June Messages 2018


03జూన్ 2018 ఆదివారము ఆరాధన
అక్కయ్యపాలెం బాప్టిస్ట్ చర్చి
దైవజనులు పాస్టర్ M.ఆనందవరం గారు
 
ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము కీర్తనలు 32
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు  69,381,573,614

లూకా సువార్త 17:28-30
28 లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
29 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
30 ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్ష మగు దినమున జరుగును.

వాక్యపఠనములో యేసు ప్రభువారు ఒక సంఘటన రెండు విషయాలు గుర్తు చేస్తున్నారు 
**మొదటిగా సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా చేర్చుకోకపోతే వినక పోతే  వారిపరిస్థితి  సొదొమ గొమొఱ్ఱాల కంటే దారుణముగా ఉంటది అని గుర్తు చేస్తున్నారు
  
మత్తయి సువార్త 10:14ఎవడైనను మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.  
**రెండవదిగా కపెర్నహూమా మీదకు రాబోయే  శిక్ష  సొదొమ గొమొఱ్ఱాల కంటే  దారుణముగా  ఉంటది అని గుర్తు చేస్తున్నారు.

మత్తయి సువార్త 11:23-24

23 కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
24 విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను. 

**ఎందుకు దేవుడు ఈ పట్టణమును గుర్తు చేస్తున్నాడు  

**పేతురుగారు భక్తిహీనుల నాశనంనకు దృష్టాంతముగా  సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను గుర్తు చేస్తున్నారు.  
2 పేతురు 2:6-7మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి,

**యూదాగారు పరశరీరాను సారులైనందున నాశనంనకు దృష్టాంత ముగా సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను గుర్తు చేస్తున్నారు.   
యూదా 1:7ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణ ములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను.

సొదొమ గొమొఱ్ఱా పట్టణం చరిత్ర :-
**మృత సముద్రము 40మైళ్ళు  పొడవు 10మైళ్ళు వెడల్పు కలిగినది.
**మృత సముద్రములో భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం ,జింక్, కాల్సషమ్ ఖనిజములతో కూడినది కావున ఇది శ్రేష్టమైనది.   1920లో
**సాంద్రత  ఎక్కువ  కలిగినది  కావున ఇందులో మునుగుట జరుగదు.
**సొదొమ గొమొఱ్ఱా పట్టణం  మృత సముద్రమునకు  సమీపము  గల పట్టణం  

**మనము ఈ సొదొమ గొమొఱ్ఱా పట్టణం పరిస్థితి గురించి ఆలోచన చేస్తే  
ఒక సైంటిస్ట్ ఈ పట్టణం మార్గము గురించి పరిశీలన  చేస్తే
లోతు అబ్రాహాము కల్దియా దేశము నుండి వచ్చారు కల్దియా దేశమునకు 
ఇరాక్ నుండి సొదొమ గొమొఱ్ఱా పట్టణంనకు ఒక రహశ్య మార్గము ఉన్నది
 అని 1924,1960 లోసైంటిస్ట్ రుజువు చేశారు. 

**మరి ఒక సైంటిస్ట్ సొదొమ గొమొఱ్ఱా పట్టణం మృత సముద్రము మట్టానికి 500అడుగుల ఎత్తులో ఉన్న శిఖరం లో తవ్వకాల్లో బయటపడిన కుండలు ఒక హిందూ టెంపుల్ లో అందరు ఒకేసారి చనిపోయినట్టు గుర్తించారు.

 **భూడిద ఉన్నది సుమారు 20అంగుళాలు అని,  సల్ఫేర్ 98% ఉన్నది
గుర్తించారు.

సొదొమ గొమొఱ్ఱా పట్టణంను దేవుడు ఏమి చేసాడు
ఆకాశము నుండి అగ్ని  గంధకము కురిపించి నాశనం చేసాడు  

సొదొమ గొమొఱ్ఱా పట్టణం ఎలా ఉన్నది 
ఆదికాండము 13:10లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.

సొదొమ గొమొఱ్ఱా పట్టణం జనులు ఎలా ఉన్నారు.
విలాపవాక్యములు 4:6-8
 నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును           దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
7 దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
8 అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను. 
***అటువంటి అందమైన ప్రజలు అందరు ఒకేసారి నాశనం చేయబడ్డారు
****ఎందుకు దేవుడు సొదొమ గొమొఱ్ఱా పట్టణంను నాశనం చేసాడు

1.పాపము తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారు  
లూకా సువార్త 17:28
ఈ సొదొమ గొమొఱ్ఱా పట్టణం నాశనం చేయబడటానికి కారణం దేవుని మరిచి జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. 

2.సొదొమవారు  పాపమును బయలు  పరచినారు  
యెషయా గ్రంథము 3:9
వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ

3.సొదొమవారు దుర్మార్గమునుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరిచుచున్నారు 
యిర్మీయా 23:14
యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

4.సొదొమవారు దేవుని మరిచి గర్వమును,ఆహార సమృద్ధియు సుఖస్థితి కలిగియున్నారు.
యెహెజ్కేలు 16:49-50
నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెల కును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. వారు అహంకరించి
 నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని. 


ఎందుకు దేవుడు ఈ పట్టణమును గుర్తు చేస్తున్నాడు .,దేవుడు మన నుండి ఏమికావాలని కోరుచున్నారు
దేవుని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిని లెక్క చేయని వారికీ సొదొమవారివలె నాశనం చేయబడతారు.
మరి ఈ దినంలో మనము ఎలా ఉన్నాము దేవుని మరిచి దేవునికి భాధ కలిగించే హృదయం మనలో ఉండకుండా మనపాపములను ఒప్పుకొని, తప్పులను చేసేవారిని బలపరచకుండ  చెడు పనులను విడిచి, దేవుని ఎదుట నిలిచి దేవుని క్షమించమని దేవుని కొరకు జీవించాలి  అట్టి మార్పు కలిగి ఉండాలని దేవుడు మన అందరిని ఆశీర్వదించాలని ఆశిస్తూ

దేవునికి మహిమ కలుగును గాక  ఆమెన్ 
***********************************************************

ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు:92
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు   7,384,535,386
దైవసేవకులు P.జోషిగారు I.E.M.సెక్రటరీ మధ్యప్రదేశ్ 
Topic: ప్రేమ
 
యోహాను సువార్త 13:31-35


35 మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.

I.E.M పరిచర్య సేవ కార్యక్రమములు 
**బైబిల్ 59భాషాలలో తయారు చేయుటకు కృషి చేస్తున్నారు.
**ట్రైబల్ ఏరియాలలో సువార్త పరిచర్య జరుగుతుంది.   
 **అనేక కార్యక్రమముల ద్వారా దేవుని సేవ జరుగుతుంది. 
**మెడికల్ సేవల్లో సేవలు అందిస్తున్నారు   

 ప్రేమ:-
**బైబిల్ అంత ప్రేమతో నిండియున్నది.
**యేసయ్య కార్యములు ప్రేమతో నిండినవి. 
**ప్రేమ వినుట రుచికరంగా ఉంటుంది.
**ప్రేమను బోధించడం సులభంగా ఉంటుంది.
**ప్రేమకలిగి ఆచరించడం కష్టంగా ఉంటుంది.
**ప్రేమతో చేయుడి యేసయ్య అని చెప్తున్నారు.

**మన కార్యములు ప్రేమతో చేయాలి.
1 కొరింథీయులకు 16:14 మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
 
**ప్రేమ శ్రేష్టమైనది, ప్రేమ గొప్పది యేసయ్య అని చెప్తున్నారు
1 కొరింథీయులకు 13:13
కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

**యోసేపు గురించి ఆలోచన చేస్తే సహోదరుల యెడల ప్రేమ
ఆదికాండము 45:4అంతట యోసేపునా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడుఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమి్మవేసిన మీ సహోదరుడైన యోసేపున

**యోసేపు వలె సహోదరుల యెడల ప్రేమ కలిగి ఉండాలి 
ఎందుకు  మనలను ప్రేమతో ఉండమని యేసయ్య చెప్పుతున్నారు.
యేసయ్య శిష్యులని  ప్రజలు  తెలుసుకోవాలని

యోహాను సువార్త 13:35
మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను.
**మనము  ప్రేమను ఎంతగా పాటిస్తున్నాము.

(ప్రేమ)  LOVE అనగా
L: Listen Carefully
అనగా మనము జాగ్రత్తగా వినువారిగా ఉండాలి
సమస్యలు ఎన్ని ఉన్న అవి వినుట వలన సగం తగ్గును.
 
O: Open Your Heart
మన హృదయాలను తెరచి ఉంచాలి
అన్ని మరచి మనము శుద్ధ హృదయం కలిగి ఉండాలి.

V: Value Each Other
ఒకరి నొకరు విలువ, గౌరవం కలిగి ఉండాలి
భార్య మాటకు భర్తల విలువ కలిగి ఉండాలి, భర్త మాటకు భార్య , గౌరవం కలిగి జీవించాలి. అత్తా కోడళ్ల మధ్య ప్రేమ కలిగి జీవించాలి.

E: Enjoy Fellowship
దేవుని సంఘములో ఒకరి నొకరు సహవాసంలో ఆనందించాలి
ఈ రీతిగా మన ప్రభువైన యేసయ్య ఇచ్చిన నూతన ఆజ్ఞ
మనమందరము ఒకరి యెడల మరిఒకరు ప్రేమ కలిగి జీవించాలి

మన పరిస్థితి  ఎలా  ఉన్నది మనము ప్రేమ కలిగి ఉంటున్నామా
మన ప్రేమ ఎలా ఉన్నది భార్య భర్తల మధ్య ప్రేమ అత్తా కోడళ్ల మధ్య ప్రేమ కలిగి జీవించాలి .దేవుని వాక్యము శ్రద్దగా విని ఆచరించు వారీగా ఉండాలి
ఒకరినొకరు ప్రేమింపవలెను ఆదరింపవలెను దేవుని సన్నిధిలో అందరి యెడల ప్రేమ తో ఉండాలి. అట్టి ప్రేమ కలిగి మనమందరము దేవుని రాజ్యంలో ఉండాలని ఆశిస్తూ
 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 

*****************************************************
24/06/2018
ఆదివారము ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
Response Reading కీర్తనలు:116
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు   9,140,441,614
MESSAGE BY దైవసేవకులు
PASTOR M.ANANDAVARAM GARU
 Topic:గట్టిగా పట్టుకొనుడి
ప్రకటన గ్రంథము 2:25-29
25 నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి.

ఏమి చేయాలి అని పౌలు భక్తుడు ప్రభువును అడుగుచున్నాడు  
అపొ కార్యములు 22:10అప్పుడు నేనుప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువునీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.

మనము ఏమి కలిగి ఉండాలి ?
1. మనకు కలిగిన రక్షణ పాత్రను గట్టిగా పట్టుకొనువారిగా ఉండాలి. 
కీర్తనల గ్రంథము 116:12-13
12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
13 రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.

2. క్రీస్తుయేసునందు విశ్వాసమును కలిగియున్న వారిగా ఉండాలి.
కొలొస్సయులకు 1:3పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు,

3. ఏకప్రేమ కలిగిన వారిగా ఉండాలి.
ఫిలిప్పీ 2:2మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.

4. దయ కలిగిన వారిగా ఉండాలి.
ఎఫెసీయులకు 4:32ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.

5. మంచి మనస్సాక్షియు కలిగిన వారిగా ఉండాలి.
1 తిమోతికి 1:18నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.

6. సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగిన వారిగా ఉండాలి.
1 తిమోతికి 2:1మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును

7. మనకు కలిగిన ఆత్మవరములు జాగ్రత్తగా కాపాడుకోవాలి
1 కొరింథీయులకు 12:28, 4-11మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.
రోమీయులకు  12:6-8మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, 7 ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను, 8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
అట్టి కృప మన అందరికి దయచేయాలని ఆమెన్ , దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..