8November2020 Sunday

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం :కృతజ్ఞతార్పణ

 

కొరింథీయులకు 9:6-7

కొంచెముగా విత్తువాడు కొంచె ముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును. సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

ప్రియులారా ఈరోజున మనం ధ్యానించుకోబోయే అంశం కృతజ్ఞతార్పణ, దీనిని ఎన్ని రకాలుగా చేసేవారు కొన్ని విషయాలు ధ్యానించుకొందాము.

 

ప్రియులారా మానవుడు దేవుని సమీపించడానికి అర్పణ అనే ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, దీనిని మానవుడే దేవునికి ఇచ్చుట అనేది మొదలు జరిగింది కానీ దేవుడు అర్పణను కోరుకోలేదు. అర్పణ అనేది ఎన్నిరితులుగా ఉన్నదో మనము బైబిల్ గ్రంధములో మనము చూస్తాము. ఇచ్చుటకు సిద్దపడుటను అర్పణ అని అంటారు.

 

1.ఈ అర్పణలో మొదటిది ఏమిటి అని మనం గమనిస్తే బలి అర్పణ

మానవుడు దేవునితో సహవాసం చేయడానికి ఎంచుకున్న మార్గము ఈ బలి అర్పణ.  

బైబిల్ గ్రంధములో మనం చుస్తే సృష్టి ఆదిలో ఆదాము బిడ్డలైన హేబేలు, కయీను దేవునికి మొదటి అర్పణను ఇచ్చారు. కయీను తన పంటలో నుండి అర్పణ ఇస్తే, హేబేలు క్రోవ్విన గొర్రెలను వాటిని అర్పణగా ఇచ్చాడు. కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. కానీ దేవుడు అర్పణలను ఇవ్వమని దేవుడు అడగలేదు కానీ ఎందుకు వారు ఇచ్చారు అని అంటే దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాలి అని భావించి వారు సమర్పించారు. మొదటిగా అర్పించిన ఈ అర్పణ కృతజ్ఞతార్పణ.

 

అభ్రాహము యొక్క ఒక్కగాని ఒక్క కుమారుని అర్పించమని చెప్పినపుడు  అలాగున చేసినపుడు దేవుడు అబ్రహాము యొక్క హృదయాన్ని చూసాడు. ఇక్కడ దేవుడు అభ్రాహము విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు తన కుమారుని బలిగా అర్పించమని అడిగాడు. ఆ సందర్భములో తన కుమారునికి బదులుగా దేవుడు సిద్దపరచిన ఒక గొర్రెపిల్లను చూపించి తన కుమారునికి బదులుగా ఆ గొర్రెను అర్పించమన్నాడు. ఇక్కడ దేవుడు అడిగినది వెనుకాడకుండా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు

తదుపరి ఇశ్రాయేలియులు ప్రజలు దేవుని సమీపించడానికి బలులను అర్పించడం మొదలు పెట్టారు. పాత నిభందన గ్రంధములో దేవునికి ఇవ్వవలసిన అర్పణలలో దేవుడు వారికీ కొన్ని నియమాలు నిభందనలను చెప్పాడు. ఆయనకు ఏమి ఇవ్వవచ్చో, ఎలాంటివి ఇవ్వాలో, ఎలాంటివి ఇవ్వకుడదో దేవుడు చెప్పాడు.  అలాగున దేవుని సమీపించడానికి వాటిని యాజకునికి ఇచ్చినపుడు దేవునికి అర్పించి వాటి రక్తమును పరిశుద్ద స్థలములో ఆర్పించేవాడు. ఈ బలి అర్పణగా దహనబలి, పాపపరిహర్ధబలి, అపరాధపరిహర్ధబలి, సమాధానబలి, నైవేద్యం.ఈ ఐదు రకాలుగా దేవునికి బలుగుగా ఆ కాలంలో అర్పించేవారు.  

 

యేరుషలేము దేవుడు కోరుకున్న పట్టణం ఈ యేరుషలేము చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. ఒక్కక ప్రాకారానికి గుమ్మాలు ఉన్నాయి. అక్కడ గొర్రెల ద్వారం అనేది ఒకటి ఉన్నది. ఎవరైనా దేవునికి బలిగా అర్పించడానికి అక్కడ గొర్రెలను కొనుక్కొని అర్పించేవారు.  మానవుడు చేసిన పాపం, మానవుడు చేసిన అసమాదాన జీవితం ఆ అపవిత్ర జీవితాన్ని పోగొట్టుకోవడానికి ఆశిస్తూ బలులను అర్పించేవారు. ఎలాగున మొదలు పెట్టిన బలులు దేవుని యొక్క ప్రియ కుమారుని మానవుల పాపము కొరకు ఆయనను మన కొరకు అర్పణగా అర్పించేలా చేసింది. మానవులమైన మన కొరకు ఇంక ఇటువంటి బలులను ఇవ్వకుండా ఒకేఒక్క పాపపరిహారంగా ఆయనను అర్పించారు. ఆయనే యేసుప్రభువారు ఆయనను గొర్రెపిల్లగా తన శరీరరక్తములను మన కొరకు అర్పించారు.

 

2.రెండవదిగా ఇప్పుడు అర్పణగా దేవునికి మనం ఏమి ఇవ్వాలి

ప్రియులారా ఇశ్రాయేలియుల ప్రజలను దేవుడు అడిగాడు ప్రధమఫలముల పండుగ చేయమని, పర్ణశాలల పండుగ చేయమని అది ఎలా చేయాలి అని అంటే అది ఏడు రోజులు ఒక పర్ణశాలను ఏర్పాటుచేసుకోని అందులో ఏడు రోజులు ఉండి ఈ పండుగను చేయమని చెప్పాడు. ఎందుకు అని అంటే వారు దేవుడు వారికీ చేసిన మేలులను మరిచేపోయే స్వభావం కలవారు. అందుకే దేవుడు వారికీ కొన్ని నియమ నిభందనలు ఆచారాలను పెట్టి ఆవిధంగా పాటించి కొన్ని పండుగలను చేయమని వారికీ చెప్పాడు వాటిని పాటించడం ద్వారా దేవుడు చేసిన మేలులను గుర్తు చేసుకొని ఆచరించమని చెప్పాడు. ఎందుకు అని అంటే ఐగుప్తు దేశములో మీరు పడ్డ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తుగా ఆవిధంగా ఆచరించమని చెప్పాడు. వారు పండిన పంటలలో ఫలములను తీసుకోని వచ్చి ప్రధమ ఫలములను తీసుకువచ్చి దేవునికి అర్పణగా దేవుని అర్పణగా చేయాలి. అవి దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచేవారు, దేవుని అరాదించేవారు, అది ప్రధమఫలములపండుగ.

 

౩.కృతజ్ఞతార్పణ అనగా ఏమిటి

దేవుడు చేసిన మేలులకు ప్రతిగా దేవుకి హృదయపూర్వకంగా ఇవ్వడమే కృతజ్ఞతార్పణ పండుగ. ఇది దశమ భాగము కాదుగాని మన హృదయపూర్వకంగా దేవుని ఇచ్చుట నేర్చుకోవాలి. అయన పని జరుగుటకు మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతగా ఇచ్చుట నేర్చుకోవాలి. ఆశీర్వాదానికి మూలము ఎక్కడ ఉన్నది అని అంటే దేవునికి ఇచ్చుటలోనే ఉంది.

బలి అర్పణ ద్వారా మానవుడు తన పాపాన్ని పోగొట్టుకొని దేవుని సమీపించాడు. కానీ చివరకు దేవుడు తన ప్రియకుమారుని మన కొరకు అర్పించి మానవుని సొంతము చేసుకున్నాడు. ప్రధమఫలముల అర్పణ, కృతజ్ఞత అర్పణ.

 

బైబిల్ గ్రంధములో మనం చుస్తే 

రాజుగా దావీదు ఎన్నుకోబడిన తరువాత దేవునికి ఒక శాస్వతమైన మందిరం కట్టాలి అనుకొనేవాడు అప్పటివరకు వారు ఎక్కడ దేవుని అరాదించేవారు అని అంటే ఉన్నత స్థలములలో ఆరాధించేవారు. ప్రత్యక్ష గుడారాలలో ఆరాధించేవారు. అందుకే దావీదు ఆలోచన చేసి దేవునికి ఒక శాశ్వతమైన గుడారమును నిర్మించాలి అనుకున్నాడు. ఇది సామాన్యమైనది కాదు గాని దేవుని మందిరము కొరకు అయన ఆలోచన ఎలాఉంది అంటే కట్టబోవు మందిరము మనుష్యునికి కాదు గాని దేవునికే అని దేవుని ఈ పనిని ఇది భాహు గొప్పదిగా ఉండాలి అని అనుకున్నాడు. మనం ఏపని ఎంచుకున్న అది మనుష్యుల కోసం కాదు గాని దేవుని కొరకే అని గొప్ప ఎంచుకోనువారిగా మనం ఉండాలి. దావీదు భాహుగా ప్రయాసపడి వెండిని బంగారమును, గోమేదిపురాల్లను, అముల్యమైన కర్రలను దేవదారు మ్రానులతో, మిక్కిలి విలువగల రత్నములను, చలువ రాళ్ళను ఆయా దేశములనుండి విశేషముగా షేకరించి సంపాదించాడు. అంతేకాకుండా తన ప్రజలను మందిరము కొరకు ప్రేరేపించారు. అయన సమస్తమును సమకూర్చి దావీదు అంటాడు నీ స్వసంపాదన నుండి నేను మీకు ఇచ్చుచున్నాము అని అంటున్నాడు. ఈరోజున మనం కూడా దేవుని పని కొరకు మనపుర్వకంగా ఇచ్చుట నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చునది ఎక్కడికి పోదు. దేవునికి ఇచ్చి అయన నామమును మహిమ పరచాలి అయనను ఘనపరచువారిగా మనం ఉండాలి.

 

4.దేవునికి ఏమి అర్పించాలి, ఎలా సమర్పించాలి

రోమీయులకు 12:1

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.         

 

దేవుని మాటలో దేవుని వాక్యములో మనం గమనిస్తే  మనలను మనం సజీవయాగముగా దేవునికి అర్పించువారిగా సమర్పించువారిగా ఉండాలి., అప్పుడే మనం  దేవుని మహిమను పొందు కొంటాము  అట్టి కృపను అందరం పొందుకోవాలి ఆమెన్ 


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్ 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్           

 

          


No comments: