stuthi patalu 89-110



89.మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)

నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా       ||మేలులు||
కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా(2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)
అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)
చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

90.యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా (2)
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము (2)          ||యేసయ్యా||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే(2)          ||యేసయ్యా||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          ||యేసయ్యా||
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు(2)          ||యేసయ్యా||
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4)
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (4)

91.యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా

యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా
నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే
కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి     ||యేసయ్యా||
ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం
అయ్యో.. ఆరిపోవు దీపం
అయినా రాదు నీకు కోపం
గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి
జారే కన్నీళ్లు మాత్రం
పాపం చేసినోల్ల కోసం       ||యేసయ్యా||
నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం
నిను మోసి కట్టుకుంది పుణ్యం
ఆహా సిలువదెంత భాగ్యం
ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం
మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే
చూసిన వారి జన్మ ధన్యం      ||యేసయ్యా||

92. యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)

యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2)         ||యేసే||
మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||
జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)       ||స్తోత్రము||

93. యేసే నా పరిహారి

ప్రియ యేసే నా పరిహారి

నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||
ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||
నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||
మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా (2)
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)         ||యేసే నా||
బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా (2)
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి (2)          ||యేసే నా||
దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ (2)
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను (2)          ||యేసే నా||

94. యేసే సత్యం యేసే నిత్యం

యేసే సర్వము జగతికి

యేసే జీవం యేసే గమ్యం
యేసే గమనము (2)
పాత పాడెదం ప్రభువునకు
స్తోత్రార్పణ చేసెదం (2)      ||యేసే||
పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన
మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా(2)
యేసులోనే నిత్య జీవం
యేసులోనే రక్షణ (2)      ||యేసే||
బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు
కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2)
యేసులోనే నిత్య రాజ్యం
యేసులోనే విడుదల (2)      ||యేసే||

95. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు

వాంఛతో తన కరము చాపి

రమ్మనుచున్నాడు (2)
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని(2)
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు (2)                ||రమ్మను||
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును (2)                ||రమ్మను||
సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము (2)                  ||రమ్మను||
సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2)
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ (2)                 ||రమ్మను||

96. (యేసు) రాజా నీ భవనములో

రేయి పగలు వేచియుందు (2)

(నిన్ను) స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను (2)     ||రాజా||
నా బలమా నా కోట
ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||
అంతట నివసించు యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||
పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని
ఆరాధన నీకే (2)
రూపించి దైవం యెహోవా హోషేను
ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన
అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||

97. రాజాధి రాజ రవి కోటి తేజ

రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)

విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును(2)        ||రాజాధి||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)        ||రాజాధి||
ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)        ||రాజాధి||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే(2)        ||రాజాధి||

98. రాజుల రాజా రానైయున్నవాడా (2)

నీకే ఆరాధన

నా యేసయ్యా.. నీకే ఆరాధన (2)
కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చును
సాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)
నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యా
నా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2)      ||రాజుల||
రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించును
మరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)
ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడును
ప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2)      ||రాజుల||

99. లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై                 ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును (2)
భూమిలో కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్             ||లెక్కించలేని|| 
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిపైనున్నవన్ని (2)
దేవా నిన్నే పొగడును                ||లెక్కించలేని|| 
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు (2)
ఆకాశామున ఎగురునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్            ||లెక్కించలేని||
**********************************************************************



100.లెమ్ము తేజరిల్లుము అని

నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)

నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద (2)
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము (2)
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
నీ కృప చూపితివి (2)
ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…
ఇదియే నా భాగ్యమూ            ||లెమ్ము||
శ్రమలలో నేను ఇంతవరకును
నీతో నిలుచుటే నా ధన్యత (2)
జీవకిరీటము నే పొందుటకే
నను చేరదీసితివి (2)
ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….
ఇదియే నా ధన్యత            ||లెమ్ము||
తేజోవాసుల స్వాస్థ్యము నేను
అనుభవించుటే నా దర్శనము (2)
తేజోమయమైన షాలోము నగరులో
నిను చూసి తరింతునే (2)
ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…
ఇదియే నా దర్శనము          ||లెమ్ము||

101.సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)         ||సదాకాలము||

పాపాల ఊభిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2) ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా (2)             ||యేసయ్యా||
నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)           ||యేసయ్యా||

102.  సంతోషమే సమాధానమే (3)

చెప్ప నశక్యమైన సంతోషం (2)

నా హృదయము వింతగ మారెను (3) నాలో యేసు వచ్చినందునా (2)              ||సంతోషమే||
తెరువబడెను నా మనోనేత్రము (3) క్రీస్తు నన్ను ముట్టినందునా (2)              ||సంతోషమే||
ఈ సంతోషము నీకు కావలెనా (3) నేడే యేసు నొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||
సత్య సమాధానం నీకు కావలెనా (3) సత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||
నిత్యజీవము నీకు కావలెనా (3) నిత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||
మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3) మోక్ష రాజునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||
యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3) ప్రవేశించు నీ హృదయమందు (2)              ||సంతోషమే||

103.సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయున్ పౌలువలెను సీలవలెను సిద్ధపడిన భక్తులజూచి

కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండే పరము చేర      ||సిలువ||
వంద గొర్రెల మందలోనుండి ఒకటి తప్పి ఒంటరియాయే తొంబది తొమ్మిది గొర్రెల విడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్    ||సిలువ||
తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రియతని జేర్చుకొనియే     ||సిలువ||
పాపి రావా పాపము విడచి పరిశుద్ధుల విందుల జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము    ||సిలువ||

104.సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో||
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి||
నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)        ||వెలి||

105.సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2) శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)
సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2) సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)
సమాధాన పరచును – యేసు రక్తము (2) సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)
నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2) దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)
రోగములను బాపును – యేసు రక్తము (2) దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2) యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)

106.సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము (2)

లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు (2)       ||సీయోను||
ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో (2) నిత్యనివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి (2)   ||సీయోను||
మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి (2) నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
ఐగుప్తు ఆశలనన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి (2) పాడైన కోరహు పాపంబుమాని విధేయులై విరాజిల్లుడి (2)          ||సీయోను||
ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చునేసు (2) సీయోను గీతము సొంపుగ కలసి పాడెదము ప్రభుయేసుకు జై (2)   ||సీయోను||

107.సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2)            ||సుధా||
దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2) నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2) ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2) నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)           ||సుధా||
లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2) క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2) నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)          ||సుధా|| 

108.స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా (2) ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2)        ||స్తుతి||

నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2)         ||స్తుతి||
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ (2) నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2)         ||స్తుతి||

109.స్తుతియించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా (2) నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా        ||స్తుతియించి||  గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా (2) అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా (2) నీ ప్రజలను పోషించినావా           ||స్తుతియించి||
అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు (2) ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు (2) నీ ప్రజలను రక్షించినావు           ||స్తుతియించి||
పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే (2) అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా (2) మము పరముకు నడిపించు దేవా         ||స్తుతియించి|| 


110.స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా (2) మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే

నే పాడెద ప్రభు సన్నిధిలో నే ఆడెద ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలి నే (2)
స్తుతి చెల్లించెద యేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2) నిరతము పాడెద హల్లెలూయా ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా          ||నే పాడెద||