ఏప్రిల్ Messages 2018


08/04/2018 Baptist Church Akkayyapalem
ఆదివారము సంఘఆరాధన
By పాస్టర్ M.ఆనందవరం గారు
Response Reading: కీర్తనల గ్రంథము 108
ఆంధ్ర క్రిస్తవ కీర్తనలు : 69,310,455,616
Topic: మేడ గది అనుభవము
అపొస్తలుల కార్యములు 1:12-14
అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,
వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు. వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.

1. మేడ గదిలో షూనేమీయురాలైన స్త్రీ దైవజనుడైన ఎలీషా ద్వారా పొందిన ఆశీర్వాద అనుభవం.
ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను.2రాజులు 4:8-11
 
2.మేడ గదిలో దైవజనుడైన ఏలీయా ద్వారా చనిపోయిన కుమారుని తిరిగి పొందిన అనుభవం
అటుతరువాత ఆ యింటి యజ మానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను. ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి 1రాజులు 17-19

3. మేడ గదిలో దానియేలు శోధనలో దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించిన అనుభవం
ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. దానియేలు 6:10

4.తబితా అను ఒక శిష్యురాలు చని పోగా మేడ గదిలో పేతురు ప్రార్థన చేసి లెమ్మనగా ఆమె కన్నులు తెరచిన అనుభవం
మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.
ఆ దినములయందామె కాయిలాపడి చని పోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగితబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అపొస్తలుల 9:36-39

5. యేసయ్యతో శిష్యులు మేడ గదిలో సిద్ధపటు కలిగిన అనుభవం
 అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. 
మార్కు 14:15

మేడ గది నుండి పడిపోయిన అనుభవములు:-

1.మేడ గదిలో అహజ్యా అను రాజు దేవుని వెదికే అవకాశం కోల్పోయిన అనుభవం
అహజ్యా షోమ్రో నులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియైమీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయిఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా 2రాజులు 1:2

2.మేడ గది నుండి దావీదు పాపములోనికి పడిపోయిన అనుభవం
ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను. 2సమూయేలు 11:2

3.మేడ గది నుండి ఐతుకు అను యవ్వనస్తుడు నిద్ర, నిర్లక్ష్యం,అశ్రద్ద వలన శోధనలో పడిపోయిన అనుభవం
మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.
అప్పుడు ఐతుకు అను నొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై 
అపొస్తలు 20:8-9

మేడ గది గురించి యేసు ప్రభు వారు చెప్పిన హెచ్చరిక
మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు;  
మత్తయి 24:17
పాపమును విడిచి దిన దినము దేవునిలో ఎదిగే వారీగా, పోగొట్టుకొనిన విశ్వాసమును , ఆశీర్వాదములను పొందే బిడ్డలుగా మేడ గది అనుభవము కలిగి ఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

*****************************************************************************


 
ఆదివారము ఆరాధన Message By
దైవసేవకులు పాస్టర్ ఆనంద వరంగారు
22/04/2018 BAPTIST CHURCH AKKAYYAPALEM
Response : psalms :120
Andhra Christava Songs 8,93,688,614

Topic : శ్రమ
1.శారీరక శ్రమ
2.యేసు ప్రభువు వారు పడిన శ్రమ -  ఆధ్యాత్మిక శ్రమ
3. దేవుని మరచు వారికీ దేవుని కోపాగ్నికి గురైన శ్రమ
 
యెషయా గ్రంథము 30:1-5
1 యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురు
2 వారు నా నోటి మాట విచారణచేయక ఫరోబలముచేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తునీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయా ణము చేయుదురు.
3 ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
4 యాకోబువారి అధిపతులు సోయనులో కనబడునప్పుడు వారి రాయబారులు హానేసులో ప్రవేశించునప్పుడు
5 వారందరును తమకు అక్కరకు రాక యే సహాయ మునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు

ఎవరికి శ్రమ ?
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి? సామెతలు 23:29

1.లోబడని దేవుని పిల్ల లకు శ్రమ .
యెహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనునట్లుగా వారు నన్ను అడుగక ఆలోచనచేయుదురు నా ఆత్మ నియమింపని సంధిచేసికొందురుయెషయా 30:1
 
2. సృజించినవానితో వాదించువానికి శ్రమ.
మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయు చున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? యెషయా 45:9
 
3.చెడుతనము జరిగించు వారికీ శ్రమ
ఇంతగా చెడుతనము జరిగించి నందుకు నీకు శ్రమ నీకు శ్రమ; యిదే ప్రభువైన యెహోవా వాక్కు.యెహెజ్కేలు 16:23

4.దుష్క్యార్యము చేయు వారికీ శ్రమ
మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. మీకా 2:1

తనది కానీ దాని కోసం ఆశించు వారికీ శ్రమ
తనదికాని దాని నాక్ర మించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. హబక్కూకు  2:6

దేవుని గురించిన ధ్యానం చేస్తే హృదయం తృప్తి పడుతుంది
 
5.గొఱ్ఱలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ
యెహోవా వాక్కు ఇదేనా మందలో చేరిన... గొఱ్ఱలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.యిర్మీయా23:1

6.అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ
అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. మత్తయి 18:7

7.సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ
నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 1కొరింథీ 9:16

 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

****************************************************************************
29/04/2018
ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు: 24
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు   6,315,441,616
దైవసేవకులు పాస్టర్ M.ఆనంద వరంగారు

Topic: ఏలీయా-ఎలీషా ఆత్మీయ  అనుభవము

2రాజులు 2:1-7
1 యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీ షాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా
2 ఏలీయాయెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషాయెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.
3 బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగు దును,మీరు ఊరకుండుడనెను.
4 పిమ్మట ఏలీయాఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.
5 యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగు దువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగుదును మీరు ఊరకుండుడ నెను.
6 అంతట ఏలీయాయెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడుయెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.
7 ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి.

**దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు
**ఆలాగుననే దేవుడు ఏలీయాను పిలుస్తున్నాడు
**ఏలీయా యేసు ప్రభు వారికీ సాదృశ్యంగ  ఉన్నారు
**ఏలీషా సంఘమునకు సాదృశ్యంగ ఉన్నారు

ఏలీయా -  ఏలీషా కలయిక
ఏలీయా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను. ఏలీయా అతని చేర బోయి తన దుప్పటి అతనిమీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తినేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబ డించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడుపోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందు కతడు అతనిని విడిచి వెళ్లి కాడి యెడ్లను తీసి, వధించి వాటిమాంసమును గొర్తినొగల చేత వంటచేసి జనులకు వడ్డిం చెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను. 1రాజులు 19:19-21

ఏలీయా -  ఏలీషా నాలుగు ప్రదేశాలు - నాలుగు అనుభవాలు

1.గిల్గాలు అనగా ఐగుప్తు అవమానము తొలగించినది అని అర్ధం
అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు. యెహొషువ 5:9

**సమస్యలు శోధనలు అవమానాలు బానిసత్వము అనే అనుభవమునకు సాదృశ్యం
**అవమానం తొలగింపబడిన అనుభవం కలిగి ఉండాలి
 
2.బేతేలు అనగా దేవుని యొక్క గృహము అని అర్ధం
భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;
పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను.  
ఆదికాండము 28:17-19 
 
**దేవుని గృహం అంటే దేవుని సంఘము** 

దేవుని సంఘములో ఎలా ఉండాలి
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸ నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది  1తిమోతి 3:15

**అవమానం తొలగింపబడిన తరువాత దేవుని గృహం అనే సంఘమునకు తీసువచ్చారు
**దేవుని సంఘములో చేర్చబడే అనుభవం కలిగి ఉండాలి
**దేవుని సంఘములో గడిపే అనుభవం కలిగి ఉండాలి

3.యెరికో అనగా ఈత చెట్ల పట్టణం, ఇది స్తుతికి సూచన
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.  
యెహొషువ 6:20

పౌలును సీలయు స్తుతి అనుభవం
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అపొస్తలు 16:25

**ఈత చెట్లు దేవుని స్తుతించుటకు ఉపయోగిస్తారు
**దేవుడు మనలను స్తుతించుటకు ఏర్పాటు చేసుకున్నాడు
**దేవుని యందు స్తుతి అనుభవం కలిగి ఉండాలి

4.యొర్దాను అనగా రక్షణ అనుభవం అని అర్ధం
మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసికొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి  ఒంటిమీదినుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టిఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి యొడ్డునకు నడిచిపోయెను.  2రాజులు 2:13-14

**యొర్దాను యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్న ప్రదేశం
**యొర్దాను అనగా బాప్తీస్మంనకు సూచన
**యొర్దాను అనగా దేవుని పరిశుద్దాత్మ అనుభవానికి సూచన  

ఈ నాలుగు అనుభవములు మన జీవితంలో కలిగి ఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్