ఆగష్టు Messages 2018


5Aug2018
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
PASTOR M. ఆనందవరం గారు
Response reading కీర్తనల గ్రంథము 111
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 33,325,455,386

యోహాను 15:12-15
 నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. యోహాను 15:14

1.
మూర్ఖుల సహవాసము చేయకుము
సామెతలు 13:20
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును

2. 
కోపచిత్తునితోక్రోధముగలవానితో స్నేహము చేయకుము.
సామెతలు 22:24
కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము 
 

3. దుష్టసాంగత్యము చేయకుము.
1
కోరింథీయులకు 15:33
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును

4. 
లోకస్నేహము చేయకుము.
యాకోబు 4:4
వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును

1.
జ్ఞానుల స్నేహము చేయుము
2. 
దేవునితో సహవాసము చేయుము
యాకోబు 2:23
కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను

దావీదుయోనాతాను ప్రాణస్నేహితునిగా భావించుకొనెను 
1సమూయేలు 18:1
దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 
 

దేవునితో సహవాసము  కలిగి జీవించుటకు మన అందరికిని అట్టి కృప యేసయ్య అందించును గాక.........

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

******************************************************************************

12AUG2018
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
PASTOR M. ఆనందవరం గారు
Response కీర్తనల గ్రంథము 88
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1,307,573,616

దానియేలు 6:10
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

బెల్తెషాజరను దేవతపేరును పొందిన దానియేలు

దానియేలు 4:8
కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను,కావున నేనతనికి నా కలను చెప్పితిని.

దానియేలు జీవిత చరిత్ర ద్వారా అనేక సత్యాలు

1.రాజవంశపు వాడు 

2.సుందరుడు 

3.సకల విద్య ప్రావీణ్యత గలవాడు 

4.జ్ఞానం గలవాడు 

5.తత్వ జ్ఞానం గలవాడు 

దానియేలు 1:3-4
రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,
తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

దానియేలు జీవితం ద్వారా మనము నేర్చుకోవాలిసినవి

1.దానియేలు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడు 

దానియేలు 1:8
రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా

*** మనము కూడా దేవునిలో పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి*** 

2.దానియేలు అపాయములో దేవుని వేడుకొనమని స్నేహితులను హెచ్చరించువాడు 

దానియేలు 2:18
తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.

*** మనము అపాయములలో మనకోసం ఇతరుల కోసం దేవుని వేడుకొనే వారీగా ఉండాలి

3.దానియేలు ఎల్లపుడు దేవుని స్తుతించువాడు 

దానియేలు 2:20
ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.

**మనము ఎల్లపుడు దేవుని స్తుతించువారిగా దేవుని మహిమపరచువారిగా  ఉండాలి. 

4.దానియేలు దేవుని ఎదుట తగ్గింపు స్వభావం గలవాడు. 

దానియేలు 2:30
ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను.

***మనము దేవుని ఎదుట తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. 

5.దానియేలు గొప్ప ప్రార్ధనాపరుడు.

దానియేలు 6:10
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

***మనము ఎల్లపుడు దేవునికి ప్రార్దించువారిగా ఉండాలి.

దానియేలు వలె దేవునిలో ప్రార్ధన జీవితం కలిగి దేవుని ఎల్లపుడు స్తుతిస్తూ గొప్ప భక్తి కలిగి ఉండేలాగున దేవుని కృప  మన అందరికి కలుగును  గాక.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*******************************************************************************8

19AUG2018
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
INDIAN EVERY HOME CRUSADE
Response
కీర్తనల గ్రంథము 132
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 8,135,583,614
Topic: నశించుపోతున్న ఆత్మల పట్ల మన భారం ఎంత ?

యోనా అధ్యాయం 1:1-10
1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
2 ​
నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.



***నశించుపోతున్న ఆత్మలకొరకు మూడు విషయాలు మనం నేర్చుకోవలసినవారమై ఉన్నాము***

1.నశించుపోతున్న ఆత్మల కొరకు సువార్తను ప్రకటించాలి 

2.నశించుపోతున్న ఆత్మల కొరకు సువార్తను చేసే వారిని ప్రోత్సహించాలి 

3.నశించుపొత్తున ఆత్మల సువార్తను కొరకు ప్రార్ధించాలి

1.నశించుపోతున్న ఆత్మల కొరకు సువార్తను ప్రకటించాలి 

యోనా అధ్యాయం 1:6-10
6 ​అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను. 

మార్కు సువార్త  16:15
15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

యోనా వలే కాకుండా దేవుని చిత్తమును ఎరిగి దేవుని సువార్తను ప్రకటించు వారీగా ఉండాలి

2.నశించుపోతున్న ఆత్మల కొరకు సువార్తను చేసే వారిని ప్రోత్సహించాలి 

సువార్త చేయువారిని ప్రోత్సహిస్తే దేవుడు ఘనురాలైన ఆశీర్వదించినట్లుగా మనలను కూడా ఆశీర్వదిస్తాడు.

రాజులు రెండవ గ్రంథము 4:8
8 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.

1 యోహాను 4:1
1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

రాజులు రెండవ గ్రంథము 8:1-2
1 ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచియెహోవా క్షామకాలము రప్పింప బోవు చున్నాడు; ఏడు సంవత్సరములు దేశ ములో క్షామము కలుగునని చెప్పినీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా 

మత్తయి సువార్త 10:41-42
41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
42
మరియు శిష్యుడని యెవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

దేవుడు ఇచ్చిన అవకాశములు వినియోగించుకొని దేవునికి మహిమ కలుగునట్లు జీవించాలి.
3.నశించుపోతున్న ఆత్మల సువార్త కొరకు ప్రార్ధించాలి.

అబ్రాహాము భారభరితమైన ప్రార్ధన లోతును రక్షించినట్లుగా
మన ప్రార్ధన ఆత్మల రక్షణ కొరకు దేవునికి జ్ఞాపకము రావాలి.

ఆదికాండము 18:32-33
32 అతడు ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.
33
యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

ఆదికాండము 19:16-17
29 దేవుడు మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

దానియేలు దుఃఖ ప్రాప్తుడనై దేవుని సన్నిధిని నిలువబడి ప్రార్థించుట

దానియేలు  9:6-7,18
18 నీ గొప్ప కనికరములనుబట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములనుబట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము; నీ కన్నులు తెరచి, నీ పేరుపెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము.

దానియేలు 10:2
2 దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.

నలుగురు కొందరు అనగా సంఘం పక్షవాయువుగల ఒక మనుష్యుని నశించుపోతున్న ఆత్మ కొరకు ప్రేమభారంవిశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలి




మార్కు సువార్త 2:3-5
3 కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
4
చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.
5
యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.

నశించుపోతున్న ఆత్మ కొరకు ప్రేమ,భారం,విశ్వాసం,నిరీక్షణ కలిగి ఉండాలని ఆశిస్తూ.
ఆత్మల పట్ల మన భారం కలిగి ఉండేలాగున దేవుని కృప మన అందరికి
కలుగును  గాక. 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

************************************************************************************26AUG2018
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
PASTOR M. ఆనందవరం గారు
Response కీర్తనల గ్రంథము
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

యోహాను సువార్త  5:1-9
1 అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.
2
యెరూషలేములో గొఱ్ఱల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.
3
యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,
4
గనుక మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.
5
అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
6
యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా
7
రోగి అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.
8
యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
9
వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

1.యెరూషలేము  పట్టణము  

2 గొఱ్ఱల ద్వారం 

3.బేతెస్ద కోనేరు 

4.ఐదు మండపములు

5.రోగులు గుంపులుగా ఉండుట 

6.పక్షవాతం గలవాడు ఏండ్లనుండి ఉండుట

7.యేసయ్య వానిని బాగుచేయుట 

ఆధ్యాత్మికంగా:-
 
1.యెరూషలేము పరలోక పట్టణమునకు సూచన

2. గొఱ్ఱల ద్వారం రక్షణ మార్గముకి సూచన

3.బేతెస్ద కోనేరు సంఘముకి సూచన

4.నీరు మారుమనసుతో కూడిన  బాప్తీస్మం  పరిశుద్ధాత్మకు సూచన

4.మంటపములు దేవుని మందిరమునకు సూచన

5.రోగులు అనగా పాపులకి సాదృషయం

కోనేరు దగ్గరకు ఎందుకు వెళ్లారు

రోగులు స్వస్థత కొరకు మూడు కారణములు.

1.విశ్వాసము 

2.నిరీక్షణ 

3.నేను ముందు దిగాలి స్వస్థత పొందాలి అని ఆశ 

దేవుని కృప  మన అందరికి కలుగును  గాక 
 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్