Stuthi patalu 45-66




45.దొరకును సమస్తము యేసు పాదాల చెంత

వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)

యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా         ||దొరకును||
మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
పాదాలను ముద్దు పెట్టుకొని
పూసెను విలువైన అత్తరు (2)
చేసెను శ్రేష్టారాధన
దొరికెను పాప క్షమాపణ (2)            ||దొరకును||
యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
చిన్నదాన లెమ్మని చెప్పి
బ్రతికించెను యేసు దేవుడు (2)
కలిగెను మహదానందం
దొరికెను రక్షణ భాగ్యము (2)            ||దొరకును||
పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
పరలోక దర్శనం
చూచెను తానే స్వయముగా (2)
దొరికెను ప్రభు ముఖ దర్శనం
దొరికెను ఇల మహా భాగ్యం (2)            ||దొరకును||

46.నజరేయుడా నా యేసయ్య

ఎన్ని యుగాలకైనా

ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద          ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)       ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||


47.నన్నాకర్షించిన నీ స్నేహ బంధం

ఆత్మీయ అనుబంధం (2)

ఆరాధన నీకే యేసయ్యా (2)
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా (2)         ||నన్నాకర్షించిన||
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు (2)
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా (2)         ||నన్నాకర్షించిన||
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు (2)
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా (2)         ||నన్నాకర్షించిన||

48.నా కోసమా ఈ సిలువ యాగము

నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)

కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా (2)            || నా కోసమా ||
నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2)          || నా కోసమా ||
నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై (2)
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే (2)
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు (2)           || నా కోసమా ||

49.నాకు చాలిన దేవుడ నీవు

నా కోసమే మరణించావు (2)

నా శ్రమలలో నా ఆధారమా
నను ఎడబాయని నా దైవమా (2)
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఏ రీతిగా నిను స్తుతియించగలను (2)       ||నాకు చాలిన||
వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె
మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)
అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)
చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2)        ||ఏమిచ్చి||
ఎండిన భూమిలో లేత మొక్క వోలె
నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)
సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)
నడవలేక సుడి వడి కూలినావయ్యా (2)        ||ఏమిచ్చి||

50.నాకు జీవమై ఉన్న నా జీవమా

నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా

నాకు బలమై ఉన్న నా బలమా
నాకు సర్వమై ఉన్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు          ||నాకు జీవమై||
పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)
నా ఆరాధన నా ఆలాపన
నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ
నా స్తోత్రార్పణ నీకే           ||నాకు జీవమై||
నాయకుడా… నా మంచి స్నేహితుడా
రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2)
నా ఆనందము నా ఆలంబన
నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము
నా పోషకుడవు నీవే          ||నాకు జీవమై||

51.నిత్యము స్తుతించినా

నీ ఋణము తీర్చలేను

సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు (2)           ||నిత్యము||
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2)                  ||రాజా||
జీవమైన దేవడా
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2)                    ||రాజా||
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2)                   ||రాజా||

52.నిన్ను కాపాడు దేవుడు

కునుకడు నిదురపోడు – నిదురపోడు

వాగ్ధానమిచ్చి మాట తప్పడు
నమ్మదగినవాడు – నమ్మదగినవాడు
భయమేల నీకు – దిగులేల నీకు (2)
ఆదరించు యేసు దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||
శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా
శోధనలలో – నిన్ను నెట్టినా (2)
కోడి తన పిల్లలను కాచునంతగా
కాపాడు దేవుడు నీకు ఉండగా (2)భయమేల నీకు – దిగులేల నీకు (2)
కాపాడు గొప్ప దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||
రోగ భారమందు లేవకున్ననూ
వ్యాధులు నిన్ను కృంగదీసినా (2)
చనిపోయిన లాజరును తిరిగి లేపిన
స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2)భయమేల నీకు – దిగులేల నీకు (2)స్వస్థపరచు సత్య దేవుడు ఉండగా          ||నిన్ను కాపాడు||

53.నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)

నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2)           ||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా            ||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా                 ||నిన్నే||

54.నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)

నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా       ||నిబ్బరం||
పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము         ||హల్లెలూయా||
మునుపటి కంటెను – అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము       ||హల్లెలూయా||
మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం      ||హల్లెలూయా||
స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును      ||హల్లెలూయా||
రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్      ||హల్లెలూయా||
మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము         ||హల్లెలూయా||

55.నీ కృప నిత్యముండును

నీ కృప నిత్య జీవము

నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2)
నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది
రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||
శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె
కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు (2)
కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా (2)        ||నీ కృప||
ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె
ప్రతి క్షణమున నీవు పలుకరించావు (2)
ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే (2)        ||నీ కృప||
అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు (2)
రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా (2)        ||నీ కృప||
***********************************************************



56.ఈ ఊపిరి నీదేనయ్యా

నీవిచ్చిన దానం నాకై

నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై (2)
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు (2)
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)        ||నీ కృప||
నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2)        ||నీ కృప||

57.నీ చేతితో నన్ను పట్టుకో

నీ ఆత్మతో నన్ను నడుపు

శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము (2)
అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు (2)
ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను (2)
ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||

58.నీ వాక్యమే నన్ను బ్రతికించెను

బాధలలో నెమ్మదినిచ్చెను (2)

కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2)      ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2)
నా పాదములకు దీపమాయెను (2)
సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)       ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2)
అపవాది వేయుచున్న అగ్ని బాణములను (2)
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది (2)       ||నీ వాక్యమే||
పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది (2)
మేలిమి బంగారు కన్న మిన్న అయినది (2)
రత్న రాసులకన్నా కోరతగినది (2)           ||నీ వాక్యమే||

59.నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్దీకరించున్

నీ రక్తమే నా బలము (2)

నీ రక్త ధారలే ఇల
పాపికాశ్రయంబిచ్చును (2)
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచుము (2)             ||నీ రక్తమే||
నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగ నున్నది (2)
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియై యున్నది (2)          ||నీ రక్తమే||
నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే (2)
పాప విముక్తి చేసితివి
పరిశుద్ధ దేవ తనయుడా (2)          ||నీ రక్తమే||
పంది వలె పొర్లిన నన్ను
కుక్క వలె తిరిగిన నన్ను (2)
ప్రేమతో చేర్చుకొంటివి
ప్రేమార్హ నీకే స్తోత్రము (2)               ||నీ రక్తమే||
నన్ను వెంబడించు సైతానున్
నన్ను బెదరించు సైతానున్ (2)
దునుమాడేది నీ రక్తమే
దహించేది నీ రక్తమే (2)                 ||నీ రక్తమే||
స్తుతి మహిమ ఘనతయు
యుగయుగంబులకును (2)
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రార్హుడా నీకే తగును (2)            ||నీ రక్తమే||

60.నీతి సూర్యుడా యేసు

ప్రాణ నాథుడా.. రావయ్యా

నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా (2)
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా        ||నిన్న||
వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా (2)
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా (2)
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా        ||నిన్న|

61.నీవు చేసిన ఉపకారములకు

నేనేమి చెల్లింతును (2)

ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||
వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2)                    ||ఏడాది||
మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2)            ||ఏడాది||
విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2)       ||ఏడాది||
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును (2)
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా (2)                          ||ఏడాది||

62.నీవు లేని రోజు అసలు రోజే కాదయా

నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)

నీవే లేకపోతే నేనసలే లేనయా (2)          ||నీవు లేని||
బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2)           ||నీవే||
ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2)       ||నీవే||

63.నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)         ||నీవుంటే||
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)          ||నీ మాట||
బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)    ||నీ మాట||
ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)        ||నీ మాట||
నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

64.నీవే ఆశ నీవే శ్వాస

నీవే ధ్యాస యేసువా

నీవే ప్రాణం నీవే గానం
నీవే ధ్యానం నేస్తమా
తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను (2)
నీ రూపులోనే నీ చేతి పనిగా – నను నీవు మలచితివే
నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై – నను సృజియించితివే          ||నీవే||
ఇహమున నా కొసగిన – ఈ ధర ఎంత భాగ్యమని
తలచితి నే భ్రమచితి – అంతయు నాకు సొంతమని
ఆశతో నేను పరుగెడితి ఇలలో చెలిమికై
ప్రతి హృదయం స్వార్ధమాయే
ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన
ఒక ప్రేమైన కాన రాదే           ||నీవే||
హృదయము పులకించెను – నీ ప్రేమ ప్రచించగానే
దృఢమాయె నా మదిలో – ఇక అంతయు వ్యర్థమని
నా జీవన గమనాన్ని నీ వైపు మలచి
నీ అడుగులలో నే నడచి
నీ ప్రియమైన ప్రేమగ ఇలలో జీవించి
నీ కౌగిలిలో ఒదుగుదునే            ||నీవే||

65.నీవే నా సంతోషగానము

రక్షణశృంగము మహాశైలము (2)

బలశూరుడా యేసయ్యా నా తోడై
ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2)        ||నీవే నా||
ఓ లార్డ్! యు బి ద సేవియర్
షో మి సం మెర్సీ
బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్
సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్
ఐ విల్ సరెండర్
యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్
త్యాగము ఎరుగని స్నేహమందు
క్షేమము కరువై యుండగా
నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి
నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)
నిరంతరం నిలుచును నాపై నీ కనికరం
శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2)        ||నీవే నా||
వేదన కలిగిన దేశమందు
వేకువ వెలుగై నిలిచినావు
విడువక తోడై అభివృద్ధిపరచి
ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2)
మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం
అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2)        ||నీవే నా||
నిర్జీవమైన ఈ లోయయందు
జీవాధిపతివై వెలసినావు
హీనశరీరం మహిమ శరీరముగ
నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2)
హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు
హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2)        ||నీవే నా||

66.నే సాగెద యేసునితో

నా జీవిత కాలమంతా (2)

యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2)
పరమును చేరగ నే వెళ్లెద (2)
హనోకు వలె సాగెదా            ||నే సాగెద||
వెనుక శత్రువులు వెంటాడిననూ (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా (2)
మోషె వలె సాగెదా             ||నే సాగెద||
లోకపు శ్రమలు నన్నెదిరించినా (2)
కఠినులు రాళ్ళతో హింసించినా (2)
స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద||
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2)
పౌలు వలె సాగెదా             ||నే సాగెద||
తల్లి మరచిన తండ్రి విడచిన (2)
బంధువులే నన్ను వెలివేసినా (2)
బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద||