పరిశుద్ధవారము 2019



35th Lentday 2019

15/04/2019
పరిశుద్ధవారము
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య పాస్టర్ వై.బాలరాజుగారు
Topic:అంజూరపుచెట్టును శపించుట

మార్కు సువార్త 11:11-14
13 ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.

చదవబడిన వాక్యం ఇది యేసుప్రభువారు మనకు చెప్పిన తీర్పుతో కూడిన లేఖనం.

1.యేసుప్రభువారు మనకు చెప్పే సందేశం ఏమిటి అని అంటే 

**దేవుని భక్తిని గూర్చిన విషయంలో మనకు నేర్పించడానికి, మనం బలపడటానికి ఉపమాన రీతిగా అయన మనతో మాట్లాడారు.

**అంజూరపు చెట్టును శపించుట మన ప్రభువారికి సంతోషాన్నిచ్చేది కాదుగాని, అయన అన్యాయము చేసేవాడు కాదుగాని  అయన శిష్యులైన వారికీ విశ్వాసముతో బలపడటం నేర్పించాలని అయన ఆలోచన.

**అంతేకాకుండా నశించిపోవుచున్న ఇశ్రాయేలీయుల జీవితాలకి సూచనగా అయన అంజూరపుచెట్టును శపించినట్లుగా అయన మనకు చెప్పే సందేశం.


2. అంజూరపుచెట్టును గూర్చి చారిత్రాత్మకంగా మాట్లాడుకుంటే 

** అంజూరపుచెట్టు సంవత్సరమునకు మూడు కాపులు కాస్తుంది, అంతేకాకుండా అంజూరపుచెట్టు సంవత్సరమునకు పదికాపులు కూడా ఇవ్వగల సామర్థ్యం కలది.

**ఈఅంజూరపు పళ్ళు అసిడిటీ , మలబద్దకంకు పనిచేస్తుంది మరియు ఈఅంజూరపు పళ్ళు అనేకమైన ఆరోగ్యకరణమైన గుణములు కలిగినది.


3.యేసుప్రభువారు ఈ అంజూరపు చెట్టును శపించుటకు కారణం.

 **యేసుప్రభువారు వెళ్ళినపుడు పండ్ల కాలం కాకపోయినా మంచి పంటకు అనుకూలపరిస్థితులు కలిగిన ఫలించలేదు. 

 **ఆధ్యాత్మికంగా మనం చుస్తే ఇశ్రాయేలీయులు, వారు దేవునిలో బలపడంలేదు, వారిలో మార్పు లేదు, వారి జీవితాలలో ఫలింపులేనివిగా ఉన్నాయి.

** అంజూరపుచెట్టు ఫలింకుండుట ఇశ్రాయేలీయుల తిరుగుబాటుకు సాదృశ్యంగా ఉన్నది

**మరియు మనకు మనం పవిత్రపరచుకోవటానికి అంజూరపు చెట్టు సూచనగా ఉన్నది

**దేవునికి ఉపయోగంలేని, ప్రయోజనకరంగాలేని విధంగా ఉంటె మనం కూడా అంజూరపు చెట్టులాగా నశింపబడటానికి సూచనా ఉన్నది

 
4.ఈ ఫలింపులేని జీవితాల గూర్చి దేవుని వాక్యమును గమనిస్తే

ద్వితీయోపదేశకాండము11:16-17
16 మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
17 లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.

**ఇక్కడ వాక్యంలో పరిశీలిస్తే ఇశ్రాయేలీయుల హృదయము దేవునికి దూరమైన స్థితి

**దేవుడు పరిశుద్ధమైన ఈవులను దేవుని ఫలములను ఇస్తున్నాడు

**దేవుని ఫలములు దేవుని రాజ్యములోనికి నడిపిస్తాయి

**దేవుని ఫలములు లేని బ్రతుకులు దేవుని రాజ్యములోనికి నడిపించవు

**అయన మనలను ప్రేమిస్తూ శిక్షిస్తున్నాడు, శిక్షిస్తూ ప్రేమిస్తున్నాడు.

**
దేవుని ఫలములు కలిగి ఉండుట గొప్ప ఆధిక్యత.

యేసుప్రభువారు మనలను దీవించటానికి వచ్చారు. యేసుప్రభువారు మనలను పరిశుద్ధంగా చేయడానికి, అయన సన్నిధికి అయన వైపు నడిపించానికి అయన పిలుస్తున్నాడు.
 
**అయన ఆశీర్వదిస్తున్నపుడు ఆశీర్వదించబడుతున్నాం, అయన వాక్యము ద్వారా మందలిస్తున్నపుడు మనం మందలించబడుతున్నాం


**దేవునిలో మనము ప్రత్యేకించబడినవారము, ఆయనను మహిమపరచువారము, అయన ద్వారా సరిచేయబడే వారము, అయన ద్వారా ఏర్పాటుచేయబడినవారము,
అయన రాకడ కొరకు సిద్ధపడ్డ జనాంగముగా ఉన్నవారము.

**మన యేసుప్రభువారు మనపట్ల కలిగిన  ప్రణాళిక అయన వాగ్దానము ద్వారా మన బ్రతుకులను దీవించునట్లుగా ఉండాలి అందుచేత మనం శపించబడిన జనాంగము కాదు కాని, మనం పరిశుద్ధపరచబడిన జనాంగం.


5.ఈ అంజూరపుచెట్టుమనం దేవునిలో ఫలించుటకు సూచనగా ఉన్నది  

మనం ఫలింపు కలిగిన వారీగా ఉండాలి.

యెషయా గ్రంథము 27:6
రాబోవు దినములలోయాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.

**మనం అయన బిడ్డలుగా వాక్యమునకు లోబడుట నేర్చుకోవాలి.

**అయన మనలను దీవించాలని నమ్మకం కలిగి ఉండాలి

**అయన మనకు సరిచేసి అయన వాక్యము ద్వారా మన జీవితాలను బాగుచేస్తారు


6. అంజూరపుచెట్టు, మనం దేవునిలో ఫలభరితమైన జీవితానికి సూచనగా ఉన్నది.

 దేవుడు ఇచ్చే ఫలములు ఏమిటి అని అంటే బైబిల్ గ్రంధములో చుస్తే

యోవేలు 2:23
సీయోను జను లారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును.

**దేవుని వాక్యమును గమనిస్తే ఫలభరితమైన బతుకులు అంజూరపుచెట్టువలె ఫలిస్తాయి.

7. ఈ అంజూరపుచెట్టు, సమాధానసూచకమైన, ఫలభరితమైన జీవితానికి సూచనగా ఉన్నది.

జెకర్యా
8:12
సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, జనులలో శేషించినవారికి వీటి నన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

**ఫలభరితమైన జీవితం సమాధానసూచకమైన ఫలింపుకు సూచనగా ఉన్నది.

8.మనం దేవునిలో ఫలింపు కలిగిన వారీగా ఉండాలి.

రోమీయులకు 1:13
సహో దరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిది వరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు

ఫలింపు కలిగి ఉండుట అంటే

**దేవుడు మనలో ఏది ఆశిస్తున్నాడో అదే ఫలింపు కలిగిఉండుట

**పరిశుద్ధమైన జీవితం కలిగిఉండుటే ఫలింపు కలిగిఉండుట

**దేవునికి సంతోషం కలిగించే బిడ్డలుగా ఉండటమే ఫలింపు కలిగిఉండుట.

**సంఘమునకు ఆశీర్వదముగా ఉండుటయే దేవునిలో ఫలింపు కలిగిఉండుట.

**వెలుగు సంబంధులుగా దేవునిలో ఫలించాలి

**
మనం మంచి నడవడిక కలిగి దేవునిలో బహుగా ఫలించాలి

**మనం మారుమనస్సు కలిగి ఆయనలో సరిచేసుకొని ఆయనలో ఫలింపుకలిగి ఉండాలి
**అయన బిడ్డలుగా సంఘములో ఫలింపుకలిగి ఉండాలి.

**ఫలభరితమైన జీవితం దేవుని సన్నిధిలో కలిగి, దేవుని వాక్యము ద్వారా కడగబడి, దేవుని రాజ్యములో ఉండాలి, అప్పుడు మనం జీవితకాలం ఆశీర్వదింపబడతాము.
 

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
 **************************************************************************

36th Lentday 2019
16/04/2019
పరిశుద్దవారము(Holy Week)
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
వాక్య పరిచర్య పాస్టర్  టి. రాజ్ కుమార్ గారు
Topic: యేసు ప్రభువారి అధికారము

మత్తయి 21:23-27
23 ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చిఏ అధికారమువలన నీవు కార్యములు చేయు చున్నావు? అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా


చదవబడిన వాక్యము చాల ప్రాముఖ్యమైన అంశము
**యేసుప్రభువారు దేవాలయములో భోదించుచుండగా ప్రధానయాజకులును అధికారమువలన నీవు కార్యములు చేయు చున్నావు అని అడుగగా యేసునేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును అధికారమువలన కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పు దును.

**
యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు తమలో తాము ఆలోచించుకొనిమాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి.
**అందుకాయన అధికారమువలన కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను అని చెప్పెను.

**ఐగుప్తులో పస్కాను ఆచరించునపుడు, పస్కా గొఱ్ఱెపిల్లను పదునాలుగు రోజులు పరీక్షించి తరువాత పస్కాను ఆచరించేవారు.

**ప్రభువైన యేసుక్రీస్తువారు యెరూషలేములో ప్రవేశించినపుడు పస్కా గొఱ్ఱెపిల్లను గూర్చి మనం పరిశీలన చేయడం చాల ప్రాముఖ్యమైన అంశం

1. పస్కాగొఱ్ఱెపిల్లగా వచ్చిన యేసయ్యను వారు చేసిన ఉద్దేశములు, ప్రణాళిక ఏమిటి అనగా

** పస్కాగొఱ్ఱెపిల్లగా వచ్చిన యేసయ్యను పరీక్షించడం.

**అయన చేసిన పాపమును చూపించడం.

**అయన మీద నేరముమోపడం.

**ఆయనను చంపాలని అనుకోవడం

పస్కాను గూర్చి మనం ఆలోచన చేస్తే 

గలలీయుడైన యేసుప్రభువారు పస్కాను గురువారం ఆచరిస్తారు

పరిసయ్యలు సద్దూకయ్యులు పస్కాను శుక్రవారం ఆచరించేవారు.
అందుకే వారు పస్కా ముందే యేసుప్రభువారిని చంపుటకు ప్రయత్నిస్తున్నారు

2.మన యేసుప్రభువారు అన్నిటి మీద అధికారము కలిగిన దేవుడు 
ద్వితీయోపదేశకాండము 32:39
ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు.

వాక్యభాగములో వారు యేసయ్యను అధికారంతో నీవు చేయుచున్నావని అడిగితే ఇది సరైన సమయం కాదు కనుక అయన తన తండ్రి ఇచ్చిన అధికారంతో చేయుచున్నాని చెప్పలేదు.

3.ఎందుకు యేసుప్రభువారు తండ్రి ఇచ్చిన అధికారంతో చేయుచున్నాని చెప్పలేదు అని అంటే 
 
బైబిల్ గ్రంధమును గమనిస్తే వారి ఆలోచన దుర్దేశము వారి నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
2 కొరింథీయులకు 4:4 దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.

**ఎందుకంటే వారికీ తెలియదు యేసుప్రభువారు మన మీద సర్వాధికారము కలిగిన దేవుడు అని
**ఆయనకు, మనకు ఉన్నది ఆత్మ సంబంధము, మనం అటువంటి గొప్ప సంభందం కలిగినవారము.

**యేసుప్రభువారు ఎందుకు తన తండ్రి అధికారమును గూర్చి చెప్పలేక పోయారు అని అంటే వారికీ యేసుప్రభువారి గూర్చి తెలియదు, అందుకే అయన యోహాను బాప్తీస్మం గూర్చి అడిగారు.

అయన ప్రాణము మీద ఆయనకు అధికారము కలిగినవాడు.
అందుకే దావీదు అంటాడు.

కీర్తనల గ్రంథము 103:1-2  
1 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
2 నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము.
ప్రాణమును గూర్చి ఇంకొక అయన బైబిల్ గ్రంధములో అంటాడు.
లూకా 12:19
నా ప్రాణముతోప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తార మైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందునను కొనెను.  


**అయన జీవముగల దేవుడు అందుకే లాజరును తిరిగి బ్రతికించిన దేవుడు
 ఆయన నోటా పలికితే జీవము కలిగి లాజరు బైటకి వచ్చాడు అందుకే బైబిల్ చెప్తుంది.
 
యోహాను 11:25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

**యేసుప్రభువారిని చంపుటకు ఎవరికీ అధికారములేదు.
**అయన సిలువలో పలికిన ఏడవ మాట తండ్రి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను.
అనే మాట అయన మరణము మీద ఆయనకు గల అధికారమును గూర్చి చెప్తుంది.
మత్తయి 10:28
మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

మన యేసయ్య మన మీద సర్వాధికారి ఐన దేవుడు 
ప్రకటన గ్రంథము 1:8
అల్ఫాయు ఓమెగయు నేనే5. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

4.ఈరోజున మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటి ?

**ప్రభువైన యేసయ్యను సద్దూకయ్యులు పరీక్షించారా ప్రధానయాజకులు పరీక్షించారా అనేది ముఖ్యమైన అంశం కాదు కానీ, ఈరోజు ప్రాముఖ్యమైన అంశము ముందుగా మనలను మనం పరీక్షించుకోవాలి.

**మన ఆత్మీయజీవితం ఎలా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి.

**మన వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నదో మనలను మనం పరీక్షించుకోవాలి.

**అయన సన్నిధిలో రోజున ఎందుకు పిలుచుకున్నాడో పరీక్షించుకోవాలి.

**మనలను రోజున దేవుడు ఈస్థలంలో ఎందుకు నిలవబెట్టాడో మనం ప్రశ్నించుకోవాలి


5. రోజున మనం ముఖ్యముగా గుర్తుచేసుకోవలసిన అంశములు ఏమిటి అని అంటే

**మొదటిగా క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు.
అందుకని మనం మెలుకువగా ఉండి ప్రార్ధనలో గడపాలి అప్పుడు మనకు దేవుడు క్షణంలో ఏమి చేస్తాడు మనకు తెలుస్తుంది ఎందుకని అంటే మనం గొప్ప వాళ్ళం అని కాదు గాని మనం ప్రార్థిస్తున్నా మన యేసయ్య గొప్పవాడు.

**రెండవదిగా మరణం ఎప్పుడో మనకు తెలియదు.

మరణం దేవుని చేతిలో ఉన్నది, ప్రాణం మీద, ఆత్మ మీద మన యేసయ్య సర్వాధికారము కలిగినవాడు .

అయన స్వరూపంలో అయన పోలికలో ఉన్న మనమే ఆయనకు ముఖ్యం, మన ప్రార్ధనే ఆయనకు ముఖ్యం.

**మూడవదిగా అయన రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు.

మూడు అంశములు లోకంలో ఎవరికీ తెలియదు,మరి ఎవరికీ తెలుస్తుంది అని అంటే

**మెలకువగా ఉండి ప్రార్ధన చేసేవారికి మాత్రమే దేవుడు విషయాలు భయాలు పరుస్తాడు అటువంటి గొప్ప ఆధిక్యత కలిగిన వాడు మన యేసయ్య.
 
**అందుకని మనం ఏమి చేయాలి అని అంటే శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి దేవునిలో ప్రార్ధన జీవితం కలిగి ఉండాలి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***************************************************************

37th Lentday 2019


17/04/2019
పరిశుద్ధవారము  
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
సిలువ శ్రమల ధ్యానకుటములు 
వాక్యపరిచర్య సహా.శ్రీ.నేతాజీప్రసాద్ గారు

మార్కు 14:3-9
3 ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, అత్తరుబుడ్డి పగులగొట్టి అత్తరు ఆయన తలమీద పోసెను.

చదవబడిన వాక్యంలో సంగతిని గూర్చి చాల సార్లు ధ్యానించుకున్నాం.
రోజున మరియొక సారి హృదయపూర్వకంగా ధ్యానించుకుందాం.

**యేసుప్రభువారికి ఇష్టమైన గ్రామం ఏమైనా ఉన్నది అని అంటే అది బెతనీయా గ్రామం

**యెరూషలేములో ఎవరు యేసుప్రభువారిని ఆశ్రయం ఇవ్వలేదు గాని బెతానియాలో యేసయ్యను మరియా మార్త, లాజరు, సీమోను అతనిని చేర్చుకున్నారు

**సీమోను, మార్త, మరియ, లాజరు యేసుప్రభువారిని ఎంతగానో ప్రేమించి వారితో మాట్లాడి వారిని సంతోషపరచేవారు.  

**బెతనీయ గ్రామంలో లాజరు,మరియ, మార్త చిన్నకుటుంబం, వారు అన్ని కష్టాలు వున్నా ప్రభువారు వెళ్ళినపుడు సంతోషంగా అతనికొరకు ఎదురు చూడటం యేసుప్రభువారిని ఆహ్వానించడం గొప్ప విషయం

**చదవబడిన వాక్యం సందర్భములో వారు అందరు భోజనానికి కూర్చొని ఉన్నపుడు ఒక స్త్రీ వచ్చి విలువైన అత్తరు అయన పై నుండి పోసి కన్నీరు విడిచి ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తోంది

**
ఇది చూసి యేసుప్రభువారి శిష్యులు ఆమెను ఇంత విలువైన అత్తరును నష్టపరచితివని కోప్పడ్డారు., అది చూసి యేసుప్రభువారు ఎందుకు ఆమెను తొందరపెట్టుచున్నారని ఆమె నా కొరకు ఒక మంచి పని చేసినది అని చెప్పెను.

1. రోజులలో మనం దేవునికి ఏమి ఇస్తున్నాం

**మనం మన విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా
**మన మీద అధికారమును దేవునికి ఇస్తున్నామా
**మనకున్న అర్హతలను దేవునికి ఇస్తున్నామా, మనలను మనం పరిశీలించుకోవాలి.

**ఆమె ఐతే నా భూస్థాపన నిమిత్తం నన్ను అభిషేకించినది అని యేసయ్య చెప్పారు.

2. పాపాత్మురాలైన స్త్రీ  యేసయ్య పాదాల మీద పడుతున్నది అని వారు అనుకొనుచుండగా యేసయ్య మాత్రం ఈమె నా కొరకు గొప్ప కార్యం చేసింది అని చెప్పారు.

దేవుని వాక్యంలో మనం గమనిస్తే
యోహాను12:3
అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు అత్తరు వాసనతో నిండినది

3.ఇక్కడ చుస్తే స్త్రీలకు అలంకరమైనది, ఘనత కలిగినది ఏమిటిఅని అంటే తన తలవెంట్రుకలు

దేవుని వాక్యములు చుస్తే
1 కొరింథీయులకు11:15
15 స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.

**స్త్రీకి ఘనత అని తలవెంట్రులను గూర్చి దేవుని వాక్యము తెలియజేస్తుంది, అటువంటి ఘనత కలిగిన తలవెంట్రుకలతో ఆమె యేసయ్య పాదాలకు తన వద్ద ఉన్న విలువైన అత్తరును వ్రాసి  కన్నీరు విడిచింది.  

4.లాజరు చనిపోయిన సంగతిని గూర్చి మనం గమనిస్తే

లాజరు చనిపోయినపుడు, మార్త నీవు ఉంటె లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అని చెప్పగా, మరియ మాత్రం అయన పాదాల దగ్గర కూర్చొని గడుపుతుంది.

ఎందుకు మరియా యేసయ్య పాదాల దగ్గర ఉన్నది అని అంటే

**మరియకు తెలుసు యేసయ్య పాదముల దగ్గర గొప్పదైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కలదు అని అందుకే అయన పాదముల చెంత చేరింది, ఇక్కడ మరియ తన విలువైన సమయాన్ని దేవుని ఇచ్చింది

5.అబ్రాహామును గూర్చి మనం ధ్యానం చేసుకుంటే

**అబ్రాహాము పిల్లలు లేక ఏడుస్తుండగా, దేవుడు ఆయనకు వాగ్దానము చేసి వాగ్దానాపుత్రునిగా ఇస్సాకుని అనుగ్రహించారు, ఇస్సాకు అంటే అబ్రాహాముముకు ఎంతో ప్రేమ. అప్పుడు దేవుడు తన ఒక్కగాని ఒక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా కోరగా అబ్రాహాము ఇస్సాకును సిద్ధపరచగా, దేవుడు అబ్రాహాము విశ్వాసమును బట్టి ఆయనను అనేక జనములకు తండ్రిగా దీవించి తన కుమారునికి బదులుగా అక్కడ ముళ్ళ పొదలలో ఉన్న గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించామని చెప్పాడు.

**ఇక్కడ అబ్రాహాము తనకు విలువైన కుమారుని కూడా దేవునికి విధేయుడై బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.

దేవునికి విలువైనవి ఇచ్చుటను గూర్చి దేవుని వాక్యమును గమనిస్తే 

 ప్రకటన గ్రంథము4:10
10 యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు

**ఇక్కడ వాక్యములో ఇరువది నలుగురు పెద్దలు యేసయ్య ముందు వారికిరీటములను ఉంచి నమస్కరించుట యేసయ్యకు ఇచ్చిన విలువను గూర్చి చెప్తుంది.

6.
దేవుని కొరకు ఉన్నతమైన దానిని గూర్చి పౌలు భక్తుని మాటలను గమనిస్తే

ఫిలిప్పీయులకు3:7
అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.

**దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అని అయన చెప్తున్నట్లు మనం గమనించవచ్చు.

7.నీకన్నులకు ఇష్టమైన దానిని దేవుడు తెసివేస్తాను అని దేవుని వాక్యము ద్వారా చెప్తున్నాడు.

యెహెజ్కేలు24:21
21 ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటిం పుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చట గాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.

**క్రైస్తవ్యం అంటే అయన కొరకు జీవించడం, అయన బలి కోరే దేవుడు కాదు కానీ, ఆశీర్వదించే దేవుడు

**ఈలోకంలో మనకు అయన కంటే విలువైనది ఏది ఉండకూడదు, దేవునికి విలువైంది ఇవ్వడం ఇంత కంటే గొప్ప విషయం ఏది ఉండదు

**మన గృహము ఎలా ఉండాలి అని అంటే దేవునిని కలిగి అత్తరు సువాసన గలవారముగా ఉండాలి.,ఆయనకు విలువైన వారముగా ఉండాలి, అయన కొరకు జీవించాలి
 
యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

*********************************************************************

38th Lentday 2019

18/04/2019
పరిశుద్దవారము
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
సిలువ శ్రమల ధ్యానకుటములు
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic:అంతిమతీర్పు - హెచ్చరికలు 
 
లూకా 22:14-23
19 పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తు తులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాప కము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.

చదవబడిన వాక్యంలో మనం గమనిస్తే యేసుప్రభువారు అప్పగించబడిన రాత్రి, అయన మనకు అప్పగించిన భాధ్యతను గూర్చి మనకు జ్ఞాపకం చేస్తుంది.

**యేసుప్రభువారికి తెలుసు అయన యెరూషలేములో ప్రవేశించినపుడు తన ప్రజలైన యుధులైనవారి చేత అయన బాధింపబడతారు అని తెలుసు ఆయనను వారు ఎంతో శ్రమ పెడతారు అని తెలుసు.

**ఆరోజు రాత్రి తన శిష్యులతో కలిసి ఆఖరిసారి భోజనము చేస్తున్నపుడు అయన వారికీ ఇచ్చిన భాద్యతను గూర్చి అయన చెప్పిన హెచ్చరికలను గూర్చి మనం ధ్యానించుకుందాం

1.మొదటిగా యేసయ్య సిద్ధపాటును గూర్చి చెప్తున్నారు.
బైబిల్ గ్రంధమును మనం గమనిస్తే 
లూకా 22:7-11
**పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసయ్య పేతురును, యోహానును, చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.

**వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును

**అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను.

మేడ గదిలో పస్కాను సిద్ధ పరచుడని వారితో చెప్పెను., పస్కా అనునది అమూల్యమైనది. పస్కాను నిత్యమూ ఒక కట్టడగా ఆచరించాలి అని చెప్తున్నారు.

2.పాతనిభంధన గ్రంధములో పస్కాను గూర్చి గమనిస్తే

** పస్కాను ఆచరించుట ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకు విడుదల కలిగింది, వారు చాల శ్రమలు, భాదలు మోయలేని స్థితిలో దేవునికి మొఱపెట్టినపుడు, ఫరో మనసు మారాలి వారి బానిస బ్రతుకులకు విముక్తి కలగాలి అని, ఫరో హృదయంలో భయం పుట్టించి అయన హృదయం మారాలి అని వారు ప్రయత్నిస్తున్నారు.

**అప్పుడు వారు పస్కా గొఱ్ఱెపిల్లను వధించి గొర్రెపిల్ల రక్తమును ఒక హిస్సోపు కమ్మేతో వారి ద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీద వ్రాయడం ద్వారా వారు నాశనపు దూత నుండి రక్షించాబటానికి గుర్తుగా విధంగా ఆచరించారు.

3.ఈలా పస్కాను ఎందుకు చేయాలి అని అంటే

నిర్గమకాండము12:13-14
13 మీరున్న యిండ్లమీద రక్తము మీకు గురుతుగా ఉండును. నేను రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను.నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
14 కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.

**వారి భాదల నుండి విముక్తి కలిగి వారికీ రక్షణ కలగాలి అని అంటే కేవలం గొఱ్ఱెపిల్ల రక్తము ద్వారా కలుగుతుంది కాబట్టి విధంగా నిత్యమైనకట్టడగా ఆచరించాలి.
** ఆచరణయే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆచరిస్తున్నారు


4.ఎందుకని పస్కాను ఆచరించమని అయన చెప్తున్నారు.

 **ఎందుకని అంటే వారికీ వారు ఏమిటో తెలియాలి, వారి స్థితి ఏమిటో తెలియాలి.

**ఇక్కడ గొఱ్ఱెపిల్లను వధించి ఆచరించవలసిన అవసరంలేదుగాని, ఎందుకంటే యేసుప్రభువారు పస్కా గొఱ్ఱెపిల్లగా బలిఅవ్వడానికి సిద్ధమయ్యారు.

**అప్పుడు యేసయ్య ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారి కిచ్చిఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నారక్తము అని చెప్పి దీనిని తినండి, త్రాగండి దీనిని చేయునపుడు నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను.

ఎందుకు యేసుప్రభువారు ఆలా చెప్పారు అని అంటే

**ఎందుకంటే మీ పాపముల కొరకు నా శరీరము, రక్తమును చిందించి నాలుగగొట్టబడుతుంది. మరియు లేఖనంలో ప్రవచనములు నెరవేర్పునకు వచ్చాను అని సాదృశ్యంగా చెప్పారు.

5.ఎందుకు యేసుప్రభువారు తన శరీరమును రొట్టెతో పోల్చారు అని అంటే

**రొట్టె బలము కలిగిన ఆహారము, ఎన్నో పోషకవిలువలు కలిగిన ఆహారము, ఆరోగ్యము కలిగించే ఎన్నోగుణములు కలిగినది
**కానీ అటువంటి ఒక గోధుమ, రొట్టెగా మారాలి అంటే అది ముందుగా నలుగగొట్టబడాలి,
దుళ్లగొట్టబడాలి తరువాత దంచబడాలి.

**అటువంటి శ్రమను, భాదను యేసయ్య మనకొరకు భరించారు, అయన అప్పగింపబడిన తరువాత వారి ద్వారా అయన ఎంతగానో నాలుగగొట్టబడ్డారు, అయన కొరడా దెబ్బలతో అయన శరీరం దుళ్లగొట్టబడింది, అయన మనకొరకు శారీరకంగా హింసించబడ్డారు అందుకే అయన తన శరీరమును రొట్టేతో సాదృశ్యంగా పోల్చారు

6. పస్కాను ఆచరించుట వలన ఏమి కలుగుతుంది అని యేసయ్య చెప్తున్నారు.

అయన అమూల్య రక్తము ద్వారా మనకు విమోచనకలుగును.
1 పేతుర1:18
అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.

అయన అమూల్యరక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును.
1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.

**పస్కాను ఆచరించునపుడు మనకు సిద్ధపాటు కలిగి ఉండాలి
**అయన రక్తము పరిశుద్ధమైనది కావున మనం పరిశుద్ధంగా ఉండాలి.

యేసుప్రభువారితో కలిసి పస్కాను ఆచారించు వారందరు పరిశుద్ధులేనా, పవిత్రులేనా.
**మనం యోగ్యత కలిగి తీసుకోవాలి, అని అయన మనలను హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు.

**అయన మనకు ఇచ్చిన హెచ్చరికలను మనం జ్ఞాపకం చేసికొని ఈ పస్కాను ఆచరించాలి.  

7.అయన ఇచ్చిన హెచ్చరికలను గూర్చి గమనిస్తే 

**అయన చెప్పిన మొదటి హెచ్చరిక పవిత్రంగా చేయాలి.

యోహాను13:10యేసు అతని చూచి స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను.

**మనం ఎలా ఉన్నాము ఆలోచించుకోవాలి, మనం పవిత్రులుగా ఉన్నామా అపవిత్రులుగా ఉన్నామా ఆలోచించుకోవాలి

**అయన చెప్పిన రెండవ హెచ్చరిక విశ్వసించి చేయాలి.

యోహాను 6:64 "మీలో విశ్వసించనివారు కొందరున్నారు'' అని వారితో చెప్పెను.విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటి నుండి యేసునకు తెలియును."
**అయన యందు విశ్వాసం కలిగి ఆచరించాలి

**అయన చెప్పిన మూడవ హెచ్చరిక మంచిబుద్దిని కలిగి స్వీకరించాలి.
 
శిష్యుడైన యూదాలాగా దొంగబుద్దిని కలిగి ఉండరాదు.
**పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యకు విలువైన అత్తరు ఎందుకు నష్టపరచితివని యేసయ్య శిష్యుడైన యూదా దొంగ బుద్దితో అనిన మాటలను గమనించవచ్చు.

మార్కు14:5 అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.

**యేసయ్యను భాదపెట్టు పనులను చేయకూడదు.


యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.