21 to 25Lentdays 2019



21st Lentday29/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev .M.ఆనందవరంగారు

మార్కు 15:16-20
16 అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరములోపలికి తీసికొనిపోయి, సైనికులనందరిని సమ కూర్చుకొనినతరువాత
17
ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి,
18
యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.

యేసయ్య గొప్పదైన పరలోకరాజ్యమనే జీవకిరీటమును, మహిమ కిరీటమును, నీతి
కిరీటమును మనకు ఇచ్చుట కొరకు యేసయ్య ముండ్ల కిరీటమును ధరించుకొని మనం
పడవలసిన భాదను అయన అనుభవించారు

**ఇంకా అనేక కిరీటములు యేసయ్య మనకు ఇస్తున్నాడు. ఈకిరీటములు గూర్చి బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే 

1. యేసయ్య మనకు నీతికిరీటం ఇస్తున్నాడు.

2 తిమోతికి 4:8ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. దినమందు నీతిగల న్యాయాధి పతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్ర హించును.

**నీతి మరణము నుండి విడుదల కలిగిస్తుంది.

**నోవహు నీతి అతనిని మరణం నుండి రక్షించింది.

**నీతిమంతుల నాలుక, ఆలోచన, మాట మాదిరికరంగా ఉంటుంది

**అందుకే నీతికీరిటం ఘనమైనది, విలువైనది, ప్రత్యేకమైనది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు.

**మనం నీతిమంతులుగా ఉండాలి నీతిని కిరీటంలాగా ధరించాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు.

2.అక్షయ కిరీటం యేసయ్య మనకు ఇస్తున్నాడు

1 కొరింథీ 9:25మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.

**క్షయము ఆంటే పాడైపోవునటువంటిది అని అర్ధం.

**అక్షయము ఆంటే పాడవనటువంటిది శాశ్వతమైనది అని అర్ధం.
**సాతాను మనకు ఎన్ని ఆశలు చూపించిన మితముగా పోరాడి, ఎన్ని భాదలు శోధనలు వచ్చిన తట్టుకొని యేసయ్య ఇచ్చు అక్షయమనే కిరీటమును పొందుకోవాలి.

**మన గురి పరలోకరాజ్యం, రాజ్యమును చేరుకోవటానికి ప్రయత్నించాలి

3.అతిశయకీరీటము యేసయ్య మనకు ఇస్తున్నాడు.

1 థెస్సలొనీకయులకు 2:19 ఏలయనగా మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకీరీటమైనను ఏది? మన ప్రభువైన యేసుయొక్క రాకడ సమయమున ఆయన యెదుట మీరే గదా.

**ఇది యేసయ్య సంఘమునకు ఇచ్చే కిరీటం.

**కాపరి అతిశయపడునట్లుగా సంఘము ఉండాలి

**యేసయ్య అతిశయపడునట్లుగా సంఘము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

**సంఘము పరిశుద్దమైనదిగా, కళంకము లేనిదిగా యేసయ్య ఇచ్చు అతిశయకీరీటము పొందుకోనునట్లుగా ఉండాలి

మనం పాపములను విడిచి యేసయ్య చూపిన ప్రేమను కలిగి, కృతజ్ఞతతో యేసయ్యలో జీవించాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య ఈమాటలను దీవించును గాక ఆమెన్
*********************************************************************

22nd Lentday 30/03/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు

మత్తయి 27:27-31
29 ముండ్ల కిరీట మును అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలోనుంచి, ఆయనయెదుట మోకాళ్లూనియూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి
30
ఆయన మీద ఉమ్మివేసి, రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.

చదవబడిన వాక్యభాగమును మనము గమనిస్తే యేసు ప్రభువారికి ఒక రెల్లును గుచ్చితరువాత దానిని చేతితో పట్టుకొనుటకు ఇచ్చిరి.

**పాతనిభందన గ్రంధములో మోషేకు దేవుడు పది ఆజ్ఞలతో కూడిన రెండు రాతి పలకలను ఇచ్చి వాటిని తుమ్మ కఱ్ఱతో చేసిన వాటికీ బంగారు రేకును పొదిగి, వాటి వంకీలను బంగారముతో పొదిగి ఒక మందసము లాగా తయారుచేసి వాటిమీద రెండు రాతి పలకలను పెట్టమని చెప్పాడు.

**తుమ్మ కఱ్ఱ ముళ్లతో నిండినది, అది ఇతరులను గాయపరచిన గుణం కలది, అది అణిచివేయబడినది.

**అటువంటి తుమ్మ కఱ్ఱతో మందసము చేసి అతి పరిశుద్ధ స్థలములో పెట్టుటకు దేవుడు అధికారము ఇచ్చాడు.

అంతే కాకుండా అనేక సేవకుల ద్వారా మోయబడుటకు ధాన్యతను తుమ్మకఱ్ఱకు ఇచ్చాడు.

తుమ్మకఱ్ఱ మనుష్యులకు సూచనగా ఉన్నది

**తుమ్మ ముళ్ల వంటి మనజీవితమును దేవుడు సరిచేసి మన హృదయమనే మందసములో దేవుని వాక్యము ఉండాలని దేవుని ప్రణాళిక

**అణచివేతస్థితిలో నుండి శాపకారమైన స్థితి నుండి మన జీవితంలో ముళ్ల వంటి భాదలని తీసివేసి విలువైన జీవితం మనకు యేసయ్య ఇస్తున్నాడు.  

పాతనిభందన గ్రంధములో రెల్లును గూర్చి అనేక విషయాలు వ్రాయబడినవి.

** రెల్లు ఒక ప్రత్యేకమైనవి, రెల్లు ఎక్కువగా జమ్ముగడ్డలో పెరుగుతుంది.

**వీటిని గూర్చి ఆలోచన చేస్తే, రెల్లు కఱ్ఱలు నీటి ద్వారా పెరుగుతాయి.
 
**ఈరెల్లు కఱ్ఱలను పడవలను తయారు చేయటానికి ఉపయోగిస్తారు

ఈరెల్లు యొక్క ప్రాముఖ్యతను గూర్చి బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే

1.యేసు ప్రభువారు నలిగిన రెల్లును గూర్చి చెప్తున్నారు.

మత్తయి 12:20విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు.

యెషయా ప్రవక్త నలిగిన రెల్లుతో ఐగుప్తును పోలుస్తున్నారు
యెషయా 36:6నలిగిన రెల్లువంటి యీ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా; ఒకడు దానిమీద ఆనుకొన్నయెడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకొనువారికందరికి అట్టివాడే.

** రెల్లు గుణం అది గుచ్చుకొనును మరియు దూసికొనిపోవును.

** రెల్లు నలిగితే దాని స్వభావం మారిపోతుంది, ప్రమాదకరంగా మారుతుంది

**ఇక్కడ ఐగుప్తు లోకానికి సూచనగా ఉన్నది.

**మనం ఈలోకమనే నలిగిన రెల్లును నమ్ముకొంటే అది మనకు గుచ్చు కొంటుంది, నరకంలోకి తీసుకుపోతుంది.

2.మరొక రెల్లు గాలికి కదులుచున్న రెల్లు 

మత్తయి 11:7వారు వెళ్లిపోవుచుండగా యేసు యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలు చున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్లితిరి?

**ఈరెల్లు తేలికగా ఉంటుంది గాలికి అటు ఇటు కదులుతు స్థిరత్వం లేనిదిగా ఉంటుంది.
  
**గాలి ఆంటే శోధనకు సూచన, దేవుని బిడ్డలుగా మనం గాలికి కదిలే రెల్లుగా ఉండరాదు.

**దేవుని బిడ్డలుగా మనం స్థిరంగా ఉండి దేవుని సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వాలి

3.మరియొక రెల్లు వాడిపోయేరెల్లు 
యెషయా 19:6ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.
**ఎందుకు రెల్లు వాడిపోవుచున్నది, అని ఆంటే దానికి నీరు అందటం లేదు.
**మనం కూడా రెల్లులాగా దేవుని వాక్యమనే నీరు అందకపొతే దేవుని సన్నిధి లేకపొతే మన జీవితం కూడా రెల్లులా వాడిపోతుంది

4.నీటిలో అల్లాడు రెల్లు 
1రాజులు14:15 ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.

**నీరు అనేది అల్లాడువారికి సూచనగా ఉన్నది.
**కొన్ని సందర్భాలలో రెల్లు నీటిలో అల్లాడుచు విరిగిపోతుంది, పెల్లగించి చెదరిపోతుంది, అటువంటి రెల్లుగా మనం ఉండరాదు.

5.ఆలాగుననే యేసుప్రభువారికి రెల్లుతో ఎందుకు కొట్టారు తరువాత ఎందుకు యేసు ప్రభువారి చేతికి ఇచ్చారు ?

**యూదులరాజుగా ఆయనను అవమానించుటకు రెల్లుతో కొట్టారు.

**తరువాత ఆయనకు రాజ దండముగా పట్టుకొనుటకు ఈఅల్పమైన అల్లాడు రెల్లును అయన చేతికి ఇచ్చారు..   

మనం కూడా అల్లాడు రెల్లు వలె ఉంటున్నామాయేసయ్య చేతిలో రెల్లును చూసి మనలను మనం సరిచేసికొని, స్థిరమైన దేవుని బిడ్డలుగా ఉండాలని యేసయ్యను వేడుకొందాం

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
********************************************************************
23rd Lentday 01/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: సిలువ భారం

లూకా  23:26-30
26 వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి
 
**యేసుప్రభువారిని పిలాతు తీర్పు తీర్చి యూదులైన వారికీ అప్పగించిన తరువాత అయన భరించిన అనేకమైన భాదలలో సిలువ భారం ప్రధానమైనది.

**ఒక చెక్కను సిలువగా చేసి అయన భుజం మీద పెట్టారు
ఇది భారభరితమైన సిలువ సుమారు 137kgs ఉండవచ్చు యేసుప్రభువారు అభారాన్ని సిలువ వేయు స్థలము వరకు మోయబడ్డారు
 
శారీరకభారము, ఆర్థిక భారము, వ్యాధులు, అవమానములు, నిందలు, ఇబ్బందులు  అనేకరకమైన భారములు ఈలోకంలో ఉన్నాయి బాధలను గూర్చి పరిశీలిస్తే

1.మొదటిగా వ్యక్తిగతమైన భారం మోయుట .
**బరువులు మోయుట అనేది పాతనిబంధన గ్రంధములో జంతువులు ద్వారా మోయబడేవి మరియు అనేక మనుష్యుల ద్వారా మోయబడేవి.
**
ఇది కష్టానికి సూచనగా ఉన్నది
**శరీరశ్రమకు సంబంధిన భారంనకు సూచనగా ఉన్నది.
కొన్ని బరువులు ఓర్చుకోలేని పరిస్థితి.

బైబిల్లో పాతనిబంధన గ్రంధమును పరిశీలిస్తే 

యోబు గ్రంథము 7:20నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి? యోబు జీవితం నాకు నేనే భారముగా నున్నాను ఎందుకంటే ఒక వైపు ఆస్తిని కోల్పోయిన పరిస్థితి, మరియొక వైపు పిల్లలను కోల్పోయిన పరిస్థితి, మరియొక వైపు వ్యాధితో భారభరితమైన పరిస్థితి.

అందుకే బైబిల్ గ్రంధములో యేసుప్రభువారు మనకు భారమును గూర్చి పలికిన వచనమును గమనిస్తే 
కీర్తనల గ్రంథము 55:22నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు

మరియొక వచనములో భారమును గూర్చి పరిశీలిస్తే 
కీర్తనల గ్రంథము 68:19ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు

2.
రెండవ భారము పాపమనే భారము మోయుట

**యేసుప్రభువారు మోసిన సిలువ భారము మన పాపమనే భారమునకు సాదృశ్యంగా ఉన్నది.   
** పాపపు బరువే యేసుప్రభువారు మన కొరకు మోసిన సిలువ భారం.
**ఇది చాల గోరమైనది మరియు చాల బరువైనది
 **అందుకే మనం యేసుప్రభువారిలో ఉంటే మన భారము వేదన శ్రమలు ఆయనే మోయటానికి ఇష్టపడుతున్నాడు.

మత్తయి సువార్త 11:28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును

**పాపము చేసిన ప్రతి నరుడు శాపగ్రస్తుడు

**ఐగుప్తు పట్టణమును ఫరో మోయలేని భారములను మోయించి   పట్టణమును కట్టించుకున్నాడు. అలాగే పాపం కూడా మోయలేని భారంగా అయిపోయింది

**
మన పాపపు భారమును ఒక్కక్కటిగా తీసివేసుకోవాలి.
 
**ప్రభువా మోయలేని నా పాపపు భారాన్ని నీవు మోసావు నాపాపభారాన్ని తీసివేయమని మనం యేసయ్యకు ప్రార్ధించాలి.   

**ఈపాపపు బరువు యేసుప్రభువారు సిలువ ద్వారా మోసారు.

 
3.మూడవది అయన కాడి అనే భారం మోయుట
మత్తయి సువార్త 11:29-30
నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
30
ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి

**అయన కాడి అనే భారం అంటే మనం అయన యందు విశ్వాసం కలిగి మన పాపములను ఒప్పుకొని అయన కొరకు గొప్ప సాక్షిగా ఉండటమే. అప్పుడుఅయన కాడి సుళువుగాను భారము తేలిక గాను ఉండును.
 
అయన కాడి అనే భారమును మనం మోయుట అని అంటే
**యేసయ్య బిడ్డలుగా జీవించుటకు ఇష్టపడాలి.
**ఆయనకు సాక్షిగ ఉండుటకు ఇష్టపడాలి.
**అయన ప్రేమను ప్రకటించుటకు ఇష్టపడాలి.
**అయన సువార్తను ప్రకటించుటకు ఇష్టపడాలి

యేసయ్య మన పాపభారమును మోయుటకు సిలువ భారమును మోసారు

అందుకే మన పాపములను విడిచి అయన కాడిని మనం మోయటానికి అయన కృప చూపమని యేసయ్యకు ప్రార్థిస్తూ.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్..

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

*******************************************************************
24th Lentday 02/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చిఅక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic:అయన ఓదార్పుతో కూడిన హెచ్చరిక

లూకా 23:26-30
26 వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి

**చదవబడిన వాక్యమును పరిశీలిస్తే యేసుప్రభువారు సిలువను మోస్తూ ఉండగా వారు అయనను కొరడాలతో కొట్టడం ఆయనను దూషిస్తూ చిత్రహింసలు చేసారు.

**మార్గమధ్యలో కురేనీయుడైన సీమోనుకు సిలువను మోయటానికి ఇచ్చారు అయన మోయలేని పరిస్థితి.

** సిలువ మోయలేనటువంటి భారం దేవుని నిబంధన కావున యేసుప్రభువారు ఒక్కరే సిలువను మోసిన పరిస్థితి

**యేసుప్రభువారి పరిస్థితిని చూసి స్త్రీలు,ప్రజలు ఆయనను వెంబండించిన పరిస్థితి

**చాల మంది కష్టాలలో రోగాలలో స్వస్థతను పొందిన వారు అయన ద్వారా మేలులు పొందిన వారు యేసుప్రభువారిని చూసి తట్టుకోలేక పోయారు గుండెలు బాదుకొనే బాధపడిన, వారు ఏమి చేయలేని పరిస్థితి

1.బాధపడువారిని చూసి యేసయ్య ఏమిచేసే వారు?
ఆలాగున భాదపడువారిని చుస్తే యేసయ్య కూడా తన వారికోసం భాదపడుతూ అయన వలన ఎవరికీ భాద పడకూడదని ఆలోచన చేసేవారు.

అటువంటి వారిని చూసి యేసయ్య పలికిన మాటలను చుస్తే
లూకా 23:28 యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

**ఇది ఒక ఓదార్పుతో కూడిన మాట

**చాల సందర్భాలలో యేసుప్రభువారు ఎన్నో అద్భుతకార్యాలలో చనిపోయిన వారిని బ్రతికించి వారి భాదకు ఓదార్పునిచ్చారు

**విధవరాలు కుమారుని కోల్పోయినప్పుడు ఆయనను బ్రతికించి వారిని ఓదార్చిన పరిస్థితి.

** రోజులలో కూడా అయన మనకు ఎన్నో మేలులు చేసుతూ అనేక సందర్భాలలో యేసయ్య ఓదార్పునిస్తున్నాడు

2. రోజులలో మన యేసయ్య ఎలా ఓదార్పునిస్తున్నాడు
**అయన సేవకుల ద్వారా ఓదార్పునిస్తున్నాడు అయన వాక్యము ద్వారా ఓదార్పునిస్తున్నాడు

అందుకే బైబిల్ గ్రంధములో కీర్తనకారుడు అంటున్నాడు.
కీర్తనల గ్రంథము 94:19నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది

3.యేసుప్రభువారు పలికిన మాటలో ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది.
లూకా 23:29 ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.

ఏమిటి హెచ్చరిక అని అంటే?

**భవిష్యత్తులో యేసుప్రభువారి పట్ల చేసిన పాపము వలన వారికీ శాపము కలుగుతుంది.
శాపము వలన మీ పిల్లల ద్వారా శ్రమలు భాదలు వస్తాయి నాశనము కలుగుతుంది అని యేసుప్రభువారు చెప్తున్నారు.

4.ఎందుకు నాశనము వస్తుంది అని అంటే ?
యేసుప్రభువారి మీద అన్యాయంగా అసూయతో అప్పగించారు చివరకు వారు యేసుప్రభువారిని సిలువ వేయుటకు బందిపోటు దొంగను సైతం విడిచి పెట్టారు, కావున వారిని బట్టి నాశనము రాబోవుచున్నది.
 
అందుకే యెరూషలేము పట్టణం నేటికీ శ్రమలను అనుభవిస్తుంది

5.అటువంటి నాశనం రాకుండా మనం ఏమి చేయాలి?
విలాపవాక్యములు 2:18
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
 
**మనుష్యుల బట్టి మనుష్యుల పాపముల బట్టి ప్రార్ధన చేయాలి వారికొరకు ఏడ్వాలి.

లూకా 23:31 వారు పచ్చి మ్రానుకు ఈలాగు చేసిన ఎండిన మ్రానుకు ఏమి చేయుదురో అని యేసు ప్రభువారు పలికిన మాటలను గమనించవచ్చు

**రాబోవు శిక్ష, శ్రమలు, నాశనమును తప్పించుకొనుటకు అయన రాజ్య సువార్తను అందరికి అందివ్వాలి అట్టి కృప మనకు యేసయ్య ఇవ్వాలి, అయన కృపను మనం పొందుకోవాలి.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
***********************************************************************
25th Lentday 03/04/2019
సిలువ శ్రమల ధ్యానకుటములు
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు 

మత్తయి 27:25-26
26 అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

**
చదవబడిన వాక్యభాగమును గమనిస్తే యేసుప్రభువారిని కొరడాలతో కొట్టడం ఇది చాల బాధాకరమైన పరిస్థితి.

1.ఈకోరాడాలతో ఎందుకు కొడతారు పాతనిభంధన గ్రంధములోచుస్తే  

ద్వితీయోపదేశకాండము 25:2-3
2 దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.
3
నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

**నేరం చేసే వారిని దోషనివారణకు శిక్షగా కొరడాలతో కొడతారు.

**వారి నేరము బట్టి కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది.

**అత్యంత నేరం చేసేవారికి నలభై కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు.

**ఇది వారి ధర్మ శాస్త్రం చెపుతున్నశిక్షగా భావిస్తారు


2.యేసు ప్రభువారిని ఎందుకు కొరడాలతో కొట్టారు?
ఎందుకంటే అయన మీద అసూయతో ఒకదాని మీద ఒకటి నిందలు మోపి యన  దేవదూషణ చేసారని, జనములను రెచ్చకొడుతున్నారని, కైసరుకు పనియ్యయొద్దని అనెనని, యూదులరాజనని చెప్పుచుండెనని కొరడా దెబ్బలు కొట్టారు.

**ఒకదాని మీద ఒక నిందలు మోపి సిలువ వేయమని తీర్పు చేసి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు  కొట్టారు, ఇది చాల దారుణమైన సంఘటన.
 
 
3.యేసుప్రభువారు కొరడా దెబ్బలతో ఎలా బాధించబడ్డారు ఎందుకు గాయపరచబడ్డారు.

 యెషయా గ్రంథము 53:5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

**
కొరడాలు వాటి చివర్లలో ఎముకలు సూదిగా ఉన్నవి, మధ్యలో లోహములతో ఉన్నవి.
**ఈకొరడా దెబ్బలు ఎముకలను చీల్చివేస్తాయి అటువంటి గోరమైన బాధను యేసుప్రభవారు మనకొరకు భరించారు.
**మన దోషములు అతిక్రమములను బట్టి అయన కొరడా దెబ్బలతో బాధించబడ్డారు గాయపరచబడ్డారు.

4.పాత నిబంధన గ్రంధము గమనిస్తే  ఇది ఒక ప్రవచనం నెరవేర్పు.
యెషయా 50:6కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్ప గించితిని ఉమివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు

**
ఈరీతిగా యేసయ్యను నలుగగొట్టబడినది మనకొరకు మనకు ఆత్మీయ స్వస్థతను యిచ్చుటకు అయన గాయపరచబడ్డారు.

**అందుకే మనం మన దోషములు అపరాధములను క్షమించుమని యేసయ్య దగ్గర ఒప్పుకొని అయన కొరకు జీవించాలి.

ఇది మనకు యేసయ్య ఇస్తున్న ఒక హెచ్చరిక మనం పాపంలో పడిపోకుండా దేవుని అడుగుజాడలలో నడవాలని యేసయ్య కృప మనకు నిత్యము ఉండాలని ఆశిస్తూ
 
యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.