డిసెంబర్ Messages2018



2DEC2018
 ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం  
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 32 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 69,104,441,386
 Topic: పాపం

మత్తయి సువార్త 1:18-21
21 తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను. 

రక్షణ అంటే ఏమిటి ?
****మరణము నుండి మనలను తప్పించుటయే రక్షణ. 

****అటువంటి రక్షణను దేవుని నుండి మనకు దూరం చేస్తుంది పాపము.

****అటువంటి రక్షణను మనకు అందించటానికి యేసు ప్రభువారు వచ్చారు.

  
పాపం అంటే ఏమిటి ?
 1.ఆజ్ఞాతిక్రమమే పాపము.
 1యోహాను 3:4
పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.

2. సకల దుర్ణీతియు పాపము
1యోహాను 5:16
సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.
యోబు గ్రంధము పరిశీలిస్తే యోబు గ్రంథము 27:5
మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతనువిడువను. 
*యోబు వలే నిత్యము మనము నీతిని విడువక యదార్థంగా జీవించాలి 

3.విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
రోమీయులకు 14:23
అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషి యని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.
*ప్రతి విషయంలో దేవుడు యెడల విశ్వాసం కలిగి ఉండాలి.

4. మేలైనది ఎరిగి చేయకుండుట పాపం 
యాకోబు 4:17
కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. 
5. మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట పాపము
1సమూయేలు 12:23 ​నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. 

యవ్వనస్తులు పాపంలోనికి పడి పోకుండా కీర్తనలు గ్రంధము పరిశీలిస్తే

కీర్తనల గ్రంథము 119:9 యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?

యవ్వనస్తులు  పాపంలోనికి పడి పోకుండా దేవుని వాక్యము కలిగి జీవించాలి.

అతిక్రమములు దాచి పెట్టు వాడు వర్ధిల్లడు దానికి విడిచి పెట్టి దేవుని వాక్యము ద్వారా పాపమును విడిచి జీవించాలని ఆశిస్తూ అట్టి కృప మన అందరికి యేసయ్య అందివ్వాలని 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*******************************************************************

3Dec2018ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరంగారు
కీర్తనలు 19 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 7,113,573,616
Topic: నక్షత్రము
మత్తయి సువార్త 2:9-11 .,9వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.
 

**యేసు ప్రభువారు పుట్టినపుడు అయన పుట్టుకకు సూచనగా ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టింది, ఈ నక్షత్రం ఒక ప్రత్యేకమైనది. అంతకు ముందు నుండి ఉన్న నక్షత్రములు ఏమిటి?
యేసయ్య పుట్టినపుడు ఏ నక్షత్రం వచ్చింది? ఇంతకూ ముందున్న నక్షత్రములు ముఖ్యముగా సూర్యుడు చంద్రుడు. అవి అన్ని దేవుడు మొదట మానవుల కోసం సృజించినవి. 
 

దావీదు కీర్తనలలో లోకమంతటిని పరిశీలించి వీటి అన్నిటి కంటే నేను ఏ పాటి వాడిని అని పలికినట్లు మనం బైబిల్లో చూస్తాం. దేవుడు ఈ నక్షత్రములను ఎందుకోసం  సృజించాడు బైబిలును పరిశీలిస్తే

1.మొదటిగా ఋతువులను తెలియజేయటానికి దేవుడు వీటిని సృజించాడు.
కీర్తనల గ్రంథము 104:19
19 ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియ మించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును.

2. వెలుగును ప్రసరింపజేయటానికి దేవుడు వీటిని సృజించాడు. 

3.సూర్యుని వెలుగులో జీవరాసులు జీవించటానికి సృజించాడు. 


యేసుప్రభు వారు పుట్టిన తరువాత పుట్టిన ఈ నక్షత్రం గురించి పరిశీలన చేస్తే యూదయ దేశంలో ఒక రాజు పుట్టెను అని తెలియజేస్తుంది.
సంఖ్యాకాండము 24:17ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును. 

నక్షత్రం గురించి పరిశీలన చేస్తే 
**ఈ నక్షత్రం అన్ని నక్షత్రంల వలె కాకుండా ఈ నక్షత్రం ముందుకు నడుస్తుంది
**యేసుప్రభువారు పుట్టిన చోటున ఆగిపోయింది
**యేసయ్య పుట్టుకకు గుర్తు ఈ నక్షత్రం యేసయ్యకు సాదృశ్యం ఈ నక్షత్రం 
 
ఆలాగుననే మనము కూడా నక్షత్రమునకు సాదృశ్యముగా ఉన్నాము.
ఆదికాండము 15:5మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను. 

ఐతే మనం నక్షత్రముగా ఎలా ఉండవలసిన వారమై ఉన్నాము?
దానియేలు12:3
3 బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. 


1.క్రీస్తు బిడ్డలుగా వెలుగు సంబంధులుగా ఉండాలి.
2. క్రీస్తు బిడ్డలుగా మనం క్రీస్తులో వెలగాలి, క్రీస్తు కోసం వెలగాలి.
3. క్రిస్తవ బిడ్డలుగా మనం ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. 
**క్రీస్తు పుట్టినపుడు సూర్యచంద్రులు ఈనక్షత్రం మూడు కలిసి గొప్ప వెలుగుగా ప్రకాశించినట్లుగా ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి, ఈ ఐక్యత వెలుగునిస్తుంది. క్రీస్తు కొరకు ప్రకాశించే వెలుగుగా మనం ఉండాలి. 

4. క్రీస్తు బిడ్డలుగా మనం మంచి బుద్దిని కలిగి ఉండాలి. 
మనం గొప్పగా ప్రకాశించాలంటే మంచి బుద్ధి కలిగి జీవించాలి.
తల్లి తండ్రి మాటలకు విధేయత కలిగి , పెద్దలకు విధేయత కలిగి, దేవుని యందు భయ భక్తులు ప్రార్ధన కలిగి జీవించాలి. మంచి బుద్ధి మనలను వెలుగిస్తుంది అప్పుడు మనం ప్రకాశించే జ్యోతుల వలె ఉంటాము.

5. క్రీస్తు బిడ్డలుగా మనం అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. 
మనం నీతి కలిగి జీవించి అనేకులను నీతి మార్గములో నడిపించాలి అప్పుడు దేవుడు మనలను దీవించి ఆశీర్వదిస్తాడు. 

దేవుడు ఈ మాటలను దీవించును గాక.. 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
***************************************************************

25Dec2018 ChristmasHAPPY CHRISTMAS.. 

ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం


మెసేజ్ By దైవసేవకులు పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 148 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 126,112,573,386
Topic: CHRITMAS సందేశం

లూకా సువార్త  2:1-7వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక


7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున 

ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.



Christos అను గ్రీక్ పదం నుండి క్రిస్మస్ అను పదం వచ్చింది

మాస్ అనగా ఆరాధన క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్.

1.ఇది ఒక వెలుగుల పండగ, 

2.ఇది ఒక స్తుతుల పండగ 

3.ఇది ఒక సంతోషకరమైన పండగ 

4.యేసు ప్రభువారు పుట్టారు ఒక గొప్ప వెలుగు కలిగి కలిగింది. 
5.ఆలాగుననే మన జీవితంలో కూడా గొప్ప వెలుగు రావాలి.

యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు ఎలా ఉంచబడ్డారు? 

అయన పశువుల పాకలో పుట్టారు. పొత్తిగుడ్డలతో చుట్టి, పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
లూకా సువార్త  2:7తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.

యేసు ప్రభువారు ఎందుకు కోసం ఈ భూలోకంలో పుట్టారు

1.పాపులమైన మనలను రక్షించుటకు పుట్టారు. 

2.మనకు వెలుగు నిచ్చుటకు పుట్టారు. 

3.నశించిన దానిని వెదకి రక్షించుటకు పుట్టారు. 

4.తండ్రి చిత్తం నెరవేర్చుటకు పుట్టారు.

1.పాపులమైన మనలను రక్షించుటకు పుట్టారు. 
1 తిమోతికి 1:15పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. 

**మనపాపముల నుండి రక్షించి నిత్యా జీవం ఇచ్చుటకు వచ్చారు.

2.మనకు వెలుగు నిచ్చుటకు పుట్టారు. 
యోహాను సువార్త 12:46నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
**చీకటి నుండి వెలుగు లోనికి మనలను తీసుకు రావటానికి క్రీస్తు ప్రభువారు పుట్టారు.

3.నశించిన దానిని వెదకి రక్షించుటకు పుట్టారు. 
లూకా సువార్త19:10నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
**యేసు ప్రభువారు మనకు సమాధానమును, స్వస్థత ను ఇచ్చుటకు వచ్చారు. 

4.తండ్రి చిత్తం నెరవేర్చుటకు పుట్టారు.
యోహాను సువార్త6:38నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.

దేవ దేవుడైన తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చారు. 

మన పాపములను విడిచి యేసయ్య ఇచ్చు వెలుగులో జీవి0చు కృప అందరికి అందించును గాక ఆమెన్.

దేవుడు ఈ మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
*****************************************************

30Dec2018 Message
ఆదివారము ఆరాధన  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ By దైవసేవకులు
పాస్టర్ Rev M.ఆనందవరం గారు
కీర్తనలు 37 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 26,367,573,610

లూకా సువార్త 2:21-25
22 మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధి చేసికొను దినములు గడచినప్పుడు
23 ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయ నను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును,

**ప్రతిష్ఠత అనే మాట పాతనిభందన నుండి వచ్చింది.
యేసు ప్రభువారిని దేవాలయము లోనికి తీసుకు వచ్చి పాతనిభంధన గ్రంధం ప్రకారం ధర్మశాస్త్రంను నెరవేర్చుటకు యేసు ప్రభువారిని పుట్టిన ఎనిమిదవ రోజున ప్రతిష్ఠత చేసి యేసు అను పేరు పెట్టారు.

**దేవుని వాక్యమును బట్టి నీతిని, నీతిమంతుడును , భక్తిపరుల గురించి చెప్పడం జరుగుతుంది.
 పాతనిబంధన గ్రంధమును పరిశీలిస్తే సుమెయోనను వ్యక్తి అనీతిపరుడు, దుర్మార్గుడు, కపటముగల చెడ్డవాడైన వ్యక్తి ఉండే వాడు.

కానీ క్రొత్త నిబంధన గ్రంధములో లూకా సువార్తలో సుమెయోనను ఒక నీతిమంతుడు మనుష్యుడు ఉండెను.
ఆ వ్యక్తి వృద్ధుడును , నీతిమంతుడును , భక్తిపరుడు పరిశుద్దాత్మ కలిగి దేవాలయంలో యేసయ్య రాకడ గురించి ఎదురు చూస్తున్న ఒక వృద్ధుడు.

1.సుమెయోనను వ్యక్తి నీతిమంతుడు.

నీతి ఎలా వస్తుంది ?
**యేసయ్య మీద విశ్వసం వలన వస్తుంది
**విశ్వాసం ఎలా వస్తుంది వినుట వలన విశ్వాసం వస్తుంది
**పరిపూర్ణంగా యేసయ్యను కలిగి ఆయనలా మారి జీవించాలి. 

అటువలె మనము కూడా మన జీవితంలలో నీతికలిగి జీవించాలి. దేవుని గొప్పదైన ఆశీర్వాదము కలిగి ఉండాలి.

అందుకనే యోబు గ్రంధము పరిశీలిస్తే యోబు గ్రంథము 27:5
మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతనువిడువను.

మలాకీ  4 :2అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును;
నీతిమంతుల గురించి దావీదు కీర్థనగ్రంధము పరిశీలిస్తే
కీర్తనల గ్రంథము 37 :16,25,29
16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధికంటె శ్రేష్టము.
25 నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
29 నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.

2.సుమెయోనను భక్తిపరుడు.అయన భక్తి ఎటువంటిది? 
 **యదార్ధమైన భక్తి కలిగిన వాడు
 **అయన ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు చూస్తున్నారు.
**ఇశ్రాయేలీయుల విమోచన కొరకు ఎదురు చూస్తున్నారు.
 ** యేసయ్య మొదటి రాకడ ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు, రెండవ రాకడ శాశ్వతమైన పరలోకం ఇవ్వడానికి సూచన.
 **ఆలాగుననే మనమైతే యేసయ్య రెండవ రాకడ కొరకు కనిపెట్టాలి, యేసయ్య రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి.

 3.ఆ సుమెయోనను ఆత్మ పూర్ణుడు పరిశుద్దాత్మతో నడిపించబడ్డాడు
 దేవుని బిడ్డలమైన మనం ఆత్మపూర్ణులమై ఉండాలి.

4.ఆయన కృతజ్ఞత భావం కలిగినవాడు.
 ఆ సుమెయోనను నుండి మనం నేర్చుకోవాలిసినవి నీతి కలిగి భక్తి విశ్వసంతో కృతజ్ఞత భావం కలిగి జీవించాలి.

క్రొత్త నిబంధన గ్రంధములో లూకా సువార్తలో భక్తి కలిగిన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను.
లూకా సువార్త 2:36-38
36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెని మిటితో సంసారముచేసి బహుకాలము గడిచినదై,
37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాల యము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను. 


1.ఆమె ఆశ్చర్యకరమైన జీవితం జీవించింది.
2.ఆమె భక్తి కలిగిన జీవితం జీవించింది.
3.ఆమె దేవాల యము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.
**ఆలాగుననే మనం కూడా దేవుని కొరకు ఉపవాస ప్రార్ధనలతో నిత్యం దేవుని స్తుతించాలి, ఇతరుల కోసం ప్రార్ధన చేయాలి, గొప్ప భక్తి కలిగి జీవించాలి.
**అట్టి కృప మన అందరికి యేసయ్య అందించును గాక ఆమెన్. 
ఈ మాటలను యేసయ్య దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.