August2019 Messages



04Aug2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
యెహోషాపాతు జీవితం - నేర్చుకోవలసిన పాఠం

2దినవృత్తాంతములు20:3-12
5 యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి
6 మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.

యెహోషాపాతు జీవితం నుండి మనం అనేకమైన విషయములను ధ్యానించుకొంటున్నాము.

1.యెహోషాపాతు దేవుని యెడల భయ భక్తులు కలిగినవాడు.
యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని యెడల స్థిరమైన దృఢమైన మనస్సు కలిగి ధర్మశాస్త్రమును తన ప్రజలకు తెలియజేసి వాటిని అనుసరింజేయుటకు కొంతమంది పెద్దలను నియమించి వారి ద్వారా భోదింపజేసినవాడు.

2.యెహోషాపాతు యెహోవా నియమమును అనుసరించువాడు.
2దినవృత్తాంతములు19:5-6
5 ​మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను.
6 మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియ మమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.

**యెహోషాపాతు పెద్దలను కొందరిని నియమించియెహోవాయందు భయభక్తులు కలిగినవారై, దేవుని నియమములను అనుసరించమని వాటిని బట్టి తీర్పు చేయుమని వారికీ ఆజ్ఞా పించెను.

**మనము కూడా దేవుని నియమములను అనుసరించవలసిన వారమైయున్నాము.

**మనము దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముతోను యథార్థమనస్సుతోను ప్రవర్తించాలి.

మనము దేవుని న్యాయవిధులను అనుసరించి వాటిని బట్టి తీర్పుతీర్చవలసిన వారమైయున్నాము., సంఘము యెడల మనం భాద్యతకలిగి ఉండాలి, సంఘములో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, హెచ్చరించాలి.


3.యెహోషాపాతు తన ప్రజలైన వారిని దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.
2దినవృత్తాంతములు19:4
4 యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బేయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.

**యెహోషాపాతు తన జనులను దేవుని వైపుకు మళ్లించుటకు మంచి ఆలోచన కలిగినవాడు, ఎందుకు అని అంటే దేవుని బిడ్డలైన వారు త్రోవతప్పి ఉండుట, అన్యాచారాలను ఆచరించుట చూచి యెహోషాపాతు హృదయం గాయపడి, బాధపడింది.

**మనం మన సహోదరుల పట్ల సంఘ బిడ్డల పట్ల భాద్యతకలిగి దేవుని వైపు నడిపించాలి.

**దేవుని ప్రజలైన వారు త్రోవతప్పిపోయిఉన్నారు వారిని సరైనమార్గంలో నడిపించాలి, అనేకమందిని దేవుని వైపుకు నడిపించాలి.

**సంఘమును అభివృద్ధిపరచుటకు అనేకమందిని దేవుని వైపు నడిపించాలి, అన్యజనులైన వారిని నశించిపోకుండా వారిని రక్షించుటకు దేవుని వైపు మళ్లించాలి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి.

4.యెహోషాపాతు ప్రతి విషయం దేవుని ఎదుట విచారించువాడు.
2దినవృత్తాంతములు18:4
4 మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతోనేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా

**అహాబు యెహోషాపాతు కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేక మైన గొఱ్ఱలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను,అప్పుడు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము అని అతనితో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు.

కుటిల ఆలోచనతో ఇశ్రాయేలురాజు నేను మారువేషమువేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పెను తరువాత వారు యుద్ధమునకు పోయిరి, ​కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను, తరువాత వారు ఇశ్రాయేలురాజును చంపిరి.

**యెహోషాపాతు కష్టo వచ్చిన దేవునికి మొరపెట్టువాడు, అటువలె మనం కష్టమొచ్చినా నష్టమొచ్చిన దేవునికి మొరపెట్టాలి.

**యెహోషాపాతు భక్తిగలవాడు, ఇశ్రాయేలురాజూ వంటి భక్తి హీనుడుతో స్నేహం చేసి తప్పిదం చేసెను.అందుకే మనం పాపులతో స్నేహం చేసి వారి ద్వారా ప్రేరేపించగా మనం వొప్పుకోకూడదు, మనం యేసయ్య తో స్నేహం చేయాలి

 సామెతలు1:10
10 నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.

**దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, లోకం వైపు ప్రేరేపించువారిని మనం వొప్పుకోకూడదు, అప్పుడు యేసయ్య మనలను ప్రకాశించు జ్యోతులవలె ప్రకాశింపజేస్తాడు.

**దేవునికి ప్రార్ధించి, దేవునికి మొరపెట్టి, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి.

యెహోషాపాతు వలె దేవుని బిడ్డలుగా వాక్యమును స్వీకరించి, దేవుని నీతి న్యాయములను అనుసరించాలి అనేక మందిని దేవుని వైపు నడిపించి, త్రోవతప్పిపోయిన వారిని గద్దించి, హెచ్చరించి, పాపులైన వారి ప్రేరేపణలను ఒప్పుకోకుండా, మనం యేసయ్య తో స్నేహం కలిగి యేసయ్య చిత్తం తెలుసుకొని యేసయ్య కృప ఆశీర్వాదం పొందుకోవాలని ఆశిస్తూ.

దేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్...

యేసయ్య మాటలను దీవించును గాక...
*************************************************************
25Aug2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

1 కొరింథీ 3:4-9
5 అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి.


 చదవబడిన వాక్యభాగములో అపొస్తలుడయిన పౌలు గారు కొరింధీ సంఘములోని పరిస్థితుల గూర్చి వివరిస్తున్నారు.

మనం గమనిస్తే కొరింధీ సంఘములో ఒక చిన్న గలిబిలి ఉన్నది, ఎవరు గొప్ప అని కొంతమంది గుంపులుగా నేను పౌలు భక్తునిగాను మరియొకడు అపోలో భక్తునిగాను నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకొంటున్న పరిస్థితి ఉన్నది. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా? అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొ క్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి, నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు అని పౌలు భక్తుడు వారికీ వివరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు.


#అనేకమైన భక్తులు దేవుని గూర్చి మనకు వివరిస్తూ ఉన్నారు భక్తులలో రోజున మనం అపోలో భక్తుని గూర్చి ధ్యానించుకుందాం.

**అపోలో అనగా ఇది ఒక దేవతకు సంభందించిన పేరు, ఇతడు యూదుడు, ఐగుప్తునకు చెందిన అలెగ్జాండ్రియా పట్టణమునకు చెందినవాడు, దేవుని ధర్మశాస్త్రమును, దేవుని ప్రవచనములు ఎరిగినటువంటివాడు.

**ఇతడు బాప్తీస్మం ఇచ్చు యోహానుకు ఆకర్షితుడైన అతనిని అనుసరించి తరువాత ఇతడు యేసు ప్రభువారిని విశ్వసించి అనుసరించాడు.

**యేసుప్రభువారి యందు గొప్ప విశ్వాసంతో అయన పరిపూర్ణ సేవ చేసినట్లు మనం గమనించవచ్చు.

**ఇతడు పౌలు భక్తునికి గొప్ప స్నేహితుడు, దేవుని యందు గొప్ప నమ్మకం కలిగి కొరింధీ పట్టణంలో దేవుని సువార్త ప్రకటించినవాడు.

**దేవుని సువార్త కొరకు దేవుని కొరకు హృదయము నందు వేదన కలిగినటువంటివాడు

**ఇతని జీవితం ప్రత్యేకమైనటువంటిది, ఇతడు యూదుడై యుండి కూడా దైర్యంగా దేవుని గూర్చి సమాజంమందిరంలో ప్రకటించినవాడు, పౌలు భక్తుడు ఒక సంఘమును కొరింధీలో నెలకొల్పిన తరువాత సంఘమును గొప్పగా నడిపించినవాడు.  

అపోలో భక్తునికున్న మూడు  ముఖ్యమైన లక్షణములు గూర్చి వాటినుండి మనం నేర్చుకోవలసిన అంశాల గూర్చి ఈరోజున మనం ధ్యానించుకుందాం.


1.మొదటి లక్షణం ఈయన లేఖనములు ఎరిగినటువంటివాడు.  

ఈయన అనునిత్యం లేఖనములను పఠించువాడు, లేఖనములను ధ్యానించువాడు.

మనం దేవుని వాక్యమును నిత్యం ధ్యానించువారిగా ఉండాలి, అందుకే దావీదు భక్తుడు అంటాడు.

కీర్తనలు 1:2
2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.


కీర్తనలు 63:5
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది.
 
##దేవుని వాక్యమును మనకు అందించడానికి విలియం కెరిగారు ఎంతగానో కృషి చేసి ఎన్నో శ్రమలకు ఓర్చుకొని దేవుని వాక్యమును మనకు అందించారు అటువంటి దేవుని వాక్యమును మనం నిత్యం ధ్యానించువారిగా ఉండాలి.

##మనం దేవుని బిడ్డలుగా దేవుని వాక్యమును ఎరిగిఉండాలి, వాక్యం ద్వారా అనేక మందిని దేవునిలో బలపరచేవారీగా ఉండాలి.


2.రెండవ లక్షణం ఇతడు ధైర్యముగా దేవుని వాక్యమును ఇతరులకు భోదించువాడు.

1 కొరింథీ 3:6-7
6 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే
7
కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.

ఇతడు యూదుడై ఉండి కూడా ఎవరికీ భయపడకుండా ధైర్యముగా అనేకులకు సమాజములో దేవుని వాక్యమును భోదించి అనేకులను దేవునిలోనికి నడిపించినవాడు.

దేవుని బిడ్డలుగా మనం కూడా ఇతరులకు దేవుని వాక్యమును భోదించి ఇతరులను దేవునిలోనికి నడిపించేవారీగా ఉండాలి.


3.మూడవదిగా ఇతడు దేవుని పరిచర్య చేయుటకు గొప్ప ఆశక్తి కలిగినటువంటివాడు.

**అనేక మందిని దేవునిలోనికి నడిపించుటకు ఆశక్తి కలిగినటువంటివాడు, ఇతడు అనేక ఆత్మలను రక్షించి నుంచి దేవునిలోనికి నడిపించుటకు ఆశక్తి కలిగినటువంటివాడు. దేవుని యెడల దేవుని పని పట్ల గొప్ప ఆశక్తి కలిగి నటువంటివాడు.

దేవుని బిడ్డలుగా మనం కూడా దేవుని పని కొరకు ఆశక్తి కలిగి ఉండాలి.

అందుకే బైబిల్ గ్రంధములో దావీదు భక్తుడు అంటాడు

కీర్తనల గ్రంథము 42:1
1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

##ఏమిటి ఆశక్తి అని అంటే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్లెదను, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడెదను అని ఆశక్తి కలిగి ఉండేవాడు.

ఇప్పుడు మనం ఎలా ఉన్నాం మనలను మనం పరిశీలించుకోవాలి, ఎప్పుడు దేవుని మందిరమునకు వెళ్లేదామా, అయన సన్నిధిలో కనపడదమా అటువంటి ఆశక్తి దేవుని యెడల కలిగి ఉండాలి. యేసయ్య అట్టి కృప మన అందరికి కలిగించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.


No comments: