మనస్సు స్థిరముగా ఉండాలి అని అంటే  స్థిరమైన ఆలోచన మనం కలిగిఉండాలి. అటువంటి స్థిరమనస్సును కలిగిన మనం దానిని విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. 

4. నాల్గవదిగా దేవుని స్థిరమైన ప్రవచనవాక్యము మనం మన జీవితంలో కలిగి ఉండాలి. 
2 పేతురు1:19 మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నదిదానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

ప్రవచనం అని అంటే భవిష్యత్తులో జరగబోయేదానిని తెలియజేసేదే ప్రవచన వాక్యం అటువంటి దేవుని స్తిరమైన ప్రవచన వాక్యము మనం కలిగిఉండాలి. 

ఈ స్థిరత్వం ఎప్పుడు వస్తుంది అని మనం కనుక ఆలోచిస్తే  
కీర్తనల గ్రంథము112:1 యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.

దేవుని యెడల భయభక్తులు కలిగి మనం మన జీవితంలో ఆయన ఆజ్ఞలను బట్టి యధార్దాతతో నీతి కలిగిప్రార్ధనలో స్థిరం కలిగి ఉంటే అప్పుడు మనకు మన జీవితంలో స్థిరత్వం వస్తుంది. 

దేవునిలో అటువంటి స్థిరత్వము మనం కలిగి ఉంటె మనకు కలిగే లాభం ఏమిటి అని ఆలోచిస్తే  

కీర్తనల గ్రంథము 40:2 నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.

మనం దేవునిలో అటువంటి బలమైన స్థిరత్వము కలిగి ఉంటె అప్పుడు దేవుడే మనలను నాశనకరమైన గుంటలోనుండి పైకెత్తి మన అడుగులు స్థిరపరుస్తాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.  

ముగింపు : ఈరోజున మనం దేవుని యెడల స్థిరవిశ్వాసము కలిగి, క్రీస్తు అనే బండ మీద స్థిరమైన పునాది కట్టుకొనిదేవుని యెడల స్థిరమనస్సును కలిగిదేవుని యందు భయభక్తులు కలిగి మనం మన జీవితంలో యధార్దాతతోనీతి కలిగిప్రార్ధనలో స్థిరత్వం కలిగి, దేవుని స్థిరమైన  ప్రవచనవాక్యము కలిగి ఉంటె మన పాదములు క్రీస్తు అనే బండమీద నిలిపిన యెడల అయన మనలను నాశనకరమైన గుంటలో నుండి పైకెత్తి  మన అడుగులు దేవునిలో స్థిరపరుస్తాడు ఆయనలో బలపరుస్తాడుఅట్టి కృప దేవుని ఆశీర్వాదము మన అందరికి నిత్యము తోడై ఉండును గాక ఆమెన్. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్. 
దేవునికి మహిమ కలుగును గక ఆమెన్. 

***************************************************************

21June2020
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 
అంశం: తండ్రి ప్రేమ  

హెబ్రీయులకు 12: 5-9 మరియు నా కుమారుడాప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. 6 ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 

చదవబడిన వాక్యములో ఇద్దరు తండ్రులను గూర్చి మాట్లాడుచున్నాడువారు ఒకరు శారిరకమైన తండ్రి మరియొకరు ఆధ్యాత్మికమైన తండ్రి. ఈరోజున మనం శారీరక తండ్రి  యొక్క ప్రేమను గూర్చి మరియు ఆధ్యాత్మిక తండ్రి ఐన మన పరమతండ్రి యొక్క ప్రేమను గూర్చి మనము ధ్యానించుకొందాము.

ప్రియులారా తండ్రిని గూర్చి దావీదు మహారాజు పలిక మాటలను మనం చుస్తే
కీర్తనల గ్రంథము 68:తన పరిశుద్ధాలయమందుండు దేవుడుతండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు.

మన దేవుడు తండ్రిలేని వారికి తండ్రి అని ఆదరణ మాటలను మనకు గుర్తుచేస్తుంది. మనం తండ్రి ఐన దేవునికి ప్రియబిడ్డలుగా మనం ఉండాలి. ఆయనకు మనం కృతజ్ఞత కలిగి నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి. 

పరమతండ్రిని గూర్చి యెషయా పలికిన మాటలను మనం గమనిస్తే
యెషయా గ్రంథము 64:8 యెహోవానీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

అయన తండ్రి లేనివారికి తండ్రి ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి అయన తండ్రి ఎందుకు అని అంటే అయన మనలను తన స్వహస్తాలతో సృజించుకున్నాడు గనుక మనం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము.

1.అటువంటి దేవునికి పిల్లలమై ఉండటానికి కొన్ని అర్హతలు మనం కలిగిఉండాలి ఏమిటి ఆ అర్హతలు అని అంటే 

మనం ఆయనను అంగికరించిఆయనను విశ్వసిస్తే ఆయనకు మనం పిల్లలమై ఉంటాము. దేవుని గ్రంధములో మనం జ్ఞాపకం చేసుకొంటే  
2సమూయేలు7:14 నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండునుఅతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని

దావీదుకు దేవునితో ఆయనకు ఉన్న అటువంటి ప్రేమ బంధము ఉన్నది. దేవుని పై ఆయనకు ప్రేమ. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, "దావీదు దేవుని హృదయానుసారుడు" అని ఎందుకు అని అంటే తండ్రికి యొక్క ఆలోచనలను ఎరిగినటువంటివాడుపరమ తండ్రి యొక్క ఆశను అతడు ఎరిగినటువంటివాడుఅయన కోరికలను గ్రహించివాటిని నేరవేర్చువాడే దేవుని కుమారుడు. ఇది దావీదులో ఉన్నది అని దేవుడే చెప్తున్నాడు. అయన దేవునితో అంత గొప్ప సహవాసం కలిగినటువంటివాడు. అయన దేవుని సన్నిదిలో నిత్యము గడిపేవాడుదేవుని వాక్యమును నిత్యము ధ్యానించువాడు. దేవునికి దగ్గరగా ఉన్న అయన జీవితాన్ని మనం చూస్తాం.

ఆవిధంగా మనం కుడా దేవుని విశ్వసించాలిదేవుని అంగీకరించాలి. దేవుని చిత్తప్రకారం చేయువారిగా మనం జీవించాలి, అయన అడుగుజాడలలో మనం నడచుకోవాలి. అప్పుడు మనం ఆయనకు కుమారులుగా ఉంటాము. అయన మనకు సమస్తమును ఇచ్చే గొప్ప దేవుడు.  సృష్టి ఆదిలో అదామును సృజించి దేవుడు వారి క్షేమమను చూసాడుఅటువంటి గొప్ప భాగ్యమును వారికీ ఇచ్చాడు, వారికీ శ్రేష్టమైన తోటను ఇచ్చాడువారిని గొప్పగా దీవించాడుఆశీర్వదించాడు. దేవునికి మనం ఎంత ఇష్టమో మనం అంటే. అందుకే అడుగుడి మీకు ఇస్తానుఅని వాగ్దానము చేస్తున్నాడు. మీ తండ్రి రొట్టెను అడిగితే రాయిని ఇస్తాడాచేపను అడిగితే పామును ఇచ్చునా. పరలోకపుతండ్రి మనకు ఏమి కావాలో అది ఇస్తాను అని మనతో మాట్లాడుచున్నాడు. అంటే దేవునికి ఎంత ఇష్టమో మనం అంటేఅందుకే మనం ఈరోజున దేవుని అడుగు జాడలలో మనం నడచుకోనే దేవుని బిడ్డలుగాజీవించాలి. 

2.దేవుడు మనకు ఏమిచేస్తున్నాడుదేవుని యొక్క ప్రేమ ఏరీతిగా ఉన్నది అని మనం చుస్తే 

దేవుని ప్రేమ ఎటువంటిది అని అంటే అయన మనలను ఎత్తుకోనే ప్రేమ.
ద్వితీయోపదేశకాండమ 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీకొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయునుమీరు ఈ చోటికి చేరువరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనునట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని.
ఒక తండ్రి తన బిడ్డలను ఎత్తుకోనునట్లుగా దేవుడు మనలను ఎత్తుకోనును. ఎందుకు అని అంటే మనం త్రోవతప్పి పోకూడదనితన బిడ్డ యొక్క భాదను తెలిసినవాడు. అందుకే తండ్రి ఐన దేవుని యొక్క ప్రేమ గోప్పప్రేమ. 

దేవుని ప్రేమ ఎటువంటిది అని అంటే తండ్రి ప్రేమ మనలను గద్దిస్తుంది.
అయన మనలను గద్దించువాడు ఎందుకు అని అంటే మనకు జ్ఞానమును నేర్పించడానికిమనం నీతి మార్గములో నడవడానికియదార్దముగా జీవించడానికిఅయన మనలను గద్దించువాడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగినవాడు. గద్దిస్తేనే పిల్లైనటువంటి వారు బాగుపడతారు అని దేవుని ఆలోచన. అందుకే మనం ఈరోజున పరమతండ్రి యొక్క మాటను వినే వారిగా మనం ఉండాలి.  తప్పి పోయిన కుమారుని గూర్చి మనం చుస్తే తండ్రి మాట వినలేదుతండ్రిని విడిచి పోయాడు. చివరికి తండ్రి దగ్గరకే రావలసి వచ్చింది. చివరకి ఆయనను చేర్చుకోనినవాడు అయన తండ్రి మాత్రమే. 

పరమ తండ్రి మన యెడల జాలిని చూపేవాడు
కీర్తనల గ్రంథము 103:13 తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
అయన పట్ల ప్రేమను చూపేవాడుఅయన మన పట్ల సహనము చూపేవాడుఅయన మన పట్ల జాలిని చూపేవాడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగినవాడు మన పరమతండ్రి. తప్పిపోయిన కుమారుని తన తండ్రి కుమారుని గూర్చి ఎదురుచూసి ఆయనను చూడగానే కనికరపడి కుమారుని ముద్దుపెట్టుకొని ఆయనకు వస్త్రములను తొడిగి విందుచేసాడు. పరమతండ్రి ఐన దేవుడు కూడా మనం ఎన్ని సార్లు ఆయనను విసిగించినాఅయన హృదయాన్ని గాయపరిచినఆయన పై తిరుగుబాటు చేసిన అయన మనలను వదలి పెట్టలేదుమనలను అను నిత్యం ప్రేమతో జాలి కలిగికనికరం కలిగిమనలను పోషించు దేవుడు.   

3.దేవుడు మనకు అధ్యత్మికమైన తండ్రి ఐతేభాద్యత కలిగిన కొందరు తండ్రులు దేవుని గ్రంధములో కొందరు ఉన్నారు. 

తండ్రి ఐన అబ్రహము కుమారుడైన ఇస్సాకు పట్ల కలిగిన భాద్యతను మనం జ్ఞాపకం చేసుకొంటే
ఆదికాండము24:3 నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు  ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడు నైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిం చెదననెను.

జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి తన కుమారునికి పెండ్లి విషయమై ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ భాద్యత కలిగి తానూ ఉంటున్న కనానీయుల కుమార్తెను కాదని తన బందువుల కుమార్తెను తన కుమారునికి ఇచ్చి పెండ్లి చేయాలి అని తన కుమారుని పట్ల భాద్యత కలిగి ఉన్నాడు. 

తన కుమారుని పట్ల భాద్యత కలిగిన సంసోను తండ్రి ఐన మానోహనా గూర్చి మనం ఆలోచిస్తే
న్యాయాధిపతులు 13:అందుకు మానోహనా ప్రభువానీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చిపుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు మని యెహోవాను వేడుకొనగా 12 అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా

మానోహనా దంపతులకు వారికీ బిడ్డలులేక చాలా కాలం గడిచిందిఅప్పడు ఆమె యొద్దకు దేవుని దూత వచ్చి తనకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పినపుడుఆధ్యాత్మికమైన తండ్రిగా మానోహనా భాద్యతను మనం చుస్తే అయనకు పుట్ట బోయే బిడ్డకు ఏమి చేయాలి అడిగినట్లుగా, అతనికి పుట్ట బోయే బిడ్డ పట్ల ఆధ్యాత్మిక భాద్యత కలిగి ఆ బిడ్డ ఏమి చేయాలిఅబిడ్డకు మేము ఏమి చేయాలిదేవునిలో ఆ బిడ్డను ఎలా పెంచలా అని అడుగుచున్నట్లుగా మనం చూస్తాం. ప్రతి తండ్రి ఈరోజున తన బిడ్డల గూర్చి అటువంటి భాద్యత కలిగి ఉండాలి.    

దావీదు భాద్యత కలిగి తన కుమారుడైన సోలోమానుకు చెప్తున్న మాటలను మనం చుస్తే
1రాజులు2:నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;

దావీదు భాద్యత కలిగిన తండ్రిగా తన కుమారునికి ఏమి చెప్తున్నాడు అని అంటే దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన నడచుకోవాలి అని తన కుమారుకిని దావీదు చెప్తున్నట్లుగాఅయన తన కుమారునికి నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక తండ్రిగా మనం మన బిడ్డలైన వారికీ ఏమి నేర్పిస్తున్నాముఒక తండ్రిగా ఎటువంటి భాద్యతగా కలిగి ఉంటున్నాము. మనం ఈరోజున వారికీ ఎన్ని సమకుర్చినావారిపట్ల భాద్యత కలిగి ఆత్మీయ తండ్రిగా దేవునిలో నడిపిస్తున్నామా మనలను మనం ఆలోచించుకోవాలి. 
 
మన పట్ల భాద్యత కలిగి మన కొరకు ప్రాణం పెట్టిన త్యాగాపురితమైన మన పరమ తండ్రి ని గూర్చి జ్ఞాపకం చేసుకొంటే
1యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.
పరమతండ్రి యొక్క ప్రేమను మనం చుస్తే అయన మన కొరకు ప్రాణం పెట్టిన గొప్పదైన త్యాగాపురితమైన ప్రేమను కలిగనవాడు అటువంటి గొప్ప ప్రేమను ఈరోజున మనం మన బిడ్డల పట్ల కలిగి ఉండాలి.

ముగింపు: ఈరోజున మనం సహనం కలిగిన ఒక తండ్రిగా, భాద్యత కలిగిన ఒక తండ్రిగామనలను ఎత్తుకోనే తండ్రిగామనలను శిక్షించే తండ్రిగా, మనపై జాలిని చూపే తండ్రిగామనం మన పరమ తండ్రిని చూస్తున్నాము. ఐతే ఒక శారీరక తండ్రిగా మనము మన బిడ్డల పట్ల భాద్యత కలిగిప్రతి క్షణం మనం వారికీ మంచిని బోదించాలివారిని ఆధ్యాత్మికంగా దేవునిలో నడిపించాలి. అంతే కాకుండా కుమారులరాకుమార్తెలార మీరు మీ తండ్రులను ప్రేమించండివారు మిమ్మలను గద్దిస్తున్నారని వారికీ దూరంగా ఉంటున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి. తండ్రి ప్రేమను అర్ధం చేసుకోండి. తండ్రి మనం ఎంత భాద పెట్టినఆయనకు మనం దూరంగా ఉంటున్నమన అవసరాలను నిత్యం తెలిసినవాడిగాప్రతి విషయంలో అయన మనకు సహాయం చేస్తున్నాడుమనలను నడిపిస్తున్నాడు. అటువంటి తండ్రి ప్రేమను ఈరోజున జ్ఞాపకం మనం చేసుకొంటూ అటువంటి పరమ తండ్రి యొక్క దేవుని కృప ఆశీర్వాదం మన అందరికి నిత్యం తోడై ఉండును గాక ఆమెన్. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక. 


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*******************************
28June2020
ఆదివారము ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 
అంశం: కిటికీ

యిర్మీయా 9:21 వీధులలో పసిపిల్లలు లేకుండనురాజ మార్గములలో యవ్వనులు లేకుండనువారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నదిమన నగరులలో ప్రవేశించుచున్నది. 
.
చదవబడిన వాక్యభాగాములో నుండి ధ్యానించు కోబోయే అంశం కిటికీ. ఈ కిటికీ అనేది చాల ప్రాముఖ్యం బైబిల్లో కూడా ఈ మాట ఒకటి ఉన్నది. అది ఏమిటి అని అంటే 1రాజులు 7:4 మూడు వరుసల కిటికీలు ఉండెనుమూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను. దేనికి ఈ కిటికి అని అంటే గాలి వెలుతురు అనేది లోపలకి ప్రవేశించడానికి చాల అవసరమైనటువంటిది. ఇది మన ఆరోగ్యమునకు ఎంతో ముఖ్యమైనది. బైబిల్ గ్రంధములో ఈ కిటికి గూర్చి అనేక అనుభవాలు మరియు ఉదాహరణలు ఉన్నాయిఆ అనుభవాల నుండి కొన్ని భాదాకరమైన అనుభవాలను గూర్చి కూడా దేవుని వాక్యంలో వ్రాయబడినది అవి ఏమిటో ఈరోజున మనం ధ్యానించుకొందాము. 

1.మొదటి కిటికీ సమాచారము కొరకు తెరువబడిన కిటికీ
ఆదికాండము 8:6 నలుబది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి
కిటికీ ఒక అనుభవం ఏమిటి ఈ సమాచారము కొరకు తెరువబడిన కిటికి అని అంటే పరిశుద్ద గ్రంధములో దేవుడు నోవహు జల ప్రళయం గూర్చి చెప్పిన తరువాత అయన కుటుంభమును రక్షించడానికి ఒక ఓడను తయారుచేయమని అది ఎలా తాయారు చేయాలో చెప్పాడు. దేవుని మాట అముల్యమైనటువంటిది. అప్పుడు నోవహు తన కోసంతన కుటుంభము కోసంఅంతేకాకుండా దేశ ప్రజలైనటు వారిని రక్షించడానికి వారికీ కూడా దేవుని మాటలను చెప్పాడు కానీ వారు ఎవరు అయన మాట వినలేదు. కనుక వారిమీద ప్రళయం వచ్చినపుడు నోవహు ఓడ ఆ నీటిలో తేలింది. అయన మాట వినని వారందరూ నశిన్చిపోయారు అప్పుడు ఒక నూతన సృష్టి రావడానికి ఆ ప్రళయం తగ్గిందా లేదా తెలియడానికి నోవహు ఆ ఓడ కిటికీలో నుండి ఒక పావురంను అయన పంపించాడు మొదట దానికి కాలు నిలుపుటకు స్థలం లేక తిరిగి వచ్చిందిరెండవసారి ఆలివ ఆకును తెచ్చిందిమూడవసారి పంపినపుడు అది తిరిగి రాలేదు. ఇక్కడ ఈ ఓడ యొక్క కిటికీ మూడు సమాచారముల కొరకు తెరువబడిన కిటికీగా మనకు కనిపిస్తుంది. 

ఈ కిటికీ దేనికి సూచనా అని మనం కనుక ఆలోచిస్తే
ఈ కిటికీ దేనికి సూచనా అని అంటే ఆత్మ సంభందమైన మన కన్నులకు సూచనా. మన కన్నులు అవి మన ఆత్మీయ కిటికీలకు సాదృశ్యముగా ఉన్నాయి. ఈ కిటికీలు మూస్తూ తెరుస్తూ ఉంటాయి. ఆత్మీయమైన ఈ కన్నులు ముయబడుతూ, తెరువబడుతూ ఉంటాయి. మన కన్నులు ముయబడుట అనునది ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యతకు సూచనాగా ఉన్నది. ఈ కన్నులు తెరువబడుట అని అనునది భవిష్యత్తును గూర్చి ఆలోచన కలిగి జాగ్రత్తగా ఉండటానికి ఆత్మీయ కన్నులు తెరువబడుటకు సూచనగా ఉన్నది.  మనం మంచి చెడులు గుర్తించి దేవుని మాటలను గుర్తిస్తున్నాము అని అంటే మన కన్నులు తెరువబడుతున్నాయి అని అర్ధం. నోవహు తెరిచిన ఒడ కిటికి సమాచారము కొరకు తెరువబడిన కిటికీ ఆత్మ సంభందమైన కిటికీ. ఈ రోజున మన కన్నులు అనేక విషయాలను మనం ఎలా ఉండాలో తెలిపే  కిటికీ. ఈరోజున మన ఆత్మీయ కిటికీ తెరువబడాలి. మన ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్య వైఖరి ఎల్లి పరిస్థితిలలో ఉండరాదు. ఈ రోజున ఏది ఎప్పుడు సంభావిస్తుందో మనకు తెలియదు అందుకే మనం లోక సంభందమైన మాటలను విడిచి దేవుని మాటలను నిత్యం ధ్యానించివాటిని తెలుసుకొని దేవుని కొరకు సిద్దపడువారిగా మనం ఉండాలి. సమాచారము తెలుసుకోవడానికి మా ఆత్మీయ కన్నులు తెరువబడాలి పరిస్తితిలన్ని తెలుసుకునుచు నూతన సృష్టి నీ రాజ్యము కొరకు తెలుసుకోవడానికి మేము నీ రాజ్యములో ప్రవేశించడానికి సహాయము చేయండి.

2.రెండవదిగా రాహాభు రక్షణ కొరకు తెరుబడిన కిటికీ
యెహొషువ 2:21 అందుకు ఆమెమీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను.

ఏమిటి రక్షణ కొరకు తెరుబడిన ఈ కిటికీ అని అంటే ఆ ఎరుకో పట్టణంను నాశనము చేయడానికి       ఇశ్రాయేలియులైన తన బిడ్డలైన వారు వాగ్ధానము చేసిన కనాను దేశమును చేరుకోవడానికి ఏరికో పట్టణంను స్వాదినమును చేసుకోవడానికి వారు వచ్చినపుడు వేగుళ వారిని రక్షించడానికి రాహాభు ఆ రక్షణ కిటికీ నుండి వారిని పంపించివేసింది. ఇక్కడ ఆ కిటికీ రక్షణ కిటికి. వారిని ఆమె దేవుని బిడ్డలుగా గుర్తించి వారి దేవుని గూర్చి తెలిసినదిగా ఆమె ఆ సేవకులైన వారిని దాచడానికి సిద్దపరిచిన ఈ కిటికీ తెరువబడిన రక్షణ కిటికీ. వారు వెళ్లినతరువాత ఆమె తొగరుదారమును తన రక్షణకు గుర్తుగా కిటికీకి కట్టెను. తిరిగి వారు ఆ దేశమును స్వదినపరచుకున్నపుడు ఆమెను వారు ఏమియు చేయకుండా గుర్తుగా ఎర్రని దరమును ఆ కిటికీకి రక్షణ కు గుర్తుగా కట్టింది. ఈరోజున మన కన్నులు ఎందుకు తెరువబడాలి అని అంటే మన రక్షణ కొరకు తెరువబడాలి. అటువంటి రక్షణ కిటికీ మనం కలిగి ఉండాలి. 

3.ముడవదిగా ప్రార్థన కోరకు తెరుబడిన కిటికీ
దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లియధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూనితన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

దానియేలు ఇక్కడ రాజు తాయారు చేసిన విగ్రహమునకు నమస్కారము చేయకపోతే సింహలా బోనులో పదవేయుడును అని ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు భయపడక తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. దేవుని గొప్ప తనం తెలుసుకోవడానికి ఆ కిటికీ తెరువబడినది. ఆ శ్రేష్టమైన పట్టణం యెరూషలేము అది దేవుని పట్టణంఅటువంటి దేవుని పట్టణం తట్టునకు తెరువబడిన ఈ కిటికీ ప్రార్ధనా కిటికీ. ఈరోజున ప్రార్ధించే కన్నులు మనకు కావాలి. మనం ప్రార్ధనలో ఎక్కువగా గడపాలి. ప్రార్ధనలో దేవుని గొప్పతనమును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్ధన లేకపోతె మనం శోధనలో ప్రవేశిస్తాముఅందుకే ప్రార్ధనకై మన కన్నులు తెరువబడాలి. అటువంటి ప్రార్ధన జీవితం మనం కలిగి ఉండాలి.

4.సేవకుల సహాయము కొరకు తెరువబడిన కిటికీ
కొరింథీయులకు 11:33 అప్పుడు నేను కిటికీగుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.   

దమస్కులో అరెత అను రాజుక్రింద ఉన్న అధిపతి పౌలు గారిని పట్టగోరి కావలియుంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. దేవుని సేవకలకు సహాయము కొరకు పౌలును తప్పించుటకు కిటికీ గుండ గోడ మీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని. పౌలును తప్పించుటకు తెరుబడిన కిటికీ. ఈరోజున మనం సేవకులకు సహాయము చేయువారిగా మనం ఉండాలి. సేవకుల పట్లమంచి ఆలోచన కలిగి ఉండే వారిగా మనం ఉండాలి.  

దేవుని గ్రంధములో భాదాకరమైన కిటికీ అనుభవం కుడా బైబిల్ గ్రంధములో వ్రాయబడి ఉన్నాయి అవి ఏమిటి అని మనం చుస్తే 

1. దావీదును దేవుని విషయంలో హినపరచిన కిటికీ అనుభవం గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే
2సమూయేలు6:16 ​యెహోవా మందసము దావీదు పురమునకు రాగాసౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచియెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొనితన మనస్సులో అతని హీనపరచెను.

దేవుని మందసం తీసుకువస్తున్నపుడు జరిగిన సందర్భములో దావీదు అతని భార్యఅతనిని కిటికీ నుండి చూసి తన మనస్సులో హీనపరచుట జరిగింది ఇది ఒక దేవుని విషయంలో దావీదు పట్ల జరిగిన భాదకరమైన చేదు కిటికీ అనుభవం. ఈరోజున మనలో కూడా దేవుని విషయంలో భర్తల విషయంలో అనవసర విషయాలలో హీనంగా ఆలోచించే సందర్బాలు అనేకం మనం చూస్తాం. ఐతే భార్యలుగా తమ భర్తలను వారిని ఏనాడూ కూడా ఏవిషయంలో ఐన హినపరచారాదు. అటువంటి ఆలోచన కలిగి ఉండరాదు. 

2. యెజెబెలు పతనంనకు దారితీసిన కిటికీ అనుభవంను గూర్చి మనం చుస్తే  
2రాజులు 9:30 యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా 

యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచినీ యజమానుని చంపినవాడాజిమీ వంటివాడానీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తలయెత్తి కిటికీ తట్టు చూచినా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను. ఇక్కడ ఈ కిటికీ అనుభవం యెజెబెలు ఆమె గర్వం అహంకారం ఆమె పతనంనకు దారితీసింది. మరణం కిటికీలా గుండా ఎక్కుచున్నది ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి.  


3. ఐతుకు అనునొక యవ్వనస్థుడి నిర్లక్ష్యం మరణానికి దారితీసిన కిటికీ అనుభవం గూర్చి మనం చుస్తే   అపొస్తలుల కార్యములు 20:9 అప్పుడు ఐతుకు అనునొక ¸యవ్వనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయిపౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగిమూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై
 
యవ్వనస్థులు మత్తులుగా ఉండరాదునిర్లక్ష్య వైకరి ఉండరాదు దేవుని కొరకు ఆశక్తి కలిగి దేవుని పని చేయాలి. 

ప్రసంగి 12:తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందేవాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందేనీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.

ఈ రోజున మనం ఉన్నస్థితి నుండి దేవుని తెలుసు కొని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని దేవుని కొరకు ఆత్మీయ కన్నులు తెరుచుకొనే వారిగా జీవించాలి.

ముగింపు:  ప్రభువా ఈరోజున మీరిచ్చిన వాక్యం మా అందరి హృదయములలో ఫలిoపజేయండికిటికీ అనుభవం మాకు ఈరోజున నేర్పించారు సమాచారము తెలుసుకోవడానికి మా ఆత్మీయ కన్నులు తెరువబడాలి పరిస్తితిలన్ని తెలుసుకునుచు నూతన సృష్టి నీ రాజ్యము కొరకు తెలుసుకోవడానికి మేము నీ రాజ్యములో ప్రవేశించడానికి సహాయము చేయండి. యేసయ్య రాహాభు కుటుంభమును రక్షించిన ఆ రక్షణ కిటికీ అనుభవం ఈరోజున మాకు కావాలిప్రతి బిడ్డ నీవైపు చూస్తూ మా కన్నులు రక్షణ కొరకు తెరిచే కన్నులు మాకు దయచేయండి. దానియేలు శ్రమ ఎదురైనా కష్టమైన మరణం కళ్ళముందున్న తన కన్నులు తెరిచి యెరూషలేము తట్టునకు చూచి ప్రార్దిస్తున్నాడుదేవా మా కన్నులు తెరవండి. నీ సేవకులను లోబడే వారిగాసేవకులను అర్దము చేసుకొనే వారిగావారికీ సహాయము చేసేవారిగా నీ బిడ్డల కన్నులు తెరవండి. ప్రభువా యెజెబెలు వలే నిర్లక్ష వైకరితో కాకుండా చిన్న చూపు చూసే వారిగా ఉండకుండా గర్వం అహంకారం మాలో తీసివేసి నీ అడుగు జడలలో నడిపించమని మా ఆత్మీయ కన్నులు తెరువమని ప్రార్దిస్తూ యేసయ్య అట్టి కృప ప్రతి ఒక్కరికి అందించును గాక ఆమెన్. 


యేసయ్య ఈ మాటలను దివించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్







No comments: