September2019 Messages





1Sep2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

అపొస్తలుల కార్యములు 2:37-42
38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు

చదవబడిన వాక్యభాగములోని సందర్బమును మనము గమనిస్తే, క్రి 34సం. కాలంలో పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు పేతురును ఇంచుమించు 120 మంది ఒకచోట కూడియుండి దేవుని స్తుతిస్తూ ఉండగా అప్పుడు పేతురు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను., 

వారు మాట విని హృదయములో నొచ్చుకొని పేతురు సెలవిచ్చిన రీతిగా మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అని భోదిస్తుండగా అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడినట్లు దేవుని వాక్యము మనకు భోదిస్తుంది.

దేవుని వాక్యం నుండి ఈరోజు మనం నేర్చుకోవలసినది ఏమిటో మనం ఈరోజు ధ్యానిదాం

1.మొదటిగా మనం మారుమనస్సు అనుభవం కలిగిఉండాలి

ఈరోజున మనం మారుమనస్సు కలిగిఉంటున్నామా, మారుమనస్సు లేకపొతే వారిలో పాపపు క్రియలు కనిపిస్తాయి.

క్రైస్తవులుగా మారుమనస్సు లేని క్రియలు ఉంటె మనం ఇప్పటికి క్రీస్తును గాయపరుస్తున్నట్లే, కావున మారుమనస్సు అనుభవం మనం కలిగిఉండాలి, అప్పుడే మారుమనస్సు యొక్క ఫలములు మనలో కనిపిస్తాయి.

2.రెండవదిగా పాపక్షమాపణ అనుభవం కలిగి పరిశుద్దాత్మ అను వరం పొందుకోవాలి

మనకు పాపక్షమాపణ కలిగి ఉండాలి అంటే మనకు పశ్చాతాపం కావాలి, కన్నీటి ప్రార్ధన అనుభవం ఉండాలి,అటువంటి పాపక్షమాపణ మనం కలిగి ఉన్నామా మనలను మనం పరిశీలించుకోవాలి.

పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం తీసుకొని పశ్చాతాపం కలిగిఉంటేనే మనకు పరిశుద్దాత్మ అను వరం పొందుకుంటాము, పరిశుద్దాత్మతో నింపబడినప్పుడు మనం సర్వ సత్యంలోనికి వెళ్తాము, దేవుని వాగ్దానము పొందుకుంటాము.

3.మూడవదిగా మూర్ఖులగు తరమువారికి వేరై రక్షణపొందాలి.
 
అపొస్తలుల కార్యములు 2:40
40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.

ఎవరు మూర్ఖులు అని ఆలోచిస్తే మాట పెడచెవిని పెట్టువాడు, చెప్పిన మాట విని ప్రకారం చేయని వారిని మూర్ఖులుగా పిలుస్తారు.

ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుడు ఎన్ని అద్భుతములు చేసిన దేవుని మరచిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంధములో మనం గమనించవచ్చు   
 
యెషయా 6:9 
ఆయననీవు పోయి యీ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు; నిత్యము చూచుచుందురు గాని తెలిసికొనకుందురు.

మనమైతే మూర్ఖులగు తరమువారికి వేరైఉండాలి ఎందుకు అని అంటే మనం అభిషేకింబడినవారము, విలువ పెట్టి కొనబడినవారము, దేవుని బిడ్డలము కావున మనము మూర్ఖులగు తరమువారికి వేరై రక్షణపొందాలి.

4.నాల్గవదిగా అపొస్తలుల బోధయందు ఉండాలి.
 
అపొస్తలుల కార్యములు 2:42
42 వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

 **మనము నిత్యమూ దేవుని వాక్యము యందు ఆశక్తి కలిగి ఉండాలి.
 
**మనం దేవుని బిడ్డలుగా సహవాసము కలిగి ఉండాలి.
 
**రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకఉండాలి.

యేసయ్య మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
******************************************************************
08Sep2019 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 

అపొస్తలు కార్యములు 4:18-22
19 అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;

చదవబడిన వాక్యభాగములో ఇక్కడ పేతురు పరిసయ్యలైన వారితో ధైర్యముగా మాట్లాడుతున్న సందర్భమును గూర్చి మనకు వివరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు

1.అసలు పేతురు ఇంతగా ధైర్యముతో దేవుని మాటలు బోధించడానికి, హెచ్చరించాడనికి కారణం ఏమిటో మనం గమనిస్తే.

యేసుప్రభువారు పేతురును ఉద్దేశించి చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసికొంటే, పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారులు పలుకుదువని చెప్పారు, అంటే కాకుండా o మీద నా సంఘమును కట్టుదువు అని పేతురును ఉద్దేశించి చెప్పిన మాటలను బట్టి పేతురును దైర్యం ఎక్కడినుంచి వచ్చిందో కారణం మనకు తెలుస్తుంది.


2.యేసుప్రభువారు చెప్పినట్లుగా పేతురు యుధులైనవారిని ఎదిరించి ధైర్యముగా దేవుని వాక్యమును వారికీ భోదించినట్లు సందర్బమును కనుక గమనిస్తే

యొక్క సందర్బమును మనం కనుక గమనిస్తే పేతురు మరియు యోహాను శృంగారమను దేవుని మందిరము లోనికి వెళ్లుచుండగా దేవాలయపు ద్వారమునొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొకడు వారిని చూచి భిక్షమడుగగా అప్పుడు పేతురు మా దగ్గర ఏమియును లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను, వాడు నడుచుచు దేవుని మహిమకు సాక్షిగా దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

అప్పుడు వారిని చూసి పేతురు మీరు అప్పగించిన సిలువవేసిన యేసుప్రభువారి నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి పూర్ణస్వస్థత కలుగజేసెను, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి అని పేతురు వారికి బోధించెను.

అప్పుడు యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును, వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరు త్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొనిరి.


3.మరునాడు ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువుల మధ్యను వారు పేతురును యోహానును నిలువబెట్టి మీరు బలముచేత నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా   

మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు, మరి ఎవనివలనను రక్షణ కలుగదు; నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి నామమున రక్షణ పొందలేము అనెను.

అప్పుడు వారు పేతురుతో మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి,అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;


4.ఇక్కడ పరిసయ్యులైన వారి ఆలోచన విధానం ఎలాఉన్నది, పేతురు యొక్క ఆలోచన విధానం ఉన్నది అని మనం ఆలోచిస్తే మనకు రెండు విషయములు అర్ధం అవుతాయి.

మొదటిగా ఇక్కడ ఎవరి మాట వినాలి.
 ఏది గొప్ప దేవుని మాట గొప్ప , మనుష్యుల మాట గొప్ప మనము దేవుని మాట వినేవారిగా ఉండాలి.

రెండవదిగా మనం ఎవరిని సంతోషపెట్టువారిగా ఉండాలి.
మనుష్యులను సంతోషపెట్టువారిగా కాకుండా దేవుని సంతోషపెట్టువారిగా ఉండాలి.


అపొస్తలుడైన పౌలు గారు పలికిన దేవుని వాక్యమును మనం గమనిస్తే 
గలతీయులకు 1:10
10 ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.


యిర్మీయా భక్తుడు దేవుని వాక్యమును గూర్చి పలికిన మాటలను మనం గమనిస్తే
యిర్మీయా 20:9
9 ​​ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృద యములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.

5.అనేకులు యేసుప్రభువారిని గూర్చి తెలుసు కోవడానికి మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలి?

మనం దేవుని సువార్తను ప్రకటించు వారీగా ఉండాలి
1 కొరింథీ9:16
16 నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

దేవుని మాట విను వారీగా, దేవుని కొరకు జీవించే వారీగా, అనేకులు యేసుప్రభువారిని గూర్చి తెలుసు కోవడానికి మనము దేవుని గూర్చి ప్రకటించువారిగా, దేవుని కొరకు సాక్షిగా ఉండేవారిగా యేసును కలిగి అయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, అట్టి కృప యేసయ్య మన అందరికి అందించును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
***********************************************************

15Sep2019 BSI Sunday
బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా 
ఆదివారం ఆరాధన  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య పాస్టర్ Rev. S.కిరణ్ కుమార్ గారు

2 తిమోతికి 1:13-18
14 నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము.

చదవబడిన వాక్యభాగము అపొస్తలుడైన పౌలు గారు రోమా చెరలో ఖైదీగా ఉన్నప్పుడు తిమోతికి వ్రాసిన పత్రిక.ఈ పత్రికను అందుకే వీడ్కోలు పత్రిక అని భక్తులైన వారు పిలుస్తూఉంటారు.ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్యలో అందరు అతనిని విడిచిపోయి, దేవుని పరిచర్యలో అపొస్తలుడైన పౌలు గారికి అడ్డంకిగా ఉన్నవారిని గూర్చి ప్రత్యేకించి పత్రికలో ప్రస్తావించడం జరిగింది. ఈ పత్రిక నుండి మనం తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసిన అంశములను గూర్చి మనం రోజు ధ్యానించుకుందాం.

పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అతనిని విడిచిపోయిన వారిని గూర్చి ప్రస్తావించారు, సత్యము నుండి వెనుదిరిగినవారిని గూర్చి ప్రస్తావించారు, ఇహలోకమును ప్రేమించు వారిని గూర్చి , అతనిని దేవునిని పరిచర్యలో ఎదిరించువారిని గూర్చి, అతనికి కీడును తలపెట్టిన వారిని గూర్చి ప్రస్తావించారు అటువంటి స్థితిలో మనం ఉండరాదని పౌలు గారు మనకు చెప్తున్నారు.

 
1. రోజున మనం ఎలాంటి ఇబ్బంది పరిస్థితులలో ఉన్న మనుష్యులను బట్టి కాకుండా దేవుని బట్టి దైర్యం తెచ్చుకోవలసినవారమై ఉన్నాము.,

పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు అతనిని విడిచిపోయిన వారిని గూర్చి ప్రస్తావించారు.,
అందరు మనలను విడిచిపెట్టిన సందర్భం వచ్చిన, మనం దేవుని బట్టి దైర్యం తెచ్చుకోవాలి .,
అని పౌలుగారు మనకు చెప్తున్నారు.

2 తిమోతికి 4:15-16
 ఆసియలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీ వెరుగుదువు; వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువా రున్నారు.

ఇటువంటి పరిస్థితి దావీదు గారికి కూడా వచ్చినట్లు మనకు తెలుసు, దావీదును ఒంటరి చేసి ఆయనపై రాళ్ళూ రువ్వి ఆయనను చంపుటకు వారు ప్రయత్నించినపుడు దావీదు మనుష్యులను బట్టి కాకుండా దేవుని బట్టి దైర్యం తెచ్చుకొనినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం.

ఎప్పుడైతే పౌలు గారు ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారో అప్పుడు పౌలు గారిని అందరు విడిచినట్లుగా మనం దేవుని వాక్యం ద్వారా మనం చూడవచ్చు, పౌలు గారు కూడా అందరు ఆయనను విడిచిన తన దేవుడైన ప్రభువారిని బట్టి దైర్యం తెచ్చుకున్నారు.

అన్ని సవ్యంగా జరిగినపుడు దేవునికి స్త్రోత్రం చెప్తాం, కానీ శ్రమలు కలిగినపుడు క్రుంగిపోతాము మనం వెనుదిరిగిపోతాము, మనమైతే ఎటువంటి ఇబ్బందులు వచ్చిన ఎవరు నమ్మదగని వారైనా సరే మనము దేవుని విడిచిపెట్టకూడదు ,సంఘమును విడిచిపెట్టకుడదు.

రోజున మనం ఎలాంటి ఇబ్బంది పరిస్థితులలో ఉన్న మనుష్యులను బట్టి కాకుండా దేవుని బట్టి దైర్యం తెచ్చుకోవలసినవారమై ఉన్నాము.

మనము దేవుని పరిచర్యలో, సంఘములో, సమాజంలో నమ్మకంగా ఉండాలి.
 

2.రెండవదిగ సత్యము నుండి వెనుతిరుగకూడదు.

సత్యమును నుండి తప్పిపోయినవారు విశ్వాసమును చెరుపువారు.,
పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు సత్యము నుండి వెనుదిరిగినవారిని గూర్చి ప్రస్తావించారు.

2 తిమోతికి 2:18
18 వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాస మును చెరుపుచున్నారు.

సత్యమును నుండి వెనుదిరుగు వారిని ఉద్దేశించి పౌలుగారు చెప్తున్నారు, అనేకమైన తప్పుడు సిద్ధాంతములలో,తప్పుడు భోధలలో మనం వెళ్ళకూడదు అని పౌలు గారు మనకు వాక్యము నుండి మనకు బోధిస్తున్నారు.
 
దేవుని వాక్యము అవునంటే అవును కాదంటే కాదు, దేవుని వాక్యము నుండి వెనుదిరగరాదు, వాక్యానుసారంగా జీవించాలి.


3.మూడవదిగ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఇహలోక స్నేహమును ప్రేమించువారిగా ఉండకూడదు. అని వారిని గూర్చి ప్రస్తావించారు.
2 తిమోతికి 4:9-10
10 దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి

ఇహలోకమును ప్రేమించువారిగా ఉండరాదు అని పౌలు గారు వారిని ఉద్దేశించి పత్రికలో మనకు చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు,

మనమైతే దేవుని బట్టి గర్హించాలి ఎందుకు అని అంటే మన దేవుడైన సైన్యములకు అధిపతియిన యెహోవా పరిశుద్దుడు అందుకని మనం ఆయనను ప్రేమించువారిగా ఉండాలి


4.నాల్గవదిగా ఎదిరించువారిగా ఉండరాదు అని వారిని గూర్చి ,ఇక్కడ పౌలుగారు మనకు చెప్తున్నారు.
2 తిమోతికి 3:7-8
8 యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎది రింతురు.

ఎదిరించిన వారినిగూర్చి ఇక్కడ పౌలుగారు మనకు చెప్తున్నారు అటువంటి స్థాయిలో స్థితిలో మనం ఉండకూడదు, మనం దేవుని యందు విశ్వాస భ్రష్టులుగా ఉండరాదు.
   
 5.ఐదవదిగా కీడుచేయువారిగా ఉండరాదు, అని వారిని గూర్చి పౌలుగారు మనకు చెప్తున్నారు.
2 తిమోతికి 4:14
14 అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫల మిచ్చును;
కీడు చేయువారిని గూర్చి జాగ్రత్తగా ఉండుమని పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తాం.

మనమైతే కీడుచేయువారిగా ఉండరాదు, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుడు మెచ్చు విధంగా జీవించాలి.భళా మంచి దాసుడా అనేవిధంగా అందరు, దేవుని దృష్టికి మెచ్చు వారీగా ఉండాలని అందరు విడిచిన మన దేవుని బట్టి దైర్యం తెచ్చుకొని, సత్యమును కలిగి ఇహలోకమును స్నేహించకుండా, కీడును చేయువారీగా కాకుండా సంఘమును ప్రేమించు వారీగా ఉండాలని అట్టి కృప మన అందరికి దేవుడు మన ప్రభువైన యేసుప్రభువారు అందరికి ఇవ్వాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..
**************************************************************





22Sep2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.మానుకొండ ఆనందవరంగారు

అపొస్తలుల కార్యములు 27:22-25
23 నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచిపౌలా, భయపడకుము;
**చదవబడిన వాక్యభాగములో , అపొస్తలుడైన పౌలు గారు మరియు శతాధిపతి మరియు  సైనికులు, కొంతమంది ఖైదీలు ఇంచుమించు 276మంది., 186అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, కలిగిన వానిజ్యపు సామాగ్రి, ఆహారపు సామాగ్రిని వారితో కలిసి తీసుకోని ఒక ఓడలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అక్కడ జరిగిన ఒక భయంకరమైన సంఘటన గూర్చి మనం చూస్తున్నాం.

1. సంఘటన ఇది మన ఆధ్యాత్మికతకు సంబందించినది, సువార్తకు సంబంధిన సంఘటన, మరియు మానవుని యొక్క నిర్లక్ష్య స్వభావం మనజీవితంలో భయంకరమైన స్థితిలోనికి తీసుకు వెళ్తుంది అని మనకు తెలియజెప్పే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన.

 పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్ప గించిరి, ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి వారు బయలుదేరితిరి అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టు చున్నందున కుప్రచాటున ఓడ నడిపించిరి అప్పుడు పౌలు అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకుకూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరి,అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.

కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను,. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతివిు, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.

కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను, పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది, అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు అని వారితో పౌలు గారు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు.


2.ఇటువంటి సందర్భం యేసు ప్రభువారు పడవలో సముద్రంలో తన శిష్యులతో ప్రయాణిస్తుండగా జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకొంటే దేవుని వాక్యంలో గమనిస్తే

యేసయ్య తన శిష్యులతో పడవలో ప్రయాణిస్తుఉండగా  అకస్మాత్తుగా ఒక తుఫాను లేచి దోనె అలలచేత కప్పబడగా, అది చూచి శిష్యులు భయపడి అమరమున నిద్రించుచున్న యేసయ్య యొద్దకు వచ్చి ప్రభువా మేము నశించి పోవుచున్నామనగా అప్పుడు యేసయ్య లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.(మత్తయి సువార్త 8:23-25)

ఇక్కడ సముద్రము మనం జీవిస్తున్న లోకానికి సాదృశ్యంగా ఉన్నది
పడవ లేక దొనే యేసయ్యకు సూచనగా ఉన్నది
పడవ ప్రయాణం మానవ జీవితానికి సూచనగా ఉన్నది
అనగా లోకమనే సముద్రంలో యేసయ్య అనే పడవలో మనం ప్రయాణిస్తున్నాం, జీవిస్తున్నాం., మన నావ క్షేమముగా ఉండాలి అని అంటే మన నావికుడుగా యేసయ్యను మన జీవితంలో కలిగి ఉండాలి అని అర్ధం.


3.సరిగ్గా ఇలాంటి సందర్భంలో పౌలు గారు దేవుని యందు విశ్వాసం కలిగి శ్రమలలో ఆయన ధైర్యంతో ఉన్నారు. ఇటువంటి శ్రమలో కూడా పౌలు కలిగి ఉన్న మూడు ముఖ్యమైన లక్షణములను మనం కలిగి ఉండాలి.

**మొదటి లక్షణం ఇన్ని శ్రమలలో కూడా అయన దైర్యంగా ఉండటం
అపొస్తలుల కార్యములు 27:22
22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.


అపొస్తలుడైన పౌలు గారిని పడవలో వారు ఖైదీగా తీసుకు వెళ్తున్నప్పటికీ అయన భయపడకుండా దేవుని యందు గొప్ప నమ్మకంతో అయన భయంకరమైన సందర్భంలో దైర్యంగా ఉంటూ, ఇతరులను ధైర్యపరుస్తున్నారు.

మనం కూడా ఎన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చిన దేవుని యందు భయభక్తులు కలిగి, దైర్యం కలిగి ఉండాలి.

**రెండవ లక్షణం శ్రమలలో పౌలు గారు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు.
అపొస్తలుల కార్యములు 27:25
25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.


అయన దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారు,

రోజున అటువంటి విశ్వాసం మనం కూడా మన జీవితంలో కలిగి ఉండాలి.
మనకు ఎన్ని శ్రమలు వచ్చిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయకుడిగా మన యేసయ్య ఉంటాడు  అనే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి.

**మూడవ లక్షణం అయన ఇన్ని శ్రమలలో కూడా దేవుని సువార్తను ప్రకటించారు.
అపొస్తలుల కార్యములు 27:24
24 నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను

పౌలు గారు జరగబోవు నష్టం గూర్చి తెలిసి దేవుడు వారికీ సహాయకుడిగా ఉంటారు అని దేవదూత ఆయనకు చెప్పిన దానిని గూర్చి, దేవుడు చెప్పిన దాని గూర్చి, దేవుడు ఏమి చేయమని చెప్తున్నాడో వారికీ దేవుని సువార్తను దైర్యంగా చెప్పడం, దేవుని సువార్త చెప్పడం ద్వారా చివరికి పౌలు గారి మాట విన్న వారందరు రక్షించబడటం జరిగింది.


4.వాక్య భాగములో మూడు విషయములు మనం అర్ధం చేసుకోవచ్చు.
 
**మొదటిగా అపొస్తలుడైన పౌలు గారు శతాధిపతితో ఈ ప్రయాణము వలన నష్టము జరుగునని నాకు తొచుచున్నది అని హెచ్చరించిన కూడా నావికుని మాట విని పౌలు గారి మాటల పట్ల నిర్లక్ష్య ధోరణి అనుసరించటం వలన వారు గోరమైన ప్రాణాపాయమైన స్థితిలోకి వెళ్లడం జరిగింది.
**రెండవ విషయం వారు ప్రాణాపాయ స్తితిఉన్నపుడు పౌలు గారు ద్వారా వారు ధైర్యపరాచబడటం.
**మూడవవిషయం వారు దేవుని సువార్త ద్వారా రక్షించబడటం
మనం కూడా దేవుని విడిచి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటె అటువంటి స్వభావం వలన గోరమైన స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని పాలు గారు తన మాటల ద్వారా మనకు హెచ్చరిస్తున్నారు, దేవుని
యందు భయ భక్తులు కలిగి, విశ్వాసంలో బలపడితే మనం శ్రమలో దేవుని ద్వారా రక్షించబడతాము., అనేకులను రక్షించగలుగుతాము. 
మనం కూడా పడవ అనే మానవ జీవితంలో ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చిన దైర్యం కలిగి దేవుని యందు  గొప్ప విశ్వాసంతో అనేకమంది రక్షించువారిగా దేవుని సువార్తను ప్రకటించు వారీగా ఉండాలి అని ఆశిస్తూ.

 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
********************************************************

29Sep2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు

ఫిలేమోను1:8-12
8 కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను,

అపొస్తలుడైన పౌలు గారు వ్రాసిన అనేకమైన పత్రికలలో అతి చిన్న పత్రిక ఫిలేమోను పత్రిక, పత్రికలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఫిలేమోను గూర్చి అతని భక్తిని గూర్చి మరియు ఒనేసిమును గూర్చి సుమారుగా క్రీ.శకం 60-64 కాలంలో పత్రికలో వివరంగా వ్రాయబడినది.

1.మొదటిగా ఫిలేమోను గూర్చి మనం తెలుసుకోవలసినవి ఏమిటి అని అంటే

ఫిలేమోను కోలసి పట్టణంనకు చెందినవాడు, ఫిలేమోను అనగా ప్రేమించువాడు అని అర్ధం, ఇతను ధనవంతుడు మరియు ఘనుడైనటువంటివాడు, గొప్ప దైవభక్తి కలిగినటువంటివాడు.

ఫిలేమోను1:4
4 నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని.,

ఫిలేమోను అపొస్తలుడైన పౌలు గారి దగ్గర రక్షణ పొందినవాడు, ఇతని కుటుంబం ప్రభువుని కలిగిన కుటుంబం, మరియు యితడు పరిశుద్ధుల యెడల, దేవుని యెడల గొప్ప విశ్వాసo కలిగిన వాడు

ఫిలేమోను ఇంటిలో ప్రార్ధన వున్నది, సంఘము ఉన్నది, మరియు ఇతనికి, కుటుంబానికి సంఘము పట్ల దేవుని పట్ల అపారమైన ప్రేమ కలిగిన వారు.

రోజున మన ఇంటిలో ఏమి ఉన్నది ., మనలను మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది.,మనం కూడా మన ఇంటిలో ప్రార్ధన కలిగి ఉండాలి, సంఘములో సమాజంలో సహవాసం కలిగి ఉండాలి.

2.రెండవదిగా ఫిలేమోను పత్రికలో మనం "ఒనేసిము" గూర్చి ధ్యానం చేసుకుంటే

ఒనేసిము అనగా ప్రయోజనకరమైనవాడు అని అర్ధం.

ఫిలేమోను1:10-11
నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.
11 ​అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

ఫిలేమోను దగ్గర చాల మంది పనివారు ఉండేవారు, బానిసలుగా కూడా పని చేసేవారు, వారిలో ఒకడు ఒనేసిము.

ఒనేసిము యితడు ఏదో ఒక తప్పు చేసి పారిపోయి తరువాత అపొస్తలుడైన పౌలు గారి ద్వారా మార్చబడినవాడు.


3.మూడవదిగా పౌలు ఒనేసిమును గూర్చి అతనిని తిరిగి చేర్చుకోమని పత్రికలో ఫిలేమోనుకు వ్రాస్తూ పలికిన మాటలను మనం గమనిస్తే

ఫిలేమోను1:18-19
18 అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము;
19 పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును.


పౌలు గారు ఇతనిని గూర్చి యితడు తన ద్వారా రక్షణ పొంది మారు మనసు పొందిన తరువాత ఒనేసిము గూర్చి అతని నమ్మకత్వం గూర్చి పలుకుచున్న మాటలు.

ప్రయోజనకరము అను మాటకు మనకు మనము ప్రయోజకువులవటమే కాకుండా ఇతరులకు, ముఖ్యంగా దేవుని ప్రయోజనకరమైన విధంగా ఉండాలి.


4.నాల్గవదిగా దేవుని బిడ్డలుగా మనం ప్రభువుని అంగీకరించిన తరువాత మన జీవితం ఎలా ఉండాలి ?

దేవుని బిడ్డలుగా మనం ప్రభువుని అంగీకరించిన తరువాత మన జీవితం మారాలి,
మన ప్రభువుకి ఉపయోగపడే విధంగా ఉండాలి.

బానిసగ ఉన్నపుడు ఒనేసిము మార్పులేని వ్యక్తి, కానీ అతడు పౌలు గారి ద్వారా మార్చబడిన తరువాత అతడు దాసుని కంటే ఎక్కువ వానిగా అతనికి పౌలు గారి ద్వారా ఘనత కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు.


ఫిలేమోను1:15-16
15 ​అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు
16 గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును,



అదేరీతిగా మనం కూడా సంఘమునకు, సేవకులకు, సమాజమునకు, ముఖ్యముగా దేవునికి ప్రయోజనకరమైన వారీగా ఉండాలి ని మాటల ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు.

ఇక్కడ పౌలు గారు యేసుప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు, మరియు ఒనేసిము మానవులమైన మనకు సాదృశ్యంగా ఉన్నారు, అంతేకాకుండా ఫిలేమోను అనే వ్యక్తి దేవుని సాదృశ్యంగా ఉన్నారు

రోజున మనలో వ్యసనాలకు బానిసలుగా ఉన్నఅనేకమైన వారి వ్యసనములను, పాపములను బట్టి మనలను క్షమించమని, మన పాపములను అయన భరించి యేసు ప్రభువారు తండ్రితో ప్రాధేయపడుతున్నారు.   

మనo ప్రభువైన యేసు ప్రభువారి ద్వారా రక్షణ ., మారుమనసు పొందుకోవాలని అప్పుడు మారుమనసుకు తగిన ఫలం యేసయ్య మన అందరికి ఇవ్వాలని, యేసయ్యకు, సంఘమునకు, ప్రయోజానకరంగా ఉండాలని ఆశిస్తూ ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..









No comments: