ఏప్రిల్ Messages2019



7/04/2019 ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య రేవ M.ఆనందవరంగారు
లూకా  22:39-46ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.

**యేసుప్రభువారు అనుభవించిన అనేకమైన శ్రమలలో ప్రాముఖ్యమైనది గెత్సమనే తోటలో అయన పడిన బాధను గూర్చి రోజున మనం ధ్యానించుకుందాం.

**గెత్సమనే అనగా గానుగ అని అర్ధం (OIL PRESS)

** గెత్సమనే తోట యెరూషలేము ప్రాకారానికి తూర్పున ఉన్నటువంటి చిన్నకొండ ప్రాంతము.యేసుప్రభువారు ఎక్కువగా అక్కడ ప్రార్థనలో గడిపేవారు

ఎందుకు అయన గెత్సమనే తోట ఎక్కవ సమయం గడిపేవారు అని అంటే?

గెత్సమనే వనంలో ఒలీవల చెట్లతో కూడినది ఇది యేసయ్య ఇష్టపడిన స్థలం.

అక్కడ యేసయ్య ఎక్కువగా ప్రార్ధనలో గడిపేవారు.

ఒలీవల చెట్ల యొక్క ప్రత్యేకతను గూర్చి మనం గమనిస్తే 

** ఒలీవల చెట్టుకు విలువెక్కువ
** ఒలీవల చెట్టు యేసుప్రభువారికి సాదృశ్యంగా ఉంది.

1.మొదటిగా ఒలీవ చెట్లు స్థిరమైనదిగా, బలమైనదిగా ఉంటుంది, అనేక సంవత్సరములు జీవిస్తాయి.

పాతనిభంధన గ్రంధమును మనం గమనిస్తే జల ప్రళయం తరువాత కూడా ఒలీవల చెట్లు స్థిరంగా ఉన్నట్లు మనము చూడవచ్చు.

ఆదికాండము 8:11 నల్ల పావురమును ఓడలోనుండి వెలుపలికి విడిచెను.
11 సాయంకాలమున అది అతనియొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను.

**జలప్రళయంలో మొత్తం అన్ని నశించిపోయిన ఒక పావురం నోటా త్రుంచబడిన ఒలీవ ఆకును మనం గమనిస్తే, ఒలీవల చెట్టు ఎంత స్థిరంగా బలంగా ఉంటాయో మనకు అర్ధం అవుతుంది.


**మనం తెలుసుకోవలసినది మన దేవుడు ఆదియందు ఉన్నవాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఒలీవ చెట్టు వలే స్థిరమైనవాడు


**ఆలాగుననే మనం దేవుని బిడ్డలుగా ఎన్నికష్టాలు శోధనలు అవమానములు వచ్చిన పడిపోయే పరిస్థితులు ఉన్న మన యేసయ్యలో పరిశుద్ధంగా స్థిరంగా ఉండాలి


2.రెండవదిగా మనం పచ్చని ఒలీవ చెట్టువలె ఉండాలి దేవుని వాక్యంలో గమనిస్తే 

కీర్తనల గ్రంథము 52:8నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమి్మక యుంచుచున్నాను.

** ఒలీవల చెట్టు ప్రత్యేకత ఇది పచ్చనిది.

**పచ్చదనం అని అంటే అభివృద్ధికి సూచన బాగుగ ఉండుటకు గుర్తుగా ఉన్నది.

**ఆలాగుననే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు దేవునిలో అభివృద్ధి కలిగి ఉండాలి.

**చెట్టు పచ్చగా ఉండాలి అంటే సమృద్ధిగా నీరు ఉండాలి, మనమైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యమనే నీరు కలిగి జీవించాలి.

**మనం అభివృద్ధిలో ఉండాలి అని అంటే దేవుని మందిరంలో ఉండాలి.

**దేవుని ప్రాముఖ్యత తెలుసుకొని దేవుని సన్నిధిలో బలపరచబడాలి


3.మూడవదిగా ఒలీవల గింజలతో వచ్చిన నూనె ప్రత్యేకమైనది

** ఒలీవలచెట్లు బాగా పండిన తరువాత చెట్ల యొక్క నల్లని గింజలను గానుగలో వేసి నలుగ గొట్టి ఒలీవల నూనెను తీసేవారు.

** నూనె ప్రపంచవ్యాప్తంగా ఘనత కలిగినది, ప్రత్యేకమైనది

** ఒలీవల నూనెతో దేవుని సేవకులకు యాజకులు అభిషేకించడానికి వాడేవారు

** ఒలీవల నూనె రాజులను అభిషేకించడానికి ఉపయోగించేవారు

**అటువంటి గొప్పతనం కలిగిన నూనెతో యేసయ్య మనలను అభిషేకించి అభివృద్ధి పరచువారిగా మనం ఉండాలి

4.నాల్గవదిగా ఒలీవల చెట్టు నూనె  స్వస్థపరచుటకు ఉపయోగిస్తారు దేవునివాక్యము గమనిస్తే 

యాకోబు 5:14మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

**ఎందుకు అని అంటే ఒలీవల నూనెలో స్వస్థపరచు గుణం కలిగినది.
ఒలీవల చెట్టు నూనె అంత విలువైనది.

చెట్ల గూర్చి దేవుని వాక్యమును గమనిస్తే 

న్యాయాధిపతులు 9:8-11  చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి9 మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.

ఇక్కడ వాక్యభాగమును పరిశీలిస్తే

**ఇక్కడ నాలుగు చెట్లును గుర్తు చేస్తుంది, చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి ఒలీవల చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్షచెట్టు , చివరగా ముండ్ల చెట్టును అడుగగా ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియ మించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; అని చెప్తున్నట్లుగా మనం చూస్తునాం.

**ముండ్ల చెట్టు శాపానికి సూచన, భాదపరచుగుణం కలిగియున్నది, అణచివేయునది, అటువంటి సాతాను జీవితంలోకి వెళ్ళరాదు.

**మనం అటు ఇటు తిరిగే మనస్తత్వం విడిచి మనమైతే ఒలీవల చెట్టులాగా అభిషేకించబడేలాగా ఉండాలి.

యేసుప్రభువారు ఒలీవల చెట్ల మధ్య ప్రార్ధన చేసేవారు
యేసుప్రభువారికి జరగబోయే శ్రమ కళ్ళ ముందు కనబడుతుంటే అయన మరింత ఆతృతగా ప్రార్ధన చేయగా ఆయన చెమట రక్త బిందువుగా మారి అక్కడపడినవి.

**యేసయ్య అంతగా బాదపడినది మనకొరకు మనకు రక్షణ ఇవ్వడానికి ఆభాదను భరించారు

**మనం మంచి జీవితం కలిగి ఉండాలని బాగుగ ఉండాలి అని అయన గొప్ప బాధని భరించారు అందుకే అయన చెమట రక్త బిందువులాగే మారి పడింది.


5.మనం ఎలా ఉండాలని యేసయ్య కోరుతున్నారు.

**మనం కూడా ఒక ఒలీవ చెట్టులాగా ఉండాలి.

**మనం ఒలీవ చెట్టులాగా స్థిరంగా ఉండాలి

**మనం ఒలీవ చెట్టులాగా బలంగా ఉండాలి

**మనం ఒలీవల నూనెతో  ప్రార్ధన చేస్తే అద్భుతములు జరగాలి
**మనం ఒలీవ చెట్టులాగా దేవుని చేత అభిషేకింపబడాలి

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
__________*****************************************___________
21/04/2019 ఈస్టర్ ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: యేసయ్య పునరుద్ధానం
మత్తయి 28:1-7.,7 త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

యేసుప్రభువారు శుక్రవారం సిలువలో మరణించిన తరువాత యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.
**అరిమతయియ యోసేపు చాల ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.
**యోసేపు దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి, సంకెళ్లతో బందించి సైనికులను కాపలాగా ఉంచి  వెళ్లిపోయెను.   

1.యేసుప్రభువారి పునరుద్ధానంను గూర్చి ఆలోచన చేస్తే
**ఆదివారమున అకస్మాత్తుగా భూకంపంకలిగి అయొక్క సంకెళ్లు తెంపబడి, రాయి కదిలింపబడింది, యేసయ్య పునరుద్ధణ శక్తికి అవి నిలువలేకపోయాయి
**ఇది ఒక శక్తి వంతమైనది మరియు ప్రభావంతమైనది.
**ప్రముఖుల సమాధులు, దావీదుసమాధి, రాజులైన వారిసమాధులు తెరవబడలేదు గాని యేసయ్య సమాధి తెరబడి యేసయ్య సజీవుడై లేచాడు, కారణం అయన గొప్ప దేవుడు శక్తిమంతుడును ప్రభావంకలిగినవాడు

 2.యేసయ్య పునరుద్ధానం వలన మనకు నిరీక్షణ కలుగుతుంది.
*ఆయనతో మనము పునరుద్ధాన శక్తి పొందుకొనుటకు నిరీక్షణ కలిగిఉండాలి.
*పునరుద్ధానశక్తి పొందుకొనేందుకు నిరీక్షణ కలిగి సిద్దపడి ఉండాలి
*దేవుని రాజ్యంలో మనకు అట్టి భాగ్యం కోసం నిరీక్షణ కలిగిఉండాలి.   
 
3. యేసయ్య పునరుద్ధానం వలన మనకు పరిశుద్ధత కలుగుతుంది.
 **యేసయ్య పునరుద్ధానం ఇది పరిశుద్ధులకు మాత్రమే కలుగుతుంది.  
**యేసునందు నిద్రించిన వారు సమాధినుండి తిరిగి లేచుదురు.
**అయన రాకడలో పరిశుద్ధులైన వారి యొక్క పునరుద్ధానం జరుగుతుంది.
** మొదటి పునరుద్ధానంలో వేయియేండ్లు పరిపాలన ఉంటుంది

ప్రకటన గ్రంథము 20:5-65 వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము. 6 మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
**ఎందుకు అని అంటే ఆయనలో ఉన్నలక్షణం పరిశుద్ధత.
** పరిశుద్ధతయే అయన బలం, అయన నీతి, అయన యదార్థత, ఆయన శక్తి

అటువంటి భాగ్యము మనం పొందుకోవాలి, పరిశుద్ధ గుంపులో మనం ఉండాలి
లోకాన్ని నమ్ముకొని జీవిస్తే అగ్ని గంధకములో పడవేయబడతాము, అని దేవుని వాక్యము చెప్తుంది.
ప్రకటన గ్రంథము 20:10వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

4.యేసయ్య పునరుద్ధానం వలన మనకు విశ్వాసం కలుగుతుంది.
**యేసుప్రభువారు శిష్యులైన వారికీ మూడవరోజున తిరిగిలేస్తాను అని చెప్పారు.
**ఐనా వారు విషయం మరచిపోయారు, వారు ఏస్థితి నుండి వచ్చారో మళ్లీ అదే స్థితిలోకి వెళ్లి పోయారు.

అందుకే బైబిల్ గ్రంధములో యేసయ్య అంటున్నారు. లూకా 24:25
అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

** రోజున మన స్థితి ఎలా ఉన్నది యేసయ్య శిష్యులుగా మండిచల్లారిపోవుచున్నాము.
లూకా 24:32అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

**మనం ఎలా వున్నాం, సంఘములో దేవుని వాక్యము వింటూ మండుచున్నాము, బయటకువెళ్లి లోకంలోపడి చల్లారిపోవుచున్నాము.

**అటువంటి బైబిల్ గ్రంధములో యేసయ్య అంటున్నారు,పునరుద్ధణబలం విశ్వాసంలో ఉన్నది.

యోహాను 11:25అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;
**అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసం మనకు బలం, ఆదరణను ఇస్తుంది.

5.అటువంటి యేసయ్యను మనం వెదకాలి.
యేసయ్యను మనం ఎలా వెదకాలి దేవుని వాక్యంలో వెదకుట గూర్చి ఏమి వ్రాయబడినది.

పరమగీతము 3:1-4రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

సంఘము ఆలోచించుకోవలసిన మాట ఏమిటి అని అంటే
**సిలువ వేయబడిన యేసుప్రభువారిని ఎలా వెదకుచున్నాము, ఉద్దేశంతో వెదకుచున్నాము.

** మనమైతే యేసయ్యను పట్టణపు విధులలో, మోసపూరితమైన సంతవీధులలో వెదికేవారిగా కాకుండా, యేసుప్రభువారి కోసం పాపములను అన్నింటిని విడిచి వెదకాలి.

**పూర్ణాత్మతో, పూర్ణహృదయముతో వెదకాలి, అప్పుడు అయన మనకు దొరుకుతారు.

**మనం అయనలో నిరీక్షణ కలిగి, పరిశుద్ధతతో, అయన యందు విశ్వాసంతో, పాపములను విడిచి, అయన శక్తిని పొందుకొని యేసుప్రభువారిని వెంబడించాలి, అట్టికృపను పొందాలి.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
***********************************************************************

8April2019 ఆదివారము ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు

యోహాను 21:15-18.,15 వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.

**యేసుప్రభువారు సమాధి నుండి తిరిగి లేచిన తరువాత తన శిష్యులైన వారికీ అగుపడి నలభై దినములు వారితో గడిపి, కలసి భోజనముచేసి, వారితో సహవాసము చేసి వారిని బలపరిచారు.

**చదవబడిన వాక్యమును గమనిస్తే యొక్క సందర్బమును బట్టి యేసుప్రభువారు తన శిష్యుల నుండి ఆశించేది కోరుకొనేది ఏమిటి అని అంటే, యేసయ్య అందరికంటే పేతురు నుండి ఎక్కువగా ప్రత్యేకమైన ప్రేమను కోరుతున్నారు.

**అటుతరువాత ఒక సంధర్బములో యేసుప్రభువారు సీమోను పేతురుతో నీవు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అప్పుడు పేతురు అవునని చెప్పెను, అప్పుడు యేసయ్య నా గొఱ్ఱెలను మేపుమని చెప్పెను.


** రోజున యేసయ్య మనలను ఇదే ప్రశ్నను వేస్తున్నారు.
ప్రశ్నఏమిటి అని అంటే వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా


 మనం అందరికంటే యేసయ్య ప్రేమించాలి, అని మనం రోజున తీర్మానం చేసుకోవాలి.

**యేసయ్య, బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పినట్లుగా, మొదటి సంఘమును స్థాపించినవాడు పేతురు. అందుకనే పేతురు అనే బండ మీద పేతురు ద్వారా యేసయ్య మొదటి సంఘమును స్థాపించుకున్నారు.

**చదవబడిన వాక్యంలో యేసయ్య పేతురును మూడుసార్లు నన్ను ప్రేమిస్తున్నావా అడిగారు అంతేకాకుండా యేసయ్య నా గొఱ్ఱెలను మేపుమని, కాయుమని చెప్పెను.

గొఱ్ఱె యేసుప్రభువారికి సాదృశ్యం, మంచి గొఱ్ఱెల కాపరి గూర్చి కొన్ని ప్రత్యేకమైన మాటలను బైబిల్ గ్రంధములో వ్రాయబడినవి .

కీర్తనలు 23 :1-2యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.

**నిజమైన కాపరి తన గొఱ్ఱెల కొరకు ప్రాణం పెడతాడు, పచ్చికగల చోట్ల మేపుతాడు, జలములు ఉన్నచోటకి తీసుకువెళ్తాడు

గొఱ్ఱెలు వాటి యొక్క పరిస్థితిని గూర్చి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంధములో మాటలను గమనిస్తే

1.మొదటిగా గొఱ్ఱె యొక్క పరిస్థితి తప్పిపోయిన గొఱ్ఱెగా ఉన్నది.

యెషయా  53:6
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.

**ఒక విశ్వాసి ఒక గొఱ్ఱెగా పోల్చబడినది, గొఱ్ఱె త్రోవ తప్పిపోయిన గొఱ్ఱెగా ఉన్నది.

**ఎందుకు గొఱ్ఱె తప్పిపోవుచున్నది అని అంటే తన ఇష్టమైన త్రోవలో వెళ్ళుట వలన తనకు తానుగా తప్పిపోవుచున్నది.
  
**అందుకని ప్రియులారా త్రోవ తప్పిపోవద్దు, సంఘములో స్థిరంగా ఉండాలి, బలపరచబడాలి, బలపడాలి.
 
**అంతే కాకుండా కుటుంబంలో కూడా స్థిరంగా ఉండాలి బాధ్యత కలిగి ఉండాలి


2.రెండవదిగా ఈ గొఱ్ఱె యొక్క పరిస్థితి నశించిపోవుచున్నగొఱ్ఱెగా ఉన్నది.

మత్తయి 15:24 ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను.

**ఇక్కడ ఇశ్రాయేలీయుల జనులను నశించిపోవుచున్నగొఱ్ఱెలకు సాదృశ్యము.
కారణము ఏమిటి ఆంటే వారి స్వార్ధ బుద్ది, వారి తిరుగుబాటుతనం, వారి గర్వాంధకారం వలన వారు నశించిపోవుచున్నారు.

**మనము కూడా త్రోవతప్పిపోవుచున్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలా చేసిన యెడల నశించిపోవుదాము.

**అందుకనే నశించిన దానిని వెదకి రక్షించుటకు మన యేసయ్య మన కొరకు వచ్చారు.


3.మూడవదిగా ఈ గొఱ్ఱె యొక్క పరిస్థితి కాపరిలేని గొఱ్ఱెగా త్రోవ తప్పిపోవుచున్నది.

మార్కు 6:34
గనుక యేసు వచ్చి గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతులను బోధింప సాగెను.

**కాపరి లేని గొఱ్ఱెలు చెదరిపోవుచున్నవి త్రోవ తప్పిపోవుచున్నవి


4.ఈ గొఱ్ఱెలు ఎలా ఉన్నవి అని దేవుని వాక్యమును గమనిస్తే

యెహెజ్కేలు 34:4-5 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
5 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

**అవి బలహీనమైన, రోగముగల, గాయపడిన గొఱ్ఱెలు. 
**సంఘము గాయపడిన గొఱ్ఱెలను ఆదరించాలి, బలహీనమైన వారిని బలపరచాలి, సంఘము వారిని కాపాడాలి.

** యొక్క గాయమును కట్టే వారీగా దేవుని బిడ్డలు ఉండాలి.

**కాపరులు, పెద్దలు, సంఘము గొఱ్ఱెలను గూర్చి బాధ్యతను వహించాలి.

**ఇది యేసయ్య మనకు ప్రత్యేకించి ఇచ్చిన భాద్యత.

**మన యేసయ్య నిజమైన కాపరి, అయన మనకు తృప్తికరంగా జీవితం ఇస్తున్నారు, అయన దక్షిణహస్తంతో మనకు సహాయం చేస్తున్నారు.

**మనము నిజమైన గొఱ్ఱెలుగా ఉండాలి

5.నిజమైన గొఱ్ఱెలు ఎలా ఉంటాయో యేసయ్య చెప్పిన మాటలలో గమనిద్దాం.

మంచి గొఱ్ఱె తన కాపరిని ఎరుగును.

యోహాను 10:15తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.

**ఎరుగుట అనగా గుర్తించుట అని అర్ధం, మన ప్రధాన కాపరి ఐన యేసుప్రభువారిని ఎరిగి జీవించాలి.

**అయన గొప్పతనమును ఎరిగి ఉండాలి , అయన ప్రభావమును ఎరిగి ఉండాలి.

**అయన గూర్చి ఎరిగి ఉంటేనే మనకు అయన యందు విశ్వాసం కలుగుతుంది


నిజమైన గొఱ్ఱె తన కాపరి స్వరమును ఎరుగును.

యోహాను 10:16 దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.

వినుట అనునది విశ్వాసికి ప్రాముఖ్యమైనది, కాపరి స్వరమును విని అనుసరించే వారీగా ఉండాలి.

నిజమైన గొఱ్ఱె తన కాపరిని వెంబడిస్తాయి.

యోహాను 10:27నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.

మనము దేవుని మరియు దేవుని సేవకుల మాటలను అనుసరించాలి.

**దేవుని వాక్యమును విని ఆయనను వెంబడించేవారిగా ఉండాలి.

కాపరి నిజమైన గొఱ్ఱెలను, మేకల నుండి వేరుచేస్తాడు, దేవుని వాక్యమును గమనిస్తే

మత్తయి  25:32-33 అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి
33 తన కుడివైపున గొఱ్ఱలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.

** మేకలు వాటి స్వభావం ఎగిరి ఎగిరి పడతాయి, అన్యులైన వారిని మేకలతో పోలుస్తున్నారు.
 
6.యేసయ్య క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని రక్షించి, కాపాడుతారు. 
యెహెజ్కేలు 34:20-21
20 కాబట్టి ప్రభువైన యెహోవా మాట సెలవిచ్చు చున్నాడుఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.
21 మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.

**క్రొవ్విన గొఱ్ఱల వలె ఉండరాదు. కొమ్ములు గర్వానికి సూచనా అధికారమునకు సూచనా, అటువంటి వారి నుండి యేసయ్య రక్షించి, కాపాడుతారు.

7.మనం ఎలా ఉన్నాం?

చెదరగొట్టే గొఱ్ఱెగా ఉన్నామా , తప్పిపోవుచున్న గొఱ్ఱెగా ఉన్నామా, నశించు గొఱ్ఱెలుగా , ఇష్టమైన త్రోవలో పోవుచున్నామా ఆలోచించుకోవాలి, మనలను మనం పరిశీలించుకోవాలి.

మనం ఎలా ఉండాలి. 
**మనం అందరికంటే యేసయ్యను ఎక్కువగా ప్రేమించే బిడ్డలుగా ఉండాలి.
 
**మనం దేవుని స్వరం వినే గొఱ్ఱెలుగా ఉండాలి.

**యేసయ్యను అనుసరించే గొఱ్ఱెలుగా ఉండాలి.

**నిజమైన మంచి లక్షణములు కలిగిన గొఱ్ఱెలుగా ఉండాలి.

**సాత్వికము కలిగి ఉండాలి అట్టికృప మనం కలిగి ఉండాలి.
 
యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.