Baptist Field Council 24Feb2019




FIRST MONTHLY MEETING
(THANKS GIVING)
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యసందేశం పాస్టర్ M.ఆనంద వరం గారు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 81,521.

కీర్తనల గ్రంథము 133:1-3
1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
2
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
3
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు

**సంఘము అంటే కూడి ఉండుట అని అర్ధం.
**సంఘముగా ఉండుటకు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి.
**ప్రత్యేకించి క్రైస్తవ సంఘమునకు చాల ప్రాముఖ్యం కలిగిఉంది
**యేసు ప్రభువారి కి సంఘము పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నది.

1.మొదటిగా సంఘము పరిశుద్ధముగా ఉండాలి
**సంఘము యేసు ప్రభువారి ఉద్దేశము నెరవేర్చువారీగా ఉండాలి
సంఘము పట్ల దేవుని ఉద్దేశము ఏమిటి అని పరిశీలిస్తే
ఎఫెసీయులకు 5:27
27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
**సంఘము అపవిత్రత కళంకము లేనిదిగా ఉండాలి.
**సంఘము దేవుని ప్రణాళిక నెరవేర్చునదిగా ఉండాలి
యేసు ప్రభువారు పరిశుద్ధ సంఘముగా ఉండుటకు అయన ఏమి చేసారు?
యేసు ప్రభువారు మన కొరకు సంఘము కొరకు తనను తాను తగ్గించుకొన్నారు

2.రెండవదిగా మహిమగల సంఘముగా తండ్రి ఎదుట నిలబెట్టాలి.
**సంఘము మహిమ కలిగిన సంఘముగా ఉండాలని అయన ప్రణాళిక.
***సంఘము ఎంతో ప్రకాశించే సంఘముగా ఉండాలని అయన ప్రణాళిక
***సంఘము పరిమళ తైలమువలె ఉండాలని అయన ప్రణాళిక.
కీర్తనల గ్రంథము 133:2
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును

3.మూడవదిగా సంఘములో ప్రేమ కలిగి ఉండాలి.
**సంఘములో ఒకరిపట్ల ఒకరికి ప్రేమానుభవము కలిగి ఉండాలి.

4.సంఘములో తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి.
**తగ్గింపు కలిగి సంఘము ఒక మాదిరికరముగా ఉండాలి.
**ప్రాముఖ్యముగా ఐక్యత సంఘములో ఉండాలి.
కీర్తనల గ్రంథము 133:1-3
1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము. 

5.సువార్త చేయుట అనేది సంఘములో జరగాలి.
**సంఘముగా దేవుని సువార్త ప్రకటించుటలో ఆశక్తి కలిగి ఉండాలి.

ఆశీర్వాదమును శాశ్వత జీవమును సంఘములోనుండవలెనని అయన కృప మన అందరికి ఇవ్వాలని ఆశిస్తూ..  
దేవుడు మాటలను దీవించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక.