July Messages 2018

ఆదివారము ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు:30
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు   5,462,955,611
MESSAGE Rev M.ANANDAVARAM GARU

1కోరింథీయులకు 11:26 మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.

మరణము రకాలు :-
1. శారీరక మరణము
2. ఆత్మీయ మరణము
3. ఆధ్యాత్మిక మరణము 
 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే ప్రకటన గ్రంథం 3:1

1.యేసు ప్రభువు మరణము విధేయతతో కూడినది
 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
ఫిలిప్పీయులకు 2:8

2.శ్రమయు వేదనతో కూడిన మరణము
 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. యెషయా 53:7

3.సమాధాన అర్థమైనది మరణము
 ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. రోమీయులకు 5:10

4.మరణము  పైన  విజయము  నిచ్చిన  సిలువ  మరణం
  ​అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. హోషేయా 13:14
మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మింగి వేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగుననియెహోవా సెలవిచ్చియున్నాడు.
యెషయా 25:8
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 

******************************************************
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు:33
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు   19,414,441,386
MESSAGE PASTOR M.ANANDAVARAM GARU
Topic: నేను వచ్చు వరకు - వ్యాపారము చేయుడి – అభి వృద్ధి చేయుడి

లూకా సువార్త 19:12-26
12 రాజ కుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలె నని దూరదేశమునకు ప్రయాణమై
13 తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. 

ఉపమానము:-
**ఈ ఉపమానంలో రాజు యేసు ప్రభువారికీ సాదృశ్యం.
**ఈ ఉపమానంలో మినాలు అయన మనకు ఇచ్చిన బాధ్యతలుకు సాదృశ్యం.

యేసు  ప్రభు వచ్చువరకు మనకు అయన ఇచ్చిన బాధ్యతలు అభివృద్ధి పరచబడాలి:-
1.ఆత్మల సంపాదన అనే మినాలో అభివృద్ధి పరచబడాలి
2.నీతి అనే మినాలో అభివృద్ధిపరచబడాలి 
3.దేవుని గూర్చిన జ్ఞానము అనే మినాలో అభివృద్ధి పరచబడాలి 
4.ప్రేమ అనే మినాలో అభివృద్ధి పరచబడాలి 
5.దేవునిలో విశ్వాసమునందు అభివృద్ధి కావలసిఉన్నది.


1. ఆత్మల సంపాదన అనే మినాలో అభివృద్ధి పరచబడాలి
**మనం రక్షింపబడాలి
**కుటుంబాని రక్షణలో నడిపించాలి
**అనేకమందిని రక్షణలో నడిపించాలి
ఆత్మ రక్షణ అనే మినా కలిగి ఉండాలి., ఈ ఉపమానంలో మనలను ఆధ్యాత్మికంగా ఆత్మల మినాల సంపాదనలో అభివృద్ధి పరచబడాలని తెలియజేస్తున్నారు.

2. నీతి అనే మినాలో అభివృద్ధిపరచబడాలి 
2 కొరింథీయులకు 9:10 విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.

3.దేవుని గూర్చిన జ్ఞానము అనే మినాలో అభివృద్ధి పరచబడాలి
కొలొస్సయులకు  1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

4.ప్రేమ అనే మినాలో అభివృద్ధి పరచబడాలి 
2 థెస్సలొనీకయులకు  1:3సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.

ప్రకటన గ్రంథము 2:3-4నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.

4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.

**సంఘము విషయములో ప్రేమ కలిగి ఉండాలి
**దేవుని పట్ల  ప్రేమ కలిగి ఉండాలి
**ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి  


5.దేవునిలో విశ్వాసమునందు అభివృద్ధి కావలసిఉన్నది

2 పేతురు 1:5-8
ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణ మును,సద్గుణమునందు జ్ఞానమును,
6 జ్ఞానమునందు ఆశానిగ్ర హమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనము నందు భక్తిని,
7 భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
8 ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును.

**ఈ రోజులలో మనము ఎలా ఉన్నాము ?
**ఈ రోజులలో మనకు ఏ విషయములలో అభివృద్ధి కావలసిఉన్నది
దేవునికొరకు  ఆత్మల సంపాదనలో, నీతిలో, దేవుని వాక్య జ్ఞానములొ సంఘము పట్ల ప్రేమ లో అభివృద్ధి కలిగి ఉండాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక

*********************************************************
13/07/2018
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
TOPIC: రాజకుమారి పుత్రిక ని నడక ఎలా ఉంది  
1పేతురు 2:1:9 అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.

పరమగీతము  7:1
రాజకుమార పుత్రికా, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచు చున్నావు! నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములవలె ఆడుచున్నవి.

సంఘము ఎలా ఉండాలి  ఎలా  ఉంటె  సంఘము ప్రభువుకు ఇష్టము 

దేవుని  మాటల చేత సిద్ధపరచబడిన మనసు ఉంటె సంఘము ప్రభువుకు ఇష్టము
ఎఫెసీయులకు  6:15పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.

దేవునితో సమాధానపరచబడిన వారమై ఉంటె ప్రభువుకు ఇష్టము  
రోమీయులకు 5:10ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.

హెబ్రీయులకు  2:14కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస ములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,

నడక మారి రాజకుమారి పుత్రికగ ఉండాలంటే అర్ధం
**విలువ  చేల్లించబడింది,
**క్రయధనం చెల్లింపబడినది ,  
**సమాధాన  పరచబడటం  జరిగింది

యోబు గ్రంథము 31:37నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.
 
రాజకుమారి  పుత్రిక  లక్షణములు :-
1. అయన కొరకు ఏర్పరచబడిన  జనం
2.రాజులైన యాజక సమూహం

3.పరిశుద్ధ  జనం

4.దేవుని  సొత్తయిన ప్రజలు

రాజకుమారి పుత్రిక లక్షణములు ఆయనను మనము  అడగవలిసిన వారమై ఉన్నాము
ఎఫెసీయులకు 4 :18 వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

 అయన  గుణాతిశయములు  ప్రచురము  చేయు వారమైఉన్నాము., యేసు  యొక్క   గుణాతిశయములు   మన  నడకలో  ఉండాలి
నాలుగు  ప్రణాళికలు మనపట్ల ఆయనకు  ఉన్నాయ్

1.యాజకుడవు   
యాజకుడవుగా ఉండాలి అని దేవుని మొదటి ప్రణాళిక
యాజకుడవుగా ఆరాధన  చేయుట  2 రకాలు
***స్తుతి అర్పణ  
***కృతజ్ఞత  అర్పణ
***నిరంతరం  దేవుని  స్తుతించాలి 

2.రాజువు : 
రాజువుగా ఉండాలి అని దేవుని రెండవ ప్రణాళిక
దేవుని రాజ్యముకొరకు పోరాడాలి అనగా
***పాపముతో  యుద్ధము  చేయువారమైఉన్నము  
***మన  శరీరాలతో  పోరాడాలి  
***అపవాదితో  పోరాడాలి

1కొరింథీయులకు 9:27గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.

3.వర్తకుడవు
వర్తకుడవుగా ఉండాలి అని దేవుని మూడవ ప్రణాళిక
దేవుని రాజ్యము కొరకు మంచి ముత్యములు సంపాదించువారీగా ఉండాలి  
మత్తయి సువార్త  13:44-46 మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమి్మ దాని కొనును.

4.దేవుని సొత్తువు
 దేవుని సొత్తువుగా ఉండాలి అని దేవుని నాల్గవ ప్రణాళిక

రోమీయులకు  15:13కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

రాజా కుమారి పుత్రిక గా అందమైన నడక కలిగి సంఘము ఉండాలి మన
ప్రభువు ఇష్టపడే రీతిగా ఉండాలని ఆశిస్తూ  

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

********************************************************
14/07/2018
TOPIC: కన్నీటి అనుభవం లేని క్రైస్తవ్యం, క్రైస్తవ్యంకాదు.
కీర్తనల గ్రంథము 56:1-8
నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా

**గువ్వకన్నులు :-
పరమగీతము  4:1
నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండ నీ కన్నులు గువ్వకన్నులవలె కనబడు చున్నవి నీ తలవెండ్రుకలు గిలాదు పర్వతముమీది మేకల మందను పోలియున్నవి.

1.గువ్వా ముందుకే చూస్తుంది
2.పైకి చూస్తుంది
3.కన్నీటిపొరలతో ఉంటుంది
 
కన్నీటి అనుభవం  క్రైస్తవులకు అవసరం
1.తిన్నగా  ముందుకు  చూడాలి
2.పైకి  చూడాలి  యేసును చూడాలి
3.కన్నీటితో ప్రార్ధించాలి
 
మన కన్నులు సూటిగా ఉండాలి సూటిగా ఉండేది సంఘము
1.సూటిగా చూడాలి
2.పైకి  చూడాలి  యేసును చూడాలి
3.కన్నీళ్లతో చూడాలి కన్నీటితో ప్రార్ధించాలి
 
పరమగీతము  5:12అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

1.మనముకూడ సూటిగా చూడాలి
సామెతలు  4:25నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.

2.మనముకూడ పైకి  చూడాలి  యేసును చూడాలి
కొలొస్సయులకు 3:1మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
కీర్తనల గ్రంథము 56:3
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను.
మార్కు సువార్త 9:8
వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

మనకు కూడా యేసు తప్ప ఎవరు కనపడకూడదు
హెబ్రీయులకు 12:2 మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.

3.మనముకూడ కన్నీళ్లతో  చూడాలి కన్నీటితో ప్రార్ధించాలి
హెబ్రీయులకు 5:7శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.

కన్నీరు మూడు రకాలుగా మూడు సందర్భాలలో దేవుని బిడ్డలు కన్నీరు కార్చాలి
1.పశ్చత్తాపము తో కూడిన కన్నీరు
2.దేవునితో సహవాసం కొరకు ఆశతో కార్చే కన్నీరు
3.యేసయ్య తిరిగి రావాలని యేసయ్య కొరకు కార్చే కన్నీరు

1.పశ్చత్తాపముతో కూడిన కన్నీరు
లూకా సువార్త7:37-38
37 ​ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ, యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని, యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి
38 ​వెనుకతట్టు ఆయన పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదము లను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.

2.దేవునితో సహవాసము కొరకైనా కన్నీరు., అయనతో సహవాసం కొరకు ఆశతో కార్చే కన్నీరు.
కీర్తనల గ్రంథము 42:3నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
***కృతజ్ఞత తో కార్చే కన్నీరు
***ప్రేమతో కార్చే కన్నీరు

3.యేసయ్య తిరిగి రావాలని యేసయ్య రాజ్యము కొరకు కార్చే కన్నీరు .
**ఆత్మల రక్షణ కొరకు కన్నీరు
**యేసయ్య రాజ్యము కొరకు కార్చే కన్నీరు .

ఆ దేవాది దేవుడు అట్టి కృప మన అందరికి అందివ్వాలని.,,దేవుని కృప మన అందరికి కలుగ జేయాలనిఆశిస్తూ..  
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

****************************************************

15/07/2018ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యోపదేశకులు దైవసేవకులు 
రేవ కే. డేనియల్ గారు
Response Reading కీర్తనల 21
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 9,239,538,610
కీర్తనల గ్రంథము 45:1-7

TOPIC: పరిమళతైలము
7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు.

పరమగీతము  1:1-3
1 సొలొమోను రచించిన పరమగీతము.
2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
3 నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.

పరిమళ తైలము:-
పాతనిబంధన గ్రంధములో దేవుని ద్వారా చేయబడిన ప్రతిష్ఠాభిషేక పరిమళ తైలము

నిర్గమకాండము 30:22-24,33
22 మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో
23 పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును
24 నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
25 వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.
33 దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.

అటువంటి పరిమళ తైలము మన యేసు ప్రభువే
1తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

ఫిలిప్పీయులకు  2:7మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

అయన ఎవరు ఎలాంటి వాడు ?
యెషయా 57:15మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

1.ఆయన మహిమకు కారణమైన పరిమళ తైలముగా ఉండుట
ఎఫెసీయులకు  5:1కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.

కొలొస్సయులకు 1:13
13 ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను.

ప్రకటన గ్రంథము 5:9-10ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

2.ప్రేమ కలిగి నడుచుకోవాలి
ఎఫెసీయులకు  5:2క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

3.ప్రభువునందే అతిశయింప వలెను

1 కొరింథీ 1:31అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.

1 పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;

***************ప్రేమకు మూడు మెట్లు*************

1.శ్రద్ధ కలిగిన ప్రేమ 
ప్రభువును ప్రేమిస్తే ప్రభువు కొరకు ఇతరుల పట్ల శ్రమలలో శ్రద్ధ కలిగి ఉండాలి.
అప్పుడు మన ప్రభువు మనపై పరిమళ తైలముతో అభిషేకిస్తాడు.

2.భరించే ప్రేమ 
ప్రేమతో ఒకరి కి ఒకరు ప్రేమ కలిగి ఉండాలి.

3.పంచుకొనే ప్రేమ
యేసు ప్రేమ ఇతరులను ప్రేమించే ప్రేమ
ప్రభువును ప్రకటించుటకు సాక్షిగా ఉండాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

 **************************************************

22/07/2018ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు:113
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 8,518,575,616
MESSAGE BY PASTOR M.ANANDAVARAM GARU
TOPIC: నేను వచ్చువరకు తీర్పు తీర్చకుడి.

1 కొరింథీయులకు 4:1-5కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. 
 
1.తీర్పు అనగా న్యాయ  సంభందమైన మాట
2.విశ్వాసి ఐన  అవిశ్వాసి ఐన తీర్పు తీర్చకూడదు
 
*పాతనిభందన గ్రంధములో దేవుడు ఇచ్చిన ధర్మ శాస్త్రము బట్టి*

**మనము దేవుని అడుగు జడలలో నడుచుకోవాలి.
**మనము ధర్మ శాస్త్రము అనుసరించాలి.
**అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు.
 
***దేవునికి కావలసినది***
1.మనము న్యాయముగా నడుచుకొనుట.
2.మనము న్యాయముగా తీర్పు తీర్చుట.
3.మనము న్యాయము పాటించుట.
 
ఎన్ని రకాలైన తీర్పులు ఉన్నాయ్
1.పక్షపాతం లేని తీర్పులు
2.సహోదరుల యెడల తీర్పు
3.పొరుగువానికి తీర్పు తీర్చుట
4.వెలిచూపులో తీర్పు
5.పరునిసేవకుని విషయంలో తీర్పు

1.పక్షపాతం లేని తీర్పు
లేవీయకాండము 19:15అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్ష పాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.

2.సహోదరుల యెడల తీర్పు

మత్తయి సువార్త 7:1,4 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు
నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?

3.పొరుగు వానికి తీర్పు తీర్చుట

యాకోబు 4:12ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

4.వెలిచూపులో తీర్పు
యోహాను సువార్త 7:24వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.

5.పరుని సేవకుని విషయంలో తీర్పు
రోమీయులకు 14:4పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

అట్టి కృప మన అందరికి కలుగ జేయాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 
*****************************************************

29/07/2018ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
PASTOR M. ఆనందవరం గారు
Response reading కీర్తనల గ్రంథము 99
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 12,641,455,614

యోహాను సువార్త  5:22-30
24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను.

మనమైతే తీర్పు తీర్చకూడదు కానీ దేవుడు తీర్పు తీర్చుటకు సర్వఅధికారము కలవాడు.
యోహాను సువార్త  5:22-23
22 తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని 
23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

 తీర్పులు అవి ఏమిటి అంటే

1.ధర్మశాస్త్ర సంభందమైన తీర్పు 
పాతనిబంధన ప్రకారం ధర్మ శాస్త్రములో ఆజ్ఞలు అతిక్రమిస్తే వచ్చే శిక్ష - తీర్పు
 
2.యేసు ప్రభువారు తీర్చిన తీర్పు
యేసు ప్రభువారు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు వారు చేసిన పాపములను ఖండించిన తీర్పు. 

3.అంత్య దినమందు ఇచ్చే తీర్పు ఆఖరి తీర్పు 
2 తిమోతికి 3:1అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

****అంత్య దినమందు - దిద్దుబాటు కాలమున మనం ఏమి చేయాలి****

1.అంధకారమందలి రహస్యములను బట్టి తీర్పునొందుదువు వాటిని దిద్దుబాటు చేసుకోని సరిచేసుకోవాలి.
1 కొరింథీయులకు 4:5
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృద యములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

రోమీయులకు  2:16
దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

2.మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటబట్టి తీర్పునొందుదువు, వాటిని దిద్దుబాటు చేసుకోని సరిచేసుకోవాలి.


మత్తయి సువార్త 12:36-37
నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

3.నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపకము వీటన్నిటినిబట్టి తీర్పునొందుదువు, వాటిని దిద్దుబాటు చేసుకోని సరిచేసుకోవాలి.

ప్రసంగి 11:9
యవ్వనుడా, నీ ¸యవ్వనమందు సంతోషపడుము, నీ ¸యవ్వనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;

4.మనం చేసిన పనులు దేవుడు తన గ్రంధములో లిఖిత మవుతాయి,వాటిని బట్టి తీర్పునొందుదువు, వాటిని దిద్దుబాటు చేసుకోని సరిచేసుకోవాలి.


దానియేలు 7:10అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.

అంత్యదినములలో మనకు దిద్దు బాటు అవసరం సరిచేసుకొనుట అవసరం అట్టి కృప యేసయ్య అందరికిని అందించును గాక..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్