భస్మబుధవారం 2019




 06MARCH2019
సిలువ శ్రమల ధ్యాన కూటములు  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య సందేశం Rev M. ఆనందవరంగారు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 16,191 

యోవేలు 2:12-18., 15 సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి ష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

భస్మబుధవారం.
భస్మ బుధవారమును క్యాథలిక్ చర్చివారు మొదటిగా మొదలు పెట్టారు.
సిలువ శ్రమ ధ్యాన కూటములను భస్మ బుధవారంతో ప్రారంభిస్తారు.
భస్మ బుధవారమును బూడిదబుధవారముగా పిలుస్తారు.
 
**రోమన్ కాథలిక్ వారు మట్టలాధివారం తరువాత మట్టలను ఎండబెట్టి సంవత్సరం తరువాత భస్మబుధవారం రోజున వాటిని కాల్చి వేసి వాటి నుండి వచ్చిన బూడిదను సిలువ గుర్తుగా ధరించుట ఆచారయుక్తంగా చేస్తారు.
**కానీ మనమైతే నలభై రోజులు దేవుని సన్నిధిలో సిలువ గురించి ధ్యానించుట, దేవుని సన్నిధిలో గడపడం గొప్ప వరంగా భావిస్తాం.

** నలభై రోజులు ఆత్మీయంగా బలపడుటకు మనకు ఉపయోగపడుతుంది.  
** నలభై సిలువ శ్రమ దినములు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి.
** నలభై రోజులు ఉపవాసధ్యానములలో మనం ఆత్మలో బలపడటానికి ఉపయోగపడతాయి.

1.మొదటిగా ఉపవాసం ప్రాముఖ్యత.
ఉపవాసానికి చాల ప్రాముఖ్యత ఉంది. **మోషే నలబై రోజులు ఉపవాసం చేసి దేవుని కోసం కనిపెట్టాడు. 
**అదేవిధంగా యేసు ప్రభువారు కూడా అయన పరిపూర్ణ సేవలో నలభై రాత్రులు నలభై పగలు ఉపవాసం చేసారు. 
**మనము ఆత్మను బలపరుచు కోవటానికి ఉపవాసం అవసరం. 
**ఎన్ని శోధనలు వచ్చిన మనం ఆత్మలో బలపడాలి.
**ఆత్మను బలపరుచుకోని దేవుని సహాయం కోరుతూ సాతానును జయించాలి.

2.రెండవదిగా తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టు వారీగా ఉండాలి.

**బూడిద తగ్గింపునకు సూచనగా ఉంది.
**బూడిద శ్రమకు సూచనగా ఉంది.
**బూడిద  కష్టానికి సూచనగా ఉంది.
**బూడిద రాబోవు ప్రమాదానికి సూచనగా ఉంది.

పాతనిభందన గ్రంథమును పరిశీలిస్తే బూడిద తగ్గింపునకు సూచనగా ఉంది.

ఆదికాండము 18:27అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 
యోబు గ్రంథము 42:6కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను

**బూడిద యొక్క ధూళి మన చేత తొక్కబడుతుంది.
**ధూళి వంటి వారమైన మనమైతే దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి 
దేవుని సన్నిధిలో మొరపెట్టు వారీగా ఉండాలి.

3.మూడవది దేవుని ఎదుట పశ్చాతాపము కలిగి ప్రార్ధనలో బలపడాలి. 
**యేసుప్రభువారు పడిన శ్రమలను తలచుకొని మనము పశ్చాతాపము కలిగి ఉండాలి
**పశ్చాతాపముతో కూడిన ప్రార్ధనలు చేయాలి.
**మనలో అసభ్యకరమైనవి ఏమైనా ఉంటె వాటిని రోజు నుండి విడిచిపెట్టాలి.
**మన పాపములను దేవుని ఎదుట విడిచిపెట్టాలి.

పశ్చాతాపమునకు సంబంధించి పాతనిభందన గ్రంధములో అర్పణలగూర్చి వ్రాయబడింది.

సంఖ్యాకాండము 19:17-18
17 అప విత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.
18
తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని నీళ్లలో ముంచి, గుడారముమీదను దానిలోని సమస్త మైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యుల మీదను, ఎముకనే గాని నరకబడిన వానినేగాని శవమునే గాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.

* అర్పణలను ఐదు రకాలుగా ఉంటాయి.
** అర్పణలో ఒక పాపి దేవుని సమీపించి బలి అర్పించాలి. 
*ఆవిధంగా చేసిన దానిని అపవిత్రమైన దానిమీద చల్లాలి.

విధంగా అర్పణలను ఎంతకాలము చేస్తాము? 
**ఈలాంటి బలులు ఆగిపోవాలి అని యేసు ప్రభువారు అయన తండ్రితో నిబంధన చేసుకొని
యేసుప్రభువారు మన పాపముల కొరకు సమాధాన బలిగా మారారు. 

**అయన పొందిన శ్రమలను గుర్తు పెట్టుకొని మనం పవిత్రపరచబడాలిప్రార్ధనలో బలపడాలి. 
నలభై దినములు మన జీవితాలను సరిచేసుకొని యేసయ్య బిడ్డగా
అయన  కృప మన అందరికి అందివ్వాలని కోరుతూ 

దేవుడు మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.