1st-5th Lentdays2020



1st సిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

హెబ్రీయులకు 9:11-22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.
బైబిల్ గ్రంధములో నలభై రోజులు ప్రాముఖ్యతను గూర్చి ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు నలభై రోజులు ప్రార్దించినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా పాతనిబంధనలో మోషే సినాయ్ కొండపై నలభై రోజులు దేవుని ఆజ్ఞలకొరకు ఉపవాసముండినట్లుగా మనం చూస్తాం, అలాగే మన పితరులైన వారు అది క్రైస్తవులైనవారు దేవుని యొక్క ఆజ్ఞలను వెదకటానికి ఏంచేద్దాం అని అలోచించి వారు నలబై గంటల ప్రార్ధన నిష్ఠకలిగి చేయాలి అని తలంచారు ఆలాగున చేస్తుండగా మరియొక ఆలోచన వారికీ వచ్చింది ఏమిటి అని అంటే ఈ నలభై గంటల ప్రార్ధన కాకుండా ఏడురోజులు పరిశుద్దవారంగా యేసుప్రభువారి శ్రమలను జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో బలపడదాము అని ఆలోచన చేసారు తరువాత ఆనాటి క్రైస్తవపెద్దలైనటువంటి వారు ఈ ఏడు రోజులు   కాకుండా నలభైరోజులుగా పాటిద్దాము అని ఆలోచన చేసారు.

రోమన్ కాథలిక్ వారు ప్రత్యేకంగా మనం జరుపుకొనే మట్టలాధివారం తరువాత ఆ మట్టలను ఎండబెట్టి సంవత్సరం తరువాత ఈ భస్మబుధవారం రోజున వాటిని కాల్చి వేసి వాటి నుండి వచ్చిన బూడిదను సిలువ గుర్తుగా ధరించుట ఆచారయుక్తంగా చేస్తారు. కానీ మనమైతే ఈ నలభై రోజులు దేవుని సన్నిధిలో సిలువ గురించి ధ్యానించుట, దేవుని సన్నిధిలో గడపడం గొప్ప వరంగా భావిస్తాం.

1.మనం ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్ధనను ఎలా జరిపించుకోవాలి, ఎలాగా మనం కొనసాగించాలి అని ఆలోచిస్తే 

చాల మంది దీనిని ఉపవాసములు చేయడము, మాంసము తినకుండా ఉండటం, శుభకార్యములు చేయకుండా ఉండటం లాంటివి చేయకుండా ఉండాలి అని భావిస్తారు.

దానికి సంభందించి బైబిల్ గ్రంధములో దేవుని వాక్యమును అనుసరించి చేస్తూఉంటారు.

దానియేలు 10:3 మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసికొనలేదు.

ఈనలబై రోజులు ఉపవాసము ఉండగలిగిన వారు ఉండవచ్చు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్నిరోజులు , కానీ మనం ఈనలబై రోజులు ప్రార్థనకు, దేవుని వాక్యమును ధ్యానించుటకును ఎక్కువగా సమయమును కేటాయించే వారీగా ఉండాలి.

2.ఈ భస్త్మబుధవారం రోజున మనం ధ్యానించుకొనే అంశము బుడిదకున్న ప్రాముఖ్యతను గూర్చి ఆలోచిస్తే బూడిద పాపక్షమాపణకు సూచనాగా ఉంది.

**పాతనిభంధన గ్రంధములో పాపక్షమాపణ కొరకు బలులను అర్పించేవారు.

బైబిల్ గ్రంధములో మనం చుస్తే సంఖ్యాకాండము 19:1-9
యెఱ్ఱని పెయ్యను యాజకుడైన వాని ఎదుట ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి దానిని వధించి దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఏడుమారులు ప్రోక్షింపవలెను; అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను, దహింపవలెను.మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రా యేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థ బలి. ఈవిధంగా పాతనిభంధన గ్రంధములో పాపక్షమాపణ కొరకు వారు చేసేవారు.

**కొత్త నిబంధన గ్రంధములో మనం చుస్తే హెబ్రీయులకు 9:11-22
 11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమై12 మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.

ఇక్కడ యేసుక్రీస్తుప్రభువారు మనకు శాశ్వతమైన విమోచన ఇవ్వడానికి అయన తన స్వరక్తముతో పరిస్ధుద్ధస్థలములో అయన ప్రవేశించెను.

ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపర చినయెడల,నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

3.ఈరోజున మనం యేసయ్య పడ్డ శ్రమలను అయన రక్తమును ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అని ఆలోచిస్తే

అయన ఎందుకు అయన మన కొరకు శ్రమపడ్డారు , ఎందుకు అయన మన కొరకు రక్తమును చిందించారు అని అంటే మనలను మన పాపములనుండి విమోచించడానికి అయన చేసారు, మనం ఈరోజున మన నిర్జీవ క్రియలను విడిచి పెట్టాలి లేక పోతే యేసయ్య చేసిన త్యాగానికి అర్థంలేదు అది వ్యర్ధమై పోతుంది అందుకే మనం పాపములను వొప్పుకొని విడిచిపెట్టాలి

ఈ హేతువుచేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్తనిబంధనకు మధ్యవర్తియై యున్నాడు.

యేసుప్రభువారు సృష్టి కర్త , అది-అంతము ఆయనే. నిన్న నేడు నిరంతము అయన ఏకరీతిగా ఉన్నవారు అయన. శరీరధారిగా రెండువేల సంవత్సరముల క్రితం వచ్చారు, కానీ అయన అంతకు ముందు ఆత్మ దేవుడుగా ఉన్నారు, అయన సృష్టి కర్త, అయన నీతి మంతుడు యదార్థవంతుడు. కాబట్టి అయన సృష్టించిన మరణ శాసనమును శరీరధారిగా అయన తనపైనే వేసుకొన్నాడు. 

అయన ప్రేమ కల్గిన దేవుడు మన పాపములను క్షమించేవాడు ఆయనే నిర్మించినవాడు ఆయనే రక్షించువాడు ఆయనే. యేసుప్రభువారు మన విడుదల కొరకు మన శాశ్వతమైన రక్షణ కొరకు మన పై ఉన్న శాపమును తొలగించడానికి అయన చేసిన త్యాగం మరువలేనిది .

**బూడిద పశ్చాతాపనికి సూచనా

**బూడిద నిర్జీవక్రియలకు సూచనా

**బూడిద మరుమనస్సుకు సూచనా

**బూడిద తగ్గింపుకు సూచనా

**బూడిద సిద్దపటుకు సూచనా

అయన కొరకు మనం మన నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మనలో దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టాలి, మనలో ఉన్న ప్రతి పాపమును వాక్య జ్ఞానము చేత, వాక్య శక్తి చేత మన ఆత్మను నిత్యము బలపరచుకోవాలి. ఏది పాపమో ఆదిగుర్తించి పశ్చాతాపడాలి., విడిచిపెట్టాలి, తగ్గింపుకలిగి అయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అయన చేసిన త్యాగమునకు కృతజ్ఞత కలిగి ఉందాం, ఆత్మీయ జీవితంలో బలపడుదాము.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్.



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
**********************************************************



2ndసిలువ శ్రమల ధ్యానకూటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
పరలోకరాజ్యము-మారుమనస్సు

మత్తయి 4:17-22 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
పరలోకరాజ్యమును స్థాపించుటకు యేసుప్రభువారు ఈలోకమునకు వచ్చారు, అందుకే అయన పరలోకము యొక్క విశిష్టితను గూర్చి అయన ఎక్కువగా వివరించారు, బంగారం వజ్రములతో నిర్మించబడినది ఈపరలోకరాజ్యము, అక్కడ కోటి సూర్యకాంతులతో యేసుప్రభువారు ఉండి., అక్కడినుండి మనలను తొంగిచూస్తున్నారు, ఆరాజ్యములో ఆకలి దప్పిక కన్నీరు ఉండదు. అది శాశ్వతంగా ప్రభువుతో ఉండే పట్టణం. ఆశ్రేష్ఠమైన పట్టణంలో ఇశ్రాయేలీయుల 12గోత్రముల వారు మరియు వారితో పాటుగా అన్యజనులమైన మనమందరం దేవుని బిడ్డలుగా ఆయనతో ఉండాలి అని పట్టణం గూర్చి వింటుంటే పట్టణంలో చేరాలి అని మనం అందరం, అనేకమంది ఆశకలిగి ఈ భూలోకంలో ఉన్నారు.
దానికోసమని చాలామంది అన్యులైన వారు పుణ్యధనాలు చేయడం ఇతరులకు సహాయం చేయడం పుణ్యసాన్నాలు చేయడం ఆలాగున చేయడం ద్వారా వారికీ మోక్షం కలుగుతుంది అని ఆలోచన కొంతమంది కలిగి ఉన్నారు. 

నీకొదేము యేసుప్రభువారి యొద్దకు వచ్చి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ఏమి చేయాలి అని అడిగినపుడు యేసుప్రభువారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో చేరలేరని యేసయ్య చెప్పారు, అందుకని పరలోకరాజ్యము సమీపిస్తోంది మారుమనస్సు పొందుడి అని అయన మనకు భోదిస్తూన్నారు.

ఈమనస్సు అనేది చాల వేగంగా పయనిస్తుంది, ఈమనస్సు గోరమైనది మరియు అది మోసకరమైనది, దేవుని బిడ్డలుగా మనం పరలోక రాజ్యము చేరాలి అని అంటే మనం మారుమనస్సు కలిగివుండాలి ఈమనస్సు అనేది ముఖ్యంగా మూడు రకములుగా ఉంటుంది ఈమూడురకములైన మనస్సులగూర్చి మనం కనుక ఆలోచిస్తే .

1.మొదటిగా దైవసంభందమైన విషయాలలో మారుమనస్సు 
ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఆనాడు సజీవుడైన దేవుని విడిచి విగ్రహాలను పూజించేవారు, మనలను విమోచించె దేవుడు దగ్గరగా ఉండగా వారు విగ్రహాలను ఆరాధించేవారు.

అందుకే ఏలీయా ప్రవక్త జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి,బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి 1రాజులు18:21

మనం దైవసంభందమైన విషయాలపై మనస్సును కలిగి ఉండాలి, విగ్రహాలపై, లోకసంభందమైన విషయాలపై మనస్సును కలిగి ఉండరాదు దైవసంభందమైన విషయాలపై మన మనస్సు మారాలి, అన్యమత ఆచారాలను ఆచరించకూడదు.

2.శరీరసంభందమైన విషయాలలో మారుమనస్సు
పాపసంభందమైన విషయాలలో శరీరము ముఖ్యమైనది, శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీస్తుంది, దేవుని ఇష్టప్రకారం మనలను పాపములోనికి నడిపించే మన కోరికలను చంపుకొని, సాతాను మనలను ఎంతగా  ప్రేరేపించినా మనం వాటికీ దూరంగా ఉండాలి మారుమనస్సు కలిగి వాటిని విడిచిపెట్టాలి.

జక్కయ్యను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టి వాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి, ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, కన్నులెత్తి చూచిజక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.

అందరు అది చూచి ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి., జక్కయ్య నిలువబడిఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. లూకా సువార్త  19:1-7

జక్కయ్య తన పాపములను ప్రభువద్ద ఒప్పుకొని తన తప్పులను తెలిసుకొని విడిచిపెట్టాడు అటువంటి మారుమనస్సు మనమందరం కలిగి ఉండాలి, శరీరసంభందమైన విషయంలో మారు మనస్సు కలిగి జీవించాలి.

3.మూడవదిగా ఆత్మసంబంధమైన మనస్సు
లాజరు మరియు ధనవంతుని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే లాజరు ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట ఉండేవాడు, ధనవంతుని మనస్సు మనం చుస్తే వాడు నాప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఉండగా అతని ద్రుష్టి ఎప్పుడు తన వస్త్రములపై, ఆహారంపై, సుఖభోగములపై ఉండగా, లాజరు తన మనస్సులో తాను చనిపోయిన తరువాత దేవుని రాజ్యములో ఉండుట కొరకు ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సు కలిగి ఉండేవాడు లూకా సువార్త 16:20

ఈరోజున మనకు ఏమి కావాలి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండాలా?, ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సు కలిగి ఉండాలా? మనలను మనం పరిశీలిoచుకొని మనలో దేవునికి విరోధమైనవి ఏమైనా ఉండి ఉన్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని రాజ్యంలో చేరడానికి కావలసిన మారుమనస్సు మన అందరం కలిగి ఉండాలి అని ఆశిస్తూ ఆమెన్..

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
********************************************************


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం 
3rdసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరం గారు

మత్తయి సువార్త 4:19 ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;


ఈరోజున మనం ఎటు పయనిస్తున్నామో, ఎవరిని వెంబడించాలో, ఎవరిని వెంబడిస్తున్నామో మనం ఆలోచించుకోవాలి, ఈరోజు దేవుని పిలుపు ఆయనను వెంబడించుట అనే అంశము గూర్చి ధ్యానించుకుందాం, మొదటిగా అయన పరలోక రాజ్యమును గూర్చి ధ్యానిస్తే తరువాత అయన వాక్య భాగములో అయన అక్కడ ఉన్నవారిలో కొందరిని శిష్యులుగా చేసుకోవడానికి తన సువార్తను చెప్పడానికి అనేకులను తన తండ్రిలోనికి తీసుకురావడానికి వారి పాపమునుండి విడిపించడానికి దేవుని యొక్క సేవలో కొనసాగడానికి కొందరిని పిలుస్తున్నారు.

1.మొదటిగా వాక్యంలో మనం చుస్తే యేసుప్రభువారు ఎవరిని పిలుస్తున్నారు
ఒక జాలరులైన వారిని చేపలు పట్టుకొని తమ యొక్క జీవనం సాగించే వారిని యేసు ప్రభువారు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచి ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారిని పిలుస్తున్నారు, ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను, క్కడ అయన చేస్తున్న దేవుని పనిని మరికొందరు చేయాలి అని అయన ఉద్దేశం అందుకు వారిని పిలుస్తున్నారు

2.ఈరోజున మనలను ఎందుకొరకు అయన పిలుస్తున్నారు.
దేవుని పిలుపు ఎందుకొరకు అని అంటే అయన సేవ కొరకు అంతే కాకుండా అనేకమందిని దేవునిలోనికి నడిపించాలి, అనేక ఆత్మలను రక్షించాలి అని అయన పిలుస్తున్నారు.

అబ్రాహామును దేవుడు పిలిచాడు ఎందుకు అంటే తన స్వకీయజనాంగాన్ని ఏర్పాటుచేసుకోడానికి దేవుడు పిలిచాడు.

అంతే కాకుండా మోషేను దేవుడు పిలిచాడు ఎందుకు అని అంటే తన ప్రజలైన వారిని నశించిపోకుండా రక్షించుకొనుటకు అయన పిలిచాడు.

అంతే కాకుండా బైబిల్ గ్రంధములో అనేకమందిని తన పనికొరకు అయన పిలిచాడు, మూర్ఖుడు భయంకరుడు కఠినుడు ఐన సౌలును మార్చి దేవుడు తన పని కొరకు పిలిచాడు.

3.ఈరోజున మనలో దేవుని పిలుపు ఎలా ఉంది ఎవరి కొరకు అయన పిలుస్తున్నారు?

మొదటిగా తన సేవ కొరకు అయన పిలుపు ఉంది.
ఇక్కడ గమనిస్తే తన పని కొరకు పేతురు మరియు అంద్రెయ, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును యేసయ్య పిలవగానే అయన పిలుపుకు లోబడి ఆయనను వెంబడించారు.

రెండవదిగా అయన పిలుపు ఎవరికీ అంటే  
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.

ఈరోజున ఆనేకమంది భారమును మోస్తూ, కష్టమును మోస్తూ, వారి యొక్క బలహీనతలను బట్టి, వారి సమస్యలను బట్టి, జీవితంలో నిందలు అవమానములను బట్టి యేసయ్య మాటలను విని మనకు విశ్రాంతి కలుగ జేయుటకు అయన పిలుస్తున్నారు వాటి నుండి మనశాంతి కలుగ జేయుటకు ఆయన పిలుస్తున్నారు, మన బలహీనలతలను బట్టి మనకు స్వస్థతను కలుగ జేయుటకు అయన మనలను పిలుస్తున్నారు, మనలను బాగుచేయుటకు అయన పిలుస్తున్నారు.

మూడవదిగా ఎందుకు పిలుస్తున్నాడు అనే అంటే
యెషయా గ్రంథము 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకొందము మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱబొచ్చువలె తెల్లని వగును. 

ఇక్కడ మన పాపములను బట్టి అయన మనలను పిలుస్తున్నాడు, పాపమూ చేత మన అపరాధముల వలన, మన పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను వస్త్రమువలె ఉండగా వాటిని తెల్లని వస్త్రములవలె మార్చడానికి, అయన మనలను పరిశుద్ధపరచడానికి, మనలను పవిత్రపరచడానికి తన యొక్క రాజ్యములో చేర్చడానికి అయన మనలను పిలుస్తున్నాడు.

ఇక్కడ ఎవరు ఈ తెల్లని వస్త్రములు ధరించుకొనువారు అని మనం ఆలోచిస్తే
ప్రకటన గ్రంథము7:13 పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
14 అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.

ఎవరు ఈ తేలని వస్త్రములు ధరిచువారు అని అంటే యేసుప్రభువారి రక్తములో పాపములను కడుగుకొని వాటిని విడిచిపెట్టి ఆయనను వెంబడించువారు.

4.యేసుప్రభువారు ఎవరిని రమ్మనుచున్నారు, ఎందుకు రమ్మనుచున్నారు?
పాపులను అయన రమ్మనుచున్నారు, ఎందుకు రమ్మనుచున్నారు అని అంటే మనలో దేవునికి విరోధముగా ఉన్న మన పాపములను సమస్తములను విడిచి ఆయనను వెంబడించుటకు అయన రమ్మనుచున్నారు., అయన పనిని చేయడానికి రమ్మనుచున్నారు,

ఎందుకు ఆయనను వెంబడించాలని అయన రమ్మనుచున్నారు అని అంటే యేసుప్రభువారు ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొని తన స్వరక్తమును ఇచ్చి మన పాపములను బట్టి మనలను పవిత్రులుగా చేయడానికి అయన మనలను రమ్మనుచున్నారు ఫిలిప్పీయులకు2:6

ఈరోజున మనం ఎలా ఉన్నాము దేవుని పిలుపుకు లోబడి జీవిస్తున్నాము అయనను వెంబడిస్తున్నామా. మనం దేవుని పిలుకు లోబడి మన పాపములను అయన వద్ద వొప్పుకొని ఆయను వెంబడించువారిగా ఉండాలి అని ఆశిస్తూ.


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
********************************************************


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
4వరోజు సిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
దేవుని దయగల మాట

లూకా సువార్త 4:16-30., 22 అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడిఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా 

చదవబడిన వాక్యభాగములో మనం చుస్తే అయన దయగల మాట అని వాడబడినది ఎందుకు ఈమాట వ్రాయబడినది అని మనం ఆలోచిస్తే, దేవుని మాటకు ఒక శక్తి ఉన్నది అయన మాటతోనే ఈ సృష్టి అంతటిని సృష్టించారు. భూమ్యాకాశములను సృజించి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.  ఈ సృష్టి అంతటిని కేవలం అయన  మాట చొప్పున సృష్టించారు అటువంటి దేవుని మాటలు బలమైనటువంటివి.

ఆ దయ కలిగిన మాటలను ఎవరు పలుకుచున్నారు అని మనం ఆలోచిస్తే 

యేసుప్రభువారు నజరేతులోని సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును అయన  నన్ను పంపియున్నాడనెను అయన యొక్క బయట చొప్పున అక్కడ వున్నవారు ఆశ్చర్య పడినట్లుగా మనచుస్తాం.

ఈరోజున మనం దేవుని దయగల మాటలను గూర్చి ఏవిషయంలో అయన దయ గలిగిన మాటలు పలికారు అనే అంశమును గూర్చి వివరంగా ధ్యానించుకుందాం.

1.మొదటిగా ఎవరికీ అయన దయగల మాటలు అని మనం ఆలోచిస్తే నశించుపోవుచున్న ప్రజలకి అయన దయగల మాటలు.

జక్కయ్య గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే అన్యాయంగా సంపాదిస్తున్న వ్యక్తి., అందరు ఆయనను ఒక మోసకారిగా, ఒక పాపిగా చుస్తే అటువంటి జక్కయ్య యేసుప్రభువారి దయగల మాట చొప్పున మార్పు చెందాడు.

ఈరోజున యేసయ్య మనం ఎటువంటి మాటను నేర్చుకోవాలి అని చెప్తున్నారు అంటే
సామెతలు 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. 

మన మాటలు ఎదుటివారిని నొప్పిస్తున్నట్లుగా ఉంటె ఈరోజున దయగలిగిన మాటలను మనకు యేసుప్రభువారు నేర్పిస్తున్నారు మనం మాట్లాడే విధానం యేసయ్యను చూచి మనం నేర్చుకోవాలి. 

2.రెండవదిగా నలిగిపోయిన వారికీ, కృంగిపోయిన వారికీ, అయన దయగల మాట పలుకుచున్నారు.

ఈరోజున దిగులు చెందిన వారికీ అయన దయగల మాటలు ఆదరించేవిగా బలపరిచేవిగా అయన పలుకుచున్నారు.

ఒక విధవరాలు చనిపోయిన కుమారుని చూచి యేడ్చుచున్నపుడు యేసుప్రభువారు అమ్మ ఏడువవద్దని ఆమెతో చెప్పి ఆయన  చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఇక్కడ యేసుప్రభువారి దయగల మాట చేత ఆమెకు ఓదార్పును, ధైర్యమును, ఆదరణనుగుండె నిబ్బరమును  ఇచ్చినట్లుగా మనం చూస్తాం లూకాసువార్త 7:12-15

3.మూడవదిగా ఒక పాపిని క్షమియించి అయన దయగల మాట పలుకుచున్నారు.

పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభువారి పాదాల మీద పడినప్పుడు యేసుప్రభువారి దయగల మాట అపాపిని రక్షించినట్లుగా మనకు తెలుసు ఈరోజున అయన దయగల మాట మనలను కాపాడుతుంది , ఈరోజున ఆయన దయగలిగిన మాట అయన వాక్యము అటువంటి అయన మాటలు మనకు బలపరిచేవి, ఆదరించేవి. 

మరియొక సందర్భములో శతాధిపతి నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసయ్యను వేడుకొనగా యేసయ్య నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని అనగా అప్పుడు యేసయ్య మాట చొప్పున దాసుడు స్వస్థత కలిగెను.
యేసయ్య మాట అంతటి శక్తివంతమైనది, అటువంటి మాటలను మనం నిత్యం ధ్యానించువారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 6:8

4.చదవబడిన వాక్యంలో యేసుప్రభువారు మనకు రెండు సూచనలను చూపిస్తూ ఉన్నారు.

లూకా సువార్త 4:26-27 ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.
మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యేసుప్రభువారు మనకు రెండు సూచనలను చూపిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే దేవుని మాట శ్రేష్టమైనది అయన దయగల  మాట ఎవరైతే వింటారో వారే స్వస్థపడ్డారు. దేని వలన అంటే అయన  మాట వినడం వలన., ఆ దేవుని మాటే మనలను బాగుచేస్తుంది.

ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను సారెపతు విధవరాలు దేవుని మాట చొప్పున చేయగా ఆమె సమృద్ధిని పొందుకుంది.

ఈరోజున మనం దేవుని మాట వినే మనస్సును కలిగి ఉండాలి, ఈ దేవుని మాట మనలను బ్రతికిస్తుంది., దేవుని మాట మనలను బాగుచేస్తుంది., అటువంటి మృదువైన మాటలను మనం నేర్చుకోవాలి. యేసుప్రభువారు సిలువ పై పలికిన మాటలు విలువైనటువంటివి, ఎంతో దయగలిగినటువంటివి ఆమాటలు ఇప్పటికిని ఎన్నో నశించిపోవుచున్న ఆత్మలను దేవుని లోనికి నడిపిస్తున్నాయి., అటువంటి ఆదరణ కలిగిన దేవుని మాటలను నిత్యం ధ్యానించేవారిగా ఉండాలి అని ఆశిస్తూ ఆమెన్..

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

*****************************************************************

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
5thసిలువ శ్రమల ధ్యాన
కూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
అంశం : నజరేతు చిగురు రక్షించునది

యోహాను సువార్త 1:40-51.,45 ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.



1.యేసుప్రభువారు సంచరించినపుడు నజరేతు గ్రామం ఎలావుందీ ఈరోజున ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే
యేసుప్రభువారు సంచరించునపుడు నజరేతు అను గ్రామం చాల చిన్నది. చిన్నచూపుచూడబడిన గ్రామం, ఎన్నికలేనటువంటి గ్రామం, కానీ ఈరోజున ప్రపంచ చరిత్రలో ఎంతో ఖ్యాతిగణించినది, పవిత్ర స్థలంగా మంచి పేరుకలిగినది అటువంటి విలువైన పేరు వచ్చింది అని అంటే అది కేవలం యేసుప్రభువారివల్లే. మన జీవితం కూడా అంతే యేసు ఎక్కడ ఉంటె అక్కడ ఆశీర్వాదం, యేసు ఎక్కడ ఉంటె అక్కడ విజయం. అయన లేని జీవితం వ్యర్థం ఈలోకంలో జీవిస్తున్నా మనం యేసును కలిగి ఉండటం మనకు ఎంతైనా ఆశీర్వాదం, ఏమి లేక పోయిన లాజరు లాంటి బ్రతుకుకలిగి ఉన్న యేసును కలిగి ఉంటె అది మనకు ఆశీర్వాదం.


2.నజరేతు అనగా ఏమిటి ఆగ్రామమునకు ఎలా గొప్ప పేరు వచ్చింది మనం ఆలోచిస్తే 
ప్రతి పేరునకు ఒక అర్ధం ఉంటుంది ఆలాగుననే నజరేతు అనగా చిగురు లేదా రక్షించునది అని అర్ధం అది కేవలం యేసుప్రభువారివల్లే ఆపేరు వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలు అయన దయగల మాటలు విని ఆశ్చర్యపడినట్లుగా మనకు తెలుసు తరువాత యేసుప్రభువారు తన రాజ్య స్థాపన కొరకు శిష్యులను ఏర్పాటు చేసికొనుచున్నపుడు కొంతమంది శిష్యులను వెంబడించమని తన సేవ చేయమని అయన చెప్తున్నారు అయన ఒక 12సంఖ్యను కోరుకొని, 12శిష్యులను కోరుకొని వారిలో యోహాను అయన మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెనుమరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొనినన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసుఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.  
3.యేసు ప్రభువారు నతనయేలు గూర్చి ఒక సాక్ష్యమును ఇస్తున్నాడు అది ఏమిటి అని ఆంటే నతనయేలు యితడు ఏ కపటము లేని వాడు అని, ఈరోజున దేవుని బిడ్డలుగా మనం కపటం లేనివారిగా మనం ఉండాలి.  యేసుప్రభువారు గలిలయలో ఫిలిప్పును పిలిచి ఆయనను వెంబడించమని చెప్పారు ఫిలిప్పు నతనయేలును పరిచయం చేసుతున్నాడు వీరందరూ ధర్మశాస్త్రం ఎరిగినవారు దేవుని రక కొరకు సిద్ధపాటు కలిగినవారు దేవుని లేఖనములను ఎరిగినటువంటివారు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక భాద్యత మనకు కనిపిస్తున్నది అది ఏమిటి అని ఆంటే అనేకులను ఈరోజున మనం అనేకులను దేవుని లోనికి నడిపించేవారిగా ఉండాలి అనేది అయన ఉదేశ్యం.
 
4.
చిగురు అనగా ఏమిటి , మనం ఎందుకు చిగురించాలి ఈరోజున మనం ఎలా ఉన్నాం?
చిగురు అనగా ఇక్కడ మనం 3రకములుగా మనం ఆలోచించాలి, 
**మొదటిగా ఒక చెట్టు ఎండిపోయి ఆకులన్నీ రాలి పోయినపుడు  చిగురు వస్తుంది. **రెండవదిగా చెట్టు పరిపక్వత వచ్చినపుడు కూడా చిగురు వస్తుంది.
**మూడవదిగా ఆ చెట్టు నరకబడినపుడు చిగురు పుట్టుకు వస్తుంది, చెక్కబడినపుడు చిగురు పుట్టుకు వస్తుంది.
నజరేతు నుండి వచ్చిన చిగురు యేసుప్రభువారు, అయన చెక్కబడ్డాడు మన జీవితాలను చిగురింపజేయడానికి, యేసుప్రభువారు కొరడాలతో గాయపరచబడ్డారు తన రక్తాన్ని చిందించారు, అయన కొట్టబడ్డారు, నరకబడ్డారు, అయన మన కొరకు చిత్రహింసలను, గాయాలను భరించారు.

ఈరోజున ప్రపంచం చిగురిస్తుంది, క్రైస్తవ్యం చిగురిస్తుంది, విస్తరిస్తుంది, ఎందరో వచ్చి ఆశీర్వదించబడతున్నాము అని ఆంటే అయన ద్వారా వచ్చిన చిగురు. ఈరోజున ఆ త్యాగాన్ని గుర్తించి, ఆ గాయాలను గుర్తించి అనేకులు ఆగాయాల చెంతకు వస్తున్నారు, మనం కూడా ఆలాగుననే వస్తున్నాం, ఎందుకు అయన కొట్టబడ్డారు అని ఆంటే మనం ప్రభువును తెలుసుకోవాలి, ఆయనను అనుసరించాలి, ఆయనలో చిగురించాలి అని.  ఆయనను మనం కొనుగొనాలి, ఆత్మీయ అనుభవంలోకి మనం రావాలి, ప్రభువారి పిలుపునకు అనేకులను ప్రభువు చెంతకు తీసుకురావాలి.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..





 







No comments: