జూన్ Messages 2017


04/06/2017 Baptist Church Akkayyapalem
సంఖ్యాకాండము 25:1-13
సంఖ్యాకాండము 25:13 అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.

ప్రకటన గ్రంథం 2:14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.

1. పాపాన్ని  ఓర్వలేకపోవుట
 ​అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,
  ​వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.
సంఖ్యాకాండము 25:10,11
 ​ దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా
1సమూయేలు 17:26
 అప్పుడు ఏలీయా-ఒకనినైన తప్పించు కొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను.
1రాజులు 18:40
 దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మర ణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మా ర్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణచేయుదును.

 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.
యెహేజ్కేలు 33:8,9
2దేవుని  విషయమందు  ఆసక్తి    కలిగియుండుట
  ​అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రా యేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
సంఖ్యాకాండము 25:13
 ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
యోహాను 2:17
 యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.
యోహాను 4:34
 మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును  మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.
హెబ్రీయులకు 6:11,12
 ​నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
1సమూయేలు 2:30
3పరిశుద్ధత  కలిగియుండుట
 మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధ మునకు పంపెను.
సంఖ్యాకాండము 31:6
 నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.
కీర్తనలు 141:2
 యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.
కీర్తనలు 15:1,2
 ***********************************************************************
18/06/2017
Baptist Church Akkayyapalem
మత్తయి 22:1-14
 స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
మత్తయి 22:12
 ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
ప్రకటన గ్రంథం 19:7
 మరియు అతడు నాతో ఈలాగు చెప్పెనుగొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.
ప్రకటన గ్రంథం 19:9
 శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణవస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
యెషయా 61:10
 మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
లూకా 1:77,78
 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
1యోహాను 1:9
 క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
గలతియులకు 3:27
 సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
యెషయా 61:3

 *******************************************************************************************

25/06/2017
Baptist Church Akkayyapalem
యెహోషువ 14:6-15
 నాతోకూడ బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము లను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితిని.
యెహోషువ 14:8
1. దేవుని వెంబడించిన కాలేబు 
 ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప
 ​మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.
సంఖ్యాకాండము 32:11,12
 సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్త మునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల
 ​నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.
ద్వితియోపదేశకాండము 30:2,3
2. కాలేబు విశ్వాసము
 ​కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యాకాండము 13:30
 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.
హెబ్రీయులకు 11:1
 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులొ స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడియున్నది.
1పేతురు 2:6
 అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారు లైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీ యులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను.
యెహోషువ 15:14
3. కాలేబు బలము
 యెహోవా చెప్పి నట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడచిన యీ నలు వది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి యున్నాడు; ఇదిగో నేనిప్పుడు ఎనబదియయిదేండ్ల వాడను.
 ​మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుండుటకు గాని నాకెప్పటియట్లు బల మున్నది.
యెహోషువ 14:10,11
 అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
రోమీయులకు 8:37