11-15th Lentdays2020


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
11సిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య ఆనందవరంగారు
లూకా సువార్త 4:33-36
Topic:యేసు దెయ్యమును పట్టిన వానిని స్వస్థపరచుట

యేసుప్రభువారు సమాజ మందిరములో ఉన్నపుడు అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొకడు, వాడు నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ప్రభువారు ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను. 

ఈరోజున మనం ఎలా జీవిస్తున్నాం మనం కనుక అపవిత్రంగా జీవిస్తే మనం కూడా ఈవిధంగా అపవిత్రాత్మలవలె అవుతామేమో మనలను మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ వాక్యంలో ఒక దెయ్యము పెట్టినవాడు చెప్తున్నాడు ఆయనను గుర్తించి యేసు నివి ఎవరో నాకు తెలుసు నీవు నజరేయుడైన యేసువు అని, ఈరోజున మనం ఎలా ఉన్నాం మన జీవితంలో ప్రభువును కనుగొని ఆయనను గుర్తెరిగి జీవిస్తున్నామా, ఆయనలోగల పారిశుద్దతను ఎరిగి మనం జీవించాలి, అయన పరిశుద్ధ రక్తంలో విడుదల క్షమాపణ కలదు అని మనం తెలుసుకోవాలి.

ఈ అపవిత్రాత్మ అనేదాని గూర్చి మనం ఆలోచిస్తే ఇది సాతాను యొక్క అధీనంలో ఉంటుంది. ఈ దయ్యపు పట్టిన వాణి ఆత్మ యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అని మనం ఆలోచిస్తే

1.మొదటిగా వారు ఇతరులను గాయపరిచేగుణం కలవారు.
ఈఅపవిత్రమైన ఆత్మ పెట్టినవారు ఇతరులను గాయపరిచే గుణమే గల వారు మరియు తమను తాము గాయపరచుకొనే గుణము గలవారీగా ఉంటారు.

ఈరోజున మనం మన మాటల ద్వారా, చేతల ద్వారా ఇతరులను గాయపరిచే గుణం కలిగి ఉంటే ఇటువంటి గుణం దెయ్యపు ఆత్మకు సూచనగా ఉంది, ఈ దెయ్యం దేనికి సూచనా అని అంటే ఇది మనలో ఉన్న చెడ్డ ప్రవర్తనకు సూచనగా ఉన్నది. ఈప్రపంచంలో తల్లితండ్రులను హింసించేవారు, భార్య భర్తలను, భర్త భార్యలను హింసించేవారు, తమ యొక్క సొంత బిడ్డలను హింసించేవారు అనేక మంది ఉన్నారు., ఈపనులు ఎవరికీ సూచనా అని అంటే అవి సాతాను క్రియలకు సూచనా, సాతాను ద్వారా చేయబడుచున్న పనులు, దెయ్యపు క్రియలకు సూచనా. ఈరోజున దేవుని బిడ్డలుగా మనం దేవునికి విరోధమైన క్రియలను విడిచి పెట్టి మంచిక్రియలను కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉండాలి.

2.రెండవదిగా మనం చుస్తే ఈ దెయ్యపు ఆత్మ కేకలు వేస్తుంది. 
ఈరోజున కుటుంబాలలో, ఇరుగుపొరుగులలో మనం చుస్తే నిత్యం ఏవో ఒక కేకలు మనకు వినిపిస్తూ ఉంటాయి, ఈకేకలు దెయ్యపు ఆత్మకు సూచనా ఉన్నవి అటువంటి వారీగా మనం ఉండ దేవుని బిడ్డలుగా మనం మనలను సరిచేసుకోవాలి.

3.ఈరోజున మనం ఎలా ఉన్నాము.
ఇతరులను గాయపరచువారిగా ఉంటున్నామా, మన మాటల ద్వారా చేతల ద్వారా ఇతరులపై కేకలు వేసే వారీగా ఉంటున్నామా మనం ఆలోచించుకోవాలి దేవుని బిడ్డలుగా మనం మన యేసుప్రభువారిని గుర్తెరిగి పరిశుద్దాత్మ కలిగిన వారీగా ఉండాలి, ప్రార్ధనపరులుగా ఉండాలి. అటువంటి జీవితం కలిగి ఉండటానికి మనం ప్రభువుకు ప్రార్థిద్దాం అటువంటి జీవితం కలిగి ఉందాం ఆమెన్.

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

***********************************************************

.

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
12thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
మత్తయి సువార్త 14:22-33
Topic: యేసుప్రభువారు నీటిపై నడచుట

యేసుప్రభువారు జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కిను  అంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని గలలియా సముద్రముపై ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఉధృతికి అలలు రేపబడినప్పడు రాత్రి నాలుగవ జామున ఆయన సము ద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను. ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

గలాలియా సముద్రము 141అడుగుల లోతు కలిగినది, సీనాయి కొండపై మంచు కరిగి ఈసముద్రంలో కలుస్తుంది కనుక ఈ నీరు శ్రేష్టమైనది. ఇక్కడ సముద్రము అనగా ఈలోకమునకు సూచనగా ఉన్నది, వారు ప్రయాణిస్తున్న దోనె లేదా నావా మనుష్యులమైన మనకు సూచనాగా ఉన్నది, మన కుటుంబాలకి సూచనగా ఉన్నది, గాలి మనకు వచ్చే కష్టాలకు సూచనగా ఉన్నది ఈ గాలి ఇక్కడ ఏమిచేస్తుంది అంటే అలల ఉదృతిని పెంచుతుంది గలిబిలి సృష్టిస్తుంది.

1.ఇక్కడ దోనెలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉన్నది అని మనం చుస్తే

మార్కు 6:48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి,

మనం కష్టం వచ్చినపుడు, నష్టం వచ్చినపుడు కృంగిపోవువారు కొందరైతే, భాదలు, అప్పులు, ఇబ్బందులు ఉన్నప్పుడు చనిపోవడానికి ప్రయత్నించేవారు మరి కొందరు.
ఈ లోకమనే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ అలలు అనే శోధనలు వచ్చినపుడు మనం ఏమిచేయాలి అని ఆలోచిస్తే కృంగిపోకూడదు. 

ఈ లోకమనే సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ అలలు అనే శోధనలు వచ్చినపుడు మనం కృంగిపోకూడదు.  అక్కడ శిష్యులకు గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆ సమయంలో వారికీ ఎన్నో ఆశ్చర్యములు అద్భుతములు చేసిన యేసుప్రభువారు వారికీ గుర్తుకు రాలేదు. ఈరోజున మనం ఎన్నో భాదలనైనా భరించడానికి ఇష్టపడుచున్నాము కానీ యేసుప్రభువారి సన్నిధికి రావడానికి ఇష్టపడటం లేదు. మన భారం అయన మీద మోపితే ఆయన మన జీవితంలో విజయo లోనికి అయన నడిపిస్తాడు., లేకపొతే మనం పడే ప్రయాస వ్యర్థమే. మనం ఈరోజున మోకరించి మన యేసయ్యకు ప్రార్థిస్తే మనకు కావలసినది, మనం అడిగినది ఇవ్వడానికి మన జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి అయన ఆశ పడుచున్నాడు.

2.ఈరోజున మన జీవితంలో మనం ఏమి చేయాలి.
మనం ఈ లోకమనే సముద్రంలో భాదలు పడవలసిన అవసరంలేదు, మనం దేవుని పాద సన్నిధికి వస్తే ఏ కష్టమైన నష్టమైనా మనలను విడిపించగల సమర్థుడు మన యేసయ్య.

యేసుప్రభువారు శిష్యులు కష్టపడుచుండగా అయన చూచి సముద్రంపై నడచి వారివైపు వస్తున్నారు .అంతవరకూ అయన ఎక్కడ వున్నారు అయన కొండపై ప్రార్థిస్తూ ఉన్నారు అయన అవసరమైనప్పుడు యేరీతిగా రావాలో అయన ఆలాగున వస్తారు. ఈభూప్రపంచంలో ఎవరైనా సముద్రం పై నడిచివచ్చిన వారు ఎవరయినా ఉన్నారు అంటే అది యేసుప్రభువారు మాత్రమే.

ఆవిధంగా నడచివస్తున్న ఆయనను చూచి శిష్యులు భయపడ్డారు, వెంటనే యేసు ప్రభువువారు  ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగిఒ ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొనిఅల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను, వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. 

ఇక్కడ పేతురు మొదట యేసయ్యను చూచి భయపడెను, తరువాత అయన యేసుప్రభువారి వలే సముద్రం మీద నడవాలి అని కోరిక కలిగి నడిచాడు, ఈ రోజున మనం కూడా యేసుప్రభువారి అయన జీవించాలి అని కోరిక కలిగి ఉండాలి పేతురు గాలిని చూచి భయపడి తన కున్న అల్పవిశ్వాసం వలన మునిగిపోసాగెను. 

మనం దేనికి భయపడకూడదు, మన యేసయ్య మనతో ఉండగా మన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చిన అయన మనకు తోడుగా ఉంది విజయమును అందిస్తాడు, యేసయ్య పేతురును సముద్రముపై నడిపించినట్లుగా మనలను ఆధ్యాత్మికంగా ఆయనలో నడిపించడానికి మన జీవితంలో భాదలు కష్టములనుండి విజయమును ఇవ్వడానికి అయన పాదసన్నిధికి పిలుస్తున్నాడు.

యేసయ్య మన అందరిని దీవించునుగాక ఆమెన్.



దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

************************************************************

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
13thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M. ఆనందవరం గారు
మత్తయి సువార్త 15:21-28
Topic:కనాను స్త్రీ కుమార్తెను బాగుచేయుట.

యేసుప్రభువారు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె అయన దగ్గరకు వచ్చినపుడు జరిగిన సందర్బమునుగూర్చి వివరిస్తుంది.
తూరు పట్టణం దావీదుసమయంలో ఈరాము అనే ఒక రాజు పట్టణమును ఎంతగానో అభివృద్దిచేసినట్లుగా మరియు దేవుని పరిశుద్ద మందిరం కట్టడానికి విస్తారమైన కలపను అయన ఇచ్చినట్లుగా దావీదు సమయంలోనే పట్టణమునకు తూరు అని పేరు పెట్టబడినది అని చరిత్రకారులద్వారా మనకు తెలుస్తుంది.

కనాను స్త్రీ గూర్చి మనం ఆలోచన చేస్తే ఈకనానీయులు చాల బలవంతులు మరియు శూరులైనటువంటివారు అని యెహోషువ కాలంలోని ఆప్రాంతాలోని ప్రజలగూర్చి వివరించబడినది. అటువంటి ప్రాంతమునుండి ఒక స్త్రీ యేసుప్రభువారి యొద్దకు వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

1.ఈదేవుని వాక్యమును బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే
ఇక్కడ సందర్బములో స్త్రీ యేసుప్రభువారిని దావీదు కుమారుడా అని సంభోదించినట్లుగా మనం చూస్తాం. యేసుప్రభువారు ఎవరో అయన చేసిన అద్భుతకార్యాలను ,స్వస్థత లను గూర్చి ,అయన శక్తిని గూర్చి తెలుసుకొని ఆయనను దావీదు కుమారునిగా లేఖనములను తెలిసినదిగా ఆయనను ఎంతో వినయముగా పిలిచినట్లుగా మనం చూస్తాం,

మనం కూడా మన ప్రార్ధనలో ప్రేమ కలిగిన యేసయ్యను ప్రేమతో పిలవగలగాలి, మన నోటితో అయన గొప్పతనమును గూర్చి మనం ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకోనువారీగా మనం ఉండాలి, అయనను ప్రేమతో పిలిచేవారిగా మనం ఉండాలి, 

2.ఇక్కడ సంధర్బములో మూడువిషయములు మనకు కనిపిస్తున్నాయి,

మొదటిగా ఇక్కడ యేసుప్రభువారు ఆమెను, ఆమెకున్న ఓర్పును పరీక్షిస్తున్నారు.
మత్తయి సువార్త 15:23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా 

మనం గమనిస్తే మొదటిసారి ఆమె యేసుప్రభువారిని దయ్యము పట్టిన తన కుమార్తెను బాగుచేయమయిని వేడుకొనినప్పుడు యేసుప్రభువారు ఒక్క మాటైనను చెప్పలేదు.

రెండవదిగా ఇక్కడ యేసుప్రభువారు ఆమె సహనమును పరీక్షిస్తున్నారు.
రెండవసారి ఆయనను ఆమె అడిగినప్పుడు మత్తయి సువార్త 15:24 ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను.

మూడవదిగా ఇక్కడ యేసుప్రభువారు ఆమె యొక్క విశ్వాసమును పరీక్షిస్తున్నారు.
మూడవసారి ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. అప్పుడు యేసుప్రభువారు పిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా., ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అప్పుడు యేసుప్రభువారు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను

3.ఎలా ఆకనాను స్త్రీ కుమార్తె స్వస్థత పొందుకుంది, మనం నేర్చుకోవాలిసినది ఏమిటి

మూడవసారి ఆమె ఆయనను సహాయం చేయమని అడిగినపుడు యేసయ్య పిల్లల రొట్టె తీసుకోని కుక్కపిల్లకు వేయుట యుక్తము కాదు అని చెప్పినపుడు ఆమె ఆయనపై విసుగుకోకుండా , నిరుత్సాహం చెందకుండా, యేసుప్రభువారు గొప్ప దేవుడు అయన ఒక్కడే తన కూతురికి స్వస్థత ఇస్తాడు అని తెలిసి, తనను తానూ తగ్గించుకొని సహనం కలిగి ఓర్పుతో ఆయనను వేడుకుని తన కూతురుని రక్షించుకొన్నది. యేసుప్రభువారిపై ఆమెకున్న గొప్ప విశ్వాసం బట్టి తన కూతురు స్వస్థత పొందుకుంది

ఈరోజున మనం కూడా అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి సహనం కలిగి ఓర్పుతో దేవుని ప్రార్దించువారిగా మనం ఉండాలి, యేసయ్య గొప్ప దేవుడు అయన మనం అడిగినది మనకు దయచేస్తాడు అని ఓపికతో కనిపెట్టాలి యేసయ్య నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను కారణం ఆమెకున్న గొప్ప విశ్వాసం, మనం కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు మన యేసయ్య అని గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి మనం పట్టుదలతో నమ్మకత్వం కల్గి ఆయనను అడగాలి., అప్పుడు అయన మనం అడిగినవి అన్ని మనకు దయచేస్తాడు.

మన ఆర్థిక ఆవసరములైన, కుటుంబ అవసరములైన, స్వస్తతలైన, కనాను స్త్రీ ఆయనపై కలిగిఉన్న గొప్ప విశ్వాసం, సహనంతో తగ్గించుకొని ప్రార్థిస్తే మన యేసయ్య మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేసి మనకు విజయాన్ని దయచేస్తాడు

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

************************************************************


బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
14thసిలువ శ్రమల ధ్యానకూటములు
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
మార్కు సువార్త 7:31-37
Topic: చెవిటి నత్తిగల వానిని బాగుచేయుట 

ఇక్కడ చదవబడిన వాక్యభాగములో యేసుప్రభువారి యొద్దకు చెవుడు నత్తి గలవానిని అయన దగ్గరకు తీసుకువచ్చినపుడు అయన బాగుచేసినట్లుగా మనము చూస్తాం.
ఈవినికిడి, మాట అనేది మనజీవితంలో చాల శ్రేష్టమైనది. కానీ ఇక్కడ తీసుకురాబడిన వ్యక్తికి ఈవినికిడి లోపం, నత్తిగా మాట్లాడుట ఉండటం వలన అతని పరిస్థితి మనం చుస్తే అది చాల బాధాకరమైన పరిస్థితి. 

ఈవినికిడి అనేది సాధారణంగా నలభై నుండి నలభైదు డెసిబుల్ వరకు ఉండాలి, అంతకన్నా ఎక్కువగా ఉంటె ఈవినికిడి లోపం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చివిలో పెట్టుకొని వినే వినికిడి వస్తువులవల్ల శారీరకమైన మరియు మానసికమైన రోగములకు గురైయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని సైన్స్ చెప్తుంది.

అటువంటి వినికిడి లోపమున్నఈవ్యక్తికి ఉన్న మరొక లోపం మరియొక శారీరక బలహీనత ఏమిటి అని అంటే అతడు మాటలలో నత్తిగలవాడు. యితడు చెవుడు మరియు నత్తి అనే రెండు వ్యాధులు గలవాడు. అటువంటి వ్యక్తిని యేసుప్రభువారి దగ్గరకు అక్కడ కొందరు తీసుకురావడం జరిగింది.

అప్పుడు వారు చెవుడుగల నత్తి వాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి, వానిమీద చెయ్యి యుంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, అని వ్రాయబడినది.

1.మొదటిగా ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటి అని అంటే
మొదటిగా యేసుప్రభువారు వాని చెవులలో తన వ్రేళ్లుపెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టినట్లుగా మనం చూస్తాం, ఎందుకు అని అంటే యేసుప్రభువారు ఆవ్యక్తిలో ఉన్న చేదును అయన స్వీకరించి వారికీ స్వస్థత ఇవ్వడానికి అయన ఆవిధంగా చేసారు,

ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం చుస్తే ఇక్కడ చేదు అని అంటే మన పాపములనే చేదును అయన స్వీకరించి, అయన మన పాపములను భరించి మన కొరకు అయన తన రక్తమును చిందించి మంచిని మనకు అందించారు.

ఇక్కడ చెవుడు అంటే., ఆధ్యాత్మిక చెవుడు నుండి మనుష్యులకు స్వస్థత రావాలి అని , దేవుని బిడ్డలైన వారిలో కొందరు దేవుని మాటలను వినుటకు ఇష్టపడటం లేదు., వారు లోకపరమైన విషయాలకు సమయం ఇవ్వడానికి ఇష్టపడుచున్నారు గాని దేవుని మాటలు వినడానికి చోటివ్వడం లేదు.

ఈఆధ్యాత్మిక చెవుడు గూర్చి దేవుని వాక్యం ఏమి చెప్తుంది అని అంటే
మత్తయి13:15 గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది.

దేవుని వాక్యమును వినని వారిని గూర్చి ఏమి చెప్తుంది అని అంటే
జెకర్యా 7:11 అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండ చెవులు మూసికొనిరి.
 అటువంటి వారు చెవులుండి చెవిటివారు అని ఈభూప్రపంచంలో ఉన్న అటువంటి వారిని గూర్చి ఉద్దేశించి మాట్లాడుచున్నారు

దేవుని వాక్యమనే సత్యమును వినడానికి మనం చేనియ్యటం లేదు అని చెప్తుంది
2 తిమోతికి 4:4 సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి అని యేసయ్య కోరుచున్నారు అని అంటే
దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యం వినేవారిగా ఉండాలి.
దేవుని బిడ్డలుగా మంచివాటిని వినేవారిగా ఉండాలి.

దేవుని వాక్యం మనం నిత్యం వింటే ధ్యానిస్తే మనకు ఏమి కలుగుతుంది
ప్రకటన గ్రంథము2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.

దేవుని వాక్యం మనం వింటే అటువంటి దేవుని మాటలు మనలను బ్రతికిస్తాయి, అంతేకాకుండా  దేవుని మాటలు మన జీవితాలను బాగుచేస్తాయి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది.

అందుకే ఆధ్యాత్మికంగా మన చెవులు తెరువబడాలి., అటువంటి ఆధ్యాత్మిక చెవుడు నుండి మనకు స్వస్థత కావాలి అని మన యేసయ్య ఈరోజున మనతో మాట్లాడుచున్నారు.


2.ఈవ్యక్తికున్న రెండవ బలహీనత నత్తిగలవాడు
ఆధ్యాత్మికంగా మనం చుస్తే ఇక్కడ నత్తి అని ఆంటే శారీరక అతనికున్న వ్యాధ్యే కానీ, 

యేసయ్య మనలో దేవుని వాక్యము చదవడంలేనటువంటి వారిని గూర్చి దేవుని స్తుతించలేనటువంటి వారిని గూర్చి ఆధ్యాత్మిక నత్తి గలవారీగా వాక్యం చెప్తుంది అటువంటి వారీగా మనం ఉండరాదు అని యేసయ్య ఆశపడుచున్నారు.

3.మూడవదిగా ఎందుకు యేసయ్య వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; అని మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే


ఎందుకు మన యేసయ్య ఆకాశమువైపు కన్నులెత్తి చూచినపుడు దుఃఖం కలిగింది ఆంటే ఆయనకు దేవుని బిడ్డలైన వారిని గూర్చి యెషయా ప్రవక్త పలికిన మాటలు గుర్తుకు రావడం వలన ఆయనకు అంత దుఃఖం కలిగి నిట్టుర్పు కలిగింది. యేసయ్య ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసారు, అనేకమందికి అద్భుతమైన స్వస్తతలను ఇచ్చారు. కానీ ఈ చెవుడు నత్తి గల వానిని స్వస్థపరచినపుడు అయన నిట్టూర్పు విడిచారు ఎందుకు ఆంటే మనం దేవుని బిడ్డలమైన మన గూర్చి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథము 42:20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.

అందుకే ఇక్కడ అయన చేదును స్వీకరించి విస్మయం పొందారు మన పాపములను బట్టి, అందుకే మనం ఈరోజు నేర్చుకోవలసినది ఏమి ఆంటే మనం దేవుని వాక్యం శ్రద్ధతో వినే అయన బిడ్డలుగా, నలుగురితో దేవుని వాక్యమును పంచె బిడ్డలుగా ఉండాలి ఆధ్యాత్మిక బలహీనత నుండి మనం స్వస్థత పొందుకోవాలి అట్టి కృప యేసయ్య మన అందరికి అందించును గాక ఆమెన్.

యేసయ్య ఈమాటలను దీవించునుగాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్..


*****************************************************************

బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
15thసిలువ శ్రమల ధ్యానకూటములు  
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు 
యోహాను సువార్త 4:46-54 
Topic:యేసయ్య జ్వరము నుండి స్వస్థపరచుట

మానవుని శరీరం సాధారణంగా ఉండవలసిన వేడిమి కన్నా ఎక్కువ వేడిగా ఉంటె ఈ వ్యాధిని జ్వరము అని అంటారు ఈ జ్వరం మానవులకు బాక్టీరియల్, ఫంగల్ , వైరల్ కారకాలవలన రావడం జరుగుతుంది.

1.ఈ జ్వరమును గూర్చి బైబిల్ గ్రంధములో ఏమి వ్రాయబడినది అని మనం చుస్తే
బైబిల్ గ్రంధములో మనం గమనిస్తే ఈ జ్వరము అనేది దేవుని యొక్క శాపానికి సూచనగా ఉన్నది ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి వారికీ ఈ వ్యాధి కలిగింది ఈ జ్వరమును తాపకరమైన జ్వరం అని బైబిల్ గ్రంధములో వ్రాయబడినది

లేవీయకాండము 26:16 నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు; 

2.బైబిల్ గ్రంధములో ఈ జ్వరము నుండి స్వస్థత పొందిన వారిని గూర్చి మనం గమనిస్తే

పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచుఉండగా పౌలుగారు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది.

అపొస్తలుల కార్యములు  28:7 పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
8 అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.

సీమోను పేతురు అత్తా ఈజ్వరముతో బాధపడుచుండగా యేసుప్రభువారు ఆమెను స్వస్థపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం.

మార్కు సువార్త 1:29-31 వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారియింట ప్రవేశించిరి.
30 సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి.
31 ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.

ఇప్పుడు మనం చదవబడిన వాక్యమును మనం గమనిస్తే ఒక ప్రధానికుమారుని
జ్వరము నుండి యేసయ్య స్వస్థపరచుట.
యోహాను సువార్త 4:46-47 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూ ములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను.
47 యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.

3.ఈ జ్వరం అనే వ్యాధిని ఆధ్యాత్మికంగా మనం చుస్తే 

ఈ జ్వరం అనే వ్యాధి మానవ శరీరమును ఏవిధంగా క్షిణింపజేస్తుందో, మన పాపములనే జ్వరం కూడా మనలను ఆవిధంగా ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగకుండా  క్షిణింపజేస్తుంది. ఈపాపం వలన మన ఆత్మ అపవిత్రం అవుతుంది., అటువంటి ఈ అపవిత్రమైన జీవితాన్ని మన యేసయ్య ఒక్కడే బాగుచేస్తాడు.

ఐతే మనం అపవిత్రంగా ఉంటె ఏమి జరుగుతుంది
ఈ జ్వరం మన ప్రాణాన్ని ఎలా బలహీనపరుస్తుందో, పాపం అనేది మనిషి ఆత్మను అపవిత్రముచేసి బలహీనపరుస్తుంది , ఈ జ్వరం ఎవరికీ వస్తుంది అంటే ఎవరైతే అపవిత్రంగా ఉంటారో వారు ఎక్కువగా ఈ జ్వరబారిన పడటానికి అవకాశం ఉంటుంది.

మనిషి జీవితానికి పరిశుద్ధత ఎంత అవసరమో, మనిషి జీవితానికి దేవుని వాక్యం ద్వారా, మన ప్రార్ధన ద్వారా మనలో ఉన్న ఆత్మకు పరిశుద్ధత ఇవ్వడం కూడా అంతే అవసరం.

దేవుని వాక్యంలో మనం చుస్తే యేసుప్రభువారిని ఆ అధికారి జ్వరంతో బాధపడుచున్నతన కుమారుని బాగుచేయమని వేడుకొనగా 

యేసయ్య నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారునిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మినట్లుగా మనం చూస్తాం.

అయన యేసయ్యను కలవడానికి ఎంతో దూరప్రాంతం నుండి ప్రయాణం చేసి వచ్చాడు. ఎందుకు అని ఆంటే ఇక్కడ అయనకు యేసయ్యపై ఉన్న గొప్ప విశ్వాసం, అయన ఆశక్తి మనకు కనిపిస్తుంది, యేసయ్య తన కుమారుని స్వస్థపరచగల దేవుడు అని నమ్మాడు కాబట్టి అటువంటి ఆ విశ్వాసం స్వస్థతను ఇచ్చింది.

4.ఈరోజున దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవలసినది ఏమిటి అని ఆంటే
దేవునికి ఇచ్చే సమయం మనం ఆయనకు ఇవ్వాలి, ఆయనపై మరియెక్కువగా విశ్వాసం ఉండాలి , అప్పుడే మనం ఎంతటి వ్యాధి నుండి ఐనా స్వస్తత పొందుకుంటాం అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య.

మనం శారీరక స్వస్థతను గూర్చి ఆయనను అడగాలి ఆధ్యాత్మిక స్వస్థతను గూర్చి అడగాలి అప్పుడు కలువరి సిలువలో మన కొరకు యేసయ్య కార్చిన రక్తము ద్వారా మనం ఎటువంటి బలహీనత నుంచైనా స్వస్థత పొందుకుంటాం., అట్టి కృప మన అందరికి సదా కలుగును గాక ఆమెన్.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..


 





No comments: