Feb2020 Messages




02Feb2020ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య మానుకొండ ఆనందవరం గారు

మార్కు 8:1-10
3నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గ ములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను.

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే యేసుప్రభువారు ఆ దినములలో అనేకమైన ఆధ్యాత్మికమైన విషయాలను మూడు దినముల నుండి అక్కడికి వచ్చిన బహుజనులకు బోధిస్తూ ఉండగా వారిని చూచి యేసుప్రభువారు వారి మీద కనికరపడి జనసమూహమునకు ఇంచు మించు నాలుగు వేల మందికి భోజనము ఏర్పాటుచేసి తరువాత ఆయన తన శిష్యులతో కూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను.

ఈరోజున ఈ వాక్యభాగములోనుండి మనం పరిశీలిస్తే మనం కొన్ని అంశములను యేసయ్య ఈరోజు మనతో చెప్పబోయే అంశములను గూర్చి తెలుసుకోవచ్చు.

1.మొదటిఅంశముగా యేసయ్య నొద్దకు వచ్చు వారు సమస్తం మర్చిపోతారు.

మార్కు8:1ఆ దినములలో మరియొక సారి బహు జనులు కూడి రాగా, వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యు లను తనయొద్దకు పిలిచి

ఆ దినములలో మరియొక సారి బహు జనులు కూడి మూడుదినములుగా యేసయ్య మాటలను వింటూ వారు ఆకలి, వారి యొక్క పనులను సమస్తమును మరచిపోయినట్లుగా మనం చూస్తున్నాం .,

ఐతే మనం ఈరోజున నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే మనం కూడా ఆలాగున ఉండగలమా అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి, ఆవిధంగా మనం ఉండగలమా?

ఈరోజున యేసయ్యను వెంబడిస్తున్నవారు, యేసయ్య నొద్దకు వచ్చువారు దేవుని పాదసన్నిధిలో తమ యొక్క పనిపట్లు, భాదలు, కష్టములు అన్నింటిని మర్చిపోయేవారిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా బలపడే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే దేవుని వాక్యము మనకు జీవాహారం, మనలను దేవునిలో ఎదగటానికి సహాయపడుతుంది, అటువంటి వాక్యమును నిత్యము వింటూ చదువుతూ దేవునిలో ఎదుగుతూ అన్నిటిని మరచి యేసయ్యను వెంబడించాలి, మన శరీరానికి శారీరక ఆహారం ఎంత అవసరమో, అదేవిధంగా మన ఆత్మలో బలడటానికి ఆత్మీయ ఆహారం కూడా అంతే అవసరం.

అందుకే మనం వాక్యమునకు సమయంను ఇవ్వాలి అప్పుడు ఈ జీవాహారం ఆత్మలో బలపరచి మన జీవితాన్ని బలపరుస్తుంది అందుకే యేసుప్రభువారు అంటారు మనుష్యులు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను మత్తయి సువార్త 4:4


ఎందుకు మనం యేసయ్యను ఆశ్రయించాలి?
కీర్తనల 107:9 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.

కీర్తనల 9:10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడవు కావుకావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

మనకు నిత్యా జీవం కావాలి అని అంటే మనం యేసును ఆశ్రయించాలి, అయన శరీరమును రొట్టెనును భుజించాలి, అందుకే ఆ దినములలో బహుజనులు ఆయనను ఆశ్రయించి ఆయనను వెంబడించేవారు, మనం కూడా అదేవిధంగా ఆయనలో బలపడాలి., అన్ని మరచి ఆయనను ఆశ్రయించువారిగా మనం ఉండాలి అని యేసయ్య ఈరోజున మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుచున్నారు.

2.రెండవదిగా యేసుప్రభువారు బహుజనులను చూచి కనికరపడుట.

మార్కు 8:2 జనులు నేటికి మూడు దినముల నుండి నాయొద్దనున్నారు; వారికి తిననేమియు లేనందున, నేను వారిమీద కనికరపడుచున్నాను;

ఎవరిమీద అయన కనికరపడ్డారు అని అంటే మూడు దినములుగా ఆకలిని మరచి అయన మాటలను వింటున్న జనులందరిని చూచి వారు ఆయనను ఏమి అడగక పోయిన వారి ఆకలిని యేసయ్య గుర్తించి వారిమీద కనికరపడ్డారు.

ఈరోజున మనం ఆయనను ఏమియు అడగకపోయినా మనలను ఎరిగినవాడు మన యేసయ్య, మనలను చూచేవారు., సమస్యలలో సహాయము చేసేవారు లేకపోయినా మన ఆకలిని మనం బాధలను గుర్తించి మనకు సహాయం చేసేవాడు మన యేసయ్య.

అయన మనలను  చూచి యేసయ్య కనికరపడువారిగా ఉండాలి అని అంటే మనం ఏమిచేయాలి? 

ఈరోజున యేసయ్య కనికరపడువారిగా మనం ఉండాలి అని అంటే దానికి మనం చేయవలసినది ఆయనను వెంబడించడమే, అయన వాక్యమనే జీవాహారమును అనుసరించడమే, ఆయనను వెదకడమే అయన చెప్పినట్లుగా మనం చేయడమే, అయన మార్గంలో నడవడమే అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూస్తాం. 

3.మూడవదిగా అయన తన శిష్యులను పరిశీలిస్తున్నారు

మార్కు 8:3నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరము నుండి వచ్చియున్నారని వారితో చెప్పెను 4 అందు కాయన శిష్యులు ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి.

ఇక్కడ యేసుప్రభువారు అయన తన శిష్యులను పరిశీలించుటకు అయన వారితో మీరు వీరికి భోజనము ఏర్పాటు చేయమని అడుగగా వారు ఈఅరణ్యప్రదేశములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి, వీరిని తృప్తిపరచగలడని వారు ఆయనతో అంటున్నారు, ఎందుకు అని అంటే విశ్వాసం ద్వారా జీవిస్తే ఎన్ని అద్భుతకార్యములు జరుగుతాయో ని చూడానికి అయన తన శిష్యులను పరిశీలిస్తున్నారు.

ఈరోజున మనలను కూడా ఆయన మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మన మాటలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తాడు అప్పుడు మనం మన జీవితంలో దేవుని యెడల విశ్వాసంలో బలపడి ప్రభు పాదసన్నిధిలో మన జీవితం ఉంచితే దేవుడు అద్భుతకార్యములు చేస్తాడు

4.నాల్గవదిగా అయన వారిదగ్గర ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగారు 

మార్కు8:5
ఆయనమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారుఏడనిరి

అయన వారిదగ్గర ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగినపుడు వారు ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఆయనకు ఇవ్వగా అయన వాటిని ఆశీర్వదించారు

ఈరోజున మనం దేవుని బిడ్డలుగా అన్ని మరచి ఆయనను వెంబడించువారిగా అయన మార్గములో నడచువారీగా అయన ఆశీర్వాదములను మన జీవితంలో పొందుకోవాలని యేసయ్య కృప అందరికి కలుగును గాక ఆమెన్

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

********************************************************



09Feb2020 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే యేసుప్రభువారు తాను ఆ బహుజన సమూహమునకు ఆధ్యాత్మికమైన విషయములు బోధించిన తరువాత వారు సమస్తమును మరచి మూడుదినములుగా ఆయనతో పాటుగా ఉండగా యేసుప్రభువారు వారినిచూచి వారి ఆకలిని గుర్తించి వారి మీద అయన కనికరపడి వారి ఆకలిని నింపుటకు ఆయనతో పాటుగా ఉన్న శిష్యులతో మీదగ్గర ఏమైనా ఉన్నాయా అడిగినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో పలికినట్లుగా మనం చూడవచ్చు.

1.మీదగ్గర ఏమైనా ఉన్నాయా అని ఎందుకు యేసుప్రభువారు వారిని ఆలా ప్రశ్నించారు అని మనం ఆలోచిస్తే

యేసుప్రభువారి ఆలోచన ఏమిటి? అయన ఆవిధంగా అడగటం ద్వారా మనకు ఏమి చెప్పాలని అయన ఆశిస్తున్నారు అని మనం చుస్తే యేసుప్రభువారు అక్కడ ఆకలి అనే సమస్యను గుర్తించి అక్కడికి వచ్చిన వారి ఆకలిని తీర్చడానికి వారి వద్ద ఉన్నవాటితో ఒక అద్భుత కార్యం చేయాలి అని అలోచించి అయన తన శిష్యులతో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగారు.

బైబిల్ గ్రంధములో మనం గమనిస్తే ఎలీషా ప్రవక్త బీద విధవరాలు మొరపెట్టగా ఆమె దగ్గర ఉన్న నూనె కుండ ద్వారా చేసి అద్భుతమును మనం చూడవచ్చు.

2రాజులు 4:1-7ఎలీషా ప్రవక్త తన శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱపెట్టగా, అప్పుడు  ఎలీషానా వలన నీకేమి కావలెను? నీ యింటిలో ఏమి యున్నదో అది నాకు తెలియ జెప్పుమనెను.
అందుకామెనీ దాసు రాలనైన నా యింటలో నూనెకుండ యొకటి యున్నది; అది తప్ప మరేమియు లేదనెను.

అతడునీవు బయటికి పోయి, నీ యిరుగు పొరుగు వారందరియొద్ద దొరుకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరవు పుచ్చుకొనుము; అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపల నుండి తలుపుమూసి, ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి, నిండినవి యొకతట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా ఆమె అతని యొద్దనుండి పోయి, తానును కుమారులును లోపలనుండి తలుపుమూసి తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నియు నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడుమరేమియు లేవని చెప్పెను .,ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడునీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలినదానితో నీవును నీ పిల్లలును బ్రదుకుడని ఆమెతో చెప్పెను.

మరియొక సందర్భములో మోషే తన దగ్గర ఉన్న చేతి కర్ర ద్వారా దేవుడు చేసిన అద్భుతములను మనం గమనిస్తే 

దేవుడు తన ప్రజలైన వారిని ఐగుప్తు నుండి విడిపించుటకు మోషేని ఏర్పాటుచేసుకుని తన దగ్గర ఉన్న చేతి కర్ర ద్వారా అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యములు చేసినట్లుగా మనకు తెలుసు చేతి కర్రతో ఎఱ్ఱసముద్రమును రెండు పాయలుగా చేయడం, బండనుండి వారికీ త్రాగుటకు నీరు తెప్పించడం ఇంకా అనేకమైన కార్యములు దేవుడు చేసాడు

నిర్గమకాండము 17: 6 ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.

ఎలీషా బీద విధవరాలు మొరపెట్టగా ఆమె దగ్గర ఉన్న నూనె కుండా ద్వారా అద్భుతమును చేసాడు, మోషే చేతి కర్ర ద్వారా తన ప్రజలైన వారిని రక్షించుటకు అద్భుతకార్యములను చేసాడు,  ఈరోజున దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్యకార్యములు అద్భుతకార్యములు చేయాలనీ దేవుడు ఆశిస్తున్నాడు.

2.ఈరోజున దేవుడు మన జీవితంలో అద్భుతకార్యము చేయాలి అని అంటే మనం ఏమి కలిగి ఉండాలి అని మన యేసయ్య కోరుచున్నారు అని మనం ఆలోచిస్తే 

ఈరోజున దేవుడు మన జీవితంలో అద్భుతకార్యము చేయాలి అని అంటే మనం మన ఇంటోలో, లేదా మనలో లేదా మన చేతిలో మనం ఏమి కలిగి ఉండాలి అంటే మనలో విశ్వాసం అనే నూనె ఉండాలి, ప్రార్ధన,వాక్యమనే అనే కర్రను మనం కలిగి ఉండాలి, అప్పుడే మనం జీవితంలో అద్భుతకార్యము చేస్తాడు ఆలాగున మనజీవితాలు ఉండాలి అని మనం యేసయ్య ఈరోజున తన వాక్యము ద్వారా మనతో మాట్లాడు చున్నారు.

3.ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని యేసుప్రభువారు వారిని అడగటంలో అర్ధం ఏమిటి అని మనం ఆలోచిస్తే

మనం దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి అని అయన ఉద్దేశం, అక్కడ ఉన్నయొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి అని చెప్పగా యేసుప్రభువారు వాటిని తీసుకొని ఆశీర్వదించిగ అవి అక్కడ వచ్చిన వారికీ వడ్డించగా ఇంకను వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. ఈసంధర్బమును బట్టి దేవునికి మనము కొంచెం ఇస్తే దేవుడు వాటిని విస్తారముగా ఆశీర్వదించి దీవించి మనం అందరికి తిరిగి ఇస్తాడు అని యేసయ్య మనకు సూచనగా చెప్తున్నారు.

4.తరువాత యేసుప్రభువారు ఆజనులను యాభై మంది చొప్పున కూర్చుండబెట్టుడని చెప్పెను


ఎందుకు యేసుప్రభువారు ఆవిధంగా పంక్తులుగా వారిని కూర్చుండబెట్టారు అని మనం ఆలోచిస్తే వారికీ ఒక క్రమంగా నేర్పించాలి అని అయన ఉద్దేశం, దేవుని బిడ్డలుగా మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి అయన ఆలోచన చొప్పున మనం ప్రతి విషయంలో నడవాలి అని అయన ఉద్దేశం, ఎందుకు అని అంటే క్రమం లేని జీవితంలో అభివృద్ధి ఉండదు, మనం జీవితంలో ఎదగాలి అంటే క్రమం కావాలి

యేసుప్రభువారు చిన్న వాని యొద్ద అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆశీర్వదించారు, అవి విస్తారముగా సమృద్ధిగా ఐనవి. 
 
మనం ఆశీర్వదించబడాలని అయన కోరిక, సమృద్ధి కలిగి ఉండాలి అని, అభివృద్ధి చెందాలని అయన ఆశిస్తున్నారు. యేసుప్రభువారి దగ్గర ఆశీర్వదం ఉన్నది అయన దగ్గర అభివృద్ధి ఉన్నది ఆయనలో సర్వసంపదలు ఉన్నవి, అందుకే మనం ఆయనకు మనం మన జీవితంను ఆయనకు సమర్పించుకోవాలి అయన మనలను ఆశీర్వదించి మన దగ్గర ఉన్న కొద్దీ వాటిని సమృద్ధిగా చేయాలి అని యేసయ్య ఆశిస్తున్నారు అట్టి కృప మన అందరికి కలుగును గాక ఆమెన్.

ఈ కొద్దీ మాటలను యేసయ్య దివించును గాక ఆమెన్.,



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్,,.
**************************************************************



16Feb2020 ఫీబా ఇండియా ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Bro.V.ఇమ్మానుయేలు గారు
వాక్యధ్యానాంశం :- ప్రార్ధన

అపొస్తలుల కార్యములు 10:1-4, 2 అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే శతాధిపతి యైన కొర్నేలీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని వ్రాయబడినది. ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే మనం దేవునికి యూఖ్తముగా ప్రార్ధన చేయుచున్నామా అని మనలను మనం ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన కుటుంబములో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్ధనకు , దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇస్తున్నామా మనం ఆలోచించుకోవాలి, ఈరోజున ప్రార్ధన ఆవశ్యకతను గూర్చి ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రార్ధన చేయాలి అనే అంశములను గూర్చి ధ్యానించుకుందాం.

1.మొదటిగా మనం దేవుని బిడ్డలుగా దేవుని వాక్యమునకు ప్రాధాన్యతను ఇవ్వాలి  

వాక్యము దేవుడై యుండెను యోహాను1:1 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను యోహాను1:14

మనం దేవుని వాక్యమునకు ఎందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి అని అంటే దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తుంది, మనం ఎవరమూ దేవుని వాక్యమును నిర్లక్ష్యపెట్టువారిగా ఉండరాదు

2.రెండవదిగా క్రైస్తవులుగా మనం మన జీవితంలో,కుటుంబాలలో వ్యక్తిగత ప్రార్ధన కలిగివుండాలి.
బైబిల్ గ్రంధములో అనేకమైన ప్రార్ధన పరులు, ప్రార్ధన ద్వారా అనేక విజయాలు సాధించినవారు ఉన్నారు., దానియేలును తన ద్వారా అనేక విజయమును పొందినట్లుగా మనం చూస్తాం, ఈరోజున ఒక తల్లిగా తండ్రిగా మన కుటుంబాలలో ప్రార్ధన కలిగివుండాలి.

3.అసలు ఈ ప్రార్ధన అనేది ఎక్కడ ప్రారంభమైనది అని బైబిల్ గ్రంధములో మనం ఆలోచిస్తే

ఆదికాండము2:6 మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

అసలు ఈ ప్రార్ధన అనేది సృష్టి ఆరంభములోనే యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది అని మనం తెలుసుకోవచ్చు.

4.మనం ఎందుకు ప్రార్ధన చేయాలి అని మనం ఆలోచిస్తే 

1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

సాతాను కబంధహస్తములనుండి విడుదల కలుగుటకు, మరియు అంతము సమీపముగా ఉన్నది అందును బట్టి దేవునికి మన విజ్ఞాపములను మన పూర్వకముగా, పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రార్ధన ద్వారా దేవునికి మన విన్నపములను తెలియజేయాలి.

5.మన జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రార్ధన చేయాలి అనే అంశములను గూర్చి తెలుసు కోవాలి.

మనం ఎక్కడ ప్రార్ధన చేయాలి అని బైబిల్ గ్రంధములో మనం చుస్తే

**నీ గదిలో రహస్యమందు ప్రార్ధన చేయాలి.
మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును

**ప్రతి స్థలమందు అనుక్షణం ప్రార్ధన చేయాలి.
1 తిమోతికి2:8 కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను

**దేవాలయంలో ప్రార్ధన చేయువారిగా ఉండాలి.
లూకా18:10 ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయము నకు వెళ్లిరి.

మనం ఎప్పుడు ప్రార్ధన చేయాలి అని బైబిల్ గ్రంధము చెప్తుంది అని మనం ఆలోచిస్తే

**దివారాత్రులు మనం దేవునికి ప్రార్ధన చేయువారిగా ఉండాలి.
లూకా 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా? 

**ఉదయకాలమున ప్రార్ధన చేయువారిగా మనం ఉండాలి.
కీర్తనల గ్రంథము 5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడునుఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసికాచియుందును.

**మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్ధన చేయువారిగా మనం ఉండాలి.
కీర్తనల గ్రంథము55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును.

మనమైతే వ్యర్ధమైన మాటలు ఉచ్చరించకుండా నిత్యము దేవునికి మన ప్రార్ధన విజ్ఞాపములను తెలియజేయువారిగా ఉండాలి., హృదయపూర్వకంగా మనం ప్రార్ధన చేస్తే అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.

చివరిగా ఎలా ప్రార్ధన చేయాలి అని బైబిల్ గ్రంధము చెప్తుంది అని మనం ఆలోచిస్తే

**దేవుని యందు విశ్వాసముతో, విరిగినలిగిన మనసుతో మనం ప్రార్ధన చేయాలి.

యాకోబు 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

**దేవుని యందు నమ్మకత్వం కలిగి ప్రార్ధన చేయాలి.
మత్తయి 21:22 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

**ఓర్పు గలవారై దేవునికి ప్రార్థన చేయాలి.
రోమ 12:12 నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

మనకు కలిగిన శ్రమలలో కానీ వేదనలలో కానీ మనం ఓర్పు కలిగి సిగ్గుపడకుండా దేవునికి మొరపెట్టువారిగా మనం ఉండాలి.

మనం జీవితంలో అన్ని వేళల ఎల్లప్పుడును శ్రమలను జయించువారిగా దానియేలు వలె ధైర్యముతో యేసుప్రభువారి వలె కనికరము కలిగి మనం మన జీవితంలో కుటుంబము కొరకు సంఘము కొరకు ప్రార్దించువారిగా ప్రార్ధన పరులుగా ఆశీర్వదించబడాలని దేవుని కృప ఎల్లపుడు మన అందరికి తోడుగా ఉండాలి అని ఆశిస్తూ..,

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.


**********************************************************


23Feb2020 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: ఉపవాసం - ప్రాముఖ్యత

లూకా సువార్త 4:1-13 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింప బడి అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆదినము లలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

చదవబడిన వాక్యభాగములో ఉపవాస ప్రార్ధన గూర్చి వ్రాయబడినది బైబిలులో మనంచూస్తే ఎస్తేరు గ్రంధములో రాణి ఐన ఎస్తేరు తన ప్రజలైన వారిని రక్షించుట కొరకు రాజు చేత చేయబడిన శాసనం మార్చడం కొరకు రాజు యొక్క మనసు మార్పు చెందు కొరకు ఉపవాసం ఉండి ప్రార్ధన చేయడం ప్రజలైన వారితో ఉపవాస ప్రార్ధన చేయించింది, ఉపవాసం ఉండి ప్రార్ధన చేస్తే ఎంతటి శాసనము నైనా మార్చగల సమర్ధుడు దేవుడు అని తెలిసి ఉపవాస ప్రార్ధన ప్రాముఖ్యతను ఎస్తేరు తెలుసుకుంది.

అంతే కాకుండా నెహెమ్యా గ్రంధములో మనం చుస్తే నెహెమ్యా కన్నీరువిడుచుచు ప్రార్ధన చేసిన సంఘటన మనం చూస్తాం దేనికి నెహెమ్యా ఆవిధంగా ప్రార్ధన చేసాడు అని అంటే అతడు దేవుడు ప్రజలు పట్ట బడ్డారు అని అదేవిధంగా దేవుని పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేము ప్రాకారములు కూలగొట్టబడ్డాయి అని, అంతేకాకుండా  యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయి అని విన్నతరువాత నెహెమ్యా తట్టుకోలేక ఉపవాసము ఉండి రాజు సముఖము నుండి సెలవు పుచ్చు కోవడానికి సెలవు తీసుకోవడానికి రాజు మనసు మారడం కోసం ఉపవాస ప్రార్ధన చేసినట్లుగా మనం చూస్తాం.


ఎజ్రా దేవుని గ్రంధములో కోరెషు కాలములో బానిసలుగా ఉన్న ప్రజలైన వారిని గూర్చి ఉపసవాసముండి ప్రార్ధన చేసినట్లుగా మనం చూస్తాం, అంతేకాకుండా మోషే నలభై దినములు సినాయ్ అరణ్యములో దేవుడు తన ప్రజలైన వారికీ ఇవ్వబోతున్న ఆజ్ఞలకొరకు శాసనముల కొరకు ఉపవాసము ఉన్నాడు, నీనెవె పట్టణమునకు రాబోయే ప్రమాదము గూర్చి ప్రజలైన వారు, యోనా దేవుని కనికరము కొరకు ఉపవాసముండి ప్రార్ధన చేసినట్లుగా మనం చూస్తాం

ఇలా ఉపవాసము యొక్క ప్రాముఖ్యత, ఉపవాసం యొక్క ప్రత్యేకత చాల చాలా వుంది
పాతనిభందన గ్రంధములో మనం చుస్తే అనేక సందర్భములలో ఉపవాసముండి దేనికి ప్రార్ధన చేసేవారు అని అంటే దేవుని మనసు మార్చడానికి వారిపై వచ్చే శిక్షను తప్పించుకోడానికి  దేవుని కనికరము కొరకు కన్నీరుతో ఉపవాసముండి ప్రార్ధన చేసేవారు, స్వస్థత కొరకు ఉపవాసముండి ప్రార్ధన చేసేవారు.

1.మొదటిగా యేసుప్రభువారు నలభై రోజులు ఉపవాసము ఉండి ఎందుకు ప్రార్ధన చేసారు?

యేసుప్రభువారు నలభై రోజులు ఉపవాసము ఉండి ఎందుకు ప్రార్ధన చేసారు అంటే మనకు ఒక మాదిరి చూపించాలి అని చేసారు తన సేవ కొరకు, తన సేవలో బలముగా వాడబడుటకొరకు అయన ఉపవాసము ఉన్నారు .దేవుని పరిచర్య కొరకు అయన నశించుచున్న తన ప్రజలైన వారి కొరకు, సువార్త కొరకు, ఈ సువార్తకు  కావలసిన శక్తి కొరకు, ఈ సువార్తకు కావలసిన బలం కొరకు, అయన మన కొరకు నలభై రోజులు ఉపవాసముండి ప్రార్ధన చేసారు,

మనం సువార్త సేవకు వెళ్లే సమయంలో ఉపవాసముండి ప్రార్ధన చేయువారిగా మనం ఉండాలి, దేవుని ఆత్మ శక్తి చేత నింపబడాలి, అయన పనెండ్రు మంది శిష్యులు సేవకు ముందు ఉపవాసముండి ప్రార్ధన చేసారు, ఈ సువార్త నశించిపోయిన అనేక ఆత్మలను రక్షించుటకు ఈరోజున విస్తరించుటకు కారణం ఆరోజు వారు చేసిన ఉపవాస ప్రార్ధన.

2.రెండవదిగా యేసుప్రభువారు ఎందుకు ఉపవాసముండి ప్రార్ధన చేసారు అని అంటే 

యేసుప్రభువారు అయన సాతానును ఎదిరించడానికి సాతానును జయించాలి అంటే ఉపవాస ప్రార్ధన చాల అవసరం అని యేసుప్రభువారు ప్రార్ధన చేసారు.
సాతాను అబద్ధికుడు మోసకరమైనవాడు, ఉపవాస ప్రార్ధన తరువాత అనేక అద్భుతాలు  జరుగబోతున్నాయి  అని తెలుసుకొని సాతాను యేసుప్రభువారిని శోధిస్తూ వచ్చాడు 
నేడు కూడా సాతాను బలమైనవాడు , ప్రలోభపెట్టేవాడు , కానీ  యేసయ్య  సాతానును జయించారు,  కారణం అయన నలభై దినముల ఉపవాసము.


  • దేవునికి, మనుష్యులకు  అగాధమును  సృష్టించి  మనలను  దేవునిలో ఎదగకుండా  చేసేవాడు  సాతానుడు., శోధించే సాతానును మనం జయించడానికి , ఎదిరించడానికి మనలో  ప్రార్ధన బలం కావాలి.  అంటే ఉపవాస ప్రార్ధన ఉండాలి, అది  గ్రహించే వారీగా దేవుని బిడ్డలు ఉండాలి దేవుని చెప్పే మాటలు వినేవారిగా మనం ఉండాలి కానీ సాతాను మాటలు వినే వారీగా ఉండరాదు.

యాకోబు వంట చేస్తున్నాడు ఏశావు అదిచూడగానే ఆకలి వేసినపుడు సాతాను చేత ప్రేరేపింపబడి అతని జేష్టత్వపు హక్కు ఇచ్చేసాడు దేవునికి మనలను దూరం చేసింది ఆహారమే ఆహారం మన శరీరమును లోబరచుకుంటుంది ఈ ఉపవాస ప్రార్ధన చేయాలి అంటే శరీరమును మనం లోబరుచుకోవాలి రకరకము  పాపములో పడిపోయేవారిగా మనం ఉండ కూడదు పాపములో పడిపోయే వారీగా మనం ఉండరాదు.

యేసుప్రభువారు ఎందుకు నలభై దినములు ఉపవాసముండి ప్రార్ధన చేసారు అంటే అతని సేవ పరిచర్య కొరకు, అంతే కాకుండా సాతానుని మోసపూరిత మైన కుయుక్తులను ఎదిరించుట కొరకు అయన ఉపవాసం చేసారు తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పినట్లుగా మనం చూస్తాం సాతాను మనలను ప్రేరేపిస్తాడు, కానీ సాతాను మాట మనం వినకూడదు అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టినీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. 

సాతానుడు మనలను ఏదోరకంగా పడదోయాలని చూస్తాడు కానీ మనం దేవుని మాటలను వినేవారిగా ఉండాలి, ఉపవాస ప్రార్ధనలో గడపాలి, సాతానును ఎదిరించడానికి సర్వాంగ కవచములు ధరించుకోవాలి.

3.మూడవదిగా మనం ఆత్మలో బలపడాలి అని యేసుప్రభువారు మన కొరకు ఉపవాసప్రార్ధన చేసారు.

మనం ఆత్మలో బలపడాలి., ఆచారయుక్తముగా కాకుండా దేవునిలో బలపడటానికి ఉపవాస ప్రార్ధన చేయాలి. మన ఆత్మ బలపడాలి అంటే జీవాహారమైన దేవుని వాక్యమును భుజించాలి, నలభై రోజులు దేవుని సన్నిధిలో మనం దేవునిలో ప్రార్ధన చేద్దాం., మన బిడ్డల రక్షణ కొరకు, మన కుటుంబ రక్షణ కొరకు, మన సంఘ రక్షణ కొరకు సాతానును ఎదిరించడానికి శక్తి కొరకు, బలము కొరకు, శాశ్వతమైన ఆత్మ బలం కొరకు, మనం ఉపవాసముండి ప్రార్ధన చేయాలి.

దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనకు సమయం కలిగినప్పుడు దేవుని వాక్యమును ధ్యానించువారిగా మనం ఉండాలి ఉపవాస ప్రార్ధనలో సాతానును ఎదిరించేవారిగా దేవుని సన్నిధిలోదేవుని ముఖకాంతిలో గడిపే వారీగా మనం ఉండాలి అట్టికృప మన అందరం కలిగి ఉండాలి. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.. 
























,

No comments: