ఫిబ్రవరి Messages2019



03FEB2019 Message

ఆదివారం ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యఉపదేశకులు పాస్టర్ M.ఆనంద వరం గారు
కీర్తనలు 69 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 69,657,441,386.
Topic: దేవుని సంతోష పెట్టుట

కొలొస్సయులకు  1:9-12
10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,

**ఈ లోకంలో మనం అనేక విదాలుగు ఇతరులను సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తాం.

**ఆలాగుననే ఇతరుల బట్టి అనేక సందర్భాలలో సంతోషిస్తాం.  

**తల్లి తండ్రులు వారి పిల్లలను బట్టి సంతోషిస్తారు.

** ఆలాగుననే దేవుడు ఎవరిని చుస్తే సంతోషిస్తాడు. 

***దేవుని బిడ్డలుగా మనం దేవుని సంతోషపెట్టు వారీగా ఉండాలి. 

**దేవుడు మనలను బట్టి ఏ విషయంలో మనం ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడు.


బైబిల్ గ్రంధములో నుండి దేవుని వాక్యము పరిశీలిస్తే

1.మొదటిగా దేవుడు ఆయనను పోలి నడుచుకుంటే వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు.

కొలొస్సయులకు  1:10,11ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,11 ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు,
 
2.దేవుని సేవకు ఇచ్చువారిని, సహాయపడువారిని చూచి దేవుడు సంతోషపడతాడు.

ఫిలిప్పీయులకు  4:18నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.

3.దేవుని మందిరము విషయంలో సహాయం చేయు వారిని బట్టి దేవుడు సంతోషపడుతాడు.

హగ్గయి అధ్యాయం 1:8పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4.దేవుని వలన మన ప్రవర్తన స్థిరపడుటను బట్టి దేవుడు సంతోషపడతాడు. 

కీర్తనల గ్రంథము 37:23ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును.

5.దుష్టుడు తన ప్రవర్తన సరిచేసుకొని బ్రతికితే వారిని బట్టి దేవుడు సంతోషపడతాడు. 

యెహెజ్కేలు 18:23దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

6.దేవుని యెడల భయ భక్తులు కలిగి దేవుని కృప కొరకు వెదికే వారిని బట్టి దేవుడు సంతోషపడుతాడు. 

కీర్తనల గ్రంథము 147:11తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.


7.కీర్తనలతో కృతజ్ఞత స్తుతులతో దేవుని ఘనపరచు వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. 

కీర్తనల గ్రంథము 69:30-31
30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను.
31 ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. 

మనలను సరిచేసుకొని దేవునికి మొదటి స్థానం ఇచ్చి, దేవుడు మనలను బట్టి సంతోషపడే వారిగా ఉండీ దేవుని యొక్క గొప్పదైన అయన కృప మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ..
దేవుడు ఈ కొద్దీ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి  మహిమ కలుగును గాక ఆమెన్.
*****************************************************

10FEB2019 Message

ఆదివారం ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Message By
పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు 147 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 33,140,441,614.
Topic: దేవునికి ఇష్టం కలిగించే అంశాలు

యెషయా గ్రంథము  43:1-4
4
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను.

**దేవుని బిడ్డలుగా మనం విధంగా ఉండాలి.
** విధంగా ఉంటె దేవుడు మనలను ఇష్టపడుతారు.
బైబిల్ పరిశీలిస్తే దేవునికి మన పట్ల ఇష్టం కలిగించే అనేక అంశాలు బైబిల్ గ్రంధములో ఉన్నాయి.

1. మొదటిగా ఉపకార ధర్మం చేయుట దేవునికి ఇష్టం
 
హెబ్రీయులకు  13:16
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి

2.అదేవిధంగా వినయ భయభక్తులతో సేవ చేయుట దేవునికి (యేసయ్యకు) ఇష్టం.
హెబ్రీయులకు  12:28
అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుదము

3. అంతే కాకుండా ఉపవాసం దేవునికి ఇష్టం.
యెషయా గ్రంథము  58:6-7
6
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?
7
నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

ఇక్కడ ఉపవాసం అనగా
**ఆకలిగొనిన వారికీ ఆహారం పెట్టుట దేవునికి ఇష్టమైన ఉపవాసం.
**దిక్కుమాలిన బీదలను చేర్చుకొనుట దేవునికి ఇష్టమైన ఉపవాసం.
**వస్త్ర హీనునికి వస్త్రం ఇచ్చుట  దేవునికి ఇష్టమైన ఉపవాసం
**ఉపవాస ప్రార్ధన దేవునికి ఇష్టమైన ఉపవాసం.

4.మరియు నాల్గవదిగా దేవునికి దాసుడైన వారంటే దేవునికి ఇష్టం.
రోమీయులకు 14 :18
విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు

***దాసుడు యజమానికి చేయవలసిన మొదటి పని  క్రమశిక్షణ.
 ***అదే రీతిగా దేవుని బిడ్డలుగా మనం దేవునికి దాసులుగా ఉండాలి.
***అనగా దేవుని ఇవ్వవలసిన సమయంలో క్రమశిక్షణ పాటించవలసిన వారమై ఉన్నాము.

5.అఖరిగా యేసయ్య యందు విశ్వాసము కలిగి ఉండుట దేవునికి ఇష్టం.
హెబ్రీయులకు 11:6
విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

బైబిల్లో అనేక మంది దేవుని యందు విశ్వాసం గురించి వ్రాయబడింది ముఖ్యంగా
**విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను.
**విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను;  
**అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను;
**దేవుని బిడ్డలుగా మన విశ్వాసం మీద మన జీవితం ఆధారపడి ఉంది.
***దేవునికి ఇష్టులుగా ఉండుట వలన మనకు కలిగేవి
 
యెషయా గ్రంథము  58:8
**ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును.
**ఆలాగున నీవు చేసినయెడల స్వస్థత నీకు శీఘ్రముగా లభించును.
** నీ నీతి నీ ముందర నడచును.
**యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

**మనం యేసయ్యకు ఇష్టునిగా ఉండిన యెడల అయన మనకు కావలసినవి అడిగినవి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

1 యోహాను 3:21మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.

మనం దేవునికి ఇష్టులుగా జీవించి అయన ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని యొక్క గొప్పదైన అయన కృప మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ.

దేవుడు ఈమాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి  మహిమ కలుగును గాక ఆమెన్
**********************************************************************
17FEB2019 Feba-Sunday

ఆదివారం ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యసందేశకులు దేవ ప్రసాద్ గారు FEBA INDIA
కీర్తనలు 34 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 356,154,445,616.

యెషయాగ్రంథము 6:1-109 ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. 

చదవబడిన వాక్యమును బట్టి యెషయాకు కలిగిన దర్శనంలో నుండి మనకు
ఆరు విషయములు తెలియజేయబడినవి. 

1.మొదటిగా యెషయా ఒక దర్శనం పొందాడు.
యెషయాగ్రంథము 6:1రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. 

2.రెండవదిగా యెషయా తన పాపమును ఒప్పుకున్నాడు.
యెషయాగ్రంథము 6:5 నేను అయ్యో, నేను అపవిత్రమైన పెద వులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని. 

3.మూడవదిగా యెషయా తన పాపమునుండి క్షమింపబడ్డాడు.
యెషయాగ్రంథము 6:6-7
6 అప్పుడు ఆ సెరాపులలో నొకడు తాను బలిపీఠముమీదనుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి
7 ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాప మునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగి పోయెను అనెను. 

4.నాల్గవదిగా యెషయా దేవుని పిలుపును అందుకొన్నాడు.
యెషయాగ్రంథము 6:8
8 అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా 

5.ఐదవదిగా యెషయా దేవుని ఆజ్ఞను పొందాడు.
యెషయాగ్రంథము 6:9
9 ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు. 

6.అరవదిగా యెషయా దేవుని సేవను చేసాడు.
యెషయాగ్రంథము 6:10
10 వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వచేసి వారి చెవులు మంద పరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. 

**మనం కూడా దేవుని యెడల దర్శనం కలిగి ఉండాలి.
**మన పాపములను ఒప్పు కోవాలి.
**మన పాపములను బట్టి క్షమింపబడాలి.
**దేవుని పిలుపును పొందుకోవాలి.
**దేవుని సువార్త సేవ చేయాలి.

మరి మనం ఏ విధంగా ఉన్నాము దేవుని పిలుపును పొందుకున్నామా
దేవుని వాక్యం పరిశీలిస్తే
సామెతలు అధ్యాయం 24:11-12
11 చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా?
12 ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహిం చును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా. 

దేవుని పిలుపును పొందుకోని మనం ఏమి చేయాలి?
యూదా 1:23-24
23 అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.
24 తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,
 

***వాక్యమును బట్టి మనం మారాలి మనకుటుంబం మారాలి. 
***దేవుని ప్రతి పనిలో స్తుతించాలి.
***దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకోవాలి.
***సువార్తను చేయాలి సువార్త చేయువారికి సహకరించాలి. 

దేవుని వాక్యం పరిశీలిస్తే సువార్తకు సహకరించేవారికి కలిగేవి. 

1. సువార్తపనిలో సహకారులు బుద్ధిమంతులై జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు.
దానియేలు 12:3
3 బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు. 

2.సువార్తపనిలో సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడతాయి.
ఫిలిప్పీయులకు 4 :3
3అవును, నిజమైన సహకారీ ఆ స్ర్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి.

3. సువార్తపనిలో సహకారుల కొరకు నీతికిరీట ముంచబడియున్నది.
2తిమోతికి 4:7-8
7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8 ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.
అట్టి దేవుని యొక్క గొప్పదైన అయన కృప మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ.. 
దేవునికి  మహిమ కలుగును గాక ఆమెన్. 
దేవుడు ఈ కొద్దీ మాటలను దీవించును గాక ఆమెన్..
దేవుడు అందరిని దీవించును గాక ఆమెన్..

************************************************************
24FEB2019 SUNDAYఆదివారం ఆరాధన  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యఉపదేశకులు పాస్టర్ M.ఆనంద వరం గారు
కీర్తనలు 51, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 16,236,440,610.
Topic: దేవునికి అసహ్యమైనవి.

సామెతలు 6:16-19
16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు
 
దేవునికి అసహ్యమైనవి ఏమిటి?
సామెతలు 6:16-19., 16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు

**అసహ్యమైన అను మాటకు ఓర్వలేనితనం అని అర్ధం.

**హేయము అను మాటకు విడువదగినది అని అర్ధం.

1.మొదటిగా అహంకారదృష్టి కలిగిఉండుట దేవునికి అసహ్యమైనది.

**అహంకారదృష్టి దేవునికి అసహ్యమైనది, దేవునికి ఇష్టములేని వాటిని వదిలి పెట్టువారిగా ఉండాలి.

అటువంటి వారికోసం దేవుని మాటలను పరిశీలిస్తే యెషయా గ్రంథము 66:2
 ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.

**ఆహంకారానికి బదులుగా మనం వినయము విధేయత కలిగి ఉండాలి.

2.రెండవది కల్లలాడు నాలుక కలిగిఉండుట దేవునికి అసహ్యమైనది .

కల్లలాడుట అను మాటకు బొంకుట, రకరకములుగామాట్లాడుట, ఇష్టము వచ్చినట్లు మాట్లాడుట అని అర్ధం.

బైబిల్ పరిశీలిస్తే - ప్రసంగి 5:6
నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు?

బైబిల్ పరిశీలిస్తే - యాకోబు 1:26
ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. 

**కల్లలాడు నాలుక దేవునికి అసహ్యమైనది, మనం కల్లలాడుట విడిచి పెట్టువారిగా ఉండాలి.

3.మూడవది నిరపరాధులను చంపు చేతులు కలిగిఉండుట దేవునికి అసహ్యమైనది.

మత్తయి సువార్త 5:21-22
21 నరహత్య చేయవద్దు; నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
22 నేను మీతో చెప్పునదేమనగాతన సహో దరునిమీద1 కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

బైబిల్ పరిశీలిస్తే  
**సహోదరునిమీద కోపపడు ప్రతివాడు నరహత్య చేయువాడుతో సమానము.
**తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పు వాడు నరహత్య చేయువాడుతో సమానము.
**మనం దేవునికి అసహ్యమైన వాటిని విడిచి పెట్టువారిగా ఉండాలి.

4.నాల్గవది దుర్యోచనలు యోచించు హృదయము కలిగిఉండుట దేవునికి అసహ్యమైనది.

**దుర్యాలోచనలు చేయుట అనగా చెడ్డ ఆలోచనలు కలిగి ఉండుట అని అర్ధం. 
**మనం అటువంటి చెడ్డ ఆలోచనలను విడిచిపెట్టువారిగా ఉండాలి.
**మన మనసులో క్రీస్తును కలిగి ఉండుట ద్వారా చెడు ఆలోచనల నుండి దూరంగా ఉండాలి.

5.ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు దేవునికి అసహ్యమైనవి.

**మనం కీడు చేయుట కొరకు పరుగులెత్తకుండా ఉండాలి. 
**క్రీస్తును కలిగి మంచి వాటి కొరకు పాటుపడు వారీగా ఉండాలి.

6.ఆరవది లేనివాటిని పలుకు అబద్ధసాక్షి దేవునికి అసహ్యమైనవాడు.

**యేసయ్య ఏ విధంగా మనం  ఉండాలి అని కోరుకుంటున్నారు?
**మనం అబద్ధ సాక్షిగా ఉండకూడదు, లేనివాటిని కల్పించువారిగా ఉండరాదు.
**మన మనసులో క్రీస్తును కలిగి ఉండాలి.

అబద్ధ సాక్షి దేవునికి అసహ్యమైనవారు, మనం సత్యమైన సాక్షి కలిగి ఉండాలి.


7.ఏడవది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు దేవునికి అసహ్యమైనవారు.
బైబిల్ పరిశీలిస్తే సామెతలు 26:20
కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. 
**జగడములు పుట్టించువారు దేవునికి అసహ్యమైనవారు.
 **మనము జగడములు కలిగించే వారీగా ఉండరాదు.
 **దేవుని యందు భక్తి కలిగి అందరిని ఐక్యపరిచేవారిగా ఉండాలని దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వాటిని చేయువారిగా ఉండాలని ఆశిస్తూ.

దేవునికి  మహిమ కలుగును గాక ఆమెన్.
దేవుడు ఈ మాటలను దీవించును గాక ఆమెన్.