11 to 15 Lentdays 2019



11th Lentday18/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు

మత్తయి సువార్త  26:55-56
గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయ ములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
56
అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరు నట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యు లందరు ఆయనను విడిచి పారిపోయిరి

బైబిల్ గ్రంధము పరిశీలిస్తే అనేక ప్రవచనములు యేసు ప్రభువారిగూర్చి చెప్తున్నాయి
చదవబడిన వాక్యంలో సంఘటన గూర్చి దావీదు భక్తుడు ప్రవచించిన మాటలు పరిశీలిస్తే
కీర్తనల గ్రంథము  38:11
నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు

ప్రవచనం యేసుప్రభువారి గూర్చి ఏమి చెప్తుంది?

ప్రవచనం యేసు ప్రభువారి గూర్చి జరగబోవు ఒక సంఘటన గూర్చి చెప్పబడింది.

ప్రవచనంలో సంఘటన గూర్చి ఏమి వ్రాయబడింది

**ఇది ఒక బాధాకరమైన సంఘటన
**ఇది యేసు ప్రభువారు ఇస్కరియోతుయుధ వలన మోసగింపబడిన సంఘటన
**యేసు ప్రభువారు ఇస్కరియోతుయుధ వలన అప్పగింపబడిన తరువాత అయన శిష్యులైన వారు ఆయనను శ్రమలో విడిచిపెట్టి పారిపోయిన సంఘటన అని వ్రాయబడింది.

బైబిల్ గ్రంధములో మనకొరకు అనేక వాగ్దానములు వ్రాయబడినవి
**దేవుడు మనలను విడువను ఎడబాయను అని చెప్పారు.

బైబిల్ గ్రంధములో యేసయ్య గూర్చి ప్రవచనం ఈవిధంగా వ్రాయబడినది
జెకర్యా  13:7
ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు

ప్రవచనం యేసయ్య గూర్చి ఏమి చెప్తుంది?
**ఈప్రవచనం మన కొరకు తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు యేసయ్య గూర్చి చెప్తుంది.
**ఈప్రవచనం అయన గొప్పదైన రక్షణను మనకు ఇచ్చిన యేసయ్య పరిస్థితిని గూర్చి చెప్తుంది.

**ఈప్రవచనంలో సందర్భము యేసు ప్రభువారికి శ్రమ, కష్టం రాగానే  ఆయనను అందరు చెదిరిపోయిన పరిస్థితిని గూర్చి చెప్తుంది.

ఇప్పుడు యేసయ్య బిడ్డలుగా మన పరిస్థితి ఎలా ఉన్నది?
**శ్రమలలో, కష్టములలో ఆయనను విడిచి పెడుతున్నామా,
**ఆయనను వెంబడించే వారీగా ఉంటున్నామా,

 **యేసయ్య శిష్యులైన వారు మొదట పారిపోయిన తరువాత అయన ద్వారా బలపరచబడి
యేసయ్య కోసం హతసాక్షులుగా మారారు.  

**ఆలాగుననే మనకు ఎటువంటి శ్రమలు నిందలు అవమానాలు వచ్చిన మనం యేసయ్యలో బలపరచబడాలి.

మనం యేసయ్యలో ఎలా జీవించాలి

**మనమైతే యేసయ్యను హత్తుకొని జీవించాలి

**దేవుని కొరకు జీవించాలి, ఎన్ని శ్రమలు వచ్చిన ఆయనలో ఉండాలి.

మనం ఎలా ఉన్నాం, యేసయ్యలో రీతిగా జీవిస్తున్నాం, యేసయ్యకు ఏమిస్తున్నాం,
మనం ఒకసారి పరిశీలించుకుని ఆరీతిగా సిద్ధపడాలి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

***********************************************************************
12th Lentday19/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరం గారు 

మత్తయి సువార్త 26:59-62
59 ప్రధానయాజకు లును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
60
అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు.

**ఈ సిలువ ధ్యానాకుటములలో అయన పొందిన సిలువ శ్రమలను జ్ఞాపకం చేస్తాయి.
**చదవబడిన వాక్య భాగమును చుస్తే యేసు ప్రభువారిని ప్రధానయాజకుల దగ్గరికి తీసుకురావడం గూర్చి చెప్పబడింది

**ప్రధానయాజకులదగ్గరికి యేసుప్రభువారిని తీసుకువచ్చి అయన మీద నేరంమోపుటకు ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము కొరకు వెదకుట గూర్చి చెప్పబడింది.

1.ఎందుకు వారు అబద్ధసాక్ష్యము కొరకు వెదకుచున్నారు

ఒక వ్యక్తి మీద నేరం మోపాలి అని అంటే దానికి రుజువు చేయుటకు దానికి సంబంధించి సాక్ష్యము కావాలి, కానీ వారికీ సాక్ష్యం దొరకలేదు. అయన నేరం చేయలేదని వారికీ తెలుసు కావున వారు అబద్ధసాక్ష్యము కొరకు వెదకుచున్నారు.

2.వారు యేసు ప్రభువారి మీద ఏమని నేరం మోపారు ఏమి అబద్ధసాక్ష్యము చెప్పించారు?

అందుకు వారు దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్ట గలనని చెప్పెనని యేసు ప్రభువారి మీద అబద్ద సాక్ష్యము చెప్పిరి

దేవునికిని ధర్మశాస్త్రమునకు విరోధముగా అయన పలికినట్లు అయన మీద నేరం మోపారు

3.దేవుని ధర్మశాస్త్రం ఏమి చెపుతుంది

ధర్మ శాస్త్రములలో ఒకటైన దేవుని ఆజ్ఞ అబద్దం ఆడరాదు అబద్ద సాక్ష్యం చెప్పరాదు అని వ్రాయబడింది. కానీ ధర్మ శాస్త్రం అనుసరిస్తున్నాము అంటున్న వారే ధర్మ శాస్త్రమును దిక్కరిస్తున్నారు

4. అబద్ద సాక్ష్యం అంటే ఏమిటి

లేనిది ఉన్నట్టులుగా ఉన్నది లేనట్టులుగా పలికే వారిని కొండెములు చెప్పుటను అబద్ద సాక్ష్యం అంటారు.

బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే సొలొమోను మహా జ్ఞానీ అబద్ద సాక్ష్యం గూర్చి ఏమి వ్రాసారు
సామెతలు  19:9కూటసాక్షి శిక్షనొందకపోడు అబద్ధములాడువాడు నశించును.

5.
ఈకూటసాక్షి అని ఎవరిని అంటారు కూటసాక్షి అనగా అర్ధం ఏమిటి?

ఈకూటసాక్షి అనగా కొంతమంది కూడి గుంపుగా ఒక అబద్దపు మాట మీద నిలబడుటను కూటసాక్షి అని అంటారు

6.దేవుని వాక్యంలో ఈకూటసాక్షిని సొలొమోను మహా జ్ఞానీ వేటితో పోలుస్తున్నాడు?
సామెతలు  25:18తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.

7.ఈకూటసాక్షికి  బైబిల్ గ్రంధములో ఏమి ప్రియము అని వ్రాయబడింది.
సామెతలు  14:5నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.

8.యేసు ప్రభువారు అబద్ద సాక్షి దేనికి గుర్తు అని చెపున్నారు?
యోహాను సువార్త 8:44మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

ఈఅబద్ద సాక్షిని యేసు ప్రభువారు అపవాది సంభందికి గుర్తుగా పోలుస్తున్నారు.

చదవబడిన దేవుని వాక్యం ఒక ప్రవచనం యేసు ప్రభువారి గూర్చి బైబిల్ గ్రంధములో

దావీదు కీర్తనలు పరిశీలిస్తే యేసయ్య మీద పలికిన అబద్ద కూట సాక్ష్యులైన వారి గూర్చి వ్రాయబడినది.
కీర్తనల గ్రంథము 35:11కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.

9.ఎందుకు యేసయ్య అటువంటి వేదన నిందలు భరించారు మన నుండి ఏమి కోరుతున్నారు?

మనం దేవునికి భయపడి సత్యం కలిగి, యేసయ్య సత్య మార్గంలో మనం నడవాలని యేసు ప్రభువారు కోరుతున్నారు.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

*********************************************************************
13th Lentday20/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు 

మత్తయి 26:69-75
పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను

చదవబడిన దేవుని వాక్యం యేసయ్య పొందిన సిలువ శ్రమలలో పేతురు జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సందర్భం గూర్చి వివరిస్తుంది.

**పేతురు జీవితం ప్రత్యేకమైనది.  
**బేత్సయిదా నగరానికి చె౦దినవాడు, అ౦ద్రెయ, పేతురు కూడా అక్కడివాళ్లే.
**యేసు ప్రభువారి 12మంది శిష్యులలో చేర్చబడినవాడు.
**తరువాత కేఫా అని యేసుప్రభువారుతో పిలవబడినవాడు(గ్రీకులో ఆపేరుకుపేతురు”* అని అర్థ౦).
**కేఫా అనగా తెలుగులో రాయి అని అర్ధం.
**రాయి వంటి దృడంగా, దేవునిలో బలంగా వాడబడాలి అని యేసు ప్రభువారు ఆపేరు పెట్టారు.

***చదవబడిన వాక్యములో పేతురు పరిస్థితిని మనము గమనిస్తే
 

1. మొదటిగా పేతురు యేసయ్య ఎవరో తెలియదని అబద్దం ఆడిన పరిస్థితి.
మత్తయి 26:69-70
69 పేతురు వెలుపటిముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతనియొద్దకు వచ్చినీవును గలిలయుడగు యేసుతో కూడ ఉంటివి గదా అనెను.
70 అందుకతడునేనుండలేదు; నీవు చెప్పుసంగతి నాకు తెలియదని అందరి యెదుట అనెను

**యేసయ్య అంటే గొప్ప ప్రేమ కలిగినవాడు పేతురు, ఐనను మొదటిసారి యేసయ్య ఎవరో తెలియదని పేతురు అబద్దం ఆడిన పరిస్థితి.

2.ఎందుకు పేతురు ఒట్టుపెట్టుకొని అబద్దం ఆడుచున్నాడు?
యేసయ్య పరిస్థితిని చూచి పేతురు భయపడి తనను కూడా పట్టుకొని హింసించి చంపుతారు అని భయంతో అబద్దం ఆడి ఒట్టుపెట్టుకొంటున్నాడు.

3.రెండవసారి పేతురు ఒట్టుపెట్టుకొని యేసయ్యను నేనెరుగనని మరల చెప్పిన పరిస్థితి.
మత్తయి 26:71-72
71 అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
72
అతడు ఒట్టుపెట్టుకొనినేనుండలేదు; మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను

4.బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే ధర్మశాస్త్రం ఒట్టు గూర్చి ఏమి చెప్తుంది.  
మత్తయి 5:34నేను మీతో చెప్పునదేమనగాఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు; అది దేవుని సింహాసనము, భూమి తోడన వద్దు

 
**దేవుని బిడ్డలుగా ఎంతమాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు అని యేసయ్య చెప్పుచున్నారు

*
*దేవుని బిడ్డలుగా మనం అవును అంటే అవును కాదంటే కాదు.
 
**ఇది మనకు యేసయ్య ఇచ్చిన ఆజ్ఞగా పరిగణించాలి.
 
5.కొంతసేపైన తరువాత మూడవసారి పేతురు శపించుకొనుచు ఒట్టుపెట్టుకొనుచు యేసయ్యను నేనెరుగనని మరల చెప్పిన పరిస్థితి.
మత్తయి 26:73-74కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చినిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
74
అందుకు అతడు మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
 
6.ముమ్మారు యేసయ్యను నేనెరుగనని చెప్పిన తరువాత పశ్చాతాపంతో యేడ్చిన పేతురు పరిస్థితి.  
మత్తయి 26:75వెంటనే కోడి కూసెను కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.

**యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు అయన జాలి కలిగిన దేవుడు అయన మనకు దేవుడుగా ఉండటం మన ధన్యత

**అటువంటి యేసయ్యను ఎవరో తెలియదని ఎరుగనని ఒట్టుపెట్టుకొని శపించుకొనిన పేతురు.

**పశ్చాతాపంతో యేడ్చినా తరువాత పరిశుద్దాత్మ శక్తి కలిగి పేతురు యేసయ్య గూర్చి గొప్పగా  వాడబడి ప్రపంచములోనే మొదటి సంఘమును స్థాపించిన వాడు పేతురు

బండమీద నా సంఘమును కట్టుదును అని యేసయ్య చెప్పిన ప్రవచనం.
పేతురు అనే బండమీద దేవుని సంఘమును కట్టుటకు నిదర్శనంగా యేసయ్య ప్రవచించినారు.

7.ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి?

**దేవునిలో బలపరచబడాలి దేవునిలో స్తిరపరచబడాలి
**యేసయ్యలో మన విశ్వాసాన్ని దృఢపరుచుకోవాలి
**కష్టాలు, నిందలు వచ్చిన, వాటిని ఎదుర్కొని యేసయ్యలో నిలబడాలి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

***************************************************************
14th Lentday21/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరం గారు

మత్తయి సువార్త 26:64-68
మీకేమి తోచు చున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి;


చదవబడిన దేవుని వాక్యమును పరిశీలిస్తే యేసు ప్రభువారి మీద ప్రధానయాజకులు రెండుతప్పులు మోపిరి.

**మొదటితప్పుగా అయన దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెనని మోపిరి

**యేసు ప్రభువారు దేవుని కుమారుడనని చెప్పుట దేవదూషణనని ఆయనమీద రెండవతప్పుగా మోపిరి.

అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మి వేసిరి.

యేసు ప్రభువారిపై, వారు ఉమ్మి వేయుట ఇది ఒక బాధాకరమైన సంఘటన

ఉమ్మివేయబడుట గూర్చి యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే  వ్రాయబడిన ప్రవచనం.
యెషయా  50:6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు.

యేసు ప్రభువారి సిలువ శ్రమలలో అయన పై ఉమ్మివేయబడుట ప్రవచనం నెరవేర్పుగాఉన్నది

ఉమ్మివేయుటను గూర్చి పరిశుద్ధ లేఖనములను పరిశీలిస్తే

 ఉమ్మివేయబడుట అపవిత్రకు సూచన అని వ్రాయబడినది.
లేవీయకాండము  15:8స్రావముగల వాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడై యుండును.

 ఉమ్మివేయబడుట సిగ్గు పడుటకు సూచన అని వ్రాయబడినది
సంఖ్యాకాండము  12:14అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.

 ఉమ్మివేయబడుట అసహ్యమునకు సూచన అని వ్రాయబడినది
యోబు30:10వారు నన్ను అసహ్యించుకొందురు నా యొద్ద నుండి దూరముగా పోవుదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు.

బైబిల్ గ్రంధములోఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని మనలను అసహ్యించుటకు సూచనగా  వ్రాయబడింది.
ప్రకటన గ్రంథము 3:16నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మి వేయ నుద్దేశించుచున్నాను

యేసయ్య ఉమ్మితో చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథమును పరిశీలిస్తే

మొదటిగా ఉమ్మితో పుట్టుగ్రుడ్డి వానికి చూపునిచ్చి అద్భుతం చేసిన యేసయ్య 
యోహాను9:6-7ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమి్మవేసిఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద బురద పూసి
7
నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను

రెండవదిగా ఉమ్మితో చెవిటివానికి మూగవానికి స్వస్థతనిచ్చిన యేసయ్య
మార్కు 7:33-35
33 సమూహ ములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి,ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి
34 ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; మాటకు తెరవబడు మని అర్థము.
35
అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను.

సిలువ శ్రమలలో యేసయ్య మనకొరకు అనేక రకాలుగా బాధింపబడ్డారు

**యేసుప్రభువారు మన కొరకు హేళన చేయబడ్డారు

**యేసుప్రభువారు మన కొరకు అవమాన పడ్డారు

**యేసుప్రభువారు మన కొరకు ఉమ్మివేయబడ్డారు, అసహ్యింపబడ్డారు.

యేసుప్రభువారు ఇన్ని శ్రమలను ఎందుకొరకు అనుభవించారు

**మనలను బాగుచేయటానికి యేసయ్య అన్ని శ్రమలను ఓర్చుకొన్నారు

**పాపము నుండి మనలను రక్షించడానికి యేసయ్య అన్ని శ్రమలను ఓర్చుకొన్నారు.

ఇప్పుడు మన జీవితం ఎలా ఉన్నది యేసయ్యలో మనం ఎలా ఉండాలి?  

**మనం అయన ప్రియబిడ్డలుగా ఉండాలి

**మనం యేసయ్యను సంతోషపెట్టువారిగా ఉండాలి.

**యేసయ్యకు ఇష్టమైన పనులు చేసేవారిగా ఉండాలి
  
**యేసయ్య అడుగుజాడలలో అయన చూపిన మార్గంలో నడవాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
***************************************************************************

15th Lentday22/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరం గారు

మత్తయి 27:1-2ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి

**చదవబడిన వాక్యభాగమును యేసుప్రభువారి పరిస్థితిని గమనిస్తే యుధులైన వారు అబద్ద సాక్షులను ఏర్పాటు చేసుకొన్నారు.

**ప్రధానయాజకులును, పెద్దలందరును ఏకమై యేసు ప్రభువారి మీద నేరారోపణ చేసారు.

**యేసు ప్రభువారిని భందించి ఉదయమున వారి అధిపతి ఐన పొంతి పిలాతు దగ్గరకు
తీసుకువచ్చారు.

**ఇది వారిలో ఉన్నటువంటి దుర్మార్గానికి దుష్టత్వానికి నిదర్శనంగా ఉన్నది.

**ఈవిధంగా నేరము చేయని యేసుప్రభువారిని బంధించి తీసుకువచ్చుట ఒక బాధాకరమైన సంఘటన

సాధారణంగా మనము గమనిస్తే ఎవరిని విధంగా బంధిస్తారు

ఖైదీలను నేరము చేసినవారిని నరహంతకులను ఈవిధంగా బంధిస్తారు.

దినాలలో మనం కూడా అనేక విషయాలలోఈవిధంగా బంధింపబడిఉన్నాము.

ఎందుకు యేసు ప్రభువారు ఆవిధంగా బందీ అయిపోయారు?  

మనం దేనికి బంధిలమై ఉంటున్నాము, ఎలా దాసులై ఉంటున్నాము?

ఈబంధకములను గూర్చి బైబిల్ గ్రంధములో అనేక విషయాలు వ్రాయబడినవి.

1.మొదటిగా మనము పాపానికి బంధిలమై ఉంటున్నాము.
రోమ 6:18
పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

**పౌలు భక్తుడు మతం కొరకు క్రీస్తు బిడ్డలను హింసిస్తూ చివరకు  దేవుని పిలుపుకు లోబడి యేసు ప్రభువారికి దాసుడైపోయాడు.
 
**అలాగుననే యేసు ప్రభువారికి లోబడి ఆయనకు మనం దాసులైపోవాలి.

ఎప్పుడైతే మనము పాపమునకు బంధింపబడిఉన్నామో మనం పాపమునకు దాసులమైయున్నాము
యోహాను 8:34అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

**మన పాపములను బట్టి యేసు ప్రభువారు బంధీ అయిపోయారు.

**అటువంటి పాపం నుండి మనలను విమోచిందడానికి యేసుభువారు బంధీ అయిపోయారు.  
  
**మనం నీతికి దాసులై ఉండాలి, మన పాపమూ నుండి క్రీస్తు ప్రేమ చేత విమోచింపబడాలి.

2.రెండవదిగా శరీరసంబంధమైన క్రీయలకు దాసులై ఉంటున్నాము.  
రోమ 7:24-25
24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?
25
మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను

3.మూడవదిగా మనం భ్రష్టత్వమునకు దాసులై ఉంటున్నాము.
2 పేతురు2:19తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా.
**మనము వ్యర్థమైన డంబపుమాటలకు దాసులైపోవుచున్నాము.

**దుర్నీతిని ప్రేమిస్తూ భ్రష్టత్వమునకు దాసులైపోవుచున్నాము.

**అటువంటివి మనలో ఉంటె మనం వాటి విడిచిపెట్టాలి.

యేసయ్య మనకొరకు సిలువ శ్రమలలో అనేక భాదలు అనుభవించారు.
మన పాపములను బట్టి మనలను విడిపించుటకు బందీ అయిపోయారు.

మన పాపములను విడిచిపెట్టి యేసయ్య కృపలో,యేసయ్య చూపిన మార్గంలో జీవించాలి

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్