EASTER SUNDAY 2019


21/04/2019 ఈస్టర్ ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: యేసయ్య పునరుద్ధానం

మత్తయి 28:1-7 త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.


యేసుప్రభువారు శుక్రవారం సిలువలో మరణించిన తరువాత యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను.

**అరిమతయియ యోసేపు చాల ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యముకొరకు ఎదురు చూచువాడు.

**యోసేపు దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి, సంకెళ్లతో బందించి సైనికులను కాపలాగా ఉంచి  వెళ్లిపోయెను.   


1.యేసుప్రభువారి పునరుద్ధానంను గూర్చి ఆలోచన చేస్తే
**ఆదివారమున అకస్మాత్తుగా భూకంపంకలిగి అయొక్క సంకెళ్లు తెంపబడి, రాయి కదిలింపబడింది, యేసయ్య పునరుద్ధణ శక్తికి అవి నిలువలేకపోయాయి

**ఇది ఒక శక్తి వంతమైనది మరియు ప్రభావంతమైనది.

**ప్రముఖుల సమాధులు, దావీదుసమాధి, రాజులైన వారిసమాధులు తెరవబడలేదు గాని యేసయ్య సమాధి తెరబడి యేసయ్య సజీవుడై లేచాడు, కారణం అయన గొప్ప దేవుడు శక్తిమంతుడును ప్రభావంకలిగినవాడు

 2.యేసయ్య పునరుద్ధానం వలన మనకు నిరీక్షణ కలుగుతుంది.
*ఆయనతో మనము పునరుద్ధాన శక్తి పొందుకొనుటకు నిరీక్షణ కలిగిఉండాలి.
*పునరుద్ధానశక్తి పొందుకొనేందుకు నిరీక్షణ కలిగి సిద్దపడి ఉండాలి
*దేవుని రాజ్యంలో మనకు అట్టి భాగ్యం కోసం నిరీక్షణ కలిగిఉండాలి.  
 
3. యేసయ్య పునరుద్ధానం వలన మనకు పరిశుద్ధత కలుగుతుంది.
 **యేసయ్య పునరుద్ధానం ఇది పరిశుద్ధులకు మాత్రమే కలుగుతుంది.  
**యేసునందు నిద్రించిన వారు సమాధినుండి తిరిగి లేచుదురు.
**అయన రాకడలో పరిశుద్ధులైన వారి యొక్క పునరుద్ధానం జరుగుతుంది.
** మొదటి పునరుద్ధానంలో వేయియేండ్లు పరిపాలన ఉంటుంది

ప్రకటన గ్రంథము 20:5-6 వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.6 మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

**ఎందుకు అని అంటే ఆయనలో ఉన్నలక్షణం పరిశుద్ధత.

** పరిశుద్ధతయే అయన బలం, అయన నీతి, అయన యదార్థత, ఆయన శక్తి

అటువంటి భాగ్యము మనం పొందుకోవాలి, పరిశుద్ధ గుంపులో మనం ఉండాలి

లోకాన్ని నమ్ముకొని జీవిస్తే అగ్ని గంధకములో పడవేయబడతాము, అని దేవుని వాక్యము చెప్తుంది.
ప్రకటన గ్రంథము 20:10 వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

4.యేసయ్య పునరుద్ధానం వలన మనకు విశ్వాసం కలుగుతుంది.
**యేసుప్రభువారు శిష్యులైన వారికీ మూడవరోజున తిరిగిలేస్తాను అని చెప్పారు.

**ఐనా వారు విషయం మరచిపోయారు, వారు ఏస్థితి నుండి వచ్చారో మళ్లీ అదే స్థితిలోకి వెళ్లి పోయారు.

అందుకే బైబిల్ గ్రంధములో యేసయ్య అంటున్నారు.
లూకా 24:25 అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

** రోజున మన స్థితి ఎలా ఉన్నది యేసయ్య శిష్యులుగా మండిచల్లారిపోవుచున్నాము.
లూకా 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.

**మనం ఎలా వున్నాం, సంఘములో దేవుని వాక్యము వింటూ మండుచున్నాము, బయటకువెళ్లి లోకంలోపడి చల్లారిపోవుచున్నాము.

**అటువంటి బైబిల్ గ్రంధములో యేసయ్య అంటున్నారు,పునరుద్ధణబలం విశ్వాసంలో ఉన్నది.

యోహాను 11:25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

**అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, అటువంటి విశ్వాసం మనకు బలం, ఆదరణను ఇస్తుంది.

5.అటువంటి యేసయ్యను మనం వెదకాలి.
  
యేసయ్యను మనం ఎలా వెదకాలి దేవుని వాక్యంలో వెదకుట గూర్చి ఏమి వ్రాయబడినది.

పరమగీతము 3:1-4
1 రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
2 నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
3 పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
4 నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

ఈరోజున సంఘము ఆలోచించుకోవలసిన మాట ఏమిటి అని అంటే

**సిలువ వేయబడిన యేసుప్రభువారిని ఎలా వెదకుచున్నాము, ఉద్దేశంతో వెదకుచున్నాము.

** మనమైతే యేసయ్యను పట్టణపు విధులలో, మోసపూరితమైన సంతవీధులలో వెదికేవారిగా కాకుండా, యేసుప్రభువారి కోసం పాపములను అన్నింటిని విడిచి వెదకాలి.

**పూర్ణాత్మతో, పూర్ణహృదయముతో వెదకాలి, అప్పుడు అయన మనకు దొరుకుతారు.

ఈరోజున మనం యేసయ్యలో నిరీక్షణ కలిగి, అయన యొక్క పరిశుద్ధతతో, అయన యందు విశ్వాసంతో, మన పాపములను విడిచి, అయన యొక్క పునరుద్ధానశక్తిని పొందుకొని యేసుప్రభువారిని వెంబడించాలి, అట్టికృపను మన మందారం పొందుకోవాలి అని యేసయ్య మనకు అట్టి కృపను కలుగజేయాలి అని ఈ వాక్యం మన అందరి వినికిడిలో ఫలించాలి అని ఆశిస్తూ ఆమెన్


యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.