November Messages2019


03Nov2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

లూకా 13:34-35
34 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.


చదవబడిన వాక్యభాగములో నరుని పట్ల అపారమైన దేవుని ప్రేమ ఎంతగానో కనిపిస్తుంది.

దేవునికి మానవులమైన మన పట్ల ఉన్న అపారమైన ప్రేమను గూర్చి వాక్యభాగము మనకు చెప్తుంది.


**దేవాది దేవుడు మొదటి నరునిగా ఆదామును, అవ్వను సృష్టించుకున్నాడు. 
ఎందుకు అని అంటే నరుని దేవుని కోసం., దేవుని బిడ్డగా మరియు దేవుని జనాంగంగా ఉంటo కోసం, కానీ ఆదాము వారు దేవుని మాటను ధిక్కరించి ఎప్పుడైతే పాపము చేసి బయటకు త్రోయబడిన తరువాత, పాపo విస్తరించి ప్రళయము ద్వారా ఒకసారి నశింపజేసాడు.

మరల నోవహు కుటుంబం ద్వారా నూతన జనాంగమును అయన తయారు చేసాడు, రక్షించు కున్నాడు. తరువాత దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు అబ్రాహామును పిలిచాడు, దేవుని జనాంగమునుఅబ్రాహామునకు వాగ్దానము చేసి నేను చూపించిన దేశమునకు నేను నీ సంతనమును విస్తరింప జేస్తాను అని చెప్పాడు.

**తరువాత అబ్రాహాము మనుమడైన యాకోబు ద్వారా ఇశ్రాయేలుగా చేసి, పనెండ్రు గోత్రములుగా చేసి, పనెండ్రు గోత్రములును దేవుని ప్రజలుగా గుర్తింపబడునట్లుగా చేసాడు, వారికీ ఒక ప్రత్యేకమైన పాలు, తేనెలు కురియు కనాను దేశమును ఇచ్చాడు, అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు వారిపట్ల చేసాడు.

యేసుప్రభువారు రాకమునుపు దేవుని బిడ్డలుగా చెప్పుకొని ఎన్నో పాపపు కార్యములు చేస్తూ, అబ్రాహాము సంతానము అని చెప్పుకొంటు వారు జీవిస్తున్నారు, వారిని మార్చుటకు దేవుడు ప్రవక్తలను పంపించాడు, ఇంకను వారిలో మార్పు కనపడకపొతే తన ప్రియకుమారుడైన యేసుప్రభువారిని ఈ లోకానికి పంపించాడు.

చదవబడిన వాక్యభాగములో మనలను అయన బిడ్డలుగా ఉండుటకు పిలిచాడు ఐనను మీరు రావటంలేదు, అని ఒక చిన్న జీవిని గూర్చి పోల్చుతూ వాక్యంలో మనకు వివరిస్తున్నాడు, ఈ వాక్యంలో ఒక చిన్న జీవిని గూర్చి పోల్చుతూ మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాడు

ఈ రోజున ఈ చిన్న అల్పమైన జీవి కోడి యొక్క లక్షణములను ఆ జీవి నుండి మనం జీవితంలో నేర్చుకోవలసిన అంశములను గూర్చి మనం ధ్యానం చేద్దాం, అంతే కాకుండా దేవుని వాక్యము ద్వారా యేసయ్య మనకు ఏమి చెప్తున్నారో మనం ఆలోచిద్దాం.

1.ఈ కోడి మొదటిగా వేకువనే లేచు స్వభావం కలిగినది.

ఈ కోడి తల్లి యొక్క మొదటి లక్షణం అది వేకువనే లేస్తుంది భాహుస అది వేకువనే దేవుని పొరపెట్టుతోoదేమో, మనం కూడా అటువంటి గొప్ప స్వభావం కలిగి ఉండాలి, మన ప్రభువారైన యేసు ప్రభువారు కూడా వేకువనే లేచి గెత్సమనే తోటలో మన కొరకు ప్రార్ధన చేసేవారు , అటువంటి తండ్రి ప్రేమ మనకు ఉంటె మనం వేకువనే లేచి దేవునికి మొరపెట్టువారిగా ఉండాలి.

దేవుని వాక్యము ఏమిచెప్తుంది అని అంటే, మన పిల్లలు లోకాశలకు బానిసలై పోకూడదు మన పిల్లలు చెడిపోకూడదు, మన పిల్లలు గూర్చిన ప్రతి తండ్రి తల్లిలా మీద ఉంది, ఈ కోడి తల్లి యొక్క మొదటి లక్షణం అది వేకువనే లేస్తుంది, అది కేకలతో దేవుని స్తుతిస్తుందేమో, అట్టి వారీగా మనం ఉండాలి.

అందుకనే దేవుని వాక్యం చెప్తుంది.
కీర్తనల గ్రంథము 63:1:దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును.

మన వేకువగనే లేవగలుగుతున్నామా, లేచి మన పిల్లల కొరకు దేవుని మొరపెట్టు వారీగా ఉంటున్నామా?

మనం పాపములో, శోధనలో పడిపోకుండా ఉండాలి అని ప్రార్ధన చేయగలుగుతున్నామా, దేవునికి మొదటి స్తానం ఇవ్వాగలుగుతున్నామా

మనం పాపములో, శోధనలో పడిపోకుండా ప్రార్ధన చేయగలగాలి, దేవునికి మొదటి స్తానం ఇవ్వాగలగాలి.


2.రెండవదిగ ఈ కోడిలో ఉన్న రెండవ లక్షణం తన పిల్లలకు ఆహారాన్ని సిద్దపరుస్తుంది.  

ఈ రెండవ లక్షణం తల్లి కోడి యొక్క అపారమైన ప్రేమను, గొప్ప ప్రేమను తెలియజేస్తుంది.

మన యేసుప్రభువారు కూడా ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో అదే విధంగా యేసుప్రభువారు మనలను చేర్చుకొని ఆదరిస్తున్నారు, మన దేవుడు యేసయ్య అయన దేవదూతలతో ఉండే విడిపెట్టే భాగ్యమును ఎంచుకొనక సుఖ సంతోషములతో ఉండవలసిన దేవాది దేవుడు ఎన్నో కష్టములను మన కొరకు భరించి తన రక్తమును మన కొరకు చిందించారు అటువంటి త్యాగ పూరితమైన ప్రేమ అయన మన పట్ల కలిగి ఉన్నారు.

కోడి తన పిల్లలకు ఆహారమును సిద్ధపరచిన రీతిగా మనకు ఆహారమును అందించువాడు ఆయనే, మన పట్ల అపారమైన ప్రేమ కలిగి నటువంటి వాడు ఆయనే, అందుకే మన తండ్రి ఐన దేవుడు మనకు దేనిని గూర్చి చింతించవద్దు మొదటిగా నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అడుగుడి నేను మీకు దయ చేస్తాను అని చెప్తున్నాడు, అయన ఆకలి చంపుకొని మన ఆకలి తీర్చే తల్లి ప్రేమ కలిగిన దేవుడు.


3.మూడవ దిగా ఈ కోడి తన పిల్లలను వెంటతీసుకొనే గుణం కలిగినటువంటిది.

ఈ కోడికి తన పిల్లపైన ఉన్న ప్రేమను బట్టి తన బిడ్డలు తన వెంటరావాలి, తనతోనే ఉండాలి అని కోరుకుంటుంది.

యేసయ్య ప్రేమ కూడా అటువంటిదే, తన శిష్యులైన వారికీ కూడా అదే చెప్తున్నాడు, నేను అనాధలుగా విడిచిపెట్టాను నా తండ్రి దగ్గర అనేక నివాసములు ఉన్నవి, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున స్థలమును సిద్దపరుస్తాను అని న్నారు.

మీరు నాతో నిత్యం ఉండాలి అని అయన కోరుతున్నారు, మనం నిత్యం ఆయనలో జీవించాలి, నిత్యం ఆయనను వెంబడించాలి .,యేసును వెంబడిస్తే శాశ్వతమైన నిత్యా జీవం ఇస్తాడు.

4.నాల్గవదిగా ఈ కోడి తన శత్రువుతో నిత్యం పోరాడుతుంది.

మన రక్షకుడైన యేసయ్య కూడా మన కొరకు మన పిల్లల కొరకు సాతాను అనే  శత్రువుతో నిత్యం పోరాడుతున్నారు.

మనం కూడా సాతానుడైన శత్రువుతో నిత్యమూ పోరాడాలి, అని అంటే నిత్యము ప్రార్ధన అనే శక్తి కలిగివుండాలిదేవుని  వాక్యం అనే శక్తిని కలిగి ఉండాలి - అప్పుడే మనం శత్రువును ఎదిరించగలం.


5.ఆఖరిగా కోడి తన రెక్కలలో తన పిల్లలను భద్రపరుస్తుంది.

అటువంటి గొప్ప ప్రేమ తన బిడ్డల పట్ల మన యేసయ్య కూడా తన వాక్యంతో పిలుస్తూ అయన తన రెక్కలలో మనలను నిత్యం భద్రపరుస్తున్నారు

కీర్తనల గ్రంథము 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.

దేవుని మనం ఆశ్రయిస్తే మనకు క్షేమం ఉన్నది, ఆయనను ఆశ్రయిస్తే ఎన్ని కష్టములు, శోధనలు వచ్చిన అయన హస్తములో మనకు రక్షణ ఉన్నది, అటువంటి దేవుని ఆశ్రయములో మనం ఉండాలి.


సామెతలు 1:24-25
24 నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
25 నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి.

మనం యందు విశ్వాసం కలిగి ఉండాలి, నిర్లక్ష్యం ఉండరాదు.

దేవుని యందు ఆశక్తి కలిగి ఉండాలి, మహోన్నతుడు, సర్వ శక్తి కలిగినటువంటివాడు మన యేసయ్య, అటువంటి గొప్ప దేవుని నీడలో మనం ఉండాలి.

మనలను విమోచించడం కోసం, మన పాపo నుండి రక్షించడం కోసం నరకమునకు పోకుండా మనలను తప్పించడం కోసం మన కొరకు వచ్చిన అంతటి ప్రేమ కలిగి దేవా దేవునికి మనం లోబడి ఉండాలి.

ఈ అల్పమైన కోడి తల్లికున్నటువంటి లక్షణములను, గొప్ప గుణములను మనం 
పొందుకొనువారిగా ఉండాలి అని ప్రభువైన యేసయ్య ఈ మాటలతో మన అందరిని దీవించాలని ఆశిస్తూ.

యేసయ్య ఈ మాటలను ఆశీర్వదించునుగాక ఆమెన్.. 


దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్..

*********************************************************


10Nov2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M ఆనందవరంగారు

2 కొరింథీ 9:6-12
11 ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

ఇశ్రాయేలీయుల పండుగలు ఏడు:- 
ఈ పండుగలలో పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ, కొత కాలపు పండుగ, ప్రధమఫలముల పండుగ, భూరల పండుగ లేదా శృంగధనుల పండుగ, ప్రాయశ్చిత్త పండుగ, పర్ణశాలల పండుగ, పెంతేకొస్తు పండుగలను దేవుడు ఆచరించమని చెప్పారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నపటినుండి ఈ పండుగలను ఆచరిస్తున్నారు.

ఈరోజున మనం కృతజ్ఞతార్పణ పండుగ మనం జరుపుకుంటున్నాము, ఈ పండుగకు మరియొక పేరు ప్రథమఫలముల పండుగ, మనం జరుపుకుంటున్న ప్రతి పండుగలో దేవునికి కృతజ్ఞత మనం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది., కానీ దేవుని బిడ్డలుగా అయన మనకు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగా దేవునికి మనం ఇచ్చే పండుగ కృజ్ఞతార్పణ పండుగ.

మన జీవితంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈ పండుగను మనం చేస్తున్నాం, దేవుని ఇవ్వడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.

దేవుడు మన యొక్క జీవితంలో ముఖ్యంగా మూడు రకములైన ఫలములను ఇస్తున్నాడు, ఈకృతజ్ఞర్పణ పండుగలో మనం ఎటువంటి ఫలములను మన జీవితంలో దేవునికి ఇచ్చువారిగా ఉండాలో దేవుని వాక్యం ఏమి చెప్తుందో ముఖ్యంగా మూడు రకములైన ఫలములను గూర్చి వివరంగా మనం ఈ రోజున తెలుసుకుందాం.


1.మొదటిగా ప్రకృతి సంబంధమైన ఫలములను మనం దేవునికి ఇచ్చువారిగా ఉండాలి.

దేవుడు మనకు ఇస్తున్న ఈ ప్రకృతి సంబంధమైన ఫలములు మూడు, అవి భూసంబంధమైనవి, గర్భఫలములు, రాబడి ఫలములు.

భూసంబంధమైన ఫలము:-

నిర్గమకాండము23;16 నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంట యొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంత మందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.
 
దేవుడు మనకు తినుటకు కావలసిన సమస్త ఫలములను సంవృద్ధిగా ఇస్తున్నాడు, అందుకని మనం దేవునికి దేవుడిచ్చిన దానిలో మొదటిఫలమును మనం దేవుని దేవుని బిడ్డలుగా ఆయనకు ఇవ్వాలి ఇదే భూసంబంధమైన ఫలము మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞతర్పణ.

గర్భఫలము:- దేవుడు మనకు ఇచ్చిన బిడ్డలు కూడా మనకు దేవుడు ఇచ్చిన ఫలమే ఈ గర్భఫలము , అటువంటి అఫలములో మొదటి ఫలమును మనం దేవునికి సమర్పించాలి అదే మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞతార్పణ

రాబడి ఫలము 
సామెతలు3:9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము.

దేవుడు మనకు ఇచ్చే సంపాదనలో, రాబడి అంతటిలో కూడా ప్రథమఫలమును మనం దేవునికి ఇచ్చువారిగా ఉండటమే ఈ రాబడి ఫలము, దేవుని బిడ్డలుగా దేవునికి ఇవ్వడం వలన దేవుని యొక్క ఆశీర్వాదమును సంవృద్ధ్దిని మన జీవితంలో మనం పొందుకుంటాం.


2.మనం ఈ ఫలములను ఏవిధంగా ఇచ్చువారిగా ఉండాలి, మనం ఎలా ఉండాలి?

2 కొరింథీ9:6-7

6 కొంచెముగా విత్తువాడు కొంచె ముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
7 సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చ యించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

ఈ వాక్యంలో దేవునికి మనం ఇచ్చే ప్రతి కనుక విత్తనంతో పోల్చబడినది, మనం సంఘము అనే పొలములో ఎంత ఎక్కువగా విత్తితే అంత ఎక్కువగా పంట కోయగలుగుతాం, అంతటి సంవృద్ధి మనకు మన జీవితంలో దేవుడు మనకు ఇస్తాడు.

అందుకని మనం దేవుని సంఘమనే పొలములో విసుగక, సణుగుకొకుండా అధికంగా విత్తువారిగా ఉండాలి.

3.దేవుడు మన నుండి ఎటువంటి ఫలములను కోరుతున్నాడు అని ఆలోచిస్తే

దేవుడు మన నుండి శ్రేష్టమైన ప్రధమ ఫలములను కోరుచున్నారు అని దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు

హెబ్రీయు11:4 విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు.

దేవుడు కయీనుకంటె హేబెలు యొక్క శ్రేష్ఠమైన బలిని అంగీకరించాడు, అటువంటి గొప్ప విశ్వాసమును మనం కలిగి  శ్రేష్ఠమైన ప్రధమ ఫలములను అర్పించువారిగా మనం ఉండాలి, అప్పుడు దేవుని మందిరమందు పొలములో మనం విత్తిన విత్తనమనే ఫలము ఏదో ఒకరోజున మనకు గొప్ప ఫలమును మనకు ఇస్తుంది.

కీర్తనల గ్రంథము 126:5 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
 
యేసు ప్రభువారు కన్నీటితో తన దగ్గర ఉన్న సమస్తమును కానుకగా దేవునికి వేసిన బీదరాలు యొక్క కానుక దేవుని దృష్టికి గొప్ప దానిగా ఎంచి ఆశీర్వదించారు ఈమె అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చింది అని అన్నారు.

అందుకని మనం కూడా మనం దేవునికి ఇచ్చేటపుడు సణుగుకొకుండా మనం దేవుని ఇవ్వాలి.

4.రెండవదిగ మనం ఆధ్యాత్మిక ఫలములను దేవునికి మనం ఇవ్వాలి. 

గలతీయులకు 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.

సమాధానము, ప్రేమ  అనే ఈ తొమ్మిది రకములైన ఆధ్యాత్మిక ఫలములను మనం మన జీవితంలో కలిగి ఉండటమే దేవునికి మనం ఇచ్చే ఆధ్యాత్మిక ఫలములు అటువంటి గుణములను మనం కలిగి ఉండాలి, అంతే కాకుండా నీతి అనే మరియొక ఫలముతో దేవుని మనం ఘనపరిచే వారీగా ఉండాలి.

5.ముదిగా జిహ్వాఫలమును మనం దేవునికి ఇచ్చువారిగా ఉండాలి.

హెబ్రీయులకు13:15 కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.


జిహ్వ అనగా నాలుక, మన నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారా నిత్యం మనం దేవుని స్తుతించాలి.
మనము శ్రమలో సంతోషములో కూడా ఎల్లపుడు దేవుని స్థితించుటయే మనం దేవునికి ఇచ్చే జిహ్వాఫలము, నిత్యం మనం దేవుని స్తుతించాలి దేవుని గూర్చిన ఆలోచన మనం మన తలంపులలో కలిగి ఉండాలి, ఆలాగున మనం ఉండటమే మనం దేవునికి ఇచ్చే జిహ్వాఫలము అనే కృతజ్ఞతార్పణ.


ఈ రోజున మనకు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగా దేవునికి మనం ఇచ్చే పండుగ కృతజ్ఞతార్పణ పండుగ. మనం దేవునికి శ్రేష్ఠమైన ప్రధమ ఫలములను, ఆధ్యాత్మిక ఫలములను, జిహ్వాఫలము విసుగక ఇస్తూ నిత్యం దేవుని ఘనపరిచే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని అట్టి కృప యేసయ్య మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ


దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్..
 
*******************************************


17Nov2019 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev. M.ఆనందవరం గారు
మత్తయి 10:16

ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. 

చదవబడిన వాక్యభాగములో గమనిస్తే మన యేసయ్య ఆనాటి జనులైన వారికిని, ఈనాటి జనులైన వారికిని, ఆయనను వెంబడించే వారి అందరికిని అర్ధమైన రీతిలో ఉపమాన రీతిగా భోదించేవారు, ఈ వాక్యంలో ఆనాటి యుధులైన వారిని గూర్చి తోడేలుతో పోల్చి మాట్లాడుతూ, ఆయనను వెంబడించేవారిని గొఱ్ఱలతో పోల్చుచు ఎవరులా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో వివరిస్తున్నారు.

వాక్యంలో పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులుగా మనం ఉండాలి, అని అయన ఉపమాన రీతిగా మనకు చెప్తున్నారు, ఈరోజున మనం పావురము గూర్చి బైబిల్ గ్రంధములో ఏమి వ్రాయబడినవో, పావురం యొక్క శ్రేష్ఠత ఏంటో దాని లక్షణములు ఏంటో మనం ఈరోజు వాక్యానుసారంగా ధ్యానిద్దాం.

1.మొదటిగా ఈ పావురం రెండురకములు తెల్లని పావురం, నల్లని పావురం ఈ రెండిటిని గూర్చి బైబిల్ గ్రంధములో వ్రాయబడినది.


తెల్లని పావురం:- గూర్చి మనం చుస్తే యేసుప్రభువారు బాప్తిస్మము తీసుకున్న తరువాత పరిశుద్దాత్మ తెల్లని పావురం వలే అయన మీద వ్రాలినది అని వ్రాయబడినది, ఇక్కడ పరిశుద్దాత్మ తెల్లని పావురంతో పోల్చబడినది, ఇక్కడ తెల్లని పావురం దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది.

నల్లని పావురం:- ఆదికాండము 8:7,10,11గూర్చి పాతనిభందన గ్రంథములోని మనం చుస్తే నోవహు జలప్రళయం తరువాత ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్లి భూమిమీదనుండి నీళ్లు ఇంకిపోవువరకు ఇటు అటు తిరుగుచుండెను, తరువాత అతడు తన యొద్దనుండి నల్లపావుర మొకటి బయటికి విడిచెను, నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతనియొద్దకు తిరిగి వచ్చెను, అతడు మరి యేడుదినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను।సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చి నప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.

ఈరోజున మనం నోవహు మొదట పంపిన కాకివలె మన ఇష్టానుసారంగా  అటుఇటు తిరుగు వారివలె ఉండరాదు, నోవహు రెండవసారి పంపిన పావురం యజమాని పట్ల నమ్మకత్వం కలిగి అతని ఆంతర్యం ఎరిగి అతడు చెప్పిన పనిని చేసి అతనికి కావలసిన సమాచారాన్ని ఇచ్చింది.
అటువంటి పావురం వలె భాద్యత కలిగి మనం మన దేవుని ఆంతర్యం ఎరిగిన బిడ్డలుగా ఉండాలి.

ఈ పావురంను గూర్చి దాని శ్రేష్ఠతను గూర్చి మనం ఈ రోజున ఒక్కొకటిగా ధ్యానిస్తే


2.ఈ పావురం సుందరమైనది, అందమైనది.

ఈ పావురమును ఇష్టపడని వారు ఎవరు ఉండరు, పాలస్తీనా దేశములో వీటిని విరివిగా పెంచుతారు.

ఈరోజు మనం ఈ పావురమును ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే, మనం కూడా  ఈ పావురం వలే మన ఆధ్యాత్మిక జీవితంలో మన క్రియలు, రూపంలో అందంగా ఉండాలి, ఆలాగుననే మన సంఘము సౌందర్యముగా ఉండాలి, దేవుని బిడ్డలైన వారు సంఘములో ఆత్మ సౌందర్యము కలిగి ఉండాలి., అని మన యేసయ్య కోరుచున్నారు.

అందుకే సోలమన్ మహారాజు పలికిన మాటలను మనం గమనిస్తే 

పరమగీతము 1:15 నా ప్రియురాలా, నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు.

బైబిల్ గ్రంధములో ఈ గువ్వా పేరు అర్ధం గల ప్రవక్త యోనా దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నాడు, ఏది ఏమైనప్పటికి యోనా ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు, ఎంతమంది ప్రవక్తలు ఉన్న దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, దేవుని బిడ్డలుగా మనం కూడా ఆవిధంగా ఉండాలి.

ఈ గువ్వ కన్నులను గూర్చి  బైబిల్లో మనం చుస్తే

పరమగీతము5:12 అతని నేత్రములు నదీతీరములందుండు గువ్వలవలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నములవలె ఉన్నవి.

ఈ గువ్వ కన్నులు ఎలా ఉన్నాయ్ అని అంటే స్వచ్ఛంగా ఉన్నాయి, అదేవిధంగా సంఘము అనే ఈ పావురం కన్నులు కూడా పాల వలే స్వచ్ఛంగా ఉండాలి, ఈ సంఘం అనే స్త్రీకి అందం రావాలి అని అంటే ఈ సంఘం యొక్క చూపు., కన్నులు స్వచ్ఛంగా ఉండాలి.


3.ఈ పావురం యొక్క రెండవ లక్షణం ఇది నిష్కలంకమైనది.

ఎఫెసీయులకు5:26అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, 27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
 

సంఘము కళంకముతో ఉంటె మన యేసయ్య యొక్క రాజ్యములో మనం చేరలేము, సంఘ కాపరి ఐనా, సంఘ సభ్యులైన, దేవుని బిడ్డలైన వారి జీవితం నిష్కపటంగా ఉండాలి
మనం బ్రతికినంత కాలం సమాజానికి భయపడాలి, మరి ముఖ్యంగా దేవునికి భయపడాలి, సంఘమునకు, దేవుని నామమునకు మహిమ తెచ్చే వారీగా ఉండాలి.

4.మూడవదిగా ఈ పావురం కపటంలేనటువంటిది.

నతనయేలు జీవితం గూర్చి యేసు ప్రభువారు మాట్లాడుతూ అయన కపటం లేని వాడు అని పలికారు, అటువంటి వారీగా మనం ఉండాలి.

యోహాను 1:47 :యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచిఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను

ఈ పావురం చేదు లేనిది, చేదు అని అంటే కపటం అసూయా, పగా, ద్వేషం లేనిది, ఈ చేదు లేకుండా జీవించేవారు నిజమైన దేవుని బిడ్డలు అని యేసు ప్రభువారు మనకు చెప్తున్నారు.


5.నాల్గవదిగా ఈ పావురం బండసందులలో ఉంటుంది.

పరమగీతము 2:14 - బండసందులలో ఎగురు నా పావురమా, పేటుబీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము

బండ మన యేసయ్యకు సాదృశ్యం, పేటుబీటలు అనగా అయన గాయాలకు సాదృశ్యం, ఈ పావురం ఎందుకు బండ సందులలో ఉంటుంది అని అంటే రక్షణ కోసం, సాతను ఎంత బలవంతుడు ఐనా యేసయ్య సన్నిధికి రాలేడు, మనకు రక్షణ కావాలి అని అంటే మనo ఏసయ్యను ఆశ్రయించాలి, అయన మందిరంలో సమయాన్ని గడపాలి, ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము.

6.ఐదవదిగా ఈ పావురము కాలమును ఎరిగినటువంటిది.

యిర్మీయా8:7 ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.

మనం కూడా యేసయ్య బిడ్డలుగా అయన రాకడ కాలమును తెలుసుకొనే బిడ్డలుగా ఉండాలి, దేవుని సన్నిధికి రావలసిన కాలం తెలిసిన బిడ్డలుగా ఉండాలి, అజ్ఞానులవలే కాకుండా- జ్ఞానులవలె దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు సిద్దపడి ఉండాలి.

పరమగీతము 6:9 నా పావురము నా నిష్కళంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు రాణులును ఉపపత్నులును దాని పొగడుదురు.

ఇంతటి శ్రేష్ఠత కలిగిన పావురంవలె మనం మన దేవుడైన యేసయ్యకు ముద్దు బిడ్డలుగా నిష్కళంకమైన జీవితం, సంఘములో సమాజంలో దేవునికి మహిమ నిచ్చు బిడ్డలుగా అట్టి కృప కలిగి ఉండాలి అని ఆశిస్తూ.


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్...

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...


*******************************************************

24Nov2019ఆదివారం ఆరాధన

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం

వాక్యపరిచర్య Rev.M. ఆనందవరంగారు



ఇక్కడ చదవబడిన వాక్యభాగములో మనం కనుక గమనిస్తే శ్రేష్ఠము అను ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది, మానవులమైన మనం ఈ లోకంలో ఏదైనా చేయాలి అని అన్నా, ఏదైనా కొనాలి అని అన్నా అది మంచిదా, శ్రేష్టమైనదా అని ఆలోచిస్తుంటాము.

ఈ లోకంలో ఏది శ్రేష్టమైనది, దేవుని వాక్యం ఏమి చెప్తుందో, ఆ వాక్యం నుండి మనం ఏమి నేర్చుకోవాలో, బైబిల్ గ్రంధములో శ్రేష్ఠమైనదానిగా ఏది ఎంచబడుతున్నాదో, దేవుని దృష్టికి ఏది శ్రేష్టమో మనం తెలుసుకుందాం. 

ఈ శ్రేష్ఠము అనగా మంచిది, గొప్పది, ఉన్నతమైనది, మేలుకరైనది, జేష్ఠమైనది అని అర్ధం.

1.మొదటిగా మనం గమనిస్తే లోకంలో శ్రేష్టమైన దేవుని మాట విని ప్రకారము నడుచుకునుటయే లోకంలో శ్రేష్టమైనది.,అని దేవుని వాక్యం చెప్తుంది.
1సమూయేలు15:22
వాక్యభాగములో మనం గమనిస్తే ప్రవక్తయిన సమూయేలు, సౌలు మహారాజుతో యెహోవా నిన్ను సాగనంపినీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను.

అందుకు సౌలు ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితినని చెప్పగా, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.

అప్పుడు సౌలు మహారాజుతో, ప్రవక్తయిన సమూయేలు యెహోవా ఒకడు బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటె మాట వినుటయు శ్రేష్ఠము అని ఆయనతో పలికెను.

సమూయేలు ప్రవక్త సౌలు మహారాజుతో మాట్లాడుతు అయన అంటున్నాడు లోకంలో బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలను అయన మాటలను గైకొని ఆప్రకారము నడుకొనుటయే శ్రేష్ఠము అని అయన చెప్తున్నాడు.

లోకంలో దేవుని బిడ్డలుగా మనం దేవుని మాటలను విని వాటి చొప్పున మనం నడుచుకోవాలి, అది మనకు, మన కుటుంబాలకి శ్రేష్ఠము, అది మనలను పరలోక రాజ్యమునకు తీసుకువెళ్తున్నది.

దేవుని మాట విని ఆప్రకారము నడుచుకొనినట్లైతే మనకు ఏమి కలుగుతుంది అని మనం ఆలోచిస్తే ధన్యులుగా దీవించి ఆశీర్వదిస్తాను అని మన యేసయ్య మనతో పలుకు చున్నారు.
కీర్తనల గ్రంథము 128:1-7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు.

దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని మన యేసయ్య మనతో పలుకు చున్నారు.

ద్వితీయోపదేశకాండము 28:1-2 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.
2 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.

మత్తయి 7:24,26 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును, మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

అటువంటి శ్రేష్ఠమైన దేవుని మాటలను శ్రేష్ఠముగా ఎంచుకొనువారిగా మనం ఉండాలి, కావున దేవుని వాక్యమును ప్రేమించాలి, అయన మాటల ప్రకారముగా మనం జీవించాలి, అటువంటి వారిని ధన్యులుగా దీవించి ఆశీర్వదిస్తాను అని మన యేసయ్య మనతో పలుకు చున్నారు అప్పుడే మనం ఆయనను సంతోష పెట్టువారిగా ఉంటాము.

2.రెండవదిగా దేవుని చేత అయన ద్వారా ఒక శ్రేష్ఠమైన క్రొత్త పేరుతో పిలువబడేవారీగా మనం ఉండాలి.

యెషయా 56:5 నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను.
 
ఎన్ని శ్రమలో వచ్చిన బాధలు వచ్చిన దేవుని కోసం భరించి నిలబడినవారికి దేవుని బిడ్డలు అని పిలుచుటకంటెదేవుడే ఒక శ్రేష్ఠమైన నామమును మనకు అయన పెడతాను అని అయన అంటున్నాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉండగా వెలుగులోనికి తీసుకువచ్చాడు, ఒకప్పుడు మనం పాపులము మనలను నీతిమంతులుగా ఉండే శ్రేష్ఠమైన భాగ్యమును అయన మనకు ఇచ్చాడు, ఇంతకంటే శ్రేష్ఠమైన పేరును అయన కొరకు నిలబడిన వారికీ మన యేసయ్య ఇస్తాను అని అంటున్నాడు.

3.మూడవదిగా శ్రేష్ఠమైన బుద్ధిగల వారీగా ఉండాలి.                       
దానియేలు5:12 దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను.
ఎందుకు దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడు అని వ్రాయబడినది అని అంటే?
అతని ప్రవర్తనను గూర్చి మనం చుస్తే అయన, షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము అని పలికెను.

ఇతని పద్దతిలో శ్రేష్ఠత కనిపిస్తుంది, ఇతని భక్తిలో శ్రేష్ఠత కనిపిస్తుంది అందుకే అయన శ్రేష్ఠమైన బుద్ధిగలవాడు అని వ్రాయబడినది.
ఈరోజున మనం ఏది పడితే అది తిని త్రాగి తిరుగు వారీగా ఉండరాదు, అటువంటి వాటిని తిని మనలను మనం అపవిత్రపరచుకొనే వారీగా మనం ఉండరాదు

శ్రేష్ఠమైన బుద్ధికలిగినవారంగా  మనం ఉండాలి అని మన యేసయ్య మనలను రోజున కోరుచున్నారు.
4.నాల్గవదిగా దేవుని వాక్యం మనం చుస్తే లోకంలో జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠము.
సామెతలు8:11 జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
వాక్యంలో సోలమన్ మహారాజు పలికిన మాటలను మనం గమనిస్తే జ్ఞానం యొక్క విలువను గూర్చి, జ్ఞానము యొక్క శ్రేష్ఠతను గూర్చి మనకు తెలుపుతుంది, అందుకే మనం దేవుని శ్రేష్ఠమైన జ్ఞానము కావాలి అని అడగవలసిన వారమైఉన్నాము, లోకంలో బ్రతకటానికి జ్ఞానం మనకు చాల అవసరం, దేవుని గూర్చిన పరలోక సంభందమైన జ్ఞానం చాల అవసరం.

అందుకే జ్ఞానం కలిగి నడుచుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది.
ఎఫెసీయులకు5:16
16 అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.

జ్ఞానం మనకు ఉంటె సాతాను యొక్క కుయుక్తులను మనం తప్పించుకోవచ్చు, అందుకే మనకు ఆత్మ జ్ఞానము, శారీరక జ్ఞానం కావాలి, జ్ఞానమునకు ఏవి సాటిరావు.

అందుకే జ్ఞానం కొదువై ఉండిన యెడల మనం దేవుని అడగాలి అని దేవుని వాక్యం చెప్తుంది.
యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.

మనం నిత్యం దేవుని మన చదువులలో, ఉద్యోగములలో, లోకంలో జీవించుటకు జ్ఞానం ఇవ్వమని దేవుని అడగాలి.

5.ఐదవదిగా దేవుని మందిరం మనకు ఎంతో శ్రేష్ఠము అని మనం గమనించాలి
కీర్తనల గ్రంథము84:10
నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దిన ములకంటె శ్రేష్ఠము.
 
దేవుని యొక్క ఆలయంలో మనం గడుపుటయే లోకంలో మనకు ఎంతో శ్రేష్టం, ఎందుకు అని అంటే దేవుని ఆలయం, ఇది దేవుడు కోరుకున్న స్థలం, దేవుని సన్నిధిలో గడపడం ఎంతో గొప్పదైనది.

అయన బిడ్డలుగా మనం అయన సన్నిధిలో ఐక్యతతో ఆయనను ఆరాధించే స్థలం దేవుని మందిరం అందుకే ఇది మనకు ఎంతో శ్రేష్ఠము.

అందుకే మనం అయన సన్నిధిలో సమయం గడుపుట కొరకు ఆశ పడువారిగా ఉండాలి.
కీర్తనల గ్రంథము84:2
2 యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి.

కీర్తనల గ్రంథము42:1
1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.

ఉన్నతమైన దేవుని మందిరంలో సమయం గడిపితే మనకు ఏమి కలుగు తుంది అని ఆలోచిస్తే
మనం ఆత్మీయంగా ఎదగటానికి, దేవునిలో బలపడటానికి, స్థిరపరచబడటానికి, దేవుని మందిరం మనకు ఎంతో సహాయం చేస్తుంది, అంతే కాకుండా అయన గొప్పదైన ఆశీర్వాదం, సర్వసమృద్ధి, సఫలత మనం పొందుకుంటాం.   మందిరం అంటే నిర్లక్ష్యం చేయువారిగా కాకుండా అశ్రద్ధగా ఉండువారిగా కాకుండా, మనలను దేవుని మందిరంనకు రాకుండా ఆటంకపరచు వాటినుండి బయటపడి జయించి, మనం అయన శ్రేష్ఠమైన మందిరంలో నిత్యం సమయం గడుపు వారీగా ఉండాలి అని మన యేసయ్య కోరుచున్నారు.

కీర్తనల గ్రంథము96:8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి 9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.

ఈరోజున మనం దేవుని బిడ్డలుగా, శ్రేష్ఠమైన దేవుని మాటలను విని ఆప్రకారము చేయువారిగా, అయన ద్వారా ఒక శ్రేష్ఠమైన క్రొత్త పేరుతో పిలువబడేవారీగా, దానియేలు వలే దేవుని యందు భయభక్తులు కలిగి శ్రేష్ఠమైన బుద్దిని కలిగినవారంగా, ముత్యం కంటే  శ్రేష్ఠమైన జ్ఞానం కలిగి, నిత్యము శ్రేష్ఠమైన దేవుని మందిరంలో గడిపేవారంగా మన యేసయ్య మన అందరిని దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ..

అనేకులకు అశీర్వాధకరముగా ఉండులాగున మాటలను ఇతరులతో పంచుకోండి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
" రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును." (మత్తయి 24:14)














  





  


 













   

 .





    
 



No comments: