22-32శ్రమదినములు2018

LENT DAY 22
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
10/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic : దెయ్యం పట్టినవాని స్వస్థపరచిన యేసయ్య

మత్తయి 17:14-17
వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని
ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;

1.యేసయ్య ఆమె విశ్వాసం బట్టి కనాను స్త్రీ కుమార్తె దెయ్యం వెళ్ళకొట్టారు, 

*ఆమె బ్రతిమాలింది కుమార్తె దెయ్యం పోగొట్టమని
మొదటిగా యేసయ్య ఆమెతో ఒక్కమాటకూడా మాట్లాడలేదు

*ఐనా బ్రతిమాలింది, రెండవసారి ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను

*ఐనా బ్రతిమాలింది, మూడవదిగా పిల్లల రొట్టె తీసుకోయిని కుక్కపిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నారుమత్తయి 15:26
అందుకు ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా యజమానుని బల్ల మీద పడు ముక్కలు తినును కదా అన్నదిమత్తయి 15:27

మూడుసార్లు సహనం కలిగి ఓర్చుకొని మనవి చేసింది గనుక ఆమె విశ్వాసం బట్టి నువ్వు కోరినట్టే అవును గాక అన్నారు కుమార్తె స్వస్థపడింది.

2.యేసయ్య దెయ్యము పట్టిన కుమారుని తండ్రి విశ్వాసమును బట్టి దెయ్యము నుండి విడుదల కలిగించుట.

*మోకాళ్లూని న కుమారుని కనికరింపమని మొఱ్ఱ పెట్టుకున్నాడు.

*దెయ్యం పట్టిన బాలుని పరిస్థితి నీళ్ళలోకి, అగ్నిలోకి, ప్రమాదంలో
*నురగ కక్కుచు పళ్ళు కోరుకుచు మూర్చిల్లుచున్నాడు. అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

ఆధ్యాత్మికంగా
1.సాతాను మనలను శోదిస్తూ మనలను దేవునికి దూర పరుస్తూ మనలను నరకమునకు, పాతలమునకు, నాశనమునకు నడిపిస్తున్నాడు. 

2.శిష్యులు దెయ్యాన్ని వెళ్లగొట్ట లేక పోయారు  యేసయ్య అంటున్నారు విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా నేనెంత కలం మీతో సహింతును అని శిష్యులను గద్దించారు
 
మన ప్రభువు యేసయ్య యొక్క ఉద్దేశ్యం
1.అయన సాతానుని జయించి ఓడించిన రీతిగా తన బిడ్డలు సాతానుని గద్దించాలని ఎదిరించాలని కోరుతున్నారు.

2.యేసు మన కొరకు శ్రమలు పది మ్రించి లేచి మరణమును జయించి లేచి మరణమును జయించి సాతానుని కి సిగ్గు దేవునికి మహిమ

3.ఆధ్యాత్మికంగా దేవుని విశ్వాసములో బలపడవలసిన వారమైఉన్నము.

4.మన ప్రభువు యేసయ్య సాతానుని జయయించిన రీతిగా, దెయ్యం వంటి పాపం మనలో తీసివేసుకొని సాతానుని జయించుటకు , సిలువ మార్గం లో పయనించుదాం 

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక  ఆమెన్

****************************************************
 LENT DAY 23 
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ M.ఆనందవరం గారు
12/03/2018 Baptist Church అక్కయ్యపాలెం

మత్తయి 18:1-6
1 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, 2 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను 5 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును. 

Topic : పరలోక రాజ్యం చేరాలంటే ఎం చేయాలి

1.మార్పు చెందాలి (చిన్న బిడ్డలా వంటి మనసు కలిగి ఉండాలి)

మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 18:3

2.తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి.

కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు. మత్తయి 18:4

3. దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి.

నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. మత్తయి 18:6

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీయులకు 11:6

మన ప్రభువు చూపిన మార్గం లోనే మనంకూడా దేవునిలో విశ్వాసం కలిగి మన ప్రభువు లో ఎదగాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

***********************************************************************************
 LENT DAY 24
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
13/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : అభ్యంతరములు  

మత్తయి 18:7-10
అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ . మత్తయి 18:7


1.చిన్న పిల్లల విషయములో అభ్యంతరపెట్టకూడదు
ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను     
మత్తయి 18:10

2.మంచి పని విషయములో  మనం అభ్యంతర పెట్టకూడదు

 9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను.
10 వారాయనమీద నేరము మోపవలెననివిశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.
11 అందుకాయనమీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?
12 గొఱ్ఱ కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి
13 ఆ మనుష్యు నితోనీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను. మత్తయి 12:9-13

3.దేవుని విషయములో మన శరీరమును అభ్యంతరపెట్టకూడదు

కాగా నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవే శించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.  మత్తయి 18:8-9

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది. రోమ 12:1

విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి
1 కొరింథీ 6:20

దేవుని ఆరాధించుట లో ప్రకటించుటలో దేవుని పని విషయములో అభ్యంతర పడ కుండ మన ప్రభువు చూపిన మార్గం లోనే మనం మన ప్రభువు లో ఎదగాలని ఆశిస్తూ

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

 ***********************************************************************************
LENT DAY 25 
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
14/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic : తప్పి పోయిన గొఱ్ఱని వెదకి రక్షించిన యేసయ్య 

మత్తయి 18:11-13
11 మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల
12 తొంబదితొమి్మదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా?
13 వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమి్మది గొఱ్ఱలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కు వగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.


గొఱ్ఱ యొక్క లక్షణములు
1.సాత్వికము కలిగినది
2. తగ్గింపుకు సాదృశ్యం
3.పవిత్రమైన దానికి సూచనా
4.బలికి సాదృశ్యం

1.వంద గొఱ్ఱలు శాస్త్రులు పరిసయ్యులు కు  సూచనా
2.తప్పిపోయిన గొఱ్ఱ పాపికి సూచనా

స్వనీతి పరులైన శాస్త్రులు కంటే రక్షణ కొరకు చూస్తున్న పాపి కావాలి

1.మనము గొఱ్ఱ ల వలే  దారి  తప్పిపోతిమి
తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కీర్తనల 119:176

2. గొఱ్ఱ ఎందుకు తప్పిపోతుంది, 

తనకిష్టమైన త్రోవలో వెళ్ళుట వ
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.యెషయా 53:6

3.మనము గొఱ్ఱలవలే  దేవుని జ్ఞానము లేక నశించుపోవుచున్నాము.

నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మ శాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. హొషేయ  4:6

అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,లూకా24:25
 
మనకు ఇష్టమైన త్రోవలో నడచుటవల్ల  యేసయ్య మనలను రక్షించుటకు పరలోకం విడిచివచ్చారు .

నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా 19:10
 
1.మన ప్రభువైన యేసయ్య తన గొఱ్ఱలను వెదకి రక్షిస్తారు

ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగాఇదిగో నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును. యెహెజ్కేలు 34:11-13

జక్కయ్య యేసయ్య ను చూడాలనుకున్నాడు , మేడిచెట్టు ఎక్కాడు
ఒకపాపి రక్షకుని కొరకు చూస్తున్నాడు శాస్త్రులు అతనిని పాపి అని చూస్తున్నారు.

యేసయ్య అతని ఇంట ఉండలనుకుంటున్నారు,  పాపి ఐన జక్కయ్య మారి పోయారు , యేసయ్యకు సంతోషం, ఈరోజు  మనం అయన చేతిలో ఒరిగిపోతే తన దూతలతో సంతోషిస్తారు

2.తప్పి పోయిన గొఱ్ఱలను మన ప్రభువైన యేసయ్య ఆదరిస్తారు 

గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా40:11

మనకోసం పరలోకం నుండి ఈ  లోకానికి వెదుకుతూ వచ్చి తన ప్రాణం ఇచ్చి మనలను రక్షించిన యేసయ్య కు వందనాలు చెప్పి మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుందాం

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*******************************************************************************************
LENT DAY 26
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by ఆలుగు సుధాకర్ గారు
15/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic:ఇస్కరియోతు యూదా వలే కాకుండ, మన ప్రభువుకు విధేయత కలిగి జీవించాలి.

మత్తయి 26:47-51
47 ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహు జనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద నుండియు వచ్చెను.

ఇస్కరియోతు యూదా లక్షణ ములు
1. దుర్నీతి గలవాడు
2. వేషధారి, కపటము గలవాడు
3. లోక స్వభావము గలవాడు

1.మనము పక్షి రాజు వంటి స్వభావము కలిగి ఉండాలి
పక్షి రాజు ఒక ప్రత్యేకమైన జీవన విధానం, శ్రేష్టమైన ఆహారం, తీక్షణమైన చూపు, ఉన్నత స్థలములో నివాసం.

2.మనము పావురం వంటి లక్షణములు కలిగి ఉండాలి.
పావురం శ్రేష్టమైనది, కల్మషం లేనిదీ , చెడు లేనిది

3.మనము చీమ వంటి జ్ఞానము కలిగి ఉండాలి.
చీమ కాలనీ గుర్తించే జ్ఞానం గలది ,కాలనీ సద్వినియోగం చేసుకొనే జ్ఞానం, ఆహారం సిద్ధం చేసుకుంటుంది, శ్రమను ఎదుర్కొంటుంది ,చీమలు ఐక్యత కలిగి ఉంటాయి.

4.మనము గొఱ్ఱవంటి లక్షణములు  కలిగి ఉండాలి.
గొఱ్ఱలు సాత్వికము కలిగినవి, తగ్గింపు కలిగినవి, పవిత్రమైన దానికి సూచన.

1. ఇస్కరియోతు యూదా వంటి లక్షణ ములు కలిగి ఉండకుండ, దేవుని నిత్య రాజ్యములో వారసులుగా జీవించాలి.

మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను
ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది 1యోహాను4:9-10

2. దేవునికి మన సమయాన్ని ఇస్తూ, దేవునిలో సాక్షి జీవితం కలిగి ఉండాలి
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున హెబ్ర 12:1
 
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను అపొస్తలు12:2

భళా నమ్మకమైన దాసుడా మంచి క్రైస్తవుడా అని మన ప్రభువుకు విధేయత కలిగి జీవించాలి, దేవునిలో సహవాసం కలిగి దేవుని కొరకు సాక్షిగా జీవించాలని ఆశిస్తూ

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***********************************************************************************
LENT DAY 27 
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
byదైవ సేవకులు పాస్టర్ ఆనందవరం గారు
16/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic:పోగొట్టకొనబడిన నాణెము 

లూకా 15:8-10
8 ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా?

1.వెండి నాణెము విలువైనది అది పవిత్రమైన దేవుని వాక్యానికి సాదృశ్యము
యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరగి ఊదిన వెండి యంత పవిత్రములు. కీర్తనల 12:6

2.వెండి దేవుడిచ్చు జ్ఞానము,తేలివిని పోలియున్నది
అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు. సామెతలు16:16

3.వెండి నాణెము నీతిమంతుని నాలుకను పోలియున్నది
 నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.   సామెతలు20:20

*********పోగొట్టకొనబడిన ఆధ్యాత్మిక వెండి నాణెము***********

1.పోగొట్టకొనబడిన వెండి నాణెము కొరకు దీపం వెలిగించుట, మన జీవితంలో దేవుని వాక్యమనే దీపం వెలిగించుటకు సాదృశ్యము
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
కీర్తనల 119:105

2.పోగొట్టకొనబడిన వెండి నాణెము కొరకు ఇల్లు ఊడ్చుట, దేవుని వాక్యంతో మన హృదయమనే ఇల్లును  సుద్ధి చేసుకొనుటకు సాదృశ్యము.
యవ్వనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి నీదానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?కీర్తనల 119:9

3.పోగొట్టకొనబడిన వెండి నాణెముదొరికే వరకు జాగ్రత్తగా వెదకుట,  దేవుని వాక్యమనే నాణెము కొరకు జాగ్రత్తగా వెదకుటకు సాదృశ్యము.

వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల 5 యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతలు2:4

రక్షణ, విశ్వాసం పోగొట్టుకోకుండా దేవునికి దూరమవకుండా దేవుని వాక్యమనే వెలుగుని కలిగి ఉండాలని ఆశిస్తూ

అటువంటి కృప మన అందరికి అందించాలని, దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
************************************************************************************

LENT DAY 28 
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
17/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
తప్పిపోయిన కుమారుడు ప్రేమతో చేర్చు కున్న తండ్రి

లూకా 15:11-24
24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు 
లూకా 15:11-18
1.స్వంత (నిర్ణయం) ఆలోచన చేసాడు
2.ఆస్థి పంచమని తిరుగుబాటు చేసాడు
3.దూరముగా వెళ్ళిపోయాడు
4.దుర్వ్యాపారము చేసాడు

ఫలితం:- కరువు తిండి లేక చివరికి పందులు తినే పొట్టు తినాలని ఆశపడ్డాడు 

మనం కూడా దేవునికి వ్యతిరేకముగా స్వంత ఆలోచనలు చేస్తున్నాం
తిరగబడుతున్నాము, దూరం ఐపోతున్నాం
 
తప్పిపోయిన కుమారుడుకి బుద్ధి వచ్చి పశ్చత్తాపపడ్డాడు 
లూకా 15:17-19
1.తాను ఏమిటో తన తండ్రి ఏమిటోతెలుసుకున్నాడు
2.తండ్రి దగ్గరకు వెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు 
3.తండ్రిని క్షమాపణ అడుగుతున్నాడు
1.మనమెమీటో తెలుసుకోవాలి, దేవుడైన తండ్రి ఏమిటో తెలుసుకోవాలి
2.తండ్రి వద్దకు రావడానికి నిర్ణయించుకోవాలి
3.దేవునికి విరోధంగా చేసిన పాపం క్షమించమని  పశ్చత్తాపడాలి
 
ఫలితం:-ప్రేమతో చేర్చు కున్న తండ్రి 
లూకా 15:20-23
1.కుమారుడు కొరకు ఎదురుచూస్తున్నాడు
2.దూరం నుండి చూసి పరుగెత్తుకొని పోయి ముద్దు పెట్టుకున్నాడు
3.ప్రశస్త వస్త్రములు కట్టి ఉంగరం చెప్పులు తొడిగించి గొప్ప విందు చేయించాడు
 
అదే తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ చాల గొప్పది
మన పాపముల కొరకు చిందించిన రక్తముతో దినమెల్ల చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు

మనం అయన వద్దకు వస్తే వెంటనే కౌగలించుకొని హత్తుకొని ముద్దుపెట్టుకుంటాడు
తన రక్తముతో కడిగి పవిత్ర పర్చిన ప్రశస్త వస్త్రములు కట్టి దూతలతో ఆనందిస్తాడు
 
1.భూమిలో నుండి మొక్కతీసేస్తే చచ్చిపోతుంది
2.నీటిలో నుంచి చెపను తీస్తే చచ్చిపోతుంది
3.దేవుని నుండి మనం వేరైపోతే చచ్చిపోతాం

దేవునికి దూరమవకుండా అయన సన్నిధిలో ఆయనతో జీవిస్తూ మన జీవితాలను ఆయనకు సమర్పించుదాం

ఇదే మిక్కిలి అనుకుల సమయం ఇదే రక్షణ దినం దేవునికి స్త్రోత్రం
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*************************************************************************************

LENT DAY 29 
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
19/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic: క్షమాపణ 

మత్తయి 18:15-17
15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

1.సంఘం లో సహోదరుడు తప్పు చేస్తే (మత్తయి 18:15-17) 

*ఒంటరిగా ఉన్నపుడు గద్దించు వినకపోతే
*ఇద్దరు ముగ్గురు సాక్షులు తో చెప్పించాలి ఐన వినకపోతే
*సంఘం లో చెప్పాలి ఐన వినకపోతే
*అన్యునిగా సుంకరిగా ఎంచుకోవాలి అని యేసయ్య చెప్పారు
 
సంఘం అనగా యేసు శరీరం మనం అయన అవయవములం
సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. ఎఫెసీయులకు 5:24

సంఘం పవిత్రంగా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని తనను తాను అప్పగిచుకున్నాడు
అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు5:26-27

శరీరం లో అవయవము పాడైపోతే వదిలేస్తామా ముందు బాగుచేయడానికి చూస్తాం
కుదరకపోతే ఆ పాడైపోయిన అవయవం తెసివేస్తాము
అవి తెసివేయక పొతే ఆ వ్యాధి  మిగతా అవయవములను సోకుతుంది అన్ని పాడైపోతాయి.
 
2.వ్యక్తిగతం గ ఎవరైనా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ఏడూ సార్లు న అని శిష్యులు  అడిగారు (మత్తయి 18:21-35)
 
*యేసయ్య చెప్పారు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను.  (70*7అంటే నాలుగు వందల తొంబై సార్లు అని అర్థం).
*యేసయ్య మనలను క్షమించారు మానవాళిని ఎంతటి పాపినైనా క్షమించుటకు సమర్ధుడు, సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని వేడుకున్నారు
 
*రెండు విషయాలు తెలుసుకోవాలి
 
1.తెలియక చేసిన పాపములను క్షమిస్తాడు
అందుకు సిలువలో వారిని క్షమించమని అడిగారు
తెలిసి పాపం చేస్తే క్షమించడు
సిలువ వద్ద హింసిస్తున్నవారు క్షమాపణ అడగలేదు ఐన క్షమించారు
 
2.క్షమాపణ అడిగినవారికి మాత్రమే క్షమిస్తాడు
ఎందుకంటే దేవుని ఎరిగినవారికి తెలిసి కూడా కొన్ని సార్లు తప్పుచేస్తాం
ఇస్కరియోతు యూదా ఏసయ్యని ముప్పై వెండి నాణెములకు అప్పగించాడు కానీ అతనికి క్షమాపణ దొరకలేదు

కారణం:-
అతడు ఆ నాణెములను ఎవరియొద్ద తీసుకున్నాడో ఇచ్చేసి
యేసయ్య వద్దకు వచ్చి క్షమించమని అడిగి ఉంటె బాగుండేది
 
*సహోదరులారా మన అతిక్రమములను దాచిపెడితే వర్దిల్లమ్ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాం.
 
*తప్పు ఎందుకు చేశాను అని పశ్చాత్తాపం చెంది మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలి.
 
*యేసయ్య మనలను క్షమించినట్టు మనంకూడా మన సహోదరులను క్షమించాలి
శత్రువులను క్షమించాలి యేసయ్య చెప్పిన ఉపమానం

మన ప్రభువు చూపిన మార్గం లోనే మనం మన ప్రభువు లో ఎదగాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***********************************************************************************

 LENT DAY 30
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
By V.M.S. LATHA గారు
20/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic:నిత్యజీవము పొందుటకు ఏమి చేయాలి

మత్తయి 19:16-22
16 ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయ వలెనని ఆయనను అడిగెను.

1.నిత్యా జీవము పొందుటకు యేసయ్య చెప్పిన మార్గాలు

*మొదటిగా దేవుని ఆజ్ఞలను అనుసరించేటయే నిత్యా జీవమునకు మార్గము అని యేసయ్య చెప్పారు.

నిత్యా జీవము పొందుటకు ఏమి చేయాలనీ ఏసయ్యని ఒక యవ్వనష్టుడు
అడుగా గ
అందుకు యేసయ్య దేవుని ఆజ్ఞలను చేయుటయే నిత్యా జీవము పొందుట అని చెప్పారు, నిత్యా జీవము పొందగోరినచో దివాజ్ఞలను ఆచరించుమని యేసయ్య చెప్పారు.

*రెండవదిగా నీ ఆస్తిని బీదలకు దానము చేసి నన్ను అనుసరించేటయే నిత్యా జీవమునకు మార్గము అని  యేసయ్య చెప్పారు..

నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్లి ని ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని యేసయ్య అన్నారు అందుకు అతడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని భాద తో వెళ్లి పోయెను.

ఆధ్యాత్మికంగా నిత్యా జీవమునకు వారసులగుటకు యేసయ్య యొక్క ఉద్దేశ్యం:-

1.ఆస్థి ఇచ్చువారిగా ఉండాలి, ఆస్థి అనగా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చువారిగా ఉండాలి.

ఆయన మాటలకు శిష్యులు విస్మయ మొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెనుపిల్లలారా, తమ ఆస్తియందు నమి్మకయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; మార్కు10:24

2.దేవుని సంకల్పం నెరవేర్చు బిడ్డలుగా ఉండుట,దేవుని గురించి తెలుసుకొనే అవకాశం ను సద్వినియోగం చేసుకొనే వారీగా ఉండాలి. 

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.రోమీ 8:28

3.దేవుని చేరుకొనే పరుగు పందెంలో ఆయనలో విశ్వాసం కలిగి ఉండాలి
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2తిమోతికి 4:7

లోకంలో దేవుని ఆజ్ఞ లు అనుసరించుచు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా ఆత్మీయంగా  శారీరకంగా దేవుని బలపరిచే అర్హత కొరకు నిత్యా జీవమునకు వారసులగుటకు ప్రయత్నించుదాం.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
**********************************************************************************

 LENT DAY 31
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
BY పాస్టర్ఆనంద వరం గారు
21/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic:ద్రాక్షతోట యజమాని

మత్తయి 20:1-16
1 ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

1.యజమాని:-
 ద్రాక్షతోట యజమాని మన ప్రభువునకు సాదృశ్యం.

2.ద్రాక్షతోట:-
యజమానుడు నాటిన ద్రాక్షతోట దేవుని సంఘమునకు సాదృశ్యం.

3.పనివారు:-
ద్రాక్షతోటలో పనివారు మనము అయన సంఘములో పనివారుకి సూచన
 
4.జీతము:-
యజమానుడు ఇచ్చు జీతము మన ప్రభువు ఇచ్చే ఫలములకు సూచన

1.ద్రాక్షతోట యజమానుడు

యజమానికి సమస్తము అధికారము ఉంటుంది.బాగుచేయుటకు పాడుచేయుటకు ఎందుకంటే నాటిన వాడు ఆయనే నీరు పొసే వాడు ఆయనే సమస్తము ఇచ్చువాడు ఆయనే తీసుకొనువాడు ఆయనే. ఎందుకు ఇవ్వలేదు ఎందుకు తీసుకున్నావ్ అని అడగటానికి మనకు అధికారము లేదు. అయన యజమానుడు గనుక ఆయనకే అధికారము. మనఇంటికి, మనకు, మన పని అంతటికి యజమానుడు మన ప్రభువు

ఆయనను మనము మనయజమానిగ చేసుకోవాలి.,మన ఇంటికి యజమాని మన ప్రభువే..

మోషేఅన్నారు నిర్గమకాండము 33:15
మోషేనీ సన్నిధి రానియెడల ఇక్కడనుండి మమ్మును తోడుకొని పోకుము.

2.ద్రాక్షతోట
నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.
నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును అన్నారు యోహాను15:1  

యజమానుడు నాటిన ద్రాక్షతోట దేవుని సంఘమునకు సాదృశ్యం.
మనము బలహీనులమైన దరిద్రులమైన ఎన్నికలేని వారమైన మనలో మంచిఫలములు ఫలించాలని యేసయ్య కోరుకొంటున్నారు
మనము అయన సంఘములో వృక్షముల వంటి వారమని యేసయ్య అన్నారు. 

ద్రాక్షతోట అనే సంఘములో ద్రాక్షవల్లీ ఐన యేసయ్యలో తీగెలు అనే మనం అయన లో ఫలించాలి లేకపోతె ఎండిపోతాం బయటకు తెసివేయబడతాము
 
3. ద్రాక్ష తోట  పనివారు. 

*ఆధ్యాత్మికంగా క్రిస్తుసంఘమనే ద్రాక్షతోట బాగుపడాలంటే కాపాడే పనివారు కావాలి.

*సంఘములో పనిచేయుటకు సంఘకాపరి గారు,సంఘ పెద్దలు, సండే స్కూల్, యవ్వనస్తులు స్త్రీల సమాజము వారు, సంఘ సభ్యులు అందరు దేవుని పనివారుగా ఉండాలి. దేవుని పనిలోవాడబడే వారు కావాలి.

*మనము సంఘములో ఫలించాలి సంఘము బాగుపడాలి.,సంఘము ఆశీర్వదింపబడాలి ఫలించాలి.

4.ద్రాక్ష తోట పనివారు జీతము.
ద్రాక్ష తోటలో పనివారుగా యజమానుడు ఇచ్చు జీతము మన ప్రభువు ఇచ్చే ఫలములకు సూచన.

*కష్టపడినవారికి వాణి పనిని బట్టి జీతము ప్రభువు ఇస్తారు.
*ఫలములు ఇస్తారుకదా అని ఆశించి పని చేయకూడదు.
*మనము దేవుని పని భాద్యతగా చేస్తే ఇహ లోక ఆశీర్వాదములు కంటే పరలోక ఆశీర్వాదములు ఇస్తాడు.

పౌలు గారు అన్నారు
నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 1కొరింథీయులకు 9:16

మన యజమానుడు పరమ తండ్రి ద్రాక్ష తోట ఐన అయన సంఘములో ద్రాక్షావల్లి ఐన  యేసయ్యతో తీగలుగ అంటుకట్టబడాలి ఫలించాలి మరియు సంఘమును కాపాడుటకు అందరమూ నమ్మకమైన పనివారముగా జీవిస్తూ అయన ఇచ్చే జీతము పరలోకమును ఈలోకం లో కూడా అనుభవిస్తూ ఫలించాలని ఆశిస్తూ 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

********************************************************************************
 LENT DAY 32

సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
BY ఆలుగు సుధాకర్ గారు
22/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic: క్రీస్తు పరిచర్య

యోహాను 2:19-22
19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.

1.యేసయ్య పరిచర్యలో చేసిన మొదటి సూచకక్రియ

గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
యోహాను2:11

2. యేసయ్య పరిచర్యలో యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసయ్య యెరూషలేమునకు వెళ్ళుట.

13 యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి 14 దేవాలయములో ఎడ్లను గొఱ్ఱలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 15 త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి 16 పావురములు అమ్ము వారితోవీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. యోహాను2:13-16

3. యేసయ్య పరిచర్యను  బాప్తిస్మము ఇచ్చు యోహాను సాక్ష్యమిచ్చుట.

26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చిబోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీ వెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చు చున్నారని అతనితో చెప్పిరి.
27 అందుకు యోహాను ఇట్లనెనుతనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొంద నేరడు.
28 నేను క్రీస్తును కాననియు, ఆయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు యోహాను3:26-28

4. యేసయ్య పరిచర్యలో నీకొదేమను పరిసయ్యుడుతో రాత్రియందు మాట్లాడుట.

యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3:5

5. గలిలయలో యేసయ్య పరిచర్య, పడిన శ్రమ, 

సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను. లూకా 4:28-30
6. యేసయ్య పరిచర్యలో  మరణ పునరుద్ధణమును రెండు  సంవత్సరములు ముందే బోధించుట, పొందిన అధికారము.

యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి. యోహాను 2:19-20

ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. యోహాను 10:18

 దేవుని పోలి అయన చెప్పిన మార్గములో జీవిస్తూ ఒక శరీరములో అవయవములుగా ఉన్న మనము క్రిస్తునే శిరశుగ కలిగి ద్రాక్ష వళ్ళికి తీగలుగా ఫలించే వారీగా 
ఉండాలని ఆశిస్తూ

పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. 2దినవృత్తాంత15:12

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్