Stuthi patalu 23-44




23.కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా                             ||కన్నీరేలమ్మా||
నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)         ||కన్నీరేలమ్మా||
నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)             ||కన్నీరేలమ్మా||

24.కలములతో రాయగలమా

కవితలతో వర్ణించగలమా

కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||
  
25.కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)

క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే
కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే
విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే
వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే
అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)


26.కలువరి సిలువ సిలువలో విలువ

నాకు తెలిసెనుగా

కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2)    ||కలువరి||
కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన       ||కలువరి||
పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన       ||కలువరి||

27.కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో

ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)          ||కుతూహలం||—

పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2)                  ||కుతూహలం ||—
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే (2)               ||కుతూహలం||—
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2)                      ||కుతూహలం||

28.కృప కృప నీ కృప

కృప కృప క్రీస్తు కృప (2)

నేనైతే నీ కృపయందు
నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2)        ||కృప||
కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2)        ||కృప||
దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ (2)        ||కృప||

29.క్రైస్తవుడా సైనికుడా

బలవంతుడా పరిశుద్ధుడా

కదలిరావోయ్ నీవు కదలిరా (4)
జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి        ||క్రైస్తవుడా||
సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2)        ||క్రైస్తవుడా||
సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2)        ||క్రైస్తవుడా||
దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2)        ||క్రైస్తవుడా||
సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2)        ||క్రైస్తవుడా||
వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2)        ||క్రైస్తవుడా||

30.కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే

ఆవిరి వంటిదిరా ఈ జీవితం

లోకాన కాదేది శాశ్వతం (2)

యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)       ||కొంతసేపు||
ఎదురౌతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)
వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)
ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు         ||యేసే||
చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగును యోచించితివా         ||యేసే||
నీ శాపం తాను మోసి పాపం తీసి
రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)
విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా         ||యేసే||


31.గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని

ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||
భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||
అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను||


32.చాలునయ్యా చాలునయ్యా

నీ కృప నాకు చాలునయ్యా (2)

ప్రేమామయుడివై ప్రేమించావు
కరుణామయుడివై కరుణించావు (2)
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2)
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)          ||చాలునయ్యా||
జిగటగల ఊభిలో పడియుండగా
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా
హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా
నా జీవితమంతా అర్పింతు నీకయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)      ||చాలునయ్యా||
బంధువులు స్నేహితులు త్రోసేసినా
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనే లేదయ్యా
మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ
నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా
ప్రేమా కరుణా నీ కృప చాలు (2)        ||చాలునయ్యా||


33.చిరకాల స్నేహితుడా

నా హృదయాన సన్నిహితుడా (2)

నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
బంధువులు వెలివేసినా
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
కష్టాలలో కన్నీళ్లలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
నిజమైనది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం (2)            ||చిరకాల స్నేహం||
***************************************************************



34.జయం జయం జయం జయం
యేసులో నాకు జయం జయం (2)
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా
ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)
నీ వాక్యమే నా హృదయములో
నా నోటిలో నుండినా           ||జయం జయం||
గొప్ప కొండలు కదిలిపోవును
సరిహద్దులు తొలగిపోవును (2)
అసాధ్యమైనది సాధించెదా
విశ్వాసముతో నేను             ||జయం జయం||

35.జీవమా… యేసయ్యా…
ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3)
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)      ||జీవమా||
మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము (2)       ||స్తోత్రము||
అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము (2)       ||స్తోత్రము||

36.జుంటి తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2)          ||జుంటి తేనె||
యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)      ||జుంటి తేనె||
యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)         ||జుంటి తేనె||
యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)         ||జుంటి తేనె||

37.జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2)           ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2)           ||జ్యోతి||
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా (2)           ||జ్యోతి||
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2)           ||జ్యోతి||

38.తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
దేవుడు దేవుడు యేసే దేవుడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భూమిని పుట్టించకమునుపు
లోకము పునాది లేనపుడు    ||దేవుడు||
సృష్టికి శిల్పకారుడు
జగతికి ఆదిసంభూతుడు       ||దేవుడు||
తండ్రి కుమార ఆత్మయు
ఒకడైయున్న రూపము        ||దేవుడు||

39.తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          ||తల్లిలా||
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

40.తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2)             ||తూర్పు దిక్కు||
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2)        ||తూర్పు దిక్కు||
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా (2)             ||తూర్పు దిక్కు||
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము (2)            ||తూర్పు దిక్కు||

41.తేనెకన్న తీయనైనది
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2)     ||తేనెకన్న||
ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2)           ||తేనెకన్న||
నా వాళ్ళే నన్ను విడిచినా
నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2)           ||తేనెకన్న||

42.తొలకరి వాన దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)
అది నూతన పరచును ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||
ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి జీవింపచేయును (2)
ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||
సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును
పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)
యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)            ||అది నూతన||

43.దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా (2)
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ (2)
ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను (2)
గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా (2)
అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి (2)
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)        ||దవలవర్ణుడా||

44.దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||