16 to 20 Lentdays2019



16th Lentday23/03/2019
సిలువ శ్రమ ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య V.CH.B.విజయంగారు 

మత్తయి 21:18-22
21 అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేపడవేయబడుదువు గాకని చెప్పిన యెడల ఆలాగు జరుగునని మితో నిశ్చయముగా చెప్పుచున్నాను.

Topic: విశ్వాసం 

**చదవబడిన వాక్యభాగమును పరిశీలిస్తే

**యేసు ప్రభువారు ఆకలిగొని త్రోవపక్కనున్న అంజూరపుచెట్టును చూచి దాని యందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు.

**దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువని శపించెను అప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయెను.
   
శిష్యులదిచూచి ఆశ్చర్యపడి  చెప్పుకొనినట్లు మనము చూస్తున్నాం.

**యేసయ్య ఒక్క మాట పలుకగా అంజూరపు చెట్టు ఎండిపోయినది

**ఇటువంటి అద్భుతము యేసయ్య మాత్రమే చేయగలరు

**విశ్వాసమునకు కర్త యేసుప్రభువారు.

1.యేసు ప్రభువారు అంజూరపు చెట్టును శపించుటకు కారణం?

యిర్మీయా 8:13
13 ద్రాక్షచెట్టున ఫల ములు లేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు

**మన విశ్వాసమును పరీక్షించుటకు యేసయ్య అంజూరపు చెట్టును శపించారు.

**మనం విశ్వాసంలో బలపడటానికి అంజూరపుచెట్టును శపించారు.

2.ఈ ఉపమానం యేసయ్య ఎందుకు చెప్తున్నారు?
మనము అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి అని యేసుప్రభువారు మనకు చెప్తున్నారు.

విశ్వాసమును బట్టి యేసయ్య చేసిన అనేక అద్భుతములు బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే

3.పక్షవాయువు కలిగిన వ్యక్తి వారి యొక్క గొప్ప విశ్వాసమును బట్టి స్వస్థత ఇచ్చిన యేసయ్య 

మార్కు 2:1-6.,,5 యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.

4.అబ్రాహాము దేవునియందు గల గొప్పవిశ్వాసమును బట్టి అతనికి కుమారుని బలిగా అర్పించుటకు కూడా సిద్ధపడ్డాడు

అటువంటి విశ్వాసము ద్వారా మనము దేవునిలో ఫలించాలి, అనేక మందిని విశ్వాసములో నడిపించాలి.మన విశ్వాసం అనేక మందిని రక్షణలోనికి తీసుకురావడానికి సహాయం చేయాలి.

5. విశ్వాసం ద్వారా మనము ఏవిధంగా ఫలిస్తాము?

మన విశ్వాసమును బట్టి మూడు రకాలైన ఫలములు కలిగిఉంటాము

*భూఫలము:-

ఆదికాండము 1:28దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను

*గర్భఫలము:-
విశ్వాసమును బట్టి అబ్రాహాము శారాకును దేవుడిచ్చిన వాగ్దానము బట్టి వారికీ కుమారుని దయచేసాడు.

*ఆత్మఫలము:-

గలతీయులకు 5:22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.

**
మనం దేవునిలో గొప్ప విశ్వాసం కలిగి ఉంటె అట్టిఫలములు మనకు యేసయ్య దయచేస్తాడు.

మనము ఆవగింజ అంత విశ్వాసం కలిగి ఉంటె ఎన్నో అద్భుతాలు చేయటానికి యేసయ్య మనకు సహాయం చేస్తాడు.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***************************************************************

17th Lentday25/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
 

మత్తయి 27:15-18
18 విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను.

Topic:అసూయ
**యేసుప్రభువారు పడిన సిలువ శ్రమలలో ప్రధానమైన శ్రమ అసూయ.

**యేసు ప్రభువారిని పిలాతు ముందు నిలువబెట్టి అయన మీద నేరం మోపిన తరువాత పిలాతుకు పస్కా పండుగరోజున జనులు కోరుకొనిన యొక ఖయిదీని విడుదల చేయుటకు పిలాతుకి ఒక అవకాశం ఉంది.

**అప్పుడు జనులు కూడి వచ్చి నప్పుడు పిలాతు ఎవరిని విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని అడుగగా వారు అసూయచేత బరబ్బను విడుదల చేయుమని చెప్పిరి.

**బరబ్బఅనేకమైన నేరములు గోరములు చేసిన దుర్మార్గమైన వ్యక్తి, ఐనను వారు యేసుప్రభువారిని అప్పగించుటకు ప్రధానమైన కారణం వారు అసూయచేత ఆయనను అప్పగించిరి.
 
అసూయ గూర్చి బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే 

1.మొదటిగా యుధులైన వారు ఎందుకు యేసుప్రభువారిపై అసూయ చెందుతున్నారు
యోహాను 11:47
కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
 
**ఎందుకంటే యేసుప్రభువారు అద్భుతకార్యములు చేస్తున్నారు సూచక క్రియలు చేసి ఆకట్టుకొంటున్నారు అని వారు అసూయ పడుచున్నారు
 
2.రెండవదిగా ప్రయత్నములు నిష్ప్రయోజనమై పోవుచున్నావని వారు అసూయ పడుచున్నారు.
యోహాను 12:19
19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి

అసూయను పడిన అనేక వ్యక్తులను గూర్చి బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే
 

3.కయీను తన తమ్ముడైన హేబెలుపై అసూయ పడిన పరిస్థితి.
ఆదికాండము 4:5కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

**దేవుడు కయీను అర్పణను అంగీకరించక తన తమ్ముడైన హేబెలు అర్పణను అంగీకరించినపుడు, కయీను అసూయతో తన తమ్ముడైన హేబెలును చంపిన పరిస్థితి.

4.యోసేఫు పై అతని సహోదరులు అతని తండ్రి అసూయ పడిన పరిస్థితి
ఆదికాండము 37:11అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి మాట జ్ఞాపకముంచుకొనెను

**యోసేఫు కనిన కలను చెప్పిన తరువాత అతని సహోదరులు అతని తండ్రి  యోసేఫు పై అసూయ పడిన పరిస్థితి

5.అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుపై ఫిలిష్తీయులు అసూయ పడిన పరిస్థితి.
ఆదికాండము 26:14అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహ మును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.
 
**ఇస్సాకుకు కలిగిన ఆస్తిని క్రమ క్రమ అభివృద్ధిని బట్టి ఫిలిష్తీయులు అసూయ పడిన పరిస్థితి.

అందుకే బైబిల్ గ్రంధములో సొలొమోను మహాజ్ఞాని అసూయ గూర్చి పలికిన మాట.
సామెతలు 14:30 మత్సరం ఎముకలకు కుళ్ళు అని వ్రాయబడినది

6.దేవుని చేత అభిషేకించబడిన సౌలు దావీదు పై అసూయ పడిన పరిస్థితి.
1సమూయేలు 18:6-8 మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొనివారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను.

**దావీదు ఫిలిష్తీయుని గోలియాతును హతముచేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.

** మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు అసూయతో బహు కోపము తెచ్చుకొనేను దావీదును చంపుటకు ప్రయత్నించెను.

**యుధులైన వారు యేసుప్రభువారిపై అసూయపడి ప్రధానయాజకులకు అప్పగించిన పరిస్థితి

**యేసుప్రభువారిపై వారు అసూయపడి బరబ్బను విడిచిపెట్టిన పరిస్థితి

**యుధులైన వారి అసూయ యేసయ్య సిలువ మరణానికి దారితీసిన పరిస్థితి..

7.ఇప్పుడు మనం ఎలా ఉన్నాము?
**దేవుని బిడ్డలుగా మనం ఇతరులపై అసూయపడకూడదు.

దేవుని బిడ్డలుగా మనం ఇతరులపై ప్రేమను కలిగి యేసయ్య కృపకు పాత్రులవుదాం

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

**********************************************************************
18th Lentday 26/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic:పిలాతు తీర్పు

లూకా 23:13-25
13 అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
14
ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు.

**రోమా సామ్రాజ్యానికి పిలాతు ఒక గవర్నర్, యేసుప్రభువారు నిర్దోషి అని తెలుసు. యేసుప్రభువారి మీద ప్రేమ కలిగిన వాడు.

**యేసుప్రభువారిమీద అసూయతో వారు పిలాతు దగ్గరికి తీసుకువచ్చి అయన మీద నేరం మోపిరి అని తెలుసు

1.వారు యేసు ప్రభువారిమీద మోపిన నేరములు పిలాతు తీరును మనము గమనిస్తే

**ఇతడు కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరముమోపిరి.

**యుధులైనవారికి ధర్మ శాస్త్రము న్యాయశాస్త్రము వంటిది అని భావిస్తారు. ధర్మశాస్త్రమును బట్టి అయన మీద నేరం మోపిరి

**మరియు వారు ఇతడు గలిలయదేశము మొదలుకొని యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

**అందుకు పిలాతు గారు మాట విని మనుష్యుడు గలిలయుడా అని అడిగి యేసుప్రభువారిని, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను.

2.యేసుప్రభువారిని చూచి హేరోదు మెలిగిన తీరును పరిశీలిస్తే  
**హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించి యేసుప్రభువారిని చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు

**అప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి.

**హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగి మళ్ళీ ఆయనను పిలాతు దగ్గరికి పంపెను.
 
అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి దినముననే
జరిగిన అద్భుతము యొకనికొకడు మిత్రులైరి.

3.హేరోదు తిరిగి పిలాతు వద్దకు యేసుప్రభువారిని పంపిన తరువాత, పిలాతు క్రీస్తు పట్ల మెలిగిన తీరును పరిశీలిస్తే

**అప్పుడు పిలాతు హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పెను.

**కాని వారు యేసు ప్రభువారిమీద అసూయ, ద్వేషం, పగ కలిగి వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి

4.పిలాతుకి యేసుప్రభువారు నిర్దోషి అని తెలుసు అతన్ని విడిచి పెట్టాలని పిలాతు కోరిక
మూడవ మారు పిలాతు ఇతడు దుష్కార్యము చేసెను అని అడుగగా

**ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.

**పిలాతు గారు యేసుప్రభువారిని విడుదల చేయుటకు ప్రయత్నం చేసిన వారు ఒకే పట్టుగా సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలు వేసిరి.

**పిలాతు అల్లరి ఎక్కువగు చున్నదే గాని తనవలన ప్రయోజనమేమియు లేదని గ్రహించి, నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరప రాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను

**అందుకు ప్రజ లందరువాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.
అప్పుడు వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.

5.ఇప్పుడు మనం అర్ధం చేసుకోవలసినవి?

యేసు ప్రభువారు అమూల్యమైన ప్రేమ అయన పరిశుద్ధత ఎనలేనటువంటిది.

యేసు ప్రభువారు ప్రేమను అర్ధం చేసుకోవాలి.

యేసు ప్రభువారు ఎంత నలిగిపోయారో అర్ధం చేసుకోవాలి.

యేసు ప్రభువారు మన కొరకు ఎంత భాద పడ్డారో మనం అర్ధం చేసుకోవాలి.
 
కాబట్టి మనం సరిచేసుకొని యేసు ప్రభువారి ప్రేమలో జీవిద్దాం

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

******************************************************************
19th Lentday27/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: అయన ధరించిన వస్త్రం (ఊదారంగు అంగీ(Violet)

మార్కు 15:16-20
16 అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమ కూర్చుకొనినతరువాత
17
ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి

వస్త్రము మానవులకు అవసరమైనది మరియు ప్రత్యేకమైనది
 
1.మొట్టమొదటిగా  వస్త్రమును కనిపెట్టినవాడు ఆదాము.
**ఆదాము దేవుని మహిమ కోల్పోయిన తరువాత ఆదాము జీవితంలో వారికీ శరీర రక్షణ కావాలని అలోచించి అంజూరవు చెట్టు ఆకులను వస్త్రముగా ధరించించాడు

2.రెండవది మానవులు ధరించిన వస్త్రం

**తరువాత మానవులు గొఱ్ఱె యొక్క చర్మపు చొక్కాలు తొడిగేవారు.

**ఈవస్త్రాన్నిగమనిస్తే మన రక్షణ నిమిత్తం మొదటిగా గొఱ్ఱె బలి ఐనది.

 **ఆరోజునుండి గొఱ్ఱె మానవుని దేవునికి మధ్య రక్షణకు గుర్తుగా ఉంది

3.మూడవదిగా యేసు ప్రభువారి శాశ్వత వస్త్రం
**మన పాపముల నిమిత్తం మనకు ఒక రక్షణ వస్త్రమును ఇచ్చుటకు యేసుప్రభువారు బలి యాగమైయారు.ఈవస్త్రం మనకు శాశ్వతమైన రక్షణను ఇస్తుంది
 
బైబిల్ గ్రంధములో అంగీ గూర్చి ప్రత్యేకించి వ్రాయబడినది

అంగీ యొక్క ప్రత్యేకతను మనము గమనిస్తే
**అంగీని ప్రత్యేకించి యాజకులైనవారు
ధరించేవారు

**
అంగీ ధరించేటప్పుడు అవి ప్రభావమును
కలిగిఉంటాయి

**
దేవుని శక్తి దిగివచ్చినట్లు ఉంటుంది వాటి విలువ గొప్పదైనది

4.యోసేఫు అంగీ
**యోసేఫు అంటే అతని తండ్రికి చాల ఇష్టం.
**యోసేఫు తెల్లని నిలువుటంగీ ధరింపజేసేవాడు.

5.సమూయేలు అంగీ
**సమూయేలు  తల్లి చిన్నప్పుడే అతనిని యాజకుని వద్ద విడిచిపెట్టి  ప్రతి సంవత్సరం అతనికి అంగీ కుట్టి తెచ్చేవారు.

6. షద్రక్, మిషాక్, అబేద్నెగోల చెడిపోనిఅంగీలు
** షద్రక్, మిషాక్, అబేద్నెగోలను అగ్నిలో పడవేసినపుడు వారి అంగీలు చెడిపోకుండుట చూచి రాజు వారి దేవుడు పూజార్హుడు అనెను

7.తబిత అను స్త్రీ కుట్టిన అంగీలు
**తబిత అను స్త్రీ సత్క్రియలను కలిగి అంగీలును వస్త్రములును కుట్టినట్లు బైబిల్ గ్రంధములో వ్రాయబడినది.

8.యేసుప్రభువారి అంగీ.
**ఈఅంగీ తెల్లనిది మరియు ప్రత్యేకమైనది
**ఈఅంగీ గొప్ప ప్రభావము కలిగినది

కీర్తనల 93:1 
యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది

యేసు ప్రభువారి అంగీ స్వస్థత ప్రభావము కలిగినది.

**12సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీ అయన వస్త్రమును ముట్టగానే వ్యాధి నుండి విడుదల పొందింది.

**
యేసు ప్రభువారి చూపులో స్వస్థత అయన ఉమ్మిలో స్వస్థత అయన ఆంగిలో స్వస్థత కలిగిన వాడు.

చదవబడిన వాక్యమును గమనిస్తే యేసుప్రభువారికి తెల్లని వస్త్రమును తీసివేసే ఊదారంగు వస్త్రమును ధరింపజేశారు.

**ఊదారంగు చాల శ్రేష్టమైనది.

**
ఉదారంగును గుల్ల చేప చంప నుండి తయారు చేస్తారు

**
ఊదారంగు వస్త్రంలను ధనికులైనవారు ధరిస్తారు

**
ఊదారంగు వస్త్రంలను రాజులైనవారు ధరించేవారు


9.ఐతే యేసుప్రభువారికి ఎందుకు ఊదారంగు వస్త్రంలను ధరింపజేశారు

మార్కు 15:20 వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయు టకు తీసికొనిపోయిరి.

 **యేసుప్రభువారిని యూదులరాజా, నీకు శుభమని చెప్పి అవమానించుటకు ఆయనకు ఊదారంగు వస్త్రమును ధరింపజేశారు.
**తరువాత యేసు ప్రభువారికి ఎర్రని వస్త్రమును ధరించారు.
**ఎరుపురంగు విమోచనకు సూచనగా ఉన్నది.**మనలను విమోచించడానికి యేసుప్రభువారు సిలువ శ్రమలను అనుభవించారు.  

ఇది బైబిల్ గ్రంథములోని ఒక లేఖనము నెరవేర్పుగా గమనించవచ్చు.

యోహాను19:24నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను;

10.యేసయ్యకు ఊదారంగు వస్త్రం ధరింపజేయుట మనకు ఏమి తెలియజేస్తుంది?

**యేసు ప్రభువారు మనకొరకు ఎంత అవమాన పడ్డారో తెలియజేస్తుంది

**యేసయ్య మనకొరకు ఇచ్చిన రక్షణవస్త్రమును గూర్చి తెలియజేస్తుంది

**మనము నీతిక్రియలను వస్త్రమును ధరించుకొని యేసయ్య మహిమను పొందుకోవాలని అయన కృపలో జీవించాలని తెలియజేస్తుంది.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

************************************************************************
20th Lentday28/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు

మత్తయి 27:29-31
29 ముండ్ల కిరీట మును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూనియూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
30
ఆయన మీద ఉమ్మివేసి, రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

Topic:ముండ్ల కిరీటము
చదవబడిన దేవుని వాక్యంలో యేసు ప్రభువారికి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి తల మీద కొట్టిరి

**
కిరీటం అనేది రాజులు ధరించేది బంగారము వెండితో చేసినవి మరియు విలువైనవికానీ సంధర్బములో యేసు ప్రభువారికి ముల్లుతో చేసిన కిరీటం పెట్టారు

ఎందుకు యేసుప్రభువారికి ముల్లుతో చేసిన కిరీటం ధరింపజేశారు?

**వారు యూదుల రాజుగా యేసు ప్రభువారిని అవమానించుటకే ఈరకంగా ముండ్ల కిరీటం పెట్టారు

ముండ్ల కిరీటం చరిత్రలోకి వెళ్తే

** ముళ్ల కిరీటంను యుఫోర్బియా మెల్లి అను మొక్కతో అల్లారు.

**దాని ముల్లు ఏడు నుండి తొమ్మిది inches ఉంటుంది, దాని ముల్లు 40% విషం కలిగి ఉంటుంది.

**అంతటి బాధాకరమైన ముండ్ల కిరీటమును యేసుప్రభువారికి పెట్టారు.

ముల్లు యొక్క చరిత్రలోకి మనం వెళితే

1.మొదటిగా ముల్లు శాపానికి సూచనగా ఉన్నది

**ఆదాము చేసిన పాపమును బట్టి నేల శపించబడినది, కష్టపడి పండించిన ముళ్ల తుప్పను పొందుకొనునట్లు శపించబడెను.

**మనిషి చేసిన పాపమును బట్టి శాపాన్ని తొలగించడానికి యేసుప్రభువారు మన కొరకు ముండ్ల కిరీటంను ధరించుకున్నారు.

2.రెండవదిగా ముల్లు భాదకు సూచనగా ఉన్నది.

** ముల్లుకు స్త్రీ అని పురుషుడని గాని బేధం లేదు ఎవరినైనా అది గాయపరిచే గుణం కలది.

**అదే రీతిగా మనం కూడా మన పనులతో  మాటలతో ఇరుగుపొరుగు వారినిగాని సంఘములోగాని  ఇతరులను గాని బాధపెట్టు వారీగా ఉండరాదు.

**అటువంటి బాధలను మన నుండి తీసివేయడానికి యేసు ప్రభువారు ముళ్ల కిరీటం ధరించుకున్నారు.

3.మూడవదిగా ముల్లు అణిచివేతకు సూచనగా ఉన్నది

**ముండ్ల పొదల పడిన విత్తనం ఏవిధంగా ఎదగకుండా అణిచివేతకు గురి అవుతుందో
మనం కూడా ఐహిక విచారాలకు గురై అణిచివేతకు లోనవుతున్నాం.

** అణిచివేతనుండి మనలను విమోచించడానికి యేసుప్రభువారు ముండ్ల కిరీటం ధరింపజేసి మనకొరకు అణచివేయబడ్డారు.

ఆవిధంగా మనలను శపించబడిన స్థితిలోనుండి బాధలనుండి అణిచివేసే పరిస్థితిల నుండి
మనకు విడుదలను ఇవ్వడానికి యేసు ప్రభువారు మన కొరకు ఎంతో బాధను అనుభవించారు.

యేసుప్రభువారు మనకు కొన్ని ప్రత్యేకమైన కిరీటాలను ఇస్తారు.
కిరీటముల గూర్చి బైబిల్ గ్రంధములో వివరంగా వ్రాయబడినది
1.
జీవకిరీటం.
2.
మహిమ కిరీటం.

4. ఎవరికి యేసుప్రభువారు జీవకిరీటం ఇస్తారు.
యాకోబు 1:12శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును

**ఎవరైతే భాదలు శోధనలు భరించి యేసుప్రభువారిలో నిలబడతారో వారికీ యేసయ్య జీవకిరీటమును ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు.

5. ఎవరికి యేసుప్రభువారు మహిమ కిరీటం ఇస్తారు.
1 పేతురు 5:4ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
**యేసుప్రభువారితో జీవించే వారికీ ప్రకాశించే మహిమ కిరీటం ఇస్తాను అని వాగ్దానము చేస్తున్నారు
మనం పొందవలసిన శిక్షకు అయన శాపంగా మరి మనకొరకు భాదను భరించారు అందుకు మన యేసయ్యకు కృతజ్ఞత చెల్లించి అయన కృపకు పాత్రులవుదాం

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్