August 2020 Messages

 

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : జ్ఞాపకముంచుకోనుడి.


 1కొరింథీయులకు 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింప బడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి 24 దానిని విరిచియిది మీకొరకైన నా శరీరమునన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.


జ్ఞాపకం అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, సాధారణంగా ఎవరికైనా మనం ఏమైనా చెప్పినపుడు జ్ఞాపకం చేసుకోనుడి అని చెప్తుంటాము,  కొన్ని వస్తువులు మనకు జ్ఞాపకం ఉంటాయి, కొంత మంది చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం ఉంటాయి. బైబిల్ గ్రంధములో చాల సందర్బాలలో జ్ఞాపకం అనే మాట వ్రాయబడియున్నది, దేవుడు తన బిడ్డలమైన మనకు అయన ఇస్తున్నటువంటి అనేకమైన మాటలు అవి మనలను జ్ఞాపకం చేసుకోమని దేవుని గ్రంధము మనకు చెప్తుంది. దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకోనుచున్నాడు, అయన మనలను జ్ఞాపకం చేసుకోనుచున్నాడు కనుకనే మన జీవితంలో అనేకమైన గొప్ప విషయాలు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. కానీ మానవులమైన మనము అనేకమైన విషయాలు దేవుని పట్ల మర్చిపోతుంటాము.

దేవుడు మనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకొంటాడు దేవుని వాక్యం చుస్తే

కీర్తనకారుడు అంటాడు కీర్తనల గ్రంథము 136:23 మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.

ఇక్కడ వాక్యములో మనం చుస్తే ఈరోజున మనుష్యులు జ్ఞాపకం చేసుకోకపోయినా మనలను దేవుడు జ్ఞాపకము చేసుకోనుచున్నాడు. మనం పతనమైపోయినపుడు క్రుంగిపోయినపుడు లేవలేని స్తితిలో ఉన్నపుడు దీనస్తితిలో మనం ఉన్నపుడు అయన మనలను జ్ఞాపకం చేసుకోనుచున్నాడు, అయన ప్రేమ మన పట్ల ఎంతో గొప్పది, మరి అలాంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలం.

పరిశుద్దగ్రందములో మనం చుస్తే దీనస్తితిలో దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోనుచున్నాడు.

ఆదికాండము 8:1 దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. 

ఏ స్తితిలో వారు ఉన్నారు, దేవుడు ఏ స్తితిలో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, వారు భయంకరమైన ప్రళయంలో, విపత్కరమైన పరిస్తితిలో ఉండగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. లోకమంతా ఆ ప్రళయంలో కొట్టుకొని పోయి చనిపోవుచున్నారు, కానీ నోవాహువారి కుటుంబం ఓడలో మాత్రం క్షేమంగా ఉన్నారు. అయన అన్ని తెలిసిన దేవుడు, అయన మనకు అన్ని ఇచ్చిన దేవుడు. నోవాహు స్తితిని బట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు దేవుని మాటకు లోబడి జీవించినవాడు. ఈరోజున లోకం ఎంతో పతన స్తితిలో ఉండగా దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోనుచున్నమా, నోవాహు దేవుని మాట ప్రకారం ఆయనను చేస్తూ అయన మాట ప్రకారం నడుచుకున్నాడు, కనుక దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు . ఈరోజున మనం అలాగున జీవిస్తున్నామా. దేవుని పోలి నడుచుకుంటున్నామా మనం ఆలోచించుకోవాలి.

అనాడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు, నూతన సృష్టిని వారికీ ఇచ్చాడు., ఈరోజున మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని విషయాలు ధ్యానించుకొందాము.


1.మొదటిగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే అయన నడిపించిన మార్గములను మనం జ్ఞాపకం చేసుకోవాలి.

ద్వితీయోపదేశకాండము 8:2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవు డైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసికొనుము.

 ఇశ్రాయేలీయుల ప్రజలైనటువంటి వారిని ఆ అరణ్యములో ఉండగా దేవుడు వారిని నలబై సంవత్సరములు వారిని కాపాడి నడిపించాడు. ఎందు నిమిత్తం కూడా దేవుడు చెప్పాడు ఎందుకు అని అంటే వారిని అణచు నిమిత్తము మాత్రమే . వారు ఆయనకు అవిదేయులుగా ఉంటే అప్పుడప్పుడు ఆ మార్గాలలో ముల్లకంచేలు, రాళ్ళను వేసాడు. 

మార్గము అని అంటే వారి జీవితంలో నడచిన విధానం, దేవుడు వారికీ ఎన్ని అడ్డంకులు వచ్చిన దేవుడు వారి మార్గామంతటిలో పగలు మేఘస్తంబంగా రాత్రి అగ్ని స్తంబంగా ఉండి వారిని కాపాడాడు. అందుకే దేవుడు అంటాడు ఆ భయంకరమైన మార్గములను జ్ఞాపకం చేసుకోనుడి. అందుకే మనం చదువుకుంటాము యెహోవా నా కాపరి అయన మనలను కాపాడుతాడు. అయనను జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలకు దైర్యం వస్తుంది. ఈరోజున ప్రభువు మనకు ప్రతి విషయంలో ఎలా ఏవిధంగా అయన మనకు తోడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవలసినవరమై ఉన్నాము.  

2.రెండవదిగా పూర్వదినములను జ్ఞాపకము చేసికొవాలి.

ద్వితీయోపదేశకాండము 32:పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుముఅతడు నీకు తెలుపునునీ పెద్దలను అడుగుమువారు నీతో చెప్పుదురు.

ఈరోజులలో చాల మంది గతమును మర్చిపోతుంటారు, కొంతమంది తమ యొక్క పూర్వదినములను మర్చిపోతుంటారు. వారి యొక్క కష్టములను పేదరికమును వారు అనుభవించిన వాటిని, మీ పితరులు పడిన బాధలను , శారీరకంగా పూర్వం ఎలా ఉన్నము., ఇప్పుడు ఎలా ఉన్నాము జ్ఞాపకం చేసుకోనుడి. అనేకమంది ఈ లోకమును బట్టి మర్చిపోతుంటారు. మనకు మంచి వాటిని ఇచ్చి నిత్యం మనలను కాపాడుతున్నది దేవుడు మాత్రమే, అటువంటి పుర్వదినములను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ రోజు శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆయనను ఆరాధించే అవకాశంను జ్ఞాపకం చేసుకోవాలి. సంఘమును జ్ఞాపకం చేసుకోవాలి, సంఘ చరిత్రను గూర్చి మనం జ్ఞాపకం చేసుకోవాలి.  

3.ముడవదిగా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికోవాలి.

కీర్తనల గ్రంథము 105:5 ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసి కొనుడి 
ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి.

తన ప్రజలను విడిపించడానికి అయన చేసిన కార్యములు ఇశ్రాయేలీయులకు బండ నుండి నీళ్ళను రప్పించిన దేవుడు., అటువంటి అయన చేసిన ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున మనం దేనికి భయపడకూడదు., అయన చేసిన ఆశ్చర్య కార్యములను అద్భుతములను జ్ఞాపకం చేసుకుంటే మనకు దైర్యము పుడుతుంది. అందుకే మనం అయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి.

4.నాల్గవదిగా అయన శరీరమునకు గుర్తుగా రొట్టెను, అయన రక్తమునకు గుర్తుగా ద్రాక్షరసమును జ్ఞాపకం చేసుకోవాలి.

1కొరింథీయులకు 11:24 దానిని విరిచియిది మీకొరకైన నా శరీరమునన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధనమీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లనన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.   

మన పాపములను., మన శరిర వ్యాధులను తొలగించుకోవడానికి, మన యేసయ్య అయన మన కొరకు చేసిన త్యాగం గుర్తు చేసుకోవడానికి ఆయన శరిరమునకు గుర్తుగా రొట్టెను, అయన చిందించిన రక్తంనకు గుర్తుగా ద్రాక్షారసమును తీసుకొనినప్పుడు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి., ఈ విషయంలో దేవుని బిడ్డలైన వారికీ నిర్లక్ష్య దోరణి ఉండరాదు.  ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి పస్క పండుగా , పులియని రొట్టెల పండుగ ఇంకా అనేకమైన పండుగలను ఆయనకు జ్ఞాపకంగా చేయమని చెప్పారు. యేసుప్రభువారు కూడా అయన ఎన్నో బాధలు, వేదనపడి మన కొరకు అయన తన రక్తమును చిందించారు. ఎందుకు అని అంటే మన మందరము ఒక శరిరములో అవయముల వలే ఆయనను జ్ఞాపకం చేసుకోని అయన యొక్క రొట్టె ద్రాక్షారసమును తీసుకోవాలి, అయన చేసిన త్యాగాములను జ్ఞాపకం చేసుకొని దైర్యముగా జీవించాలి అయన ఆలోచన.ఈరోజున మనం అయన మనకు ఇచ్చిన విలువైన జీవితాన్ని దేవునితో జీవించాలి ఆయనతో నిత్యం గడపాలి.

ముగింపు : నిస్సహాయ స్తితిలో ఉన్న నోవహును, అయన కుటుంబమును దేవుడు జ్ఞాపకం చేసికోనుచున్నాడు, ఈరోజున ఏమి జ్ఞాపకం చేసుకోవాలో మాకు గుర్తు చేసారు, దేవుడు చూపిన, అయన నడిపించిన మార్గములను, మా యొక్క పుర్వదినములను జ్ఞాపకం చేసుకోమని గుర్తు చేసారు, యేసయ్య మన జీవితంలో అయన చేసిన ఆశ్చర్యకార్యములను, ఏ స్తితిలో ఉన్నా మన కొరకు యేసుప్రభువారు., అయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి అని గుర్తు చేసారు. దేవుని బిడ్డలుగా అయన శరిరమనే రొట్టెను, అయన నిభందన రక్తమనే ద్రాక్షరసమును నిత్యమూ జ్ఞాపకం చేసుకొనే అయన బిడ్డలుగా ఉండి., యేసయ్య కృపను దేవుని ఆశీర్వాదమును అందరికి దయచేయమని దేవుని స్తుతిస్తూ ఆమెన్.     

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

**********************************************

 

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 

 

హొషేయ 14:5-7 6అతని కొమ్మలు విశాలముగా పెరుగునుఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగునులెబానోనుకున్నంత సువాసన అతనికుండును.

 

చదవబడిన వాక్యములో మనం గమనిస్తే బైబిల్ గ్రంధములో లెబానోను అను ప్రాంతం గూర్చి ఆ యొక్క చరిత్రను గూర్చి వ్రాయబడియున్నది. ఈ లెబానోనుకు చాల ప్రాముఖ్యత ఉన్నదిఎందుకు అని అంటే దేవుడు ఇశ్రాయేలియుల ప్రజలకు వాగ్దానము చేసిన వాటిలో ఇది కూడా ఒకటి. ఇది పాలస్తీనా ప్రాంతానికి ఒక సరిహద్దు ప్రాంతముగా ఉన్నది. ఇది సుమారు 10000 చదరపు కిలోమీటర్ల విస్తిర్నత కలిగి ఉన్న ప్రాంతము. ఇక్క రెండు శ్రేష్టమైన అతి ఎత్తైన పర్వతాలు హేర్మోను ఇక్కడ ఉన్నాయి, సుమారుగా సముద్రమట్టానికి పదివేల ఎత్తుగా ఉన్న కొండలు ఇక్కడ ఉన్నాయి. లెబానోను అని ఈ ప్రాంతమునకు రోమీయులు ఆ పేరును పెట్టారు. సుమారుగా అరవై లక్షల మంది జనావాసం కలిగినది.

 

దేవుడు ఈ ప్రాంతానికి కొన్ని పోలికలు ఇచ్చినట్లుగా అవి ఏమిటో మనం ఈరోజున బైబిల్ గ్రంధములో మనం చూస్తాం.

 

1.మొదటిగా లెబానోను సౌందర్యము కలిగినటువంటిది

లెబానోను అనగా తెల్లనివి అని అర్ధమును ఇస్తుందిదేవుని వాక్యంలో మనం చుస్తే ఇక్కడ సౌందర్యము కల్గిన పర్వతములతో నిండినది అని చెప్తుంది.

యెషయా గ్రంథము 35:2 అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును      

ఇక్కడ పూలతో కూడిన చెట్లుపళ్ళుతో కూడినది అందమైన మంచుతో కూడి లెబానోను సౌందర్యము కలిగినటువంటిది. ఇది చాల ముచ్చటగా కనిపిస్తుంది.

ఈరోజున మనం లెబానోను సౌందర్యము బట్టి మనం తెలుసుకోవలసినది ఏమిటి 

ఈరోజున సంఘమునకు అటువంటి సౌందర్యము కావాలి, విశ్వాసికి సౌందర్యము కావాలి.ఏ సౌందర్యము అంటే శారిరక సౌందర్యము కాదుగాని ఆధ్యాత్మిక సౌందర్యము కావాలి. ఈరోజున మనం రకరకాల వస్త్రములుఆభరణములు ధరిస్తే శారిరక సౌందర్యము రావచ్చు. కానీ మనకు ఆత్మ సౌందర్యము కావాలి. ఎలాగున శ్రేష్టమైన వృక్షాలుతో కూడి తెల్లని మంచుతో కప్పి ఉండుట వలన లెబానోనుకు సౌందర్యము వచ్చిందోఇక్కడ తెల్లని మంచు పరిశుద్దమైన జీవితానికి సూచనా. ఒక విశ్వాసి ఆత్మీయ సౌందర్యము కలగాలంటే ఒక తెల్లని మంచువంటి ఒక పరిశుద్దమైన జీవితాన్ని మనం ధరించాలి అప్పుడే మనకు ఆత్మీయ సౌందర్యము కలుగుతుంది. 

 

అందుకే కీర్తనకారుడు అంటాడు కీర్తనల గ్రంథము 110: 3 యుద్ధ సన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు.

 

విశ్వాసులు ఒక మంచి ఆత్మీయ సౌందర్యము కలిగి ఉండాలి, దేవుని దృష్టిలో అప్పుడే మనం సౌందర్యము కలిగినవారముగా కనిపిస్తాము. మనం మంచితనం అనే సుగుణంమేలు చేసే సుగుణం మనలో నింపుకోవాలిఇతరులకు సహాయం చేసే గుణం మనలో నింపుకోవాలిచెడుకు దూరంగా ఉండిమంచిని ప్రేమించి స్వీకరించే సుగుణము క్రైస్తవ విశ్వాసికి ఉండాలి జీవితం అందముగా తీర్చి దిద్దుకోవాలి. అటువంటి ఆత్మీయ సౌందర్యము మనం నిర్మించుకోవాలిఅప్పుడే దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాము. ఈరోజున మన ఆత్మీయ స్తితిని చూసి దేవుని కను దృష్టి మన మీదఉండే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. 

 

2. ఈ లెబానోను మంచి సువాసన కలిగినటువంటిది

పరమగీతము 4:11 ప్రాణేశ్వరీనీ పెదవులు తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వక్రింద మధుక్షీరములు కలవు నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనవలె నున్నది.

 

ఇక్కడ ఉన్న దేవదారు వృక్షముల వలనమంచి ఫలముల వలన లెబానోను మంచి సువాసన కలిగినటువంటిదిప్రియులారా ఈ రోజున మన జీవితం కుడా దేవుని దృష్టికి ఒక మంచి సువాసనలా ఉండాలి. ఒక విశ్వాసిగా మనలో ఉన్న దృష్టత్వాన్ని చేడుతనమును కల్మషమును తీసివేసుకొని క్రిస్తు అనే సువాసన మనలో నుండి వెదజల్లాలి. మనలో ఉన్న పాపమనే చెడును తీసివెసుకొవాలి. మంచి ప్రవర్తన అనే అటువంటి మంచి సువాసన మనకు కావాలి. అందరితో మంచిగా ఉండాలి క్రీస్తును మన జీవితంలో కలిగి మంచి సువాసన కలిగి ఉండాలి., లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు. అని దేవుని వాక్యములో వ్రాయబడినది. యేసు రక్తము మనలో ప్రవహించి మనలో మంచి సువాసన ఇస్తుంది. 

 

3. లెబానోను ప్రసిద్ది కలిగినది

1రాజులు5: 6 లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్మునా సేవకులును నీ సేవకులును కలిసి పని చేయుదురుమ్రానులను నరుకుట యందు సీదోనీయులకు సాటియైనవారు మాలో ఎవరును లేరని నీకు తెలియును.

ఎంత ప్రసిద్ది చెందింది అని అంటే దేవదారుమ్రాను ఎనబై నుండి నూటా ఇరవై అడుగుల ఎత్తు పెరుగుతుందిదాని వెడల్పు రెండు అడుగులుఇది ఎందుకు ప్రసిద్ది అంటే ఓడలను చేయడానికి ఉపయోగిస్తారు యేసుప్రభువారు గలలియ సముద్రంలో ప్రయాణించిన ఓడ కూడా ఈ లెబానోను దేవదారు మ్రానులతో చేయబడినది అని చరిత్ర చెప్తుంది. రాజ నగరు కట్టుటకు కూడా ఉపయోగించే దేవుని మందిరము కొరకు వాడబడినవిఅంతగా ప్రసిద్ది చెందినవి. 

 

పరమగీతము 5:15 అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. 

 

లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత అలంకరణకు ఉపయోగించడానికి ప్రసిద్ది చెందినవి. ఈరోజున క్రైస్తవ బిడ్డగా మనం ఆత్మీయ సౌందర్యము కలిగిమంచి సువాసన కలిగి జీవిసిస్తే దేవుడు మనకు గొప్ప ఘనతను ఇస్తాడుగొప్ప స్తితిని దేవుడు మనకు కలుగజేస్తాడు. 

 

4. లెబానోను ఎదుగుదల అభివృద్ధి కలిగినటువంటిది

హొషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందునుతామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందునులెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు.     

 

లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత వేళ్లు తన్నునట్లు బలంగాపాతుకు పోయి  దృడంగా ఉంటాయి. ప్రియులారా మనం ఈరోజున దేవునిలో మనం కుడా బలంగా పాతుకు పోయి ఉంటే వాక్యంలో బలం ఉంటె మనలో అభివృద్ధి మనకు వస్తుంది ఫలింపు మనలో వస్తుంది. మనం పై పై భక్తి కలిగి ఉండరాదు. ఈరోజున మనం ప్రభువులో మన భక్తి బలంగా ఉండాలి, అప్పుడే దేవునిలో మనకు ఫలవంతమైన జీవితం ఉంటుంది. లోకానుసారమైన జీవితం కలిగి ఉంటే మనం పడిపోతాము., అందుకే మనం దేవునిలో లోతైన జీవితం కలిగి ఉండాలి. ఈరోజున మనం ఏ స్తితిలో ఉన్నాము.మన పరిస్తితి ఏమిటి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది దేవునిలో పై పై జీవితం కాకుండా దేవునిలో బలంగా జీవించాలి. 

 

5.లెబానోను నీటిఊటలు కలిగినటువంటిది

ఈ లెబానోను నీటిఊటలు అనేకమైన వృక్షములకు ఎదుగుదలనిస్తుంది గొప్ప ఫలములను కలిగినటువంటిది. ఈరోజున క్రీస్తువాక్యమే నీటి ఊటలు మనలో కలిగి ఉండాలి అటువంటి నీటి ఊటలు మనలో నిత్యమూ ప్రవహించాలి.

 

6.లెబానోను వలే ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి

కీర్తనల గ్రంథము 92:12 నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయు దురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు

అటువంటి శ్రేష్టమైనది లెబానోనుప్రియులారా మనకు అటువంటి శ్రేష్టమైన రాజ్యము పరలోక రాజ్యము అక్కడకు చేరాలి అంటే లెబానోను వలె మంచి ఆత్మీయ సౌందర్యం, మంచి సువాసన జీవితం కలిగి అనేకులకు సువాసన పరిమలించాలి. లెబానోనులా ఆత్మీయ ప్రసిద్ది చెంది జీవించాలి., లెబానోనులా ఫలవంతమైన జీవితము కలిగిలెబానోనులా దేవుని వాక్యమనే నీటి ఊటలుతో నింపబడి దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని ఆశిస్తూ దేవుని కృప అందరికి తోడై ఉండును గాక ఆమెన్.

 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్   

 

 *************************************************-******

 

23August2020

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం: మహిమను ఘనతను అక్షయతను వెదకుడి.

రోమీయులకు 2: -7 సత్‌ క్రియను ఓపికగా చేయుచుమహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

చదవబడిన వాక్యములో మనం పరిశీలన చేస్తే అపొ స్తలుడైన పౌలు భక్తుడు రోమ సంఘమునకు వ్రాస్తూ మనము ఏమి వెదకాలో అలాగున మనం ఏమి వెదకితే ఏమి దొరుకుతుందో అయన మనకు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అవి ఏమిటి అని అంటే దేవుని మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. ఈ మూడు మన జీవితానికి నిత్య జీవము పొందడానికి చాల ప్రముఖ్యమైనవి. ఈ రోజున ఈ మూడు అంశములను గూర్చి ధ్యానించుకొందాము.


1.దేవుని మహిమ అంటే ఏమిటి., ఈ మహిమ అది ఎలా ఉంటుంది?

బైబిల్ గ్రంధములో ఎక్కువగా మనకు కనిపించే మాట మహిమ , అంతే కాకుండా చాల పాటలలో కూడా దేవుని యొక్క మహిమను గూర్చి పాడటం మనకు కనిపిస్తుంది.

తెలుగు భాషలో ఈ మహిమ అంటే గొప్పతనం అని వ్రాయబడుతుంది, బైబిల్ గ్రంధము పరంగా మనం చుస్తే ఇది దేవుని సంభందించినది ఇది ఒక ప్రకాశామానమైనటువంటిది అని అర్దమునిస్తుంది.


ఈ దేవుని మహిమ ఎలా ఉంటుందో బైబిల్ గ్రంధములో మనం చుస్తే

నిర్గమకాండము 16:10 అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరిఅప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.

నిర్గమకాండము 24:16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెనుమేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెనుఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు  

మేఘము అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది, అటువంటి మేఘములో యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను. ఇక్కడ మహిమ అంటే అయన ప్రకాశమానమైనటువంటి గొప్ప వెలుగు. ఎందుకు అంటే ఆయనను మనం చూడలేము కాబట్టి ఒక మేఘము సీనాయి కొండను కమ్ముకొన్నపుడు, ఆమేఘములో దేవుని మహిమ మోషేను పిలిచింది., అప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. దేవుని మహిమ దహించు అగ్ని వంటిది.

మనం కూడా ప్రియులారా అయన మహిమతో నింపబడాలి, అయన మహిమ ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఆ మహిమను తెలుసుకోనువారిగా మనం ఉండాలి. ఆ మహిమ ఎలా ఉంటుంది అంటే దహించు అగ్నివలె ఉంటుంది., ఇది ఒక ప్రకాశామానమైనటువంటిది.


దేవుని మహిమ ఎలా ఉన్నది

దేవాది దేవుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.

నిర్గమకాండము 40:34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.


అసలు మహిమ అంటే ఏమిటి, ఆ మహిమను ఎలా పొందుకోవాలి.

లేవీయకాండము 9:23 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.

దేవుని యొక్క ప్రకాశమే మహిమ., యాజకులైన మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములో నుండి బయటకు వచ్చినపుడు ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను, ఆ మహిమను పొందుకోవాలి అంటే మనం పరిశుద్దమైన జీవితం పొందుకోవాలి. అట్టి మహిమను మనము అందరము పొందుకొనేవారిగా ఉండాలి. ఆ మహిమ ప్రార్ధనలో ఉంది.


2.ఈరోజున మనం దేవుని., మహిమగా, గొప్పగా., మహిమ పరుస్తున్నామా?

రోమీయులకు 1:21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదుకృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. 23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయుపక్షుల యొక్కయుచతుష్పాద జంతువుల యొక్కయుపురుగుల యొక్కయుప్రతిమాస్వరూపముగా మార్చిరి.  

వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, అని దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘమునకు వ్రాస్తున్నారు. సజీవుడు మనలను విమోచకుడు ఐన మన యేసయ్యను గొప్ప ఆరాధిస్తున్నమా ఆయనను గొప్పగా మహిమ పరుస్తున్నామా మనం ఆలోచించుకోవాలి.


3.ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనం ఎలా దేవుని మహిమపరచాలి.

ప్రకటన గ్రంథము 19:7 ఆయనను స్తుతించుడిగొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నదిగనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.

మహిమ గలిగిన జీవము కల్గిన దేవుని గొప్పగా ఆరాధించాలి. దేవుని ఊపిరితో చేయబడిన ఒక మానవునిగా దేవుని మనం మహిమపరచాలి. కాని ప్రకృతి దేవుని మహిమపరుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది.

కీర్తనల గ్రంథము 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

దేవుని మహిమ ఎలాగున అంటే అయన నోటి ద్వార సృజించబడిన సూర్య చంద్రులు కాలములు అయనను మహిమ పరుస్తున్నాయి ఆయన చెప్పినట్లుగా సమయమును అనుసరిస్తున్నాయి దేవుని మహిమను కనుపరుస్తున్నాయి. యేసయ్య పుట్టుకలో కుడా నక్షత్రములు దేవుని మహిమపరచాయి. అటువంటి గొప్ప ఘనతను మానవులైనా మనకు దేవుని మహిమను నోటితో ఘనపరచే భాగ్యమును మనకు ఇచ్చాడు. నీటి బుడగ వంటి జీవితములో మన యొక్క ప్రతిఅవసరమును దేవుడు తీరుస్తూ ప్రతి క్షణం మనలను కాపాడువాడు ఆయనే. అటువంటి దేవుని మహిమ ఎరిగినవారమై ఉంది ఆయనను మహిమపరస్తున్నమా, ఈరోజున విశ్వాసులుగా దేవుని ఎరిగినవారిగా అయనను చెప్పినట్లుగా చేస్తూ అనేకులకు దేవుని మహిమను కనుపరచువారిగా ఉండాలి. ప్రజలు మనలను చుస్తే దేవుని మహిమ దేవుని మంచితనం మనలో కనిపించాలి. అయన గొప్ప వెలుగు కనిపించాలి, మన క్రియలు ఆవిధంగా ఉండాలి, ఒక విశ్వాసిగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది.


4.ఎక్కడ ఉంది దేవుని మహిమ ఎక్కడ దేవుని మహిమను వెదకాలి.  

ఎక్కడ ఉంది దేవుని మహిమ అంటే దేవుని మందిరంలో ఉంది దేవుని మహిమ, ఎక్కడ ఉంది దేవుని మహిమ అంటే దేవుని వాక్యంలో ఉంది దేవుని మహిమ. వాక్యం చదువుతుంటే మన జీవితంలోని ఆ మహిమ ప్రవేశిస్తుంది, ఆ వాక్యం మనలో ఉన్నపుడు జీవము మనలోనికి వస్తుంది. అ వాక్యము జీవజలపు ఊటలాంటిది. ప్రభు పాదాసన్నిదిలో ఉన్నది అయన మహిమ. ఆ మహిమ మన జీవితంను మారుస్తుంది నిత్య మహిమలోనికి మనలను నడిపిస్తుంది.  

బైబిల్ గ్రంధములో మనం చుస్తే నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా 22 జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి. అపొస్తలుల కార్యములు 12:23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

మనం అలాగున ఉండరాదు మనం నిత్యమూ దేవుని మహిమపరచువారిగా ఉండాలి. అయన మహిమ గొప్పది ఆయనను మహిమపరచాలి.  ఆయన బిడ్డలుగా మనం అయన సన్నిదిలో వెదకాలి అయన కార్యములలో, అయన వాక్యములో ఆయనను వెదకాలి.

రోమీయులకు 8:18 మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచు చున్నాను.`

ఈ భూమి పైన మనం ఎన్ని శ్రమలు పొందిన ఆవి అయన మన యెడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని దేవుని వాక్యం చెప్తుంది అటువంటి భాగ్యం మంకు కావాలి అంటే మనం దేవుని యొక్క శక్తితో నింపబడాలి. ఈరోజున ప్రకాశమానమైన వెలుగు వంటి దేవుని కలిగి జీవిస్తే మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట నిలువబడతాము.


5.మనం దేవుని యొక్క మహిమలోనికి ఎలా మార్చబడతాము ఆయన శక్తి ఎలా ఉంటుంది. 

కొరింథీయులకు 15:43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడునుబలహీనమైనదిగా విత్తబడిబలమైనదిగా లేపబడును;

అయన శక్తితో నింపబడిన ఈ శరీరము., మహిమ శరీరముగా నింపబడుతుంది.

ఎఫెసీయులకు 5:27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెననివాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచిపరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

అయన ప్రియ కుమారుడైన యేసుప్రభువారు అయన చిందించిన రక్తము ద్వార అయన సంఘము మహిమ గల సంఘముగా మార్చబడినది. దేవుని బిడ్డలుగా అయన మహిమ గల రాజ్యములోనికి చేర్చబడే భాగ్యము కలుగుతుంది. ఆ సంఘములో మనం ఆయనకు మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి లేకపోతె మనము చీకటిలోనికి త్రోయబడతాము. 


ఈరోజున మనం దేవుని బిడ్డలుగా ఆ మహిమ గల దేవుని నిత్యం వెదకాలి, ఆ మహిమతో నింపబడాలి, ఆ మహిమ కోసం పవిత్రమైన., పరిశుద్దమైన జీవితాన్ని జీవించాలి. యేసు రక్తములో కడగబడాలి. ఆ మహిమలో మనం చేర్చబడాలి. అయన మహిమ గల రాజ్యమును స్వతంత్రించుకోవాలి. అయన ఇచ్చు గొప్ప ఆశీర్వాదమును మనము అందరము పొందుకోవాలి ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.  

******************************************************

 30August2020

ఆదివారము ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అంశం : ఘనతను వెదకుడి

రోమీయులకు 2:7 సత్‌ క్రియను ఓపికగా చేయుచుమహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.

చదవబడిన దేవుని వాక్యములో మనం చుస్తే ఘనత అను మాట మనకు కనిపిస్తుంది. ఘనము అనగా దొరకనిది, దట్టమైనది, గొప్పది అని అర్దము. దేవుని మాటలలో చుస్తే ఘనము అనగా గొప్పది అని వ్రాయబడినది ఈలోకములో మనం చుస్తే పేరు ప్రక్యాతులు కలిగినవారు ఆటపాటలలో ప్రక్యాతి ఉన్నవారికి ఒకరకమైన గౌరవము ఘనము పొందుకోవడము మనం చూస్తాం. కానీ అపొస్తలుడైన పౌలు భక్తుడు గారు ఇక్కడ దేవుని వాక్యంలో మనకు ఏమి చెప్తున్నారు అని అంటే మనము దేవుని ఘనతను వెదకే వారిగా ఉండాలి అని అయన మనకు చెప్తున్నారు. మనము తెలుసు కోవలసినది ఏమిటి అని అంటే ఈ ఘనము ఎక్కడ దొరుకుతుంది మనము ఎలాగున దానిని వెదకాలి. ఈ లోకంలో ప్రియులారా మనం ధనవంతులమైతే ఘనముగా ఎంచబడవచ్చు లేదా మనము జ్ఞానవంతులమైతే కూడా ఘనముగా ఎంచబడవచ్చు. కానీ ఈ ఘనత అనేది మనకు ఎక్కడ కలగాలి అంటే అది దేవుని దృష్టిలో మనకు కలగాలి దేవుడు మనకు అది ఘనంగా ఇవ్వాలి.

ఎవరికీ కలుగుతుంది ఈ ఘనత? ఈ ఘనతను దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే మనం ఏమి చేయాలి? ఈరోజున మనం కొన్ని అంశములను గూర్చి ధ్యానించుకొందాము.

1.మొదటిగా ఎవరికీ కలుగుతుంది ఈ ఘనత అంటే సత్‌ క్రియ చేయు ప్రతివానికి ఘనతయు సమాధాన మునుకలుగును అని దేవుని వాక్యం చెప్తుంది.

రోమీయులకు 2:10 సత్‌ క్రియ చేయు ప్రతివానికిమొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడమహిమయు ఘనతయు సమాధాన మును కలుగును.

ఈలోకంలో మనం ఎలావుండాలి అని అంటే మంచిని ఎంచుకొని కీడును మాని మేలు చేయాలి. మనం ఇతరుల పట్ల సత్‌ క్రియ చేయువారిగా ఉండాలి. ఆనాటి కాలంలో ఇతర దేశములో ఉండి వచ్చిన బాప్టిస్ట్ మిషనరీ వారు చేసిన గొప్ప సేవ ఇదే. వారు ఎంతోమందికి పేదవారైనవారికి ఉచితంగా స్తలములను ఇచ్చేవారు., వారు అన్ని వదలుకొని ఇతరులకు మేలుచేసేవారు ఈరోజున మనం కూడా ఆవిధంగా ఇతరులకు మేలు చేయువారిగా ఉండాలి.

 

2.దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనత అని దేవుని వాక్యం చెప్తుంది.

సామెతలు 25:2తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.

దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము అనగా పొందవీలుగలిగినది, శాశ్వతమైనది అని అర్ధం అటువంటి దానిని పరిశీలన చేయుట ఘనతకు కారణము. శాశ్వతము కానిది మన శరీరము మరియు శాశ్వతమైనది మన ఆత్మ శాశ్వతమైనది. శాశ్వతమైన మన ఆత్మకు ఘనత రావాలి. మనఆత్మను నిత్యమూ కాపాడుకోనువారిగా ఉండాలి. ఏమిటి మనకు శాశ్వతమైనది అని అంటే దేవుని రాజ్యము మనకు శాశ్వతమైనది. మన ఆత్మ దేవుని రాజ్యములో చేరాలి. అటువంటి దానిని గూర్చి పరిశీలన చేయుట ఘనతకు కారణము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనకు శాశ్వతము.  శాశ్వతమైన దేవుని రాజ్యములో ఆయనతో నిత్యమూ ఉండే భాగ్యము పొందుకోవాలి. అటువంటి శాశ్వతమైన దానిని గూర్చి మనము నిత్యమూ పరిశీలన చేయువారిగా మనం ఉంటె మనకు ఘనత.

 

3. మూడవదిగా ఎవరికీ కలుగుతుంది ఈ ఘనత అని అంటే దేవునిచేత పిలువబడిన వారికీ ఘనత.

హెబ్రీయులకు 5:4 మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గానిఅహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును.

ఎలాపిలుస్తాడు దేవుడు మనలను అంటే అయన తన దర్శనము ద్వార మనలను పిలుస్తాడు, అంతే కాకుండా దేవుని వాక్యము ద్వార అయన మనలను పిలుస్తాడు, మరియు అయన తన సేవకుల ద్వార మనలను పిలుస్తాడు, దేవుని ప్రణాళిక ఒక్కొక వ్యక్తి పట్ల ఒక్క్కరితిగా ఉంటుంది మనం చేయవలసినది ఏమిటి అని అంటే అయన పిలుపుకు లోబడి ఉండాలి అలా ఎవరు ఉంటారో వారికీ కలుగుతుంది ఈ ఘనత.

 

4. ఎవరి ద్వార మనకు కలుగుతుంది ఈ ఘనత, అంటే దేవుని ద్వార మనకు కలుగుతుంది ఘనత.

థెస్సలొనీకయులకు 2:మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమైయున్నను, మీవలననే గాని యితరుల వలననే గానిమనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.

మనలను సృజించి రక్షించి పొషిస్తూ మనలను విమోచిస్తున్న మన ప్రభువైన యేసు ద్వార మనకు ఘనత రావాలి తప్ప మరి ఎవరి ద్వార మనకు ఘనత అనేది కలుగదు అని దేవుని వాక్యము మనకు చెప్తుంది.

 

5. ఎవరిని మనం ఘనపరచాలి 

దేవునిసేవ చేసే సేవకుల వారి పనిని బట్టి ఘనపరచాలి.

1థెస్సలొనీకయులకు 5:13 వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాముమరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.  

మనము ఎవరిని ఘనపరచాలి అని అంటే దేవుని సేవకులు ఎవరైతే ఆత్మల భారము కలిగి, ఆధ్యాత్మిక సంభందమైన విషయములతో దేవుని సేవను చేయచున్నవారి పనిని బట్టి మనం వారిని ఘనపరచాలి గౌరవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది.

 

6. ఈ ఘనత విషయంలో మనం ఎలా వుండాలి. 

ఎలా ఉండాలి అని అంటే ఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది.

రోమీయులకు 12:10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారైఘనత విషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

మనం ఎదుటవారిలో ఉన్న చెడును మరచి వారిలో మంచిని చూసే వారిగా ఉండాలి. వారిని ఘనముగా, గొప్పగా చూడాలి అప్పుడు మనకు దేవుని దృష్టిలో మనకు ఘనత కలుగుతుంది.

 

దేవుని ఘనపరచకుండా ఈలోకంలో ఉన్న వాటిని చూసుకొని నాశనంను తెచ్చుకోనిన వారిని గూర్చి దేవుని వాక్యంలో మనం చుస్తే.

అహష్వేరోషును గూర్చి మనం ఆలోచిస్తే  

ఎస్తేరు 1.4 హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములనుతన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములుఅనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.

ఈ లోకంలో ఉన్న వాటిని మనకు ఇచ్చినవాడు దేవుడు, కానీ మనం చుస్తే ఇవి అన్నిఇచ్చినవాడు దేవుడు అని అహష్వేరోషు రాజు తెలుసుకోలేక నాశనం తెచ్చుకున్నాడు.  మనం ఐతే ఈలోకంలో ఉన్న వాటిని కాకుండా దేవుని నిత్యం, ఆయనను ఎల్లపుడును ఘనపరచాలి.  

దేవుని ఘనపరచ కుండా నాశనం తెచ్చుకున్న కోరహు దాతాను అబీరాముల గూర్చి మనం ఆలోచిస్తే

సంఖ్యాకాండము 16:1-6 ఈలాగు చేయుడికోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.

వాక్యములో మనం చుస్తే లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహురూబేనీయులలో ఏలీ యాబు కుమారులైన దాతాను అబీరాములునుపేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని  ఇశ్రాయేలీయు లలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబది మందితో మోషేకు ఎదురుగాలేచి  మోషే అహరోనులకు విరోధముగా పోగుపడిమీతో మాకిక పనిలేదుఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యనున్నాడుయెహోవా సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగామోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చుకొనును.

అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.  క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడిసమస్త శరీరాత్మలకు దేవుడ వైన దేవాయీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువాఅని వేడు కొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను. కోరహు దాతాను అబీరాములయొక్క నివాస ముల చుట్టుపట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి. అతడు ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగి పోవుడిమీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.

ఈరోజున ప్రియులారా మనము దేవుని ఘనముగా చూడవలసిన వారమైఉన్నాము.

దేవుని ఘనపరచక నాశనమును తెచ్చుకోనిన రాజగు నెబుకద్నెజరును గూర్చి మనం ఆలోచిస్తే

దానియేలు 4:30 రాజుబబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను.

రాజగు నెబుకద్నెజరును తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరునీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవుసర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారియైయుండితానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. ఈలాగు నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములునుఆయన మార్గములు న్యాయములునై యున్న వనియుగర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియుఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను. 

మనం ఎప్పుడు గర్వముతో ఉండరాదు, నీ బలమును బలగమును చూసుకొని గర్వించరాదు, అంతేకాకుండా ప్రతి విషయంలో దేవుని గొప్ప చూడాలి. 

 

ఈరోజున మనం తెలుసుకోవలసినది ఏమిటి ?

ఈ లోకము శాశ్వతము కాదు అని తెలుసుకొని ఇతరుల పట్ల సత్‌ క్రియలు చేయుచు, దుర్లభమైన వాటిని గూర్చి పరిశీలన చేయుచు, శాశ్వతమైనది పరలోకం అని తెలుసుకొని నిత్యమూ దేవుని ఘనపరుస్తూ., మన సాటైన వారిని గొప్ప ఎంచుకొని దేవుని పిలుపుకు లోబడి, దేవుని దగ్గర వినయము, తగ్గింపును నేర్చుకొని అన్ని విషయములలో దేవుని నిత్యమూ ఘనపరచువారిగా ఉండాలి. ఈ వాక్యము మా అందరి హృదయములో ఫలింపు కలిగినవారముగా ఉండాలని దేవుని కృప అయన కాపుదల దేవుని ఆశీర్వాదము మన అందరము పొందుకోవాలని యేసయ్య నామమున మన అందరికి కలుగును గాక ఆమెన్. 

 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

 

 

 

  

 

 

 

  

  

 

 

 

  

 

 


No comments: