1-10శ్రమదినములు2018

 LENT DAY 1
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
14/02/2018 Baptist Church Akkayyapalem
భస్మ బుధవారం
Topic : భస్మము ( బూడిద )

సంఖ్యాకాండము 19:9,10
 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి.
 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును. ఇది ఇాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.
తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిోని సమస్త మైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యుల మీదను, ఎముకనే గాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను. సంఖ్యాకాండము 19:18

1. బూడిద లోబడుటకు నిదర్శనం
నీనెవె పట్టణపువాు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.  యోనా 3:5,6

2. బూడిద తనను తాను అసహ్యించు కొనుటకు నిదర్శనం
 కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.యోబు 42:6

3. బూడిద దుఃక్కించుటకు నిదర్శనం
నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.  యిర్మియా 6:26

4. బూడిద అవమానానికి నిదర్శనం
అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యే్చుచు పోగా  2సమూయేలు 13:19

5. బూడిద తగ్గింపునకు నిదర్శనం
అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఆదికాండము 18:27

ఆత్మీయంగా  శారీరకంగా దేవుని బలపరిచే అర్హత కొరకు ప్రయత్నించుదాం
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
 
***********************************************************
  LENT DAY 2
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
15/02/2018 Baptist Church Akkayyapalem
ThursdayTopic : శోధన

Today Verses: మత్తయ్య 4:1-7
7 అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని ితో చెప్పెను.

1 సాతాను పురిగొల్పే శోధన జయించు వారీగా ఉండాలి
దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెా? అని అడి గెను. (ఆదికాండము 3:1)

ఆ వృక్షము ఆహారమునకు మంచి దియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను.(ఆదికాండము 3:6)

2. సాతాను శోధన ని ఎదురించు వారీగా ఉండాలి
కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు 4:7)

కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో  అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు.(యిర్మియా 35:8)

3.దేవుడు అనుమతించే శోధన సహించు వారీగా ఉండాలి
శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు ను ప్రేంచువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు 1: 12-13)

దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడునేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు.
తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.(హెబ్రీయు 2:18)

దేవుడు అనుమతించే శోధన సహించు వారీగా దేవుని బలపరిచే అర్హత కొరకు ప్రయత్నించుదాం

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

**********************************************************
  LENT DAY 3
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
16/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
శుక్రవారము Topic : గొప్ప వెలుగు

Bible reading : మత్తయి 4: 12-17
12 ​యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
13 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్న హూమునకు వచ్చి కాపురముండెను.
14 ​జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు
15 చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిి. మరణ ప్రదేశములోు మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను
16 అని ప్రవక్తయైన యెషయాద్వారా పలుకబడినది నెరవేరు నట్లు (ఈలాగు జరిగెను.)
17 అప్పటిుంి యేుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
1. ఆద్యాత్మిక మైన చీకటి - "వెలుగును ద్వేషించే వారికీ నిదర్శనం"
13 వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.
14 తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును.
15 వ్యభిచారిఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును. (యోబు గ్రంథమ 24:13,14,15)
2.ఆధ్యాత్మిక మైన చీకటి  - "వెలుగును చీకటి అనుకోను వారికీ నిదర్శనం"
కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ. 
(యేషయా 5:20)
3.ఆధ్యాత్మిక మైన వెలుగు - "ప్రకాశించు వారికీ నిదర్శనం"   
16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి. (మత్తయి 5-16)
4. ఆధ్యాత్మిక మైన వెలుగు -  "తేజరిల్లుటకీ నిదర్శనం"  
18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, (సామెతలు  4:18)
5. ఆధ్యాత్మిక మైన వెలుగు - "జ్యోతుల వలె పోలిఉండుటకు నిదర్శనం"
14 మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు,
15 సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడు చున్నారు. (ఫిలిప్ 2:14-16)
6.ఆధ్యాత్మిక మైన వెలుగు - "గొప్ప వెలుగును పోలిఉండుటకు  నిదర్శనం"
ఆరు దినములైన తరువాత యేసు పేతురును... యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.  
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.  (మత్తయి17;1-2)

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

 ***********************************************************
LENT DAY 4
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
17/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
SaturdayTopic : పరలోక రాజ్యం
bible Reading: మత్తయి 4: 12-17
17 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
1.పరలోక రాజ్యం  "ఆవగింజ"ను పోలిఉండుటకు సాదృశ్యం
ఒక మనుష్యుడు తీసికొని పోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను.
20 మరల ఆయనదేవుని రాజ్య మును దేనితో పోల్తును? (లూకా 13: 19-20)
2. పరలోకరాజ్యము  పుల్లని పిండికి సాదృశ్యం
 
ఒక స్త్రీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను
3.పరలోక రాజ్యం పెండ్లి విందుచేసిన "రాజుకు"  సాదృశ్యం (లూకా 13:21)
యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. (మత్తయి 22:1-3)
2 పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.
3 ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.
4.పరలోకరాజ్యము పది మంది "కన్యకలకు" సాదృశ్యం
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది.
(మత్తయి7 25: 1-10)
5.పరలోకరాజ్యము "తలాంతులకు"  సాదృశ్యం
తరువాత అతడు దాదాపు తొమి్మది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచిఒ మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి. (మత్తయి 20:3)
6. పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానికి సాదృశ్యం.
1.ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి 
2 దినమునకు ఒక దేనారము2 చొప ్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను. (మత్తయి20:1-4)
7.పరలోకరాజ్యము "పసి బిడ్డల వలే ఉండు వారికీ"  సాదృశ్యం 
ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
2 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను
3 మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
4 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు.
(మత్తయి 18:1-4)

***********************************************************
LENT DAY 5
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
19/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic : దేవుని యొక్క పిలుపు

Bible Reading:  మత్తయి 4:18-22 

19 ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
20 వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
21 ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
22 వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబ డించిరి.

1.దేవుడు స్వతంత్రులుగా ఉండుటకు పిలుచుచున్నాడు
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. (గలతీయులకు 5:13)

2.దేవుడు మన పాపము బట్టి పిలుచుచున్నాడు
అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 8:34)

3.దేవుడు విశ్రాంతి కలుగజేయుటకు పిలుచుచున్నాడు
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. (మత్తయి 11:28)

4.దేవుడు సమాధానపరచుటకు   పిలుచుచున్నాడు
క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. (కొలొస్సయుల 3:15)

5.దేవుడు నిరీక్షణ కలుగటకు పిలుచు చున్నాడు
దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడ
(యాకోబు 4:8)

6.దేవుడు క్రీస్తువారుగా ఉండుటకు పిలుచు చున్నాడు 
మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు. (రోమా 1:7)

అట్టి కృప మన అందరికి దేవుడు అందించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***********************************************************

 LENT DAY 6
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
20/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today topic :విడిచి పెట్టుట
bible reading: మత్తయి 4:18-22
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను.
వంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబ డించిరి

1.దేవుని కొరకు ఇహలోక బంధాలూ సైతం  విడిచిపెట్టు వారీగా ఉండాలి
పేతురు ఇదిగోమేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.
29 అందుకు యేసు ఇట్లనెనునా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలి దండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
30 ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.(మార్కు10:28-30)

2.దేవుని కొరకు ప్రాచీన స్వభావము విడిచిపెట్టు వారీగా ఉండాలి
31మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
23 మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
25మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను(ఎఫెసీయులకు  4:31, 22,23,25)

3.దేవుని కొరకు అవిశ్వాసం విడిచిపెట్టు వారీగా ఉండాలి
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
(ప్రకటన 21:8)

4.దేవుని కొరకు సమస్త కల్మషమును విడిచిపెట్టు వారీగా ఉండాలి
అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.(యాకోబు 1:21)
 
ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. (కొలొస్సయులకు 3:8)

అట్టి కృప మన అందరికి దేవుడు అందించును గాక

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
 
*********************************************************
 LENT DAY 7
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు

by పాస్టర్ ఆనందవరం గారు
21/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today Topic : ధన్యతలు
Today bible reading మత్తయి 5:1-12 

1 ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిరి.
2 అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
3 ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
4 దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
5 సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
6 నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.
7 కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
8 హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
9 సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
10 నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
12 సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి

 ******************************************************

 LENT DAY 8
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
22/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today Topic : ఉప్పు 

bible reading మత్తయి 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.

ఉప్పు యొక్క గుణాలు:-
1.ఉప్పు రుచి గల పదార్ధం
2.ఉప్పు వేరే వస్తువులు పాడవకుండా చేయుట
3.ఉప్పు మన శరీరానికి శక్తి నిచ్చే గుణం గలది
 
1.ఉప్పు దేవునికి ఇచ్చే అర్పణములకు సాదృశ్యం
13 నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను. లేవీయకాండము 2:13
2.ఉప్పు దేవునికి ఇచ్చే పరిమళ దూప ద్రవ్యములకు సాదృశ్యం
34 మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని  నిర్గమకాండము 30:34
3.ఉప్పు దేవునికి ఇచ్చే దహనబలికు సాదృశ్యం
యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింప వలెను. యెహెజ్కేలు 43:24
4. ఉప్పు రుచిగల సంభాషణకు సాదృశ్యం
 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. కొలొస్సయులకు 4:6
5. ఉప్పు పరిశుద్ధత యదార్థతకు సాదృశ్యం
ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.
ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. మార్కు 9:49-50
6. ఉప్పు  పాపానికి  సాదృశ్యం
అంతట ఆ పట్టణపువారుఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా యేలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై యున్నదని ఎలీషాతో అనగా 2రాజులు 2:19
ఆదికాండము 19:26
అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్థంభమాయెను.
యెహెజ్కేలు 47:11
అయితే ఆ సముద్రపు బురద స్థలము లును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.
అట్టి కృప మన అందరికి దేవుడు అందించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
 
*******************************************************
 LENT DAY 9

సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
23/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today Topic : దేవుని మాటలు   

 Bible Reading : మత్తయి 7:24-29
 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.   
           
పరిశుద్ధ గ్రంధములో దేవుని మాటలు:-  

1.దేవుని యొక్క మాటలు నెరవేర్చుటకే
 మత్తయి 5:17-21,23,24,27 5:33-35, 38,43
17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.  

25 అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; మత్తయి 6:25

మత్తయి 7:1,13,15,19
1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 

2.దేవుని మాటలు మంచి నేలను పడ్డ విత్తన ములు  వంటివి వాటిని వినవలిసిన వారమై ఉన్నాము

 కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. 9 చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. 
మత్తయి13:4-9

3.దేవుని మాటలు విలువైనవి వాటిని అనుసరించ వలిసిన వారమై ఉన్నాము 

అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి కీర్తనలు 119:95

1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి  యెషయా 48:1

4.దేవుని మాటలు అగ్నికి(వెలుగుకు )నిదర్శనం వాటిని అనుసరించవలిసిన
వారమై ఉన్నాము 
యిర్మీయా 23:29
నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా? 

5.దేవుని మాటలు దీవెనలకి , ఆశీర్వాదానికి నిదర్శనం వాటిని అనుసరించ వలిసిన వారమై ఉన్నాము

2 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.ద్వితీయోపదేశకాండమ 28:2

చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును. ప్రకటన గ్రంథం 2:7 

అట్టి కృప మన అందరికి దేవుడు అందించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

************************************************************
  LENT DAY 10
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ బెంజిమెన్ గారు
24/02/2018 Baptist Church Akkayyapalem
Today topic:- పేతురు యొక్క పతనం

bible readings: లూకా 22:54-62
54 వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను. 55 అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండి నప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను. 56 అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను. 57 అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను. 58 మరి కొంత సేపటికి మరియొకడు అతని చూచినీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయీ, నేను కాననెను. 59 ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడునిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. 60 అందుకు పేతురుఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. 61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురునేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసిక 62వెలుపలికిపోయి సంతాపపడి యేడ్చెను.

పేతురు ప్రత్యేకత  :
మత్తయి 10:2
ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;

మత్తయి 16:13-18
13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా 14 వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 15 అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను. 16 అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 17 అందుకు యేసుసీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు2 నీకు బయలు పరచలేదు. 18 మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

1.పేతురు పతనంలో మొదటిదశ శోధనకు సాదృశ్యంగా ఉంది
తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.ఆ చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి లూకా 22:40-41

2.పేతురు పతనంలో రెండవదశ తొందరపాటుకు  సాదృశ్యంగా ఉంది
ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను  లూకా 22:50-51

3.పేతురు పతనంలో మూడవదశ అబద్ధంకు సాదృశ్యంగా ఉంది
అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.అందుకు పేతురు అమ్మాయీ, నేనతని నెరుగననెను. లూకా 22:57-58

పేతురు యొక్క పతనానికి మూడు కారణాలు

1.దేవాది దేవునికి దూరముగా ఉండుట
వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసికొనిపోయిరి. పేతురు దూర ముగా వారి వెనుక వచ్చుచుండెను. లూకా 22:54

2.పేతురు సుఖవంతమైన జీవితానికి ఇష్టపడుట
అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండి నప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను. లూకా 22:57

3.పేతురు దేవుని దూషించు ప్రజల మధ్య కూర్చుండుట
అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచివీడును అతనితో కూడ ఉండెనని చెప్పెను.  లూకా 22:58

1.మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దగ్గరగా ఉండవలసిన వారమైఉన్నము
సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. యోహాను 6: 68-69

2.దేవుని యెడల మన విశ్వాసం సరిచూచుకొని దేవుని తో ఉండవలిసిన వారమైఉన్నము
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీయులకు 1:21

3.మన ఆధ్యాత్మిక జీవితంలో మనలను దేవునికొరకు స్థిరపరచు వారమైఉన్నము 
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
నీ నమి్మక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా లూకా 22:31-33