September 2020 Messages

  

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : అక్షయతను వెదకుడి.

 

రోమీయులకు 2:7 సత్‌ క్రియను ఓపికగా చేయుచుమహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

ఈ రోజున పరిశుద్ద వాక్యభాగము నుండి క్షయత - అక్షయత అను రెండు మాటలను గూర్చి మనము ధ్యానము చేసుకుందాము. ఈరోజున మనము మహిమను ఘనతను అక్షయతను వెదకువారిగా ఉండాలి. క్షయత అంటే పడిపోయేది అని అర్ధం అక్షయత అంటే తరగనిది చెడిపోనిది అని అర్ధం. ఏది పాడవనిది ఏది చెడుపోతుంది. ఒకటి మంచి ఉంటె చెడు కూడా ఉంటుంది. ఈరోజున అక్షయత అంటే క్షయత కూడా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద మానవులమైన మనకు చాలా అవసరమైనది ఏమిటి అని అంటే మన శరీరము. ఇది దేవుడు మనకు ఇచ్చినదివిలువైనటువంటిది. చివరకు ఈ శరీరము మట్టిలోనికి కలసిపోవలసినది. ఎందుకు అంటే మానవ శరీరమునకు నిత్య జీవము కలుగకుండా విడదీసినది పాపముమానవ శరీరానికి మహిమను ఘనతను పోగొట్టినది ఈ పాపము. మానవునికి మహిమను ఘనతను పోగొట్టినది పాపముశరీరము ఒక మనినిషికి ఎంత ప్రాముఖ్యమోఅటువంటి శరీరము శాశ్వతమైనది కాదు. కాబట్టి ఈ శరీరము క్షయమైనది. ఈరోజున ఏది  క్షయమైనదో - అక్షయతగా మార్చబాడలో దేవుని వాక్మము ఏమి చెప్నంతుందో  మనము తెలుసుకుందాము

 

1.మొదటిగా క్షయమైన మన శరీరము- అక్షయమైన శరీరముగా మార్చబడాలి.

కొరింథీయులకు 15:42 మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;   

దేవుడు మనకిచ్చిన క్షయమైన శరీరము నుండి ఆక్షయముగా మారాలి. అక్షయమైనటువంటిది అది దేవుని ద్వారా మనకు ఇవ్వాలి. ఈ క్షయమైన శరీరము ఆక్షయముగా మహిమ శరీరముగా మార్పు చెందుతుంది. అప్పుడు అక్షయ శరీరముగా ఉంటుంది. ఆది ఇవ్వాలి అంటే మార్పు ద్వారా ఇవ్వాలి. మట్టి శరిరముగా ఉన్న మనము శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుటకు యేసు ప్రభువారు మన కొరకు ఈలోకమునకు వచ్చారు. అయన అనేక భాదలు పడి పాతి పెట్టబడి మహిమ శరీరముగా లేపబడ్డారు. నేటికి అయన సమాది ఖాళీగా ఉంది. అటువంటి మనకు అయన శరిరమును మహిమ శరీరముగా లేపుటకు ఒక దైర్యమునుఒక నమ్మకమునుఒక నిరీక్షణను మనకు అయన ఇస్తున్నారు. ఈ రోజున మనము మహిమ శరీరముగా మార్చబడాలి. ఎందుకు అని అంటే ఆ శరీరమునకు ఆకలి దప్పులు ఉండవు. మొదటి పునరుద్దాణపు గుంపులో మనం ఉండాలి.  

 

ఆవిధంగా మహిమా శరీరముగా ఆక్షయముగా మార్చబడాలి అని అంటే ఎలా?

మహిమ శరీరముగా మార్చబడుటకు మనము ముందుగా సిద్దపడాలి. మన ఇష్టపుర్వకముగా నా ప్రాణమా అని తినుచు త్రాగుచు ఉంటే మహిమా శరీరము మనకు ఎలా వస్తుంది. అయన మనకు రొట్టెను ఇచ్చి ఇది నా శరీరము అని ఇచ్చినపుడు మన జీవితంలో ఒక సిద్దపాటు రావాలి ఒక మార్పు రావాలి.  మన ప్రభువు ఏరితిగా భాదపెట్టబడి మనకు ఈ రొట్టెను ఇచ్చారో అని జ్ఞాపకం చేసుకొని మనం అలాగున చేయమని అయన చెప్పారు అలాగున చేయువారికి నిత్య జీవము వస్తుంది. నిత్య జీవము అంటే శాశ్వతముగా బ్రతికి ఉండటముమన శరీరము మహిమ శరీరముగా మార్చబడి పరలోకరాజ్యములో చేరాలి. ఈ రక్త మాంసములు పరలోకమునకు చేరావు. అటువంటి అక్షయమైన శరీరముతో మనము పరలోకమునకు చేరాలి అని మనము ఎదురుచూడాలి.         

 

2. అక్షయమైన ఆహారము మనకు ఉంది దాని కొరకే కష్టపడుడి.

యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడిమనుష్య కుమారుడు దానిని మీకిచ్చునుఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.  

 

ఈ లోకములో మానవునికి బలమునిచ్చు ఆహారము అది పాడైపోవునటువంటిది. ఈ శరీరమునకు తగు మాత్రము ఆహారమును తీసుకోవాలి. లేక పొతే అనారోగ్యపాలై పోవలసివస్తుంది. ఈ లోక ఆహారము క్షయమైనటువంటిది. ఐతే శాశ్వతమైన ఆహారము మనకు ఉంది దాని కొరకు పాటుపడండి అని మన ప్రభువు మనకు చెప్తున్నారు. దేవుని వాక్యము అనేది మనకు జీవహరము అటువంటి వాక్యము మనలను బ్రతికింప జేస్తుంది. వాక్యము మనలను తెప్పరిల్లింప జేస్తుంది. దేవుని వాక్యము మనలను బలపరుస్తుంది. ఆ వాక్యము మనలను పరలోక రాజ్యమునకు చేరుస్తుంది. అటువంటి వాక్యమును నిర్లక్ష్యము చేయరాదు. అందుకే దావీదు భక్తుడు అంటాడు. కీర్తనల గ్రంథము 119:97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.

ఈలోకంలో మనం చాల వస్తువులను వ్యక్తులను ఇష్ట పడుతుంటాము. మన ఆత్మను బలపరచుకోవడానికి ఈ వాక్యము చాల అవసరము.

 

ఎందుకు ఈ అక్షయమైన ఆహారము అవసరము.

కీర్తనల గ్రంథము 119:148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.

శరీరమును బలపరచుకోవడానికి వాక్యమనే ఆహారము చాల అవసరము.ఈ వాక్యమనే ఆహారము మనకు బలమునిస్తుంది. మనలను బ్రతికిస్తుంది. 

 

ఎజ్రా భక్తుడు గారు పలికిన ఒక మాటను మనం చుస్తే

ఎజ్రా 7:10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకునుఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను.

ఎజ్రా భక్తుడు గారు దేవుని వాక్యమును పరిశీలించడానికిఅనుసరించడానికిదానిని ఇతరులకు నేర్పుటకు దృడ నిశ్చయము చేసికొనెను. అటువంటి వాక్యమును నిర్లక్ష్యము చేయరాదు. అటువంటి వాక్యము కొరకు మనము నిత్యమూ ఆశపడాలి. మనలను నిత్య జీవమునకు కారణమైనదిఅక్షయమనే జీవాహరము ఐన దేవుని వాక్యము కొరకు మనము ఆశపడాలి.

దేవుని వాక్యం చెప్తుంది యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవిఅవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనదిఅది కన్ను లకు వెలుగిచ్చును.యెహోవాయందైన భయము పవిత్రమైనదిఅది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవిఅవి కేవలము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.

 

3. అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగస్వభావము మనము కలిగి ఉండవలెను.

పేతురు 3:4 సాధువైనట్టియుమృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగస్వభావము మీకు అలంకారముగా ఉండవలెనుఅది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

 

దేవునికి మనలో ఇష్టమైనది ఏమిటి అంటే హృదయ అలంకారము. మానవులకు శారిరకముగా ఉండే అలంకారము క్షయమైనటువంటిది. కానీ దేవునికి మన హృదయ అలంకారము కావాలి ఎందుకు అని అంటే అది పాడవదు.ఏమిటి ఈ అక్షయాలంకారము అంటే గుణము అనే అలంకారము వినయమువిదేయత అనే అలంకారముతో మనం అలంకరించుకోవాలి. దేవుడు మనపై రూపమును కాక మన హృదయమును చూస్తాడు.

ఓ సంఘమా మనం ఏమి అలంకరించుకోవాలి అని అంటే మన శరీరమును అందముగా అలకరించుకోనుట కాదు. కానీ మనము మంచి గుణము.హృదయం కావాలి. గుణమనే అక్షయ అలంకరముతో మనము అలంకరించుకోవాలి. సహోదరుడా సహోదరి ఆలోచించుకోవాలి తీర్చిద్దుకో  కాపాడుకో అని దేవుడు ఈరోజున మనతో మాట్లాడుచున్నాడు.

 

4. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉండాలి.  

కొరింథీయులకు 9:25మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకునుమనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 

 

కిరీటాలు అనేవి రాజులైన వారికీఘనులైన వారికీ ఇస్తారు.ఇవి క్షయమైనటువంటివి ఇవి పడిపోయేవి. కానీ ఈరోజున మనకు పాడవని అక్షయమనే కిరీటము దేవుడు మనకు ఇస్తున్నాడు. అది పొందుకోవాలి అని అంటే మనము మితముగా ఉండాలిజాగ్రతగా ఉండాలి. శాశ్వతమైన అయన ఇచ్చు అక్షయమైన కిరీటము మనం పొందుకోవాలి దానిని పొందుకొనుటకు మనం ప్రయత్నించాలి.

 

5. అక్షయమైన స్వాస్యము మనకు కావాలి.  

పేతురు 1:4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుఅనగా అక్షయమైనదియునిర్మలమైనదియువాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లుఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. 

 

మనకు ప్రభువు ఇచ్చు అక్షయమైన స్వాస్యము మనము పొందుకోవాలి. స్వాస్యము అని అంటే గొప్ప సంపద. అక్షయమైన స్వాస్యము మనము పొందుకోవాలి అంటే అది శాశ్వతమైనదిఅది పొందుకోవాలి అంటే మనము క్రొత్తగా జన్మించాలి.మనము మార్పు చెందాలి. అది పొందుకోవడానికి మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. అటువంటి అయన రాజ్యములో చోటు సంపాదించుకోవడానికి పాటుపడదాము. అక్షమైనది శాశ్వతమైన పరలోకరాజ్యమును పొందుకోవాలి. ప్రభువు రాజ్యమును స్వతంత్రిoచుకొందాము.

 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

 **********************************************************

 

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : దేవుని పక్షము

 

అపొస్తలుల కార్యములు 5:12-15 ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.


చదవబడిన వాక్యభాగాములో మనము చుస్తే ప్రభువు పక్షము అను మాట మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఈ లోకంలో అనేక పక్షములు లేదా గుంపు అనేవి మనము చూస్తూ ఉంటాముఒక గుంపు ఒక పక్షముగా మరియొక గుంపు వేరొక పక్షముగా ఉంటూ ఉంటారు. బైబిల్ గ్రంధములో కూడా ఈ పక్షముల గూర్చి వ్రాయబడి ఉంది. పరిశుద్ద లేఖనములలో మనం చుస్తే దేవునికి కూడా ఒక పక్షము ఉంది. అయనకు కూడా ఒక వర్గము ఉంది అని అయన వర్గము అని మనకు కనిపిస్తుంది. ఐతే ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే దేవుని యొక్క వర్గం ఎలాంటిదిఎవరు అయన పక్షముఅయన పక్షముగా మనము ఎందుకు ఉండాలి , ఇంకా అనేకమైన విషయాలను గూర్చి ఈ రోజున మనం ధ్యానము చేసుకుందాము.      

 

1.దేవునికి ఒక వర్గము ఉందిఅయన వర్గము ఎలాంటిది అని మనం ఆలోచిస్తే

ఈలోకములో అనేకమంది తమకున్న ధనమును బట్టిలేదా ఒక కులమును బట్టి అనేకమైన వర్గములుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని వర్గము అలాంటి వర్గము కాదు. పాతనిభంధన గ్రంధములో మనం చుస్తే ఆనాడు దేవుడు అబ్రహమును బట్టి ఒక జనాంగమును సృష్టించుకొని దేవుని ప్రజలైనటువంటివారిని ఏర్పాటు చేసుకున్నాడువీరు దేవుని సొత్తుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ అనేక రీతులుగా అభివృద్దిలోనికి నడిపించారు. ఆవిధంగా అయన వారిని ఏర్పాటుచేసుకున్నారు. క్రొత్త నిభందన గ్రంధములో మనం చుస్తే యుదులైన వారుఅన్యులైన వారు అనేకులు ప్రజలు ప్రభువును ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అని వ్రాయబడినది.

 

ఈఅరోజున ఎవరు దేవుని వర్గము అని అంటే ఆయనను తెలుసుకొని దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభువు నందు ఉండేవారు అయన కొరకు జీవించే వారు అయన వర్గముగా ఉంటారు.

 

2.ఈ లోకములో మనుష్యలు ఎందుకు పక్షములుగా ఉంటున్నారు.

అపొస్తలుల కార్యములు 14:4 పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొస్తలుల పక్షముగాను ఉండిరి.

అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. సద్దూకయ్యులు పునరుత్థానములేదనియుదేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.

ధర్మశాస్త్రమును ఎరిగిన వారు కూడా వారికీ ఇతరుల పట్ల వారికీ కలిగిన భేదములను బట్టి, అంతే కాకుండా మనుష్యలు తమ స్వార్దములను బట్టి వర్గములుగా ఉన్నారు. మనుష్యలు ఒకరి యెడల ఒకరికి బేదములు కలిగి వారు పక్షములుగా ఏర్పడుచున్నారు. మనమైతే ప్రియులారా అటువంటి భేదములు కలిగి ఉండరాదు.  

 

3.మనం ఎవరి పక్షమున ఉండాలి అని మనం కనుక ఆలోచిస్తే

 

బైబిల్ గ్రంథములోని ఒక సందర్బమును మనం గమనిస్తే  

40 రోజులు మోషే కొండ దిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ముమా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోనుమీ భార్యలకు మీ కుమా రులకు మీ కుమార్తెలకు చెవుల నున్న బంగారు పోగులను తీసి నాయొద్దకు తెండని వారితో చెప్పగా,  ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారియొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారుఓ ఇశ్రాయేలూఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.  అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోనురేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుముఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించిఓయి ఇశ్రాయేలూఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెనునేను ఈ ప్రజలను చూచియున్నానుఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుమునా కోపము వారిమీద మండునునేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొనియెహోవానీవు మహాశక్తివలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేలఆయన కొండలలో వారిని చంపునట్లును భూమిమీదనుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెనునీ కోపాగ్నినుండి మళ్లుకొని నీవు  నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితోఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియువారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.

 

అప్పుడు మోషె దేవుని పక్షమున ఉన్నవారు నా యొద్దకు రండి అనగా  

(నిర్గమకాండము 32:26) అందుకు మోషే పాళెముయొక్క ద్వార మున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.

 

మూడువేల మంది అయన మాట దిక్కరించి ఉండగా వారి విచ్చలవిడి తనమునకు దేవుని కోపాగ్నికి గురై వారు చనిపోయారు. ప్రియులారా మనం ఈరోజున ఆలోచించుకోవలసిన విషయం ఏమిటి అని అంటే తల్లులార, పిల్లలైన వారలారా మన జీవితాలలో విచ్చలవిడి తనమునకు చోటివ్వకూడదు. దేవునికి భయపడాలి. మనం అయన పక్షముగా ఉండాలి. అయన పక్షముగా జీవించాలి. 

 

4.దేవుడు ఎవరి పక్షమున ఉంటాడు అని మనం ఆలోచిస్తే  

అప్పుడు దేవుని పక్షమున ఎవరు వుంటే వారి పక్షముగా దేవుడు ఉంటాడు.

 

2దినవృత్తాంతములు 15:2 ఆసాయూదావారలారాబెన్యామీనీయులారామీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండునుమీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగునుమీరు ఆయనను విసర్జిం చినయెడల ఆయన మిమ్మును విసర్జించును,

 

ఈరోజున మనం ప్రభువు పక్షమును మనం ఉంటె అయన కొరకు జీవిస్తే ప్రభువు కూడా మన పక్షముగా ఉంటాడు.

రోమీయులకు 8:31 ఇట్లుండగా ఏమందుముదేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడుఈరోజున ఎటువంటి భయంకరమైన పరిస్తితి ఐనా దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఎవ్వరు విరోధిగా ఉండలేరు.

 

దేవుడు పక్షముగా ఉండగా దావీదు గోలియాతును చూసి భయపడలేదు ఎందుకు అని అంటే దేవుడు అయన పక్షముగా ఉన్నాడు కనుక. అందుకే మనం అయన పక్షముగా ఉండాలి. మనం విన్నాం ఈ క్షయమైన లోకం,   క్షయమైన ఈ శరీరం క్షయమైన ఆహారము అంటే పడైపోవునటువంటిది. అక్షయమైన ఆహారం దేవుని వాక్యంఅక్షయమైన రాజ్యం దేవుని రాజ్యము అది పొందుకోవాలి. అందుకే మనం దేవుని వైపుకు మరలాలి. 

కీర్తనల గ్రంథము 118:6 యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?  

అందుకే మనం దేవుని పక్షముగా ఉండుటకు ఇష్టపడదాము.

 

5.ఆఖరిగా యేసుప్రభువారు మనము ఎవరి పక్షముగా ఉండాలి అని చెప్తున్నారు.

 

మత్తయి సువార్త 6:24ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడుఅతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించునులేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

 

ఈరోజున మనం ధనం, సంపదకు దాసులుగా ఉంటే దేవునికి దాసులుగా ఉండలేముదేవుని పరిచర్య చేయలేము. కానీ ప్రియులారా దేవునికి దాసులుగా ఉంటే మనం ఆత్మీయంగా దేవునిలో ఎదుగుటకు తోడ్పడుతుంది. ఈరోజున మనం దేవుని పక్షముగా ఉండాలి. అయనకు ఇష్టులుగా జీవించాలి, అయన ఇచ్చు ఆశీర్వదమును పొందుకోవాలి. దేవునికి దగ్గరగా ఉందాము అయన రాజ్యమును పొందుకుందాము.

 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.  

    *****************************************************

 

 

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : బుద్ది చెప్పుకోనుడి

 

హెబ్రీయులకు 3:12-1514 పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లునేడు అనబడు సమయముండగానేప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. 15 ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.

 

ఈ రోజున మనం ధ్యానించుకాబోయే అంశము బుద్ది చెప్పుకోనుడి, ఇది చాల ప్రాముఖ్యమైన ఒక మంచి మాట. అసలు ఈ బుద్ది అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఒక మనిషి యొక్క నడవడిక లేదా ప్రవర్తన మంచిది ఐతే మనం మంచి బుద్ది కలవాడు అని అంటాముఆ ప్రవర్తన సరిగా లేకపోతె ఆ వ్యక్తి యొక్క చెడు ప్రవర్తన కలిగినవాడు అని పిలుస్తారు. ఈ బుద్ది అనేది మంచి ప్రవర్తన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, ఇది సంఘములో ఉండాలి చాల ముఖ్యము. బుద్ది చెప్పుడి అను మాటకు మంచి నడవడిని నేర్పు అని అర్దమునిస్తుంది. ఈ రోజున భుప్రపంచములో మానవులైనవారు అనేక రీతులుగా ఎవరికీ తోచినట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. అలాంటప్పుడు కొంతమంది మంచి బుద్దిని  చెప్పినపుడు కొంత మంది వింటారు. ఈరోజులలో మనం బయట ఎలాగున ఉంటున్నా సంఘములో ప్రతి ఒక్కరు మంచి బుద్దిని కలిగి ఉండాలి, అలాగున ఉండక పొతే అతనికి దేవుని యెద్ద చోటు ఉండదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఒకరికి ఒకరు బుద్ది చెప్పుకోవాలి వారిని సరిచేయాలి, మనలను మనం సరిచేసుకోవాలి. భార్యలో లోపం ఉంటె భర్త, భర్తలో లోపం ఉంటె భార్య, పెద్దలైన వారు పిల్లలను, కుటుంభంలో ఏమైనా లోపం ఉంటె కుటుంబ సభ్యులైనవారు వారిని సరిచేయాలి.

 

 సంఘములో మంచి ప్రవర్తన లేకపోతె బైబిల్ గ్రంధములో ఆ వ్యక్తి పరిస్తితి ఎలాగున ఉంటుందో వివరంగా వ్రాయబడినది. బుద్ది బుద్దిహినుడు అని ఎక్కవసార్లు మనం చూస్తాం.

ప్రియులారా ఈ బుద్ది అనేది చాల అవసరం, ఎవరికీ ఈ బుద్ది అనేది లేదు, వారి యొక్క ప్రవర్తన అనేది ఎలాగున ఉంటుందిఎవరికీ బుద్ది చెప్పాలి బైబిల్ గ్రంధములో మనం చూద్దాం.

 

1.ఎవరు ఈ బుద్ది హీనులు, ఎవరికీ బుద్ది చెప్పాలి అని మనం చుస్తే

కీర్తనల గ్రంథము 53:1

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారుఅసహ్యకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును లేడు.

 

దేవుడు లేడు అని అనుకోను వారు బుద్ది హీనులు, ఈరోజున దేవుడు లేడు అను కొనువారికి మనం బుద్ది చెప్పాలిఅటువంటి వారి క్రియలను మనం చుస్తే వారు అసహ్యకార్యములు చేయుదురు. దేవుడు అనే మాట వారి నోట రాదు. దేవుని చూడాలి అంటే అయన మహిమను చూడాలి కానీ ఆయనను మనం చూడలేము. ఈ రోజున అనేక మంది కష్టమోచ్చినపుడు, విలువైనది కోల్పోయినపుడు దేవుడు లేడు అని అనుకొందురు. కానీ ప్రియులారా మనమైతే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. దేవుడు లేడు అను అటువంటి ఆలోచన మనలో నుండి తీసివేసుకోవాలి. మనం దేవుని యెడల నిరీక్షణ కలిగి జీవించాలి ఎందుకు అని అంటే అయన సృజించిన బ్రతుకులో మనం బ్రతుకుతున్నాము అని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని యెడల భక్తి కలిగి జీవించాలి.

 

2. ఈ బుద్ది హీనులు ఎలా ఉంటారు అని మనం చుస్తే

సామెతలు 1:32

జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూల మగుదురు.  

 

అనేకమంది జ్ఞానము లేనివారు ధనము కలిగిన కొందరు, బుద్దిహినులైన వారు అనేకమంది  దేవుని మైమరచి నాశనమగుదురు. యేసయ్య చెప్తున్నాడు ఒక ధనవంతుడైనవాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని, కానీ ఇవ్వన్ని ఇచ్చినవాడు దేవుడే, అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా దేవుడిచ్చిన దానిని దేనిని మరువకుము అని చెప్తున్నాడు, ప్రియులారా మైమరచిపోయే స్తితి మనలో ఉంటె చివరికి మనము నిర్మూలమైపొతాము. ప్రియులారా ఈరోజున మనం ఎలాగున ఉన్నాము ఆలోచించుకోవాలి. దేవుని మరచిపోకుండా ఉండాలి.  

 

3. అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి.

థెస్సలొనీకయులకు 5:14

సహోదరులారామేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడిధైర్యము చెడినవారిని దైర్యపరచుడిబలహీనులకు ఊత నియ్యుడిఅందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.

 

ఎవరు వీరు అని అంటే అక్రముముగా ఉండేవారు, క్రైస్తవ జీవితంలో ఒక క్రమము కలిగి ఉండాలి అందుకే ఇది ఇరుకు మార్గము అన్నారు ప్రభువారు. దేవుని యెడల ఇష్టానుసరముగా ఉండరాదు. సంఘములో ఒక క్రమముగా ఉండాలి. ఓ సంఘమా నీ కోసం యేసయ్య అప్పగింపబడ్డాడు అని మనం మర్చిపోకూడదు. అందుకే సంఘము ఒక మంచి బుద్ది కలిగి నడచుకోవాలి.

 

 మనం చేయవలసినది ఏమిటి అంటే 

మనం సంఘములో బుద్దిగా నడచుకోవాలి, మంచి బుద్ది లేనివారికి బుద్ది చెప్పాలి, వారిని సరిచేయాలి. అక్రమముగా మనం నడవరాదు, దేవుని ఇష్ట ప్రకారంగా నడచుకోవాలి. చేడువ్యసనాలను కలిగి ఉన్నావారికి, సమాజానికి ఆటకంగా ఇష్టానుసరముగా నడచుకోనువారికి మనం బుద్ది చెప్పాలి.మంచి బుద్ది  స్వీకరించి జీవితాలను సరిచేసుకోవాలి.  

       

4. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

రోమీయులకు 1:22

వారి అవివేకహృదయము అంధకారమయమాయెనుతాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.

 

క్రైస్తత్వం అన్నిటికి అనేకమైన అధారాలు ఉన్నాయి, ఐతే దేవుని వాక్యమును నమ్మాలి. ఈ రోజులలో కూడా అనేకమంది మరిఎక్కువ జ్ఞానము కలిగినవారు దేవుని యెడల బుద్ది హినులుగా ఉండరాదు. సమాజంలో బుద్ది కలిగి జీవించాలి, ఆ విధంగా మంచి బుద్ది  కలిగి ప్రవర్తిస్తే వారి తల్లి తండ్రులకు మంచి పేరు వస్తుంది.

 

ఇంకా ఎవరు బుద్ది లేనివారు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది.

సామెతలు 11:12 తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.

 

ఈరోజున పోరుగువానిని ప్రేమించువారిగా మనం ఉండాలి

 

సామెతలు 13:16 వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును.   

 

సామెతలు 14:16 జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.   

 

సామెతలు 17:10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

 

తండ్రి తన కుమారులు చేసిన తప్పులను బుద్ది చెప్పనందున, దేవుడు శిక్ష విదించిన  సంఘటనను బైబిల్ గ్రంధములో మనం చుస్తే

1సమూయేలు 3:13

తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.

 

ఏలి యొక్క కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొను చున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు, ఏలి తన కుమారులను అడ్డగించలేదు అప్పుడు దేవుడు వారిని శిక్షించగా ఏలి కుమారులు చనిపోయారు, కారణం కుమారులను తండ్రి సరిచేయకపోవడం అయన చేసిన తప్పు అయన తన కుమారులను గద్దించి, వారిని సరిచేసి ఉంటే, నిత్య శిక్ష వారికీ రాకపోయివుండును. తండ్రి చుసిచూడనట్లుగా ఉండుట వలన వారికీ ఆ శిక్ష కలిగింది. ఈరోజున ఊ తండ్రులారా మీ పిల్లలు తప్పు చేస్తే చూసి చునట్లుగా ఉంటున్నారా జాగ్రత్తగా ఆలోచించుకోండి. 

     

5. ఎందుకు మనం ఈ లోకంలో బుద్ది చెప్పుకోవాలి.

పేతురు 2:4

దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకపాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసితీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

 

దేవుడు ఈ భులోకములో గాని పరలోకంలో గాని దేవుడు ఎటువంటి పాపమును ఒప్పుకోడు, ఈరోజున ఎక్కడ పాపము చేయడానికి అవకాసం లేదు. అందుకే మనం పాపంలను ఒప్ప్పుకొని పరిశుద్దమైన జీవితం గడపాలి. అందుకు ఒకరినొకరు బుద్ది చెప్పుకోవాలి పాపమును విడిచి పెట్టాలి.     

 

ఈరోజున మనం దేవుని బిడ్డలుగా మంచి బుద్దిని కలిగి ఉండాలి., మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. బుద్దిహినులైనవారిని హెచ్చరించాలి, వారిని సరిచేయాలి. ప్రియులారా ఇవి సరిదిద్దే రోజులు, ఇవి సరి చేసుకొనే రోజులు. అందుకే మనం ఒకరి నొకరు బుద్దిచేప్పుకోవాలి. సంఘుములో ప్రతి ఒక్కరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సంఘమును కాపాడు కోవాలి. కుటుంబాలలో చేసే తప్పులు ఒప్పుకొని సరిచూసుకోని జీవించాలి, అలాగున జీవించి దేవుని రాజ్యమును పొందుకొందాము.

     

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

 

 *******************************************

 

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev. M. ఆనందవరం గారు

అంశం : జీవ నది

 

యోహాను సువార్త 7:38-39

నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.

 

చదవబడిన దేవుని వాక్య భాగములో జీవజలనది అను మాట మనకు కనిపిస్తుందినదులు అనేవి చాల ఉన్నాయి అవి మనకు చాల అవసరంఈ నదులలో నీరు చాల శ్రేష్టమైనదివిలువైనది. అయితే బైబిల్ గ్రంధములో కూడా ఆత్మీయ నదులను గూర్చి వ్రాయబడినది. ఇది చాల ప్రాముఖ్యమైనవి. ఎలాగైతే నదులు మానవ జీవితానికి ఎంతో అవసరమో అవి అనేకమంది మానవులైనా వారిని బ్రతికిస్తాయి. అదేవిధంగా యేసుప్రభువారు మనకు జీవనదుల గూర్చి చెప్తున్నారు. ఈ నది ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ నది అయన యందు విశ్వాసముంచు ప్రతి మనిషి యొక్క కడుపులో పుడుతుంది.

 

1.ఈ జీవనది ఎవరికీ ఉపయోగపడుతుంది అని మనం ఆలోచిస్తే

ఎలాగైతే ఎండి పోయిన నేలను చిగురింపజేయడానికి ఆ నేలను పంటను బ్రతికింపజేయడానికి ఉపయోగపడుతుందోఅదేవిధంగా ఎండి పోయిన మన బ్రతుకులను జీవింపజేయడానికి మనలో ఎండిపోయిన ఆత్మీయ స్తితి తిరిగి బాగుచేయడానికి మనలో జీవజలనది అనేది పుట్టాలి అందుకు ఈ జీవనది మనకు ఎంతో అవసరం. మన ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా శారీరకంగా అభివృద్ధి చెందాలంటే మనలో కూడా ఈ జీవ జల నది అనేది పుట్టాలి అది మనలను ఎల్లపుడు జీవింపజేస్తుంది. ఈ జీవనది అంటే నిత్యం పుట్టే ఊట అని అర్దమునిస్తుంది. అందుకే యేసుప్రభువారు అంటున్నారు నా యందు విశ్వాసం ఉంటే వారిలో ఈ జీవనదులు పారును అని చెప్తున్నారు. ఎలాగైతే నీరు లేక పొతే చెట్టుకు ఫలాలు ఉండవో, చెట్టు ఎండిపోతుందోఅదేవిధంగా మనలో ఈ జీవ జలనది లేకపోతే దేవునిలో ఫలించలేము, మనం దేవుని యందు విశ్వాసం కలిగి జీవ జలనదిని మన కడుపులో కలిగి ఉండాలి అప్పుడే మనం దేవునిలో ఫలిస్తాం.

 

ఈ జీవజల నది అంటే ఏమిటి ?

దేవుని యొక్క పరిశుద్దాత్మయే ఈ జీవజలనదిఇది దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. ఈ వాక్యం మనలను జీవింపజేస్తుందిమనలను బలపరుస్తుందిమనలను హెచ్చరిస్తుందిమన జీవితాన్ని సరిచేస్తుంది ఇది జీవపు ఊట వంటిది.

 

ఇది మనకు ఎలా వస్తుందిఏమి చేస్తుంది అని మనం ఆలోచిస్తే

దేవుని యెడల విశ్వాసం కలిగి ఉంటే అది మనకు లబిస్తుంది.దేవుని ఆత్మ మనలను జీవింపజేస్తుంది. అది మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆ పరిశుద్దాత్మ మన పక్షముగా తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రభువు యందు విశ్వాసం కలిగి జీవిద్దాం.

 

2.రెండవ ఆత్మీయ నది అగ్ని అనే నది

ప్రకటన గ్రంథము 22:1

మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహా సనమునొద్దనుండి

 

ఎక్కడ నుండి వస్తుంది ఈ అగ్ని అనే జీవజలముల నది అని మనం ఆలోచిస్తే అది దేవుని నుండి వస్తుంది ఈ అగ్ని అనే జీవజల నది మనకు మారు మనసును కలిగిస్తుంది.  

 

మత్తయి సువార్త 3:12

ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదిఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసిఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.   

 

అగ్ని దేనికి సూచనా అని అంటే మారుమనసుకు సూచనాఅటువంటి అగ్నిలో మనం మారుమనస్సు పొందాలిఅటువంటి అగ్నిలో బాప్తీస్మం పొందాలి. ఎలాగైతే బంగారము పుటములో వేయబడి పరిశుద్ద పరచబడుతుందో ఆవిధంగా మనం పరిశుద్దపరచబడాలి.

 

3.సమాదానపు నది

యెషయా గ్రంథము 66:12

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడినదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.    

 

ఈ నది ప్రతి మనిషికి అవసరంఈరోజులలో ప్రతి దేశానికి మరియు ప్రపంచానికి ఇది కరువైపోయిందిఅనాడు ఇస్రాయేలియులకు కుడా రాజుల వలన బానిసలుగా తీసుకువెల్లినపుడు వారు దేవునికి మొరపెట్టగా వారిని అయన విడిపించేవాడువారిని సమాధానపరచేవాడు. అందుకే సర్వోన్నతమైన స్తలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుష్యులకు సమాధానము అని వ్రాయబడినది.

 

ఈరోజున యేసు ప్రభువారు ఇచ్చే సమాధానము ప్రతి ఒక్కరు కలిగి అయన యందు ఇంకా బలపడాలి. అయన సమాధానకర్త. అందుకే మనం ఈరోజున దేవునితో సమాధానము కలిగి జీవించాలి. మనుష్యులతో సమాధానము కలిగి ఉండాలి.

 

4. కన్నీటి నది

విలాపవాక్యములు 2:18

జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమానదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.

 

ఈరోజున మన ప్రార్ధన ఎలా ఉండాలి అని అంటే అది ఒక కన్నీటి ప్రవాహంలా ఉండాలిఒక కన్నీటి నదిలా మనలో ప్రవహించాలి. ఆనాడు దావీదు తన కుటుంభం కోసంతన ప్రజలైనవారి కోసంఅనేకమైన సమస్యల కోసం ఎన్నోసార్లు  కన్నీటి ప్రార్ధన చేసేవాడు. ఈరోజున మనకు అటువంటి కన్నీటి ప్రార్ధన అనుభవం మనకు కావాలి అది మనకు క్షేమము కలుగజేస్తుంది.

 

 

5.జ్ఞానపు నది

సామెతలు 18:4

మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.  

 

ఈరోజున మన మాటలు అనేకులను బాగుచేసేవిగా ఉండాలిఅనేకులను దేవునిలో నడిపించేటట్లుగా ఉండాలిఅవి జ్ఞానపు నది వలే ఉండాలి. అనేకులు దేవునిలో ఫలించేటట్లుగా చేసేవిగా ఉండాలి.     

 

యెషయా గ్రంథము 11:2

యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.

 

కీర్తనల గ్రంథము 36:8

నీ మందిరముయొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనందప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు.    

 

ఆనందప్రవాహము అనే నది మనలో ప్రవేశింపజేస్తుంది. జ్ఞానయుక్తముగా మన మాటఉండాలి. అప్పుడు మన మాటలు మనలను నీతి మంతులుగా తీర్చిదిద్దుతాయి.

 

తిమోతికి 3:1

అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

 

ఈరోజున మనం అటువంటి జీవపు ఊటను అనుభవించలేక పోతున్నాము ఎందుకు అని అంటే దేవునిలో మనం సరైన భక్తిని కలిగి ఉండలేకపోతున్నాము. మనం అంత్య దినములో మనం మంచి మాటను పలకాలి.దేవుని యెడల సరైన భక్తిని కలిగి ఉండాలి. భక్తిలో గొప్ప శక్తి ఉంది మన భక్తిలో గొప్ప ఆనందము ఉంది అది పొందుకోవాలి ఈ లోకంలో మనకు ఏమున్న లేకపోయినా దేవుని యందు భయభక్తులు గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మన దేవుని రాజ్యము పొందుకోనే వారిగా మనం ఉండాలి.

 

ఈరోజున మనం దేవుని యందు విశ్వాసం కలిగి పరిశుద్దాత్మ అనే జీవనదిని పొందుకోవాలి. ఎందుకు అని అంటే అయన ఎండిపోయిన బ్రతుకులను బాగుచేస్తాడు. అయన మన జీవితాలను చిగురింపజేస్తాడుఅయన మనలను మారుమనస్సు అనే అగ్ని వంటి నదితో బాప్తిస్మం ఇస్తాడు.  అయన సమాధానమునకు కర్త అయిన దేవుడుమనలో సమాధానము అనే ప్రవాహముతో నింపుతాడు. ఈరోజున కన్నీటి ప్రార్ధన అనే నదిని మనం కలిగి ఉండాలిజ్ఞానపు నదిని మనలో కలిగి జ్ఞానయుక్తమైన మాటలను మనం పలకాలి దేవుని రాజ్యమును పొందుకోవాలి అట్టి కృప మన అందరికి కలుగును గాక ఆమెన్

 

యేసయ్య ఈమాటలను దీవించునుగాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.          

 

 

 

 

 

 

        

             

         

 

 

 

 

                                                                                 

 

 

 

 

 

 

 

 

 

                                                                                 

 

 

 

 

 

 

No comments: