నవంబర్ 2018 Msgs


 03Nov2018
ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 145 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 8,329,583
Topic: సమీపం
ఎఫెసీయులకు 2:11-13
13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు

సమీపం అనే మాట ప్రాముఖ్యత కలిగిన మాట
**సమీపం అంటే దగ్గరగా అని అర్ధం.
**మన జీవితంలో ఏమిటి సమీపంగా ఉంది., దేవుడు ఏమి సమీపంగా ఉంది అని చెప్తున్నాడు.

 మన జీవితంలో అయన రక్షణ సమీపంగా ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు.  
రోమీయులకు 13:11
మరియు మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళ యైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వా సులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.

**బైబిల్లో సమీపం అనే మాట క్రీస్తు రాకడకు సూచనగా ఉన్నది.
**మన జీవితంలో సమీపంగా ఉండటం వలన ఒకరినొకరు ఆదరించుకొనుటకు
సహాయం కొరకు సమీపంగా ఉండాలని అనుకొంటాము.
**అదే విధంగా మనం దేవుడు కూడా మనకు సమీపంగా ఉండాలని కోరుకొంటాం.

దేవుడు మన సమీపంగా ఉంటె ఏమి కలుగుతుంది.
1. మనకు దైర్యం కలుగుతుంది.
2. మనకు శ్రమలలో ఆదరణ, బలం కలుగుతుంది.
3. కష్టాలలో మనకు సహాయం కలుగుతుంది.
4. దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది.

బైబిల్లో దేవుడు ఎవరికీ, విషయంలో సమీపంగా ఉంటాడు.
 
1. తగ్గింపు కలిగి విరిగి నలిగిన వారికీ దేవుడు సమీపంగా ఉంటాడు.
కీర్తనల గ్రంథము 34:18
18 విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.
2. శ్రమలలో భాదలలో దేవునికి మొఱ పెట్టు వారికీ దేవుడు సమీపంగా ఉంటాడు
ద్వితీయోపదేశకాండమ 4:7
7 ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి గొప్ప జనమునకు దేవుడు సమీపముగా నున్నాడు?
3. నిజముగా మొఱ పెట్టు వారికీ సమీపంగా ఉంటాడు.
కీర్తనల గ్రంథము 145:18
18 తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
4. క్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపంగా ఉంటాము.
ఎఫెసీయులకు 2:13
13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. 
అటువంటి గొప్ప ప్రభువును మన జీవితాలలో కలిగి అయన సమీపంగా ఉండాలని,
 అట్టి కృప మన అందరికి యేసయ్య అందివ్వాలని ఆశిస్తూ.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

******************************************************************

11Nov2018
కృతజ్ఞతార్పణలపండుగ

ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు 
నిర్గమకాండము 23:14-17
16 నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.

**దేవుడు తన బిడ్డలైన వారికీ కొన్ని సూచనలు ఇస్తున్నాడు.

**దేవుడు మనకు ఆజ్ఞలను నియమాలను కొన్ని కట్టడాలను నిబంధనలను చెప్తున్నాడు 

1. పులియని రొట్టెల పండగ 

2. ప్రధమ ఫలముల పండగ

3. కోత పండగ (కృతజ్ఞతార్పణల పండుగ )
**కోత పండగ అనగా  నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగ.

**కోతపండుగలో వారు మొదటి భాగాన్ని దేవుని దగ్గరకు తీసుకురావలి

**మనం ఆలా దేవుని దగ్గరకు మొదటి ఫలము తీసుకు రాలేము కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత కానుక అర్పించాలి

కోత పండగలో వారు ఎందుకు కృతజ్ఞత కానుక చెల్లిస్తున్నారు

1. దేవుడు మంచి భూములను ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞత కానుక చెల్లిస్తున్నారు.
2. పంటలను కాపాడేది దేవుడే అని కృతజ్ఞత కానుక చెల్లిస్తున్నారు.
3. కష్టానికి ఫలితం ఇచ్చింది దేవుడు కాబట్టి కృతజ్ఞత కానుక చెల్లిస్తున్నారు.

మనం ఎందుకు దేవునికి కృతజ్ఞత కానుకులను తీసుకురావాలి.

**దేవుని సంఘము పొలమునకు సూచనగా ఉన్నది. 

** పొలములో మనం ఇచ్చే ప్రతి కానుక ఒక విత్తనం అది గొప్పగా ఫలించి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఇస్తుంది.

**కాబట్టి కృతజ్ఞత అర్పణల పండుగ మన అందరికి సంబందించిన పండుగ.

బైబిల్లో దేవునికి ఇచ్చే విషయంలో రాజైన దావీదును పరిశీలన చేస్తే దేనికోసం దావీదు ధనమును సంపాదించాడు

1. దావీదు దేవుని మందిరము కోసం అన్నింటిని సంపాదించాడు.

1దినవృత్తాంతములు  29:1-2
కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక పని బహు గొప్పది.
2
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని. 

2. దావీదు దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత సమకూర్చాడు.

1దినవృత్తాంతములు 29:3
3 మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.

3. దావీదు సమకూర్చాడు , తనకు ఉన్నదానిని దేవుని మందిరం కొరకు సమర్పించాడు

దేవునికి ఎలా ఇవ్వాలో దావీదు చెప్తున్నాడు.

1దినవృత్తాంతములు 29:9
9 వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనః పూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి.

4. దేవుని మందిరం కొరకు సమర్పించమని తన పరివారమును అడిగాడు. 

దేవునికి ఎలా ఇస్తే ఇష్టపడుతారు.
1దినవృత్తాంతములు 29:17
17 నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. 

దావీదు దేవునికి చేసిన కృతజ్ఞతతో కూడిన ప్రార్ధన దావీదు గొప్పతనం చెప్తుంది. 

1దినవృత్తాంతములు 29:11-12
11 యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు.
12
ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. 

1దినవృత్తాంతములు 17:16
16
రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెనుదేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?
దేవునికి ఇచ్చే విషయంలో సణుగకోకూడదు విసుగకోకూడదు వెనకాడకూడదు
  
ఈరోజు మనకు కలిగిన అన్నింటిలో దేవునికి ఇవ్వాలి దేవుని ప్రేమను కృపను పొందాలి. 

అన్నిటికన్నా ముఖ్యముగా దేవునికి మన మారు మనసు పొందిన హృదయమును దేవునికి ఇవ్వాలి.
దేవుడు మనకు ఇచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తు

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్



****************************************************************
18Nov2018
ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 138 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 5,636,581,614
Topic: గొప్పది/గొప్పవాడు
యోహాను సువార్త  8:52-59
53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
54
అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.  

"గొప్పది అంటే అన్నిటికంటే ఉన్నతమైనది అని అర్ధం."
బైబిల్లో యుధులైన వారు తమను తాము గొప్పగా భావించుకొనే వారు ఎందుకంటే 
**యుధులైన వారు మంచి పరిజ్ఞానము కలిగిన వారు అని గొప్పగా భావించుకొనేవారు.
**యుధులైన వారు అందరికంటే అందము కలిగిన వారు అని గొప్పగా భావించుకొనేవారు.
**యుధులైన వారు నీతి కలిగి యదార్థము ఉండు వారము అని గొప్పగా భావించుకొనేవారు.

యూదులు వారిని ఎలా గొప్పగా భావించుకొనేవారు?
మొదటిగా పితరుడైన అబ్రాహామును బట్టి వారును గొప్పగా భావించుకొనేవారు
**ఎందుకంటే ఇస్రాయేయులకు మూలా పురుషుడు అబ్రాహాము.,కావున వారిని వారు గొప్పగా భావించుకొనేవారు.
యోబు బైబిల్లో దేవుని గురించి పలికిన మాట.
యోబు గ్రంథము 19:25
25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాతఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.
యేసు ప్రభువారు బైబిల్లో పలికిన మాట. 
యోహాను సువార్త 3:31
31 పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమి నుండి వచ్చువాడు భూసంబంధియై భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చు వాడు అందరికి పైగానుండి

మరి మనం ఎవరిని గొప్పగా చూస్తున్నాము
**మనము దేవుని కంటే ఎవరిని గొప్పగా చూడకూడదు.
1.మన దేవుడు అబ్రాహాము కంటే గొప్పవాడు.
2.మన దేవుడు యాకోబు కంటే గొప్పవాడు. 
3.మన దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. 
4.మన దేవుడు యోనా కంటే గొప్పవాడు. 
5.మన దేవుడు దేవాలయము కంటే గొప్పవాడు. 

1.మన యేసయ్య అబ్రాహాము కంటే గొప్పవాడు.
యోహాను సువార్త  8:53
53 మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా?
**
అబ్రాహాము దేవునితో మాట్లాడేవాడు.
*దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు.
**అబ్రాహాముకు అట్టి కృపను ఇచ్చింది దేవుడు.

2.
మన యేసయ్య యాకోబు కంటే గొప్పవాడు.
యోహాను సువార్త 4:12
12 తానును తన కుమాళ్లును, పశువులును, యీబావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను.
కీర్తనల గ్రంథము 146:5
5 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు
**ఎందుకంటే యాకోబుకు సమస్తము ఇచ్చింది దేవుడు కాబట్టి మనము దేవుని కంటే ఎవరిని గొప్పగా చూడకూడదు

3.మన యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు. 
మత్తయి సువార్త 12:42
42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంత ములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
**
జ్ఞానము పరిపాలన విషయంలో పేరు కలిగిన వాడు సొలొమోను.
**కానీ అట్టి జ్ఞానము సొలొమోను కి ఇచ్చిందది దేవుడు కాబట్టి దేవుడు అందరికంటే గొప్పవాడు.
 
4.మన యేసయ్య యోనా కంటే గొప్ప వాడు.
మత్తయి సువార్త 12:41
41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
**యోనా గొప్ప సువార్తికుడు లక్ష మందికి పైగా దేవునిలోనికి నడిపించాడు 
**కానీ యోనాకి అట్టి కృపను ఇచ్చింది దేవుడు. 
**యేసు ప్రభువారు మూడు దినములు సమాధి నుండి తిరిగి లేచి తన శిష్యులకు కనిపించి, నడిపించారు. కాబట్టి దేవుడు అందరికంటే గొప్పవాడు.

5.మన యేసయ్య దేవాలయము కంటే గొప్పవాడు.
మత్తయి సువార్త 12:6
6
దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
**యదార్థతతో ఎవరైతే దేవుని ఆలయంలో ప్రార్దిస్తారో వారిని దేవుడు కరుణిస్తాడు.
**దేవాలయం నుండి దేవుడు వారికీ కావలసింది దయచేస్తాడు
**కావున దేవాలయం కంటే దేవుడు గొప్పవాడు.
**అయన బిడ్డలమైన మనము అయన మందిరం, కావున దేవాలయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి
****మన యేసు ప్రభువారికంటే ఎవరు గొప్పవారు కాదు*****
మనలను మనం దేవుని ఎదుట సరిచేసుకొని దేవుని కృపను పొందాలని అట్టి కృప మన అందరికి యేసయ్య ఇవ్వాలని ఆశిస్తూ.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..