July 2020 Messages

 05July2020

ఆదివారము ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : నేర్చుకోనుడి

మత్తయి సువార్త 11: 29-30 నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడిఅప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 

చదవబడిన వాక్యభాగాములో యేసుప్రభువారు మనకు చెప్తున్న ఒక అమూల్యమైన మాట నా యెద్ద  నేర్చుకొనుడి, ఈరోజున మనం ధ్యానించుకాబోయే అంశం నేర్చుకొనుడి, సాధారణంగా పిల్లలైన వారు అనేక విషయాలను చదువు ద్వార మరియు మనుష్యలు ద్వార అనేకమైన విషయాలు నేర్చుకొంటారు. తల్లి తండ్రుల పట్ల ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, అలాగుననే ఉపాధ్యాయుల పట్ల, దేశం పట్ల ఎలా ఉండాలో నేర్చుకుంటారు. బైబిల్ కూడా అదే చెప్తుంది బాలుడు నడువవలసిన త్రోవను వారికీ నేర్పుము. ఐతే మనం మనుష్యుల దగ్గర వినుట ద్వార, చదువుకోవడం ద్వార అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకొనే అంశాలు ఉంటాయి కానీ అవి పరిపూర్ణంగా ఉండకపోవోచ్చు, మరియు వాటిలో కొన్ని మన జీవనానికి ఉపయోగపడేవి కావొచ్చు. కానీ యేసయ్య నేర్చుకున్న సత్యాలు భవిష్యత్తులో మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి., అవి పరలోక రాజ్యమును అనుగ్రహించేవి. అ మాటను ఒకసారి మనం చుస్తే యేసు ప్రభువారి మనకు చెప్తున్నమాట నా యొద్దకు వచ్చి నేర్చుకోనుడి. 

మనం అయన యొద్దకు వచ్చి ఏమి నేర్చుకోవాలి అని అంటే  
మనం ఈరోజున ఎలా జీవించాలో నేర్చుకోవాలి, మన జీవితానికి సంభందించి ఎలా నడచుకోవాలో నేర్చుకోవాలి. ఎందుకు అని అంటే మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును అని యేసుప్రభువారు మనకు చెప్తున్నారు. 

ఒక దైవజనుడు ఒక విశ్వాసి ఐన ఒక రైతు దగ్గరకు వెళ్ళడం జరిగింది, అయన భూమి సేద్యపరచుట చూచి అయన నుండి నలుగు విషయాలను అయన నేర్చుకున్నాడు. మొదటిది ఎద్దు యొక్క పాదాలకు ఇనుప కళ్లములను వేస్తున్నాడు, దానిని చూచి ఆ దైవజనునికి చాల ఆశ్చర్యమనిపించింది. ఈ ఇనుప కళ్లములను మేకులతో తన ఎద్దులకు కొట్టాడు. అప్పుడు ఆ రైతును అయన ఎందుకు ఇనుప కళ్లములను మేకులతో అలా ఎద్దును కొడుతున్నారు అని అడిగినపుడు, అ రైతు ఇలా చేయడం వాళ్ళ ఆది అడుగులు వేసినపుడు ఆ ఇనుప కడ్డిల వలన శక్తి కలిగి ఆప్పుడు ఎద్దుకు బలం వస్తుంది దాని కొరకు వేయడం జరుగుతుంది అని చెప్పాడు. అది చూసినపుడు ఆయనకు దేవుని వాక్యం గుర్తుకు వచ్చింది సువార్తను ప్రకటించువారి పాదాలు సుందరముగా ఉంటాయి. నిజమే ప్రియులారా బీడుబారిన ఈ ప్రపంచాన్ని, బీడుబారిన సంఘాలను సాగుచేయడానికి దేవుని సువార్తను చేయడానికి మన పాదాలు పరుగు పెట్టాలి. మన పాదాలు పరుగు పెట్టాలి అని అంటే మన పాదాలు బలపరచాలి., మన పాదాలు బలపడాలి అని అంటే సువార్త కొరకై దేవుని పని కొరకై ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరికి కుడా మన ప్రభువారు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు అను సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలసి పోకుండా దేవుని చేయడానికి దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. రెండవదిగా ఆ రైతు ఆ ఎద్దు మీద ఒక బరువైన ఒక కాడిని పెట్టాడు.         

అసలు ఈ కాడి అంటే ఏమిటి?
ఈ కాడి అనేది దాసత్వమునకు సూచనాగా ఉన్నది, ప్రభువారు అంటున్నారు మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి.అంటే ప్రభువు దగ్గర ఆ కాడి ఉంది ఆ కాడిని మనం ఎత్తుకొని మోస్తూ అయన దగ్గర నేర్చుకోవాలి. ఈ కాడి అనేది బానిసత్వమునకు సూచనా, మనం పూర్తిగా ఆయనకు దాసులమై జీవించాలి అని దాని అర్ధం. 

1.దాసత్వమనే కాడి.
పరిశుద్ద గ్రంధములో సోలోమన్ తరువాత అతని కుమారుడైన రెహబాము రాజు దగ్గరకు వచ్చి తన ప్రజలైన వారు చెప్తున్నా మాటలను మనం చుస్తే  

1రాజులు12:4 నీ తండ్రి బరువైన కాడిని మామీద ఉంచెనునీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మామీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసినయెడల మేము నీకు సేవ చేయుదుము.

ఈ కాడి బానిసత్వమునకు సూచనగా ఉన్నది, కఠినమైన పనులతో కూడుకోనినదిగా ఉన్నది. ఈ కాడి బరువైనది దాస్యము అనే కాడి. అలాగున ఇశ్రాయేలు ప్రజలైనవారు ఆ కాడిని సులువు చేయమని ఆ రెహబాము రాజును అడిగారు. అప్పుడు ఆ రాజు మరింత బానిసత్వమును చేయమని వారికీ చెప్పినపుడు వారు మరింత బాధపడ్డారు. 

2.పాపమనే దాసత్వము ఇది కుడా ఒక కాడి లాంటిది ఈ కాడిని విడిచి పెట్టాలి.
గలతీయులకు 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిక్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టిమీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి.

మనుష్యులు ఈ పాపమనే కాడిని రోజు, రోజుకు మూటకట్టుకొని మోస్తూ ఉంటున్నారు. అది మనలను కూలబెడుతుంది, అది మనలను నాశనం చేస్తుంది. అందుకే మనం పాపమనే కాడిని, పాపమనే భానిసత్వమును మనము విరగ గొట్టుకొని, యేసుప్రభువారు దగర ఒక కాడి ఉంది అది అయన ఇచ్చే ఉచితముగా ఇచ్చే రక్షణ, నిత్య జీవమును, పొందుకోవడానికి ప్రయత్నించాలి. అది మనలను పాపమును నుండి విమోచిస్తుంది. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రభువారు విడిపించిన పాపమనే కాడిని విడిచి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే యేసుప్రభువారి దగ్గరికి వచ్చిన పాపపు స్త్రీని మరల పాపమూ చేయవద్దని చెప్పారు. 

3.యవ్వనకాలమున సేవ భారము అనే కాడిని మనం మోయాలి.  
విలాపవాక్యములు ౩:27 యవ్వనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

దేవుని పని ఏదైనా అది ఇష్టముగా చేయాలి, అది బరువుగా తలచరాదు. ఇది నా ప్రభువు కొరకు నేను చేసే ఒక భాద్యతగా మనం చేయాలి. ఒక పొలమును దున్నడానికి మంచి యవ్వన శక్తి కలిగిన ఎద్దులను ఎన్నుకొంటారు కానీ వయసు మళ్ళిన వాటిని ఎన్నుకోరు. ఈరోజున ఎంతమంది యవ్వనకాలమున దేవుని సేవను చేయుటకు ఇష్టపడుచున్నారు, ప్రియ యవ్వనస్తులరా ఆలోచించుకోవాలి. గమనించండి ప్రియులారా యేసయ్య ఎప్పుడు సేవచేసారు., “యవ్వన కాలంలోనే” అలోచించుకోనుడి., ప్రియులారా యవ్వన వయసులోనే మనం దేవునికి సేవ చేయువారిగా ఉండాలి. దేవుని సేవకు మించిన గొప్ప పని ఈ లోకంలో ఏది లేదు. ప్రియులారా యవ్వనకాలంలోనే అయన కాడిని మనం ఎత్తుకోవాలి, యవ్వనకాలంలోనే అయన భారాన్ని భరించే వారిగా మనం ఉండాలి.  ఈ రోజున ఎంతోమంది ఆయనను తెలుసుకోలేనివారు ఉన్నారు. అందుకే మనం దేవుని కొరకు బలంగా సేవ చేయువారిగా ఉండాలి, అలాంటి వారు దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు.

4.ఆ రైతుదగ్గర నేర్చుకున్న మరియొక అంశం ఏమిటి అని అంటే ఆ యెద్దుమీద కాడిని వేయుట
ఈ కాడి దేనికి సూచనా అని అంటే తగ్గింపునకు సూచనా, ఈ కాడి దీన మనస్సునకు సూచనా, ఇది విధేయతకు సూచనా. ఈరోజున ప్రభువారి దగ్గర మనం విదేయులమై ఉండాలి. ఆ భరువైన కాడి ఆ ఎద్దు మీద ఉంచినపుడు అది తలవంచింది, మనం ఎంతటి వారమైన ఈరోజున మనం తలవంచే వారిగా ఉండాలి దేనికి అని అంటే ఈలోకానికి కాదు గాని, మన ప్రభువు దగ్గర తలవంచే వారిగా ఉండాలి. మనం దేవునికి లోబడు వారిగా ఉండాలి. మనం సాత్వికము కలిగి, దీనమనస్సు కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే ప్రభువు అంటాడు, నేను సాత్వికుడును , దీనమనస్సు కలిగినవాడును. ఈరోజున మనము అటువంటి దీనత్వమును నేర్చుకోవాలి, సాత్వికమును మనం నేర్చుకోవాలి.  

5. తరువాత ఆ రైతు ఆ ఎద్దుకు చిక్కమును పెట్టాడు.
ఈ చిక్కమును గూర్చి దేవుని వాక్యములో మనం గమనిస్తే
కీర్తనల గ్రంథము 39:1 నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.

వ్యర్ధమైన మాటలు మాట్లాడుకుండా, అనవసరమైన మాటలు మాట్లాడుకుండా ఈరోజున మనము కుడా మన నోటికి చిక్కము వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులలో మనం ఇటువంటి చిక్కమునే ధరిస్తున్నాము. ఒక వేళ మనం మాట్లాడితే నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 

దేనికి చిక్కము పెట్టుకోవాలి అని అంటే మనం మాట్లాడే ముందు చిక్కము పెట్టుకోవాలి
యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారామీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడునుమాటలాడుటకు నిదానించువాడునుకోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.

మనం వినుటకు వేగిరపడాలి, మనం అలోచించి జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి.  

దేనికి చిక్కము పెట్టుకోవాలి అని అంటే తిండి విషయంలో చిక్కము పెట్టుకోవాలి.
సామెతలు 23:2 నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

6.తరువాత ఆ ఎద్దు ముక్కు తాడును వేశాడు., ఒక కర్రను పట్టుకున్నాడు
ముక్కు తాడు ఎందుకు అని అంటే అది అటు ఇటు వెళ్తే సరిచేయడానికి, దేవుడు కూడా మనం అటు ఇటు వెళ్తే మనలను సరిచేస్తూ ఉంటాడు, శిక్షకు కొన్ని సార్లు అనుమతిస్తాడు.  

తరువాత ఒక ముళ్ళతో కూడిన ఒక కర్రను పట్టుకున్నాడు, దేనికి ఆ కర్ర అని అంటే ఒకవ వేళ ఎన్ని చేసిన అది మాట వినక పొతే ఉపయోగించడానికే ఈ కర్ర. 

అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుడు కూడా మనం ఎన్ని సార్లు మాట చెప్పిన, గద్దించిన ఎవరిని లెక్క చేయక మాట వినక పొతే వాడు నాశనమగును అని
సామెతలు 29:1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

ఈరోజున దేవుని మాటలను విని మనలో పశ్చాతాపం కలిగి జీవించాలి. ఆయనే మనలను తప్పించువాడు.  

ఈరోజున మనం నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే
1.ఆ ఎద్దు కాళ్ళకు ఇనుప మేకులు నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే మొదటిలో దానికి భారంగా ఉంటుంది గాని తరువాత అది బలం కలిగి ఉంటుంది, అలాగుననే మనం దేవుని సేవలో భారమైన దేవునిలో బలంగా వాడబడాలి.   

2. ఆ ఎద్దు భుజం మీద కాడి నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే తలవంచుకొని దేవునికి లోబడాలి. 

౩. ఆ ఎద్దు మూతికి చిక్కము మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే మాట్లాడు విషయంలో, తిండి విషయంలో చిక్కము వేసుకోని అలోచించి జాగ్రతగా మాట్లాడాలి. 

4.ఆ ఎద్దు ముక్కుతాడు నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే మనకు దేవుడు తన వాక్యం ద్వార అయన మాట్లాడుతాడు, అయన మాటను విని అటు ఇటు వెళ్ళకుండా మనలను మనం సరిచేసుకోని జీవించాలి, లేకపొతే అయన కర్ర పట్టుకొంటాడు. కావునా జాగ్రత్తగా ఉండాలి, దేవుని అ మాటలను విని ఆప్రకారం నడచుకోవాలి,

ముగింపు : అందుకే ప్రభువుకు ఈరోజున లోబడదాము, అయన కొరకు సాక్షిగా జీవిద్దము. ఆయన చెప్పినట్లుగా చేద్దాం. లెక్కలేని తనంగా ఉంటె ఈరోజున ఉన్న పరిస్తితిలా ఉంటుంది. ఈరోజున బీడుబారిపోతున్న అనేక మందిని రక్షించడానికి, ప్రభువా నీ సేవ కొరకు వాడుకొండి, అనేక మంది యవ్వనులను, యవ్వనకాలమున సేవ కొరకు వాడుకోండి. పాపమనే కాడి నుండి విడిపించిన దేవా, నీ భారమును మాపై మోపండి ప్రభువా. నీ సేవ భారమైనది కాదు ఆ సేవను ఇష్టంతో చేసే వారిగా మేము ఉండాలి. అట్టి కృప, అయన ఆశీర్వాదమును మన అందరికి అందించును గాక ఆమెన్. 

యేస్యయ ఈ మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

*********************************************************

ఆదివారం ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : మాకేమి దొరకును 


మత్తయి సువార్త 19:27 పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

చదవబడిన వాక్యములో యేసుప్రభువారిని అయన శిష్యులైనవారు ఆయన్ను వెంబడిస్తే మాకేమి దొరకును అని అడుగుచున్న ఒక మాట మనకు కనిపిస్తుంది. మానవ పాపపరిహారం కొరకు లోక రక్షకుడు వస్తాడు అయన మనలను రక్షిస్తాడు అని బాప్తిస్మము ఇచ్చు యోహాను ప్రకటిస్తూ అనేకమందిని సిద్దపరచినవాడు. యేసుప్రభువారు మీరు నా వెంబడి రండి మిమ్మలిని మనుష్యులను పట్టు జలారులుగా చేస్తాను అని చెప్పారు. మన కొరకు వచ్చిన గొప్ప దేవుడు మన యేసుప్రభువారు. ఇక్కడ వాక్య సందర్భములో పేతురు గారు యేసుప్రభువారిని మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగుచున్నట్లుగా మనం చూడవచ్చు. 

ఈ కాలంలో అనేకమంది నుండి ఇటువంటి ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. 

నిన్ను వెంబడిస్తున్నాము మాకు ఏమి ప్రయోజనం అని అనుకున్నవారు, అలాంటి ఆలోచనతో ఈరోజున అనేకమంది జీవిస్తున్నారు. అయన ద్వార ఏదైనా ఒక అవసరత, వారి యొక్క కోరిక, వారి సమస్యలు నెరవేర్చుకొనుటకు ఆయనను వెంబడిస్తున్నారు, అయన ఇచ్చిన వాగ్దనములు నెరవేర్చినవాడు, అయన అందరికి న్యాయము చేయువాడు. ఇంకా అనేక మంది ఆయనను నమ్ముకోన్నవారు ఉన్నారు. దేవుడు మనకు ఎంతో మేలులు చేయువాడు.  

అందుకే దేవుడు మానవుల కొరకు ఎంతో మేలు సిద్దపరచాడు అని కీర్తనకరుడు అంటాడు.

కీర్తనల గ్రంథము 31:19 నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు యెంతో గొప్పది నరులయెదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.   

మనలను సృజించిన పరమ తండ్రికి ఎవరికీ ఎప్పుడు ఎలా ఇవ్వాలో మన దేవునికి తెలుసు, ఎందుకు అని అంటే అయన మన కొరకు అనేకమైన వాటిని సిద్దపరచువాడు. కనుక ఆయనను ఎవ్వరును నిందించరాదు. మనం చేయవలసినది ఏమిటి అని అంటే దేవుని వాగ్దనములు నేరవేర్పు కొరకు కనిపెట్టాలి, అందుకు మనం ఎలా ఉండాలి అని అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 


ఈరోజున మనం ధ్యానించు కోబోయే అంశం మాకేమి దొరుకును, దేవుడు మనం ఆయనను వెంబడిస్తే అయన మనకు ఏమి ఇస్తాడు, దేవుని వాక్యం మనకు ఏమి చెప్తుంది అని మనం ఈరోజున ధ్యానించుకొందాము.


1.మొదటిగా ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దోరుకుతుంది అని అంటే దేవుని రాజ్యమును అయన సిద్దపరుస్తాడు

మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారారండిలోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.

సమస్తమును విడిచి ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దొరుకుతుంది అని అంటే "దేవుని రాజ్యము" మనకు దొరుకుతుంది, ప్రియులారా దేవుని రాజ్యము అముల్యమైనది, ఈ లోకరాజ్యాలు వేరు, నా రాజ్యము వేరు అని యేసుప్రభువారు పిలాతుతో అన్నారు. ఈ లోకరాజ్యాలు అన్యాయము అసూయతో నిండినవి, పగలతో, కష్టాలతో నిండినవి, కానీ మన దేవుని రాజ్యము నిత్యమూ వేలుగైనటువంటిది, ఇది శాస్వత నీతి, న్యాయములు కలిగినటువంటిది, అది చిరకాలము శాశ్వతమైనది అటువంటి దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకొంటాము.

ఎప్పుడు మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొంటాము అని ఆలోచిస్తే

అవసరమైతే అన్ని విడిచి దేవుని కంటే ఎక్కువగా దేనిని తలంచక, దేవుని యెడల భయ భక్తులు కలిగి మనము అయన చేతుల క్రింద దీనమనస్కులై ఉండాలి. అప్పుడు మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొంటాము. మనము అయన చేత ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఉండాలి, గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియుండాలి అప్పుడు మనము అయన రాజ్యమును స్వతంత్రించుకొంటాము.

అసలు ఎవరు అయన రాజ్యము అని మనం చుస్తే

ప్రకటన గ్రంథము 5:10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివిగనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

మనమే అయన రాజ్యము అని దేవుని వాక్యం చెప్తుంది, మనలను ఎవరైనా అడిగితే మనము రాజులము దేవుని చేత ఏర్పాటుచేయబడిన వారము అని చెప్పాలి. 

కనుక మనము ఎవరము, మనము ఎలా జీవించాలి అని ఆలోచిస్తే  

1పేతురు 2:అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తముఏర్పరచబడిన వంశమునురాజులైన యాజక సముహము పరిశుద్ద జనమును దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.  

దేవుని వాక్యము చెప్తుంది మనము అయన నామమును ప్రచురించే అయన బిడ్డలము, రాజులైన యాజక సముహము, పరిశుద్ద జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము, కనుక మనము ఎలా జీవించాలి అని అంటే అయన సొత్తైన ప్రజలై అయన యందు భయభక్తులు కలిగి నిత్యమూ జీవించాలి. 

అందుకు దేవుడు మనలను ఒక రాజ్యముగాను యాజకులనుగాను ఎలా చేసాడు.

ప్రకటన గ్రంథము 1:మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

దేవుడు మనలను ఒక రాజ్యముగాను యాజకులనుగాను ఎలా చేసాడు అని అంటే యేసుప్రభువారి తన రక్తము చిందించుట వలన మన పాపముల నుండి మనలను విడిపించి మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా పరలోక యజాకులుగా చేసాడు. మనము పరలో రాజులము.


2.రెండవదిగా ఆయనను వెంబడిస్తే మనకు ఏమి దోరుకుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కూర్చొనే ధన్యత ఇస్తాను అని చెప్తున్నారు

ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. 

యేసుప్రభువారు అయన ఈ లోకమును జయించారు, అందుకే అయన ఈరోజున మనకు ఏమి చెప్తున్నారు అని అంటే అయన వలే మనము కూడా ఈ లోకమును జయించే వారిగా ఉంటె మనకు ఆయనతో కూర్చునే ధన్యత ఇస్తాను అని చెప్తున్నారు. దేవుని సింహాసనమునందు కూర్చుండియున్న భాగ్యము మనకు యేసుప్రభువారు ఇస్తారు.

మనకు ఎటువంటి భాగ్యము కలుగుతుంది అని అంటే

మత్తయి సువార్త 19:28 యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.

అటువంటి భాగ్యము మనకు కావాలి అని అంటే మానవ శక్తి చాలదు మనము ఆత్మ చేత నింపబడి పరిశుద్ద ఆత్మ శక్తిని పొందుకోవాలి. అప్పుడు శాశ్వతమైన అయన సింహాసనము ఎదుట ఉండే భాగ్యము కలుగుతుంది.

అటువంటి ఆత్మ శక్తిని పొందుకోవడానికి మనము ఏమిచేయాలి 

మత్తయి 19:29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందునుఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.


3. ముడవదిగా మనము ఆయనను వెంబడిస్తే ఏమి పొందుకుంటాము అని అంటే జనుల మీద అధికారము ఇచ్చెదను అని చెప్తున్నారు.

ప్రకటన గ్రంథము 2:26 నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచుఅంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.

ఈలోకంలో అదికారము కొరకు ప్రాకులాడు వారు అనేకమంది ఉన్నారు, కానీ ఇక్కడ దేవుని వాక్యములో అదికారము అంటే ఈ లోక అదికారము కాదు గాని శాశ్వతమైన దేవుని రాజ్య అదికారము, దానికి మనము పరలోకము చేరాలి, అయన సింహాసనము ఎదుట నిలువబడాలి. అయన ఇచ్చు అధికారము పొందుకోవాలి.  

అటువంటి దేవుడు ఇచ్చు అధికారము పొందుకోవాలి అని అంటే మనము ఏ గుంపులో ఉండాలి.

కొరింథీ 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరె రుగరామీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగామిక్కిలి అల్ప మైన సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా?

అటువంటి దేవుడు ఇచ్చు అధికారము పొందుకోవాలి అని అంటే మనము పరిశుద్దుల గుంపులో ఉండాలి. రాజులైన యాజక సమూహములో ఉండాలి. అప్పుడు జనుల మీద తీర్పు తీర్చు అధికారము కలిగిన అధికారులుగా మనం ఈరోజున ఉండాలి.    


ఈలోకరాజ్యములు శాశ్వతములు కాదు, ఈ లోక సింహాసనములు శాశ్వతము కాదు , ఈలోక అధికారము శాశ్వతము కాదు గాని, శాశ్వతమైనది ఒక్కటే అది దేవుని రాజ్యము -దేవునితో ఉండే భాగ్యము, దేవుని సింహాసనము. అట్టి భాగ్యము - ప్రభువు కృప మన అందరికి అందించును గాక ఆమెన్. 


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్ 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 

 

***************************************************


19July2020

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం: నా యెద్ద కొనుడి

ప్రకటన గ్రంథము 3:18 నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమునునీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములనునీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.

చదవబడిన దేవుని వాక్యములో యేసు క్రీస్తు ప్రభువారు అయన కొన్ని వస్తువులను అయన నా యెద్ద కొనుమని చెప్తున్నారు? అయన దగ్గర అన్ని ఉచితమే ఐన కానీ ఇక్కడ అయన కొన్ని వస్తువులను అయన నా యెద్ద కొనుమని ఎవరికీ చెప్తున్నారు అని ఆలోచిస్తే? ఎవరిని అయన కొనమని చెప్తున్నారు అని అంటే ఏడు సంఘములలో ఒకటి ఐన లవోదికియ అనే సంఘమునకు చెప్తున్నారు. లవోదికియ అను పట్టణము చాల ప్రసిద్ది చెందినది, చాల ధనము కలిగినటువంటిది, చాల సంపాదన కలిగినటువంటి ఒక పట్టణము. ఈ లవోదికియ పట్టణములో ఎఫప్రా అను అపొస్తలుడైన పౌలు గారి శిష్యుడు లవోదికియ సంఘమును స్తాపించాడు. ఆ సంఘమునకు దేవుడిస్తున్న హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాము. అటువంటి ఆ పట్టణపు వారు చాల ధనము కలిగినటువంటివారు, వారు ఆ ధనమును చూసి మురిసి పోతుంటే దేవుడు వారిని గద్దిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ సంఘమును ఉద్దేశించి దేవుడు నీవు చల్లగా నైన లేవు, వెచ్చగానైనలేవు అందుకు నేను ఉమ్మివేయుచున్నాను అని హెచ్చరిస్తున్నాడు.   


ఎందుకు దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు వాక్యములో మనం చుస్తే

ప్రకటన3: 17 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగకనేను ధనవంతుడనుధనవృద్ధి చేసియున్నానునాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.

లవోదికియా మంచి పేరు పొందిన పట్టణము, మంచి సంవృద్ది కలిగిన పట్టణము, కానీ దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారు అని అంటే వారు గర్విస్తూ ఉన్నారు. ఈ సంఘము పరిస్తితి దేవుని దృష్టిలో ఎలా ఉంది అంటే నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని దేవుడు వారిని ఉద్దేశించి పలుకుచున్నారు. అందుకే దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు నా యొద్దకు వచ్చి బంగారము, తెల్లని వస్త్రము, కాటుక కొనుడి.


ఈరోజున ఎందుకు యేసుప్రభువారు నా యొద్దకు వచ్చి బంగారము, తెల్లని వస్త్రము, కాటుక కొనుడి., అని చెప్తున్నారో దేవుని వాక్యములో ధ్యానించుకొందాము.


1.మొదటిగా యేసయ్య బంగారమును నా యెద్ద కొనుడి అని చెప్తున్నారు

బంగారము చాల ప్రత్యేకమైనది, ఎంతోమంది ఇష్టపడేది, ఇది చాల వెల కలిగినటువంటిది. అందుకే పరిశుద్ద గ్రంధములో కూడా దానిని గూర్చి వ్రాయబడినది. ప్రియులారా పాత నిభందనలో మనం చుస్తే దేవుని మందిరము బంగారపు పూతతో చేసినటువంటిది అని వ్రాయబడినది.

ఐతే బైబిల్ గ్రంధములో ఈ బంగారము గూర్చి ఏమి చెప్తుంది అని మనం చుస్తే

ద్వితీయోపదేశకాండము17:17 తన హృదయము తొలగి పోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదువెండి బంగారములను అతడు తనకొరకు బహుగా విస్తరింపజేసి కొనకూడదు.   


పాత నిభందన గ్రంధములో ధనవంతులైన దేవుని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, అలాగే యెబు, అబ్రహాము అయన ఎంతో గొప్ప బంగారము కలిగినటువంటివారు. మనుష్యులైనటువంటి వారికీ ఈ బంగారము అంటే ఎంతో మక్కువ అవసరమైతే బంగారము కొరకు దేవుని కూడా పక్కకు పెట్టె వారు కూడా ఉన్నారు. ఇస్రాయేలియుల జీవితంలో బంగారు వెండి కలిగినవారు, వారు మోషే తరువాత వారందరూ తమ బంగారము తిసి దానితో ఒక విగ్ర హమును చేసి మమ్ములను రక్షించినది నీవే అనుచు దానిని పూజించి దేవుని మరచిరి అని మనం చూస్తాం.

దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి అని ఈ బంగారమును గూర్చి వాక్యములో చూడవచ్చు

యెహెజ్కేలు 28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివిమాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావునీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

బంగారముతో కట్టబడిన పరలోక పట్టణము అని పరిశుద్ద గ్రంధములో మనం చూస్తాం.

ప్రకటన గ్రంథము 21:18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెనుపట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

ప్రియులారా మనమైతే బంగారముతో కూడిన దేవుని రాజ్యము మనము స్వతంత్రించుకోవాలి.

ఐతే ఈ బంగారము అనునది దేనికి సూచనగా ఉన్నది అని మనం ఆలోచిస్తే  

యేసుప్రభువారు పుట్టినపుడు జ్ఞానులైన వారు ఆయనకు బంగారమును బోళమును సమర్పించారు, ఇక్కడ బంగారము రాజరికమునకు గుర్తు, ఇంకా దేనికి సూచనా అని అంటే సంతోషానికి గుర్తు, శాంతికి గుర్తు బంగారము. నీవు రాజువి., నీవు దేవుని బిడ్డవు అందుకే అది రాజరికమునకు సూచనా. ఈ బంగారమును ధరించగానే సంతోషము అంతే కాకుండా మనసుకు శాంతి కలుగుతుంది, ఇది శాంతికి సూచనా. ఇది ఆనందము కలుగజేసేది, ఇది ఒక ఘనతకు గుర్తు. ఘనతను తీసుకువస్తుంది ఈ బంగారము.

ఎందుకు మనం అయన యెద్ద బంగారమును కొనుక్కోవాలి, ప్రాముఖ్యముగా మనం తెలుసుకోవలసినది ఏమిటి అని ఆలోచిస్తే

ఎందుకు అని అంటే ఈ బంగారము యేసుక్రీస్తు వారికీ సూచనగా ఉన్నది. అవును ప్రియులారా కొలిమిలో పుటము వేయబడిన దానిని తిసినటువంటి ఆ బంగారమునకు ఉన్నసమస్త మలినాలు పోయి స్వచంముగా కనిపిస్తుంది. ఇది స్వచ్ఛతకు గుర్తు. మన కుడా యేసయ్య స్వచ్ఛమైనవాడు. అయన కొలిమిలో నుండి తీసినట్లుగా శ్రమలనే కొలిమిలో కాల్చబడి, నలుగగొట్టబడి, హింసించబడి, అనేక దెబ్బలు పడి, అయన ఒక శుద్ధ సువర్ణముగా మనకు కనిపిస్తున్నారు. అటువంటి సువర్ణముగా ఉన్న యేసు అనే బంగారము కలిగిన ఆ పరలోక పట్టణము అందుకే అయన గొప్ప వెలుగుతో నిండి ప్రకాశిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు అనే బంగారముతో ప్రకాశిస్తున్న కాంతి అనేక రత్నములతో కూడినది., అటువంటి యేసు ఈరోజున మనకు కావాలి, చిన్న బంగారమునకు ఎంతగా తహతహలాడుతమే, ఇంత కొండంత బంగారానికి మన కొరకు శ్రమలలో నుండి వచ్చిన యేసుప్రభువారిని ఈ రోజున మనం కలిగి ఉండాలి.

పరిశుద్ద గ్రంధములో ఈ బంగారును దేనికి సూచనగా ఉన్నది. 

సామెతలు 20:15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.             

ఈ బంగారము జ్ఞానమునకు సూచనా

అంతే కాకుండా ఈ బంగారము దేవుని ఆజ్ఞలకు, దేవుని శాసనములకు, దేవుని కట్టడములకు సూచనా. అయన ఇస్తున్న వాక్యమునకు సూచనా. మనము కూడా శ్రమలలో కాల్చబడిన బంగారము వలె ఉండాలి. మనము మార్చబడాలి అని అంటే మనకు గద్దింపుతో కూడిన దేవుని వాక్యము కావాలి, అటువంటి వాక్యమును విని., వాటిని అనుసరిస్తే అప్పుడు మన జీవితము కొలిమిలో నుండి తీయబడిన బంగారము వలె సువర్ణము అవుతుంది. అందుకే మనం అయన దగ్గర అయన ఇచ్చు బంగారము కొనుక్కోవాలి.


2.రెండవదిగా తెల్లని వస్త్రము నా యెద్ద కొనుడి అని యేసు ప్రభువారు చెప్తున్నారు.

కొత్త కొత్త వస్త్రాలు అంటే ఎంతో ప్రాణము మనుష్యులకు, కానీ ఇక్కడ యేసుప్రభువారు అంటున్నారు నా యెద్ద తెల్లని వస్త్రము కొనుడి అని చెప్తున్నారు. తెల్లని వస్త్రము శాంతికి, ఆధ్యాత్మికతకు సూచనా. తెల్లని వస్త్రము స్వచ్ఛతకు, పరిపూర్ణతకు, పరిశుద్దతకు సూచనా ఇది మనుష్యునకు ఘనతను ఇస్తుంది.

ఎందుకు మనం తెల్లని వస్త్రము ధరించాలి అని యేసు ప్రభువారు చెప్తున్నారు.

యేసుప్రభువారు మనకు చెప్తున్నా మాట ఏమిటి అని అంటే పరిశుద్దమైన జీవితాన్ని నా దగ్గర పొందుకోండి, అటువంటి జీవితం కావాలి అని అంటే మీరు పవిత్రపరచబడండి, మీ క్రియలు, మీ మనస్సు, మీ జీవితము పవిత్రపరచబడాలి. అందుకే నా దగ్గర మీరు తెల్లని వస్త్రములు కొనుక్కొని ధరించుకోనుడి అని చెప్తున్నారు.  

ఎందుకు మనం పవిత్రపరచబడాలి అని యేసుప్రభువారు చెప్తున్నారు అని ఆలోచిస్తే

ఎందుకు అని అంటే యేసయ్య దగ్గర అపవిత్రతకు చోటు లేదు, అయన రాజ్యములో అవినీతికి చోటులేదు, అక్రమాలకు చోటులేదు, పాపానికి చోటులేదు. అందుకే మీరు తెల్లని వస్త్రము కొనుడి, మీరు తెల్లని వస్త్రము ధరించుడి అని అయన మనతో ఈరోజున చెప్తున్నారు.

అందుకే దేవుడు అంటున్నాడు నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కొనుడి , ఎందుకు అని అంటే అప్పుడు మన పాపము ఆయనకు కనబడకూడదు, మన దోషము ఆయనకు కనపడకూడదు, నీ కల్మషము ఆయనకు ఆయనకు కనపడకూడదు. అందుకే ఇదిగో నాదగ్గర తెల్ల్లని వస్త్రమును తీసుకో దీనిని నా పరిశుద్ద రక్తమును ఇచ్చి నా రక్తమును చిందించి కొన్నాను, అటువంటి వస్త్రమును అయన మన కొరకు ఈరోజున సిద్దపరిచారు.

అటువంటి తెల్లని వస్త్రమును ధరించి మనం ఎలా జీవించాలి

దేవుని బిడ్డలుగా మనం మన ఇష్టానుసరముగా జీవించరాదు. అందుకే మనం ఆయనను, అయన ఆజ్ఞలను హత్తుకొని జీవించాలి, అయన జ్ఞానము అనే బంగారమును పొందుకొందాము, ఆయనదగ్గర ఘనతను, శాంతిని మనము సంపాదించుకొందాము. మన జీవితాలను పవిత్రపరచమని ప్రభువు పాదాలచెంత ప్రార్దిద్దాం. దేవుని మహిమ వస్త్రము మనము పొందుకొందాము.


3.ముడవదిగా మనం చుస్తే నా యెద్ద కాటుక కొనుడి అని ప్రభువారు చెప్తున్నారు

ఏమిటి ఈ కాటుక అని అంటే., కాటుక కంటికి అందమును ఇస్తుంది, మనిషికి అందము బంగారము, వస్త్రములు కాకుండా, మనకు ముఖ్యముగా అందమును ఇచ్చేది మన కన్నులే. అటువంటి కన్నులకు అందమును ఇచ్చేది ఈ కాటుక, ఇది కన్నులకు చల్లదనము ఇచ్చేది.

ఈ రోజున మన దృష్టి ఎలా ఉంది. ఎందుకు ప్రభువు కాటుక కొనుడి అని చెప్తున్నారు అని ఆలోచిస్తే

మనిషి దృష్టి ఈరోజున చెడుగా ఉన్నది, మన కన్నులు జబ్బుగల కన్నులుగా మారిపోయాయి , చీకటి గల కన్నులుగా మారిపోయాయి, ఈ కన్నులు బాగుపడాలి, ఈ కన్నులు స్వచ్చమైనవిగా ఉండాలి., ఆధ్యాత్మికమైన కన్నులుగా ఉండాలి. మనకు దేవుడు ఎందుకు ఈ కన్నులు ఇచ్చాడు అని అంటే మంచి వాటిని చూడడానికి. అందుకే నాదగ్గరకు వచ్చి కాటుక కొనుడి అని ప్రభువారు ఈరోజున చెప్తున్నారు. కంటి యొక్క విలువ ఎంతో గొప్పది. దేవుని సృష్టి ఎంతో గొప్పది. అందుకే మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ఈ కంటితో దేవుని చూచే బిడ్డలుగా మనం ఉండాలి, అయన దర్శనమును చూచే బిడ్డలుగా మనం ఉండాలి.

ఈరోజున మనం ఏమి చుస్తాన్నాము ఆలోచించుకోవాలి.      

మన కన్నులు ఈరోజున లోకమును చూస్తున్నాయా, మన కన్నులు దేవుని చూస్తున్నాయా, దేవుని వాక్యమును చూస్తున్నాయా., దేనిని చూస్తున్నాయి, ఆ కన్నులకు కాటుక మలినాలను తిసివేస్తాది, అది మంచి చూపును ఇస్తున్నది, అది శారీరకమైన కాటుక కాదు గాని ఆధ్యాత్మికమైన కాటుక. ఈరోజున ఎలా ఉన్నది మన జీవితం, ఎలా ఉన్నాము. మనము ఏమి ధరించుకోవాలి. మనమైతే యేసయ్య దగ్గర విలువైన బంగారము, యేసయ్య దగ్గర తెల్లని వస్త్రము అనే పరిశుద్దమైన జీవితం, యేసయ్య దగ్గర మంచి దృష్టి కలుగుటకు కాటుక కోనుక్కోవాలి.

అలాగునే ప్రియులారా ఈరోజున ఏమి ధరించుకోవాలి

మనము క్రీస్తును ధరించుకోవాలి, అయన ఆజ్ఞలను, అయన జ్ఞానమును ధరించుకోవాలి.

కీర్తనల గ్రంథము 45:8 నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది.          


4.మనం ఏమిచ్చి అయన దగ్గర బంగారము, తెల్లని వస్త్రము, మంచి దృష్టికి కాటుక ధరించుకోవాలి.

మన వెండి బంగారములు ఆయనకు అవసరం లేదుగాని మరి మనం ఆయనకు ఏమి ఇవ్వగలం అని అంటే పశ్చాతాపంతో కూడిన మన మనస్సు, మన పరిశుద్దమైన జీవితమును ఇచ్చి అయన దగ్గర ఉన్న వాటిని పొందుకోవాలి. అయన దగ్గర శాంతి, సమాధానము, క్షమాపణ పొందుకోవాలి., అయన ఇచ్చు రక్షణను అయన రాజ్యమును స్వతంత్రించుకోవాలి.

ఈరోజున బంగారము వంటి ఆయనను కలిగి, పరిశుద్ద జీవితం అనే తెల్లని వస్త్రమును ధరించుకొని, అయన ఇచ్చు కాటుకతో మంచి దృష్టిని కలిగి., అయన ఆశీర్వాదము పొందుకోవాలి. యేసయ్య ప్రేమ అయన కృప మన అందరికి నిత్యమూ తోడై ఉండును గాక ఆమెన్.  

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గక ఆమెన్. 

 ****************************************************

26July2020

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య వీర్ల సంజీవరావు గారు

ఆదికాండము 2:1-7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

దేవుని వాక్యములో ఈ సృష్టిని గూర్చి మనం ఆలోచిస్తే అది యందు మొదటిగా ఎవరు ఉన్నారు దేవుడు మొదటిగా ఏమి సృష్టించాడు అని వాక్యములో మనం చుస్తే ఆది యందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెనుచీకటి అగాధ జలము పైన కమ్మియుండెనుదేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగునకు పగలనియుచీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెనుదేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని ఇవ్వన్ని దేవుని మాట చొప్పున పలుకగా ఆ ప్రకారమాయెను. అయాదినలలో దేవుడు సృష్టించిన తరువాత అరవదినమున దేవుడు నరుని సృష్టించాడు.

 

దేవుడు మానవుని ఎలా సృష్టించాడు అని మనం చుస్తే

దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

దేవుడు మానవుని ఎలా సృష్టించాడు అని అంటే నరుని తన చేతి కష్టము మీద నిర్మించాడు. దేవుడు తన మాట చొప్పున చేయ వచ్చును గాని అయన మానవుని సృష్టించినపుడు చాల జాగ్రత్తగా అలోచించి ఒక నిర్ణయం చేసి సృజించాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. 

ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదమువారు 
సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త
 భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.

దేవుడు మనలను సృష్టించినపుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నాడు. నేల మంటితో నరుని నిర్మించాడు అసలు ఎందుకు నేల మంటితో నిర్మించాడు అని అంటే మన్ను అయన చెప్పినట్లుగా మాట వింటుంది అని అయన ఆలోచన. 

1.దేవుడు ఎటువంటి నేల మంటితో నరుని నిర్మించాడు మానవుడు ఎక్కడ నిర్మించబడ్డాడు అని మనం ఆలోచిస్తే 
దేవుడు మాములుగా ఉన్న నేల మంటితో నరుని నిర్మించలేదుమనం ఆలోచిస్తే ఇందులో ఒక లోతైన మర్మము మనకు కనిపిస్తుంది. అది తెలుసుకోవాలి అని అంటే మనకు భూమి యొక్క చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర ఏమిటి అని అంటే భూమిని దేవుడు ముఖ్యంగా నాలుగు భాగాలుగా సృష్టించాడు.

మొదటిది భూమి యొక్క పై పొర అని అంటారు దాని లోతును గూర్చి మనం ఆలోచన చేస్తే డబ్బై కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటిది కానీ ఇటువంటి మలినమైనటువంటి మట్టి నుండి మానవుని నిర్మించలేదు ఎందుకు అని అంటే అది దేవుని దృష్టిలో సరైనది విలువైనతువంటిది కాదు అని దేవుడు తలచాడు. ఎందుకు అని అంటే ఈ పైన ఉన్నటువంటి మట్టి మలినములతో కూడినది.   

రెండవది భూమి యొక్క అగాధము డబ్బై కిలోమీటర్ల లోతులో నుండి రెండువేల తొమ్మిది వందల కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటిది. అది ఎలా ఉంటుంది అని అంటే అగ్ని పర్వతాల నుండి బయటపడిన లావా వలే అగ్నితో కూడిన మట్టి కలిగినది దీని పేరు అగాధములో ఉన్న మంటి.  

మూడవది భాగం ఔటర్ కోర్ ఇది రెండువేల ఆరువందల కిలోమీటర్ల లోతులో ఉంటుంది. ఇక్కడ నికిల్ఐరన్ కానీ ద్రవ పదార్దంతో కూడినది. ఇందులో నుండి మట్టితో కూడా మానవుని సృష్టించలేదు. 

నాల్గవదిగా తరువాత పన్నెండ్రు వందల కిలోమీటర్ల లోతున ఉన్న భూమి ఇన్నర్ కోర్. ఇక్కడ ఏమి 
ఉంటుంది అని అంటే నికిల్
ఐరన్ కానీ ఘన పదార్దంతో కూడినదిగా ఉంటుంది. ఇందులో నుండి మట్టితో కూడా
 మానవుని సృష్టించలేదు. ఎందుకు అని అంటే ఈ మట్టి అన్ని మలినాలతో కూడినది. మొత్తంగా ఈ భూమి అరు వేల ఏడువందల డబ్బై కిలో మీటర్లు లోతు కలిగినది. 

దేవుడు చెప్తున్నాడు నేల మట్టితో నరుని నిర్మించితిని అని యే మట్టితో మనం నిర్మించాబడ్డం ఒకసారి మనం ఈ రోజున ఆలోచించుకోవాలి.

2.నీవు నిర్మించబడిన మట్టి ఎలాంటిది ఎలాంటి మట్టి నుండి నీవు నిర్మించబడ్డావు.ఎందుకు దేవుడు మనలను నిర్మించాడు.

ఎందుకు అని అంటే దేవుడు మనలో ఉండాలి అని ఆశిస్తున్నాడు కాబట్టి అయన నరుని నిర్మించాడుఅయన మనలను తయారు చేసినపుడు చాల జాగ్రత్త తీసుకున్నాడుఒక వేల భూమి యొక్క పై పొర నుండి తయారు చేస్తే వారి యొక్క దేహము మలినమై పోతుంది అని దాని నుండి మనలను చేయలేదుఅలాగే భూమి యొక్క ఓటర్ కోర్ఇన్నర్ కోర్ కూడా మురికితో కూడినది కావున ఈ మూడు నరుని సృష్టించడానికి వీలులేదుఎందుకు అని అంటే అయన మనలను ఎంతో పవిత్రంగా సృష్టించాలి అని అయన కోరుచున్నాడుఎందు కొరకు అని అంటే అయన కొరకు మనం ఒక సాక్షిగా ఉండాలి అని అయన ఆలోచన. 

అందుకే దేవుడు నరుని నిర్మించడానికి భూమి యొక్క అగాధము నుండి తీసిన అగ్నితో కూడిన మట్టితో మనలను సృజించాడుఅయన చాల కష్టపడి అయన స్వహస్తాలతో నిర్మించాడు అని దేవుని వాక్యము చెప్తుంది.  

కీర్తనల గ్రంథము 139:14-15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు.

ఎందుకు దేవుడు మనలను భూమి యొక్క ఆగాధము నుండి తీసిన అగ్నితో కూడిన మట్టితో నిర్మించాడు అని అంటే మనం పవిత్రముగా ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉండాలి అని అయన ఆలోచన అప్పుడే దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఇటువంటి భయంకరమైన మట్టితో మనవ శరీరం నిర్మించాడు. అందుకే ప్రభువు పట్ల మన హృదయం కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.

అందుకే దేవుని వాక్యం చెప్తుంది.

యోబు గ్రంథము 10:9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుమునీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

ఆవిధంగా మనలను నిర్మించి నరుని తయారు చేసి నాశిక రంద్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.

3.ఎందుకు దేవుడు మనలను అంత పవిత్రమైన మట్టితో నిర్మించాడు అంటే దేవుని వాక్యము చెప్తుంది.

పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.

లేవీయకాండము 11:45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానునేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

దేవుడు పరిశుద్దుడు కావున మనలను పరిశుద్ధంగా సృష్టించాడు. ఆవిధంగా సృష్టించి మన హృదయంలో ఆయన ఉండాలి అని అయన కోరుచున్నాడు కాబట్టి అటువంటి ఆత్మను మన హృదయంలో పెట్టాడు.

గలతీయులకు 4:6 మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీఅని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.  

4.కానీ ఈరోజున మన ఆత్మ దేవుని దృష్టికి ఎలా ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది అని చుస్తే

ఆదికాండము 6:5 నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియువారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.

దేవుడు నరుని యొక్క చెడుతనమును చూసి తన హృదయములో అయన ఈరోజున నోచ్చుకోనుచున్నాడు. ఎందుకు అని దేవుని మాటను లెక్క చేయక అయన మాటను అయన ఆజ్ఞను అతిక్రమించి మనము ప్రవర్తించుచున్నాము. దేవుడు అందుకే ఈరోజున మనలను బట్టి అయన చింతిస్తున్నాడు.అయన ఈరోజున చాల వేదన చెందుతున్నాడు.  

అందుకే యేసుప్రభువారు మనలను చూసి చింతించి మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకు అని అంటే అయన కొరకు మనం పరిశుద్ధంగా జీవించడానికి అయన హృదయంలో మనం ఉండటానికి. అలాగున ఉండాలి అంటే మొదటిగా మనం మారాలి, మన ద్వార అనేకులు మార్చడానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని అయన చెప్పాడు. అందుకు మనం పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి.

 

5.ఈరోజున మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుచున్నాడు అని చుస్తే  

మొదటిగా మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండాలి.

పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

ఈరోజున మనం ప్రవర్తన ఎలా ఉన్నదో చూచుకొని ఆ ప్రవర్తనను సరి చేసుకొని ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి.

మనలో జారత్వమే గానియే విధమైన అపవిత్రతయే గాని ఉండరాదు.

ఎఫెసీయులకు 5:3 మీలో జారత్వమే గానియే విధమైన అపవిత్రతయే గానిలోభత్వమేగానివీటి పేరైనను ఎత్తకూడదుఇదే పరిశుద్ధులకు తగినది.

మనలో జారత్వముగాని అపవిత్రతయే గాని,లోభావత్వమే గాని మన హృదయంలో ఉండరాదు. మనం పవిత్రంగా ఉండాలి ఎందుకు అని అంటే ఆ పవిత్రతే మనలను పరలోక రాజ్యములోనికి తీసుకువెళ్తుంది. అటువంటి పవిత్రతయే మన జీవితంలో మనం కలిగి దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి సహాయపడుతుంది. మనం  దేవుని నిత్యం స్తుతించాలి., సమస్త దుర్నితిని మన నుండి దూరపరచి నిత్యం యేసయ్యతో ఉండే గొప్ప భాగ్యం అందరికి అందించాలని ఆశిస్తూ ఆమెన్.  

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

 

 

 

 







No comments: