అక్టోబర్ Messages2018


 07OCT2018 ఆదివారము ఆరాధన 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ పాస్టర్ Rev.M.ఆనందవరం గారు
కీర్తనలు 135, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 19,521,455,614
మార్కు సువార్త  4:35-41
35 ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
36 వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.
37 అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.

**దోనె  మానవ జీవితానికి సూచనగా ఉన్నది 
**మానవుని జీవితంలో ప్రతి కుటుంబంలో యేసయ్య అనే దోనె కలిగి ఉండాలి 
యేసయ్యను కలిగి ఉంటె ఏమీ జరుగుతుంది 
**మన జీవితంలో తుఫాను సముద్రము శోధనలకు సూచన
**శోధన మన పాపపు జీవితానికి సూచనగా ఉంది
యేసు ఉన్న చోట తుఫాను ఎందుకు వచ్చింది ఇది దేనికి సూచన

యేసు ప్రభువారు దోనెలో ప్రయాణిస్తుండగా  అనుకోని రీతిగా పెద్ద అలలతోకుడి యేసు ఉన్న  దోనెలో తుఫాను రేగింది. అప్పుడు అయన శిష్యులు అయ్యా మేము నశించు పోవుచున్నాము నీకు చింత లేదా అని యేసయ్యకు మొరపెట్టుచున్నారు. అప్పుడు యేసయ్య వారితో మీరు ఎందుకు భయపడుచున్నారు. మీరు ఇంకను నమ్మలేక పోచున్నారా అని యేసయ్య వారితో చెప్పారు. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
**యేసయ్యను మనం నమ్ముకున్న మన జీవితంలో ఆర్ధిక శోధనలు, అలజడులు వస్తాయి. ఇవి మన పాపపు జీవితానికి సూచన.
**యేసు ఉన్నారు అయన గొప్పవాడు అయన అనేక మనుష్యులకు స్వస్థత ఇవ్వగల సమర్థుడు. 
**ఆయనను కలిగి అయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి 
**దావీదు నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను అని మాట పలికాడు. మనము కూడా అట్టి గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి.
**అయన సృష్టికర్త , యేసయ్య గద్దిస్తే సృష్టి లోబడింది. సముద్రము, గాలి యేసయ్యకు లోబడింది. ఆలాగుననే యేసయ్య మాటకు మనము కూడా లోబడవలసిన వారమైయున్నాము.

గాలి అతి భయంకరమైన శక్తీవంతమైనది.,గాలి మూడు రకాలుగా ఉన్నది
1. మానవులకు అవసరమైన గాలి ఇది ఆరోగ్యమైన గాలి యేసయ్యకు సూచన
2. పెనుగాలి సాతునునికి సూచనగా ఉంది
3. విషపుగాలి ఇది ప్రమాదకరమైన గాలి

నిర్గమకాండము  14:21మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.  
అటువంటి గొప్ప ప్రభువును మన జీవితాలలో కలిగి అయన యందు విశ్వాసము కలిగి శోధనలను జయించువారిగా ఉండాలని అట్టి కృప మన అందరికి యేసయ్య అందివ్వాలని ఆశిస్తూ.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
******************************************************

21OCT2018ఆదివారము ఆరాధన
శాంతి పరిశోధన పాఠశాల 
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
మెసేజ్ రెవ సూర్యరావు గారు
కీర్తనలు 96, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 33,470,455,610
సమూయేలు రెండవ గ్రంథము  7:17-29
17 తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను.

క్రైస్తవకుటుంబం 
** క్రైస్తవకుటుంబంగా ప్రత్యేకత కలిగి ఉంటున్నామా అని గమనించుకోవాలి
**దేవుని మందిరంలో కుటుంబం గురించి ప్రార్ధించాలి.

దేవుని మందిరంలో మనకు ఆశీర్వాదం దీవెనలు ఉన్నాయ్.
1.దేవుని మందిరంలో మొదటిగా మనకు సంతోషం ఉంటుంది
2.దేవుని మందిరంలో శాసనములు ఉన్నాయ్
3.దేవుని మందిరంలో నెమ్మది ఉన్నది 
4.దేవుని మందిరంలో క్షేమం ఉన్నది
1.దేవుని మందిరంలో మొదటిగా మనకు సంతోషం ఉంటుంది 
2సమూయేలు 7:18దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెనునా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?

**హన్నా దేవుని మందిరంలో ప్రార్ధించి అనేక మేలులు పొందుకుంది.

2.దేవుని మందిరంలో శాసనములు ఉన్నాయ్
అపొస్తలుల కార్యములు గమనిస్తే శాస్త్రములు చదివిన ఐతియొపీయుడైన నపుంసకుడు
అపొస్తలుల కార్యములు  8:26,27,31,36
26 ప్రభువు దూతనీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.
27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూష లేమునకు వచ్చియుండెను. 30 ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా వినినీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా
31 అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడు కొనెను. 36 వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.

**మనం ప్రతిదినం దేవుని శాసనములు చదవాలి  
**మరియు దేవుని రక్షణ సువార్తను అనేకమందికి అందించాలి.
3.దేవుని మందిరంలో నెమ్మది ఉన్నది 
**దేవుని వాక్యం నందు ఆశక్తి గల సంఘముగా  ఉండాలి. 
ద్వితీయోపదేశకాండమ 32:7పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము తరతరముల సంవత్సరములను తలంచుకొనుము నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును; నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
దేవుని వాక్యము బట్టి బహుగా అభివ్రుది చెంది అనుసరించాలి నడుచుకోవాలి.
ద్వితీయోపదేశకాండమ 6:3,7-9
3 కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను.
7 నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
8 అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
9 నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.

ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి
ఎఫెసీయులకు 6:1-3
1 పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే.
2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
3 అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 

యేసు ప్రభు వారు కూడా తలిదండ్రులకు లోబడి యుండెను
లూకా సువార్త 2:49-51అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృద యములో భద్రము చేసికొనెను.

మన ప్రభువు ఇచ్చిన సహవాసము కలిగిన సంఘముగా ఉండాలి.
అపొస్తలుల కార్యములు 2:42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

4.దేవుని మందిరంలో క్షేమం ఉన్నది 
కీర్తనల గ్రంథము 34:4,7,19,22
4 నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. 6 ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
7 యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును 19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును. 22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు.

అట్టి కృప మన అందరికి యేసయ్య అందివ్వాలని ఆశిస్తూ.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.