30 to 34 Lentdays2019

09/04/2019
30th సిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు 
Topic:చేదు కలిపిన ద్రాక్షారసము

మత్తయి 27:33-36
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

చదవబడిన వాక్య భాగమును గమనిస్తే యేసుప్రభువారిని సిలువ వేసి అయన తల మీద ముండ్ల కిరీటమును పెట్టి ఆయనను యూదుల రాజు అని పై విలాసమును వ్రాసి సిలువ మీద పెట్టించిన తరువాత మండుటెండలో ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగనిచ్చిరి కానీ అది చేదుగా ఉండుట వలన అయన దానిని తాగలేకపోయెను.
 
వాక్యమును బైబిల్ గ్రంధములో మార్కు సువార్తలో గమనించవచ్చు.
మార్కు 15:23 అంతట బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు.

బైబిల్ గ్రంధములో గమనిస్తే  మరియొకసారి ఆయనకు ద్రాహము వేసినపుడు రెండవసారి కూడా వారు కూడా ఆయనకు త్రాగటానికి ఇచ్చిన సందర్బము
మత్తయి  27:48 వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

చేదు అనుభవం గూర్చి మనము ఆలోచనచేస్తే

1. ద్రాక్షారసమును గూర్చి మనము ఆలోచనచేస్తే రెండుసార్లు ఆయనకు వారు చేదు కలిపిన ద్రాక్షారసమును ఇచ్చారు.
**ద్రాక్షారసము ఇశ్రాయేలీయుల ప్రజలైనవారికి విరివిగా దొరికేది కావున వారు ఎక్కువగా వాడేవారు మరియు ద్రాక్షారసము వారికీ ముఖ్యమైనది ఎందుకంటే ఇది మత్తును కలిగించే గుణం కలిగినది.

**మరియు వాక్యంలో ప్రత్యేకించి ఏమని వ్రాయబడినది అని అంటే ద్రాక్షారసము బోళము కలిపినది వారు ఖైదీలైనవారికీ ద్రాహము వేసిన వారికీ ద్రాక్షారసమును త్రాగనిచ్చేవారు.

**ఇక్కడ గమనిస్తే రెండు వ్యతిరేకమైన పదార్దములు వారు కలిపారు ఒకటి తీయని ద్రాక్షరసములో., బోళము అనే చేదును కలిపి చిరకలో ముంచి ఆయనకు ఇచ్చారు.

2. రెండవదిగా ద్రాక్షరసములో బోళము అనే చేదును కలిపి చిరకలో ముంచి ఆయనకు ఇచ్చారు.

**ఇక్కడ చిరక అనగా  (in English Vinegar) వెనిగర్ అని అర్ధం.  దీనిని ద్రాక్ష పళ్ళను బాగా కుళ్లబెట్టి దాని నుండి వచ్చిన ద్రవాన్ని చిరక అని అంటారు దానిలో బోళమును కలిపారు.

**ద్రాక్షరసమును గూర్చి పరిశీలన చేస్తే, ద్రాక్షరసమును యేసుప్రభువారికి మత్తును కలిగించుటకు అందించారు
 
3. బోళమును (Myrrh) గూర్చి మనము ఆలోచనచేస్తే  
**బోళము యొక్క మొక్క దాని జిగురు నుండి వచ్చేది బోళము.

**ఇందులో పరిమళ సువాసన ఇచ్చేవి కూడా ఉంటాయి.

**పాతనిభందనలో మందసమునకు వేసే ధూపములో కలిపే నాలుగు పదార్దాలలో బోళమును సువాసన కొరకు కలిపేవారు.

**దాని విలువ ఏమిటి అని అంటే బోళము కలిపిన రసములో శవాలను పాడవకుండా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.

**బైబిల్ గ్రంధములో ఒక పదార్థమును గూర్చి ప్రత్యేకించి వ్రాయబడినది అని అంటే పదార్దానికి ప్రాముఖ్యతకలిగినది అని అర్ధం 

4.అంతే కాకుండా మనం గమనిస్తే  పాతనిబంధన గ్రంధములో ఇది ఒక ప్రవచనాత్మకమైన నెరవేర్పు.
కీర్తనల 69:21వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.

**ఇది యేసుప్రభువారి పట్ల నెరవేరాలి అని దావీదు ద్వారా దేవుడు ప్రవచనాన్ని వ్రాయించాడు.

5.ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ప్రియులారా చేదును గూర్చి ఆలోచన చేస్తే మనకు ఒక విషయం గూర్చి గుర్తుకు వస్తుందిఅది ఏమిటి అని అంటే?

**మనకు చేదు అనేది ఒక మనిషి పడిన భాద, వేదన, నిందలు, కష్టంనకు సూచనగా ఉన్నది., అనుభవాన్ని మన జీవితంలో ఒక  చేదు అనుభవంగా మనం భావిస్తాం.
**కానీ మనం కష్టాన్ని అనుభవిస్తే దాని ఫలితం మనకు ఆశీర్వాదం కలిగి ఉంటుంది.
మన జీవితంలో ఒక చేదు అనుభవం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడు.

యేసుప్రభువారు ఇన్ని శ్రమలు భాదలు దెబ్బలు తిని, గాయాలుపడి, సిలువ చనిపోవడం చేదు అనుభవం లేక పొతే మనకు రోజున రక్షణ లేదు. **అయన మరణము ఆయనను తండ్రి కుడిపార్శమున కూర్చుండబెట్టింది.


యోసేఫు చేదు అనుభవం గూర్చి మనం గమనిస్తే 
**అయన జీవితంలో ఇటువంటి చేదు అనుభవం ఆయనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. అయన జీవితం శ్రమలతో కూడినది, అన్నదమ్ములు కొట్టిన పరిస్థితి, తరువాత ఆయనను గోతిలో పడవేసిన పరిస్థితి, తరువాత చెరసాలలో పెట్టిన పరిస్థితి నుండి దేవుడు ఆయనకు ప్రధాన అధికారిగా ఉండే గొప్పఆశీర్వాదాన్నిఆయనకు ఇచ్చాడు.

యేసుప్రభువారికి భాద వేదన అనుభవిస్తున్నప్పుడు స్వచ్ఛమైన ద్రాక్షారసమునకు బదులుగా బోళము కలిపిన ద్రాక్షారసమును చిరకలో ముంచి ఒక రెల్లుతో త్రాగడానికి ఆయనకు ఇచ్చారు కానీ అయన స్వీకరించలేక పోయారు.

మనకోసం యేసుప్రభువారు భరించిన చేదు అనుభవానికి మనం ఏమిఇచ్చి అయన ఋణం తీర్చుకోగలం.

**ప్రియులారా మన యేసయ్య ఎలాగైతే శ్రమలనుభవించి మరణము నుండి విజయం సాధించారో, మనం కూడా చేదు అనుభవాలు మన జీవితంలో వచ్చినా, ఓర్పుతో సహనంతో అయన చూపిన మార్గంలో మనం జీవించి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్


*****************************************************************

31st Lentday 2019

10/04/2019
31st సిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: అయన ప్రక్కలో బళ్లెపు పోటు

యోహాను 19:32-37
34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.

**ప్రియులారా మనం సిలువ ధ్యాన కూటములలో యేసుప్రభువారు సిలువను సమీపిస్తున్నప్పుడు అయన పడిన అనేకమైన శ్రమలగూర్చి ధ్యానించుకున్నాం.

**ఆయనను అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను కొరడాల చేత కొట్టించి బాధించడం ధ్యానించుకున్నాం.

**అయన అంగీని తీసివేసి ఆయనను అవమానపరచిన విధానం ధ్యానించుకున్నాం.

**అయన తలకు ముండ్ల కిరీటమును పెట్టి భాదించిన విధానం ధ్యానించుకున్నాం.

**ఆయనకు ద్రాహమునకు చేదును కలిపిన ద్రాక్షారసమును ఇచ్చిన విధానమును ధ్యానించుకున్నాం.

**చదవబడిన వాక్య భాగములో యేసుప్రభువారితోకూడ సిలువవేయబడిన ఇద్దరి దొంగల కాళ్లను రోమా సైనికులు విరుగగొట్టిరి..

లేఖనం ఏమి చెప్తుందంటే కానీ యేసుప్రభువారి ఎముకలలో ఒక్కటైనా విరవబడదు.

యోహాను 19:36
అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
  
** రోమా సైనికులు అతి కఠినమైన వారు. వారి ఆలోచన విధానం చాల భయంకరమైనటువంటిది.

**వారు అయనను ప్రక్కలో బల్లెముతో పొడిచారు అప్పుడు నీరును రక్తమును అయన శరీరము నుండి వచ్చెను

1.యేసుప్రభువారిని ఈవిధంగా ప్రక్కలో పొడుచుటను గూర్చి మనం ఆలోచన చేస్తే

ఇది ఎందుకు జరిగింది అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే

**మన పాపపు జీవితానికి సాదృశ్యంగా యేసుప్రభువారికి ప్రక్కలో బళ్లెముతో పొడుచుట జరిగింది.

**ఎందుకు అని అంటే మన తలంపులలో చెడు ఆలోచనలు కలిగి చెడ్డ మనస్సు కలిగి ఉండుట ద్వారా యేసుప్రభువారికి ముండ్ల కిరీటం పెట్టబడింది.

**ఎందుకు అని అంటే మన చేతులతో పాపపు క్రియలు చేయటంవలన అయన చేతులకు శిలలు కొట్టబడినవి.

**ఎందుకు అని అంటే మన పాదములు పాపము చేయుటకు పరుగులిడుచుండుట వలన అయన పాదములకు మేకులు కొట్టబడినవి.

**ఎందుకు అని అంటే మనలో ఉన్న కుళ్ళు, అసూయా, ద్వేషమునకు గుర్తుగా అయన ప్రక్కలో బళ్లెముతో పొడవబడ్డారు

ప్రఖ్యాత దైవసేవకులు బిల్లీ గ్రహంగారు వ్రాసిన మనుష్యులను సులువుగా చిక్కులు పెట్టునవి ఏడు పాపములు అను పుస్తకంలో మనం కనుక గమనిస్తే వాటిలో ముఖ్యమైన వాటిలో అసూయా ప్రధానమైనది అని వ్రాయబడినది.

2.మానవుని అసూయా, పగ, ద్వేషం ఇవన్నీఅయన ప్రక్కలో పొడవబడిన బళ్లెపు పోటునకు సూచనగా ఉన్నది.

మనలో అటువంటి పాపపు క్రియలైన అసూయా, ద్వేషం, మనం కలిగి ఉంటె వాటిని విడిచిపెట్టాలి, ఎందుకంటే మన పాపమును బట్టి అయన ప్రక్కలో బళ్లెముతో పొడవబడినది.


3. బళ్లెము పోటు గూర్చి ఆలోచన చేస్తే 

బళ్లెము ఇది చాల ప్రమాదమైనది. మొదటిలో వాటిని రాతితో సూదిగా తయారుచేసేవారు, తరువాత ఇనుముతో తయారుచేసారు

వెన్నుపోటు గూర్చి ఆలోచన చేస్తే

మనం యేసుప్రభువారికి వెన్నుపోటు పొడిచే బిడ్డలుగా ఉండరాదు. మనం గమనిస్తే ఇస్కరియోతు యూదా అలాగే యేసుప్రభువారికి వెన్నుపోటు పొడిచాడు, అందుకు భయంకరమైన శాపాన్నిఅనుభవించాడు.


4.ఆయనను పొడిచినపుడు రక్తము నీరు కారినవి ఆయనలో ఆఖరి రక్తపు బొట్టు లేకుండా ఉన్న స్థితి, జరిగిన సంఘటన మనకు ఏమి నేర్పుతుంది, మనకు ఏమి కలుగుతుంది అని దేవుని వాక్యమును గమనిస్తే

1 యోహాను1:6-8
 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.

ఎందుకు అని ఆంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.

అంతే కాకుండా పేతురు భక్తుడు మాటలను మనం గమనిస్తే

1 పేతురు1:1-19
పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని
19 అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా.

**బానిసలైన వారిని వెండి నాణెములతో విమోచింబడితే మనమైతే యేసుప్రభువారి అమూల్యమైన రక్తముచేత విమోచింపబడితిమి.

**ఎందుకు రక్తము అమూల్యమైనది అని ఆంటే అది నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తము.


5.మనము ఎలా విమోచింపబడాతాము అని ఆంటే

**ప్రియులారా అయన బిడ్డలం అని చెప్పుకొని ఆయనకు అవమానం తెచ్చేవి ఏమైనా ఉంటె వాటిని వదిలిపెట్టాలి. మనకు యేసుప్రభువారి కంటే ఏది ఎక్కువకాకూడదు.

**మన పాపములను అయన ముందు ఒప్పుకొని అయనలో జీవిస్తే అయన మనలను పవిత్రులుగా చేసి అయన రక్తముతో విమోచిస్తారు.


యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
**************************************************************

11/04/2019
32nd సిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య శ్రీ I.భక్తవిజయంగారు

మార్కు16:1-8
మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.

చదవబడిన వాక్యంలో యేసుప్రభువారు సమాధి చేయబడిన తరువాత విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు తీసుకొని అయన సమాధి వద్దకు రాగా అక్కడ రాయి పొర్లింపబడి యుండుట చూచిరి.

**అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.

**అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు,కనుక  మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను.

**ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు దేవదూత పేతురుతో యేసుప్రభువారి పునరుద్ధానమును గూర్చి చెప్పమని చెప్పెనని మనం ఆలోచన చేస్తే

మొదటిగా యేసుప్రభువారిలో  పేతురు యొక్క పడిపోయిన స్థితిని మనం గమనిస్తే

1.పేతురు తన సొంతబలమును నమ్ముకొనినట్లుగా వాక్యంలో చూడవచ్చు

మార్కు14:29-31
అందుకు పేతురుఅందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
30 యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

**ఇక్కడ వాక్యంలో పేతురు తన సొంతబలమును గూర్చి అతిశయించినపుడు ప్రభువారు అతనికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు

2.శోధనలో తన ఆత్మీయస్థితిలో పడిపోయిన పేతురు

మార్కు14:38-40
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి
39 తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.
40 ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి;

**యేసుప్రభువారు గెత్సమనే తోటలో పేతురును శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్ధనలో గడపమన్నపుడు పేతురు నిద్రించుట తన పడిపోయిన ఆత్మీయ స్థితిని గూర్చి చెప్తుంది.

**సైనికుని చెవిని నరికివేయుట అతని పడిపోయిన స్థితిని గూర్చి చెప్తుంది
యేసయ్య కొరకు చెరసాలకైనా పోవుదునని చెప్పిన పేతురు చివరికి యేసుప్రభువారిని ఎరుగనని ముమ్మారు రోమా సైనికులకు భయపడి పలికినపుడు పేతురు యొక్క పడిపోయిన స్థితి మనం చూడవచ్చు.

అటువంటి ఆత్మీయ స్థితిలో పడిపోయిన పేతురును యేసుప్రభువారు క్షమించి ఆత్మీయ స్థితిలో పైకి నడిపించినట్లు మనం గమనించవచ్చు

**పేతురు ద్వారా నా సంఘమును కట్టుదును అని యేసుప్రభువారు చెప్పినట్లుగా తరువాత పరిశుద్దాత్మ సహాయముతో పేతురు అనేక మందిని మారుమనస్సు కలిగించుట అనేకమైన ఆశ్చర్య, అద్భుతకార్యములు చేసిన పేతురును దేవుని వాక్యంలో మనం చూడవచ్చు

3.మూడువేల మంది మారుమనస్సు పొందేలా పేతురు చేసిన గొప్ప ప్రసంగము మనం చూడవచ్చు.

అపొస్తలుల కార్యములు 2:14-36

**ఇక్కడ పేతురు యావేలు ప్రవక్త మరియు దావీదు భక్తుని మాటల ద్వారా చేసిన గొప్ప ప్రసంగమును మనం చూడవచ్చు

ప్రసంగము వినిన వారు పేతురు ద్వారా మూడువేలమంది మారుమనస్సు పొందిరి అటువంటి అద్భుతమైన జ్ఞానమును పరిశుద్దాత్మ అను వరమును యేసయ్య పేతురుకు ఇచ్చారు

అపొస్తలుల కార్యములు 2:41
41 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.


4.పేతురు చేసిన నాలుగు అద్భుతకార్యములను గూర్చి ఆలోచన చేస్తే

**పక్షవాయువు గల ఐనెయ అను ఒక మనుష్యుని స్వస్థపరచుట.
అపొస్తలుల కార్యములు9:33-34
అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,
34 పేతురుఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను.

**చనిపోయిన తాభిత అను ఒక శిష్యురాలును తిరిగి బ్రతికించి అద్భుతము చేసిన పేతురు
అపొస్తలుల కార్యములు 9:36-40
40పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగితబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.

**కుంటివానిని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తి అతనిని కుంటి తనమును బాగుచేసిన పేతురు
అపొస్తలుల కార్యములు 3:1-7
అంతట పేతురువెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి
7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.

**తన నీడతో అనేకమైన రోగులను స్వస్థతనిచ్చిన పేతురు
అపొస్తలుల కార్యములు5:15-16
అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.
16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి। వారందరు స్వస్థత పొందిరి.

**అటువంటి గొప్పకార్యములు యేసయ్య పేతురు ద్వారా చేసారు.

**ఇటువంటి ఆశ్చర్య అద్భుతకార్యములు కేవలం ప్రార్ధన శక్తి వలననే కలుగుతాయి.

**మనం కొన్ని వెంటనే పొందుకోలేకపాయినా విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు సరైన సమయంలో మనకు అవి అనుగ్రహిస్తాడు.

**మనకు అనేకమైన కష్టములు వచ్చిన విశ్వాసంతో ప్రార్ధించాలి, విశ్వాసం ద్వారా బలపడాలి.

**విశ్వాసం ప్రధానమైనది, అటువంటి గొప్ప విశ్వాసం శక్తి దేవుని వాక్యంలో ఉన్నది.

**దేవుని వాక్యము బలమైనది, అటువంటి దేవుని వాక్యము ద్వారా ఆశ్చర్యఅద్భుత కార్యములు మనం చూడగలం.

దేవుడు పేతురు ద్వారా తన సంఘమును కట్టుదునని చెప్పిన రీతిగా ఆయనను అనేక రీతులుగా దేవుని చేత వాడబడ్డాడు.

పేతురు వంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండేటట్లుగా దేవుడు మన అందరిని దీవించాలి.


యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

***************************************************************
12/04/2019
33rdసిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: హిస్సోపు

మత్తయి 27:33-37
చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.

యేసుప్రభువారు పడిన సిలువ శ్రమలో అయన ద్రాహము గొనిన సంధర్బములో  రెండుసార్లు అయనకు  దాహము వేసినపుడు చేదు కలిపిన ద్రాక్షారసమును ఇచ్చారు అందులో బోళము కలిపి ఒక హిస్సోపు పుడకను రెల్లుకు తగిలించి యేసుప్రభువారికి త్రాగనిచ్చారు.  
 
ఈబోళమును గూర్చి ఏవిధంగా ఉపయోగపడుతుందో మనం అనేక విషయములు ధ్యానించుకున్నాం. ఈబోళమును శరీరములను సుమారు డబ్భై సంవత్సరములు పాడవకుండా చేసే శక్తి కలిగినది. ఈబోళమును సుఘంధద్రవ్యములలో కలిపేది మరియు అనేక ఆరోగ్యకరమైన గుణము కలిగినది.

 
చదవబడిన వాక్యంలో పరిశుద్ధ గ్రంధములో హిస్సోపును గూర్చి ధ్యానిద్దాం.

1. హిస్సోపు విషయాన్నీ ఒక్కసారి గమనిస్తే 
యోహాను  19:29
చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.

**ఒక హిస్సోపు పుడకను రెల్లుకు తగిలించి యేసుప్రభువారికి త్రాగనిచ్చారు

2.మరి పాతనిభంధన గ్రంధములో పాపమునకు పరిహారము హిస్సోపుతో ఎలా జరిగేది మనం గమనిస్తే

హిస్సోపును గూర్చి దావీదు గారు పలికిన మాటలను మనం గమనిస్తే
కీర్తనల గ్రంథము 51:7
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము  హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.

**దావీదు గారు ఇక్కడ పాపం పరిహారమవడానికి హిస్సోపు గూర్చి చెప్తున్నట్లు మనం గమనించవచ్చు.

3.ఎందుకు దావీదు హిస్సోపుతో పాపము నుండి పవిత్రత పొందటానికి చెప్తున్నాడో బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే

లేవీయకాండము 14:4
యాజకుడు పవి త్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.

రక్తమును తీసుకొని హిస్సోపు ద్వారా ఎలా రాయాలి అని తెలియజేస్తున్నారు.
నిర్గమకాండము 12:22 మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.

**ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలుగుటకు గొర్రెను వధించి దాని రక్తమును ఒక పళ్ళెములో తీసుకొని నిలువు కమ్మీలకు హిస్సోపు కుంచె తీసుకొని రాయాలి.

**ఇశ్రాయేలు ప్రజలకు రక్తము ద్వారా విడుదల కలిగినది, కానీ విడుదల హిస్సోపు ద్వారా కలిగింది


4.సొలొమోను మహాజ్ఞాని హిస్సోపును గూర్చి ఒక చక్కటి వచనము చెప్తున్నట్లు మనం బైబిల్ గ్రంధమును చుస్తే
 
1రాజులు 4:33 మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలోనుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాటి నన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను.

** హిస్సోపు పవిత్రత చాల గొప్పది

**ఇశ్రాయేలీయులకు హిస్సోపు ద్వారా విడుదల కలుగుతుంది

**అలాగే ఎవరైతే పవిత్రత పొందగోరుచున్నారో వారిని గొర్రెపిల్ల రక్తముతో యాజకులు హిస్సోపుతో పవిత్రపరుస్తారు. 

5. హిస్సోపును గూర్చి మనం నూతన నిబంధన గ్రంధములో గమనిస్తే

**యేసుప్రభువారుకూడా మనకొరకు శ్రమపడి నలుగ గొట్టబడి అయన రక్తమును చిందించారు.
అక్కడ ఒక పాత్ర సిద్ధపరచబడినది, పాత్ర  చేదు కలిపిన బోళము కలిపిన ద్రాక్షారసమును హిస్సోపుతో ఇస్తున్నారు

 6. హిస్సోపును గూర్చి గమనిస్తే
 
** హిస్సోపుకు బైబిల్ గ్రంధములో చాల ప్రాముఖ్యతను ఇచ్చారు.
 
** హిస్సోపు పవిత్రంగా ఉన్న ఒక చిన్న మొక్క.

** హిస్సోపు మొక్క ఇంచు మించు రెండు నుండి మూడు అడుగులు పెరుగుతుంది.

** హిస్సోపులో నాలుగు నుండి ఐదు రకములు ఉన్నాయి.

** హిస్సోపు ద్వారా చాల ఆరోగ్యకరమైనదిగా ఉన్నది.

** హిస్సోపు దీనిని వైద్యపరంగా ఉపయోగిస్తారు

హిస్సోపు ద్వారా పాపము పవిత్రపరచబడినట్లుగా మనం యేసుప్రభువారి ద్వారా పాపమునుండి విడుదల కలిగివుండాలి.
   
యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

********************************************************************

13/04/2019
34th సిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య శ్రీ వీర్ల సంజీవరావు గారు

ప్రకటన గ్రంథము 5:9-10
పెద్దలునీవు గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

ప్రకటన గ్రంధము మొదట పాత బైబిల్ గ్రంధములో దేవుని ప్రత్యక్షత అని వ్రాయబడినది.

**పద్మాసు ద్విపములో యోహాను ఉన్నపుడు యేసుప్రభువారు ప్రత్యక్షమై ఒక గ్రంధమును వ్రాయిస్తాను అని చెప్పేను ఇది జరగబోయినటువంటి సంఘటనలను గూర్చి ప్రకటనగ్రంధము యేసుప్రభువారు వ్రాయించినది.


1.ఏమిటి  యోహాను ప్రత్యక్షత,   సందర్భములో ప్రకటన గ్రంధము వ్రాయబడినది అని అంటే 

ప్రకటన గ్రంథము 4:1
1 సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను.

తరువాత జరిగిన ఒక సంఘటనను గూర్చి యోహాను గారు వివరిస్తున్నారు.

ప్రకటన గ్రంథము 5:1-7
1 మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహా సనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
3 అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.

** గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గరగా అడుగగా గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున యోహాను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు ఏడువకుము

**ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును నాలుగు జీవులు, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల, గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములునుండెను.

2. నాలుగు జీవులు,గొఱ్ఱపిల్ల, ఏడుకొమ్ములు గూర్చి బైబిల్ గ్రంధములో పరిశీలన చేస్తే

ప్రకటన గ్రంథము 4:7
 మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది;మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.

** గొఱ్ఱపిల్లకు ఏడుకొమ్ములు ఉన్నవి కొమ్ములు ఒక మనుష్యుని సూచిస్తున్నాయి

**యూదా గోత్రపు సింహము వదకుతేబడిన గొఱ్ఱపిల్ల మన యేసుప్రభువారు


3. కొమ్ములను గూర్చి మనం ఆలోచన చేస్తే

ద్వితీయోపదేశకాండము 33:17
అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.


4. ఏడు లక్షణములను గూర్చి మనం ఆలోచన చేస్తే

ఏడుకొమ్ములు యేసుప్రభువారికున్న ఏడు లక్షణములను సూచిస్తున్నాయి.

కీర్తనల గ్రంథము 89:17-18
17 వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
18 మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.


5. కొమ్ములు ఇవి ఏమిటి సూచిస్తున్నాయి

జెకర్యా అధ్యాయం 1:18-19
అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కన బడెను.
19 ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడు చున్న దూతనడుగగా అతడు ఇవి యూదావారిని ఇశ్రా యేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.

 
** కొమ్ములు యేసుప్రభువారి దైవలక్షణములు, అధికారము,యోగ్యతను సూచిస్తున్నాయి.

7. యోగ్యత పొందుకోవటానికి కారణం, యేసుప్రభువారు భూలోకంలో ఏమిచ్చి పరలోకంలో యోగ్యత పొందుకున్నారు దేవుని వాక్యమును గమనిస్తే 

**అట్లాంటి యోగ్యత యేసుప్రభువారికి ఎలా వచ్చింది మనం ఆలోచన చేస్తే

**అయన వధింపబడినవాడవై తన స్వరక్తమిచ్చి యోగ్యత కలిగి ఉన్నారు.

వధకు తేబడు గొఱ్ఱపిల్లగా మౌనముగా యోగ్యత పొందుకున్నారు.

యెషయా గ్రంథము 53:7
7 అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనుసరించి దుష్టులచేత సిలువ వేయబడి
యోగ్యత పొందుకున్నారు.
 
అపొస్తలుల కార్యములు 2:23
23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.

**మన పాపములను మోసి అటువంటి గొప్ప యోగ్యత యేసుప్రభువారికి కలిగింది.
అపొస్తలుల కార్యములు 3:15
15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము

8.ఎలా యేసుప్రభువారు యోగ్యత కలిగి ఉన్నారు.

మత్తయి 20:28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకు లకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

9.ఇప్పడు మనం ఏమి చేయవలసి ఉన్నది.

అపొస్తలుల కార్యములు 20:28
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

1 కొరింథీయులకు 6:20
20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.