26 to 29 Lentdays 2019


26th Lentday 2019 04/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: అయన హస్తము 

యోహాను 19:17-22.,17 వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ బాషలో దానికి గొల్గొతా అని పేరు.
18
అక్కడ వైపున ఒకనిని వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.

**చదవబడిన వాక్యభాగమును గమనిస్తే యేసుప్రభువారిని మన అతిక్రమములను బట్టి అయన వీపుపై కొరడాలతో కొట్టడం తరువాత ఆయనను సిలువ మోయచుండగా కపాల స్థలం దగ్గరకు తీసుకువచ్చారు.

**అయన చేతులను, కాళ్ళను పొడవాటి  మేకులతో సిలువకు కొట్టి గాయపరిచారు.
అయన కుడి వైపు ఒక దొంగను ఎడమవైపు మరొక దొంగను సామాన్యమైన సిలువ వేశారు కానీ వారి నేరాలు ఎక్కువ, కానీ యేసుప్రభువారికి గోరమైన శిక్షను విధించి బాధపెట్టారు.

అయన రెండుచేతులను మనం గమనిస్తే

అసలు చేతులు గూర్చి బైబిల్ గ్రంధములో ఏమి వ్రాయబడినది మనం గమనిస్తే
1.మొదటిగా దేవుని హస్తము భూమికి పునాది వేసినది.
యెషయా 48:13
నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును.
 

**ఒక కుమ్మరి వాడు కుండను చేసినట్టుగా దేవుని హస్తము నరుని నిర్మించినది

2.రెండవదిగా అయన హస్తము ఏమిచేస్తుంది
కీర్తనల గ్రంథము 89:13
పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.
**
అయన హస్తము పరాక్రమైనది బలమైనది ఉన్నతమైనది.
**అటువంటి శ్రేష్ఠమైన హస్తము సిలువలో గాయపరచబడినది.

3.మూడవదిగా దేవుని హస్తము ఎలాంటిది?

కీర్తనల గ్రంథము 118:16
యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును.
అందుకే
కీర్తనకారుడు అంటున్నాడు
కీర్తనల గ్రంథము 118:17
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను

4.
నాల్గవదిగా దేవుని వాక్యమును గమనిస్తే నూతన నిబంధనలో హస్తము ఏమిచేసింది?
మత్తయి 8:3
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టినాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధి యాయెను

**యేసయ్య హస్తము ఒక కుష్టు రోగిని బాగుచేసింది.
**అందరితో అసహ్యింపబడిన వ్యక్తి, వెలివేయబయిన వ్యక్తిని అయన హస్తము తాకి శుద్ధుడవు కమ్మని ఆరోగము నుండి బాగుచేసింది.
**ఆకుష్టు రోగిని ముట్టుకొని స్వస్థపరచుట యేసయ్య యొక్క ప్రేమను సూచిస్తుంది.
**యేసయ్య హస్తము అమోఘమైనది.

**మరియొక సంధర్బములో సముద్రముపై పేతురును యేసయ్య హస్తం పైకి లేవనెత్తింది.

మత్తయి 14:30-31
గాలిని చూచి భయపడి మునిగిపోసాగిఒ ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.
31
వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను

**
పేతురు సముద్రముపై నడవాలని ఆశపడి గాలికి భయపడిన సంధర్బములో, తనలోని దేవుని శక్తిని కోల్పోయి నీటిలో మునిగిపోతున్నపుడు యేసయ్య హస్తం పేతురును పైకి లేవనెత్తింది.
 
** రోజున మనం కూడా యేసయ్యకు దగ్గరగా  ఉంటె అయన తన చేయిచాపి మనలను లేవనెత్తుతాడు
**అందుకే మనం యేసయ్యకు దగ్గరగా ఉంటే హస్తం మనలను నిత్యం కాపాడుతుంది

కోడి తన పిల్లను తన రెక్కలక్రింద కాపాడునట్లుగా యేసయ్య కాపాడును
 కీర్తనల గ్రంథము 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది

5.
యేసయ్య హస్తము క్రింద మనం ఎలా ఉండాలి?
1 పేతురు 5:6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
**
చివరకు హస్తం సిలువలో మేకులతో కొట్టబడి గాయపరచబడినది.
**యేసయ్య ప్రేమ గొప్పది అయన గాయపరచబడిన హస్తముతో అయన మనలను పిలుస్తున్నాడు, అయన హస్తము క్రింద మనం దినమనస్కులై ఉండాలని పిలుస్తున్నాడు.

6.యేసయ్య గాయపడిన హస్తముతో ఎందుకు మనలను పిలుస్తున్నాడు.
పరమగీతము 2:14
బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము.

**పావురం అనగా సంఘము మరియు విశ్వాసి
**బండ అనగా  యేసుప్రభువారు అయన గాయపడిన హస్తముతో మనం హత్తుకొని ఉండాలని యేసయ్య మనలను పిలుస్తున్నాడు
**యేసయ్య మనలను బాగుచేయటానికి పిలుస్తున్నాడు.
**యేసయ్య మనలను పైకి లేవనెత్తటానికి పిలుస్తున్నాడు.
**అయన అడుగుజాడలలో నడుస్తూ జీవించడానికి యేసయ్య మనలను పిలుస్తున్నాడు.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.. 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

**********************************************************************
27th Lentday 2019
05/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెo
వాక్యపరిచర్యRev.M.ఆనందవరంగారు
Topic:గొల్గొతా స్థలము-ప్రత్యేకత

మార్కు 15:21-26
22 అతడు అలెక్సంద్రు నకును రూఫునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
 
**చదవబడిన వాక్యంలో గమనిస్తే యేసుప్రభువారిని గొల్గొతా అను స్థలమునకు తీసుకువచ్చారు. స్థలమునకు కపాల స్థలమని పేరు.

**అసలు స్థలమును గూర్చి, అది ఏప్రాంతములో ఉన్నది అని ఆలోచన చేయగా ఇది మోరియా పర్వత ప్రాంతము.

1. పర్వతము యొక్క ప్రత్యేకతను గూర్చి దేవుని గ్రంధములో ఏమి వ్రాయబడినది?
బైబిల్ గ్రంధమును పరిశీలన చేస్తే 

ఆదికాండము 22:2అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతనిని నర్పించుమని చెప్పెను.

ప్రియులారా అబ్రాహాము ఒక్కగానీ ఒక కుమారుని భలి ఇచ్చుటకు పర్వతం దగ్గరకు తీసుకు వచ్చి తన కుమారునికి బలి ఇచ్చుటకు కత్తిని ఎత్తగా అప్పుడు దేవుని దూత పరలోకమునుండి ఆయనను పిలిచి చిన్నవానిమీద చెయ్యి వేయకుము తన కుమారునికి మారుగా పొట్టేలును పట్టుకొని పెట్టి దహన బలిగా ఇమ్మని చెప్పెను.

దేవుడు ఎందుకు పర్వతము మీదకు తన కుమారుని బలి ఇచ్చుటకు తీసుకొనిరమ్మన్నాడు?

ఎందుకంటే మోరీయా పర్వతము ఒక ప్రత్యేకత కలిగినది

2.మోరీయాపర్వతము ఎక్కడ ఉన్నది పర్వతము ప్రత్యేకత.
2దినవృత్తాంతములు 3:1 ఇది యెరూషలేములో ఉన్నది అక్కడ ఒక సుందరమైన మందిరం సొలొమోను ద్వారా కట్టబడినది.  

**దేవుని హృదయానుసారుడైన దావీదుకు స్థలంలో దేవుడు ప్రత్యక్షమాయెను, స్థలంలో మందిరం సొలొమోను ద్వారా కట్టబడినది.  


3.ఆ మోరీయాపర్వతానికి మరియొక పేరు సీయోను పర్వతము, దేవుని వాక్యము పరిశీలిస్తే
కీర్తనల గ్రంథము 78:68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.  

4.ఆ మోరీయాపర్వతము దేవునికి ఇష్టమైన పర్వతము.

కీర్తనల గ్రంథము 132:13 యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.

5.సీయోనులో అయన ఆలయము ఉన్నది అని కీర్తనకారుడు వ్రాస్తున్నాడు

కీర్తనల గ్రంథము 76:2 షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది

**షాలేములో అయన గుడారము ఉన్నది, హెరేబు పర్వతం దేవునికి ఇష్టం.
 
6.పాతనిభంధన గ్రంధములో గమనిస్తే ఈపర్వతం గూర్చి ఏమివ్రాయబడినది
 
లేవీయకాండము 16:27
పరిశుద్ధస్థలములో ప్రాయ శ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థ బలియగు కోడెను మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయ వలెను.

**పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము లోపలికి తేబడి వాటిని పాళెము వెలుపలికి తీసికొని పోవలెను, పాతనిబంధనలో ఇటువంటి ఆచారము ఉండేది.

**పాళెము వెలుపల ఉన్నది గొల్లాత ప్రాంతము.

**దేవుని పర్వతంగా ఇది పిలువబడుతుంది అందులోని ఒక భాగం గొల్లాత
ఇది ప్రత్యేకమైనది

7.యేసుప్రభువారి విషయంలో సిలువశ్రమ ఈవిధంగానే పాళెము వెలుపల జరిగింది దేవుని వాక్యమును పరిశీలిస్తే

హెబ్రీయులకు 13:12-13
కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
13 కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.

** స్థలంలో అబ్రాము తన కుమారుని బలి ఇచ్చుటకు తీసుకువచ్చెను.

** స్థలంలో దావీదుకు దేవుడు ప్రత్యక్షమాయెను.

** స్థలంలో సొలొమోను సుందరమైన దేవాలయము కట్టించెను

** స్థలం దేవునికి ఇష్టమైన స్థలంగా పిలువబడుతుంది.

** స్థలంలో యేసు ప్రభువారు మనకొరకు సిలువవేయబడెను.

కాబట్టి మనం ఏమిచేయాలి అని ఆంటే యేసుప్రభువారు యిన్ని భాదలు పడటానికి మనమే కారణం, మన పాపములు కారణం కావున అయన నిందలు మనం భరించి అయన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***************************************************************************
28th Lentday 2019
06/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: అయన పాదములు

మత్తయి 27:32-37
ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

**చదవబడిన వాక్యభాగములో యేసుప్రభువారు సిలువ నెత్తుకొని మోస్తూఉండగా ఆప్రదేశంలో సీమోను అనే ఒకనిని సిలువ మోయుటకు బలవంతముచేసిరి తరువాత యేసుప్రభువారిని కపాల స్థలమునకు తీసుకువచ్చి అయన చేతులకును పాదములను మేకుకొట్టి సిలువ వేసి యూదుల రాజని వ్రాసి అయన తలపై ఉంచిరి.

**ప్రియులారా రోజున అయన పాదముల గూర్చి కొన్ని విషయములు ధ్యానం చేద్దాం.

**అయన సుందరమైన పాదములకు అయన విలువైన పాదములకు మేకులు కొట్టి సిలువ వేసిరి.

**యేసయ్య పాదములు రక్త మాంసములు ధరించినవి

**యేసయ్య పాదములు దేవుని సువార్త కొరకు పరుగిడినవి.

**గలాలియా ప్రాంతములో అయన పాదములు అనేకమందికి మారుమనస్సును కలిగించినవి.

**అనేకమంది అయన పాదముల చెంతకు వచ్చేవారు.

1. అనేకమంది అయన పాదముల దగ్గరకు వచ్చి ఏమి చేసేవారు, ఎందుకు అయన పాదముల వద్దకు వచ్చేవారు? దేవుని వాక్యమును గమనిస్తే

మత్తయి15:30
బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

**అనేకమైన వ్యాధుల గలవారు దైయ్యాలు పట్టిన వారిని అయన పాదముల దగ్గరకు స్వస్థత కొరకు అయన పాదముల వద్ద పడేసేవారు.

**ఎందుకంటే అయన పాదముల వద్ద తగ్గింపు కలిగి స్వస్థత కొరకు వచ్చేవారు.

**ఎందుకంటే అయన పాదముల దగ్గర కనికరమును పొందుటకు వచ్చేవారు


2.దెయ్యం పట్టిన వ్యక్తి యేసుప్రభువారి పాదముల వద్దకు కూర్చొని ఉన్న సంధర్బము మనం గమనిస్తే

లూకా 8:35
జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.

**జనులు దెయ్యం పట్టిన వ్యక్తి స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.

3.మరియా, మార్తా, యేసుప్రభువారి మధ్య జరిగిన సందర్బమును పరిశీలిస్తే

లూకా 10:39-40
ఆమెకు మరియ అను సహోదరియుండెను। ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను.

**మరియా అయన పాదముల చెంత అయన బోధను వినుచుండగా , మార్తా విస్తారమైన పనులు పెట్టుకొనెను.

**అప్పుడు యేసుప్రభువారు మరియా ఉత్తమైనదానిని ఎంచుకొనెను అని మార్తతో అనిన సంగతి మనం గమనించవచ్చు

**మనము కూడా మార్తలాగ విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుని మందిరములో గడపలేని పరిస్థితి.


4.ఎందుకు మనం అయన పాదసన్నిధిలో గడపటానికి సమయం ఇవ్వాలి?

కీర్తనల గ్రంథము119:105
 
నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది

**అయన వాక్యము ఉన్నతమైనది, అది పాదములకు దీపము అయన వాక్యము శాశ్వతమైన జీవితాన్నిఇచ్చేది.

**అందుకే ఆయన మందిరములో అడుగుపెట్టి అయన పాదసన్నిధిలో మనం గడపాలి.


5.ఒక పాపాత్ములారాలైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి తన పాపవిముక్తి కొరకు కన్నీరుతో యేసయ్య పాదముల చెంత చేరి తన తల వెంట్రుకలతో తుడిచిన సందర్బమును మనం గమనించ వచ్చు.

**ఆమె విస్తారమైన పాపములకు యేసయ్య పాదముల వద్ద క్షమాపణ దొరికింది.

**మనం కూడా దేవుని సన్నిధిలో హృదయవేదనతో పశ్చాత్తాపముతో ఏడ్చి ప్రార్ధన చేయాలి.


6.యేసయ్య పాదముల చెంత పడిపోయిన యోహాను భక్తుని గూర్చి ఆలోచన చేస్తే

ప్రకటన గ్రంథము1:17
నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;

**యోహాను పద్మాసు దీపములో పొందిన దర్శనములో యేసయ్య ముఖము మహా తేజస్సుతో గొప్ప వెలుగుతో ప్రకాశించుట చూచి ఆయన పాదముల వద్ద పడిపోయెను

7.ఈరోజున మనం ఎలా ఉన్నాము?
 
**యేసయ్య పాదముల చెంత చేరి స్వస్థతను పొందుతున్నామా

**యేసయ్య పాదముల చేత చేరి ఆయన కొరకు బలమైన సాక్షిగా వాడబడుచున్నామా

**యేసయ్య పాదముల చెంత చేరి క్షమాపణ పొందగలుగుతున్నామా, మనలను మనం పరిశీలించుకోవాలి
 
యేసయ్య పరిశుద్ధత కలిగి పరిశుదాత్మతో జన్మించారు. ఐనా కానీ ఆయన కూడా మనలాగే ఆకలి వేదన, దప్పిక భరించారు
 
సిలువలో పాదములకు మేకులు కొట్టినా మనకొరకు, మన పాపముల కొరకు ఎంత బాధనైనా భరించారు


8.ఇప్పుడు మన పాదములు ఎటుపరిగెడుచున్నవి మన పాదములు ఎటు ఉండాలి అని దేవుని వాక్యము చెప్తుంది.

మన పాదముల గూర్చి సొలొమోను మహాజ్ఞాని పలికిన మాటలు 

సామెతలు1:15నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.

మనమైతే కీడుచేయక మేలైన మార్గములో నడవాలి.

యెషయా  59:7 వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి.

యేసయ్య మనకు ఇస్తున్న హెచ్చరికను దేవుని వాక్యంలో గమనిస్తే 

సామెతలు 4:27 నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.

**యేసయ్య మనలను జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నాడు

**ఆయన పాదములవలె మనము సువార్తకొరకు సాక్షులుగా ఉండాలని తెలియజేస్తున్నాడు

**ఆయన వాక్యమును విని మనం ఎలా బాగుపడాలో ఎలా స్వస్థత పొందుకోవాలో మనకు తెలియజేస్తున్నాడు

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
************************************************************************
29th Lentday 2019 08/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
వాక్య పరిచర్యRev.M. ఆనందవరంగారు

యోహాను 19:17-22
మరియు పిలాతుయూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.

**చదవబడిన వాక్యభాగములో గమనిస్తే యేసుప్రభువారు మండుటెండలో అయనను సిలువ వేసి సిలువ మీద ఒక పలక మీద పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని వ్రాయించి సిలువ మీద పెట్టించెను.

అది లాటిన్ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో వ్రాయబడినది.
Latin inscription IESVS NAZARENVS REX IVDÆORVM (Iesus Nazarenus, Rex Iudaeorum), which in English translates to "Jesus the Nazarene, King of the Jews" (John 19:19)

ఈమాట యూదులైన వారికీ ఇష్టం లేదు, అందుకనే వారు వెళ్లి పిలాతును అడిగారు

**ఎందుకు ఇష్టం లేదు అని అంటే యేసు ప్రభువారంటే వారికీ అసూయా చేత అయన మీద దేవాలయం పడగొట్టి తిరిగి లేపుదునని యూదుల రాజునని అంటున్నావని అయన మీద నేరం మోపారు గనుక  పిలాతు ఆలా వ్రాయించడం ఇష్టం లేదు.

**యుధులైన వారు అయన తెల్లని అంగీని తీసివేసి ఊదారంగు అంగీని ఆయనకు తొడిగించారు.

**యూదులరాజుగా ఆయనకు కిరీటమునకు బదులుగా అయన తలపై ముండ్ల కిరీటమును పెట్టారు.

**అయన చేతికి రాజా దండమునకు బదులుగా రెల్లును విరిచి అయన చేతికి ఇచ్చారు.
  
**ఇవన్నీ ఎందుకు చేసారని అంటే ఆయనను అవమానించాలని సూచనగా చేసారు.


**అంతే కాకుండా వారు మోకరించి యూదుల రాజా నీకు శుభమని రీతిగా అవహేళనకు సూచనగా వారు చేసారు.

**కానీ పిలాతుగారు యేసుప్రభువారిని యూదుల రాజుగా అంగీకరించి ఆయన పైవిలాసమును వ్రాయటం జరిగింది.

**తరువాత పిలాతుతో వారు ఆలా వ్రాసినందుకు ఆయనతో గొడవ పడగా ఆయన విషయం గూర్చి నేను వ్రాసినది ఏదో వ్రాసితిననెను

యూదులరాజైన నజరేయుడగు యేసు పైవిలాసము మీద వ్రాయబడిన దానిని గూర్చి మనం తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే వివరంగా ఆలోచన చేద్దాం.


1.మొదటిగా యేసు అను నామము గూర్చి ఆలోచన చేస్తే  

**యేసుప్రభువారు పుట్టిన తరువాత జ్ఞానులైన వారు యూదుల రాజు పుట్టెనని ధర్మశాస్త్రమును బట్టి లేఖనములను బట్టి తెలుసుకొన్నారు.

**యేసు ప్రభువారు మన అందరికి రక్షకుడని మన పాపములను విమోచించడానికి పుట్టాడని తెలుసుకొన్నారు.

** నామము తప్ప మరి నామము వలన రక్షణ కలుగదని వ్రాయబడినది.

ఫిలిప్పీయులకు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.

**యోసేపుకు దేవదూత ప్రత్యక్షమై యేసుప్రభువారి పుట్టక గూర్చి అనగా కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని ఆయనకు యేసు అని పేరు పెట్టుమని చెప్పెను.

**అయన నామంలో అనేక కార్యములు చేస్తారని దేవుడు మనకు అధికారము ఇచ్చాడు

**దెయ్యముల నుండి విడుదల కలిగించే శక్తిని మనకు అయన నామంలో ఇచ్చాడు.

**కాబట్టి అయన నామంలో మనకు అద్భుతాలు చేయటానికి అయన మనకు అధికారం ఇచ్చాడు. నామమే యేసు నామం.


2.రెండవదిగా నజరేయుడు అను మాటను గూర్చి ఆలోచన చేస్తే

**యేసుప్రభువారు సంచరించిన ప్రదేశం నజరేతు అను ఒక చిన్న గ్రామం.

**నజరేతు గ్రామం అయన పెరిగిన స్థలం.

**నజరేతు గ్రామం ఇప్పటికిని ప్రత్యేకతకలిగినది.

**ఈరోజున ఇది మహా పట్టణం మరియు పవిత్ర స్థలం.

**అయన నజరేతు అను గ్రామం నుండి వచ్చినవాడు కావున అయన నజరేయుడు.


3.మూడవదిగా అయన యూదుడైన వాడు

**దేవునికి యుధులైనవారంటే ఎంతో ఇష్టం ఇశ్రాయేలీయుల పనెండ్రుగోత్రాలలో యూదాగోత్రము ప్రత్యేకమైనది.

**యాకోబుకు నాల్గవ కుమారుడు యూదా యూదా అనగా స్తుతి అని అర్ధం.

**రాజైన దావీదు యూదాగోత్రానికి చెందినవాడు.

**దేవుడు తన ప్రజలైనటువంటి వారిని తన రాజ్యానికి వారసులగుటకు యూదులను ఏర్పాటు చేసుకొన్నాడు.

**అటువంటి గోత్రం యెరూషలేములో ఉన్నది.

**యుధులైన వారికీ రక్షణ కొరకు మన అందరి రక్షణ కొరకు అయన యూదా గోత్రమునుండి వచ్చాడు.అట్టి గోత్రమునుండి వచ్చిన యేసు ప్రభువారు మన కొరకు యూదుడై  వచ్చారు.


4.నాల్గవదిగా యూదుల రాజు

**యేసుప్రభువారు యూదులరాజు అని అంటే అయన శరీరసంబంధమైన రాజ్యానికి గూర్చి చెప్పడం లేదు.

**కానీ ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యానికి అయన రాజుగా ఉన్నాడు.

**అందుకని అయన యూదులరాజైన నజరేయుడగు యేసు.

 **మనo పవిత్రులమై అయన రాజ్యము కొరకు జీవిద్దాం.


యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.