Stuthi patalu 67-88




67.నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా

మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2)

వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు         ||నేస్తమా||

68.పదములు చాలని ప్రేమ ఇది

స్వరములు చాలని వర్ణనిది (2)

కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ         ||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||

69.పదివేలలో అతిసుందరుడా

మనోహరుడా మహిమోన్నతుడా (2)

నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం (2)
తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను (2)
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా (2)        ||పదివేలలో||
నీ కొరకే యేసు నీ కొరకే (3)
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే (2)
పరిశుద్ధ ఆత్మ రమ్ము (2)
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము              ||నీ కొరకే||

70.ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2)

పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2)

పరలోకముకై – చిర జీవముకై (2)
ప్రార్ధించెను నా హృదయం             ||ప్రభు యేసుని||
దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2)
దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2)
ధన పీడనతో – మృగ వాంఛలతో (2)
దిగాజారితి చావునకు              ||ప్రభు యేసుని||
యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2)
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2)
ఇల వేడితిని – విలపించుచును (2)
ఈడేరెను నా వినతి             ||ప్రభు యేసుని||
పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2)
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2)
పరలోకమే నా – తుది ఊపిరిగా (2)
పయనించితి ప్రభు కడకు          ||ప్రభు యేసుని||

71.ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2)

హాల్లెలూయా హాల్లెలూయా
హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు||
ఆకాశము కంటె ఎత్తైనది
మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2)
ఆ సన్నిధే మనకు జీవమిచ్చును
గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు||
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
ధరియింప చేయును ప్రభు సన్నిధి (2)
నూతనమైన ఆశీర్వాదముతో
అభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు||

72.ప్రార్థన వినెడి పావనుడా

ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా              ||ప్రార్థన||
పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||
దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా                 ||ప్రార్థన||
శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా               ||ప్రార్థన||

73.ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)

యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా||
  
74.ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2)        ||ప్రియమైన||
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)       ||నా ప్రియుడా||
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2)       ||నా ప్రియుడా||
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2)       ||నా ప్రియుడా||

75.ప్రేమించెదన్ అధికముగా

ఆరాధింతున్ ఆసక్తితో (2)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా
ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే   || నిన్ను పూర్ణ ||
ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా    || నిన్ను పూర్ణ ||
యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా       || నిన్ను పూర్ణ ||

76.బలమైనవాడా బలపర్చువాడా

మరలా నన్ను దర్శించుమా

స్తోత్రం స్తోత్రం (2)
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నీకేనయ్యా         ||బలమైన||
ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము (2)
మొదటి ప్రేమ మొదటి పవిత్రత
మరలా నాలోన దయచేయుమా (2)         ||బలమైన||
అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని
నీలోన నేను ఉండాలని
మరలా నన్ను వెలిగించుము (2)
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా (2)         ||బలమైన||

77.బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు

హృదయాన్ని అడిగాడయ్యా

ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా (2)
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా…   ||బంగారం||
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)         ||నా యేసయ్యా||
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా (2)
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా (2)          ||నా యేసయ్యా||
****************************************************************



78.బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)

పరమును విడచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్యా (2)          ||బాలుడు||
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి
పరుగు పరుగున పాకను చేరామే (2)
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2)
మా మంచి కాపరని సంతోషించామే
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         ||బాలుడు||
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)          ||బాలుడు||

79.బెత్లెహేములో సందడి

పశుల పాకలో సందడి

శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)       ||బెత్లెహేములో||
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)       ||బెత్లెహేములో||
దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)       ||బెత్లెహేములో||
దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)       ||బెత్లెహేములో||

80.భజియింతుము నిను జగదీశా శ్రీ

యేసా మా రక్షణ కర్తా (2)

శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2)          ||భజియింతుము||
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2)           ||శరణు||
ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి (2)
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం (2)         ||శరణు||

81భాసిల్లెను సిలువలో పాపక్షమా

యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||
పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||
ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||
నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||

82.భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు

దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)

ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే (2)          ||భేదం||
ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)          ||భేదం||
పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము (2)          ||భేదం||

 83.మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ (2)

మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2)        ||మధురమైనది||
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||
పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా
ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2)
మరణపు ఛాయలే దరి చేరనీయక (2)
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం        ||ప్రేమా||
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం       ||ప్రేమా||

84మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2) 

దీన మనస్సు – దయ గల మాటలు
సుందర వదనం – తేజోమయుని రాజసం (2)    ||మధురం||
ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని
బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||
పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు
ప్రయాసపడు వారి భారము తొలగించుటకు(2)
ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||
కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను
ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

85మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము

సృష్టికర్త ముక్తి దాత (2)
మా స్తుతులకు పాత్రుడా
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే ఆరాధనా నీకే
మన్నాను కురిపించినావు
బండనుండి నీల్లిచ్చినావు (2)
యెహోవా ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును           ||ఆరాధనా||
వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు (2)
యెహోవా రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును                 ||ఆరాధనా||

86మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా(2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)

ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు(2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)
మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు            ||దరిద్రులను||
గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు           ||దరిద్రులను||

87మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నది

మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2)           ||మహోన్నతుడా||
మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2)             ||మహోన్నతుడా||
ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2)      ||మహోన్నతుడా||
వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2)  ||మహోన్నతుడా||

88. మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి

మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2)
పాప మమతల చేత – పారిపోయిన నాకు
ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు
పంపుము క్షేమము (2)
ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు
పుట్టించె ధైర్యము (2)                    ||మార్గము||
ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు
తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ
దేహీ నిను చేరితి (2)
దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు
దారిని జూపుము (2)     ||మార్గము||
దూర దేశములోన – బాగుందుననుకొనుచు
తప్పితి మార్గము
తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల
తరిమే దారిద్య్రము (2)
దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి
ధన్యుని చేయుము (2)                  ||మార్గము||
అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు
ఆకలి బాధలో
అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ
అలవడెను వేదన (2)అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత
ఆశ్రయము గూర్చుము (2)        ||మార్గము||
కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు
కోపించి వెళ్ళితి
కూలివానిగనైన – నీ యింట పని చేసి
కనికరమే కోరుదు (2)కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు
క్షమియించి బ్రోవుము (2)        ||మార్గము||
నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి
నాపైబడి ఏడ్చెను
నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి
నన్నూ దీవించెను (2)
నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో
సాక్ష్యమై యుండును (2)                    ||మార్గము||