6 to 10 Lentdays 2019



6th Lentday12/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev. M. ఆనందవరం గారు.
Topic: మౌనం 
యెషయా గ్రంథము 53:7అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

**యేసుప్రభువారి గురించి యెషయా ప్రవక్త ద్వారా సమస్తం వివరింపబడినది
**యేసు ప్రభువారి పుట్టుక గూర్చి యేసయ్య జీవితం గూర్చి వివరంగా వ్రాయబడింది

**బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే దేవాది దేవుడు గురించి ఫిలిప్, నపుంసకుడికి లేఖనం గూర్చి ఆలేఖన భావం వివరిస్తున్నాడు.
అపొస్తలుల కార్యములు  8:32అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
అతను దౌర్జన్యము పొందెను భాదింప బడెను ఐనను అతను నోరు మెదప లేదు

1.ఎప్పుడు యేసు ప్రభువారు మౌనంగా ఉండిపోయారు?
మత్తయి సువార్త 27:12ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

2.ఎందుకు యేసు ప్రభువారు మౌనంగా ఉండిపోయారు, లేఖనంలో మన యేసయ్యను దేనితో వర్ణిస్తున్నారు.
**అయనను వధకు తేబడు గొఱ్ఱపిల్లతో పోలుస్తున్నారు.

**మొదటిగా దేవుని ప్రణాళిక ప్రకారం అయన గూర్చిన లేఖనం నెరవేర్పు కొరకు మౌనంగా ఉండిపోయారు.

**రెండవదిగా మన పాపములను బట్టి మన రక్షణ కొరకు అయన వధకు తేబడు గొఱ్ఱపిల్ల వలె మౌనముగా నుండి అతడు నోరు తెరువలేదు

**యేసయ్య మన కొరకు తన పరిశుద్ధ రక్తం చిందుచుటకు మౌనంగా ఉండిపోయారు.

3.యేసయ్యలో మనలో  ఏమి చూడాలి అని కోరుకుంటున్నారు?

**మనం పాపమూ నుండి రక్షించబడాలని అయన కోరుకుంటున్నారు.

**మనం కూడా అయన వలె తగ్గింపు కలిగి జీవించాలి అని కోరుకుంటున్నారు.

**మనం ఎంతో సహనం కలిగి ఉండాలని అయన కోరుకుంటున్నారు.

4.మరి మనం అటువంటి యేసయ్య ఇచ్చే రక్షణను పొందుకోవటానికి ఎలా ఉండాలి?
విలాపవాక్యములు 3:26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

**యేసయ్య రక్షణ పొందుకోవటానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి
**ఐనా సరే అన్నింటిని భరించి అయన ఇచ్చు గొప్పదైన రక్షణ కొరకు  ఓపికతో కనిపెట్టాలి.

5.మరి రక్షణ అనగా ఏమిటి?
**రక్షణ అనగా మరణం నుండి తప్పించబడుట అని అర్ధం
**రక్షణ అనగా ఆపద నుండి తప్పించబడుట అని అర్ధం.
**దేవాది దేవుడు మనలను అగ్నిగంధకము అనే మంట నుండి తప్పించబడుటయే,
దేవుని యొక్క గొప్ప రక్షణ.

ప్రభువు వారు మనకు గొప్ప జీవాన్ని ఇస్తారు దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని రాజ్యములో అందరం ఉండటానికి అయన ఇచ్చు రక్షణ పాత్ర పట్టు లాగున దేవుని కృప అందరికి ఉండాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
****************************************************************************

7th Lentday13/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev. M. ఆనందవరంగారు

కీర్తనల గ్రంథము 22:1-7
నన్ను చూచువారందరు పెదవులు విరిచి తల ఆడిం చుచు నన్ను అపహసించుచున్నారు

Topic: అపహసించుట.
**ఈరోజున ప్రవచనాత్మక మాటలనుండి మరొక వచనము అపహసించుటను గూర్చి ధ్యానం చేసుకుందాం.
**యేసు క్రీస్తు ప్రభువారు పడిన శ్రమలలో ముఖ్యమైన శ్రమ అపహసించుట.
**బైబిల్ గ్రంధము పరిశీలిస్తే యేసు ప్రభువారిని  అపహసించుట గూర్చిఏమి చేప్తుంది.

1.మొదటిగా ఎవరు యేసు ప్రభువారిని అపహసించుచున్నారు?
యేసు ప్రభువారిని అనేక సందర్భాలలో అనేకమంది అపహసించారు.
మత్తయి సువార్త 27:41
ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజ కులును కూడ ఆయనను అపహసించుచున్నారు.
మార్కు సువార్త  5:39
39 లోపలికిపోయిమీరేలగొల్లుచేసి యేడ్చుచున్నారు? చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను40 అందుకు వారు ఆయనను అపహసించిరి.
అపహసించుట అను మాటకు హేళన చేయుట అని అర్ధం

2.ఎవరిని అపహసిస్తారు దేనిని బట్టి అపహసిస్తారు అని బైబిల్ గ్రంధము చెప్తుంది.
2రాజులు 2:23 
అక్కడనుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములోనుండి వచ్చిబోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా
**ఒక మనిషి ప్రవర్తనను నడవడికను చూసి అపహసిస్తారు.
**బీదలైన వారిని అపహసిస్తారు అని బైబిల్ గ్రంధము చెప్తుంది.

3. అపహసించుట దేవుని దృష్టికి ఎలా ఉంది?
అపహాసకులుగా అనేకమంది ఉండుట చూస్తున్నాం.
హేళన అనేది దేవుని దృష్టిలో ఎంతమాత్రము ఇష్టమైనది కాదు

4.బైబిలులో అపహసించువారి గూర్చి సొలొమోను మహాజ్ఞాని చాల చక్కగా వివరించారు.
సామెతలు15:12 అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
ఇంకా చాల విషయాలు పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడ్డాయి.

5.యేసు ప్రభువారిని ఎలా అపహసిస్తున్నారు, ఏమని అపహసిస్తున్నారు?

మత్తయి 27:39-40.,,39 మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు
40
దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు వాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.

6.
యేసు ప్రభువారిని ఎందుకు అపహసిస్తున్నారు?
వారు ఆత్మ సంబంధులు కారు శరీరానుసారులు కనుక అపహసిస్తున్నారు.

7.అప్పుడు యేసు ప్రభువారు ఏమి చేసారు?
**అయన మనకొరకు తృణీకరింపబడ్డారు.
**ఆసిలువలో అపహసానికి హేళనకు గురి అయ్యారు.

8.మరి మనం ఏమి చేస్తున్నాం మనం ఎలా ఆయనను అపహసిస్తున్నాము?
**మన క్రియల ద్వారా ఆయనను అపహసిస్తున్నామా.
**మన పాపముల బట్టి ఆయనను అపహసిస్తున్నామా.

9.మనము ఎలా ఉండాలని అయన కోరుకుంటున్నారు?
**మన ప్రవర్తన మారి ఒక మాదిరికరంగా ఉండాలని అయన ఆశిస్తున్నారు
**మన పాపపు క్రియలను విడిచి పెట్టాలని అయన కోరుచున్నారు

మనలను మనం పరిశీలన చేసుకొని మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి అయన కృపను పొందాలి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***************************************************************

8th Lentday14/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev. M. ఆనందవరంగారు.

కీర్తనల గ్రంథము 41:6-9
9 నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను.

 Topic:మోసగింపబడుట

** సిలువ శ్రమల ధ్యానాకుటములలో మరియొక్క ప్రవచనాత్మకంగా నెరవేర్చబడిన మాటను గూర్చి ధ్యానిందాం.

**చదవబడిన వాక్యభాగమును దావీదు మహారాజు ప్రవచించిన ఒక ప్రవచనము

**ఈప్రవచనము యేసు ప్రభువారి శిష్యుడైన ఇస్కరియోతుయోద గురించి ప్రవచించబడినది.

1.మొదటిగా ఇస్కరియోతుయోద జీవితం ఎలా ఉంది?
యేసు ప్రభువారి శిష్యులలో ఒకడిగా ఉండే భాగ్యం కలిగినవాడు.
యేసు ప్రభువారితో భోజనం చేసిన ఘనత కలిగినవాడు

2.కానీ ఇస్కరియోతుయోద పరిస్థితి హృదయము ఎలా ఉంది?
ఆయనకు ధనాపేక్ష కలిగినవాడు, అయన మాటలలో మోసం ఉంది
యేసు ప్రభువారిని ధనము కొరకు అప్పగించుటకు హృదయంలో కపటపు ఆలోచన కలిగినవాడు.

బైబిల్ గ్రంధములోని హృదయము గూర్చి పరిశీలిస్తే

3. దేవుని వాక్యము పరిశీలిస్తే  హృదయము ఎలా ఉన్నది?
యిర్మీయా 17:9హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?
 
**హృదయం మోసకరమైన ఆలోచనలు కలిగిఉన్నది

4.హృదయం ఎలా ఉండాలి?
**మన హృదయములో మంచి ఆలోచనలు కలిగిఉండాలి.
కీర్తనల గ్రంథము 120:2యెహోవా, అబద్ధమాడు పెదవులనుండియు మోసకరమైన నాలుకనుండియు నా ప్రాణమును విడిపించుము

**మన హృదయం ఎలా ఉంది ఒకసారి మనలను మనము పరిశీలించుకోవాలి

5.పౌలుభక్తుడు రోమాపత్రికలో మోసకరమైన వారి గూర్చి ఏమి చెప్పారు.
రోమీయులకు 16:18 అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు

**ఇంపైన మాటలతో మోసపుచ్చుతారు అని పౌలుభక్తుడు చెప్తున్నాడు
 
**నిష్కపటుల మనసులను మోసం చేస్తారు అని పౌలుభక్తుడు చెప్తున్నాడు

**వారు బుద్ధిహినులును మరియు మూర్ఖులు అని పౌలుభక్తుడు చెప్తున్నాడు.
 
6.మోసకరమైన ఆలోచనలు కలిగి ఉండుట వలన ఇస్కరియోతుయోదకు ఏమి కలిగింది? 
మార్కు సువార్త 14:18-21
21 నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, మను ష్యునికి శ్రమ; మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను

**అతడు సాతానుకి అవకాశం ఇవ్వటం వలన శ్రమ కలిగింది.

7.మనం ఎలా ఉండాలి అని యేసు ప్రభువారు కోరుచున్నారు.

**మనలో మోసకరమైన ఆలోచనలు ఉంటె దేవుని బిడ్డలుగా వాటికీ దూరంగా ఉండాలి.
సామెతలు  12:7భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును

**మనం వ్యర్ధమైన మాటలకు సమయం ఇవ్వకూడదు, సాతానుకి అవకాశం ఇవ్వకూడదు.
**వ్యర్థమైన మాటలు కుటుంబానికైనా సంఘానికైనా మంచి కాదు.
**దేవుని మీద, దేవుని వాక్యము మీద మనసు పెట్టాలి

మన యేసయ్యను మోసపరిచే పరిస్థితులను లోకసంబంధమైన వాటిని విడిచి పెట్టాలి.
దేవుని బిడ్డలుగా ఆయనకు నమ్మకంగా ఉండాలి, ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తూ.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

********************************************************************
9th Lentday15/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev. M. ఆనందవరంగారు.
మత్తయిసువార్త  27:1-10

1 ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల.. పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధ ముగా ఆలోచనచేసి
2
ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
3
అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ముప్పది వెండి నాణములు ప్రధానయాజకులయొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి
4 ​
నేను నిరపరాధరక్తమును1 అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
Topic: అప్పగింపబడుట.

1. మొదటిగా యేసు ప్రభువారు ఎందుకొరకు అప్పగింపబడ్డారు

ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని ధనాపేక్షతో ఆయనను ప్రధానయాజకులకు అప్పగించాడు

2.వెండినాణెములకు యేసు ప్రభువారిని అప్పగించుట రీతిగా ఉంది.

పాత నిభందన గ్రంధమును పరిశీలిస్తే ఇరవై వెండినాణెములు ఒక బానిస యొక్క ఖరీదు.
యోసేఫు చరిత్రలో పరిశీలిస్తే అతని తండ్రి మరియు అన్నదమ్ములు ద్వేషించారు చివరికి యోసేఫును  గుగ్గిలం వర్తకునికి ఇరవై వెండినాణెములకు అమ్మివేసారు.
అదే రీతిగా యేసు ప్రభువారిని ముప్పై వెండినాణెముల కొరకు అప్పగించబడ్డారు.

3.యేసు ప్రభువారు ఎలా అప్పగింపబడ్డారు?
యోదా ప్రధానయాజకులును ప్రభువారి యొద్దకు తీసుకువచ్చి యేసు ప్రభువారిని చూపించుటకు గుర్తుగా యేసయ్యను కపటమైన ప్రేమతో ముద్దుపెట్టుకొని అప్పగించబడ్డారు.

4. యూదా యేసుప్రభువారిని ముద్దు పెట్టుకొనుట దేనికి సూచనగా ఉన్నది.
ముద్దు ప్రేమకు సూచన, కానీ ఇక్కడ సంధర్బములో ముద్దు యేసు ప్రభువారిని అప్పగించుటకు సూచనగా ఉన్నది.

5. ప్రధానయాజకులు శాస్త్రులు ఎలా ఉన్నారు?
ప్రధానయాజకులు శాస్త్రులు స్వనీతి పరులు. తరువాత యూదా పశ్చాతాపడి తాను తీసుకున్న
 30 వెండినాణెములు తిరిగి వారికే ఇవ్వగా ఇది రక్త క్రయధనము కనుక ఆధనమును వారు 
తీసుకోవడంలేదు, కానుక పెట్టెలో వేయనియ్యలేదు

6. తరువాత ఆధనము ఏమి చేయబడింది దేనికి కొనబడినది?

**ఆధనము కుమ్మరి వాని పొలమున కిచ్చిరి.
**కుమ్మరి పొలం జిగటమట్టితో కూడినది
**ఇది దేనికి పనికి రాకుండా పరదేశులను పాతి పెట్టుటకు కొనబడినది

7.యేసయ్యను ఎలాంటి పరిస్థితిలో అప్పగింపబడ్డారు.

**ఇది ఒక బాధాకరమైన పరిస్థితి.

**ఏ తప్పు చేయని యేసయ్య ప్రధానయాజకుల వద్ద మౌనంగా ఉండవలసిన పరిస్థితి.

**యేసయ్యను నమ్మకమైనవారే దుర్మార్గులకు, కఠినులకు అప్పగించిన పరిస్థితి.

 8. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము?

మనం యేసయ్యను ప్రేమిస్తున్నామా.

**మనం యేసయ్యపై కపటమైన ప్రేమను కలిగిఉండరాదు.

**యేసయ్యను పూర్ణ హృదయంతో ఆరాధించాలి.

**మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి క్రీస్తు బిడ్డగా ఉండాలి.

సంఘటనను గూర్చి యిర్మీయా మరియు జకార్య వ్రాసినట్టు ప్రవచనం నెరవేర్పు కొరకు జరిగినట్లు వ్రాయబడింది

జెకర్యా  11:12-13.,,12 మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయు డని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి.13 ​యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మ రికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.
  
దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునికి ఇష్టము కలిగించే జీవితం కలిగిఉండాలని ఆశిస్తూ

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
*********************************************************************
10th Lentday16/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యసందేశం శ్రీ V.అబ్రాహాముగారు

యెషయా 53:7-10 .,8 అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో సంగతి ఆలో చించినవారెవరు?

**యేసు ప్రభువారి గూర్చి అనేక ప్రవచనములు పాతనిభందన గ్రంధములో వ్రాయబడినవి.**నెరవేర్పు కొత్త నిబంధన గ్రంధమును  పరిశీలిస్తే చూడవచ్చు.

లూకా 22:54-55
నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.

మార్కు15:5
అయినను యేసు మరి ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను

**చదవబడిన వాక్యములో యేసుప్రభువారు తగ్గింపు కలిగిఉన్నారు.  

**క్రైస్తవులుగా తగ్గింపు జీవితానికి యేసు ప్రభువారు మాదిరికరంగా ఉన్నారు

**అటువంటి మనస్సు మనం కలిగిఉండాలి అని యేసయ్య ప్రభువారు సూచిస్తున్నారు.

1.మొదటిగా మనం ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి?
ఫిలిప్పీయులకు 2:5
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి

2. రెండవదిగా ఏమిటి మనస్సు, మనం కలిగిఉండాలి?
మత్తయి 5:44
44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

**మనం శత్రువులను ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి మనలను హింసించువారికొరకు ప్రార్ధించువారిగా ఉండాలి.

3.ప్రార్ధనలో తగ్గింపు కలిగిఉండుట.

 బైబిల్ గ్రంథములోని మనకు గుర్తుకు వచ్చేది సుంకరి, పరిసయ్యుని ప్రార్ధన.
సుంకరి వంటి తగ్గింపు కలిగి మనం యేసు ప్రభువారిని పోలి నడుచుకోవాలి

పరిశుద్ధ గ్రంధములో తగ్గింపు కలిగిన కొంతమంది వ్యక్తుల జీవితాల గూర్చి పరిశీలిస్తే

1.  తగ్గింపు జీవితం కలిగి ఉన్న అబ్రాహాము.
ఆదికాండము 18:27అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను

2. తగ్గింపు జీవితం కలిగి ఉన్న యోబు
యోబు 40 :4చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.

3. తగ్గింపు ప్రార్ధన జీవితం కలిగి ఉన్న ఎజ్రా
ఎజ్రా 9:6నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది

4. తగ్గింపు ప్రార్ధన జీవితం కలిగి ఉన్న దావీదు
కీర్తనల  51:5 నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
దావీదు తగ్గింపు కలిగి తన పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు.

5. తగ్గింపు జీవితం కలిగి ఉన్నయెషయా
యెషయా 6:5 నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.

6. తగ్గింపు జీవితం కల్గి ఉన్న అపొస్తలుడైన పౌలు భక్తుడు 
1 కొరింథీయులకు 15:9ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

7.విశ్వాసులమైన మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి
2దినవృత్తాంతములు  7:14నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును

**
తగ్గింపు లేనిదే క్రైస్తవ జీవితానికి అర్ధం లేదు.
**తగ్గింపు కలిగి ఉంటేనే మనం నిజమైన క్రైస్తవులము అవుతాము.
**తగ్గింపుకలిగి పశ్చత్తాపముతో ప్రార్థిస్తేనే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు.

యేసయ్య మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.