April2020 Messages

 


19April2020
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
లూకా సువార్త24:50-53
Topic:ఆరోహణం

యేసుప్రభువారు మరణమును జయించి మూడవదినమున లేచిన తరువాత ఈ భూమి మీద నలభై రోజులు ఆయా సందర్భములలో ఆయా రీతిగా తన శిష్యులైన వారికిని అక్కడ వున్నా స్త్రీలైనవారికిని, మగ్దలేయమరియను దర్శించినట్లుగా, కనిపించినట్లుగా మనకు తెలుసు. పేతురును, తన శిష్యులైనవారిని సుమారుగా పదిసార్లు దర్శించినట్లుగా బైబిల్ గ్రంధములో మనం చూస్తాం. 

యోహాను20:16-18 యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. 18 మగ్దలేనే మరియ వచ్చినేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

తన శిష్యులైనవారు తిరిగి చేపలు పట్టుటకు వెళ్ళినపుడు ఆయా సందర్బములో వారితో అయన వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంతే కాకుండా బైబిల్ గ్రంధములో మనం చుస్తే ఇంచు మించు ఐదు వందల మందికి అయన కనిపించినట్లుగా మనం చూడవచ్చు.  

1 కొరింథీ15:6 అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

1.ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఎందుకు వారిని అయన దర్శించారు అని మనం ఆలోచిస్తే
అయన తన తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాపముల నుండి వారి రక్షణార్థం అయన తన రక్తాన్ని చిందించారు. తన ప్రాణాన్ని ఇచ్చి తిరిగి సమాధిని గెలిచి తెరిగి లేచారు అయన రాజ్య స్థాపన కొరకు అయన చెదిరిపోయిన తన శిష్యులైనవారిని అయన బలపరచడానికి, అయన వారిని ఆత్మీయంగా స్థిరపరచడానికే వారిని అయన దర్శించినట్లుగా మనం చూస్తాం.

వారిని ఆత్మీయంగా ముందుకు నడిపించడానికి అయన అందరికిని కనిపించినట్లుగా మనం చూస్తాం అటుతరువాత జరిగిన సంఘటనను మనం చుస్తే 

లూకా సువార్త24:50 ఆయన బేతనియ వరకు వారిని తీసికొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. 51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.

బైబిల్ గ్రంధములో మనం చుస్తే ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
2రాజులు2:11 వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను.
 
2.ఈవాక్యం ద్వారా ఈ ఆరోహణం అనే అంశం ద్వారా మనం తెలుసు కోవలసినది ఏమిటి అని అంటే
భూమి మీద మనం బ్రతికినoత కాలం కూడా దేవుని పనిని నమ్మకంగా చేయాలి, మరియు దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలి దేవుని బిడ్డలుగా మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి అయన చూపిన మార్గంలో జీవిస్తే మనం కూడా క్రీస్తువలె ఆరోహణమైయ్యే గొప్ప భాగ్యమును మనకు అయన అందిస్తారు.

ఈ రోజున అయన పునరుద్ధానం ఆరోహణం మనకు నేర్పించేది ఏమిటి అని అంటే

ఇక్కడ మనం గమనించవలసిన ప్రత్యేకమైన అంశం ఏమిటి అని అంటే యేసుప్రభువారు తిరిగి లేచినపుడు అయన ఆ యొక్క మహిమ శరీరంతో లేచారు ఈ రోజున అయన పునరుద్ధానం ఆరోహణం మనకు నేర్పించేది అయన ఎలాగునైతే సమాధిని గెలిచి నిలిచారో అటువంటి గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది అనే ఒక గొప్ప బలం, ఒక గొప్ప విశ్వాసం, ఒక గొప్ప నిరీక్షణ మనకు నేర్పిస్తుంది.

ఆరోహణం గూర్చి బైబిల్ గ్రంధములో మనం చుస్తే
ప్రకటన గ్రంథము4:1ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడుఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను

ప్రకటన గ్రంథము 11:12 అప్పుడుఇక్కడికి ఎక్కిరండని పరలోకమునుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని, మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి; వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి.

1 కొరింథీ15:40 మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు. 

3.ఈరోజున క్రీస్తువలె ఆరోహణమైయ్యే గొప్ప భాగ్యముతో మనం మన ప్రభువును చేరాలి అని అంటే మనం ఏవిధంగా జీవించాలి అంటే

హెబ్రీయులకు 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.

మనం ఒకరికొకరు సమాధానం కలిగి జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి అప్పుడు ప్రభువును మనం చూడగలం. భూమి మీద మనం బ్రతికినoత కాలం కూడా విశ్వాసం, ఒక గొప్ప నిరీక్షణ కలిగి దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలి దేవుని బిడ్డలుగా  అయన చూపిన మార్గంలో జీవిస్తే మనం కూడా క్రీస్తువలె ఆరోహణమైయ్యే గొప్ప భాగ్యమును మనకు అయన అందిస్తారు. ఆమెన్

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్ 


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

************************************************
26April2020
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
మత్తయి సువార్త 10:24-28
అంశం:భయం - ధైర్యము

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే యేసయ్య తన శిష్యులైనవారికి ఒక ప్రాముఖ్యమైన విషయమును వారికీ తెలియజేస్తున్నారుప్రియులారా ఈరోజున అంశం భయం ధైర్యము గూర్చి ధ్యానం చేద్దాంమనం చుస్తే  రెండు పదాలు ఒకదానికి ఒకటి వ్యతిరేఖ పదాలుమొదటిగా  భయమును గూర్చి మనం ఆలోచిస్తే జీవితంలో చాల సందర్భాలలో  భయమును గూర్చి వింటుంటాముబైబిల్ గ్రంధములో కూడా అనేకసార్లు మనం చూస్తాం భయము అనేది మన జీవితంలో ఒక భాగమైయున్నది.

ప్రతి మనిషి ప్రతి కుటుంబములో ఏదో ఒక రీతిగాఏదో ఒక సందర్భాలలో  భయమును కలిగిఉంటున్నాడుకొంత మంది తెలిసి భయపడుచుంటారు కొందరు తేలియకుండానే భయపడతారు

1.ఈభయము అనేది చాల ప్రమాదకరమైనదిప్రియులారా మనుష్యుల యొక్క జీవితాలలో  భయము ముఖ్యముగా మూడు రకములుగా ఉంటుంది.

**మొదటిది ప్రకృతి సంభందమైన భయం
ప్రకృతి సంభందమైన భయం అంటే ఏదైనా చుస్తే భయంనీడను చుసిన భయంశవంను చుస్తే భయం ముట్టుకుంటే భయంఎదురొస్తే భయంఅగ్నిని చుస్తే భయంఇంకా చుస్తే సముద్రప్రయాణంలో నీటిని చుస్తే భయంగాలిని చుస్తే భయంతుఫానును చుస్తే భయం ఇలా ప్రతి దానికి భయం - ప్రకృతి సంభందమైన భయం.

**రెండవది సమాజ సంభందమైన భయం
సమాజ సంభందమైన భయం అంటే ఎవరైనా బలంగా ఉంటే వారిని చుస్తే భయం ఎందుకు అంటే పోరాడలేమని భయపడతారు వారిని ఎదుర్కోవాలన్న భయం మనుష్యులను చుస్తే భయం , శత్రుభయం వారినుండి అపాయం కలుగుతుంది అని భయం

**మూడవది దైవసంభందమైన భయం
దైవ సంభందమైన భయం ఇది చాల ప్రాముఖ్యమైనది భూప్రపంచములో చాలమందికి ఉంటుంది దేవుడు ఏమైనా నాశనం కలుగచేస్తాడు అని భయం., అందుకే చాల మంది అటువంటి  ఆధ్యాత్మికమైన భయం కలిగినవారు దేవునికి భయపడి బలులు అర్పిస్తూ ఉంటారు., మొక్కులు అర్పిస్తూ ఉంటారుదీనిని అనువుగా చేసుకొని కొంతమంది ఎన్నో ఆచారాలను నేర్పిస్తున్నవారు కూడా ఉన్నారుకానీ మానవులమైన మనం ఈలోకంలో ప్రకృతికి భయపడనవసరం లేదుసమాజానికి భయపడనవసరం లేదు కానీ మనం మన జీవితంలో దేవునికి మాత్రం ఎట్టిపరిస్థితిలో భయపడువారిగా ఉండాలి.

ఈరోజున మనం దేనికి భయపడనవసరంలేదుగాని మనలను సృష్టించిన సృష్టి కర్తకు మనం భయపడాలి మనలను విమోచించువాడురక్షించువాడుమనకు సహాయంచేయు వాడైనటువంటి మన పరమదేవుడైన యేసుప్రభువారిని బట్టి., యెహోవాను బట్టి మనం ఆయనకు భయపడువారిగా ఉండాలిఒక వ్యక్తి తాను ప్రేమించింది తన నుండి దూరమవుతుంది అని అంటే ఆవ్యక్తి భయమును కలిగిఉంటారుఒక పామును చుస్తే దానిని చంపివేస్తాము లేదా అక్కడినుండి పారిపోతాముప్రియులారా ప్రమాదకరమైనటువంటిది మన ముందు ఎది ఉందొ దాని నుండి భయపడిపారిపోతాముఅది జంతువు అవొచ్చుమన శత్రువు అవొచ్చుశరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది అన్నపుడు మనం భయపడుతాముఅందుకే ఈరోజున ప్రపంచమును భయపెడుతున్న ఈకరోనా వైరస్ అంటే అందరము భయపడుచున్నాము.

** రోజున మనం ఎవరికీ భయపడాలి అని వాక్యంచెప్తుంది అని అంటే
మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గానిఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.  

మనం మనలను సృజించిన ఒక్క దేవునికే మనం భయపడాలి అంతే గాని మనం వ్యాధికి గానిమనుష్యులకు గానిశత్రువులకు గాని మనం భయపడకూడదుమన ప్రభువు చెప్పు రీతిగా మనం నడుచుకోవాలి లేకపోతె మనలను ఎవరు విడిపించలేరు.

**అటువంటి దేవుని భయం కలిగి ఉండకపొతే ఏమి కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది అంటే
సామెతలు1:23 నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను. 24 నేను పిలువగా మీరు వినకపోతిరినా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి 26 కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము చేసెదను 27 భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగు నప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసెదను.28అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడ కుందును.

2.మనం ఆలోచిస్తే ధైర్యము అనేది మనకు ఈరోజున ఎలా కలుగుతుంది అంటే

ఎఫెసీయులకు 3:12 ఆయనయందలి విశ్వా సముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.

మనం కనుక పాతనిభందన కాలంలో దేవుని యొక్క శిక్ష వెంటనే వచ్చేది కానీ ఇది యేసుప్రభువారి కృపాకాలం కనుక మనకు అటువంటిది వెంటనే కలుగటలేదు.

**మనం ఆలోచిస్తే ధైర్యము అనేది మనకు ఎలా కలుగుతుంది.
ఈరోజున ధైర్యము అనేది మనకు ఎలా కలుగుతుంది అని అంటే మనం యేసుప్రభువారి యందు గొప్ప విశ్వాసమును ఉంచుట ద్వారా ఆయనను విశ్వసించుదురో ఆయనను వెంబడించేవారిని వారిని అయన రక్షించేదేవుడు.

ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యము ఏమిటి అని అంటే మనలను స్వస్థపరచువాడు అయనశ్రమలనుండి విడిపించగల శక్తి మంతుడు అయనఏదైనా చేయగల సమర్ధుడు అనే విశ్వాసం మనలో ఉండాలిఆవిశ్వాసమే మనకు ఈరోజున గొప్ప ధైర్యమును ఇస్తుందిదావీదు అంటాడు యుద్ధము యెహోవాదే అని., చిన్నవాడు ఏంటి  ధైర్యముఏంటి ఆబలము అంటేఅతనికి దేవుని మీద ఉన్న విశ్వాసము అతనికి అంత గొప్ప ధైర్యమును ఆయనకు ఇచ్చిందిగోలియాతును చంపగలిగాడుఈరోజున మనం దేవుని యందు అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉంటె మనం అటువంటి ధైర్యమును కలిగి ఉంటాము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏమిటి అని అంటే ఈరోజున మనం దేనికి బయపడనవసరం లేదు యేసుప్రభువారి అందు విశ్వాసం ద్వారా ధైర్యము మనకు లభిస్తుంది.

**ఎటువంటి ధైర్యము మనకు కలుగుతుంది అని అంటే పరిశుద్ధస్థలమునందు ప్రవేశించు ధైర్యము కలుగుతుంది.
హెబ్రీయులకు 10:20 ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను.

పాతనిబంధన గ్రంధములో మనం చుస్తే దేవుడు ఎవరికి ఏమి పని అప్పజెప్పాడో ఆపనిని వారు చేయాలి లేకపోతె వారి మీదకు  దేవుని శిక్ష వచ్చేది.

2సమూయేలు6:6 వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా 7యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెనుఅతడు చేసిన తప్పునుబట్టి దేవుడు  క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను.

యాజకులైనవారి పని వారు చేయాలిపరిశుద్ధ స్థలంలో ఎవరు రాకూడని నిష్ఠ ఉండేది కానీ ఇప్పుడు మనకు అటువంటి ధైర్యము క్రీస్తు రక్తము చిందించిన తరువాత మనకు మన కొరకు అయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ఉండే ధైర్యమును అటువంటి గొప్ప భాగ్యమును ఈకృపాకాలంలో ఆయన మనకు ఇచ్చారు.

**దేవుని ఎదుట ప్రార్దించే  ధైర్యము ఎలా కలుగుతుంది అని అంటేమంచి మనసాక్షి కలిగి ఉండుట ద్వారా అటువంటి ధైర్యము మనకు లభిస్తుంది.
1యోహాను3:20 ప్రియులారామన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము

ఒక తప్పుచేసిన వ్యక్తికి తన మన సాక్షి గద్దించుట ద్వారాచేసిన పాపము బట్టి మన మనసాక్షి గద్దిస్తుంది అప్పుడు పాపము వొప్పుకొని విడిచిపెట్టుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది.

**మనం ఎప్పటికప్పుడు మనం చేసేప్రతి పనిని పరిశీలన చేసుకొంటూఉండాలి.
అపొస్తలుల కార్యములు 24:16 విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను
మనం ఎప్పటికప్పుడు మనం చేసేప్రతి పనిని ప్రతి మాటను ఏది మంచి ఏది చేదు అని ప్రతిదానిలో పరిశీలన చేసుకొంటూఉండాలిఅప్పుడు మనం దానినుండి బయటకు రావడం జరుగుతుంది మనకు ధైర్యము కలుగుతుంది మనం ఆలా వొప్పుకొనేలా చేసుకొనేదే మనసాక్షి.

**దేవుని యెడల మనుష్యుల యెడల ప్రేమ భయమును వెళ్లగొడుతుంది అని వాక్యం చెప్తుంది.
1యోహాను4:18 ప్రేమలో భయముండదుఅంతేకాదుపరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టునుభయము దండనతో కూడినదిభయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.

దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుందిమంచి మన సాక్షి కలిగి ఉండుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుందిమనం చేసేప్రతి పనిని పరిశీలన చేసుకొంటూఉండుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుందిఅంతే కాకుండా  ప్రేమకలిగి ఉండుట ద్వారా మనకు ధైర్యము కలుగుతుంది.

**దేవుడిచ్చే గొప్ప ప్రసన్నతను గూర్చి మనం చుస్తే మనకు ధైర్యము కలుగుతుంది.
హెబ్రీయులకు 13:6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడునేను భయపడనునరమాత్రుడు నాకేమి చేయగలడుఅనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

యెషయా గ్రంథము 41:13 నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను
14 
పురుగువంటి యాకోబూస్వల్పజనమగు ఇశ్రాయేలూభయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.

**అందుకే ఈరోజున మనకు ఎందుకు భయముమన గురి ఆయనపై నిలిపి ఉన్నయెడల మనకు ధైర్యము కలుగుతుంది.
కీర్తనల గ్రంథము 16:8 సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను.
కీర్తనల గ్రంథము 18:29 నీ సహాయమువలన నేను సైన్యమును జయింతునునా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
యెషయా గ్రంథము 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

**దేవుని చిత్తము చేయడం ద్వారా ఆత్మాభిషేకము ద్వారా ధైర్యము కలుగుతుంది.
అపొస్తలుల కార్యములు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడివారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
పరిశుద్దాత్మ అభిషేకము నింపబడుట ద్వారా పేతురు అటువంటి ధైర్యముతో వారికీ బోధించినపుడు వారికీ విస్మయమును పొందారు అని దేవుని వాక్యము చెప్తుంది .

ఈరోజున మనం ఎవరికినిదేనికిని భయడపకూడదుఅది వ్యాధి ఐనా ,శత్రువు ఐనా మనం భయపడరాదు ఎందుకు అని అంటే మనలను విడిపించగలధైర్యపరిచే దేవుడు యేసయ్య మనకు ఉన్నాడు . అయన వాక్యం ద్వారాఅయన యందు విశ్వాసం కలిగి ఉండుట ద్వారాదేవుని చిత్తప్రకారం నడుచుకొంటే మనలను అయన ధైర్యపరుస్తాడుమనలను అందరిని బలపరుస్తాడు అయన బిడ్డలందిరిని అయన ఆత్మతో అభిషేకిస్తారు.
 
యేసయ్య  మాటలను దీవించును గాకా ఆమెన్..
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


No comments: