GoodFriday2020


శుభ శుక్రవారం 10April 2020
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం



1.మొదటి మాట : క్షమించు
వాక్యపరిచర్య Rev.M. ఆనందవరం గారు
లూకా23:34 యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను.
యేసుప్రభువారు పలికిన మొదటి మాట ప్రేమతో కూడిన మాట ఇది ఒక క్షమాపణతో కూడిన గొప్ప మాట. యేసుప్రభువారు గొప్ప దేవుడు భూప్రపంచంలో ఆయనలాగ  మనలను క్షమించేవారు ఎవరు లేరు. ఈరోజున భర్త-భార్యను, భార్య-భర్తను క్షమించలేకపొవచ్చును కానీ అంతేకాకుండా మనపట్ల చిన్న చేసిన తప్పును మనం క్షమించలేము. కానీ యేసయ్య ఆయనను ఎన్ని భాదలు పెట్టిన అయన తండ్రి వీరు ఏమిచేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని కోరుచున్నారు.

పరిశుద్దగ్రంధములో మనం చుస్తే  దానియేలు 9:9, మీకా 7:18 మన దేవుడు కృప, క్షమించే గుణము కలిగిన దేవుడు అని వ్రాయబడినది. ఈరోజున మనం అయన జీవితం ద్వారా, అయన మాటల ద్వారా, అయన యొక్క క్రియల ద్వారా క్షమించే గుణమును మనం నేర్చుకోవాలి

అంతే కాకుండా మార్కు11:25-26 బైబిల్ గ్రంధములో క్షమాపణ గూర్చి ఒక గొప్ప మాటను మనం చూడవచ్చు. మనం ప్రతిసారి ప్రార్థన చేయునప్పుడెల్లను దెబదియేడుమార్లు క్షమించాలి అని మత్తయి 18:21లో వ్రాయబడినది. ప్రతి విషయంలో మనం ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి.  

హెబ్రీయులకు 10:18లో మనం చుస్తే మన పాప క్షమాపణ ఎక్కడ కలుగుతుంది అని అంటే క్రీస్తు రక్తము ద్వారా అని పౌలు భక్తుడు చెప్తున్నారు. ఎఫెసీయులకు 1:7 లో ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది అని వ్రాయబడినది
 
లూకా 5:38 పాపపరిహార్దబలి అనే క్రొత్త నిబంధన గూర్చి వ్రాయబడినది.
మనం ఇతరులను క్షమించేవారిగా ఉండాలి అప్పుడే ప్రభువు మనలను క్షమిస్తారు అందుకే యేసుప్రభువారు అంత బాధలో కూడా అయన చేస్తున్న ప్రార్ధన ద్వారా మనకు నేర్పిస్తున్న విషయం ఏమిటి అంటే మనం కూడా అటువంటి క్షమాగుణము కలిగి ఉండాలి అని అయన ఆశ

ఈరోజున సంఘములలో, కుటుంబములలో క్షమాపణ గుణం లేదు, సమాధానం లేదు, మన అతిక్రమములను బట్టి అయన పొందిన దెబ్బలచేత పాపములను అయన క్షమించినరీతిగా ఈరోజున అయన పడిన శ్రమను, అయన త్యాగమును జ్ఞాపకం చేసుకొని అయన నేర్పించిన క్షమాగుణమును కలిగి ఉండాలి., లేకపోతె అయన త్యాగమునకు విలువలేదు. అందుకే మనం ఈరోజున క్షమాగుణం కలిగి ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి ఆమెన్.

2.రెండవమాట: పర దైసు
వాక్యపరిచర్య శ్రీమతి M.మేరీ గ్రేస్ గారు  
లూకా 23:43 అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను

మొదటి దొంగ ఆయనను హేళనగా మాట్లాడుచుండగా, కానీ ఇక్కడ రెండవ దొంగ యేసయ్యను దేవుని కుమారునిగా గుర్తించి సాత్వికంగా కలిగినవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసయ్య సిలువలో చేసిన క్షమాపణతో కూడిన ప్రార్ధన, దొంగ హృదయాన్ని కదిలించినట్లుగా మారుమనస్సు కలిగించినట్లుగా తాను చేసిన పాపములను వొప్పుకొనినట్లుగా యేసుప్రభువారిని ఒక రాజుగా, రక్షకునిగా గ్రహించినట్లుగా, మరణాంతర జీవితమును గ్రహించి యేసయ్య చెంత తాను ఉండాలి, అని పశ్చాతాపం కలిగినవాడిగా, దేవుని రాజ్యంలో తనను జ్ఞాపకం చేసుకోమని, అటువంటి ఆలోచన కలిగినపుడు యేసయ్య దొంగతో నీవును నాతో కూడా పరదైసులో ఉందువు అని పలికినట్లుగా మనం చూస్తాం.

ఈపరదైసులో ఉండే భాగ్యం ఎవరికీ కలుగుతుంది అని మనం ఆలోచిస్తే
ఎంతో గొప్ప మారుమనస్సు , పాపపు ఒప్పుకోలు, అయన రక్షణ, అయన గూర్చి పూర్తిగా తెలిసిన వారికీ, అయన రాకాడను గూర్చి సిద్ధపాటు కలిగి ఉన్నవారికి కలుగుతుంది., కానీ అటువంటి గొప్ప ధన్యత దొంగకు కలిగింది.

పరదైసును గూర్చి మనం ఆలోచిస్తే
పరదైసు అనగా దేవుని తోట అను అర్థమిచ్చే ఒక పర్షియా పదం 2కొరింధీ12:3-4లో, ప్రకటన 2:7 మనం జ్ఞాపకం చేసుకొంటే యోహాను భక్తుడు పరదైసును గూర్చిన వివరణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ జీవవృక్షఫలములు అని వ్రాయబడినది, ఎవరికి అని అంటే జయించినవారికి దాచబడినవి అని వ్రాయబడినది. యెషయా 55:3, యెహెజ్కేలు28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి
 
అటువంటి గొప్పదైన భాగ్యమును రెండవదొంగ పొందుకున్నాడు. ఈరోజున మనం కూడా దేవుడిచ్చే జీవవృక్షఫలములు పొందుకోవాలి అని అంటే మనకు కావలసినది మారుమనస్సు , రక్షణ, అయన చేసిన త్యాగంపట్ల కృతజ్ఞత, అయన రాజ్యంపట్ల నిశ్చయత కలిగి ఉంటె, మనం కూడా పరదైసులో స్థానమును స్వతతంత్రించుకోగలము అటువంటి గొప్ప భాగ్యం మనం కలిగి ఉండాలి ఆశిస్తూ  దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.


3.మూడవమాట : అమ్మా
వాక్యపరిచర్య M.చంద్రలీలాలమ్మ గారు
యోహాను19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా,యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,

యేసుప్రభువారు సిలువలో పలికిన మూడవమాటను కనుక మనం చుస్తే అయన తల్లి గారు అయనను గర్భమును ధరించినప్పటి నుండి ఆమె అనేకమైన అవమానములు, నిందలు పడినట్లుగా తెలుసు వాటిని అన్నిటిని ఆమె భరించించారు., బాధలు సహించినట్లుగా మనం చూస్తాం. అయన తల్లి యొక్క భాధ్యతను తాను ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తు యేసుప్రభువారు సిలువలో మాటను పలికినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మనం అయన చూపిన మార్గంలో మన యొక్క భాద్యతలను నిర్వహించవలసినవారమై ఉన్నాము.

నిజంగా తల్లి యొక్క ప్రేమ అపారమైనది, తల్లి యొక్క ప్రేమ ఎంతో గొప్పది. భూప్రపంచంలో తల్లి ప్రేమను తెలియనివారు ఎవరు ఉండరు. అటువంటి తల్లి యొక్క శ్రమను తెలిసినవాడు యేసుప్రభువారు. ఆమె గొప్ప ప్రార్ధనపరురాలు, పరిశుద్దాత్మ శక్తితో నవమాసములు అయనను మోసినది, అయనను ఎంతో ప్రేమతో పెంచినది. ఎందుకు ఆని అంటే అయన దేవుని కుమారుడు అని తెలుసు కాబట్టి ,కుమారునిగా ఆయన చేసిన గొప్పకార్యములు ఆమె చూసినది కాబట్టి . అయన సిలువలో ఎన్నో భాదలు పడుచున్నపుడు ఆమెకు తెలుసు అయన మానవుల పాపములకు తన కుమారుడు పాపపరిహార్థబలిగా అవుతున్నాడు అని

ఇక్కడ యేసయ్య తల్లి ప్రేమను అర్ధం చేసుకున్న చేసుకున్న కుమారునిగా యేసుప్రభువారు మాట పలికినట్లుగా మనం చూస్తాం. రోజున మనం మనలను ఎంతగానో ప్రేమించే తల్లితండ్రులను గౌరవించేవారీగా, వారిని ప్రేమించేవారిగా ఉండాలి అని యేసయ్య మాట ద్వారా మనకు నేర్పిస్తున్నారు.


4.నాల్గవమాట :  ఏలీ, ఏలీ, లామా సబక్తానీ
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
మత్తయి27:46 ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
యేసుప్రభవారు సిలువలో వేదన అంతటిని భరించి, వేదనతో కూడిన మాటను తండ్రికి చెప్పినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధగ్రంథములో మనకు అయన అనేకమైన వాగ్దానములు చేసారు ఆదికాండము 28:15 అని యాకోబుతో దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 
ద్వితీయోపదేశకాండమ 31:6అయన మనకు ఇస్తున్న అంటే నిన్ను విడువను ఎడబాయను అని ప్రమాణం చేస్తున్నాడు. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?ఆలాగుననే  యెహొషువ చెప్తున్నాడు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అని అయన వాగ్దానము చేస్తున్నాడు

బయపడకు నేను తోడై ఉన్నాను అని అయన చెప్తున్నాడు అందుకే ఇశ్రాయేలీయులైనవారిని నలభై సంవత్సరములు నడిపించి కాపాడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభువారు అయన పడిన భాద వేదన శ్రమలుతో కూడిన మాటగా మనకు తెలుసు., నా దేవా నాదేవా నా చేయి ఎందుకు విడిచితివి అని పలికినట్లుగా మనం చూస్తాం. మనం ఈరోజున ప్రభవుతో ఉండాలి తండ్రి యొక్క ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ.

పరమ తండ్రి తన ప్రియకుమారుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకు తండ్రి ఆయనను విడిచిపెట్టారు అని మనం ఆలోచిస్తే

ఎందుకు అని అంటే మనలను మన పాపముల నుండి విడిపించడానికే అటు వంటి గొప్ప ప్రేమ కలిగిన వాడు మన ప్రేమ తండ్రి 

యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
మన పాపముల నుండి విమోచించడానికి అటువంటి తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని దేవునిలో ఆత్మీయంగా ఎదగాలి అని యేసయ్య మాట మన కొరకు పలికారు అని మనము తెలుసుకొని దేవునిలో మరింతగా ఎదగటానికి బలపడటానికి ప్రయత్నించాలి ఆమెన్.


5.ఐదవ మాట : దాహము
వాక్యపరిచర్య శ్రీమతి M.మేరీ గ్రేస్ గారు.,
యోహాను 19:28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లునేను దప్పిగొను చున్నాననెను.
ఐదవ మాట లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఈమాటను పలికినట్లుగా మనం చూస్తాం. అయన ఎందుకు దప్పిగొన్నారు అని మనం ఆలోచిస్తే మొదటిగా మనం చుస్తే రాత్రి అంత ఆయనను పిడిగుద్దులతో శ్రమపెట్టిన, మరియు ఎండయొక్క వేడిమికి అయన మాటను పలికినట్లుగా మనం అనుకుంటాం. అయన శరీరసంభందమైన దాహమే కాకుండా., ఆత్మ సంభందమైన దాహము కలిగినవాడుగా అయన మాటలను పలికినట్లుగా మనం చూడవచ్చు. అయన మాట చెప్పిన తరువాత ఆయనకు ఒక చిన్నచిరాకలో ముంచి ఇచ్చినట్లుగా వ్రాయబడినది

హాగరు గూర్చి మనం చుస్తే హాగరు ఎదుట నీటి అతను పుట్టించినటువంటి దేవుడు మన యేసయ్య , అంతే కాకుండా సమ్సోను దాహముతో ఉన్నపుడు ఒక లోయను చీల్చి నీటి ఊటను పుట్టించిన దేవుడు మన దేవుడు .

అటువంటి దేవుడు యేసుప్రభువారి దాహము గొన్నపుడు అయన దాహము తీర్చలేడా కానీ అయన దాహము గొనడానికి కారణం ఏమిటి అని అంటే 

యోహాను 4-7,8 సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. ఇక్క యేసుప్రభవారు ఆత్మీయ దాహమును సూచిస్తుంది. యోహాను 7-37-38 లో మనము చుస్తే నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెనుఅప్పుడా సమరయ స్త్రీ అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని మెసయ్య కనుగొన్నాను అనిపలికినది, అనగా ఆమెకు అప్పుడే ఆమె యొక్క జీవితంలో రక్షణ వచ్చింది అయన జీవజలము త్రాగు ప్రతి వాడు దప్పిగొనడు అని మనకు చెప్తున్నారు ఎవరు జీవజలము వెతుకుచున్నారు అని మనం చుస్తే యిర్మీయా 17-13, యిర్మీయా 2-13 యెషయా 55-1 జకార్య 13-1 యేసయ్యను గూర్చి పలికినట్లుగా మనం చూస్తాం
 
అయన దాహము గొనడానికి కారణం ఏమిటి అని అంటే 
అనేకమై నవారు ఇంకను రక్షణ పొందాలి అని ఆయనకు ఉన్న ఒక కోరికను ఆయన మనకు తెలియజేస్తున్నారు. అయన యొక్క రక్షణ మనమందరం పొందాలి అని అయన యొక్క ఆలోచన. రోజున మనం రక్షణ పొంది అనేకమైన వారి యొక్క దాహమును మనం తీర్చేవారిగా మనం ఉండాలి అని అయన యొక్క ఆలోచన. యెషయ 12-3 మనం చుస్తే అటువంటి దాహము మనం కలిగి ఉండాలి అని అయన కొరిక. అటువంటి ఉచితముగా అయన ఇచ్చే రక్షణ పొందాలి అని అయన కొరిక. ప్రభువారు మాటలను దీవించును గాక ఆమెన్.

6.అరవమాట : సమాప్తము
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
యోహాను 19-30 యేసు చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను

ఈలోకంలో ప్రతి దానికిని ఒక సమాప్తము అనేది ఉంటుంది, అయన మన కొరకు అన్ని భాదలు పడి ఆఖరిగా మాటనుపలికారు

ఏవిషయంలో సమాప్తమైనది అని మనము ఆలోచిస్తే 
అయన తన పరమతండ్రితో చేసుకొన్న నిబంధన సమాప్తమైనది అయన పరలోకము నుండి భూలోకమునకు ఎందుకు వచ్చారో నిబంధన నెరవేర్చబడినది. అయన లేఖనములు అన్ని నెరవేర్చారు గ్రీకు భాషలో తండ్రి చిత్తము సమస్తమును కూడ పూర్తిగా నెరవేర్చబడినది అని అర్ధము. ఈరోజున మనకు మన ప్రభువు ఇస్తున్న భాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చవలసినవారమైఉన్నాము, మన ప్రభువు ఇస్తున్న భాధ్యతను దేవుని పనిని పూర్తిగా కొనసాగించవలసినవారమైఉన్నాము.
 
అపో. కార్యములు 20-24 మనం చుస్తే దేవుని పనిని తుదముట్టించేవారీగా మనం ఉంటున్నామా., 2తిమోతి 4-7 ఇక్కడ దేవుని పని కొరకు అయన క్రీస్తు కొరకు, అయన రాజ్యము కొరకు, అయన సంఘమున కొరకు పరుగు అని చక్కని విషయమును అయన జ్ఞాపకం చేస్తున్నారు, అయన ఇచ్చిన భాద్యతను మనం పూర్తిగా నెరవేర్చాలి. అయన సర్వమానవులమైన మన కొరకు అయన చేసిన సమస్తపనిని నెరవేర్చువారిగా మనం ఉండాలి అని అటువంటి  ప్రభువు బిడ్డలుగా మనం జీవించాలి అని యేసయ్య ఈరోజున ఆశపడుచున్నారు, ప్రభువారు మాటలను దీవించును గాక ఆమెన్

7.ఏడవ మాట :  తండ్రీ
వాక్యపరిచర్య శ్రీమతి M.మేరీ గ్రేస్ గారు
లూకా 23:44-46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను.

యేసయ్య పలికిన ఏడవ మాట తండ్రి కి మొరపెట్టిన మాటగా ఇది ఒక నిశ్చయత, నిరీక్షణ కలిగిన గొప్ప మాట, అయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి సమస్తమును మన కొరకు చేసిన వాడిగా ఫిలిప్ 2:8 లో మనము చూస్తే అయన తండ్రికి విధేయత చూపిన కుమారునిగా మనం గమనించాలి. అంతేకాకుండా యోహాను 10:18లో మనము చూస్తే తన తండ్రి మాటకు విధేయునిగా తండ్రి వలన అధికారము పొందినవానిగా మనంచూడవచ్చు. కీర్తన31:5 1యోహాను 4:6,7 వ్రాయబడిన మాటలను కూడా మనం చూడవచ్చు.

యేసయ్య తన తండ్రి ద్వారా ఈలోకమునకు పంపబడి నీళ్లు, రక్తము, ఆత్మతో కార్యము చేసినట్లుగా మనం చూస్తాం. కీర్తన 10:14 ఆధారం లేనివారం మన కొరకు పాపములను అపరాధము జీవయుక్తమైనది ఇవ్వడానికి అయన ఈలోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తాం కూడా మాటను పలికినట్లుగా మనం చూస్తాం.

1పేతురు4:19 నమ్మకమైనటువంటి మన దేవునికి మన ఆత్మ అప్పగించుకోవాలి అని అయన చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవునికి యేసుప్రభువారు ఏరీతిగా తన  అప్పగించుకున్నారో మనం కూడా అరీతిగా సత్ప్రవర్తన కలిగినవారీగా మనం మన యొక్క ఆత్మను తండ్రి యెడల కుమారుడు విధేయత కలిగి రీతిగా మనం ఉండాలి,మన ఆత్మ అప్పగించుకోవాలి.

యేసుప్రభువారు సిలువలో పలికిన అమూల్యమైన మాటలు మనజీవితంలో మనం నేర్చుకొని మనం అయన నేర్పిన క్షమాపణతో అందరిని క్షమిస్తూ అయన మనకు ఇచ్చిన భాధ్యతను నెరవేరుస్తూ అయన చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకొంటూ అయన బిడ్డలుగా అయన చూపిన మార్గంలో జీవించాలని ఆశిస్తూ

యేసయ్య మాటలను దివించును గాక ఆమెన్..
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...






No comments: