MARCH Mesasages2018

ఆదివారము ఆరాధన
BY పాస్టర్ఆనంద వరం గారు
18/03/2018 Baptist Church Akkayyapalem
Response Reading: Psalm34
Andhra christian songs: 405,190,578,616
Topic: ఆత్మీయ పాఠాన్ని నేర్పించే మిక్కిలి జ్ఞానము గల చిన్న జీవులు

సామెతలు 30:24-28
24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. 25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. 26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. 27 మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును. 28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును. 

చిన్న కుందేళ్లు :
సామెతలు 30:26చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.

1.డెక్కలు లేనివి  అపవిత్రముగా ఎంచబడినవి
2.బలము లేని జీవులు
3.బండ సందులను ఆశ్రయించుతుంది

**ఎందుకు మనము దేవుని ఆశ్రయించాలి? అపవాదిని ఎదుర్కొనుటకు దేవుని ఆశ్రయించాలి
1పేతురు 5:8నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.  
 
1.ఆధ్యాత్మికంగా బండ క్రిస్తు కు సాదృశ్యం , మనము ప్రభువులో ఉండాలి
కీర్తనలు 91:1మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

2.మన ప్రభువును ఆశ్రయించువారికి, ఏ మేలు కొదువయై యుండదు
కీర్తనలు 34:9-10యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.  


3.అపవాదిని  ఎదుర్కొని, మన ప్రభువు ఇచ్చు రక్షణపొందు బిడ్డలుగా ఉండాలి  
కీర్తనలు 34:7-8యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును.యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

మిడతలు:-
సామెతలు 30:27మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.

1.మిడతలు మహా సైన్యంగ ఉంటాయి
యోవేలు 2:25మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.

2.దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటాయి
కీర్తనలు 105:34ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను,

ప్రకటన గ్రంథం 9:7-11ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుఱ్ఱములను పోలి యున్నవి. బంగారమువలె మెరయు కిరీటములవంటివి వాటి తలలమీద ఉండెను; వాటి ముఖములు మనుష్యముఖములవంటివి,

3.అవి తూర్పు గాలి నుండి వస్తాయి, తూర్పుగాలి పరిశుద్ధాత్మ కు సూచన.
1.మనము కూడా దేవుని మహా సైన్యంగా క్రిస్తూ పరివారముగా ఉండాలి
2.దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలుగా ఉండాలి
3. తూర్పుగాలి పరిశుద్ధత కు సాదృశ్యం, దేవుని పరిశుద్ధ గాలిని ఎదుర్కొనే బిడ్డలుగా ఉండాలి

బల్లి:- (spider)
సామెతలు 30:28బల్లి ని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.


1. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు
1.రాజా గృహములలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి
3.అల్పమైన జీవులు

 ఆధ్యాత్మికంగా:-
1.దేవుని చేతిలో మనం ఉండాలి
2.మన నివాసము దేవుని రాజ్యములో ఏర్పాటు చేసుకొనే వారీగా ఉండాలి
3అశాశ్వతమైన  మన జీవితంను దేవుని కొరకు జీవించాలి  

దేవుని బిడ్డలుగా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని కృప ఆశీర్వాదము పొందే వారీగా ఉండాలని ఆశిస్తూ  

దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*****************************************************
ఆదివారము ఆరాధన BY పాస్టర్ఆనంద వరం గారు
11/03/2018 Baptist Church Akkayyapalem
Response Reading: Psalm18
Andhra christian songs: 8,650,441,614
Topic: చీమ నేర్పిన ఆధ్యాత్మిక జ్ఞానం

సామెతలు 30:24-28
24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. 25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.  

1.చీమ కాలాన్ని గుర్తించే  జ్ఞానము గలది
దేవుని బిడ్డలముగా మనం కూడా దేవుని రాకడ కాలం గుర్తించే జ్ఞానం కలిగి ఉండాలి

2.చీమ కాలాన్ని సద్వినియోగం చేసుకొనే జ్ఞానము గలది
మనము కూడా దేవుని వాక్యమనే జ్ఞానము కలిగి దేవుని కొరకు కాలని సద్వినియోగం చేసుకొనే జ్ఞానము కలిగి ఉండాలి.

ఎఫెసీయులకు 5:15దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, 

3. ఆహారానిని సిద్ధం చేసుకొనే  జ్ఞానము గలది
మనంకూడా దేవుని వాక్యమనే ఆహారానిని ,మన హృదయంలో భద్రపరచుకోవాలి. 

4.శ్రమను ఎదుర్కొనగలిగే జ్ఞానము గలది
మనము కూడా అనేక ఆపదలు కష్టాలు ఎదుర్కొని దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి

5.ఐక్యత కలిగి ఉంటాయి.
సామెతలు 6:6మనము కూడా దేవునిలో ఐక్యత కలిగి దేవుని పని లో ఐక్యతతో జీవిదమ్
సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*****************************************************
ఆదివారము ఆరాధన BY పాస్టర్ఆనంద వరం గారు
04/03/2018Baptist Church Akkayyapalem
Response Reading: Psalm55
Andhra christian songs: 27,239,442,610

Topic: పావురం
మత్తయి 3:13-17
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 

పావురము స్వభావము:-
 
1.పావురము దేవుని బలికి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది.
లేవీయకాండము 5:7అతడు గొఱ్ఱపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

2.పావురము చేదులేని (నిష్కపటమైన) దానికి సాదృశ్యంగా ఉంది.
మత్తయి 10:16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

3.పావురము చెడు తినదు, అది శ్రేష్టమైన దానికి సాదృశ్యంగా ఉంది.
యోహాను  6:54నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును

4.పావురం గోధుమ తింటుంది గోధుమ జీవాహారమై అయన శరీరానికి సాదృశ్యంగా ఉంది.
1కొరింథీ 11:23నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి

5.పావురం ఇంటిని ప్రేమిస్తుంది ఇల్లు దేవుని సంఘమునకు సాదృశ్యం
పరమగీతము  2:14బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము. 

6.పావురం శాంతికి, సమాధానానికి సాదృశ్యం. 
మత్తయి 5:5సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

7.పావురం తనలో ఒక నూనె కలిగిన జీవితం, నూనె పరిశుద్ధాత్మ కు సాదృశ్యం.
మత్తయి 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.   

పరిశుద్ధమైన వారీగా శ్రేష్టమైన వారీగా దేవుని ఆహ్వానించువారిగా ఉండాలని ఆశిస్తూ   దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్