Stuthi patalu 1-22



1.అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)            ||ఆహాహా||
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2)                    ||ఆహాహా||
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2)     ||ఆహాహా||
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)             ||ఆహాహా||
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2)                 ||ఆహాహా||

2.అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము

ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)
పాపముల నుండి విడిపించును – యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును – క్రీస్తేసు నామము (2)       ||యేసు నామము ||
సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)        ||యేసు నామము ||
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)            ||యేసు నామము ||

3.అన్నీ సాధ్యమే

యేసుకు అన్నీ సాధ్యమే (2)

అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
ఆ యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2)           ||అన్నీ సాధ్యమే||
మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2)           ||అన్నీ సాధ్యమే||
బండనే చీల్చగా – జలములే పొంగెను
ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని
మెండైన తన కృపలో – నీకండగా నిలచును (2)           ||అన్నీ సాధ్యమే||
ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలని – పూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదన – ఆలించి మన్నించును
ఏ పాటి వ్యధలైననూ – ఆ సిల్వలో తీర్చును (2)           ||అన్నీ సాధ్యమే||
కష్టాల కడలిలో – కన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2)           ||అన్నీ సాధ్యమే||

4.అపరాధిని యేసయ్యా

కృపజూపి బ్రోవుమయ్యా (2)

నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

5.ఆయనే నా సంగీతము బలమైన కోటయును

జీవాధిపతియు ఆయనే

జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే||
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)          ||ఆయనే||
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2)       ||ఆయనే||
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2)       ||ఆయనే||

6.ఆరాధన యేసు నీకే (4)

నీ చిత్తం నేను జరిపెద

చూపించే మార్గంలో నడిచెద
నీ సన్నిధిలో నే నిలిచెద
నా ప్రియ యేసువే (2)          ||ఆరాధన||
సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్
మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము
గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు
మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2)         ||ఆరాధన||
దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు
దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం
ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు
రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2)       ||ఆరాధన||

7.ఆరాధించెదను నిన్ను

నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)

ఆనంద గానముతో ఆర్భాట నాదముతో (2)        ||ఆరాధించెదను||
నీ జీవ వాక్యము నాలో
జీవము కలిగించె (2)
జీవిత కాలమంతా
నా యేసయ్యా నీకై బ్రతికెదను (2)       ||ఆరాధించెదను||
చింతలన్ని కలిగిననూ
నిందలన్ని నన్ను చుట్టినా (2)
సంతోషముగ నేను
నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2)      ||ఆరాధించెదను||

8.ఆశ్చర్యకరుడా స్తోత్రం

ఆలోచన కర్తా స్తోత్రం (2)

బలమైన దేవా నిత్యుడగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)
ఆహాహా.. హల్లెలూయా (7)
ఆహా ఆమెన్
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివి స్తోత్రం (2)
నీ రక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం (2)
ఆహాహా.. హల్లెలూయా (7)
ఆహా ఆమెన్

9.ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త

బలవంతుడైన దేవుడా

నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను (2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (2)     ||ఆశ్చర్యకరుడా||
ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్
ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
దొంగలను మార్చి దయచూపినావు (2)
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు         ||వి విష్||
నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు         ||వి విష్||

10.ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది

నన్ను జయించె నీ ప్రేమ (2)   ||ఆశ్చర్యమైన||
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే      ||ఆశ్చర్యమైన||
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే      ||ఆశ్చర్యమైన||
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు        ||ఆశ్చర్యమైన||
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే    ||ఆశ్చర్యమైన||

11.ఆహా ఆనందమే మహా సంతోషమే

యేసు పుట్టె ఇలలో (2)

ఆనందమే మహా సంతోషమే
యేసు పుట్టె ఇలలో (2)       ||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2)      ||ఆనందమే||
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2)      ||ఆనందమే||
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2)          ||ఆనందమే||

****************************************************************



12.ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం

ఇది లోక కళ్యాణం

మేరి పుణ్యదినం – (2)
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో       ||ఇది||
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో       ||ఇది||

13.ఇదిగో దేవా నా జీవితం

ఆపాదమస్తకం నీకంకితం (2)

శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం        ||ఇదిగో||
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||
విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించి ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||

14.ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే

అల్పమైన దానికా ఆరాటం

త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)     ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా       ||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో        ||ఇంతలోనే||


15.ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను

తూలనాడక తనదు జాలి చూపినదా       ||ఈలాటిదా||

ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె        ||ఈలాటిదా||
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె         ||ఈలాటిదా||
నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె         ||ఈలాటిదా||
పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె         ||ఈలాటిదా||
నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు          ||ఈలాటిదా||
శోధనలు నను చుట్టినప్పుడు – నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి – యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు        ||ఈలాటిదా||

16.ఎన్ని తలచినా ఏది అడిగినా

జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా

నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||

17.ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2)         ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2)        ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2)             ||ఎందుకో||

18.ఎంత కృపామయుడవు యేసయ్యా

(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)

నలిగితివి వేసారితివి (2)
నాకై ప్రాణము నిచ్చితివి (2)     ||ఎంత||
బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం (2)
మార్చినావు నీ స్వాస్థ్యముగా (2)
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2)     ||ఎంత||
కన్న తల్లి తండ్రి నన్ను మరచినను
ఈ లోకము నన్ను విడచినను (2)
మరువలేదు నన్ను విడువలేదు (2)
ప్రేమతో పిలచిన నాథుడవు (2)     ||ఎంత||
కరువులు కలతలు కలిగినను
లోకమంతా ఎదురై నిలచినను (2)
వీడను ఎన్నడు నీ సన్నిధి (2)
నీ త్యాగమునే ధ్యానించెదన్ (2)     ||ఎంత||


19.ఓ మానవా.. నీ పాపం మానవా

యేసయ్య చెంత చేరి

నీ బ్రతుకు మార్చవా (2)

పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)         ||ఓ మానవా||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)         ||ఓ మానవా||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2)         ||ఓ మానవా||


20.ఓరన్న…  ఓరన్న

యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న

యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా    ||ఓరన్న||
చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)              ||ఓరన్న||
పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2)             ||ఓరన్న||
సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)     ||ఓరన్న||


21.ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన

నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)
సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)           ||ఎంత మంచి||
ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)          ||ఎంత మంచి||
సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)         ||ఎంత మంచి||

22.ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా

దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2)           ||ఏ బాధ||
ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా            ||దిగులేల||
పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా          ||దిగులేల||