February Messages2018

ఆదివారము ఆరాధన BY పాస్టర్ఆనంద వరం గారు
Baptist Church Akkayyapalem  11/02/2018 
Response Reading: Psalm 144
Andhra christian songs: 21, 455, 614
ఎఫెసీయులకు 6:11-17

Topic: పోరాటం
ఎఫెసీయులకు 6:11,12మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో(మూలభాషలో-రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.

1.సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి
 నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.ఫిలిప్పీయులకు 1:27 
 
2.ధర్మ శాస్త్రమునకు విరోధముగా ఉన్న నియమముతో పోరాడాలి
 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. రోమీయులకు 7:23

3.పాపముతో పోరాడాలి
 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు.
హెబ్రీయులకు 12:4

4.పోరాడువాడు మితముగా ఉండును
 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.1కోరింథీయులకు 9:25

యాకోబు దేవునితో పోరాడాడు
అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;హోషేయా 12:4

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
 ******************************************************
ఆదివారము ఆరాధన BY పాస్టర్ఆనంద వరం గారు 
25/02/2018 Baptist Church Akkayyapalem
Topic : దేవుని మహిమ 
Response Reading: Psalm63
Andhra christian songs: 6,161,688,386
అపో.కార్యములు 12: 19-23

దేవుని మహిమకు రెండు సాదృశ్యంలు
1. దేవుని మహిమ ప్రకాశమైన వెలుగు తేజస్సు కు సూచనా
2. దేవుని మహిమ అయన గొప్పతనం అయన తీరుకు సూచనా

1.దేవుని మహిమ పరచు నిమిత్తము నరులను సృజించెను  
 నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. యెషయా 43:7

2.దేవుని మహిమ  పరచువారమై  ఉన్నాము
 యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.
యెషయా 42:8

3.దేవుని మహిమ పరచుటకు మనము చేయబడియున్నాము 
 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసము చేయగా
 జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.
 అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
అపో.కార్యములు 12:21-23

దేవుని 5 విధాలుగా మహిమ పరచువారమై  ఉన్నాము :

1. స్తుతి యాగము చేయుట ద్వారా దేవుని మహిమ పరచుట  
 స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.కీర్తనలు 50:23

2.మారు మనసు పొందుట ద్వారా దేవుని మహిమ పరచుట 
 కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, యీ తెగుళ్లమీద అధికారముగల దేవుని నామమును దూషించిరి గాని, ఆయనను మహిమ పరచునట్లు వారు మారుమనస్సు పొందినవారుకారు.ప్రకటన గ్రంథం 16:9

3.దేవుని పరిచర్య చేయుట ద్వారా దేవుని మహిమ పరచుట 
 ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్‌. 1పేతురు 4:11

4.నమ్ముట ద్వారా (విశ్వశము ) దేవుని మహిమ పరచుట 
 అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; యోహాను 11:40

5.మనము బహుగా ఫలించుట ద్వారా దేవుని మహిమ పరచుట 
 మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు. యోహాను 15:8

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్