MAY Messages 2018

06/05/2019  ఆదివారము ఆరాధన 
BAPTIST CHURCH AKKAYYAPALEM 
Message పాస్టర్ Rev. M. ఆనంద వరంగారు 
Response : psalms :58
Andhra Christava Songs 7,171,574,386
యోహాను సువార్త 3:14-15
అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను.

అరణ్యములో మోషే సర్పమును ఎత్తడము ద్వారా దేవుడు ఉద్దేశము

1.ఇశ్రాయేలీయులు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడుట
2.మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినపుడు వారు చేసిన పాపము గుర్తు రావాలి అని దేవుడు ఉద్దేశము
3.మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినపుడు వారి పాపము వలన వచ్చే శాపము గుర్తు రావాలి అని దేవుడు ఉద్దేశము

సంఖ్యాకాండము 21:4-5
వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్య మైనదనిరి. 

**ఇశ్రాయేలీయులకు దేవుడు విలువైనవి, శ్రేష్టమైనవి ఇస్తున్నాడు.
**ఇశ్రాయేలీయులు దేవునికిని దేవునిసేవకులును విరోధముగా మాట్లాడుట.
**ఇశ్రాయేలీయులు మాకు అసహ్య మైనదనిరి.
**ఇశ్రాయేలీయులు దేవుని విడిచి యిత్తడి సర్పమును ఆరాధన చేయుట.
 
2రాజులు18:4ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభ ములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి 

పాము యొక్క లక్షణములు:-
1.విషపూరిత మైనది 
కీర్తనల 58:4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
**మన మాటలు విషపూరితమైనవిగా ఉండకూడదు.
**మన మాటలు జాగ్రత్త మాటాడాలి.
**మన మాటలు అలోచించి మాట్లాడాలి.
 
2.పాము చెవిటిది
కీర్తనల 58:5 వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.  

**దానికి స్పర్శ గలది వినికిడి లేనిది
**దేవుని యొక్క వాక్యము శ్రద్దగా వినువారిగా ఉండాలి
**దేవుని బిడ్డలు దేవుని వాక్యము గ్రహించే వారీగా ఉండాలి 

3.కోపము ఎక్కువ, పగ, ద్వేషము గలది
**మనము దేవుని బిడ్డలుగా కోపము కలిగి ఉండకూడదు
**ఎవరి మీద ద్వేషము కలిగి ఉండరాదు
**కోపములో మనలను మనము సరిచేసుకొవాలి

4.వివేకము గలది
**జాగర్తగా  తప్పించుకొనే వివేకము గలది.
**పాపము చేసి తప్పించుకొనే వివేకము వదిలి పెట్టాలి.
**మంచి విషయాలలో వివేకము కలిగి ఉండాలి.
**ఆత్మ సంబంధ మైన వాటిలో వివేకము కలిగి ఉండాలి.

5.వంకరతనము గలది
యెషయా 27:1ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును 

**మన నడక మారాలి
**మన ప్రవర్తన మారాలి
**మాట తీరు మారాలి

6.పాము బురదలో ప్రాకుతుంది
ద్వితీయోపదేశకాండమ  32:24
వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవు దురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.  

**బురద అనేది పాపపు జీవితానికి సూచన
**మన పాపపు జీవితమును విడిచిపెట్టు వారీగా ఉండాలి
**మన జీవితము దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి

మోషే ఇత్తడి సర్పమును పైకెత్తినపుడు చనిపోతున్నవారు బ్రతికారు
పాపములో చనిపోయినవారు ఆత్మ సంభందంగ తిరిగి బ్రతకాలంటే యేసును పైకెత్తడం జరగాలి, యేసు ప్రభువు మన పాపాల కోసం దేవుని  గొర్రె పిల్లగా మన పాపములను మోసుకుపోయి మనము నశింపక శాశ్వత జీవం పొంది యేసులో జీవించాలి.
 
దేవునిలో ఎదగాలి అని అంటే
1.పాము యొక్క లక్షణము విడిచిపెట్టు వారీగా ఉండాలి.
2.విషపూరిత మైన మాటలను విడిచి పెట్టాలి.
3.విలువైన దేవుని వాక్యము ముత్యము వజ్రము కంటే విలువైనది దేవుని వాక్యం విని దేవునిలోఎదగాలి.
4.పాపములోను, కోపములోను, ద్వేషములో ఉన్నప్పుడు మనకు శ్రమపడిన మన ప్రభువైన యేసయ్య గుర్తుకు రావాలి.
 5.మనము పాపములో నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొంది, మనలను మనము సరిచేసుకొని దేవునిలో జీవించాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక  ఆమెన్
************************************************
13/05/2018
ఆదివారము ఆరాధన దైవసేవకులు
Msg By పాస్టర్ M.ఆనందవరం గారు
BAPTIST CHURCH AKKAYYAPALEM
Response : psalms :139
Andhra Christava Songs 12,518,578,614
Topic : MOTHER’S DAY
తీతుకు 2:1-5
1 నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము.
2 ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు,
3 ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై6 యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
4 ¸°వనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు,
5 మంచి ఉపదేశముచేయువారునై యుండవలె ననియు బోధించుము.

MOTHER Abbrevation Meaning.......
M- Monitor O., - Operator., T- Teacher., H- Helper.,  E- Educator .,R- Rectifier
**తల్లి కుటుంభంలో విలువైనది తల్లిని గౌరవించాలి ప్రేమించాలి.
**తల్లి చెప్పు బోధను మరువకూడదు.
**కుటుంభంలో బిడ్డల కొరకు శ్రమించేది 
**తల్లికుటుంభం యొక్క భాద్యతను చూసుకుంటుంది
M- Monitor - ఎలా చేయాలో సమస్తమును బిడ్డలకు చూపించేది
O- Operator - ఎం కావాలో కుటుంబాన్ని నడిపించేది తల్లి
T- Teacher - బిడ్డలకు మంచి మార్గములు బోధించే తల్లిగా ఉండాలి
H- Helper _ కుటుంబమునకు సహాయకర్త ఉండాలి 
E- Educator - మంచి చెడుల గురించి నేర్పించే తల్లిగా ఉండాలి
R- Rectifier - కుటుంబములో లోటుపాటులను సరిచేస్తుంది

**తల్లి బిడ్డలను తన రూపములో చూసుకుంటుంది
**తల్లి కుటుంభంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది
**తల్లి తన బిడ్డలకు మంచి మార్గంలో నడిపిస్తుంది
**తల్లితన బిడ్డలను అభివృద్ధిలో సహాయపడుతుంది 
**దేవుని వాక్యమును శ్రద్దగా విని బిడ్డలకు చెప్పే తల్లిగా ఉండాలి
**ఆధ్యాత్మికంగా బిడ్డలను నడిపించే తల్లిగా ఉండాలి 
**దేవుని యందు విశ్వాసంలో నడిపించే తల్లిగా ఉండాలి
**ప్రార్ధన లో బలపడే బిడ్డలుగా తయారు చేసే తల్లిగా ఉండాలి

ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆద రించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెషయా 66:13
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*************************************************
20/05/2018
ఆదివారము ఆరాధన దైవసేవకులు
Message By పాస్టర్ M.ఆనందవరం గారు
BAPTIST CHURCH AKKAYYAPALEM
Response : Psalms :55
Andhra Christava Songs 1,474,583,616
Topic : జాగ్రత్త
ద్వితీయోపదేశకాండము 6:12-17
12 ​దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.
13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.
14 మీరు ఇతర దేవతలను, అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు.
15 నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండ కుండ నిన్ను నశింపజేయును.
16 మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను.

**జాగ్రత్త అనగా ఒక హెచ్చరిక తో కూడిన మాట
**జాగ్రత్త అంటే ఎదో జరిగింది అని అర్ధం
**జాగ్రత్త అంటే ఎదో జరగబోతుంది అని అర్ధం
**జాగ్రత్త ప్రమాదం ఉంది అని అర్ధం
**సిద్దపటుకు జాగ్రత్త అని అర్ధం
**సరిచేసుకోవడానికి జాగ్రత్త అని అర్ధం

1.కుక్కలతో జాగ్రత్త
ఫిలిప్పీ 3:2కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి.
**దుష్టులైన పరిసయ్యులు,సద్దుకాయ్యలతో,శాస్త్రులతో జాగ్రత్తగా ఉండాలి.

2. దుష్టులైన పని వారితో జాగ్రత్త
ఫిలిప్పీ 3:2 దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. 

**దుష్టులైన మనుష్యుల మధ్య జాగ్రత్తగా ఉండాలి.

3. అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి
మత్తయి 7:15 అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. 

**సంఘములో అబద్దబోధలు చేసే వారితో జాగ్రత్త గా ఉండాలి.
**దేవుని బిడ్డలు జ్ఞానవంతులుగా ఉండాలి.

4. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి
నిర్గమకాండము 23:20-22ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.
** దేవుని సన్నిధిలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
** దేవుని సన్నిధిలో కూరుచ్నపుడు, మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
** దేవుని సన్నిధిలో దేవుని మాట జాగ్రత్తగా వినవలెను.


5. దేవుని మరువకుండ నీవు జాగ్రత్తపడుము. 
ద్వితీయోపదేశకాండము 6:12దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండ నీవు జాగ్రత్తపడుము.
**మనము సజీవంగా ఉన్నాము అంటే అయన కృప.
**మనము ఆరోగ్యముగా ఉన్నాము అంటే అయన మేలు.
**మనము శోధనలో పడకుండా ఉన్నాము అంటే అయన మేలు.
**అందుకు దేవుని కృపను జ్ఞాపకము చేసుకొని దేవుని మరువకూడదు.

6. చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. 
ద్వితీయోపదేశకాండము 15:9 విడుదల సంవత్సర మైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీద వాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును.
**చెడు  ఆలోచన రాకుండా జాగ్రత్త పడాలి
**మంచి ఆలోచనలు  కలిగి  ఉండాలి

7. దేవుని తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త.
యోబు36:18నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము
**కోపములో దేవునికి తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తగా ఉండాలి

8. దేవునికి ఇచ్చే ప్రాయశ్చిత్తము విషయములో మోసపోయెదవేమో జాగ్రత్త. 
యోబు36:18నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
**దేవునికి ఇచ్చే వాటి విషయములో జాగ్రత్తగా ఉండాలి

దేవునిలో మన ఆత్మీయస్థితిని పరిశీలించికొని జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
********************************************************
27MAY2018
BAPTIST CHURCH AKKAYYAPALEM
ఆదివారము ఆరాధన దైవసేవకులు
Message By పాస్టర్ M.ఆనందవరం గారు
Response : Psalms 34
Andhra Christava Songs 8,236,455,610

Topic : కొర్నేలీ - భక్తి

అపొస్తలుల కార్యములు10:1-8
1 ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.

** కొర్నేలీ అనగా ఉదేడి కొమ్ము అని అర్ధం 
**కొర్నేలీ భక్తి పరుడు
**కొర్నేలీ రోమీయుడు
**కొర్నేలీ శతాధిపతి
**కొర్నేలీ కైసరయ పట్టణం వాడు

1.భయభక్తులు గలవాడు.
అపొస్తలుల 10:2 అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి;
**మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి
దేవుని యందు  భయభక్తులు కలిగి ఉండుట  వలన  ఏమిటి  ప్రయోజనం?

కీర్తనల గ్రంథము 34:7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును

కీర్తనల గ్రంథము 128:1యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు

2. బహు ధర్మము గలవాడు
అపొస్తలుల 10:2అతడు తన యింటివారందరితోకూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు


ద్వితీయోపదేశకాండము 15:7నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీద వాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింప కుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు.


** బీద వారికి మనము సహాయము చేయువారిగా ఉండాలి.

3. ఎల్లపుడు దేవునికి ప్రార్ధన చేయువాడు ప్రార్ధన పరుడు.
అపొస్తలుల 10:2 ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయు వాడు.

మత్తయి సువార్త 26:41మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి;
**మనము ఎల్లపుడు దేవునికి ప్రార్దించు వారీగా ఉండాలి

4. నీతిమంతుడు నీతిగలవాడు
అపొస్తలు 10:22 అందుకు వారునీతిమంతుడును, దేవునికి భయపడువాడును


ద్వితీయోపదేశకాండము 6:25మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచు కొనునప్పుడు మనకు నీతి కలుగును. 
**మనము మన జీవితాలలో నీతి కలిగి జీవించాలి

5. మంచి పేరు పొందినవాడు
అపొస్తలుల 10:22యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు
ప్రసంగి 7:1 సుగంధతైలముకంటె మంచి పేరు మేలు;   
దేవుని యందు మంచిపేరు కలిగి ఉండవలసిన వారమై వున్నాము. 

6. మర్యాద కలిగినవాడు
 
అపొస్తలుల 10:25పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాద ములమీద పడి నమస్కారము చేసెను.

** మన జీవితాలలో మర్యాద కలిగి ఉండవలిసిన  వారమై వున్నాము

7. దేవుని వాక్యము వినుట యందు ఆశక్తి గలవాడు
అపొస్తలుల 10:33వెంటనే నిన్ను పిలి పించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను.
** దేవుని వాక్యము వినుటకు సిద్ధపడవలసిన వారమై వున్నాము

8. దేవునిలో జనులను నడిపించువాడు
అపొస్తలుల 10:24మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కని పెట్టుకొని యుండెను.


అపొస్తలుల 10:27అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.
**మనము దేవునిలో జనులను నడిపించు వారీగా ఉండాలి.
మన జీవితాలలో కొర్నేలీ వలే దేవుని యందు భయభక్తులు కలిగి,  దేవునికి మహిమకరముగా  జీవించాలని అట్టి కృప ఆ దేవాది దేవుడు మన అందరికిని అందించాలని ఆశిస్తూ

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.