జనవరి Messages2019



05JAN2019 Message
ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 91 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1,413,573,614
Topic: వాగ్దానము 

1రాజులు గ్రంథము 8:54-58
56 ​ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు
 
**వాగ్దానము అను మాటకు అర్ధం మాట ఇచ్చుట.
 **ఆయా సందర్భాన్ని బట్టి వాగ్దానములు మనకు వస్తాయి. 
 **దేవుడు మనకు ఎన్నో వాగ్దనములు ఇస్తున్నాడు వాటిని నెరవేరుస్తున్నారు. 
 **అనేక వాగ్దనములు ద్వారా దేవుడు మనతో మాట్లాడు తున్నాడు. 
 **వాటిలో ఆజ్ఞలతో కూడిన వాగ్దానములు ,షరతులతో కూడిన వాగ్దానములు ఉన్నాయ్.

 ఈ వాగ్దానములు అనేక రకములుగా ఉన్నాయ్
 ఈ వాగ్దానములలో ముఖ్యముగా 

1.శుభవాగ్దానములు 
2.పరిశుద్ధ వాగ్దానములు 
3.అమూల్యమైన వాగ్దానములు
4.ఆజ్ఞలతో కూడిన వాగ్దానములు 
5.పరిశుద్ధ ఆత్మగూర్చిన వాగ్దానములు 
6.యేసయ్య రాకడ గూర్చిన వాగ్దానములు 
7.నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము

1.శుభవాగ్దానములు.
1రాజులు గ్రంథము 8:25-28
56 ​ఎట్లనగాతాను చేసిన వాగ్దానమంతటినిబట్టి ఇశ్రాయేలీయులగు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండును గాక. తన దాసుడైన మోషేద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పి పోయినదికాదు.

మోషేద్వారా మంచి వాగ్దానము - పరలోకము గూర్చిన వాగ్దానము
హెబ్రీయులకు 11:13,16
13 వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయి నను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
16 అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడ

2.పరిశుద్ధ వాగ్దానములు
 
కీర్తనల గ్రంథము  105:42
42 ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని

3.అమూల్యమైన వాగ్దానములు.
2పేతురు 1:4
4 ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్య ములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.

4.ఆజ్ఞలతో కూడిన వాగ్దానములు.
ద్వితీయోపదేశకాండమ 28:14-15
14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞా పించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ లను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.

5.పరిశుద్ధ ఆత్మగూర్చిన వాగ్దానములు.
అపొస్తలుల కార్యములు 1:4
4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;

6.యేసయ్య రాకడ గూర్చిన వాగ్దానములు.  
2 పేతురు 3:4
4 ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త మును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవ

7.నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము.
హెబ్రీయులకు 9:15
15 ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.

దేవుని వాక్యము వింటూ దేవుని యందు విశ్వసం కలిగి దేవుని వాగ్దానములు
అన్ని మనజీవితాలలో నేరవేరాలని అట్టి కృప మన అందరికి అందివ్వాలని
దేవుడు ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

20JAN2019 Message
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
గిడియన్ ఇంటర్నేషనల్ ఆదివారం ఆరాధన
వాక్యఉపదేశకులు గిడియన్ ప్రసాద్ గారు
కీర్తనలు 20 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 5,474,447,386
Topic: దేవుని తెలుసుకొనుట
 యిర్మీయా  9:23-24
 24 ​అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ABOUT GIDEON INTERNATIONAL 
 
1.Gideon internationally Started in 1899 and 1941 in india.
2.Traslated bible in 108 languages till now.
3.180000 gidians are working across world to spread good news Bibles in 200 countries.

1.పరిశీలనగా తెలుసుకొనుట.
పరిశీలన అను మాటకు లోతుగా తెలుసుకొనుట అని అర్ధం.

మనము దేవుని గురించి పరిశీలన చేసి లోతుగా తెలుసుకోవలసిన వారమైయున్నాము.    
**దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు.
2సమూయేలు 7:24
మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి.

**అటు తరువాత యేసు ప్రభువారు మన అందరిని తన ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నారు.
1పేతురు 2:10
ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.

** యేసు క్రీస్తు పరిపూర్ణతలో మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.
యోహాను సువార్త 1:16-17
16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.
17 ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. 

**దేవుడు మన కొరకు చేసిన గొప్ప మేలు వరం దేవుని వాక్యము.
కీర్తనల గ్రంథము 147:19-20
19 ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
20 ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి. 
అలాంటి దేవుని వాక్యము ద్వారా మనము దేవుని గూర్చి లోతుగ తెలుసు కోవటానికి మేలు కలిగింది.
**అలాంటి దేవుని వాక్యమును పరిశీలనగా చుస్తే మనకు కలిగేవి

1.ఫలించుట
యిర్మీయా 17:7-8
7 ​యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
8 వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.

యోహాను సువార్త 15:5
5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. 
***అటువంటి దేవుని వాక్యము ద్వారా మన జీవితాలలో గొప్ప ఫలింపు కలుగుతుంది.

2.సఫలత
కీర్తనల గ్రంథము 1:3
3 అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.

ఎఫెసీయులకు 3:20-21
20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, 21 క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌. 
***అంతేకాకుండా దేవుని వాక్యం మన జీవితాలలో గొప్ప సఫలతను మనకు అందిస్తుంది.
  
**దేవుడు అందరి హృదయములను పరిశోధించువాడును. దేవుడు గురించి దావీదు సొలొమోనుతో పలికిన మాటలు.
1దినవృత్తాంతములు28:9
 ​సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
**దేవుడు ఎలా మనలను గూర్చి తెలుసు కొంటాడు.
**ఎలా అనగా దేవుడు మనలను ఆవరించి ఉంటాడు.

2. దేవుడు మనలను ఆవరించి పరిశోధించి తెలుసుకొనును.
కీర్తనల గ్రంథము 139:1,5
1 యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు
5 వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.
 **దేవుడు మనలను ఆవరించి మనలను కాపాడుటకు అనేకమైన కంచెలను వేస్తాడు.
 **దేవుడు పరిశోధించి మనకు వెనుకను ముందును కంచె వేటితో వేస్తాడు.

1. దేవుడు వెనుక కృప క్షేమమాలుతో కంచె వేస్తాడు.
కీర్తనల గ్రంథము 23:6
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.

2. దేవుడు ముందు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో కంచె వేస్తాడు.
కీర్తనల గ్రంథము 21:3
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు.

3. పైన కరుణాకటాక్షములను కంచెవేస్తాడు.
కీర్తనల గ్రంథము 103:4
సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించు చున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు.

4. క్రింద విశాలస్థలమున నా పాదములను కంచెవేస్తాడు.
కీర్తనల గ్రంథము 31:8
నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి. 
5.అంతే కాకుండా దేవుడే మనచుట్టు ఉంటాను అంటున్నాడు.
కీర్తనల గ్రంథము125:2
2 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.

**అట్టి దేవుని కృప మన అందరికిని కలుగుటకు దేవుని వాక్యము ద్వారా దేవుని 

తెలుసుకొని యేసయ్య కృపకు పాత్రులువుదాము.
దేవుని లోతుగా తెలుసుకొని యేసు క్రీస్తు కృపను అందరికిని అందించాలని, అప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదిస్తాడు.
 దేవుడు ఈ మాటలను దీవించును గాక..  దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

*************************************************************
7thJAN2019 Message
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యఉపదేశకులు పాస్టర్ M.ఆనంద వరం గారు
కీర్తనలు 55 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 6,492,441,610.
Topic: కేక
మత్తయి సువార్త 3:1-3
3 ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే.

**కేక అను మాట బైబిల్లో ప్రత్యేకించి వ్రాయ బడిన మాట.
**ఈ కేక ఎందుకు వేస్తారు దాని అర్ధం ఏమిటి.
**బైబిలులో ఈ కేక అను మాట ఎన్ని రకాలుగా  వ్రాయబడినది.
**బైబిలులో ఈ కేక అను మాట అనేక  రీతులుగా అనేక సందర్భాలలో వివరింపబడినది.

1. మొదటి సందర్భం సేన దెయ్యపు కేక 
 మార్కు సువార్త 5:7
7 యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 

2. రెండవ సందర్భం కుష్టు రోగుల యొక్క కేక 
లూకా సువార్త 17:13
13 యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. 

3. మూడవ సందర్భం కనాను స్త్రీ యొక్క కేక
మత్తయి సువార్త  15:22
22 ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చిప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

4. నాల్గవ సందర్భం గ్రుడ్డివాని యొక్క కేక 
లూకా 18:38-39
38 అప్పుడు వాడుయేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా
39 ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగాదావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.

5. ఐదవ సందర్భం పెండ్లి కుమారుని యొక్క కేక 
మత్తయి సువార్త 25:6
6 అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
దేవదూతల ద్వారా దేవుడు కన్యకలనే సంఘములను పిలుస్తున్నారు కేక వేస్తున్నారు.

**ఈ కేక ఎవరు వేస్తున్నారు?
దేవుడు మన కొరకు అనేక సందర్భాలలో కేక వేస్తున్నారు.
దేవుడు ఏవిధంగా ఎలా మన కొరకు కేక వేస్తున్నారు.
***సంఘములో దేవుడు మన కొరకు తన వాక్యము ద్వారా కేక వేస్తున్నారు.

1.దేవుడు తన వాక్యము ద్వారా కేక వేస్తున్నాడు. 
 మత్తయి సువార్త  25:1-13
 1 పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది.

2 వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
**దేవుని వాక్యమనే కేక కానీ మనం వినుట లేదు ,గ్రహించటంలేదు , దేవుని వాక్యమును స్వీకరించటం లేదు. 
 **సంఘములో దేవుని వాక్యమనే కేకను గ్రహించాలి.
 **మనము మారు మనసు కలిగి పరలోక రాజ్యం కొరకు సిద్ద పాటుకలిగి ఉండాలి. 

 2.ప్రవక్తల ద్వారా కేక దేవుడు మన కొరకు కేక వేస్తున్నారు.
 మత్తయి సువార్త 3:1-3
3 ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవా డితడే.

**క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, ఈ మార్గం ఎలా ఉంది.

**మనము కఠిన హృదయమును రాతి హృదయమును విడిచిపెట్టాలి. 
**నేటి క్రైస్తవులుగా మనం పాపము అనే రాయిలను,  ముళ్ల తుప్పలను మన మార్గములో తీసివేసి క్రీస్తులో మన మార్గములను సరాళము చేసుకోవాలి. అప్పుడు మన త్రోవలు సరాళము చేయబడతాయి.

**మొదటిగా ఈ మార్గం ఎక్కడ మారాలి?
 **క్రైస్తవ్యంలో ఆధ్యాత్మికంగా మారాలి అంటే కుటుంబంలో మారాలి.
 **కుటుంబంలో మార్గం సరళం చేయబడాలి అప్పుడు సంఘములో మార్పు వస్తుంది.

3.జ్ఞానము కేకలు వేయుట 
సామెతలు  1:20
20 జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. 

** దేవుని బిడ్డలకు దేవుని యందు భయ భక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. 

4. యేసు ప్రభువారు కేక వేశారు.
లూకా సువార్త 23:46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
**భాద కొలది వేసే కేక దేవుని కొరకు మొరపెట్టటానికి కేక.
**యేసు ప్రభువారు కూడా సిలువలో భాదతో బిగ్గరగా కేక వేశారు. 

5. ఆఖరిగ మనము కేక వేసే చోటు నరకములో కేక 
**దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తే నరకంలో మనం వేసే కేక ఎవరు వినిపించుకొని పరిస్థితి
నరకంలోఅక్కడ అగ్ని అరదు పురుగు చావదు అటువంటి స్థితి లోకి పోకుండా దేవునిలో ఎదగాలని ఆశిస్తూ.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.