సెప్టెంబర్ 2018 Msgs



02SEP2018
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
PASTOR M. ఆనందవరం గారు
Response reading కీర్తనల గ్రంథము 81
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 6,396,578,610

TOPIC: గోధుమగింజ ప్రాముఖ్యత ,మనకు గోధుమగింజకి ఉన్న సంబంధము .

మత్తయి సువార్త 13:24-30
24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.
25 మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. 

1.గోధుమగింజ యేసు ప్రభు వారికీ సాదృశ్యం

2.గోధుమగింజ వాక్యానికి సాదృశ్యం

3.గోధుమగింజ విశ్వాసికి సాదృశ్యం

1.గోధుమగింజ యేసుప్రభువారికీ సాదృశ్యంగా  ఉన్నది
యోహాను సువార్త 6:51
పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.
పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారముతో గోధుమను యేసుప్రభువారికీ సాదృశ్యంగా పోల్చుకున్నారు. 

పాతనిభంధన గ్రంధములో కనాను దేశములో గోధుమ శ్రేష్టమైనది అని వ్రాయబడినది. 

గోధుమ శక్తి వంతమైనది గోధుమలో 9రకాల విటమిన్లను కలిగి ఉన్నదీ
ఆహారములో గోధుమకి ప్రాముఖ్యత కలిగి ఉన్నదీ.

2.గోధుమగింజ దేవుని వాక్యానికి సాదృశ్యంగా  ఉన్నది  

**గోధుమలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ఆలాగానే,
**దేవుని వాక్యమనే గోధుమలో అనేక ప్రయోజనాలు ఉన్నాయ్. 

దేవునివాక్యంలో 4 స్థలములలో పడిన గోధుమగింజ విత్తనములను చూపిస్తున్నారు 

1.మొదటిగా త్రోవ పక్కన పడిన విత్తనములు
మత్తయి సువార్త 13:4
వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను.
**అడ్రస్ లేని స్థలము నకు సూచనగా  ఉన్నదీ
మనలో కూడా త్రోవ పక్కన పడిన విత్తనము వలే దేవునిలో ఫలింపులేని జీవితమునకు సూచనగా ఉన్నదేమో మనలను పరీక్షించుకోవలసిన అవసరం ఉన్నది.

2.రాతి నేలను పడిన విత్తనము
మత్తయి సువార్త 13:5
5 కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 
**మనలో కూడా రాతినేల వంటి హృదయము కలిగి దేవునిలో ఫలించలేక పోవుచున్న మెమో మన స్వభావమును దేవునిలోనికి ఎదగటానికి మార్చుకోవాలి.

3.ముండ్ల పొదలో పడిన విత్తనము
 
మత్తయి సువార్త 13:7
కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి
**సమస్యలు, భాదలు  అనే ముల్లు వలన  వాక్యములో ఫలింపని స్థితిలో నుండి దేవునిలో ఎదగటానికి వాక్యమును ధ్యానించాలి 

4.మంచి నేలను పడిన విత్తనము
మత్తయి సువార్త 13:8
కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.
**మంచి నేలను పడిన విత్తనంకు యజమానుడు సమస్తము సమకూరుస్తాడు కావున ఆ విత్తనం బహుగా ఫలిస్తుంది.
**మనము కూడా మన యజమాని ఐన దేవుని సంఘములో ఉంటె మనలను యేసయ్య బహుగ  ఫలింప జేస్తాడు.

3.గోధుమగింజ విత్తనము విశ్వాసికి సాదృశ్యముగా  ఉన్నది 

హెబ్రీయులకు అధ్యాయం 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

ప్రకటన గ్రంథము 22:10-12
12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
సామెతలు అధ్యాయం 27:22
మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదలిపోదు.

గురుగులు, భక్తి లేని వారికీ మూఢునికీ సాదృశ్యముగా  ఉన్నది 
సాతాను మనలను పాడుజేయటానికి గురుగులును కలుగజేస్తాడు.

**కావున మన భక్తి జీవితాన్ని కాపాడుకొని దేవుని యందు విశ్వాసముతో ఎదిగితే
కోతకాలమున గోధుమ గింజలు వలే మనము దేవుని రాజ్యములో ఉంటాము
లేకపోతె గురుగులు వలే అగ్నిలో వేయబడతాము 

దేవుని బిడ్డలుగా ఏమిచేయాలి ,గోధుమగింజ ఏమి చేయబడుతుంది ?

***మొదటిగా విత్తబడలి , రెండవదిగా ఫలించాలి ,మూడవది కోయబడుతుంది

1.మన విశ్వాసమును భట్టి మూడు రకాలుగా ఫలింపు కలిగిఉంటాము
 
***మొదటిగా దుళ్లగొట్ట బడాలీ,  

***రెండవదిగా తూర్పారబట్ట బడాలి,  

***మూడవది రోకలిలో దంచబడాలి.

**మనము దేవునికి ఇష్టమైన పాత్రగా దుళ్లగొట్టబడాలీ

**పాపము నుండి తూర్పారబట్టబడాలి 

**వాక్యము ద్వారా దంచబడాలి హెచ్చరించబడాలి 

**దేవునికి ఇష్టముగా జీవించాలి, మంచి నేల అనే సంఘములో దేవుని వాక్యము ద్వారా దేవునికి ఇష్టమైన గోధుమగింజగా మార్చబడాలి.

అట్టి కృప యేసయ్య అందరికిని అందించును గాక..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*************************************************************

09Sep2018
ఆదివారం ఆరాధన  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు  
PASTOR M. ఆనందవరం గారు
కీర్తనల గ్రంథము 39
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1,474,578,616
TOPIC: అగ్ని 
లూకా సువార్త 3:15-17
17 ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.

ఐదు స్థలంలలో అగ్ని ప్రాముఖ్యత కలిగిఉన్నదీ
1.మొదటిది భూమి లోపల అగ్ని ఉన్నదీ
2.భూమి మీద అగ్ని ఉన్నది
3.ఆకాశము నుండి కుమ్మరింపబడే అగ్ని
4.తదుపరి తీర్పు తరువాత మన కంటికి కనపడని నరకములో అగ్ని
5.మన శరీరము వేడిగ ఉంచుటకు అగ్ని ప్రాముఖ్యత ఉంది 

1.అగ్ని ద్వారా వచ్చే వెలుగు దారి చూపించేదిగా ఉన్నదీ 

ఇశ్రాయేల ప్రజలుకి ఎర్ర సముద్రము  పాయలుగా  ఐన తరువాత
పగలు  మేగస్తంభం  రాత్రి  అగ్నిస్తంభం  అక్కడ అగ్ని దారి చూపించేదిగా ఉన్నదీ
ఆధ్యాత్మికంగా మన జీవితంలో అగ్ని దేవునికి సాదృశయంగా ఉంది
అయన  మనకు  అగ్నిస్తంభముగా  మన జీవితాలకు దారి చూపిస్తున్నారు
మన జీవితాలకు మార్గము చూపించగలిన దేవుడు మన యేసయ్య.

2.అగ్ని కరగదీస్తుంది. 
అగ్నిఎంతటి బలమైన దానినైనా కరగదీస్తుంది.
అగ్ని దేవునిలో మనము కూడా కరిగి పోవాలి. మనలో రాతి హృదయం పొయి మాంసపు హృదయం కలిగి  దేవునికి లోబడి ఉండాలి.

3.అగ్ని వంగదీస్తుంది .
అగ్ని ఇనుమును వంగదీస్తుంది, ఇది  దేనికి  సాదృశ్యం అని చుస్తే క్రీస్తులోకి  రాగానే  మనము ఎంతటివారమైన  దేవునిలో తగ్గింపు కలిగి ఉండాలి 
మన ప్రభువులో వంగిపోవాలి., అటువంటి స్వభావము కలిగి ఉండాలి.

4.అగ్ని మష్టును తొలగించి శుద్ధిచేస్తుంది .
యెహెజ్కేలు 22:18
18 నరపుత్రుడా, ఇశ్రాయేలీ యులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి. 
పాపము అనే మష్టును శుద్ధిచేసుకోవాలి.
 బంగారము వెండికి ఉన్న మురికిని అగ్ని శుద్ధిచేస్తుంది
అగ్ని వంటి మన యేసుప్రభువారు కూడా పాపమూ అనే మష్టును యేసు అనే అగ్ని ద్వారా కడిగి వేసి మనకు విలువైన జీవితాన్ని ఇస్తారు. 

5.అగ్ని సారము కలుగజేస్తుంది 
మత్తయి సువార్త 5:13 మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
*మనము ఉప్పయి ఉన్నాము, సూర్యుని వేడి వలన సముద్రపు నీరు ఉప్పుగా మారుతుంది. అగ్ని వలన ఉప్పుకి సారము కలుగుతుంది 
**మనము దేవుని  అగ్ని ద్వారా సారవంతము చేయబడి దేవునిలో ఆశీర్వదింపబడాలి,
దేవునిలో మన ఫలింపు  అందరికి ఉపయోగ పడాలి.

6.అగ్ని మనం బ్రతకడానికి సహకరిస్తుంది 
అగ్నివంటి దేవుని మాటలుతో యేసు మనలను ఆదరిస్తారు మనం బ్రతకడానికి సహకరిస్తారుయేసులో సమర్పణ కలిగి ఉండాలి.

 7. దహించు అగ్ని దేవుడు
హెబ్రీయులకు 12:29
29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియై యున్నాడు.
దహించే రోజున మనము అగ్నిలో పడిపోకుండా మన దేవాది దేవునిలో నిత్యమూ ఉండాలి. అగ్ని వంటి యేసయ్యలో మనము కరిగి పోవాలి ,కఠినమైన హృదయం కరిగిపోవాలి వంగి పోవాలి అగ్ని వంటి యేసయ్యలో. మష్టు అనే పాపమూ పోవాలి 
శుద్ధి చేయబడాలి, సారము కలిగి క్రీస్తు కొరకు ఫలించాలి

అట్టి కృప యేసయ్య అందరికిని అందించును గాక..
**మన ప్రభువు ఈ మాటలను దీవించును గాక ఆమెన్...
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


************************************************************

16Sep2018ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message by దైవసేవకులు
బైబిల్ సొసైటీ సండే Rev డేనియల్ చక్రవర్తి గారు 
కీర్తనల గ్రంథము 19,
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 16,302,578,614
మత్తయి సువార్త 9:37-38
37 ​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
38 గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

దేవునికి ఎలాంటి పనివారు కావాలి 

దేవునికి అందుబాటులో ఉండి ఉన్నపాటున సమర్పించుకొని వారు కావాలి.

గలతీయులకు 6:10
9 మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
10 కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేష ముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.

1.కంఫర్ట్ జోన్ విడిచి బయలుదేరి వాక్యపరిచర్య చేయు వారు కావాలి.

మార్కు సువార్త 16:20
20 వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన2 సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్‌

2.వ్యతిరేక పరిస్థితిలో సువార్త పరిచర్య చేయు వారు కావాలి.

అపొస్తలుల కార్యములు 5:28-29
28 ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.


3.మనము దేవుని ఉనికి కలిగి వాక్యపు వెలుగులో జీవించాలి.

యిర్మీయా 9:20-21
20 స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తె లకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
21 వీధులలో పసిపిల్లలు లేకుండను, రాజ మార్గములలో ¸°వనులు లేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.

**ఆత్మలో మరణము లేకుండా దేవుని వాక్యపు వెలుగులో జీవించాలి.


4. దేవుడు మనకు ఇచ్చిన రక్షణ కలిగి కొనసాగించి జీవించాలి.

అయన మనకు ఇచ్చిన రక్షణ దేవుని మనలో కలిగి ఉండుటకు నిదర్శనం.

2సమూయేలు 5:24
24 కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెల విచ్చెను.

కీర్తనల గ్రంథము 84:6
6 వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును.

ప్రకటన గ్రంథము 2:2-4
4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.

**లోయ  మరణము నకు సూచనగ ఉన్నది దేవుడు అటువంటి పరిస్థితి నుండి అయన రక్షణ అనే దీవెనలను మనకు ఇస్తున్నాడు

**దేవుడు ఇచ్చిన మొదటి రక్షణను కొనసాగించాలి 

5. మన క్రియలలో దేవుని మనం కలిగి జీవించాలి.

 ప్రకటన గ్రంథము 22:10-12.
12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

**దేవుడు మనలను రక్షించుటయే గొప్ప భాగ్యం అట్టి దేవుని కృపను గొప్ప సాక్ష్యమును కలిగి జీవించాలి.

అట్టి కృప దేవుడు మన అందరికి అందించును గాక  ఆమెన్ 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*********************************************************

23Sep2018ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ By దైవ సేవకులు 
పాస్టర్ M.ఆనందవరంగారు

1రాజులు 18:36-39.,38 అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను.
39 అంతట జనులందరును దాని చూచి సాగిలపడియెహోవాయే దేవుడు,యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.

 మానవుని జీవితంలోమూడు విషయాలులో అగ్ని కలిగి ఉన్నది. 

1.మానవునిలో ఉన్న అగ్ని  
**మానవుని హృదయంలో ఉన్న అగ్ని.
**ఒక మనుష్యుని నాలుక అగ్ని లాంటిది.
**దేవుని బిడ్డల హృదయంలో అగ్ని పుట్టాలి.
**బైబిల్లో చుస్తే ఏలీయా హృదయంలో అగ్నిపుట్టింది. 

ఎందుకు అగ్ని పుట్టింది?

1రాజులు 18:21
21 ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.

దేవుని ప్రజలు దేవుని ఎరుగక నశించి పోవుచున్నారు
దేవునికి చెందవలిసిన స్తుతులు ఇతర దేవతలకు చెందుతుంటే ఏలీయా హృదయంలో అగ్నిపుట్టింది.

ఈ లోకంలో కూడా సంఘంలో సజీవుడైన దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు
ఆయనలో పుట్టిన అగ్ని దేవుని బిడ్డల హృదయంలో కూడా పుట్టాలి.

2.దేవునికి మానవునికి మధ్య ఉన్న అగ్ని

లేవీయకాండము 6:13
13 బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.

బలి పీఠము మీద ఉండే అగ్ని, దేవుని సన్నిధిలో ఉండే అగ్ని. 

దేవుని సన్నిధిలో అగ్ని ఎందుకు ఉన్నది దానికి కారణం ఏమిటి ?

**ఎందుకంటే ఐదు రకాల అర్పణలు
   దహనబలి, సమాధానబలి, సమాధానఅర్పణబలి
   పాపపరిహార్దబలి, నైవైద్యము.

**బలి పీఠము మీద ఉండే అగ్నిమనుష్యునికి దేవునికి 
సంబంధమునకు సూచనగా ఉన్నది.

**బలి పీఠము మీద ఉండే అగ్నిమనుష్యునికి దేవునికి సహవాసంనకు 
సూచనగా ఉన్నది.

**దేవునికి మానవునికి మధ్య అగ్ని పాపక్షమాపణ కలిగించేది.
అటువంటి పాపక్షమాపణ మనం కలిగి ఉండాలి.

3.దేవుని నుండి వచ్చు అగ్ని 

దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు

కీర్తనల గ్రంథము 39:3
3 నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని

యిర్మీయా అధ్యాయం 5:14
14 కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

1కొరింథీయులకు 3:13
13 వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును.

**అగ్ని వంటి దేవుని కలిగి ఉన్న మనము దేవుని బిడ్డలుగు మన హృదయములో అగ్నిని కలిగి ఉండాలి

**అటువంటి అగ్నిని ఆర్పుటకు ఉపయోగించు నీరు దేవుని ప్రేమకు సూచనగా ఉన్నది. ఆ నీరు మన యేసు ప్రభు వారికీ సాదృషయంగా ఉన్నది.
 
యేసు ప్రభు వారు మన పట్ల చూపించే ప్రేమ, పాపక్షమాపణ కలిగి దేవుని బిడ్డలగా హృదయంలో అగ్ని మనము కలిగి ఉండాలని అట్టి కృప దేవుడు మన అందరికి అందించును గాక. 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*******************************************************

30Sep2018ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ By దైవ సేవకులు 
పాస్టర్ M.ఆనందవరం గారు
Topic: నీరు 
2రాజులు 2:18-2221 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

1.నీరు మంచిది,  నీరు ప్రమాదకరమైనది 
1. మంచి నీరు  - దేవుని ప్రజలకు సాదృశ్యం
2. సముద్రపు నీరు - అన్య జనులకు సాదృశ్యం
3. బురద నీరు - పాపపు జీవితానికి,హృదయానికి సాదృశ్యం 

2.బైబిల్ గ్రంధములో నీటి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు

*యొర్దాను నదిలో యేసు ప్రభువారు బాప్తీస్మం తీసుకున్నారు.
*నయీమోను యొర్దాను  నదిలో మునిగి కుష్ఠు రోగము నుండి స్వస్థత పొందాడు.
*గుడ్డివాడు నీటి ద్వారా తిరిగి చూపును  పొందగలిగాడు.
*తన బిడ్డలైన వారి కి బాప్తీస్మం పొందుటకు సహాయపడుతుంది.
*కనాను ఊరిలో నీటిని మధురమైన ద్రాక్షారసంగా  మార్చిని యేసు ప్రభువారి గూర్చి వ్రాయ బడినది.

వాక్య పఠనము నుండి 2రాజులు 2:19-20
19 అంతట ఆ పట్టణపువారుఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా
20 అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా
యెరికో పట్టణము 
1. విశాలమైన పట్టణం
2. విలువైన మెడలు మిద్దెలు కలిగిన పట్టణం
3. రమ్యమైనది 

అటువంటి యెరికో పట్టణం మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నది
ఆలాగుననే మనుష్యులు చూడటానికి అందముగా జ్ఞానం కలిగి ఉన్నారు
కానీ లోపల పగా ద్వేషం వంటి చెడును కలిగి ఉంటున్నారు 
1. నీరు హృదయానికి సాదృశ్యం
2. కొత్తపాత్ర, కొత్త నిబంధనకు సూచనగా ఉన్నది
3. ఉప్పు యేసు ప్రభువారికి సూచనగా ఉన్నది 
అన్యజనుల నుండి మనం వేరు చేయబడి ఉప్పు వలే మార్చబడాలి మన ప్రభువును కలిగి జీవించాలి, మన కుటుంబాన్ని బాగుచేసుకోవాలి. 
3. మందిరంలో నీరు ఉన్నది అని బైబిల్లో వ్రాయబడినది 
కీర్తనల గ్రంథము65:9నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు.
దేవుని మందిరం అనే నీటిలో మనం నాటబడాలి
దేవుని మందిరంలో నిత్యమూ గడపగలగాలి 
అప్పుడు మనకు పరిశుద్దాత్మ అనే నీరు అందివ్వబడుతుంది 
యోహాను సువార్త 7:37-3937 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
39 తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
అటువంటి నీటి ద్వారా మనం సుద్ధిచేయబడి ఉప్పు అనే యేసు ప్రభువారిని కలిగి జీవించాలి.

పరిశుద్దాత్మ అనే నీరు మన ప్రభువును కలిగి జీవించాలి, మన కుటుంబాన్ని బాగుచేసుకోవాలి. అట్టి కృప దేవుడు మన అందరికి అందించును గాక. 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్