1 to 5 Lentdays 2019


భస్మబుధవారం 201906MARCH2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev M. ఆనందవరంగారు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 16,191 

యోవేలు 2:12-18
12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు
భస్మబుధవారం.
భస్మ బుధవారమును క్యాథలిక్ చర్చివారు మొదటిగా మొదలు పెట్టారు.
సిలువ శ్రమ ధ్యాన కూటములను భస్మ బుధవారంతో ప్రారంభిస్తారు.
భస్మ బుధవారమును బూడిదబుధవారముగా పిలుస్తారు.
**రోమన్ కాథలిక్ వారు మట్టలాధివారం తరువాత మట్టలను ఎండబెట్టి సంవత్సరం తరువాత భస్మబుధవారం రోజున వాటిని కాల్చి వేసి వాటి నుండి వచ్చిన బూడిదను సిలువ గుర్తుగా ధరించుట ఆచారయుక్తంగా చేస్తారు.
**కానీ మనమైతే నలభై రోజులు దేవుని సన్నిధిలో సిలువ గురించి ధ్యానించుట, దేవుని సన్నిధిలో గడపడం గొప్ప వరంగా భావిస్తాం.

** నలభై రోజులు ఆత్మీయంగా బలపడుటకు మనకు ఉపయోగపడుతుంది.  
** నలభై సిలువ శ్రమ దినములు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి.
** నలభై రోజులు ఉపవాసధ్యానములలో మనం ఆత్మలో బలపడటానికి ఉపయోగపడతాయి.

1.మొదటిగా ఉపవాసం ప్రాముఖ్యత.
ఉపవాసానికి చాల ప్రాముఖ్యత ఉంది**మోషే నలబై రోజులు ఉపవాసం చేసి దేవుని కోసం కనిపెట్టాడు
**అదేవిధంగా యేసు ప్రభువారు కూడా అయన పరిపూర్ణ సేవలో నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం చేసారు
**మనము ఆత్మను బలపరుచు కోవటానికి ఉపవాసం అవసరం
**ఎన్ని శోధనలు వచ్చిన మనం ఆత్మలో బలపడాలి.
**ఆత్మను బలపరుచుకోని దేవుని సహాయం కోరుతూ సాతానును జయించాలి.

2.రెండవదిగా తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టు వారీగా ఉండాలి.

బూడిద తగ్గింపునకు సూచనగా ఉంది.
**బూడిద శ్రమకు సూచనగా ఉంది.
**బూడిద  కష్టానికి సూచనగా ఉంది.
**బూడిద రాబోవు ప్రమాదానికి సూచనగా ఉంది.

పాతనిభందన గ్రంథమును పరిశీలిస్తే బూడిద తగ్గింపునకు సూచనగా ఉంది.

ఆదికాండము 18:27అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను
యోబు గ్రంథము 42:6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను

**బూడిద యొక్క ధూళి మన చేత తొక్కబడుతుంది.
**ధూళి వంటి వారమైన మనమైతే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి 
దేవుని సన్నిధిలో మొరపెట్టు వారీగా ఉండాలి.

3.మూడవది దేవుని ఎదుట పశ్చాతాపము కలిగి ప్రార్ధనలో బలపడాలి
**యేసుప్రభువారు పడిన శ్రమలను తలచుకొని మనము పశ్చాతాపము కలిగి ఉండాలి
**పశ్చాతాపముతో కూడిన ప్రార్ధనలు చేయాలి.
**మనలో అసభ్యకరమైనవి ఏమైనా ఉంటె వాటిని రోజు నుండి విడిచిపెట్టాలి.
**మన పాపములను దేవుని ఎదుట విడిచిపెట్టాలి.

పశ్చాతాపమునకు సంబంధించి పాతనిభందన గ్రంధములో అర్పణలగూర్చి వ్రాయబడింది.

సంఖ్యాకాండము 19:17-18అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.
18
తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని నీళ్లలో ముంచి, గుడారముమీదను దానిలోని సమస్త మైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యుల మీదను, ఎముకనే గాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.

* అర్పణలను ఐదు రకాలుగా ఉంటాయి.
** అర్పణలో ఒక పాపి దేవుని సమీపించి బలి అర్పించాలి
*ఆవిధంగా చేసిన దానిని అపవిత్రమైన దానిమీద చల్లాలి.

విధంగా అర్పణలను ఎంతకాలము చేస్తాము
**ఈలాంటి బలులు ఆగిపోవాలి అని యేసు ప్రభువారు అయన తండ్రితో నిబంధన చేసుకొని
యేసుప్రభువారు మన పాపముల కొరకు సమాధాన బలిగా మారారు.
**అయన పొందిన శ్రమలను గుర్తు పెట్టుకొని మనం పవిత్రపరచబడాలిప్రార్ధనలో బలపడాలి
నలభై దినములు మన జీవితాలను సరిచేసుకొని యేసయ్య బిడ్డగా
అయన  కృప మన అందరికి అందివ్వాలని కోరుతూ 

దేవుడు మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

***********************************************************

2nd Lentday 2019 07MARCH2019
సిలువ శ్రమల ధ్యానకూటములు  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev M. ఆనందవరంగారు
యోహాను సువార్త 1:1-5
1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
2
ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
3
కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
4
ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
5
వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను
**యేసు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నారు.
**మనము మేల్కొని యేసు ప్రభువారిలో వెలగాలి.
**చీకటిని విడిచిపెట్టి వెలుగులో మనము ఉండాలి.
** జీవపు వెలుగులో మనము ఇతరులను వెలిగించాలి.
**అయన వాక్యపు వెలుగులో మనం ఇతరులను వెలిగించాలి.
**యేసు ప్రభువారి ద్వారా అందరు వెలుగు కలిగి ఉంటారు.
మనలను వెలిగించే వారు యేసయ్య అయన జీవితాలకు వెలుగు ఇచ్చేవారు.

1. వెలుగైనా యేసయ్య.
యేసు ప్రభువారు జీవపు వెలుగై ఉన్నారు.
యోహాను సువార్త 1:4 ఆయనలో జీవముండెను; జీవము మనుష్యులకు వెలుగైయుండెను

2. వెలిగించిన యేసయ్య.
యోహాను సువార్త 1:9నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది

3.మనం లోకానికి వెలుగైయున్నాము
మత్తయి సువార్త 5:14మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.
యేసు ప్రభువారిలో ఉంటె మనము లోకమునకు వెలుగై ఉన్నాము.

4.మనం యేసు ప్రభువారిలో వెలగాలి.
యేసు ప్రభువారి ద్వారా మనము పాపములను విడిచి వెలిగింపబడాలి.
ఎఫెసీయులకు 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ఎఫెసీయులకు 3:1 మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

5.ఇతరులను యేసు ప్రభువారి వాక్యపు వెలుగులో వెలిగించాలి.
కీర్తనల గ్రంథము  119:130నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును

ఆవిధంగా వెలిగేవారు ఎవరు, వారు ఎలా వెలగాలి?
1.బుద్ధిగల వారు వెలుగు తున్నటుగా వెలగాలి.
2.అనేకులను యేసు ప్రభువారి యొద్దకు నడిపించువారిగా వెలగాలి.
3.ఐక్యత గల వారు వెలుగుతున్నట్లుగా వెలగాలి.

మనము మేల్కొని యేసు ప్రభువారి వాక్యపు వెలుగులో ఇతరులను నడిపించాలి.
యోహాను సువార్త 1:12తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను
యేసు ప్రభువారి కృప ఆశీర్వాదం మన అందరికి సదా తోడై ఉండాలి.
దేవుడు మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

****************************************************************

3rd Lentday 201908/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్  చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం  శ్రీ వీర్ల సంజీవరావు గారు

1 పేతురు 1:18-1918 పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
19
అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా
***పితృపారంపర్యమైన వ్యర్ధ ప్రవర్తనను విడిచిపెట్టాలి.ఎవరు పితరులు, వారు ఎట్లా ఉండేవారు?ఎవరంటే ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలుగా ఉన్నవారు, కానీ దేవునికి విరుద్ధంగా కార్యములు జరిగించువారు.ఎట్లా పితృపారంపర్యమైన పాపపు జీవితాన్ని వదిలివేయాలి?

1.గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత పాపపు జీవితాన్ని వదిలివేయాలి.
1 పేతురు 1:19అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

యేసు ప్రభువారు గొఱ్ఱపిల్లగ ఎందుకు వచ్చారు?
గొఱ్ఱపిల్లతో యేసు ప్రభువారిని ఎందుకు పోల్చారు?
ఎందుకంటే గొఱ్ఱ ఎవరికీ హాని కలిగించని లక్షణం కలిగి ఉంటుంది.
గొఱ్ఱపిల్ల చాల మౌనంగా ఉండి అన్నిటిని సహిస్తుంది,నిష్కళంకంగా ఉంటుంది.
అటువంటి గొప్ప మనసు మన యేసు ప్రభువారు కలిగి ఉన్నారు
మనం కూడా నిష్కళంకమైన మనసు కలిగి ఉండుటకు ప్రయతించాలి.

2.సహోదర ప్రేమ కలిగి ఉండాలి.

1 కొరింథీయులకు 13:1-5మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.
యేసు ప్రభువారు వారివలె మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి.

3.శోధన వేదనలను జయించి పాపమును విడిచి పెట్టాలి.
హెబ్రీయులకు 4:15మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
యేసు ప్రభువారు మనకొరకు ఎన్నో శ్రమలను శోధనలను జయించి పాపము లేని వారీగా ఉన్నారు.
మనము కూడా ఎన్ని శోధనలు వచ్చిన పాపమును విడిచి పెట్టాలి.
 సిలువ మనకొరకు క్షమాపణ, పశ్చతాపానికి ఆయనపట్ల మనకు ఉన్నభాద్యతను గుర్తుచేస్తుంది.

4.మనము యేసు ప్రభువారి  కృపలో ఫలించాలి
ఎఫెసీయులకు 1:4-6ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు,
ఎల్లపుడు సిలువ గురించి ధ్యానించాలి.
అనేకులను సిలువ యొద్దకు నడిపించాలి.

5.ఆత్మ ఫలము కలిగి ఉండాలి.
గలతీయులకు 5:22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
ఫలింపని అంజూరపు చెట్టు వలె కాకుండా
ఆత్మ ఫలములోని అన్ని లక్షణములు కలిగి ఉండాలి.దేవునిలో బహుగా ఫలించే వారీగా ఉండాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
********************************************************************
4th Lentday 09MARCH2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం శ్రీ వీర్ల అబ్రాహాము గారు 
లూకా సువార్త  15:1-7
4 మీలో మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా

దేవుని త్యాగమును, దేవుని ప్రేమను ధ్యానించుటకు సిలువ ధ్యానకుటములు సహాయపడతాయి.నలభై సంఖ్యకు పరిశుద్ధ గ్రంధములో గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది.
**మోషే సినాయ్ పర్వతo మీద గడిపిన నలబై రోజులకు ప్రాముఖ్యత
**ఏలీయా నలభై దినముల ప్రయాణానికి ప్రాముఖ్యత
**యేసయ్య అరణ్యములో ఉపవాసమున్న నలభై దినములకు ప్రాముఖ్యత
**యేసయ్య పునరుద్దనుడైన తరువాత గడిపిన నలభై రోజుల కాలానికి ప్రాముఖ్యత.
**ఇశ్రాయేలీయుల నలభై సంవత్సరముల అరణ్యపు ప్రయాణానికి ప్రాముఖ్యత.
**దావీదు యొక్క నలభై సంవత్సరముల పరిపాలనకి ప్రాముఖ్యత.

**మొడుబారిన జీవితాలను చిగురింపజేయుటకు దేవుని శక్తిని పొందుకొనుటకు, సిలువ శ్రమల ధ్యాన కూటములు సహాయపడతాయి.
చదవబడిన వాక్యములో ఎందుకు యేసయ్య ఉపమానము చెప్పారు?
ఎవరైతే సణుగుచున్నారో పరిసయ్యలు శాస్త్రులు గూర్చి యేసు ప్రభువారు మాట్లాడు తున్నారు
మనము దేవుని యొక్క శక్తిని పొందుకొనుటకు యేసయ్య ఉపమానము చెప్పారు.
మత్తయి సువార్త  23:27అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతో నిండియున్నవి.

**పరిసయ్యల అంతరంగమును గూర్చి చెప్తున్నారు, మన హృదయము గూర్చి చెప్తున్నారు.

ఎలా మనము దేవుని యొక్క శక్తిని పొందుకుంటాము?
కల్మషం వేషధారణ లేకుండా నిర్మల హృదయం కలిగి ఉంటె అప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటాము.

లోకానికి యేసయ్య ఎందుకు వచ్చారు
**పాపులను రక్షించుటకు యేసయ్య లోకానికి వచ్చారు
 **నశించిన దానిని వెదకి రక్షించుటకు లోకానికి వచ్చారు.

మనము ఎలా ఎందువలన త్రోవ తప్పి పోవుచున్నాము?
1.రకరకముల అబద్ద బోధల వలన బోధకుల వలన మనము త్రోవ తప్పి పోవుచున్నాము.
యెషయా గ్రంథము  65:5వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు

2.సరైన కాపరులు లేక పొతే కొండలెక్కి మనము త్రోవ తప్పి పోవుచున్నాము.
యిర్మీయా 50:6నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి

3.మన యతిక్రమక్రియలనుబట్టి త్రోవ తప్పి పోవుచున్నాము.
యెషయా గ్రంథము 53:5మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది

మనము ఎలా త్రోవ తప్పి పోకుండా ఉండాలి?
దేవునిలో తప్పిపోవకుండా దేవునిలో ఎదగటానికి మనం పశ్చాత్తాపము పొంది,  దేవునిలో బలపడి దేవుని శక్తి పొందుకోవాలి.
యేసు ప్రభువారి కృప ఆశీర్వాదం కృప మన అందరికి సదాతోడై ఉండాలి.
యేసయ్య మాటలను దీవించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక.
****************************************************************
5th Lentday 11/03/2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం M.ఆనందవరంగారు

యెషయా  53:1-2
1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
2
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.

సిలువ శ్రమ ధ్యానకుటములు యేసు ప్రభువారి కోసం లోతుగా తెలుసుకోవటనికి ఉపయోగపడతాయి. ఎన్నో ప్రవచనములు యేసు ప్రభువారికోసం వ్రాయబడినవి.

ప్రవచనం అనగా జరగబోయే దానిని ముందుగా తెలియజేయటం అని అర్ధం.

చదవబడిన వాక్యభాగములో పరిశీలిస్తే 

1.యేసు ప్రభువారు ఎలా ఎదిగారు, ఎలా ఉన్నారు అని వాక్యభాగము సూచిస్తుంది?

లేత మొక్కవలె ఎదిగారు , ఎండిన భూమిలో మొక్కవలె ఉన్నారు, అని సూచిస్తుంది.
అతనికి సురూపమైనను సొగసైనను లేదు.

యెషయా  53:2 లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను.అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు

2.ప్రవచనంలో యేసు ప్రభువారు ఎలా ఉన్నారు అని సూచిస్తుంది?

యెషయా  53:3 అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
యేసు ప్రభువారు తృణీకరింపబడినవారు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.

3.యేసుప్రభువారిని ఎవరు తిరస్కరిస్తున్నారు?

 
యోహాను సువార్త  1:10-11 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. 11ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు

తన స్వకీ యులైన, యూధులైన వారే యేసు ప్రభువారిని తిరస్కరించారు.

4.యేసు ప్రభువారిని ఎందువలన తిరస్కరిస్తున్నారు?

ద్వితీయోపదేశకాండమ  32:15యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
వారు క్రొవ్వినవాడై యేసు ప్రభువారిని తిరస్కరించారు.

5.యేసు ప్రభువారిని ఎందుకు వారు తృణీకరించారు, ఎందుకు తిరస్కరిస్తున్నారు?

యోబు గ్రంథము  12:5 దుర్దశ నొందినవానిని తిరస్కరించుట క్షేమముగలవారు యుక్తమనుకొందురు. కాలుజారువారికొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది

దేవుని యెడల మనము ఎలా ఉన్నాం ఏమి చేస్తున్నాం?
దేవుని వాక్యమును తృణీకరిస్తున్నామా
దేవునికి దూరంగా ఉంటున్నామా 
దేవుని తిరస్కరిస్తున్నామా
దేవుని విసర్జిస్తున్నామా
దేవునికి విరుద్ధంగా ఉంటున్నామా
 మనలను పరిశీలించుకోవాలని దేవుని వాక్యమును, యేసయ్య కృపను పొందుకోవాలని

యేసయ్య మాటలను దేవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..