ఉజ్జివకూటములు12July2019


ఉజ్జివకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.K.డేనియల్ గారు
Topic:విశ్వాసము వృద్ధిపొందించుట ఎలా?
లూకా 17:1-5., 5 అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా

**చదవబడిన దేవుని మాటలు మనకు క్రొత్తవికాదు గాని అనేక మార్లు మనకు భోదించబడినవి, కానీ ప్రభువు ఈరోజు మరొక్కసారి మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు.

**మనం దేవుని వాక్యంలో అపొస్తలలులైన 12మంది శిష్యులు ప్రభువు వద్దకు వచ్చి తమ విశ్వాసము వృద్ధిపొందించుమని అడుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు.

** వాక్యం ద్వారా దేవుడు మనలను మన విశ్వాసమును ప్రశ్నించుకోవాలి అని మాట్లాడుతున్నాడు.

**విశ్వాసం అని అంటే నమ్మకం అని, విశ్వాసం అని అంటే విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.

**అసలు నిజమైన విశ్వాసం అంటే మనం పూర్తిగా ప్రభువు మీద ఆధారపడటం
మనలను మనం పూర్తిగా ప్రభువుకు అప్పగించుకోవటం నిజమైన విశ్వాసం కలిగి ఉండటం.

ఈరోజున మన విశ్వాసం మరియు సంఘము విశ్వాసం ఎలా ఉన్నది అని గమనిస్తే 
1తిమోతికి 4:1-2
1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
2 దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.

రోజున సంఘము విశ్వాసంలో బలహీన స్థితిలో, విశ్వాసంలో చెడిపోయిన స్థితిలో ఉన్నది

ఈరోజున విశ్వాసంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నామో చుస్తే  
2 కొరింథీ11:12
12 అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు

**విశ్వాసంలో సరళత లేక తొలగిపోవుచున్నాము, మనకు మన ప్రభువే తొలి స్థానంలో ఉన్నాడని చెప్పగలిగే విశ్వాసం మనం కలిగి ఉండాలి.

**ఎల్లప్పుడూ మన ప్రభువు మనతో ఉన్నాడని మన ప్రభువును మనం చూడగలిగే విశ్వాసం మనకు ఉండాలి

విశ్వాసం లేకుండా దేవుని చూడటం అసాధ్యం కనుక మన విశ్వాసాన్ని పరీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది,అని దేవుని వాక్యం చెప్తుంది.
2 కొరింథీ13:5
5 మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?

**కనుక మనము మంచి విశ్వాసి అని అవునో కాదో మనలను మనం పరిశీలించుకోవాలి

విశ్వాసాన్ని ఎలా వృద్ధిపొందించుకోవాలో ప్రభువు మనకు కొన్ని సమాధానాలు మనకు ఉపమానరూపంలో చెప్పారు.

ఈరోజున మనం విశ్వాసాన్ని వృద్ధిపొందించుకోవటానికి  ఏమి చేయాలి ఏమి కలిగి ఉండాలి.

1.మొదటిగ నిజమైన విశ్వాసంలో పరిపూర్ణమైన దీనత్వం కలిగి ఉండాలి.

లూకా 17:10
10 అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

**మనం నిష్ప్రయోజకులమైన దాసులము అనే పరిపూర్ణమైన దీనత్వం కలిగిఉండటమే విశ్వాసంలో మొదటి మెట్టు.

**మనలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి.

దావీదు తనను తాను తగ్గించుకొని దేవుని యందు కనుపరిచిన విశ్వాసమును మనం దేవుని వాక్యంలో గమనించవచ్చు

1దినవృత్తాంతములు29:14
14 ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము.

1దినవృత్తాంతములు22:14
14 ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తార మైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రాను లను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.

**దావీదు అంతటి తగ్గింపు స్వభావం, దేవుని యందు దావీదు అంతటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి

2.రెండవదిగా కృతజ్ఞత అనే ఆత్మ కలిగిన వాడే నిజమైన విశ్వాసి

లూకా17:17-18
17 అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; తొమ్మండుగురు ఎక్కడ?
18 అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి

**మనకు విశ్వాసి అని చెప్పడానికి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి.
**మానవ బంధాలలో మనం బలహీన పడిపోకుండా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి.

 **దేవుడు చేసిన మేలు యందు కృతజ్ఞత కలిగిఉండాలి.


3.మూడవదిగా క్రమం తప్పకుండ ప్రార్దించే లక్షణం కలిగి ఉండాలి.

లూకా18:7
7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?

**ఒక విశ్వాసికి ఉండవలసిన ముక్ష్య లక్షణం దివారాత్రులు దేవునికి ప్రార్దించువారిగా ఉండాలి.

**విశ్వాసి  విసుగక నిత్యం ప్రార్ధించాలి, ఆలా ప్రార్ధన కలిగి ఉండటం అని అంటే మన ప్రభువుతో సమయం గడపటం.

**ఈరోజున చాల మందికి ప్రార్ధనకై సమయం లేని స్థితిలో ఉంటున్నాము మనలను మనం పరిశీలించుకోవాలి


**మన అవసరాలలోనే కాదుగాని అన్ని సమయము లందు మనం ప్రార్దించువారిగా ఉండాలి.
 
** రోజున సంఘములో మన విశ్వాస పరిమాణం ఎంతో మనం పరిశీలించుకోవాలి.

మన విశ్వాసంలో వృద్ధిపొందాలి, మనలను మార్చగలిగే దేవుడు మన యేసయ్య అట్టి కృప మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..