March2020 Messages




1March2020 ఆదివారం ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

రోమ5:6-10, 8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

చదవబడిన వాక్యభాగములో పౌలు భక్తుడు ప్రాముఖ్యమైన మూడు విషయాలను గూర్చి మనకు ఈరోజున గుర్తుచేస్తున్నారు, ఆ మూడు విషయాలు ఏమిటీ అని అంటే మనము భక్తిహీనులమై ఉండగా,  పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా క్రీస్తు మనకొరకు చనిపోయెను. యేసుప్రభువారు మన కొరకు చేసిన త్యాగం మరువలేనిది అది వెలకట్టలేనిది, ఒక పాపి కోసము భక్తిహీనులమైన వారి కొరకు చనిపోయినది ఎవరైనా ఉన్నారు అని అంటే అది యేసుప్రభువారే.

బైబిల్ గ్రంధములో ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు రోమ 3:11.
అలంటి భక్తిహీనులమైన వారికొరకు మనము ఇంకను పాపులమై ఉండగా మన కొరకు చనిపోయినది యేసుప్రభువారు. 

మరి ఈపాపం అంటే ఏమిటి బైబిల్ గ్రంధములో ఈ పాపమును గూర్చి, ఏది దేవుని దృష్టికి పాపమనబడుతుందో మనం ధ్యానించుకుందాం.

1.మొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యము చెప్తుంది.

1యోహాను3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

ఈరోజున పెద్ద పెద్ద విషయాలలో అనబడుతుంది అని మనం అనుకొంటాము గని ఇక్కడ దేవుని వాక్యం మనం చుస్తే దేవుని యొక్క మాటలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం అని దేవుని వాక్యం చెప్తుంది.

ఇక్కడ దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, నేను చేసిన మనిషి తన మాట వినాలి, అ నా డు ఆదామును ఆ జీవవృక్ష ఫలమును తినవద్దని ఆజ్ఞ ఇచ్చినపుడు తన మాట పాటించాలి అని దేవుడు ఉద్దేశమైవుంది, కానీ సాతాను ఆ ఆజ్ఞను మీరే లాగా వారితో పాపం చేయించాడు. ఇక్కడ దేవుడు ఏది చేయవద్దని ఆదాముతో చెప్పాడో అది చేసి దేవుని ఆజ్ఞను మీరాడు అప్పుడే మనలోకి పాపం ప్రవేశించింది.

జన్మతః పాపులైన మన పాపములను బట్టి యేసుప్రభువారు మన కొరకు చనిపోయారు

అందుకే మనం ఈరోజున మనలను మనం పరిశీలించుకుని దేవుని మాట విని ఆప్రకారం నడుచుకొను వారీగా మనం ఉండాలి అని తీర్మానం చేసుకోవాలి.

2.రెండవదిగా మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట పాపము అని మనం దేవుని వాక్యము చెప్తుంది.

1సమూయేలు12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.

ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెప్తుంది అని అంటే మన మట్టుకే కాకుండా ఇతరుల నిమిత్తము కూడా ప్రార్ధన చేయాలి అని ఆవిధంగా ప్రార్ధన చేయుట మనుటయే పాపం అని చెప్తుంది, ఈరోజున మనం మన కుటుంబం కొరకు నిత్యం ప్రార్ధన చేయువారిగా ఉండాలి, బిడ్డలకొరకు ప్రార్ధన చేయువారిగా మనం ఉండాలి అంతే కాకుండా మన సంఘముకొరకు, సమాజం కొరకు , ఎంతోమంది నశించిపోవుచున్న ఆత్మల కొరకు, వారి కొరకు ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుచున్న క్రైస్తవ బిడ్డల కొరకు సేవకుల కొరకు మనం నిత్యం దేవునికి మొరపెట్టువారిగా ఉండాలి, దానికి మనకు మన ప్రభువైన యేసుక్రీస్తువారే మాదిరి, అయన ఓలివా కొండపై నిత్యం కన్నీటితో మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేసేవారు. అందుకే మనం ప్రతినిత్యం అందరికొరకు ప్రార్ధన చేయువారిగా ఉండాలి లేనిచో మనం పాపం చేసినవారమవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది.

3.మూడవదిగా తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము  

1సమూయేలు15:23 తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము.

తిరుగుబాటు చేయుట పాపము అని దేవుని వాక్యం చెప్తుంది, ఏమిటి ఈ తిరుగుబాటు అని అంటే దేవుని చేత ఎన్నో మేలులు పొంది మరల దరి తప్పి విగ్రహాల తట్టుకు తిరిగే వారిని, సోదె చెప్పువారిని ఉద్దేశించి దేవుడు ఈమాటలను పలుకుచున్నారు.

ఇశ్రాయేలీయుల ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారికీ బానిస బ్రతుకు నుండి విడిపించుటకు, విడుదల కలిగించుటకు దేవుడు వారిని ఎఱ్ఱసముద్రమును దాటించి వారికీ నీళ్లు ఆహారమును ఇచ్చినా వారు దేవుని చేసిన మేలును మరచి విగ్రహాలను పూజిస్తున్నారు. అనాడు మోషే ఎన్నో బాధలు పడి ఎన్నో సూచక క్రియలను, ఎన్నో అద్భుతకార్యములను వారి ఎదుట చేసినపుడు వారు తిరిగి ఆహారం కొరకు, తిండికొరకు దేవుని నిందించినట్లుగా మనకు తెలుసు దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేసారు.

ఈరోజున మనం కూడా అటువంటి తిరుగుబాటు స్వభావం కలిగి  ఉంటున్నామా దేవుని ద్వారా అనేకమైన మేలులు పొంది తిరిగి దేవుని మరచి జీవిస్తున్నామా, సోదేచెప్పు వారి మాటలను వినుచున్నామా, అటువంటి మాటలను చెప్పుచున్నామా మనలను మనం పరిశీలించుకోవాలి మనలను మనం సరిచేసుకోవాలి దేవుని బిడ్డలుగా మేల్కొని జీవిద్దాం.


4.నాల్గవదిగా చెడునడతయు దేవుని దృష్టికి పాపము అని దేవుని వాక్యం చెప్తుంది.

ద్వితీయోపదేశకాండము9:18 మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి,

ఈరోజున మనం ఎలా ఉన్నాము, మన నడవడిక ఎలా ఉన్నది, మన జీవితం ఎలా సాగుతుంది, మనం చెడునడతను కలిగి ఉంటె అది దేవునికి దృష్టికి పాపం అని తెలిసి కూడా ఆవిధంగా జీవిస్తున్నామా మనలను మనం సరిచేసుకొని జీవించాలి.

5.ఐదవదిగా మేలైనది తెలిసి కూడా ఆలాగున చేయకుండుట పాపం అని దేవుని వాక్యం చెప్తుంది.

యాకోబు4:17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.

అనేకమంది దేవుని సేవకులు మన దేశంలో వచ్చి మన కొరకు ఎన్నో మంచి కార్యక్రమములు చేసారు, వారిలో కొందరు వారి ప్రాణ త్యాగం కూడా చేసినట్లుగా మనకు తెలుసు. ఈరోజున మనం ఇతరులకు మేలు కలిగినది మనం చేయడానికి ముందుకు రావాలి, సేవ చేయడం నేర్చుకోవాలి. మనకు తెలిసిన మేలైన దానిని ఇతరులకు చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం.

ఈరోజున మనం దేవుని ఆజ్ఞలను పాటించువారిగా, సమాజం కొరకు, సంఘము కొరకు, దేశము కొరకు, సేవకుల కొరకు, మనుష్యులందరు కొరకు, నిత్యం ప్రార్ధించువారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. చెడునడత ఏమైనా ఉంటె విడిచిపెట్టి, మేలైనది చేయువారిగా ఉండాలి అని యేసయ్య ఈరోజు మనలను కోరుచున్నారు. యేసయ్య కృప దీవెన అందరికి కలుగును గాక ఆమెన్.

యేసయ్య  ఈమాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
********************************************



08March2020బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
C.B.M ఆదివారం ఆరాధన
వాక్యపరిచర్య Rev.సద్గుణరాజు గారు
అంశం :వదకు తేబడిన గొఱ్ఱె పిల్ల

ఈరోజున క్రీస్తుప్రభువు వారు ఎందుకు వదకు తేబడిన గొఱ్ఱె పిల్ల వలే మౌనముగా ఉండిపోయారు అని ఆలోచిద్దాం. పిలాతు నీ మీద నేరం మోపడినది అని అడిగినపుడు అయన ఎందుకు మౌనముగా ఉండిపోయారు అని ఆలోచిద్దాం, నీవు దేవుని కుమారునివైతే నిన్ను నీవు రక్షించుకోమని అక్కడవున్న కొందరు ఆయనను ఉద్దేశించి పలికినపుడు అయన ఎందుకు మౌనముగా ఉండిపోయారు అని ఆలోచిద్దాం.,

క్రీస్తుప్రభువు వారు ఎందుకు అయన  మౌనముగా ఉన్నారు అని అంటే అయన తనను తాను రక్షించుకొనుటకు ఈ లోకానికి రాలేదు కానీ అయన సర్వలోకమును రక్షించుటకు ఈలోకమునకు వచ్చారు, ఎందుకు అయన మౌనముగా ఉండిపోయారు అని అంటే మనకు పాపమునుండి విడిపించి అనేకమైన ఆశీర్వాదములను ఇచ్చుటకు అయన ఈలోకమునకు వచ్చారు.


1.మొదటిగా ఎందుకు అయన  మౌనముగా ఉండిపోయారు అని మనం ఆలోచిస్తే పాపము నుండి మనలను విడిపించుటకు అయన మౌనముగా ఉండిపోయారు.

యోహాను సువార్త 1:29 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.

పరిశుద్ధ గ్రంధము ఏమి చెప్తుంది అని అంటే., ఈలోకంలో పాపము నుండి విడిపించడానికి ఆయనకు ఒక్కడికే సాధ్యం. ఎందుకు అని అంటే అయన లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱె పిల్ల అందుకే అయన మన దోషములను బట్టి అపరాధములను బట్టి మౌనముగా ఉండిపోయారు. తేనెను ఆశించిన చీమలు ఆ తేనెను త్రాగి., త్రాగి ఆ తేనెలోనే పడి చనిపోవడం జరుగుతుంది, ఆలాగుననే పాపమనే తేనెలో సాతాను యొక్క అడుగు జాడలలో నడుస్తూ నిత్యమరణంలో పడి మనం చనిపోవుచున్నాము. ఇట్టి శాపం, పాపము నుండి విడిపించడానికి యేసుప్రభువారు మన కొరకు ఈలోకమునకు వచ్చారు., అటువంటి పాపం నుండి మనం బయటకు రావాలి అప్పుడే అయన త్యాగానికి ఒక ఉన్నతమైన విలువ ఉంటుంది.

ఏయే విషయములలో పాపం తెలియబడుచున్నది అని మనం ఆలోచిస్తే
యోబు 15:5 నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. 

పరిశుద్ధ గ్రంధములో అనేకమైన పాపములను గూర్చి వ్రాయబడినది గాని ముఖ్యముగా మనం పలికే మాటల ద్వారా పాపం తెలియబడుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ మాటలే మనలను పరిశుద్దిడివో, పాపివో, నీతిమంతుడివో నిరూపిస్తాయి. నీ హృదయంలో ఎలాంటి మాటలు ఉంటాయో అవే బయటకు వస్తాయి. యేసుప్రభువారు ఎందుకు మౌనముగా ఉండిపోయారు అని అంటే అయన మన హృదయంలో నిత్యం నివసించడానికి , మనలో హృదయమార్పు తీసుకురావడానికి, మనకు హృదయశుద్ధి తీసుకురావడానికి ఆలాగున ఉండాలి అని అంటే మనలో పాపం బయటకు రావాలి. అందును బట్టి యేసుప్రభువారు వదకు తేబడిన గొఱ్ఱె పిల్ల వలె మౌనంగా ఉండిపోయారు.

ఈపాపం వలన మనకు ఏమి తెస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది
సామెతలు14:34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.

ఈపాపం మనకు అవమానం, చేటును మనకు తెస్తుంది అందుకే మనం ఈపాపమునకు దూరంగా ఉండాలి.

ఏది ఈ పాపం నుండి మనలను బయటకు తెస్తుంది అని ఆలోచిస్తే
రోమ 8:4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.

మనకు పాపము నుండి విడుదల కలగాలి అని అంటే పాపప్రయశ్చిత్తం జరగాలి, అందుకే యేసుప్రభువారు మన అందరి పాపములను అయన  సిలువపై మోసుకొని పాపపరిహార్ధబలిగా మన పాపము నుండి, అవమానము నుండి విడిపించడానికి అయన మన కొరకు వదకు తేబడిన గొఱ్ఱె పిల్ల వలె మౌనముగా ఉండిపోయారు. అటువంటి శ్రేష్ఠమైన దేవుని మనం కలిగిఉన్నాము.

2.రెండవదిగా ఎందుకు అయన మౌనముగా ఉండిపోయారు అని అంటే అయన మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికే. 

1 పేతురు3:18 ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతు డైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయ ములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.

దేవుడు ఈసమస్త భూమండలం మీద మానవులమైన మనకు అధికారము ఇస్తే ఆనాడు ఆదాము చేసిన తప్పు వలన మనం దుష్టుని అధికారంలోనికి వచ్చాము అటువంటి దుష్టుని నుండి దేవుని యొద్దకు రప్పించడానికి యేసుప్రభువారు ఈలోకానికి వచ్చారు.

అందుకే దుష్టునినుండి విడిపించాడనికి అయన మౌనంగా ఉండిపోయారు.
గలతీ1:4 మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.

మొదటిగా ఎక్కడ ఉన్నాము, మన ఏ స్థితిలో ఉన్నాం అని ఆలోచిస్తే ,మనం ఎక్కడ ఉన్నాము అని అంటే దుష్టుని చేతిలో ఉన్నాము, అటువంటి దుష్టుని నుండి విడిపించడానికి యేసుప్రభువారు వద్దకు తేబడిన గొఱ్ఱె పిల్ల వలె మౌనంగా ఉండిపోయారు.

అందుకే సమస్త దుర్నీతి నుండి విడిపించడానికి అయన మౌనముగా ఉండిపోయారు.
తీతుకు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

దుర్నీతి అనగా ఏది నీతి కాదో అదే దుర్నీతి, అటువంటి దుర్నీతి నుండి విమోచించడానికి అయన మౌనంగా ఉండిపోయారు.

అందుకే అయన ధర్మశాస్త్రము నుండి మనలను విమోచించడానికి అయన మౌనముగా ఉండిపోయారు.
గలతీ 4:5 మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను. 

ధర్మశాస్త్రమును ఏమి చెప్తుంది అని అంటే పాపము చేస్తే దానికి శిక్షను విదిస్తుంది కానీ ఆపాపము నుండి విమోచించడానికి యేసుప్రభువారి ద్వారానే సాధ్యం.

3.మూడవదిగా అయన మనకు ఒక మంచి కాపరిగా ఉండటానికి అయన మౌనముగా ఉండిపోయారు. 

ప్రకటన గ్రంథము 7:17 ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. 

ఇశ్రాయేలీయులను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు, కన్నవారు నిన్ను మరచిన నేను నిన్ను మరువను అని అయన మనతో చెప్తున్నారు. అందుకే అయన నిత్యం మనలను సంరక్షించడానికి యేసుప్రభువారు వద్దకు తేబడిన గొఱ్ఱె పిల్ల వలె అయన మౌనంగా ఉండిపోయారు.

అయన ఎందుకు మౌనముగా ఉండిపోయారు అని అంటే
మనకు జీవజలములను ఇవ్వడానికే వాటి యొద్దకు మనలను నడిపించడానికి, అంతే కాకుండా దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయడానికి అయన మౌనముగా ఉండిపోయారు.

అంతే కాకుండా అయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మౌనముగా ఉండిపోయారు.
యోహాను సువార్త 10:10 దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

అటువంటి గొప్ప దేవుడైన ఏసయ్యను కలిగి ఉన్న మనం మన జీవితంధన్యం, అయన మనలను పాపమునుండి విమోచించడానికి మౌనముగా ఉండిపోయారు, మనలను దేవుని యొద్దకు తీసుకురావడాన్ని మౌనముగా ఉండిపోయారు, అయన మంచి కాపరిగా ఉండటానికి అయన మౌనముగా ఉండిపోయారు. అయన మనకొరకు చేసిన శ్రేష్ఠమైన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ అయన కృపను నిత్యజీవమును పొందుకోవాలి అని ఆశిస్తూ ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

**********************************************************


15March2020 బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
విశ్వవాణి ఆదివారము ఆరాధన
వాక్యపరిచర్య Rev.E.శామ్యూల్ గారు
విశ్వవాణి State Co.Ordinator
లూకా సువార్త  22:40-46
అంశం: ప్రార్ధన

లూకా సువార్త22:41 చోటు చేరి ఆయన వారితోమీరు శోధనలో ప్రవే శించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
 
చదవబడిన వాక్యమును మనం గమనిస్తే యేసుప్రభువారు ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళినపుడు అయన అక్కడ శిష్యులతో మాట్లాడటం మొదలు పెట్టినపుడు మాట్లాడిన మొదటిమాట ఏమిటి అని అంటే అది మీరు శోధనలో పడిపోకుండా మెలుకువగా ఉండి ప్రార్ధన చేయుడి అని వారితో చెప్పినట్లుగా మనంచూస్తాం. అంతే కాకుండా యేసుప్రభువారు అప్పగింపబడక ముందు అయన కొన్ని జాగ్రత్తలు వారితో చెప్పిన క్రమంలో అయన పలికిన చివరిమాట మెలుకువగా ఉండి ప్రార్ధన చేయుడి అని., ఈరోజు ప్రభువు చెప్పిన అంశం ప్రార్ధనను గూర్చి వివరంగా కొన్ని విషయాలను ధ్యానించుకొందాం.
 
1.మొదటిగా ప్రార్ధన మన జీవితంలో ఏమి చేస్తుంది అని మనం ఆలోచిస్తే

ప్రార్ధన అనేది దేవుని బిడ్డలైన వారికీ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది .
ప్రార్ధన మనలను అపాయకరమైన పరిస్థితిల నుండి పడిపోకుండా విపత్కరపరిస్థితులలో పడిపోకుండా మనలను కాపాడుతుంది.

అంతేకాకుండా మన యొక్క ప్రార్ధన మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది, అందుకే మనం వ్యక్తిగత ప్రార్ధన, కుటుంభప్రార్ధన, సహవాస పార్ధనలు చేయడం ద్వారా మనం శ్రమల నుండి ఆపదలనుండి తప్పించుకోవడానికి మనకు తోడ్పడుతుంది.

అందుకే యేసుప్రభువారు శిష్యులైన వారికీ మీరు మెలకువగా ఉండి ప్రార్ధన చేయుడి అని చెప్తున్నారు. శిష్యులకే కాదు ఈరోజున మానవులమైన మన జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండటానికి అయన మనలను ప్రార్థన చేయుడి అని హెచ్చరిస్తున్నారు మరియు బోధిస్తున్నారు.

2.ఈరోజున మనం ఎందుకు వ్యతిరేక పరిస్థితులు అనుభవిస్తున్నాము అని అంటే
 
దేవుడు ఎవరికీ అన్యాయం చేయువాడు కాదుగాని, ఈరోజున మనిషి జీవితంలో ఉన్న చెడును భయాన్ని వ్యతిరేకపరిస్థితులను అనుభవిస్తున్నాము అని అంటే మన జీవితంలో ప్రార్ధన లేకపోవుటయే మరియు అయన చెప్పినటువంటి మాట మనం వినక పోవుటయే
మనమైతే  దేవుని మాట విని ఆప్రకారం ప్రార్ధన చేయువారిగా మనం ఉండాలి., అప్పుడు మనం శోధనలో నుండి విడిపింపబడుతాము.

మన ప్రభువుతో నిత్యం ప్రార్ధన ద్వారా ఆయనతో మాట్లాడటం అనేది అయన మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం.

కీర్తనల గ్రంథము145:17 యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు
18 తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు.
19 తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును.   

మనకు పరిశుద్ధుడు., పవిత్రుడు ఐన మన ప్రభువు మనకు ఇచ్చిన గొప్ప భాగ్యం ప్రార్ధన . తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా ఆశక్తితో మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉంటాను అని అది అయన మనకు ఇస్తున్న గొప్ప భాగ్యము అని దేవుని వాక్యం చెప్తుంది.  

ద్వితీయోపదేశకాండమ 4:7 ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి గొప్ప జనమునకు దేవుడు సమీపముగా నున్నాడు?

అందుకే మనం ఏసమయమైతే అప్ప్పుడు., ఎక్కడైతే అక్కడ., సమయమున్నప్పుడు మనం మన యేసయ్యకు నిత్యం ప్రార్థిస్తే అయన మనకు సమీపంగా ఉండి మనలను శ్రమలనుండి తప్పించే దేవుడు మన యేసయ్య .

3.ప్రార్ధన ద్వారా విజయమును పొందుకున్న ఒక సందర్భమును మనం జ్ఞాపకం చేసుకొంటే

హిజ్కియా రాజుగా ఉన్నదినాలలో ఆరాజ్య ప్రజలకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చినపుడు వారు దేవునికి మొరపెట్టగా దేవుడు గొప్ప కార్యమును వారి కొరకు చేసినట్లుగా అసంధర్భములో మనం చూస్తాం. అటువంటి పరిస్తుతులు ఎదురైనప్పుడు హిజ్కియా తన ప్రజలైన వారికీ అందరు దేవుని ప్రార్ధన చేయుడని చెప్పినట్లుగా మనం చూస్తాం .,ఆప్రార్ధన ఫలితాన్ని కూడా దేవుడు వారికీ దయచేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం.

2రాజులు 19: 34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను పట్టణమును కాపాడి రక్షించుదును.35 రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి

ఇక్కడ సందర్భములో వారు ప్రార్ధించగా రాత్రి అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతము చేసినట్లుగా మనం చూస్తాం అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య అందుకే మనం నిత్యం హృదయపూర్వకంగా ఆయనకు మొరపెట్టువారిగా మనం ఉండాలి అని ఈరోజున యేసయ్య కోరుచున్నారు
 
ఈరోజున మనం సమయమున్నప్పుడు, ఏసమయంలో ఐన దేవునికి ప్రార్ధన చేసి ఆయనకు మొరపెడితే అయన మనం అడిగినది మనకు దయచేయగలిగిన సమర్ధుడు మన యేసయ్య . ఈరోజున మన ప్రభువైన యేసయ్య మనతో పలుకుచున్న మాట ఏమిటి అని అంటే మనం మన జీవితంలో ఎటువంటి పరిస్థితులలో ఐన మెలకువగా ఉండి వ్యక్తిగత ప్రార్ధన, కుటుంభం ప్రార్ధన, సహవాసప్రార్ధన కలిగి ఉండాలి అని ఆయనకు చెప్తున్నారు. అట్టి కృప ఆశీర్వాదము మన అందరమూ పొందుకోవాలి అని ఆశిస్తూ ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్  


***************************************************************

22march 2020 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు 
లూకా 21:10-19

రోజున ఆదివారం దేవుని మందిరంలో మనం అందరం కలిసి ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేకపోయినా దేవుని సన్నిధికి రాలేకపోయినందుకు ఎవరు బాధపడొద్దు ఎందుకు అని అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు విధమైన నిర్ణయములు చేయడం జరిగింది. రోజున ప్రతి గృహము ఒక మందిరంగా ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సినదిగా మనం అందరం భావించాలి., దేవుని వాక్యం విని బలపడాలి .

ఇక్కడ వాక్యంలో మనం చుస్తే యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారికి ఒక సంఘటనను గూర్చి తెలియజేస్తున్నారు అది ఏమిటి అని అంటే ఇక్కడ అయన  రాకడను గూర్చి అయన చెప్తున్నారు .,అప్పుడు వారు బోధకుడా, ఆలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవు నని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.

1.దేవుని రాకడ మనం ఎలా తెలుసుకోగలం, క్రీస్తు రాకడకు సూచన మనం ఎలా గుర్తించగలం
యేసుప్రభువారు మనకు ఏమి చెప్తున్నారు అని అంటే యేసుప్రభువారు తన బిడ్డలైన వారికీ ముందుగానే జాగ్రత్తలను మనకు చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు.
జనము మీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; అది క్రీస్తు రాకడకు సూచనగా ఉన్నది  అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును. అటువంటి తెగుళ్లలో ఈకరోనా వ్యాధి ఈరోజున చైనాలో మొదలై ప్రపంచ దేశములకు ప్రాకినట్లుగా మనం తెలుసు.

సాధారణంగా మానవులకు తెగుళ్లు ఎందుకు వస్తాయి అని మనం ఆలోచిస్తే
కలుషితమైన ఆహారం తినడం వలన, కలుషితమైన పరిస్థితులు వలన, మానవులు చేసిన తప్పులవలన వ్యాధులు అనేవి వస్తాయి. ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఇచ్చిన దేనిని బట్టి ఆనందముగా గడిపారో పంటను దేవుడు నాశనం చేసాడు ఎందుకు అని అంటే వారిలో ఉన్న మత్తు,గర్వం పోవాలి అని

ఇశ్రాయేలీయుల ప్రజలు వారి యొక్క అవిధేయతను బట్టివారి పంటలను
తెగుళ్లు తినివేసియున్నవి అని బైబిల్ గ్రంధములో వ్రాయబడినది

యోవేలు 1:4 గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి. 5 మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,

దేవుడే అధికారమును ఇచ్చాడు అని బైబిల్ గ్రంధములో వ్రాయబడినది.  

ప్రకటన గ్రంథము 11:6తాము ప్రవచింపు దినములు వర్షము కురువ కుండ ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్ల నీళ్లు రక్తముగా చేయుటకును, నానావిధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు.

2.మన దోషములను,అవిధేయతను బట్టి, అటువంటి తెగుళ్లు వచ్చినపుడు మనం ఏమి చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది.

యెషయా గ్రంథము 26:20 నా జనమా, ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసు లను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలివచ్చుచున్నాడు భూమి తనమీద చంపబడినవారిని ఇకను కప్పకుండ తాను త్రాగిన రక్తమును బయలుపరచును. 21 నీవు వెళ్లి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్లి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవువరకు కొంచెముసేపు దాగియుండుము.

మనం ఈరోజున ఏలా ఉన్నాం, 
మనం దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి.,

దేవుని యెడల భయభక్తులు కలిగి నడుచుకోవాలి., వ్యాధి వచ్చిన కష్టము వచ్చిన ప్రభువులో ఉంటె మనకు రక్షణ అని దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి. అప్పుడు మనకు అపాయమేమియు రాదు తెగులును నీ గుడారమును సమీపించదు.
కీర్తనల గ్రంథము 91:9యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు 10 నీకు అపాయమేమియు రాదు తెగులును నీ గుడారమును సమీపించదు.

3.మనం ఈరోజున ఏలా ఉండాలి అని అంటే మనం దేవుని బిడ్డలుగా కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన దేవుని ఆశ్రయించువారిగా మనం ఉండాలి.

యెషయా గ్రంథము 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు

దేవుని ఆశ్రయించిన వారిని అయన స్వస్థపరుచుతాడు ఎందుకు అని అంటే మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను.

4.ఈరోజున మనకు ఎటువంటి స్వస్థత కావాలి.

రోజున మనకు శారీరక స్వస్థత కన్నా మన ఆత్మకు ఆధ్యాత్మికమైన స్వస్థత కావాలి
రోజున ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికమైన వ్యాధి కలిగి ఉన్నారు అది ఏమిటి అని అంటే పాపం అనే వ్యాధి.
అటువంటి పాపం అనే వ్యాధి నుండి స్వస్థత ఇవ్వడానికి యేసుప్రభువారు వచ్చారు. ఆధ్యాత్మిక వ్యాధి నుండి ఎప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది అని అంటే అయన రక్తములో మనం కడగబడాలి అటువంటి స్వస్తత మనకు యేసుప్రభువారు మాత్రమే మనకు ఇవ్వగలరు. అటువంటి స్వస్థతను పొందుకునే వారీగా మనం ఉండాలి అని అంటే మనం పాపమునకు దూరంగా ఉండాలి. ఈరోజున మనం శారీరక వ్యాధుల నుండి స్వస్థత కొరకు మనం ప్రార్ధన చేయాలి., మరియు ఆధ్యాత్మిక పాపమేనే వ్యాధి నుండి స్వస్తత కొరకు ప్రార్ధన చేయాలి.

ఎందుకు మనకు ఆధ్యాత్మిక స్వస్థత కావాలి.

ఎందుకు అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది., అందుకే మనం ధైర్యము తెచ్చుకొని తలలెత్తికొనుడి అని దేవుని వాక్యముచెప్తుంది.

లూకా 21:27 అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. 28 ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.

ఈరోజున మన మనమందరం దేవుని రాకడ కొరకు ఎదురుచూడాలి, మనం కష్టం వచ్చిన వ్యాధి వచ్చిన దేవుని ఆశ్రయించువారిగా  ఉండాలి., మనం దేవుని పట్ల విధేయత కలిగి మన కుటుంభం కొరకు, సంఘము కొరకు, శారీరక స్వస్థత కొరకు, ఆధ్యాత్మిక స్వస్థత కొరకు ప్రార్ధన చేయాలి అట్టి కృప మన అందరికి యేసయ్య అందించును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును  గాక ఆమెన్..
దేవుని మహిమ కలుగును గాక ఆమెన్..







No comments: