11-21శ్రమదినములు2018

LENT DAY 11
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
26/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today Topic : కుష్టు వ్యాధి(పాపము) నుండి విడుదల

మత్తయి8:1-4
ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. 
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను.
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను
               
కుష్టు వ్యాధి లక్షణములు:-
 1.స్పర్శ తెలియకుండుట 
 2.అసహ్యముగా కనబడుట  
 3.అంటువ్యాధి

కుష్టు వ్యాధి పాపానికి సాదృశ్యం

1.పాపంలో స్పర్శ తెలియకుండుట దేవునికి దూరం చేయుటకు సాదృశ్యం గా ఉంది

ప్రకటన గ్రంథం 3:16
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను

2.పాపం దేవునికి అసహ్యం కలిగించుటకు సాదృశ్యం గా ఉంది
ప్రకటన గ్రంథము 21:8
 పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.

3.పాపం దేవునిద్రుష్టికి అంటువ్యాధికి  సాదృశ్యంగా ఉంది 
(మన పాప ములు కడుగుకొనవలిసిన వారమై ఉన్నాము )

ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కిప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.  మత్తయి 8:2

ప్రకటన గ్రంథము 7:13-14
పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.

మనము దేవుని ప్రేమించు వారీగా ఉండాలని పాపానికి దూరంగా ఉండాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

 ***************************************************************************************************

 LENT DAY 12
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
27/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Today Topic : శతాధిపతి సేవకునికి స్వస్థత
 
మత్తయి 8:5-13
అంతట యేసుఇక వెళ్ళుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.

పక్షవాయువు లక్షణములు:- 
1.శరీరము సహకరించకుండుట   
2.మాట్లాడలేక పోవుట
3.స్వస్థత కష్టం

ఆధ్యాత్మిక పక్షవాయువు లక్షణములు:- 
1. ఆధ్యాత్మికతలో దేవుని లెక్కచేయకుండుట.
2. దేవునిలో  ప్రార్థన జీవితం లేకపోవుట
3.దేవునిలో ఆధ్యాత్మిక స్వస్థత లేకపోవుట

శతాధిపతి యొక్క నాలుగు క్రీయలు:-   
1.శతాధిపతి హోదాను విడిచి యేసు వద్దకు వచ్చుట 
2.శతాధిపతి సేవకునికి కొరకు వేడుకొనుట 
3.శతాధిపతి తనను తాను తగ్గించుకొనుట 
4.శతాధిపతి యేసును స్వస్థపరచమని అడుగుట

1.శతాధిపతి దేవుని ఆశ్రయించుట ఆధ్యాత్మికతలో  
దేవునికి దగ్గరవుటకు సాదృశ్యంగా ఉంది.
ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి (మత్తయి 8:5)

దేవుని ఆశ్రయించు వారీగా ఉండాలి.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. (2కోరింథీయులకు 10:17)

2.శతాధిపతి సేవకునికి కొరకు వేడుకొనుట ఇతరుల కొరకు దేవునికి  మోర పెట్టువారికీ (ప్రార్థన) సాదృశ్యంగా ఉంది
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. (మత్తయి 8:6)
 అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. (అపొస్తలు కార్యములు 2:21)

3.శతాధిపతి దాసుడు కొరకు వచ్చుట దేవుని యెడల తగ్గింపు కలిగి ఉండుటకు సాదృశ్యంగా ఉంది
ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను (మత్తయి 8:8)

దేవుని యొక్క తగ్గింపు
మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. (యెషయా 53:5)

4.శతాధిపతి యేసును స్వస్థపరచమని అడుగుట
దేవుని యెడల గొప్ప విశ్వాసం కలిగిఉండుటకు సాదృశ్యంగా ఉంది.
ప్ర తీ విషయములో దేవుని యెడల గొప్ప విశ్వాసం కలిగిఉండు వారీగా ఉండాలి
యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచిఇశ్రా యేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. (మత్తయి 8:10)

దేవుని యెడల గొప్ప విశ్వాసం కలిగిఉండుట.
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. (1కోరింథీయులకు 8:6)

అట్టి కృప మన అందరికి దేవుడు అందించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
 
*************************************************************
LENT DAY 13
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
28/02/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic: యేసుని వెంబడించుట
మత్తయి 8:18-22
18 యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
19 అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను.
20 అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
21 శిష్యులలో మరియొకడుప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా
22 యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.

పరలోక రాజ్యం కొరకు నిత్యత్వం కొరకు యేసుని వెంబడించువారీగా ఉండాలి. 
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును. (మత్తయి6:33)

యేసుని వెంబడించుట:-
 
1. పాపమూ చెడును విడిచిపెట్టి తనను తాను ఉపేక్షించుకొని యేసుని వెంబడించుట.
అప్పుడు యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, (మత్తయి16:24)

2.ఆధ్యాత్మిక చీకటిని విడిచిపెట్టి యేసుని వెంబడించుట
12 మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. (యోహాను 8:12)

3.ధనము విడిచిపెట్టి యేసుని వెంబడించుట
22 యేసు వినినీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమి్మ బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.
25 ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. (లూకా 18:22,25)

4.దేవుని మహిమ పరచుచు యేసుని వెంబడించుట
వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబ డించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. 
(లూకా 18:43)

5.దేవుని స్వరం విని యేసుని వెంబడించుట
మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.  (యోహాను 8:12)

6.శ్రమలు,అపనిందలు,అవమానాలు, విడిచిపెట్టి సిలువనెత్తి కొని యేసుని వెంబడించుట
తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను. (మత్తయి16:24)
 దేవునికొరకు శ్రమలు,అపనిందలు, అవమానాలు, విడిచిపెట్టి సిలువనెత్తి కొనిన 
 ఒక యువతీ FOLLOW LINK FOR DETAILS

 https://en.wikipedia.org/wiki/Blandina

దేవుని ప్రేమించు వారీగా ఉండాలని ఆశిస్తూ. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

****************************************************************
 LENT DAY 14
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
01/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic: యేసు పయనించిన ఓడ
verses: మత్తయి 8:23-27

23 ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.
24 అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా
25 వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.

1.యేసు దోనెలో(మనలో) ఉండి భోదించుట.

ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను. (లూకా 5:3)

2.యేసులో సమృద్ధి ,ఆశీర్వాదం కలుగుట.

ఆయన బోధించుట చాలించిన తరువాతనీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.  (లూకా 5:4-5)
 
3.యేసును పడవలో ఆహ్వానించు వారీగా ఉండాలి, పడవ మానవునికి సూచన.

ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.  (మత్తయి 8:23)

4.సముద్రము అనే లోకంలో యేసుతో జీవించు వారీగా ఉండాలి, సముద్రం లోకానికి సూచన.

అందుకాయనఅల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. (మత్తయి 8:26)

5.యేసు ద్వారా శోధన జయించు వారీగా ఉండాలి, యేసు గద్దించిన గాలి శోధనకు సూచనా.

అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చిప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.  ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి. (మత్తయి 8:24-25,27)

4.యేసు ఉంటె శాంతి సమాధానం దైర్యం క్షేమం రక్షణనకు 
సూచనా
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. (కీర్తనలు 23:1-2)
 
****************************************************************************************

 LENT DAY 15
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
02/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : దెయ్యం పట్టిన వాని స్వస్థత

మత్తయి 8:28-34
28 ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
29 వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
30 వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా
31 ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్ల గొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. 

ఒక దెయ్యం పట్టిన వాని పరిస్థితి:-

1.నివాస స్థలం సమాధులలో అడవులలో
ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.మార్కు 5:2

2.వస్త్రములు కానకుండుట దిగంబరత్వం
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు. లూకా 8:27

3.గాయపరచుట, గాయపరచుకొనుట
పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. 5 వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు,  తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. మార్కు 5:4-5
  
4.కేకలు వేయుట అల్లరి చేయుట
వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి. మత్తయి 8:29

దెయ్యం నుండి విడుదల తరువాత పరిస్థితి:-
1.స్వస్థత కలిగిఉండుట
జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయ పడిరి. మార్కు 5:15

2.వస్త్రములు ధరించుకొనుట
జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించు కొని, మార్కు 5:15

3.యేసుతో ఉండుటకు ఇష్టపడుట
ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని మార్కు 5:18

4.యేసు చేసిన ఆశ్చర్య కార్యములు ప్రకటించుట
ఆయన వానికి సెలవియ్యకనీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. మార్కు 5:19-20

ఆధ్యాత్మిక కోణంలో మన స్థలం ఎక్కడ ?
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.1 పేతురు 5:8 

1.మన స్థలం దేవుని మందిరములో నివసించే వారీగా ఉండాలి.

2.పాపమూ నుండి స్వస్థత కలిగిన వారీగా ఉండాలి

3.ఆధ్యాత్మిక రక్షణ వస్త్రం కలిగిఉండే వారీగా ఉండాలి

4.దేవుని స్తుతించే ఉండేవారిగా ఉండాలి.

5.దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు ప్రకటించువారిగా ఉండాలి.

పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.ప్రకటన గ్రంథము 7:13-14

ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
2 కొరింథీయులకు6:2

యేసు గురించి  ప్రకటించు వారీగా ఉండాలిని ఆశిస్తూ 
  
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 

**************************************************************

 LENT DAY 16
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
03/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
Topic: అధికారము 

మత్తయి 9:1-7
1 తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా 2 ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. 

1. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారము కలదు.
అయినను పాప ములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ వాడు లేచి తన యింటికి వెళ్లెను. మత్తయి 9:6-7 

2. బోధించుటకు ఖండించుటకు బుద్ధి చెప్పుటకు ఆయనకు అధికారము కలదు.
ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను. 
మత్తయి 7:29  

3. అపవిత్ర ఆత్మలను గద్దించుటకు ఆయనకు అధికారము కలదు.
అందరును విస్మయమొంది ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. మార్కు 1:27

4. తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారము కలదు.
మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను. యోహాను 5:27

5.ప్రాణము ఇచ్చుటకు తిరిగి ప్రాణము పొందుటకు ఆయనకు అధికారము కలదు.
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.  యోహాను 10:18

1.పాప క్షమాపణ కలిగిన వారీగా ఉండవలిసిన వారమై ఉన్నాము
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. రోమీయులకు3:23

2.అయన బిడ్డలుగా గొప్పవిశ్వాసము కలిగి ఉండవలిసిన వారమై ఉన్నాము
యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు
గలతీయులకు 3:26

3.అయన వలే పరిశుద్ధులునై ఉండవలిసిన వారమై ఉన్నాము
ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. 
 ప్రకటన 20:6

4.అయన రక్షణ వస్త్రం కలిగి ఉండవలిసిన వారమై ఉన్నాము
అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. మత్తయి28:18

దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

************************************************************** 
  LENT DAY 17

సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
05/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : కనికరము
మత్తయి 9:35-38
35 యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామములయందును సంచారము చేసెను.
36 ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
37 ​కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
38 గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.

దేవుడు మన మీద  కనికరపడునట్లు మనము ఇతరుల కనికరం పడవలసిన వారిగా యుండుడి.
కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి.లూకా 6:36

దేవుని కనికరమునకు సాదృశ్యములు:-

1. రోగుల మీద కనికరం పడుట,
ఆయన వచ్చి ఆ గొప్ప సమూహ మును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.మత్తయి 14:14 

2.కుష్టు రోగము గలవని మీద కనికరం పడుట,
 ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టినాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. మార్ 1:41

3.విధవరాలు మీద కనికరం పడుట,
ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. లూకా 7:13

4.కాపరి లేమి వలన కనికరం పడుట,
ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి మత్తయి 9:36

5.ఆకలి గొనువారి మీద కనికరం పడుట,
అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్చ మత్తయి 15:32

6.దేవుని యందు భయభక్తులు గల వారి మీద కనికరపడుట
తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. కీర్తనల  103:13

దేవుని కనికరం మంచి ఫలములతోను నిండుకొనినది
అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన యాకోబు 3:17

దేవుడు కనికరము చూపుటయందు సంతోషించువాడు
తన స్వాస్థ్య ములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడ వైన నీతోసముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మీకా 7:18 

దేవుడు మన మీద  కనికరపడునట్లు మనము ఇతరుల కనికరం పడవలసిన వారి గా ఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును  గాక ఆమెన్
****************************************************************
LENT DAY 18
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
06/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : గొప్పవాడు
మత్తయి 11:7-9
7 వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?
8 ​సన్నపు బట్టలు ధరించుకొన్న మనుష్యునా? ఇదిగోసన్నపు బట్టలు ధరించుకొనువారు రాజగృహములలో నుందురు గదా. 

మన ప్రభువు గొప్పవాడు.
మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
కీర్తనల 147:5

1.మన ప్రభువు  ప్రవక్తలు కంటే గొప్పవాడు
మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. మత్తయి 11:9
మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి. యోహాను 8:53
 అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.  యోహాను 8:54

2.మన ప్రభువు అబ్రాహాము కంటే గొప్పవాడు
యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను యోహాను 8:58-59

3.మన ప్రభువు యాకోబు కంటే గొప్పవాడు
తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యోహాను 8: 12-14

3.మన ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడు
విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
మత్తయి 12:42

5.మన ప్రభువు దేవాలయము కంటే గొప్పవాడు
దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
మత్తయి 12:6

6.మన ప్రభువు యోనా కంటే గొప్పవాడు
యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.
మత్తయి 12:40

మన ప్రభువు జ్ఞానమునకు మూలాధారము
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. యాకోబు  1:5

మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభువు గొప్ప వాడు
అయనను ప్రేమించు వారీగా ఆశీర్వదింపబడే వారుగా ఉండాలని ఆశిస్తూ

దేవునికి మహిమ కలుగును గాక
*****************************************************************
LENT DAY 19
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
07/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : నేను మీకు విశ్రాంతి కలుగజేతును

మత్తయి 11:25-30
25 ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.
26 అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
27 సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశిం చునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. 

మన ప్రభువు శాంతి, విశ్రాంతి, నెమ్మది, సమాధానము కలుగజేయువాడు

1.మన ప్రభువు శారీరక విశ్రాంతి కలుగజేయువాడు
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. మత్తయి 11:28

2. మన ప్రభువు మానసిక విశ్రాంతి కలుగజేయువాడు
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు. యెషయా  26:3

3. మన ప్రభువు ఆత్మకు విశ్రాంతి కలుగజేయువాడు
అంతట ఇప్పటినుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదుం ప్రకటన 14:13

మన ప్రభువు యందు నించి యుండుడి
నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. యోహాను 6:56

మన ప్రభువు ఉత్తముడు
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనల 34:8

మన ప్రభువు నెమ్మది కలుగజేయువాడు
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుమార్గ ములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారుమేము అందులో నడుచుకొనమని చెప్పు చున్నారు. యిర్మీయా  6:16

యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించె దను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి 
కీర్తనల 146:1-3

మన ప్రభువు శాంతి, విశ్రాంతి, నెమ్మది, సమాధానము కలుగజేయువాడు

దేవునికి మహిమ కలుగును  గాక ఆమెన్

*******************************************************
LENT DAY 20
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
08/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : దేవుని కుమారుడు
మత్తయి 11:13-16
13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
14 వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
15 అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
16 అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
1.మన ప్రభువు దేవుని ప్రియమైన కుమారుడు
మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. మత్తయి 3:17

తండ్రి చిత్తం చేయుట
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. యోహాను 5:19

నేను తండ్రి ఏకమైయున్నాము
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యోహాను 10:30

కుమారుని ద్వారా తండ్రి మహిమ పరచబడుట
మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను 14:13
2.ప్రాణము పెట్టిన కుమారుడు

తండ్రి కుమారుని బంధించుటకు అప్పగించెను
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. యెషయా 53:4

మన అందరి దోషములు కుమారుని మీద వేసెను
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.  
యెషయా 53:6

కుమారుని నాలుగగొట్టుటకు తండ్రి కి ఇష్టమాయెను
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.యెషయా 53:10

మనం నశియించక నిత్యజీవము పొందునట్లు కుమారుని అనుగ్రహించెను
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.యోహాను 3:16

మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు కుమారుని పంపెను
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 
1 యోహాను 4:10

కుమారుని రక్తం ద్వారా తండ్రి తో సమాధానం కలుగుటకు
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. రోమా5:10

అటువంటి కుమారుడు రక్షకుడు యేసయ్య కావాలంటే ఏంచేయాలి
1.యేసుని విశ్వసించాలి  
యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.గలతీయులు3:26

2.యేసుని అంగీకరించాలి అయన మార్గం లో నడవాలి
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 1యోహాను 5:11-12

అటువంటి కుమారుడు రక్షకుడు యేసయ్యతోఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును  గాక ఆమెన్

******************************************************
LENT DAY 21
సిలువ శ్రమ దిన ధ్యాన ప్రసంగములు
by పాస్టర్ ఆనందవరం గారు
08/03/2018 Baptist Church అక్కయ్యపాలెం
 Topic : దేవుని కుమారుడు
మత్తయి 11:13-16
13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా
14 వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.
15 అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
16 అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.
1.మన ప్రభువు దేవుని ప్రియమైన కుమారుడు
మరియుఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. మత్తయి 3:17

తండ్రి చిత్తం చేయుట
కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. యోహాను 5:19

నేను తండ్రి ఏకమైయున్నాము
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యోహాను 10:30

కుమారుని ద్వారా తండ్రి మహిమ పరచబడుట
మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను 14:13
2.ప్రాణము పెట్టిన కుమారుడు

తండ్రి కుమారుని బంధించుటకు అప్పగించెను
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. యెషయా 53:4

మన అందరి దోషములు కుమారుని మీద వేసెను
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.  
యెషయా 53:6

కుమారుని నాలుగగొట్టుటకు తండ్రి కి ఇష్టమాయెను
అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును.యెషయా 53:10

మనం నశియించక నిత్యజీవము పొందునట్లు కుమారుని అనుగ్రహించెను
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.యోహాను 3:16

మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు కుమారుని పంపెను
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 
1 యోహాను 4:10

కుమారుని రక్తం ద్వారా తండ్రి తో సమాధానం కలుగుటకు
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. రోమా5:10

అటువంటి కుమారుడు రక్షకుడు యేసయ్య కావాలంటే ఏంచేయాలి
1.యేసుని విశ్వసించాలి  
యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.గలతీయులు3:26

2.యేసుని అంగీకరించాలి అయన మార్గం లో నడవాలి
దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 1యోహాను 5:11-12

అటువంటి కుమారుడు రక్షకుడు యేసయ్యతోఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును  గాక ఆమెన్